LATEST NEWS
 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.   ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు.  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.  ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా? సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.   నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.! రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​ [Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne] 
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎంకు ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేశారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. రామోజీరావుకు వెంకయ్యనాయుడు ఘన నివాళి.! మరోవైపు, విలువలతో కూడిన వ్యాపారం, సమాజహితమే జర్నలిజం అని ఆచరణలో చూపించిన మహామనిషి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు.రామోజీరావు పట్టుదల, స్వయంకృషి, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, కార్యదీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  సాధారణ రైతు కుటుంబంలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ఈనాడు దినపత్రికతో పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి మహోన్నత వ్యవస్థల నిర్మాణంతో ప్రపంచస్థాయికి చేరిందని గుర్తుచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రామోజీరావు పేరు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని వెంకయ్యనాయుడు తన పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: డేటింగ్ యాప్‌లో వల..బీర్‌లో మత్తుమందు..ఆపై బంగారం మాయం.!     [ Ramoji Excellence Awards, Ramoji Rao,Amit Shah, Chandrababu Naidu, Pawan Kalyan, Justice Abdul Nazeer, Venkaiah Naidu, Eenadu Group, CH Kiran, Ramoji Film City, Vijayawada, Andhra Pradesh ]
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు.. పక్కాగా ప్లాన్ చేసిన దోపిడీ.. డేటింగ్ యాప్‌లను వేదికగా చేసుకుని యువకులతో పరిచయాలు పెంచుకుంటున్న ఓ ముఠా.. వారిని గదులకు రప్పించి మత్తుమందు ఇచ్చి దోపిడీలకు పాల్పడుతోంది. బాధితులు స్పృహ కోల్పోగానే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్తోంది. అంతటితో ఆగకుండా.. బాధితులకు సంబంధించిన వీడియోలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. గ్రైండర్ యాప్‌లో పరిచయం.. ముందుగానే రెక్కీ.! గ్రైండర్ డేటింగ్ యాప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ నేరాలకు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత యాప్‌లో బాధితులను గుర్తించి.. ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా పరిచయాన్ని పెంచుకుంటారు. మాటలతో నమ్మకం సంపాదించుకున్న తర్వాత అసలు ప్లాన్ అమలు చేస్తారు. బాధితుల వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయా? వారు ఒంటరిగా ఉంటున్నారా? వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాలను ముందుగానే తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత వారిని గదులకు లేదా ఇళ్లకు రప్పించి దోపిడీకి పాల్పడతారు. బీర్‌లో మత్తుమందు.. స్పృహ తప్పగానే దోపిడీ.! బాధితులతో కలిసి బీర్ తాగుతున్నట్లు నటిస్తూ అందులో ముందుగానే మత్తు పదార్థాలు కలిపి ఇస్తారు. అది తాగిన బాధితులు స్పృహ కోల్పోగానే ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్తారు. బాధితులు తేరుకునేలోపే అక్కడి నుంచి పరారవుతారు. అంతేకాదు.. వారి వద్ద విలువైన వస్తువులు లేకపోతే వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, వాటిని బయటపెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు ప్రాంతాల్లో వేట.. ఐదుగురు అరెస్ట్.! ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో నిందితులను పట్టుకున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఏఎస్ రావు నగర్‌లో మరో ఇద్దరిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 361 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే దాదాపు 35 తులాలకు పైగా బంగారం నిందితుల నుంచి లభ్యమైంది. 14 కేసుల్లో ముఠా ప్రమేయం.! నిందితుల విచారణలో పలు ప్రాంతాల్లో జరిగిన దోపిడీలతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 14 కేసుల్లో వారి ప్రమేయాన్ని గుర్తించారు. వీటిలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో రెండు, సైబరాబాద్ పరిధిలో ఏడు, హైదరాబాద్ పరిధిలో మూడు, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నాయి. మరో కేసుకు సంబంధించిన వివరాలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో మరో నిందితుడు.. డిజిటల్ ఆధారాల పరిశీలన.! ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన చందు అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టయిన నిందితుల మొబైల్ ఫోన్లు, గ్రైండర్ యాప్ ప్రొఫైల్స్, చాటింగ్స్, వీడియో కాల్స్, కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులు, డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ ఈ ముఠా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసే పనిలో ఉన్నారు. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ పరిచయాల ముసుగులో జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: భారత్ సమ్మిట్ వివాదం: తెలంగాణ BJP నేతలపై అమిత్ షా ఆగ్రహం.!   [ Grindr Dating App, Dating App Robbery, Hyderabad Crime, Malkajgiri Police, Kushai guda Police, Uppal Police, Dating App Gang, Drugged Beer, Gold Robbery ]
ఇటలీ నేత ఫిలిబెక్ వ్యాఖ్యలపై కమలనాథుల ఫైర్.!     హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సమ్మిట్‌లో ఇటలీకి చెందిన రాజకీయ ప్రతినిధి ఫిలిప్పో ఫిలిబెక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించలేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చి ఇక్కడి రాజకీయ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే.. రాష్ట్ర స్థాయి నాయకులు ఉదాసీనంగా ఉండటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన మార్గాల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు, కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు స్థానిక రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, భారత్ సమ్మిట్‌ 2026లో విదేశీ రాజకీయ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. తన న్యాయ బృందంతో కలిసి సంబంధిత విదేశీ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కు ఫిర్యాదు చేశారు. సమ్మిట్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్టీ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వివాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశం ఉంది. అమిత్ షా అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: విజయ డెయిరీ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు.! మీకు నచ్చవచ్చు: 14 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు..భార్యతో విడాకులు ప్రకటించిన మంత్రి ఆధవ్‌ అర్జున.!      [ Italian leader Filipes remarks at India Summit, Amit Shah, TG BJP Leaders, Filippo Filibeck, Bharat Summit Hyderabad, TeluguOne News ]  
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.! ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్. సుమారు 15 కిలోల బంగారం, వజ్రాభరణాలను క్షణాల్లో బ్యాగులో నింపుకుని పరారయ్యాడు. కానీ తాను చేసిన చిన్న పొరపాటు అతడి నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. చేతి మణికట్టుపై ఉన్న ఓ చిన్న టాటూ పోలీసులకు కీలక క్లూగా మారింది. తమిళనాడులోని మదురైలో జరిగిన ఈ భారీ నగల చోరీ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. 25 ఏళ్ల నిషాంత్ కృష్ణ.. ఓ గ్రాడ్యుయేట్. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూనే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, సినిమాల్లో చూపించినట్లుగా పక్కా ప్రణాళికతో భారీ దొంగతనానికి తెరతీశాడు. మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ జ్యువెలర్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి తన ప్లాన్‌ను అమలు చేశాడు. మూడు గెటప్పులు.. మూడు సార్లు రెక్కీ.! చోరీకి ముందే నిషాంత్ పక్కాగా రెక్కీ నిర్వహించాడు. సాధారణ కస్టమర్‌లా ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో షోరూంకు వెళ్లాడు. ఆభరణాలు ఎక్కడున్నాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి లోపలికి వెళ్లొచ్చు? ఎలా బయటపడొచ్చు? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏ చిన్న ఆధారం కూడా వదలకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ షోరూం ప్రారంభమై అప్పటికి కేవలం రెండు వారాలే అవుతోంది. దీపావళి సీజన్‌లో భారీగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం భవన నిర్మాణం పూర్తికాకముందే కార్యకలాపాలు ప్రారంభించింది. లాకర్ గది నిర్మాణంలో ఉండటం, భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేకపోవడం నిషాంత్‌కు కలిసొచ్చాయి. బ్యాగులో పట్టినంత బంగారమే టార్గెట్.! ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. చేతులకు గ్లౌజులు ధరించి భవనం వెనుకవైపు ఉన్న ఇనుప చువ్వల సాయంతో పైకి ఎక్కాడు. మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని కెమెరాలపై స్ప్రే కూడా చల్లాడు. లాకర్లను తెరిచే ప్రయత్నం చేయలేదు. కేవలం డిస్‌ప్లేలో ఉంచిన ఆభరణాలనే టార్గెట్ చేశాడు. తనతో తెచ్చుకున్న డఫ్ బ్యాగులో పట్టినంత బంగారం, వజ్రాభరణాలను నింపుకున్నాడు. అప్పటికి ఆ అంతస్తులో సుమారు 42 నుంచి 43 కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే బ్యాగులో పట్టకపోవడంతో మిగిలిన ఆభరణాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మార్గంలో ఏర్పాటు చేసిన తాడును ఉపయోగించి కిందికి దిగాడు. తాళాలు పగులగొట్టకుండా, ఆయుధాలు ఉపయోగించకుండా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరుసటి రోజు షోరూంలో ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కోసం ఓ కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న నగలు కూడా చోరీకి గురవడం నిర్వాహకులను కలవరపరిచింది. పోలీసులకు చిక్కిన చిన్న టాటూ.! కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు షోరూం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగు ధరించిన దొంగ ద్విచక్రవాహనంపై మాడకుళం రోడ్డు వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే అతడి ముఖం కనిపించకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో షోరూం ప్రారంభోత్సవం రోజు నుంచి నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు మరోసారి పరిశీలించారు. ఓ యువకుడు మూడు వేర్వేరు సందర్భాల్లో షోరూంకు వచ్చినట్లు గుర్తించారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో నిశితంగా పరిశీలించారు. అప్పుడే పోలీసులకు ఓ కీలక విషయం కనిపించింది. రెక్కీ సమయంలో కనిపించిన యువకుడి చేతి మణికట్టుపై ఉన్న టాటూ.. చోరీ జరిగిన సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి చేతిపై కనిపించిన టాటూతో సరిపోలింది. ముఖాన్ని దాచుకున్నా.. ఆ చిన్న గుర్తును మాత్రం దాచలేకపోయాడు. అదే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ప్రియురాలి బైక్‌తోనే చోరీకి వెళ్లాడా.? దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిషాంత్ ఉపయోగించిన ద్విచక్రవాహనం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచ్చియార్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా తిరుప్పూర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కీలకంగా మారింది. చోరీ చేసిన నగల సమాచారాన్ని నిషాంత్ తన సొంత ఫోన్ నుంచి కాకుండా మరో వ్యక్తి ఫోన్ ద్వారా మీనాక్షికి చేరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నగలను ఎక్కడెక్కడ దాచారో పోలీసులు గుర్తించారు. మదురైలోని మాడకుళం ప్రాంతంలోని ఇంటితో పాటు సమీపంలోని కొండ ప్రాంతంలో దాచిన సుమారు ఆరు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ తర్వాత తాను ధరించిన దుస్తులను పొలాల్లో తగులబెట్టినట్లు కూడా విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా పలుమార్లు మార్గాలు మార్చుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. ప్రేయసి కోసం భారీ చోరీ చేశాడా.? మీనాక్షి నిర్మించుకుంటున్న ఇంటికి డబ్బు అవసరమవడంతో నిషాంత్ ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి, ఆటో డ్రైవర్ సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. చోరీ చేసిన సొత్తును దాచిపెట్టడంలో వీరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు నిషాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి ఫోన్ సిగ్నల్స్ తొలుత మదురై సమీపంలోని తిరుప్పాలైలో, ఆ తర్వాత తిరుప్పూర్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పొల్లాచ్చి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంటి దొంగ హస్తం ఉందా.? ఈ భారీ చోరీ వెనుక షోరూం భద్రతా లోపాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో అలారం ఆఫ్‌లో ఉండటం, డిస్‌ప్లేలోని ఆభరణాలను రాత్రివేళ లాకర్లలో భద్రపరచకపోవడం, భవనం నిర్మాణం పూర్తికాకపోవడం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలారం ఎందుకు ఆఫ్‌లో ఉందనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. షోరూం సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే నిషాంత్ చోరీకి ప్రయత్నించినట్లు సీసీ కెమెరాల ద్వారా బయటపడింది. భవనంపైకి ఎక్కినప్పటికీ కుక్కలు తరమడంతో అప్పట్లో పారిపోయాడు. ఆ సమయంలో నగలు తీసుకెళ్లలేదు. అయినా షోరూం యాజమాన్యం భద్రతను మరింత పటిష్టం చేయకపోవడం మరోసారి చర్చకు దారితీసింది. 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ..! ఈ కేసులో అరెస్టయిన మీనాక్షి, సురేష్‌లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. తొలుత సుమారు 30 కిలోల ఆభరణాలు చోరీకి గురైనట్లు అంచనా వేసినా, స్టాక్ పరిశీలన అనంతరం దాదాపు 15 కిలోల బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు ఆరు కిలోల వరకు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖాన్ని దాచుకుంటే తప్పించుకోవచ్చని.. సీసీ కెమెరాలకు చిక్కకుండా వ్యవహరిస్తే పోలీసులకు దొరకమని భావించిన నిషాంత్‌ను చివరకు అతడి చేతిపై ఉన్న చిన్న టాటూ పట్టించింది. కోట్ల విలువైన ఆభరణాల చోరీలో పెద్ద ప్లాన్ వేసినా.. ఓ చిన్న గుర్తు అతడి గుట్టును బయటపెట్టింది. ఇప్పుడు మిగిలిన నగలు ఎక్కడున్నాయి? నిషాంత్ ఎక్కడ దాక్కున్నాడు? ఈ భారీ చోరీలో ఇంకా ఎవరి పాత్ర ఉంది? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు.! మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.!   [ Tanishq Jewellery Robbery, Madurai Gold Theft, Nishanth Krishna, Meenakshi Nachiyar, 15 Kg Gold Theft, Jewellery Heist, Tattoo Clue, Madurai Police Investigation, Gold Robbery Case, CCTV Footage ]
ALSO ON TELUGUONE N E W S
  భారతీయ సినీ ప్రేమికులు అనే పదం పుట్టుకకి ప్రధాన ఆద్యుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్.  స్వయంగా యాక్టింగ్ నే  అమితాబ్ కాళ్ళకి నమస్కరించి నేను ఇంత పవర్ ఫుల్ నా అంటుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా నటనలో అతి పెద్ద ఇన్ స్పిరేషన్. రీసెంట్ గా అమితాబ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తాజాగా అమితాబ్  'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) సీజన్ 18 షోలో పాల్గొన్న సందర్భంగా తన జీవితంలో జరిగిన ఒక భయానక సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. గతంలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నేపాల్‌ వెళ్లినప్పుడు తాను చావు అంచుల దాకా వెళ్లొచ్చినట్లు బిగ్ బి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కయాకింగ్ చేసే క్రమంలో జరిగిన ఊహించని పరిణామాలు తనను మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లాయని భావోద్వేగంతో వెల్లడించారు. షూటింగ్ విరామ సమయంలో నేపాల్‌లోని ఒక అందమైన ప్రాంతంలో కయాకింగ్ చేయడానికి అక్కడున్న వారు సలహా ఇవ్వగా, మొదట ఆయన కొద్దిగా వెనుకాడినప్పటికీ ఆ సాహస క్రీడని  ప్రయత్నించేందుకు అంగీకరించారు. అయితే ఆ సన్నని, పొడవాటి చిన్న కయాక్ పడవ ఎక్కడం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆయన వివరిస్తూ, కేవలం ఆ బోటులోకి ప్రవేశించడానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు. సరిగ్గా పడవను నడుపుతున్న సమయంలో తప్పు దిశలో తిప్పడంతో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది.   పడవ బోల్తా పడినప్పుడు నీటి లోపల ఎలా ప్రవర్తించాలనే దానిపై తనకు ముందుగా కొన్ని సూచనలు అందాయని అమితాబ్ తెలిపారు. సాధారణంగా నీటి అడుగున రెండు చేట్లతో పైకి తోయాలని లేదా సహాయం కోసం నీటిలోనే చేతులు విదిలించాలని నిబంధనలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మనిషి ఎక్కువ సేపు ఊపిరి బిగపట్టుకోలేకపోవడంతో, ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి నీటి అడుగున తీవ్రంగా చేతులు ఊపుతూ బయటపడేందుకు ప్రయత్నించారు.   ఇది కూడా చదవండి:వైరల్ గా నిలిచిన అవెంచర్స్ డూమ్స్‌డే టికెట్ రేట్స్: మీరు కూడా ఈజీగా కొనేయవచ్చు!    అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ తనను కాపాడటానికి వెంటనే రాలేదని అమితాబ్ చమత్కారంగా, అదే సమయంలో ఆందోళనకరంగా చెప్పుకొచ్చారు. తాము ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నామని, ఒకవేళ ఆ చిత్రంలోని ప్రధాన హీరోనే నీటిలో మునిగిపోతే పరిస్థితి ఏంటని, ఆ తర్వాత వేరే హీరోతో సినిమా కొనసాగించాల్సి వచ్చేదని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. చివరికి నీటి ప్రవాహం వద్ద, అనగా వాటర్‌ఫాల్ సమీపంలో నిలబడిన ఒక వ్యక్తికి ఏదో ప్రమాదం జరుగుతోందని గమనించి, ఎంతో కష్టపడి తనను బయటకు లాగారని తెలిపారు. ఆ ప్రత్యేకమైన ప్రదేశం నుండి ఒక మనిషిని సురక్షితంగా బయటకు తీయడానికి ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు అవసరమయ్యారని, తనను రక్షించడం కూడా చాలా కష్టతరమైందని అమితాబ్ బచ్చన్ వివరించారు. ఈ భయానక అనుభవాన్ని తలచుకుంటూ ఆయన చెప్పిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందుకే అంటారు సినిమా,ప్లస్ షూటింగ్ అనేవి మహా యజ్ఞం అని.   మీకు నచ్చవచ్చు:వైరల్ గా  సాయి పల్లవి!   మీకు నచ్చవచ్చు:భోగి కొత్త రిలీజ్ డేట్ ఇదే: ఫ్యాన్స్ లో పూనకాలు!   [Amitabh Bachchan ,Nepal kayaking,  Bollywood news, Chiranjeevi]  
కొన్ని న్యూస్ ని నమ్మడం తప్ప వేరే ఛాయిస్ లేదు. ఒక వేల మంకు పట్టుపట్టి 'నమ్మం' అని బీష్మించుకొని కూర్చుంటే ఆధారాలతో సహా నిరూపించాక షాక్ తో నోరెళ్లెబెట్టాల్సిన పరిస్థితి. మరి నోరెళ్ళ బెట్టేయండి. మార్వెల్ సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ హాలీవుడ్ చిత్రం 'అవెంచర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday) భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే, దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలను మించి దూసుకుపోతున్నాయి. నవంబర్ 17న మధ్యాహ్నం 12 గంటలకు పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లలో ఆన్‌లైన్ టికెట్ విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.  బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్స్ మొదలైన కొద్దిసేపట్లోనే గంటకి సుమారు 10,000 టికెట్ల వరకు అమ్ముడవుతూ రికార్డు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 50,000లకు పైగా టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోవడం క్రేజ్‌కి నిదర్శనం.   ముంబై, దిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పూణే, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. డిసెంబర్ 17న అమెరికా కంటే ఒక రోజు ముందే భారత్‌లో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 17 అర్ధరాత్రి 12:01 గంటలకు స్పెషల్ మిడ్‌నైట్ స్క్రీనింగ్‌లు, 24 గంటల షోలని కూడా ప్లాన్ చేశారు. ముంబై వంటి నగరాల్లో రెక్లైనర్ సీట్ల ధరలు 1,500 నుండి  1,990 వరకు ఉన్నప్పటికీ, క్షణాల వ్యవధిలోనే ఆ షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం విశేషం. సాధారణ టికెట్ల ధరలు  420 నుంచి ప్రారంభమవుతున్నాయి.ముంబై, హైదరాబాద్ లాంటి అర్బన్ సిటీలతో పాటు తెనాలి లాంటి లోకల్ ప్రాంతాల్లోనూ టికెట్స్ సేల్ చేస్తున్నారు. కానీ రేట్లే.. సినీ ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఇది కూడా చదవండి:భోగి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ మూవీకి పోటీ తప్పదా! అయితే ఈ చిత్రానికి మన దేశంలో టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టగా ఏకంగా ఒక్కొక్కటి  4500 పైగానే విక్రయిస్తున్నారు. నేవి ముంబై ప్రాంతంలోని ఓ మల్టీప్లెక్స్‌లో ఈ రేట్లు దర్శనమిచ్చాయి. 500 నుంచి మొదలుపెట్టి ఒక్కో చోట ఒక్కోలా 1000,.2000, 3000 ఇలా టికెట్లని అమ్ముతున్నారు. ఇంతటి భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr.) మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి (MCU) తిరిగి వస్తుండటమే. అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆయన ఈసారి టోని స్టార్క్ అనగా ఐరన్ మ్యాన్ క్యారక్టర్ లో  కాకుండా, అత్యంత శక్తివంతమైన విలన్ 'డాక్టర్ డూమ్' (Doctor Doom) రూపంలో కనిపిస్తుండటం విశేషం.    ఆంథోనీ మరియు జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో క్రిస్ హేమ్‌వర్త్, క్రిస్ ఎవాన్స్, పెడ్రో పాస్కల్, ఆంథోనీ మ్యాకీ, ఫ్లోరెన్స్ ప్యూ వంటి హాలీవుడ్ దిగ్గజ నటుల పెద్ద తారాగణం నటిస్తోంది. సుమారు 1 బిలియన్ డాలర్లు అనగా భారతీయ కరెన్సీలో సుమారు 8,500 కోట్ల భారీ బడ్జెట్‌తో  రూపుదిద్దుకుంది. భారతీయ ప్రేక్షకులని  దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, 2D, 3D, 4DX, స్క్రీన్ఎక్స్ (ScreenX) మరియు ప్రీమియం ఇన్ఫినిటీ విజన్ (Infinity Vision Certified) వంటి అత్యాధునిక ఫార్మాట్లలో  థియేటర్లలో అనుభవించవచ్చు.   మీకు నచ్చవచ్చు:11000 కోట్లు కొల్లగొట్టింది! మీకు నచ్చవచ్చు:సాయిపల్లవి హీరోయిన్ నేనా!   [Avengers Doomsday, Robert Downey Jr Doctor Doom, MCU India release, Tollywood]
అన్ని కుదిరి ఉంటే స్టిల్ శర్వానంద్ , సంపత్ నంది తో కలిసి 'భోగి'తో థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండాల్సింది. మరి  ఎవరి దిష్టి తగిలిందో ఏమో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో  భోగి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ డేట్ ఇదేనంటూ తాజా న్యూస్ ఒకటి దర్జాగా తిరుగుతూ ఉంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం. ప్రస్తుతం భోగి సెన్సార్ కార్యక్రమాలు పూర్తిగా ముగిశాయంటూ సరికొత్త వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, సెన్సార్ బోర్డు  'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, శర్వానంద్ కెరీర్‌లోనే ఇది మొదటి 'A' సర్టిఫికెట్ పొందిన చిత్రంగా రికార్డు సృష్టించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 27 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే తేదీకి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'మైసా' (Mysaa) కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల నవంబర్ 27న బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ 'భోగి'కి మరియు రష్మిక 'మైసా'కు మధ్య అత్యంత రసవత్తరమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఈ కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం శర్వానంద్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       ఒరిజినల్ రిలీజ్ డేట్  నవంబర్ 12 . కానీ  సెన్సార్ బోర్డు (CBFC) నిబంధనలు మరియు రివైజింగ్ కమిటీ పరిశీలన కారణంగా చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శర్వానంద్ సరికొత్త రస్టిక్ మరియు మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇది కూడా చదవండి:సాయిపల్లవి పేరుని హీరోయిన్ అని సేవ్ చేసుకున్న ఆ లెజండ్: నవ్వుకుంటున్న నెటిజెన్స్! ఇందులో ఆయన గంగా అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తుండగా, ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కీ రోల్స్ లో కనిపిస్తున్నారు. 1960ల కాలం నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో గ్రామీణ కట్టుబాట్లు, సంప్రదాయాలు మరియు అక్కడ జరిగే ఉద్విగ్న భరిత సంఘటనలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నట్లు సినిమా టీజర్ ద్వారా స్పష్టమైంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.   మీకు నచ్చవచ్చు:రమ్యకృష్ణ మొదటి సంపాదన ఎంతో తెలుసా! మీకు నచ్చవచ్చు: రామాయణ ఓవర్ సీస్ కలెక్షన్స్ ఇవే!   [Sharwanand, Bhogi,Sampath Nandi, Anupama Parameswaran, Tollywood]  
'రామాయణ' తో తాను ఎంత పవర్ ఫుల్ నటినో మరోసారి సాటి చెప్పింది సాయి పల్లవి. సాక్షాత్తు  సీతమ్మ వారే సెల్యులాయిడ్ పైకి  వచ్చారా అనేలా విజృంభించింది. పార్ట్ 2 లో అంతకు మించి ఉంటుందనే  మాట ఇప్పట్నుంచే  చాలా కట్టుదిట్టమైన భద్రతతోనే తిరుగుతూ ఉంది.  తాజాగా సాయిపల్లవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన మరియు ఎంతో సరదాగా ఉండే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సినిమాల్లోకి రాకముందే ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ సాయిపల్లవి ఫోన్ నంబర్‌ను తన కాంటాక్ట్ లిస్ట్‌లో 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్నారట.  సాయిపల్లవి కేవలం నటిగానే కాకుండా ఒక అద్భుతమైన డ్యాన్సర్‌గా ఎంతో మంది హృదయాలని గెలుచుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా కాలం ముందే, అంటే ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న రోజుల నాటి నుంచి ఆమె ప్రతిభను గమనించిన ఒక ప్రముఖ దర్శకుడు ఆమెతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ సమయంలోనే ఆమె భవిష్యత్తుపై నమ్మకంతో తన ఫోన్‌లో సాయి పల్లవి నంబర్‌ని  'హీరోయిన్' (Heroine) అని ఎంతో ముద్దుగా సేవ్ చేసుకున్నట్లు ఆ డైరెక్టర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది కూడా చదవండి:రమ్యకృష్ణ మొదటి సంపాదన ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందే ఆమె ఏం చేశారంటే! ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు రాజ్ కుమార్ పెరియ స్వామి. అదేనండి ఈ నెల 20 న ఓం తో వస్తున్న డైరెక్టర్.. సాయి పల్లవి, రాజ్ కుమార్ కాంబోలో ఇప్పటికే అమరన్ వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.     [Sai Pallavi. Om. Raj Kumar Peria Swamy, Dhanush, Mammotty]
Selena Gomez can finally put the legal trouble surrounding her mental health venture Wondermind behind her. A fraud lawsuit filed against the singer and actress by two investors has been permanently withdrawn, bringing an end to allegations that she misrepresented the company's financial position and business operations. The investors had sought nearly $1.2 million from the venture, claiming that they were misled about Wondermind's resources, leadership and overall functioning. They alleged that the company was facing serious financial difficulties without properly informing them about its deteriorating position. The case had also brought attention to Gomez's involvement in the company, which she co-founded with her mother Mandy Teefey and entrepreneur Daniella Pierson. However, Gomez maintained that she was not involved in its daily management, which was handled by Teefey and Pierson as co-CEOs. Wondermind's financial difficulties had already come under scrutiny last year, with reports suggesting that the company was struggling to pay employee salaries. Gomez reportedly stepped in with additional financial support to ensure that staff members were paid, despite not managing its everyday operations. Also Read: Kamal Haasan to appear in Sivakarthikeyan's Seyon? Gomez's legal team had strongly challenged the investors' allegations, arguing that she had been unnecessarily dragged into the dispute. Her lawyer Mathew Rosengart had described the fraud claims as absurd and meritless. Following the withdrawal, he said Gomez was pleased with the outcome and wanted to move forward. The latest development is significant because the investors have withdrawn the lawsuit with prejudice, which means they cannot bring the same claims against Gomez again. What began as a dispute over a mental health startup's finances has now ended without the singer having to continue fighting the fraud allegations in court. Check Out: Avengers: Doomsday creates history with unreal demand                     Robert Pattinson to play two famous detectives at same time! Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
రమ్యకృష్ణ.. తెలుగు సినిమాకి దొరికిన అపురూపమైన వజ్రం లాంటి నటి. ఆ వజ్రం తాలూకు చిత్రాలు అభిమానులు, ప్రేక్షకుల మనసులో చాలా భద్రంగా ఉన్నాయి. డాన్సర్ గా కూడా చించి పడేయగలదు. పెర్ఫార్మ్ పరంగాను మెప్పించగలదని సూత్రదారులు మూవీనే చిన్న ఉదాహరణ. జెన్ జీ బ్యాచ్ కోసం బాహుబాలి ఉండనే ఉంది. చిన్న వయసులోనే కళారంగంపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రమ్యకృష్ణ, తన అద్భుతమైన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ రోజుల్లోనే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్లు, నాటి జ్ఞాపకాలు నేటికీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి.  ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు రియాలిటీ షోలకి  హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఆమె అందుకుంటున్న భారీ పారితోషికాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నేను డ్యాన్సర్ ని. కూచిపూడి నేర్చుకునేదాన్ని. వెంపటి చిన సత్యంగారు మా గురువు. రోజూ స్కూల్ అవ్వగానే డ్యాన్స్ క్లాస్ కి వెళ్లేదాన్ని. రోజూ స్కూల్ నుంచి స్కూల్ డ్రెస్ తోనే వెళ్లేదాన్ని. ఒకరోజు అనుకోకుండా సల్వార్ కమీజ్ వేసుకొని వెళ్ళాను. ఆ రోజు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి డ్యాన్సర్లు కావాలని నన్ను కూడా సెలెక్ట్ చేసారు. సల్వార్ కమీజ్ లో చూసి పెద్ద అమ్మాయిని అనుకోని సెలెక్ట్ చేసారు. తర్వాత స్కూల్ డ్రెస్ లో చూసి వద్దన్నారు. కానీ నేను చేస్తాను అని అడుక్కున్నాను. ఇదంతా 8వ తరగతిలో జరిగింది. ఇది కూడా చదవండి: ఓవర్సీస్ లో రాముడి కలెక్షన్ల తుఫాన్: 11 రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డు!   ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కి వంద రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. అప్పట్లో ఆ డబ్బులు ఎక్కువే. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోలు చూసి భారతి రాజా, టి రాజేందర్ చూసి నన్ను ఆడిషన్ చేసి సినిమాలు ఆఫర్ చేసారు. కానీ ఆ రెండు చేయకుండా ఒక కమెడియన్ తో సినిమా చేశా. అలా 14 ఏళ్లకే హీరోయిన్ అయ్యాను. స్కూల్ లో హోమ్ వర్క్, ఎగ్జామ్స్ తప్పించుకోవచ్చు అని యాక్టింగ్ వైపు వెళ్తాను అని చెప్పాను మొదట్లో అని తెలిపింది. అప్పట్లో చిన్నగా  మొదలైన ఆమె ప్రయాణం, నేడు పాన్ ఇండియా రేంజ్‌లో కోట్లాది రూపాయల సంపాదనకి  చేరుకోవడం విశేషం. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు గ్లామరస్ పాత్రలు, టెలివిజన్ షోలతో రమ్యకృష్ణ తన క్రేజ్‌ను ఎప్పటికీ తగ్గకుండా చూసుకుంటున్నారు. నటిగా ఆమె ప్రయాణం ఎందరో యువ నటీమణులకు ఒక స్పూర్తిదాయకమైన పాఠం లాంటిది. తెరపై గ్లామర్ , తీవ్రమైన భావోద్వేగాలు పండించే రాజసం ఉట్టిపడే పాత్రలైనా రమ్యకృష్ణ వాటికి పూర్తిన్యాయం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె మొదటి సంపాదనకు సంబంధించిన చిన్న విశేషం వెలుగులోకి రాగానే అభిమానులు దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.   మీకు నచ్చవచ్చు:ఆ మూవీకి 11000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి: వెలుగులోకి వచ్చిన నిజం! మీకు నచ్చవచ్చు:అక్కినేని కోడళ్ళ గొప్పతనం!   [Ramya Krishnan, first income,Tollywood, Sivagami]
స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎవరు? అనే చర్చ జరగడం కామన్. కానీ రామ్ చరణ్‌–సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న RC17 విషయంలో మాత్రం ఈ సస్పెన్స్ కాస్త ఎక్కువగానే ఉంది. సినిమా ప్రారంభమైపోయింది.. ప్రీ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. అయినా హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం మేకర్స్ బయటపెట్టడం లేదు. తాజాగా ఈ మూవీ కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్లకు లుక్ టెస్టులు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. RC17లో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కోసం శ్రీలీల, సారా అర్జున్, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, సాత్విక వీరవల్లి పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఇప్పటికే లుక్ టెస్టులు, ఆడిషన్లు నిర్వహించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే వీరిలో ఎవరి పేరును ఇంకా హీరోయిన్‌గా ఖరారు చేయలేదట. గతంలోనూ సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లు ప్రధానంగా వినిపించగా.. తాజాగా మరికొందరు హీరోయిన్ల పేర్లు కూడా ఈ జాబితాలో చేరాయి. సాధారణంగా పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న తారల పేర్లు ముందుగా వినిపిస్తుంటాయి. కానీ సుకుమార్ మాత్రం RC17 విషయంలో తొందరపడటం లేదనే టాక్ ఉంది. పాత్రకు ఎవరు సరిపోతారు? నటన పరంగా ఎవరు మెప్పించగలరు? అనే అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ‘రంగస్థలం’లో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర అందుకు ఉదాహరణ. అందుకే RC17లోనూ హీరోయిన్ ఎంపికను ఆయన అంత సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: శ్రీలీల ఓపెన్ కామెంట్స్.. చిన్న వయసులో తప్పులు చేశా.! ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారా? లేక ఈ జాబితాలో లేని మరో నటిని సుకుమార్ తీసుకొచ్చి అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ ఎంపికపై డిసెంబర్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కావచ్చని ప్రచారం జరుగుతోంది. మీకు నచ్చవచ్చు: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.! మెగా హీరోయిన్ పెళ్లి.. మలేషియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఫొటోలు వైరల్.!       [RC17 Heroine, Ram Charan, Sukumar, Sreeleela, Sara Arjun]
రామాయణ పార్ట్ 1 ద్వారా రాముడు ఎక్కుబెట్టిన విల్లు రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెల్లోల్ల అడ్డా  ఓవర్ సీస్ లోను అదే పరిస్థితి. దీంతో అతి తక్కువ వ్యవధిలోనే ఓవర్ సీస్ చరిత్రలో అనేక రికార్డ్స్ జై శ్రీరామ్ అంటున్నాయి.    కేవలం 11 రోజుల్లోనే ఫేజ్-1 (Phase 1) ఓవర్సీస్ కలెక్షన్లలో 50 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటి, ఇప్పటివరకు ఉన్న అన్ని భారతీయ చిత్రాల రికార్డులు 'ధురంధర్ 2' (50 మిలియన్ డాలర్లు), 'పఠాన్' (49.30 మిలియన్ డాలర్లు), 'జవాన్' (48 మిలియన్ డాలర్లు), 'బాహుబలి 2' (46.98 మిలియన్ డాలర్లు) నెలకొల్పిన ఫేజ్-1 లైఫ్ టైమ్ రికార్డులని   11 రోజుల్లోనే అధిగమించడం విశేషం. 12 రోజులు ముగిసేసరికి ఈ సినిమా మొత్తం ఓవర్సీస్ వసూళ్లు 51.75 మిలియన్ డాలర్లకు, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 490 కోట్ల రూపాయల గ్రాస్‌కి  చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో వచ్చిన 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లలో, ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే 34.1 శాతం వాటా రావడం ఈ సినిమా గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం.   విదేశీ మార్కెట్లలో నార్త్ అమెరికా (అమెరికా, కెనడా) 'రామాయణం' చిత్రానికి అతిపెద్ద వసూళ్ల కేంద్రంగా నిలిచింది. అక్కడ 11 రోజుల్లోనే ఏకంగా 24 మిలియన్ డాలర్లు వసూలు చేసి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.యూకే, ఐర్లాండ్ దేశాల్లో 5.55 మిలియన్ డాలర్లు (4.20 మిలియన్ పౌండ్లు) సాధించి, యూకే బాక్సాఫీస్ వద్ద 4 మిలియన్ పౌండ్ల మార్కును దాటిన మూడో భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది. ఇది కూడా చదవండి: సంచలనం నమోదు: రిలీజ్‌కి ముందే 11,000 కోట్లు కొల్లగొట్టేసింది!    అలాగే గల్ఫ్ దేశాల్లో 5.40 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 4.20 మిలియన్ డాలర్లు, యూరప్ దేశాల్లో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కేవలం పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా, రామాయణ ఇతిహాసంతో విడదీయరాని అనుబంధం ఉన్న ఆసియా దేశాల్లో కూడా  వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మలేషియాలో 900 వేల డాలర్లు, సింగపూర్‌లో 790 వేల డాలర్లు, ఇండోనేషియాలో 575 వేల డాలర్లు, వియత్నాంలో 565 వేల డాలర్లు, న్యూజిలాండ్‌లో 525 వేల డాలర్లు వసూలు చేసి అక్కడి భారతీయ చిత్రాల ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసింది. పొరుగు దేశమైన నేపాల్‌లో అయితే కేవలం 8 రోజుల్లోనే 4 లక్షల 6 వేలకు పైగా టికెట్లు అమ్ముడై 16.10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 'ఆర్ఆర్ఆర్', 'పఠాన్', 'జవాన్' వంటి చిత్రాలను దాటేసింది.భారతదేశంలో 12 రోజుల్లో 947.25 కోట్ల రూపాయల గ్రాస్ (792 కోట్ల నెట్) వసూలు చేసిన 'రామాయణం', ఓవర్సీస్ కలెక్షన్ల అండతో అత్యంత వేగంగా 1,400 కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రంగా నిలిచింది.   చైనా, జపాన్ వంటి ఫేజ్-2 మార్కెట్లలో ఇంకా విడుదల కాకముందే ఈ స్థాయిలో 51 మిలియన్ డాలర్లకు పైగా ఓవర్సీస్ వసూళ్లు సాధించడంతో, రాబోయే రోజుల్లో ఈ చిత్రం 2,000 కోట్ల మైలురాయిని కూడా సునాయాసంగా దాటుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   మీకు నచ్చవచ్చు:ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్: అక్కినేని కోడళ్ల గురించేనా చెప్పింది!  మీకు నచ్చవచ్చు: కొత్త లోక రికార్డుకి మన తెలుగు హీరోయిన్ మంగళగీతం పాడనుందా!    [Ramayana, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh TIwari, Namith Malhotra]  
  సినిమా హిట్టు అయినా సరిగా డబ్బులు రాని పరిస్థితి. అలాంటిది ఏకంగా 11,050 కోట్లు రాబడితే.. ఏంటి ఇది నిజమేనా అనుకుంటున్నారా? అక్షరాలా పచ్చి నిజం. మరి లేటు చేయకుండా మీరు కూడా ఇంకొకరికి ఈ విషయాన్నీ చెప్పేలా పూర్తి మాటర్ చూసేద్దాం. గేమింగ్ ప్రపంచంలో గత 13 ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంచలనాత్మక వీడియో గేమ్ 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6' (GTA 6) మార్కెట్లోకి అడుగుపెట్టకముందే సరికొత్త చరిత్ర సృష్టించింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగడం చూస్తుంటాం, కానీ ఒక వీడియో గేమ్ కోసం ఒక్కరు కూడా కనీసం కంట్రోలర్ పట్టుకుని గేమ్‌ప్లే ఆడకముందే, కేవలం డిజిటల్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా 11,000 కోట్లకు పైగా వసూలు చేయడం గేమింగ్ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'సెన్సార్ టవర్' అందించిన తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 13 నాటికే ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ కోసం సుమారు 1.21 కోట్ల (12.13 మిలియన్లు) డిజిటల్ ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయి.   వీటి ద్వారా అక్షరాలా 1.18 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 11,050 కోట్లు) భారీ రాబడిని ఈ గేమ్ రాబట్టింది. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ కానున్న ఈ అడ్వెంచర్ గేమ్ కోసం యువత ఎంతగా పిచ్చిసెక్కిపోయి ఉన్నారో ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సోనీకి చెందిన ప్లేస్టేషన్ స్టోర్ (PlayStation Store), మైక్రోసాఫ్ట్ ఎక్స్-బాక్స్ స్టోర్ (Xbox Store) చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ప్రీ-ఆర్డర్లు దక్కించుకున్న ఏకైక టైటిల్‌గా జీటీఏ 6 నిలిచింది. సోనీ, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటివరకు ఉన్న ఆల్-టైమ్ రికార్డులన్నింటినీ ఈ గేమ్ తుడిచిపెట్టేసిందని అధికారికంగా వెల్లడించాయి.     ఇది కూడా చదవండి: అక్కినేని కోడళ్లపై ఆ అగ్ర నటి కీలక వ్యాఖ్యలు: ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!   విశ్లేషకుల అంచనాల ప్రకారం, మొత్తం ప్రీ-ఆర్డర్లలో దాదాపు 75 శాతం అనగా సుమారు 9.08 మిలియన్ల కాపీలు కేవలం ప్లేస్టేషన్ 5 (PS5) యూజర్ల నుంచే అమ్ముడయ్యాయి. దీనివల్ల ఒక్క ప్లేస్టేషన్ ప్లాట్‌ఫారమ్ ద్వారానే దాదాపు 88 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది.   మిగిలిన ప్రీ-ఆర్డర్లు ఎక్స్-బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ (Xbox Series X/S) ద్వారా వచ్చాయి. అంతేకాకుండా, కొనుగోలుదారులు ఎక్కువగా ఖరీదైన ఎడిషన్ల వైపే మొగ్గు చూపడం విశేషం. సుమారు 89 శాతం మంది గేమర్లు 100 డాలర్ల విలువైన అల్టిమేట్ ఎడిషన్‌ను ఎంచుకోగా, 11 శాతం మంది 80 డాలర్ల స్టాండర్డ్ ఎడిషన్‌ను ప్రీ-ఆర్డర్ చేసుకున్నారు.   మరోవైపు, గేమింగ్ ప్రియులు లాంచ్ రోజు ఎలాంటి సర్వర్ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు రాక్‌స్టార్ గేమ్స్ ముందస్తు డౌన్‌లోడ్ (Pre-load) సదుపాయాన్ని కల్పించింది. అయితే, ఈ భారీ గేమ్ సైజ్ కన్సోల్స్‌లో దాదాపు 212GB వరకు స్థలాన్ని ఆక్రమిస్తుందని తేలడంతో గేమర్లు తమ స్టోరేజ్‌ను ముందే సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో వచ్చిన జీటీఏ 5 (GTA 5) గేమ్ మార్కెట్లోకి వచ్చిన తొలి మూడు రోజుల్లో 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. కానీ జీటీఏ 6 మాత్రం అసలు విడుదల కాకముందే ఆ మైలురాయిని దాటేసి, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. నవంబర్ 19న గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న ఈ విజువల్ వండర్ లాంచ్ అయిన మొదటి వారంలోనే రూ. 27,000 కోట్ల నుంచి రూ. 43,000 కోట్ల ($3.3 బిలియన్ల నుంచి $5.2 బిలియన్లు) వరకు వసూలు చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.అర్ధమయిందిగా ఇదంతా సినిమా కాదు.. వీడియో గేమ్. మన సినిమా ఫక్కిలోనే ఉందని చెప్పుకున్నాం.   మీకు నచ్చవచ్చు:రామోజీ రావు లేటెస్ట్ న్యూస్ వైరల్! మీకు నచ్చవచ్చు:సాయి పల్లవి తల్లి షాకింగ్ స్పీచ్!     [gta 6 pre orders, Cinema, grand theft auto 6, gta 6 release , hollywood]
సినిమాలో పాటలు హిట్టయితే ప్రమోషన్స్‌కు ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో సినిమా కంటే పాటలే ముందుగా ప్రేక్షకుల్లోకి వెళ్లి అంచనాలను పెంచుతుంటాయి. ‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట ఇందుకు మంచి ఉదాహరణ. ఆ పాట సినిమాకు మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, మూవీ ప్రమోషన్స్‌లోనూ కీలకంగా నిలిచింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘రియాలిటీ’ కూడా ఇలాంటి ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ‘రియాలిటీ’ సినిమాలో పాపులర్ ‘రఘుకుల తిలకా రారా’ పాటను ఉపయోగిస్తున్నారట. విశేషం ఏంటంటే.. ఈ పాటను ఒరిజినల్‌గా పాడిన గాయకులతోనే మళ్లీ పాడించారట. క్వాలిటీ ఇన్‌స్ట్రుమెంట్స్‌, డీజే మిక్స్‌తో సరికొత్త మ్యూజిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాత పాటకు కొత్త ఎనర్జీ తోడైనట్లు తెలుస్తోంది. దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ఈ పాటను సినిమాలో మంచి సందర్భంలో ఉపయోగించారట. కేవలం ప్రేక్షకులను అలరించడానికి పాటను చొప్పించకుండా.. కథలో సరైన సన్నివేశంలో వచ్చేలా ప్లాన్ చేసినట్లు టాక్. అందుకే థియేటర్లలో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. ‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. ఆ పాట సినిమా ప్రమోషన్స్‌కు కూడా ఉపయోగపడింది. అసలు ఆ పాట కోసం సినిమాకి వెళ్దాం అనుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ‘రఘుకుల తిలక’ పాట పుణ్యమా అని ‘రియాలిటీ’ విషయంలోనూ అలాంటి మ్యాజిక్ జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: 15 ఏళ్ల కొలవెరి డి.. ఆరు నిమిషాల్లో రాసిన పాట ప్రపంచాన్ని ఊపేసింది.! ‘రియాలిటీ’పై మొదటి నుంచి అంచనాలే ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'ఉన్నంతలో మనకున్నంతలో' సాంగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ క్రమంలో ‘రఘుకుల తిలక’ పాటపై ఆసక్తి పెరుగుతోంది. ఒకవైపు పాత పాటకు ఉన్న క్రేజ్.. మరోవైపు ఒరిజినల్ సింగర్స్ గొంతులు, కొత్త మ్యూజిక్ మిక్స్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో మంచి సందడి ఉండే అవకాశం ఉంది. మరి ‘మల్లెపూల పల్లకి’ తరహాలో ‘రఘుకుల తిలక’ కూడా ‘రియాలిటీ’ ప్రమోషన్స్‌కు కీలకంగా మారుతుందా? ఈ ఒక్క పాటతో సినిమాపై హైప్ మరో స్థాయికి వెళ్తుందా? చూడాలి. మీకు నచ్చవచ్చు:  ఏనాటి వరమో నువ్వు.. ‘మైసా’లో తండ్రీకూతుళ్ల అనుబంధంతో రెండో పాట.! ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!       [Raghukula Tilaka Rara Song, Kiran Abbavaram, Reality Movie, Irumudi Movie, Mallepoola Pallaki Song]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాలంలో అత్యంత చల్లని వాతావరణం ఉంటుంది. ఈ సీజన్‌లో ఉదయం నిద్రలేచి వ్యాయామశాలకు వెళ్లడం కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికే అధిక బరువు ఉన్నవారికి బద్ధకంతో వ్యాయామాలు వాయిదా పడటం సర్వసాధారణం. అయితే ఎలాంటి కష్టతరమైన జిమ్ వర్కౌట్లు లేకుండానే, కేవలం చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ చలికాలంలోనూ సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో హైడ్రేషన్ అనేది చాలా కీలకమైన అంశం. చలికాలంలో సాధారణంగా దాహం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి, నీరు తాగడం తగ్గిపోతుంది. అయితే శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ ఏర్పడి తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఇది అనవసరమైన ఆహారాన్ని తీసుకోవడానికి దారితీసి బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో ఖచ్చితంగా తగినన్ని నీళ్లు తాగాలి. చల్లటి నీరు తాగడం కష్టంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కొవ్వు కరగడానికి సహాయపడి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అధ్యయనాల ప్రకారం, మీ శరీర ఉష్ణోగ్రత కంటే చల్లని నీరు తాగితే, శరీరం దానిని వేడి చేయడానికి సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో అవసరమైన క్యాలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి వీలైతే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం చాలా ఉత్తమం. నీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు శీతాకాలంలో బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో నీటితో పాటు పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు తేలికపాటి పానీయం కావాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. అలాగే ఒక చిన్న బీట్‌రూట్‌తో తయారు చేసుకున్న రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ఎంతో మంచిది. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది కూడా చదవండి:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి! చల్లని వాతావరణంలో చాలామంది కాఫీ, టీ ఎక్కువగా తాగుతుంటారు. అయితే చక్కెర, పాలు కలిపిన పానీయాలు బరువును పెంచే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా బ్లాక్ టీ, మందార టీ, ఊలాంగు టీ వంటి హెర్బల్ టీలను ఎంచుకోండి. కాఫీలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి బరువు తగ్గడం చాలా సులభమవుతుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో ఎక్కువగా వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాం. అలా కాకుండా ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చిన్నపాటి శారీరక శ్రమను చేస్తూ ఈ చిట్కాలను పాటిస్తే శీతాకాలంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు. మీకు నచ్చవచ్చు:ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!                              ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర!       Winter Weight Loss, Control Weight In Winter, Winter Health Secrets, Fitness Tips For Cold Weather, Healthy Lifestyle Habits, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కాంతివంతమైన, మచ్చలేని అందమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలుష్యభరిత వాతావరణం మరియు ఎండల కారణంగా చర్మం తన నిగారింపును కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. రసాయనాలతో కూడిన ఖరీదైన క్రీమ్‌లకు బదులుగా సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సంరక్షించుకోవచ్చు. అలాంటి అద్భుతమైన నేచురల్ క్లెన్సర్‌లలో పచ్చి పాలు ముందు వరుసలో ఉంటాయి. చర్మ సౌందర్యానికి పచ్చి పాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకోవడం ద్వారా సహజమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మ సంరక్షణలో పాలు ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్‌లా పనిచేస్తాయి. ప్రతిరోజూ పాలతో ముఖాన్ని మర్దనా చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న ధూళి, మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సాధారణ పద్ధతి వల్ల చర్మం ఎప్పుడూ తాజాగా మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది. రసాయన ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను నివారిస్తూ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో పచ్చి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పచ్చి పాలను రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం లోతుగా పోషణ పొంది ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా, ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడకుండా నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా పాలను ముఖానికి పట్టించడం ద్వారా చర్మ ఛాయ మెరుగుపడుతుంది మరియు సహజమైన మెరుపు సొంతమవుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో పాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎండ కారణంగా చర్మం కందిపోయి నల్లబడటాన్ని తగ్గించడంలో ఇది చక్కటి పరిష్కారం. ఎండ వల్ల వచ్చే ట్యాన్‌ను తొలగించి, చర్మానికి పాత కాంతిని తీసుకురావడానికి పచ్చి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి:కాళ్లలో రక్తం, గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ఎంత ప్రమాదం? పల్మనరీ ఎంబాలిజం పూర్తి వివరాలు పచ్చి పాలలో ఉండే సహజ కొవ్వు పదార్థాలు చర్మానికి అవసరమైన తేమను నిరంతరం అందిస్తాయి. దీనివల్ల చర్మం ఎప్పుడూ మృదువుగా, సున్నితంగా ఉంటుంది. క్రమం తప్పకుండా పాలను వాడటం ద్వారా వృద్ధాప్య ఛాయలను కూడా సమర్థవంతంగా తగ్గించవచ్చు, తద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పచ్చి పాలను ముఖానికి రాసుకునే సరైన పద్ధతి చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చి పాలు, దూది తీసుకోవాలి. దూది ఉండను పాలలో ముంచి, ముఖం అంతటా సమానంగా రాయాలి. పాలు సహజంగా ఆరిన తర్వాత, అదే దూదిని ఉపయోగించి మరోసారి పాలను రాయాలి. ఇలా 3 నుంచి 4 సార్లు అప్లై చేయాలి. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు స్వస్తి పలికి, ఇంట్లోనే దొరికే పచ్చి పాలను మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ చర్మంలో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. మీకు నచ్చవచ్చు:చలికాలం స్పెషల్: ఆరోగ్యకరమైన, క్యాప్సికం బజ్జీ తయారీ విధానం!                           పచ్చి బొప్పాయితో ,చర్మ సౌందర్యం మరియు, అసాధారణ ఆరోగ్య లాభాలు!       Raw Milk Skincare, Glowing Skin Remedies, Blemish Free Face, Kacha Dudh Benefits, Natural Beauty Tips, Skin Care Routine, Health Tips In Telugu.  
వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ ఫ్లూ, కోవిడ్ 19 లేదా మరేదైనా తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు చాలా మందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం రావడం సర్వసాధారణం. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే ఇవి వాటంతట అవే తగ్గిపోతాయని అందరూ భావిస్తారు. కానీ, కొన్నిసార్లు వైరస్‌లు కేవలం శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం కాకుండా, గుండెపై చాలా ప్రమాదకరమైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.   ఓపెన్ హార్ట్ జర్నల్  మరియు  కరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్డియాలజీ జర్నల్ ల తాజా అధ్యయనాల ప్రకారం, కోవిడ్ 19 లేదా ఇతర తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ల తర్వాత గుండె సమస్యలు తలెత్తే ముప్పు గణనీయంగా పెరుగుతుందని తేలింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు మన శరీరం సృష్టించే తీవ్రమైన వాపు ప్రక్రియ ఒక్కోసారి గుండె కండరాలను లేదా గుండె బయటి పొరను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల తర్వాత తలెత్తే ఈ గుండె సమస్యలను వైద్య పరిభాషలో మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ అని పిలుస్తారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వీటిని మామూలు ఫ్లూ లక్షణాలుగా లేదా సాధారణ నీరసంగా భావించి పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గమనించాల్సిన మొదటి లక్షణం భంగిమను బట్టి పూర్తిగా మారిపోయే విచిత్రమైన ఛాతీ నొప్పి. వెల్లకిలా పడుకున్నప్పుడు ఛాతీలో నొప్పి మరింత పెరిగి, కొద్దిగా ముందుకు వంగినప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తే అది వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల గుండె పొర వాపునకు గురైందని అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టమైన సంకేతం కనిపిస్తే వెంటనే అప్రమత్తమై కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం. రెండవ అత్యంత కీలకమైన లక్షణం ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే వచ్చే తీవ్రమైన ఆయాసం. ప్రశాంతంగా కూర్చున్న చోట కూడా శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడటం లేదా అర్ధరాత్రి హఠాత్తుగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మెలకువ రావడం గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతోందని సూచిస్తుంది. మూడవదిగా అస్థిరమైన హృదయ స్పందన లేదా గుండె దడ. ఒకవేళ జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కూడా మీ గుండె దడదడలాడుతున్నా లేదా విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నా అది తీవ్రమైన అరిథ్మియా సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో గుండె పనితీరు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి:కంటి చూపును, సహజంగా పెంచే సూపర్ ఫుడ్.. మునగాకు రహస్యాలు! నాల్గవ ముఖ్యమైన లక్షణం శరీరంలో నీరు చేరడం వల్ల వచ్చే వాపులు మరియు అకస్మాత్తుగా పెరిగే బరువు. గుండె బలహీనపడినప్పుడు శరీరంలో ద్రవాలు సరిగ్గా ప్రసరించక పేరుకుపోతాయి. దీనివల్ల చీలమండలు, పాదాలలో అకస్మాత్తుగా వాపులు రావడం, కేవలం 24 నుంచి 48 గంటల వ్యవధిలో హఠాత్తుగా బరువు పెరగడం జరుగుతుంది. ఇది గుండె వైఫల్యానికి స్పష్టమైన సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐదవది విపరీతమైన నీరసం మరియు కళ్లు తిరగడం. ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా తీవ్రమైన నీరసం వేధించడం, నిలబడినప్పుడు కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పడం వంటివి జరిగితే అది రక్తపోటు పడిపోవడానికి సూచన. ఈ 5 కీలక హెచ్చరిక సంకేతాలను ఏ దశలోనూ తేలికగా తీసుకోకూడదు. ఛాతీ నొప్పి, తీవ్రమైన ఆయాసం, గుండె దడ, కాళ్ల వాపులు, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంతావశ్యకం. సరైన సమయంలో స్పందించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెకు జరిగే శాశ్వత నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే వైరల్ ఇన్‌ఫెక్షన్ల తదనంతరం ఎదురయ్యే ప్రాణాంతక గుండె ముప్పుల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు. మీకు నచ్చవచ్చు:రోగనిరోధక శక్తిని పెంచే, క్యాప్సికమ్ గురించిన, ఆసక్తికర విషయాలు!                  కేలరీల ఖజానా, నల్ల శెనగలు.. చలికాలంలో ఇవి తింటే మీ శరీరానికి అసలైన శక్తి!       Heart Palpitations After Fever, Leg Swelling Symptoms, Post Viral Complications, Heart Risk Warnings, Cardiovascular Health News, Doctor Health Advice, Health Tips In Telugu.
షుగర్ (Diabetes) ఉన్నవారికి గుండె జబ్బులతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందా? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని రక్తనాళాలు, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? ఇలాంటి ముఖ్యమైన ఆరోగ్య విషయాల గురించి ఈ వీడియోలో డాక్టర్ శాస్త్రి వివరించారు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా నియంత్రణలో లేకపోతే రక్తనాళాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడటం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు పెరగవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. డయాబెటిక్ స్ట్రోక్ అంటే ఏమిటి? మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? షుగర్ వ్యాధి మెదడులోని రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు: ముఖం ఒకవైపు వాలిపోవడం లేదా కండరాల్లో బలహీనత రావడం. ఒక చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం లేదా తిమ్మిరి రావడం. మాట తడబడటం లేదా మాట్లాడటంలో ఇబ్బంది కలగడం. అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా కనిపించకపోవడం. నడవడంలో ఇబ్బంది, తల తిరగడం, శరీర సమతుల్యత కోల్పోవడం. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం. స్ట్రోక్ విషయంలో గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది. మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని స్ట్రోక్ చికిత్స అందించే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రారంభ గంటల్లో అందించే చికిత్స వల్ల మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల స్ట్రోక్ చికిత్సలు లక్షణాలు ప్రారంభమైన సమయం ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను ఎలా గుర్తిస్తారు? తక్షణ చికిత్సలో ఎలాంటి వైద్య విధానాలను అనుసరిస్తారు? గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి షుగర్ వ్యాధిని ఎలా నియంత్రించుకోవాలి? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను డాక్టర్ శాస్త్రి ఈ వీడియోలో వివరించారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, అత్యవసర చికిత్స, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. సకాలంలో గుర్తించి వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్, గుండె ఆరోగ్యం, స్ట్రోక్ లక్షణాలు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ శాస్త్రి అందిస్తున్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.  
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!