LATEST NEWS
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
టాలెంట్ ఉన్న కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య లక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'కింగ్ ఆఫ్ కోథా' బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరచడమే కాకుండా, తనపై వచ్చిన దారుణమైన ట్రోల్స్ వల్ల తన కెరీర్, ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత భారీ అంచనాల నడుమ 2023లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే నెటిజన్లు చిత్రబృందంతో పాటు ఐశ్వర్య లక్ష్మిని కూడా లక్ష్యంగా చేసుకుని విపరీతంగా ట్రోల్ చేశారు. సినిమాలో తన నటన, ముఖ్యంగా సంభాషణలు పలికే తీరుపై వ్యక్తమైన విమర్శలు తనను తీవ్రంగా బాధించాయని, కొన్నిసార్లు ప్రేక్షకులు చెప్పిన విమర్శల్లో నిజం ఉందేమో అని కూడా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సినిమాలో దుల్కర్ పాత్రను ఉద్దేశించి ఆమె పలికిన 'రాజువెట్టా' అనే సంభాషణ నెట్టింట బాగా వైరల్ అయి మీమ్స్‌గా మారింది. ఈ నెగెటివిటీ ఎంతలా పాకిందంటే, మరో సినిమా సెట్స్‌పై కూడా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్దేశపూర్వకంగా ఆ పేరుతో పిలిచి గేలి చేయడంతో తాను ఎంతో మానసిక వేదనకు గురైనట్లు ఐశ్వర్య వెల్లడించారు. ఈ దారుణమైన ట్రోలింగ్ ప్రభావం వల్ల మలయాళ చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలు తనకు కొత్త అవకాశాలు ఇవ్వడానికి కూడా కొంతకాలం వెనుకాడారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ చేదు అనుభవం వల్ల ఏర్పడిన భయంతో, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఒక బ్రాండ్ కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చినా తాను దాన్ని నిరాకరించానని ఐశ్వర్య తెలిపారు. తన వల్ల సదరు బ్రాండ్‌కు కూడా ట్రోలింగ్ సెగ తగులుతుందేమో అనే ఆందోళనతోనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. ఈ రకమైన నెగెటివ్ వాతావరణం వల్ల భవిష్యత్తులో దుల్కర్ సల్మాన్‌తో మళ్లీ కలిసి పనిచేయగలనా లేదా అనే సందేహం తనలో నెలకొందని ఆవేదన చెందారు. గతంలో జరిగిన ఈ ప్రతికూల ప్రభావాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఐశ్వర్య లక్ష్మి, ప్రస్తుతం ఇతర పరిశ్రమల్లో మంచి ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. తమిళంలో 'గట్ట కుస్తీ-2' విజయాన్ని అందుకున్న ఆమె, తెలుగులోనూ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. సాయి దుర్గా తేజ్ సరసన ఆమె నటిస్తున్న భారీ చిత్రం 'సంబరాల ఏటి గట్టు' నిర్మాణ ఆఖరి దశకు చేరుకోగా, మరోవైపు నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ చిత్రంలోనూ ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పాత చేదు జ్ఞాపకాలను పక్కనబెట్టి, సరైన ప్రాజెక్ట్‌లు ఎంచుకుంటూ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునేందుకు ఐశ్వర్య లక్ష్మి గట్టిగానే ప్రణాళికలు వేస్తున్నారు. రానున్న ప్రాజెక్టులతో ఆమె మళ్లీ విజయాన్ని అందుకుని తన స్టామినా నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.       [Aishwarya Lekshmi King Of Kotha, Dulquer Salmaan Aishwarya Lekshmi, King Of Kotha Trolling, Aishwarya Lekshmi Interview, TeluguOne TMDB Movie News]
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై సందడి చేశారు. ఆ కవర్ పేజీపై రాయల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే.. తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయం గురించి ఆమె పంచుకున్న మాటలు ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతున్నాయి. సమంత ప్రస్తుతం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన, ఎమోషనల్ ఫేజ్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సమంత, జీవితాన్ని ఒక కొత్త కోణంలో, ఆశతో చూడటం ప్రారంభించారు.  తాజాగా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన సమంత.. "I’m ready for my life to change completely" అంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒక తల్లిగా, ఒక వ్యక్తిగా ఆమెలో రాబోతున్న ఆ కొత్త అనుభూతి, కొత్త అనుభవం ఆమె జీవితాన్ని ఎలా మార్చబోతోందో ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జీవితంలో ఎన్ని మార్పులు, సవాళ్లు ఎదురైనా ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడే సమంత, ఇప్పుడు రాబోయే భవిష్యత్తును పూర్తి ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తున్నారు. ఈ మాతృత్వ ప్రయాణం కేవలం ఒక కొత్త బాధ్యత మాత్రమే కాదు, తనని తాను ఒక కొత్త కోణంలో అర్థం చేసుకునేందుకు సహాయపడుతోందని ఆమె భావిస్తున్నారు. https://www.instagram.com/p/DdDnjqTT8Zv/ ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో మరిన్ని ఆసక్తికరమైన పిక్స్ కూడా షేర్ చేశారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌ను విజిట్ చేసిన సమంత, అక్కడ ప్రశాంతమైన క్షణాలను గడిపారు. ఆ ప్రదేశంతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, లింగ బైరవి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, గోవులతో గడపడం, అక్కడే భోజనం చేయడం, సద్గురును కలవడం వంటి పిక్స్‌ను షేర్ చేశారు. తన వ్యక్తిగత జీవితంలో ఎంతటి ఒడిదుడుకులు ఎదురైనా, ప్రతిసారి అంతకంటే బలంగా తిరిగి కోలుకుని నిలబడ్డ సమంత, ఇప్పుడు తన జీవితంలో రాబోయే ఈ పాజిటివ్ మార్పులను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీ ఫోటోలు, సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/Dc8cDUOmpKo/       [Samantha Ruth Prabhu, The Hollywood Reporter India, Samantha, Magazine Cover, Bangaaram, Sadhguru, Telugu Film News, Telugu News]  
    బోల్డ్ అండ్ రొమాంటిక్  కంటెంట్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే 'ఛీ ఛీ ఇదేం సబ్జెట్ అంటారు. కానీ ఇరగబడి చూస్తుంటారు. శృతిమించి విమర్శలు చేసిన వారు సైతం రహస్యంగా ఒక్కరే చూసి 'ఆహా ఏం తెరకెక్కించారు. మనం బయట నిత్యం ఇలాంటి కహాని లు చూస్తూనే ఉన్నాం కదా అనుకుంటారు. ఈ కోవకి చెందిన మూవీ 'లస్ట్ స్టోరీస్'. మొదటి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి.  ఒకవైపు ఆకర్షణ, మరొకవైపు గుండెల్లో దాగి ఉన్న రహస్య కోరికలు, ఇంకోవైపు బంధాల నడుమ నలిగిపోయే మనుషుల నిజరూపాలుతో రాగా, ఇప్పుడు మూడో పార్ట్  'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్‌ తాజాగా విడుదలై సోషల్ మీడియాని  షేక్ చేసింది. మరింత డ్రామా, రొమాన్స్, బోల్డ్ కంటెంట్ మరియు సంక్లిష్టమైన మానవ సంబంధాలను మన ముందుకు తీసుకువస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆంథాలజీ ప్రాజెక్ట్ కోసం భారతీయ చిత్రసీమలోని 4 మంది దిగ్గజ దర్శకులు చేతులు కలిపారు. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా మరియు విశాల్ భరద్వాజ్ లాంటి ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు 4 వేర్వేరు కోణాల్లో ఈ ప్రేమ, మోహం మరియు ఆకర్షణల కథలని మలిచారు. సమాజంలో ఇప్పటికీ విప్పడానికి జడిసే ఎన్నో సున్నితమైన అంశాలని , మనుషుల మనస్సులోని ప్రతిబింబాలను ఈ 4 షార్ట్ ఫిలిమ్స్‌ ద్వారా చాలా ధైర్యంగా ఆవిష్కరించబోతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఏర్పడే గందరగోళాలు, దాచుకున్న బంధాల వెనుక ఉండే అసలు సత్యాలు ఈ కథల్లో అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. నటీనటుల విషయానికి వస్తే, ఏకంగా 10 మందికి పైగా దిగ్గజ, ప్రముఖ నటీనటులతో అత్యంత నక్షత్ర సమూహంతో ఈ సీరీస్ రూపొందింది. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, విజయ్ వర్మ, సిద్ధార్థ్, ఆలీ ఫజల్, అభిషేక్ బెనర్జీ, రాధికా మదన్, గుర్ఫతే పిర్జాదా మరియు సనా థంపి వంటి ప్రముఖ తారలు ఈ కథల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా హిందీ, సౌత్ ఇండియా సినీ రంగాలకు చెందిన ఈ క్రేజీ స్టార్ కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఒక్కో దర్శకుడికి ఉన్న విభిన్నమైన టేకింగ్ స్టైల్ ఈ ఆంథాలజీని ఎంతో ప్రత్యేకంగా మలిచింది.   Also Read: లేట్ అయినా లేటెస్ట్ గా: దృశ్యం 3 ట్రైలర్ వచ్చేసింది.. ఇంకా చూడలేదా! ట్రైలర్ పరిశీలిస్తే... రోజువారీ సాధారణ జీవితానికి అలవాటుపడిన మనుషులు, ఊహించని కోరికలకి లోనైనప్పుడు వారి జీవితాలు ఏ తీరానికి చేరుకుంటాయో విక్రమాదిత్య మోత్వానే విభాగంలో చూపించారు. అలాగే చిన్న ఆకర్షణ కూడా ఎలాంటి అనుకోని పర్యవసానాలకు దారితీస్తుందో కిరణ్ రావ్ దర్శకురాలిగా వినోదాత్మకంగా, ఉత్కంఠభరితంగా చెక్కారు. మరోవైపు బంధాలలో స్పష్టత లేని మనుషుల మానసిక ఘర్షణలను శకున్ బాత్రా ఆవిష్కరించగా, విశాల్ భరద్వాజ్ తనదైన శైలిలో కోరికలు మరియు కల్పనా ప్రపంచం నడుమ నడిచే ప్రయాణాన్ని ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18, 2026 నుంచి ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ఆర్‌ఎస్‌విపి (RSVP) మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ లస్ట్ స్టోరీస్ 3, డిజిటల్ వీక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. 4 రకాల విభిన్నమైన ప్రపంచాలు, 4 కొత్త ప్రేమ కథలు, అంతకుమించిన ఉత్కంఠభరిత డ్రామా చూడటానికి ప్రేక్షకులు కూడా సెప్టెంబర్ 18 కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     [Lust stories 3, Lust stories 3 Trailer, Radhika Apte, Netflix, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]
  దృశ్యం మూవీతో తెలుగు ప్రేక్షకులకి ఉన్న అనుబంధం తెలిసిందే. కూతుర్ని హత్య కేసు నుంచి కాపాడుకోవడానికి సినిమాని విపరీతంగా ప్రేమించే మధ్య తరగతి తండ్రి అదే సినిమా నేర్పిన తెలివితేటలతో కూతుర్ని హత్య కేసు నుంచి ఎలా కాపాడుకున్నాడు   అనేదే దృశ్యం. అప్పట్నుంచి తెలుగు వారికి దృశ్యంతో పాటు కంటిన్యూగా వచ్చే దృశ్యం సిరీస్ ల పై ఒకింత అభిమానమే దాగి ఉంది.  ఇప్పడు హిందీలో  అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న 'దృశ్యం 3' (Drishyam: The Conclusion) అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలైంది. పనోరమా స్టూడియోస్, స్టార్ స్టూడియోస్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ సుమారు 2 నిమిషాల 52 సెకన్ల నిడివితో ఉత్కంఠభరితంగా సాగింది. విజయ్ సల్గాంకర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పన్నిన వ్యూహాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అభిషేక్ పాఠక్ చాలా త్రిల్లింగ్‌గా ఆవిష్కరించారు. హిందీ ప్రేక్షకుల ముందుకు ఈ కథ ముగింపు ఘట్టంగా రాబోతోంది. "నా నిజం, నా ధర్మం.. కేవలం నా కుటుంబమే" అనే శక్తివంతమైన డైలాగ్‌తో విజయ్ సల్గాంకర్ పాత్ర స్వభావాన్ని మరోసారి ప్రతిబింబించారు.  ఈ మూడో భాగంలో విజయ్ సల్గాంకర్‌కు గతంలో కంటే చాలా పెద్ద ముప్పు ఎదురుకాబోతోంది. మాజీ ఐజీ మీరా దేశ్‌ముఖ్‌గా తబు, ఆమె భర్తగా రజత్ కపూర్ తిరిగి తమ పాత్రల్లో కనిపిస్తుండగా, కొత్తగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ లాయర్ ఇంద్రజిత్ శెట్టిగా, ప్రసిద్ధ నటుడు జైదీప్ అహ్లావత్ ఎస్పీ రాజ్వీర్ సింగ్ తోమర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురు దిగ్గజ నటుల కాంబినేషన్‌లో సల్గాంకర్ కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు ట్రైలర్‌లో అత్యంత ఆసక్తికరంగా మారాయి. శ్రీయా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ యాదవ్ కూడా నందిని, అంజు, అను పాత్రల్లో తిరిగి నటించారు.       Also Read: ఫ్యాన్స్ షాక్: బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత పెళ్లిళ్లల్లో డ్యాన్స్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న స్టార్ హీరో  ఫ్రాంచైజీ సెంటిమెంట్‌కు అనుగుణంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజే  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2015 నుండి కొనసాగుతున్న ఈ కేస్ స్టోరీకి ఇది ఆఖరి ఘట్టం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.      [Drishyam 3, Ajay Devgn, Tabu, Drishyam 3 Hindi Trailer, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]    
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' కోసం సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? మహేష్ బాబు పార్ట్ ఎంత మిగిలింది? అనుకున్న డేట్‌కి రిలీజ్ అవుతుందా? అంటూ అభిమానులు చర్చించుకుంటూనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా గురించి నెట్టింట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను 90 శాతానికి పైగా పూర్తి చేశారని సమాచారం. మనం ఇంకా షూటింగ్ ఏ దశలో ఉందో అని అనుకుంటుంటే, జక్కన్న మాత్రం సైలెంట్‌గా మెజారిటీ పార్ట్ పూర్తి చేసేశారు. మరో విశేషం ఏంటంటే.. మహేష్ బాబుకు సంబంధించిన కీలకమైన మేజర్ పోర్షన్స్ షూటింగ్ ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయిపోయింది. కేవలం మహేష్ బాబుకు సంబంధించిన ఒక క్రూషియల్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఎంట్రీ సీన్లు థియేటర్లలో సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. ఇప్పుడు 'వారణాసి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ప్లాన్ చేశారట. ఈ ఒక్క షెడ్యూల్ పూర్తయితే మహేష్ బాబు టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లే. ఒకవైపు షూటింగ్ నడుస్తుండగానే.. మరొకవైపు డబ్బింగ్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, VFX పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కడా టైమ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ VFX కంపెనీలతో జక్కన్న టీమ్ నిరంతరం వర్క్ చేస్తోంది. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో ప్రపంచస్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, కళ్లు చెదిరే విజువల్స్ ఉండబోతున్నాయి. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని రఫ్ లుక్‌లో పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు రాజమౌళి. ఇప్పటికే పూర్తి చేసుకున్న పోర్షన్స్ చూసిన యూనిట్ వర్గాలు అవుట్‌పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాయట. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ షూటింగ్ పూర్తి కావడంతో.. ముందుగా ప్రకటించినట్టుగానే 'వారణాసి' మూవీ ఏప్రిల్ 7, 2027న విడుదల కావడం ఖాయమనిపిస్తోంది.         [Varanasi Movie, Shooting Update, Mahesh Babu, Introduction Scene, SS Rajamouli, Telugu Film News, Tollywood News, Telugu News]  
  రాహుల్ రాయ్.. 90’sలో స్టార్ డమ్ హోదాని అనుభవించిన బాలీవుడ్ నటుడు. ముఖ్యంగా ఆషిఖీ’ చిత్రంతో లెక్కలేనంత మంది అభిమానులని సంపాదించడమే కాకండాప్రత్యేకమైన రూపం హెయిర్‌స్టైల్‌తో తనకంటూ ఒక 'ఆరా' క్రియేట్ చేసుకున్నాడు. ‘జునూన్’, ‘ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ’ వంటి  సూపర్ హిట్ చిత్రాలు కూడా తన ఖాతాలో ఉన్నాయి.  సుమారు 37 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించిన ఈ నటుడి జీవితం 2020లో ఊహించని విషాద మలుపు తిరిగింది. కార్గిల్‌లో ‘ఎల్‌ఏసీ – లైవ్ ది బ్యాటిల్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా  బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, నీ కెరీర్ మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ విషాదకర సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడాల్సి వచ్చింది. అనారోగ్యం నుంచి కోలుకుని, శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో ఆయనకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు లభించలేదు. అనారోగ్యం కారణంగా సినిమాలు దూరం కావడంతో ఆర్థిక ఇబ్బందులు, నిత్యం వాడాల్సిన మందుల ఖర్చులు, ఇంటి నిర్వహణ భారం రాహుల్ రాయ్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేసాయి. మరోవైపు తన ఆస్తులన్నింటినీ మాజీ భార్య పేరిట రాయాల్సి రావడంతో, ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సులో ఆయన మళ్లీ మొదటి నుంచి తన లైఫ్ స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. పైగా బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు నుంచి ఉన్న  చట్టపరమైన వివాదాలు, కోర్టు ఖర్చులు  అదనపు భారంగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో జీవనోపాధి కోసం, కుటుంబ పోషణ కోసం ఆయన ఎలాంటి సంకోచం లేకుండా తనకు దొరికిన పనిని స్వీకరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే పెళ్లిళ్లలోతో పాటు శుభకార్యాలలో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఒక పెళ్లిలో ఇచ్చే ప్రదర్శనకు గానూ  2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు పారితోషికం పొందుతారు. ఆ వచ్చిన డబ్బుతోనే నెలకు కావలసిన మందుల ఖర్చులు, నిత్యావసరాలు మరియు ఇతర కుటుంబ వ్యయాలను నెట్టుకొస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.   Also read: వామ్మో వారణాసి తెలుగు రైట్స్ అన్ని కోట్లా: అసలు ఆ బిజినెస్ నిజమేనా!  అయితే, ఆయన పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విమర్శలపై రాహుల్ రాయ్ ఎంతో నిగ్రహంతో, ప్రశాంతంగా స్పందించారు. "ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చుని నన్ను ట్రోల్ చేసేవాళ్లకు, అనారోగ్యం తర్వాత ఈ వయసులో నిలబడి డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో తెలియదు. నేను ఎవరి ముందూ చేతులు చాచడం లేదు, స్వశక్తితో కష్టపడి నిజాయితీగా నా కడుపు నింపుకుంటున్నాను" అని గట్టిగా సమాధానమిచ్చారు.        [Rahul Roy, brain stroke, Marriage Dance, Ashiqui, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]    
'తండేల్' సూపర్ సక్సెస్ తర్వాత అక్కినేని నాగ చైతన్య తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ'. 'విరూపాక్ష' లాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్స్ వేగంగా పూర్తవుతుండగా.. రాజస్థాన్‌లోని రాజభవనాల్లో భారీ యాక్షన్ సీన్స్, మిస్టరీ సీక్వెన్సెస్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ రేస్‌లో మిగతా పాన్-ఇండియా సినిమాల డేట్లు అటూ ఇటూ మారే అవకాశాలు కనిపిస్తుండటంతో, 'వృషకర్మ' టీమ్ ఖాళీగా ఉన్న డిసెంబర్ ఫస్ట్ వీక్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ప్రభాస్, హను రాఘవపూడి భారీ 'ఫౌజీ' మూవీ వాయిదా పడుతుందన్న సమాచారంతో.. 'వృషకర్మ' టీం ఆ డేట్ పై కన్నేసినట్లు సమాచారం. 'విరూపాక్ష'తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన కార్తీక్ దండు, ఈసారి 'వృషకర్మ' కోసం మైథాలజీ, హిస్టారికల్ ఎలిమెంట్స్, మిస్టరీని మిక్స్ చేసి అంతకుమించిన గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ చేశారట. ఈ సినిమాలో నాగ చైతన్య ఒక ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి 'లక్ష్య' అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తోంది. ఇక 'లపాతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించబోతున్నారు.  సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న 'వృషకర్మ' నాగచైతన్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ 3న బాక్సాఫీస్ దగ్గర 'వృషకర్మ' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.       [Vrushakarma Release Date, Naga Chaitanya, Karthik Dandu, Meenakshi Chaudhary, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]  
Yash after KGF franchise, became one of the biggest Pan-India stars. But his recent film, Toxic, his career biggest risk ended up being a forgettable disaster. The discussions are going about how big of a loss the movie ended up being for everyone involved. Yash, very confidently, even produced the film along with KVN Productions.  Now, he is answerable to exhibitors and distributors as well. Dubbing artist Jaidev Mohan in an interview revealed that when he spoke to Yash post release, the actor stated that he need to accept the audiences final judgement. He revealed that Yash looked upset but discussed about his upcoming Ramayana Part-1.  Also, few inside reports suggest that Yash did promise to compensate to producer Venkata Narayana with a new film. He is planning to keep this experience in mind and plan a better script but again he will be choosing an action film, state reports. Currently though, he is concentrating on finishing all his portions for Ramayana.  As Ravana, he has a very important part in the film and he will travel around India and world to promote the film in coming days. It is stated that he is determined to look ahead and not restrict to one failure. He did tell to Jaidev that when people did not connect they should learn and move on but not stop themselves.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    మహేష్, రాజమౌళి  'వారణాసి' గురించి డైలీ మాట్లాడుకోవడం అభిమానులు, మూవీ లవర్స్ కే కాదు భారతీయ సినిమాకే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. వరల్డ్ సినిమా టార్గెట్ గా కూడా తెరకెక్కుతున్న వారణాసికి సంబంధించిన బిజినెస్ న్యూస్ ఇప్పుడు  హీట్ ని రాజేస్తోంది.  తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 350 కోట్లకి ఫైనల్ అయ్యాయనే ప్రచారం జరుగుతుంది. మరి ఇదే నిజమైతే బిజినెస్ పరంగా 'వారణాసి' చరిత్ర సృష్టించినట్టే    . రాజమౌళి ప్రీవియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్'  తెలుగు స్టేట్స్ లో 200 కోట్లు బిజినెస్ జరుపుకోగా 270 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 122 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాధించగా ఇప్పుడు వారణాసి చిత్రం రూ. 320 కోట్ల నుండి రూ. 350 కోట్ల రేంజ్‌లో బిజినెస్ ఆఫర్లు అందుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా మారుతోంది.     Also Read: టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి కేవలం హోమ్ మార్కెట్ నుంచే ఈ స్థాయి డిమాండ్ రావడం భారతీయ సినీ చరిత్రలోనే అపూర్వం.  కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్‌లో మహేష్ బాబు 'రుద్ర' మరియు 'శ్రీరాముడు' వంటి రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.     [Varanasi, Mahesh Babu, Rajamouli, Priyanka Chopra, Telugu Rights, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]
  ఇల్లు కట్టుకొని మురిపోని వారంటూ ఉండరు. తమ జీవితం ధన్యమైపోయిందనుకునే వారికైతే లెక్కే ఉండదు.  కానీ  మన టాలీవుడ్ హీరోలలో కొంతమందికి... ఇప్పటివరకు తమకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదంటే మీరు నమ్ముతారా? "ఏంటి కామెడీ చేస్తున్నారా?" అని అనుకుంటున్నారేమో..ఇది అక్షరాలా నిజం! మనందరికీ తెలిసిన ఫేమస్ హీరోలు, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు కూడా నేటికీ అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు.అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అంతటి స్టార్డమ్ ఉన్న నటులకు సొంత ఇల్లు లేకపోవడానికి కారణం ఏమిటి?  ఈ లిస్ట్‌లో అందరికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి... పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ, ఎన్నో సక్సెస్ ఫుల్ విప్లవాత్మక సినిమాలు తీసిన ఈయన, నిజ జీవితంలో ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెలుసు. తలచుకుంటే హైదరాబాద్‌లోనే పెద్ద బంగ్లాలు కట్టేయగల సత్తా ఆయనకు ఉంది. కానీ, ఇప్పటివరకు ఆయన తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోలేదు. నేటికీ అమీర్‌పేట్‌లోని ఒక సాధారణ హాస్టల్‌లోనే నివాసముంటూ, తన దగ్గర ఉన్న డబ్బంతా సినిమాల పైనే పెడుతున్నారు. సినిమానే తన జీవితం, సినిమానే తన ఇల్లు అని నమ్మిన మహోన్నత నటుడు. ఇక కుర్ర హీరో రాజ్‌తరుణ్ కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు! అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, 'ఉయ్యాల జంపాల'తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. వరుస హిట్‌లతో కోట్లు సంపాదించిన రోజుల్లో చాలా ఆశగా ఒక మంచి కస్టమ్‌ హోమ్‌ను కొనుగోలు చేశాడు. కానీ పర్సనల్ లైఫ్‌లో వచ్చిన వివాదాల వల్ల, ఆ ఇంటిని తన మాజీ ప్రేయసి లావణ్యకు ఇచ్చేసి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసాడు. ప్రస్తుతం వరుస ప్లాపులు, రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతల వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజ్ తరుణ్... నేటికీ అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు! "జాతి రత్నాలు" సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మోస్ట్ వాంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించీ మీకు తెలుసా? యూట్యూబర్ స్థాయి నుండి ఒక్కో సినిమాకు 8 నుండి 10 కోట్ల రూపాయల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు ఈ యంగ్ స్టార్! కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే... ఇంత స్టార్డమ్ ఉన్నా నవీన్ పొలిశెట్టికి కూడా హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదు. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ కూడా ఇప్పటివరకు సొంత ఇంటిని నిర్మించుకోలేదు.     Also read: రికార్డులే తరువాయి: ఇరుముడి సక్సెస్, ది ప్యారడైజ్ కి ప్లస్ కాబోతుందా!  అయితే ఈ పరిస్థితి కేవలం యంగ్ హీరోలకే కాదు... మన టాలీవుడ్ లెజెండ్స్, పవర్ స్టార్స్‌ని కూడా వదల్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు ప్రొడక్షన్‌లో తీవ్ర నష్టాల్లో ఉన్నప్పుడు... అన్నను ఆదుకోవడానికి తన సొంత ఇంటిని అమ్మేశాడు! దాదాపు రెండు మూడు ఏళ్ల పాటు దగ్గరలోని ఒక చిన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అద్దెకు ఉన్నాడు ! ఇక నిర్మాతల హీరోగా పేరుగాంచిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా భారీ బడ్జెట్ సినిమాల ప్లాపుల వల్ల తనకెంతో ఇష్టమైన 'పద్మాలయ స్టూడియోస్'తో పాటు తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది! మహేష్ బాబు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వరకు కృష్ణ గారు ఎన్నో ఆర్థిక కష్టాలని అనుభవించారు.       [Krishna, Pawan Kalyan, Naveen Polishetty, Raj Tharun,  R Narayana Murthy,Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]
గణపతి నవరాత్రులు ఎలా ప్రారంభం అయ్యాయి..వీటి వెనుక ఉన్న భారత చరిత్ర ఏమిటి.! గణపతి నవరాత్రుల మహోత్సవం కేవలం ఒక  పండుగ మాత్రమే కాదు. ఇది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజా చైతన్యాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఉపయోగపడిన ఒక గొప్ప విప్లవాత్మక సామాజిక ఉద్యమం. ప్రాచీన కాలంలో వినాయక చవితి పూజలు ఇళ్లకే పరిమితమై, ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుగుతుండేవి. శాతవాహనులు, రాష్టకూటులు, విజయనగర రాజుల కాలం నుండి గణేష్ ఉత్సవాల ప్రస్తావన ఉన్నప్పటికీ, అందరూ ఇప్పట్లో వీధుల్లో గణపతిని ప్రతిష్ట చేసి  గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి  ప్రధాన కారణం బ్రిటిష్ పాలనా కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు. నేటి వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల వెనుక చరిత్రలో జరిగిన కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. గణపతి ఉత్సవాల వెనుక చరిత్ర.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో సంస్కృతి, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వినాయక ఉత్సవాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పీష్వాల పాలనలో వినాయకుడు వారి కులదైవం కావడంతో పూణేలో ఈ ఉత్సవాలు రాజ్యపండుగలా వైభవంగా సాగేవి. అయితే 1818లో పీష్వాల పాలన అంతరించి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం చేపట్టిన తర్వాత ఈ  ఉత్సవాలు ప్రాభవాన్ని కోల్పోయాయి.  ప్రజలు  ఇళ్లలోనే రహస్యంగా లేదా వ్యక్తిగతంగా పూజలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలో 19వ శతాబ్దం చివరలో ఒక పెద్ద మార్పు వచ్చింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష తీవ్రమైంది. దీనిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1892 ప్రాంతంలో తీవ్రమైన ఆంక్షలు విధించింది. భారతీయ ప్రజలు రాజకీయంగా సమావేశం కాకుండా, గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట చేరడం నేరంగా పరిగణించబడేది. ప్రజా సంఘాలు, రాజకీయ సమావేశాలపై కఠినమైన నిఘా ఉండేది. ఈ క్లిష్ట సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ లతో కలిసి పనిచేసిన గొప్ప నాయకుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సమావేశాలపై నిషేధం విధించింది కానీ, మతపరమైన ఆచారాలు , ఉత్సవాలపై నేరుగా జోక్యం చేసుకోలేకపోయింది. ఈ అవకాశాన్ని తిలక్ తెలివిగా ఉపయోగించుకున్నారు. 1893లో పూణేలో ఆయన సార్వజనిక గణేశోత్సవ మండలిని ప్రారంభించి, ఇళ్లలోని పూజను వీధులకి, బహిరంగ వేదికలకి తీసుకువచ్చారు. తిలక్ గణపతి ఉత్సవాలను ఒక సామాజిక, రాజకీయ వేదికగా మలిచారు. పందిళ్లు వేసి గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రజలందరూ ఒకచోట చేరే అవకాశం లభించింది. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే వేదికపైకి వచ్చి కలవడానికి ఈ ఉత్సవాలు తోడ్పడ్డాయి. ఉత్సవాల సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పద్య పఠనాలు నిర్వహించేవారు. వీటితో పాటు దేశభక్తి ఉపన్యాసాలు ఇస్తూ, స్వాతంత్ర్య ఉద్యమ భావాలను, బ్రిటిష్ పాలనలోని అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఈ తొమ్మిది లేదా పది రోజుల ఉత్సవాల కాలంలో విప్లవకారులు, స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా సమావేశమై ప్రణాళికలు రచించుకోవడానికి వీలు కలిగింది. బ్రిటిష్ గూఢచారులు పందిళ్లలో ఏం జరుగుతుందో కనిపెట్టడం కష్టమయ్యేది. తిలక్ స్థాపించిన కేసరి, మరాఠా వార్తాపత్రికల ద్వారా ఈ గణపతి నవరాత్రుల సందేశం మహారాష్ట్ర అంతటా మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. ముంబై, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో వేలాదిగా సార్వజనిక మండపాలు వెలిశాయి. స్వాతంత్రోద్యమంలో ఈ ఉత్సవాలు అందించిన చైతన్యం వెలకట్టలేనిది. ప్రజలలో జాతీయ సమైక్యతను, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గణపతి నవరాత్రులు కీలక పాత్ర పోషించాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్య లభించినప్పటికీ, తిలక్ ప్రారంభించిన ఈ సాంప్రదాయం భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిపోయింది. కాలక్రమేణా ఈ నవరాత్రుల ఉత్సవాలు మహారాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , ఉత్తర భారత దేశమంతటా విస్తరించాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు, లాల్ బాగ్ చారాజా వంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈనాడు గణపతి నవరాత్రులు కేవలం పూజలకే పరిమితం కాకుండా, రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు , పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలకు వేదికగా మారుతున్నాయి. ఈ విధంగా భక్తి భావనతో మొదలై, స్వాతంత్ర్య ఉద్యమ ఆయుధంగా రూపాంతరం చెంది, నేడు మహోన్నత సామాజిక ఉత్సవంగా విలసిల్లుతున్న గణపతి నవరాత్రుల వెనుక శతాబ్దాల భారతీయ చరిత్ర, సమరయోధుల వ్యూహాత్మక ఆలోచనలు , ప్రజల ఐక్యతా శక్తి దాగి ఉన్నాయి.                     *రూపశ్రీ.  
  వర్షాకాలం రాగానే చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పలు రకాల ఆరోగ్య, సౌందర్య సమస్యలు కూడా మొదలవుతాయి. వర్షంలో తడవడం, తేమతో కూడిన వాతావరణం వల్ల కాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య పగిలిన మడమలు మరియు పొడిబారిన పాదాలు. వర్షపు నీటిలోని బాక్టీరియా, బురద, మరియు వాతావరణంలో పెరిగే తేమ వల్ల పాదాల చర్మం నెర్రలు బారి పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ పగుళ్ల నుంచి తీవ్రమైన నొప్పి, రక్తం కారడం లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ముఖ సంరక్షణతో పాటు పాదాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. వర్షాకాలంలో పగిలిన మడమల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పాదాలను మెరిసేలా మార్చుకోవడానికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదే ఇంట్లోనే చేసుకునే సహజ సిద్ధమైన పెడిక్యూర్! ప్రతిరోజూ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో వారానికి 2 సార్లు ఈ పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పగిలిన మడమల సమస్య నుంచి 100 శాతం విముక్తి లభిస్తుంది. ఈ పెడిక్యూర్ ప్రక్రియ పాదాలలోని మృతకణాలను తొలగించి, చర్మానికి అవసరమైన తేమను అందించి పాదాలను ఎంతో మృదువుగామారుస్తుంది. ఈ హోమ్ మేడ్ పెడిక్యూర్ చేయడం అత్యంత సులభం. ముందుగా ఒక వెడల్పాటి బకెట్ లేదా టబ్‌లో పగిలిన పాదాలు మునిగేంత గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో 1 నుండి 2 చెంచాల ఎప్సమ్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు, కొద్దిగా మైల్డ్ షాంపూ మరియు ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ నీటిలో మీ పాదాలను దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. గోరువెచ్చని నీటి వల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మరియు పగుళ్లు మృదువుగా మారుతాయి. నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ గుణాలు బాక్టీరియాను అంతం చేస్తే, ఉప్పు అలసటను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలు బాగా నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ (Pumice Stone) లేదా ఫుట్ స్క్రబ్బర్ సహాయంతో మడమలను సున్నితంగా రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు (Dead Cells) సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత పాదాలను మంచి నీటితో కడిగి శుభ్రమైన తువ్వాలుతో తుడుచుకోవాలి. అనంతరం పాదాలకు తగినంత తేమను అందించడానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా మంచి మోయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పూట ఈ పెడిక్యూర్ చేసుకుని, ఆ తర్వాత సుతిమెత్తని కాటన్ సాక్స్ (Socks) ధరించి నిద్రపోవడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి పాదాలు పట్టులాగా మారుతాయి. వారానికి కనీసం 2 సార్లు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 2 వారాల్లోనే పగిలిన మడమలు పూర్తిగా నయమై, పాదాలు అందంగా తయారవుతాయి. దీనితో పాటు వర్షాకాలంలో తడి బూట్లు, తడి సాక్స్ ఎక్కువ సేపు వేసుకోకూడదు. వర్షంలో తడిసిన వెంటనే పాదాలను శుభ్రమైన నీటితో కడుక్కుని పొడిగా ఉంచుకోవాలి. సులభమైన ఈ జాగ్రత్తలు పాటిస్తూ, వారానికి రెండుసార్లు పెడిక్యూర్ చేయడం వల్ల వర్షాకాలంలో కూడా మీ పాదాల అందం, ఆరోగ్యం 100 శాతం పదిలంగా ఉంటాయి.     Pedicure twice a week for soft feet, monsoon foot care tips, and remedies.
  మన భారతీయ వంటకాల్లో పచ్చళ్లకు ఉన్న స్థానమే వేరు. రోజూ తినే ఆహారంలో కాస్త పచ్చడి నంచుకుంటే ఆ రుచే వేరు, మనసుకు కలిగే తృప్తి వేరు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు ఇళ్లలో పచ్చళ్లు చేయాలంటే నూనెలో ఎండుమిర్చి, ఇతర దినుసులు వేయించడం లేదా పచ్చడికి భారీగా తిరగమాత (తాళింపు) వేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా, ఎంతో ఘుమఘుమలాడే సువాసనతో, నోరూరించే రుచితో పాటు 100 శాతం నిండు ఆరోగ్య ప్రయోజనాలను అందించే  ఆయిల్ ఫ్రీ కొత్తిమీర పచ్చడి  (Oil Free Coriander Chutney) ని క్షణాల్లో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? పోషకాలతో నిండిన కొత్తిమీరతో చేసే ఈ సాంప్రదాయ వంటకం కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి దివ్యమైన ఆరోగ్య వరప్రదాయినిగా పనిచేస్తుంది. కొత్తిమీరను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు మరియు ఖనిజాలు అందుతాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్  సి, విటమిన్  కె లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు పీచు పదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉంటాయి. నూనె లేకుండా ఈ పచ్చడిని తయారు చేసినప్పుడు అందులోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా 100 శాతం శరీరానికి నేరుగా అందుతాయి. కొత్తిమీరలో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేసి రోగనిరోధక శక్తిని విశేషంగా పెంపొందిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హై బీపీని అదుపు చేయడంలో మరియు మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ ఆయిల్ ఫ్రీ పచ్చడి సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి గ్యాస్, అసిడిటీ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ అద్భుతమైన నూనె లేని కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఎప్పుడూ లభించే దినుసులే సరిపోతాయి. ఈ పచ్చడి తయారీ కోసం 2 కప్పుల తాజా కొత్తిమీర (బాగా కడిగి తరిగినది), మీ కారానికి సరిపడా 4 నుండి 6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, రుచికి సరిపడా రాతి ఉప్పు మరియు కొద్దిగా రుచిని పెంచడానికి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు లేదా పుట్నాల పప్పును సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం అత్యంత సులభం! మొదటగా చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం ఒక బాణలిలో నూనె వేయకుండా కేవలం పచ్చిమిర్చి, జీలకర్రను డ్రై రోస్ట్ (డ్రైగా వేయించడం) చేసుకోవాలి. పల్లీలను కూడా విడిగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లేదా సాంప్రదాయ రోలు తీసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, వేయించిన పల్లీలు, నానబెట్టిన చింతపండు మరియు ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత తాజా కొత్తిమీరను అందులో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే! ఎలాంటి నూనె లేదా తాళింపు అవసరం లేకుండా ఘుమఘుమలాడే హెల్తీ కొత్తిమీర పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, గారెలు లేదా రోటీలలోకి నంచుకుని తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. జీరో ఆయిల్ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది 100 శాతం పర్ఫెక్ట్ హెల్త్ డైట్ చట్నీగా నిలుస్తుంది.       Kothimeera pachadi without oil guide, healthy zero oil coriander green chutney.
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది ఒకవైపు అయితే, ప్రతిరోజూ ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ బైక్ ప్రయాణాలు చేసేవారు మరొకవైపు. ఈ రెండు రకాల పనుల వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడి, చిన్న వయస్సులోనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో డిస్క్ సమస్యలు, నరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. కూర్చునే పద్ధతిపై దృష్టి పెట్టాలి.. కుర్చీలో కూర్చున్నప్పుడు వీపు కుర్చీకి సరిగ్గా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుక భాగంలో ఖాళీ లేకుండా చిన్న కుషన్ లేదా పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ లేదా లాప్‌టాప్ స్క్రీన్  కళ్ళ ఎత్తులోనే ఉండాలి. స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ, వెన్ను భాగం ముందుకు వంగి నొప్పికి కారణమవుతాయి.  ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం రెండు నిమిషాలు అటు ఇటూ నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బైక్ జర్నీలు చేసేవారికి జాగ్రత్తలు.. రైడింగ్ చేసేటప్పుడు వీపును పక్కకు లేదా ముందుకు ఎక్కువగా వంచకుండా నిటారుగా కూర్చోవాలి. బైక్ షాక్ అబ్జార్బర్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రోడ్డుపై ఉండే గోతులు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే షాక్స్ నేరుగా వెన్నెముకపై పడతాయి. అందుకే ప్రయాణంలో హెల్మెట్‌తో పాటు నడుముకు సపోర్ట్ ఇచ్చే లుంబార్ బెల్ట్ వాడటం మంచిది. దూర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లేవారు మధ్యమధ్యలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. వెన్నునొప్పికి ప్రధాన కారణం నడుము , పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనపడటమే. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడానికి కేటాయించాలి. భుజాలు, నడుము, మెడ భాగాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని భుజంగాసనం, మార్జాలాసనం వంటివి వెన్నెముకను బలంగా, దృఢంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నీరు.. శరీరంలో నీటి శాతం తగ్గితే వెన్నెముక డిస్కులు తమ శోషణ శక్తిని కోల్పోయి త్వరగా అరిగిపోతాయి. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, గుడ్లు, బాదం , నువ్వులు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవడం కూడా వెన్నునొప్పి నివారణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర.. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం లేదా సరిగ్గా లేని మెత్తటి పరుపులపై పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి పెరుగుతుంది. మరీ మెత్తగా ఉన్న పరుపుల కంటే వెన్నెముకకు సరైన ఆధారాన్ని ఇచ్చే ఆర్థోపెడిక్ పరుపులను ఉపయోగించడం మంచిది. చిన్న చిట్కా..  పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో చిన్న దిండు పెట్టుకోవడం వల్ల నడుముపై పడే భారం తగ్గుతుంది. ఈ చిన్నపాటి మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా డెస్క్ జాబ్‌లు, బైక్ ప్రయాణాల వల్ల వచ్చే వెన్నునొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉండి, కాళ్ళలోకి పాకుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.                     *రూపశ్రీ.  
మహిళల శరీరంలో ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయో సరిగ్గా గమనిస్తే, ముప్పై ఏళ్లు అనేది ఒక ప్రధానమైన మలుపు అని చెప్పవచ్చు. ఇరవైల వయసులో ఉండే ఎనర్జీ, వేగంగా కోలుకునే తత్వం ముప్పైకి వచ్చేసరికి కాస్త మందగిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం విషయంలో చాలామందికి తెలియని, తెలిసినా నిర్లక్ష్యం చేసే అనేక విషయాలు ఉంటాయి. చాలామంది ఎముకల బలహీనత లేదా ఆస్టియోపోరోసిస్ అనేది కేవలం అరవై ఏళ్లు దాటిన ముసలివారికి మాత్రమే వచ్చే సమస్య అని భావిస్తారు. కానీ ఎముకలు గుల్లబారే ప్రక్రియ , వాటి నాణ్యత తగ్గడం అనేది నిశ్శబ్దంగా ముప్పై ఏళ్ల వయసు నుంచే ప్రారంభమవుతుంది. ఈ విషయం  అందరూ నమ్మే  అపోహలు, వాటి వెనుక ఉన్న సైన్స్ , ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే..  ఎముకల మార్పు.. మన శరీరంలోని ఎముకలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండే నిర్జీవ నిర్మాణాలు కావు. అవి నిరంతరం మారుతూ ఉండే సజీవ కణజాలాలు. పాత ఎముక కణజాలం తొలగిపోవడం ,  దాని స్థానంలో కొత్త ఎముక కణజాలం ఏర్పడటం అనే ప్రక్రియ జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియను బోన్ రీమోడలింగ్ అంటారు. చిన్నతనం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల వయసు వరకు శరీరం పాత కణజాలాన్ని తొలగించే వేగం కంటే కొత్త కణజాలాన్ని నిర్మించే వేగమే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్నే పీక్ బోన్ మాస్ అంటారు. అంటే జీవితంలో ఎముకలు చాలా సాంద్రతతో, బలంగా ఉండే స్థితి ఇదే. 30 ఏళ్ల తర్వాత.. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎముకల దశ పూర్తిగా మారిపోతుంది. శరీరం కొత్త ఎముకను నిర్మించే వేగం కంటే, పాత ఎముక కణజాలాన్ని కోల్పోయే వేగం పెరగడం మొదలవుతుంది. దీనిని సాధారణ భాషలో బోన్ లాస్ లేదా బోన్ డెన్సిటీ తగ్గడం అంటారు. ఈ మార్పు ముప్పైలలోనే మొదలైనప్పటికీ, ప్రారంభంలో ఎలాంటి నొప్పులు లేదా స్పష్టమైన లక్షణాలు ఉండవు. అందుకే దీనిని సైలెంట్ చేంజ్ అని పిలుస్తారు. ఈ వయసులో శ్రద్ధ తీసుకోకపోతే, నలభై,  యాభై ఏళ్లలో స్వల్పంగా కిందపడినా ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. కాల్షియం సరిపోతుందా? ఎముకల బలహీనత అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది కాల్షియం. చాలామంది వెంటనే కాల్షియం మాత్రలు వేసుకోవడం లేదా పాలు తాగడం మొదలుపెడతారు. కానీ నిజానికి కాల్షియం ఒక్కటే ఎముకలను కాపాడలేదు. మీరు ఎంత కాల్షియం తీసుకున్నా, దానిని శరీరం పీల్చుకోవడానికి విటమిన్ డి3 చాలా అవసరం. సూర్యరశ్మి సరిగ్గా తగలకపోవడం వల్ల నేటి కాలంలో ఎంతోమంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీనితో పాటు విటమిన్ కె2, మెగ్నీషియం, భాస్వరం వంటి ఇతర మూలకాలు కూడా సరిపడా లేకపోతే, తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకలకు చేరకుండా రక్తంలోనే ఉండిపోతుంది లేదా మూత్రపిండాల్లో రాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. హార్మోన్ల పాత్ర.. 30 ఏళ్ల తర్వాత  వయసులో హార్మోన్ల పాత్ర కూడా చాలా కీలకమైనది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎముకల సాంద్రతను కాపాడటంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముప్పై ఐదు దాటిన తర్వాత లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఈస్ట్రోజెన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు వస్తాయి.  ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిన ప్రతిసారీ ఎముకలు తమ సాంద్రతను వేగంగా కోల్పోతాయి. ముఖ్యంగా గర్భధారణ, పాలిచ్చే సమయాల్లో తల్లి శరీరం నుంచి అధిక మొత్తంలో కాల్షియం బిడ్డకు అందుతుంది. ఆ సమయంలో తగినంత పోషకాహారం తీసుకోకపోతే, ఆ లోపం వయసయ్యే కొద్ది స్పష్టంగా బయటపడుతుంది. వ్యాయామం.. వ్యాయామం విషయంలో కూడా చాలామంది మహిళలు పొరబడుతుంటారు. ప్రతిరోజూ నడవడం లేదా ఇంటి పనులు చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని అనుకుంటారు. నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఎముకల సాంద్రతను పెంచడానికి లేదా బలంగా ఉంచడానికి వేర్ బేరింగ్ వ్యాయామాలు , రెసిస్టెన్స్ ట్రెయినింగ్ అవసరం. అంటే కాస్త బరువులు ఎత్తడం, పుష్ అప్స్ చేయడం, సొంత శరీర బరువును ఉపయోగించి చేసే వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడికి స్పందనగానే శరీరం ఎముకల సాంద్రతను పెంచే కణాలను వేగంగా ఉత్పత్తి చేస్తుంది. ఎముకలకు నష్టం కలిగించే అలవాట్లు.. ఆధునిక జీవనశైలిలోని కొన్ని అలవాట్లు ఎముకలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ , ఉప్పు ఎముకల్లోని కాల్షియంను బయటకు లాగేస్తాయి. కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది. ఇక క్రాష్ డైటింగ్ లు చేస్తూ సడన్ గా బరువు తగ్గడం వల్ల కొవ్వుతో పాటు ఎముకల సాంద్రత కూడా దారుణంగా పడిపోతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ముప్పై ఏళ్లు దాటిన మహిళలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో గడపడం, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, విత్తనాలు, పాలు వంటి సమతులాహారాన్ని భాగం చేసుకోవడం, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం , క్రమం తప్పకుండా విటమిన్ డి, కాల్షియం స్థాయిలను చెక్  చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. నలభై ఏళ్ల తర్వాత ఎముకల సమస్యలతో బాధపడేకంటే, ముప్పైల నుంచే ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.                   *రూపశ్రీ.  
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా? ఈ వీడియోలో హార్ట్ హెల్త్, పోషకాహారం (Nutrition), సమీకృత ఆహారం (Samikrutha Aharam) గురించి డాక్టర్ జి. లక్ష్మణరావు Consultant Herbalist వివరించారు. మన శరీరంలో కనిపించే లక్షణాలను, రోజువారీ జీవనశైలిని గమనించి ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవడం గురించి ఆయన సూచనలు అందించారు. గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, సమతుల్యమైన మరియు సమీకృత ఆహారం, రోజువారీ జీవనశైలి వంటి అంశాలపై ఈ వీడియోలో చర్చించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారానికి ఉన్న ప్రాధాన్యతను ఈ వీడియో వివరిస్తుంది. అలాగే, ప్రతి ఆరోగ్య సమస్యకు వెంటనే మందులపైనే ఆధారపడకుండా, సమస్యకు సంబంధించిన లక్షణాలు, ఆహారం, జీవనశైలి వంటి అంశాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ ప్రస్తావించారు. ముఖ్య గమనిక: ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే వైద్యుడు సూచించిన మందులను స్వయంగా ఆపడం లేదా మార్చడం చేయకండి. గుండెకు సంబంధించిన లక్షణాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)