LATEST NEWS
సీనియర్ ఐఏఎస్ అధికారి  శ్రీలక్ష్మి రిటైర్‌మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.  మంగళవారం (జూన్ 30) శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్ అయిన తరువాత ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి..  జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా  పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.   22 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్‌గా ఎంపికైన శ్రీలక్ష్మి  కెరీర్‌ మొత్తం వివాదాస్పదంగానే సాగింది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ సీఎస్‌గా పనిచేసిన శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొని,  వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో ఆరో నిందితురాలిగా ఉన్నారు.  2011 నుంచి 2013 మార్చి వరకు చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్‌పై వచ్చిన శ్రీలక్ష్మి  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌లో కొనసాగి.. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి వచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమెను కూటమి ప్రభుత్వం రాగానే పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తాజాగా రిటైర్‌మెంట్‌కు 4 రోజుల ముందు ఆమెకు పోస్టింగ్ దక్కింది. ఇప్పుడు జగన్‌ కేసుల్లో సహనిందితురాలిగా ఉన్న అనుబంధం, తనకున్న ఫైనాన్షియల్ బ్యాంక్‌గ్రౌండ్‌తో శ్రీలక్ష్మి వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతుండటం రాజకీయవర్గాల్లో బర్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా  బీజేపీ) వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  పార్టీ తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.   ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని, అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలను తెలంగాణ బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని  పిలుపునిచ్చారు. బెంగాల్ మోడల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించాలన్న నితిన్ నబీన్.. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఇక ఎంత మాత్రం సహించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు.  బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు.   పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  రాజకీయంగా  భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు కోల్పోవడం బీజేపీకి  ప్లస్ పాయింట్‌ అయ్యింది. దానికి తోడు అక్కడ  తృణమూల్ కాంగ్రెస్పై తీవ్రమైన అవినీతి, అక్రమాల ముద్ర పడటం, మమతా బెనర్జీ తర్వాత వారసుడిగా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ మించి బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి బలమైన, మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఐకాన్ లీడర్ బీజేపీకి దొరకడం కలిసి వచ్చింది. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలే అక్కడ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయి. కానీ..  అటువంటి పరిస్థితి లేదు.  రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ, సీఎంపై గానీ ప్రజల్లో పెద్దగా  వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ముద్ర పడిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో   కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ..  వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో   బలమైన   నేతగా, మాస్  లీడర్‌గా, అసెంబ్లీ లోపలా  బయటా గట్టిగా గళం ఎత్తగల నాయకుడిగా  గుర్తింపు పొందారు. ఇటువంటి బలమైన వ్యూహకర్తను ఢీకొట్టడం బీజేపీ అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు.  మరోవైపు..  బెంగాల్‌లో సువేందు అధికారి తరహాలో రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగల  నాయకుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎవరూ కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య  అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు, కుమ్ములాటలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయని చెబుతున్నారు.   అలాగే.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్  ఇప్పటికీ బలంగానే ఉండటం కూడా బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో   త్రిముఖ పోటీ తధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. బెంగాల్ తరహా ఏకపక్ష వ్యూహాలు ఇక్కడ ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి  రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా..  విభజన చట్టంలో పేర్కొన్న ప‌లు కీలక ప్రాజెక్టులు, హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి హామీలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదనే అసంతృప్తి స్థానికంగా చాలా చాలా బలంగా ఉంది.  తెలంగాణ ఆవిర్భావానికి  పార్లమెంట్‌లో తాము కూడా మద్దతు తెలిపామని బీజేపీ క్రెడిట్ కోరుకుంటున్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పుష్కర కాలంలో  రాష్ట్రానికి చేసిన ఆర్థిక సాయం ఎంత అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే..   కేవలం బెంగాల్ ఫార్ములాను నమ్ముకుని తెలంగాణలో పాగా వేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడంగా మారుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. 
భారతీయ రాజకీయాలలొప్రశాంత్ కిషోర్ (పీకే) పేరుకు పరిచయం అక్కర్లేదు.  రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో చారిత్రాత్మక విజయాల వెనుక పీకే ఉన్నారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మరో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.  సొంత పార్టీ పెట్టి  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ  తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ అప్పుడు తాను స్వయంగా పోటీ చేయలేదు. పార్టీ ఘోర పరాజయం తరువాత ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు  సిద్ధమౌతున్నారు.    బిహార్‌లో ఆయన స్థాపించిన  జన్ సూరజ్  పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా వెనుకడుగు వేయని ప్రశాంత్ కిశోర్..  ఇప్పుడు బీహార్ కొత్త పాట్నా పరిధిలోని  బాంకీపూర్  నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా  బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.  దీంతో బాకింపూర్ కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీకి బలమైన నియోజకవర్గమే అయినప్పటికీ..  పీకే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా వెళ్లడడించారు.  బాంకీపూర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమనీ.. అవసరమైతే తానే స్వయంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు   పొలిటికల్ స్క్రీన్‌ప్లే లకే పరిమితమైన  ప్రశాంత్ కిషోర్..    ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అదీ బీజేపీకి గట్టిపట్టున్న బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. బీజేపీ కోటలాంటి బాంకీపూర్ లో పీకే గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాశాంత్ కిశోర్ మాత్రం  దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి  ఆ పార్టీ హైకమాండ్   గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ   జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం (జూన్ 28)  అర్ధరాత్రి తెలంగాణ బీజేపీ కీలక నేతలతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా..  గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే చూస్తూ ఊరుకోబోమని కుండబద్దలు కొట్టారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు.  బయటి నుంచి  మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  పశ్చిమ బెంగాల్ లాంటి   రాష్ట్రంలోనే బీజేపీ కేవలం తన సొంత బలంతో, క్షేత్రస్థాయి పోరాటాలతో  ఎదిగి అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పిన నితిన్ నబీన్.. అందుకు భిన్నంగా తెలంగాణలో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నాయకుల అలసత్వం, గ్రూపు రాజకీయాలు, విభేదాల కారణంగా పార్టీ వెనుకబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   రాష్ట్రంలోని ఏ నాయకుడు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్నారో, ఎవరు పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారో అనే పూర్తి వివరాలు, గణాంకాలు  తన వద్ద ఉన్నాయని  నితిన్ నబీన్ చెప్పారు.  రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అలాగే జీహఎచ్ఎంసీ సంస్థల ఎన్నికలను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. 
  ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..  తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కార్పొరేట్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని బలపరుస్తున్నది బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉప్పల్‌లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. ఉప్పల్ తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువని పేర్కొన్న కవిత, అలాంటి ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 250 గజాల స్థలాల కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని, అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని గతంలో అవహేళన చేసినవారే ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 'ఇడుపు కాగితం' అనే పదాన్ని ఎగతాళి చేస్తున్న వారిపై స్పందిస్తూ, దాని అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్‌ను అడిగితే వివరిస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాషను అవమానిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గతంలో అవమానాలను ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. భాషలన్నింటినీ గౌరవించాలని, అయితే తెలంగాణ భాషను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భాషను అవమానిస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని విమర్శించారు. బీజేపీ దేశ ప్రయోజనాల పేరుతో తెలంగాణ సమస్యలను విస్మరిస్తోందని, బీఆర్ఎస్ కూడా స్పందించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులు నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నందువల్లే తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడడం లేదని ఆరోపించారు. నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల పాలనే వినియోగించేలా ప్రభుత్వం జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, పాఠశాల ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. టీచర్లలో అధిక శాతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారినే నియమిస్తున్నారని, ఉత్తర భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు కూడా చిన్న ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని కవిత పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నది బీఆర్ఎస్‌లోని నాయకత్వమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, లాఠీలు, రబ్బరు తూటాలకు కూడా భయపడబోనని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప్పల్‌లోని అన్ని డివిజన్లలో పోటీ చేస్తామని, భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని, ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే చిత్రబృందం దృష్టి పెట్టబోతోందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర కథలో ఊహించని విధంగా ఒక కొత్త ఎపిసోడ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. సినిమాను మరింత నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు, ప్రేక్షకులకు థియేటర్లలో రోమాంచిత అనుభూతిని అందించేందుకు గానూ ఒక అద్భుతమైన కొత్త ఎపిసోడ్‌ను యాడ్ చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. దర్శకుడు వశిష్ట రాసుకున్న ఈ కొత్త సీన్ల స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవికి కూడా విపరీతంగా నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ షూటింగ్ కోసమే చిరంజీవి మరో 4 నుండి 5 రోజుల పాటు తన విలువైన కాల్షీట్లను ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు. ఈ కొన్ని రోజుల కొత్త షెడ్యూల్ గనుక విజయవంతంగా పూర్తయితే, ఇక విశ్వంభర సినిమా షూటింగ్‌కు అధికారికంగా పూర్తిగా పేకప్ చెప్పేసినట్లేనని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ కొత్త ఎపిసోడ్‌లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన అద్భుతమైన యాక్షన్ లేదా కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఉండబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం మేకర్స్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ అదనపు 4-5 రోజుల షూటింగ్ సినిమాకు చాలా కీలకంగా మారబోతోంది. ఇక మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై కూడా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ వసూళ్లకు ఎంతగానో కలిసి వస్తుందని భావిస్తున్నారు. గ్రాఫిక్స్ పనుల ఆలస్యం కాకుండా సకాలంలో పూర్తయితే దసరా రేసులో మెగాస్టార్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.   
సూర్య(Suriya)ప్లాపుల పరంపరకి మంగళం పలికిన మూవీ కరుప్పు అలియాస్ వీరభద్రుడు. ఎంటైర్ సూర్య కెరీర్ లోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 340 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో  దూసుకెళ్లింది. కేవలం తమిళనాడులోనే ఏకంగా 191 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి, సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ బ్లాక్‌బస్టర్ విజయం ఇచ్చిన జోష్‌తో సూర్య  'విశ్వనాధ్ అండ్ సన్స్' చేస్తున్న విషయం తెలిసిందే.  ఆగష్టు 14 న రిలీజ్ కాబోతుండగా వెంకీ అట్లూరి దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీలో సూర్య ఒక సాంగ్ పాడబోతున్నాడు రికార్డింగ్ థియేటర్ లో సూర్యతో పాటు వెంకీ, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కలిసి ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఇక సూర్య ఫ్యాన్స్ అయితే సూర్య గళం నుంచి వచ్చిన  సాంగ్ కి పూనకాలతో ఊగిపోవడం ఖాయం. Also read: lenin: లెనిన్ ట్రైలర్ రిలీజ్ రేపే.. ఆ నగరంలో అక్కినేని అభిమానుల మధ్య భారీ ఈవెంట్  సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్నవిశ్వనాధ్ అండ్ సన్స్ లో మమితా భైజు హీరోయిన్.  ప్రచార చిత్రాలతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.    
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మరో సంచలన ప్రకటన చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సంస్థ, తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 'జై భీమ్' చిత్ర దర్శకుడు టి. జె. జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారు. జూన్ 29, 2026 న చెన్నైలోని ప్రతిష్టాత్మక పార్క్ హయత్ హోటల్‌లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ముహూర్తపు వేడుకను ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మాత విజయ్ కిరగందూర్ నేతృత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం బలమైన కథాంశంతో పాటు, విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత రెండు దశాబ్దాలుగా వర్సటైల్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య ఖాతాలో ఇప్పటికే 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 7 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక బాధ్యత గల పాత్రలను ఎంచుకుంటూ ఆయన సాధిస్తున్న విజయం అద్భుతం. ఇక ఐఎండిబి (IMDb) ఇండియాలో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆలోచింపజేసే కథలకు, భావోద్వేగాలను జోడించి వెండితెరపై అద్భుతాలు సృష్టించడంలో జ్ఞానవేల్ శైలి ప్రత్యేకం. ఈ క్రేజీ ప్రాజెక్టులో సూర్య సరసన యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ఎస్. ఆర్. కతిర్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే కె. కతిర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు.  బలమైన కథ, ప్రతిభావంతులైన నటీనటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   https://x.com/hombalefilms/status/2071516269518504236
Suriya has officially joined hands once again with director TJ Gnanavel, the filmmaker behind the critically acclaimed Jai Bhim, for a new Pan-India project backed by Hombale Films. The reunion comes at a time when Suriya is riding high on the success of Karuppu.  Hombale Films Founder Vijay Kiragandur talking about the film said, “At Hombale Films, we have always believed that powerful cinema is born when passionate people come together with a shared vision. Collaborating with Suriya and T. J. Gnanavel is a step towards telling a story that is honest, meaningful, and will connect with audiences across the world.”  While the makers have kept plot details under wraps, the new venture is expected to be a gritty drama with commercial elements, aiming to strike a balance between intense storytelling and mainstream entertainment. The project is expected to be mounted on a grand scale, making it one of the actor's most anticipated upcoming films. Praising Suriya, the production house wrote, "He built it. Frame by frame. Film by film. Fight by fight. Roles that bled truth. Characters that carried the weight of real lives. A journey defined by courage, conviction, and craft." Continuing to praise him, they wrote, "Three decades of truth on screen. Countless hearts touched beyond it. Now, the most fearless actor of his generation steps onto his grandest stage yet." Sai Abhyankkar who scored music for Karuppu is composing music for the film and more details about the cast and crew will be revealed soon.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఉత్తరాది డిజిటల్ మార్కెట్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని చిత్రాలు కూడా యూట్యూబ్ వేదికగా అక్కడ వందల మిలియన్ల వ్యూస్ రాబట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా యంగ్ అండ్ మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ డిజిటల్ మార్కెట్ లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసి సంచలనం సృష్టించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘జయ జానకి నాయక’ చిత్రం యూట్యూబ్‌లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూన్‌ఖార్’ (Khoonkhar) పేరుతో విడుదలై ఏకంగా 100 కోట్ల వ్యూస్ మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర లిఖించింది. భారతీయ సినీ చరిత్రలోనే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ పై వంద కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్న మొట్టమొదటి హిందీ డబ్బింగ్ చిత్రంగా ‘ఖూన్‌ఖార్’ అరుదైన ఘనత సాధించింది. ఈ రికార్డుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉత్తరాది ప్రేక్షకుల గుండెల్లో తనకు ఉన్న అపారమైన మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన షాకింగ్ విషయం ఏంటంటే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్-1’ (KGF Chapter 1) హిందీ వెర్షన్ కూడా ప్రస్తుతం 861 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేజీఎఫ్ లాంటి భారీ చిత్రాన్ని వెనక్కి నెట్టి మరీ బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 2017లో భారీ బడ్జెట్ తో విడుదలైన ‘జయ జానకి నాయక’ సినిమా తెలుగు థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుని కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. కానీ ఈ చిత్రంలోని బోయపాటి శ్రీను మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ ఫ్యామిలీ సెంటిమెంట్ మరియు అదిరిపోయే లవ్ స్టోరీ ఎలిమెంట్స్ ఉత్తరాది మాస్ ప్రేక్షకులకు అమితంగా కనెక్ట్ అయ్యాయి. పెన్ మూవీస్ (Pen Movies) యూట్యూబ్ ఛానెల్ ద్వారా హిందీలో విడుదలైన ఈ చిత్రం కాలక్రమేణా నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ పొంది, రోజురోజుకూ వ్యూస్ పెంచుకుంటూ ఈ చారిత్రాత్మక రికార్డు వైపు దూసుకెళ్లింది. కేవలం ‘జయ జానకి నాయక’ మాత్రమే కాదు, హిందీ డిజిటల్ మార్కెట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఒక తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన నటించిన అల్లుడు అదుర్స్, కవచం, సీత వంటి ఫ్లాప్ చిత్రాలకు సైతం హిందీ యూట్యూబ్ వెర్షన్లలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం. అందుకే ఈ యంగ్ హీరో నటించే సినిమాలకు తెలుగు నాన్-థియేట్రికల్ రైట్స్ కంటే కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే నిర్మాతలకు కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరుతుంది. తెలుగులో యావరేజ్‌గా నిలిచిన సినిమాను హిందీలో వంద కోట్ల వ్యూస్ వచ్చేలా చూసిన నార్త్ ఆడియన్స్ అప్రిసియేషన్‌పై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి ఇండియన్ సినిమాగా ‘ఖూన్‌ఖార్’ నిలిచి టాలీవుడ్ సత్తాను చాటి చెప్పింది.  
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు తమిళ సినీ, రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ (Vijay) తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడమే కాకుండా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడును పాలిస్తున్నారు.  విజయ్ సాధించిన ఈ అసాధారణ రాజకీయ విజయం తమిళ సినీ పరిశ్రమలోని ఇతర స్టార్ హీరోలలో సరికొత్త ఆశలను, ఆలోచనలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే సూర్య రాజకీయ రంగప్రవేశంపై గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు, ఆయన అధికారిక అభిమాన సంఘం తాజాగా చెన్నైలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం మరింత ఆజ్యం పోసింది. ఈ ప్రత్యేక సమావేశంలో అభిమాన సంఘం నాయకుడు చేసిన ప్రసంగం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సూర్యను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "కాలం, దేవుడు కలిసి నిర్ణయిస్తే సూర్య ఒక గొప్ప ప్రజా నాయకుడిగా ఎదగడాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ అడ్డుకోలేరు. రాబోయే 2 నుండి 3 ఏళ్లలో మన సూర్య అభిమాన సంఘం చాలా పెద్ద స్థాయికి చేరుకోబోతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీలో ఉన్న 'నేను' అనే అహాన్ని పక్కన పెట్టి, మన అన్న సూర్య కోసం మీరంతా ఐక్యంగా పని చేయాలి. ఆయన ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదు" అంటూ ఆ నేత కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. గతంలో సూర్య స్థాపించిన 'అగరం ఫౌండేషన్' 15వ వార్షికోత్సవ వేడుకల సమయంలో కూడా ఇలాంటి రాజకీయ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ సమయంలో సూర్య పిఆర్ టీమ్ మరియు అభిమాన సంఘాల ముఖ్యులు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. కేవలం సమాజ సేవ, సినిమా రంగానికే సూర్య పరిమితమవుతారని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టం చేశారు.  కానీ, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడం, శాసనసభలో సినిమా నటుడిగా తనపై వస్తున్న విమర్శలను 'మేము ఫ్యాన్ క్లబ్ రోజుల నుంచే ప్రజల పక్షాన నిలబడ్డాం' అంటూ విజయ్ గట్టిగా తిప్పికొట్టడం వంటి పరిణామాలు సూర్య అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. రాజకీయ విశ్లేషకులు కూడా సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే అన్ని అర్హతలు, ప్రజాదరణ ఉన్నాయని భావిస్తున్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సూర్య సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చూడాలి.  
  అఖిల్ అక్కినేని((Akhil Akkineni)అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2023లో విడుదలైన 'ఏజెంట్'  బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా భారీ బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కసితో అఖిల్  జూలై 10 న  తన లెనిన్' తో ప్రేక్షకుల  ముందుకు రాబోతున్నాడు. యువ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సగటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకు కాస్త సైలెంట్‌గా ఉన్న  చిత్ర బృందం ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచింది.  రేపు అంటే 30 న  థియేట్రికల్ ట్రైలర్‌ని  విడుదల చేయాలని మేకర్స్ అధికారికంగా నిర్ణయించారు. వైజాగ్ వేదికగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని  అత్యంత ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. అఖిల్‌ని  మునుపెన్నడూ చూడని పూర్తిస్థాయి ఊర మాస్, రగ్గడ్ అవతార్‌లో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, 'సోల్ ఆఫ్ లెనిన్' గ్లింప్స్ వీడియో ద్వారా స్పష్టమైంది. అఖిల్ తన రోల్ కోసం ప్రత్యేకమైన డైట్, కఠినమైన వర్కౌట్స్ చేసి తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పక్కా విలేజ్ కుర్రాడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని నేర్చుకోవడం విశేషం. రాయలసీమ గ్రామీణ నేపథ్యంగా సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో ఒక వైవిధ్యమైన పాత్రలో అఖిల్ తన నటనా విశ్వరూపం చూపించనున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 'ప్రేమ' అనే సున్నితమైన అంశం చుట్టూ ఈ కథ అల్లుకున్నప్పటికీ, యాక్షన్ మోతాదు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. భాగ్యశ్రీతో అఖిల్ అద్భుతమైన లవ్ స్టోరీ, ఆ ప్రేమ కోసం అతను అందర్నీ ఎదిరించి నిలబడే తీరు, చేసే పోరాటం  హైలైట్‌గా నిలవనుందని సమాచారం. Also read: Chiranjeevi: ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రేవంత్ రెడ్డి.. ఫ్యాన్స్ సంబరాలు   శివాజీ, బ్రహ్మాజీ, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను వంటి విలక్షణ తారలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తూ కథకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందిస్తున్న అద్భుతమైన సంగీతం. మాస్ సినిమాలకు ప్రాణం పోసే థమన్, ఇప్పటికే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల ద్వారా సినిమాకు సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ బజ్‌ను తీసుకొచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవానే నడుస్తోంది. ఒక భారీ హిట్ సినిమాకు పార్ట్ 2 తీయడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే తాజాగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సరికొత్త చర్చ నడుస్తోంది. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కేవలం ఒక భాగంతో ముగించకుండా, రెండు భాగాలుగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ రెండు భాగాలను చాలా తక్కువ వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సాధారణంగా ఒక సినిమాకు, దాని సీక్వెల్‌కు మధ్య కనీసం ఏడాది లేదా రెండేళ్ల గ్యాప్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ 'డ్రాగన్' విషయంలో మాత్రం ట్రెండ్ పూర్తిగా మారబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే 2027 జూన్ 11వ తేదీన ఈ సినిమా మొదటి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఇప్పటికే డేట్ లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షాకింగ్ విషయం ఏంటంటే, ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన రెండో భాగాన్ని కూడా అదే ఏడాది అంటే 2027 డిసెంబర్ నాటికే థియేటర్లలోకి తీసుకురావాలని మూవీ టీమ్ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తోందట. అంటే కేవలం ఆరు నెలల తక్కువ వ్యవధిలోనే ఎన్టీఆర్ నుంచి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయన్నమాట. ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన 'ధురందర్' ఫ్రాంచైజీ సరిగ్గా ఇదే తరహా వేగవంతమైన రిలీజ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మొదటి భాగం విడుదలైన కొద్ది నెలలకే రెండో భాగాన్ని థియేటర్లలోకి తెచ్చి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకున్నారు. అక్కడ ఆ ఫార్ములా పర్ఫెక్ట్‌గా వర్కవుట్ కావడంతో, ఇప్పుడు టాలీవుడ్‌ లో ప్రశాంత్ నీల్ కూడా అదే తరహా మేజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ వంటి మాస్ హీరో ఇమేజ్, ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇటువంటి రాపిడ్ టూ-పార్ట్ రిలీజ్ స్ట్రాటజీతో ఎంతటి అడ్వాంటేజ్ ఉందో, అంతే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సినిమా రెండు భాగాలుగా సక్సెస్ కావాలంటే కేవలం రిలీజ్ ప్లానింగ్ ఒక్కటే సరిపోదు. కథలో చాలా బలమైన కంటెంట్ ఉండాలి. ముఖ్యంగా మొదటి భాగం ముగిసే సమయానికి ప్రేక్షకుడిలో రెండో భాగం ఎప్పుడెప్పుడు చూస్తామా అనే రేంజ్‌లో క్యూరియాసిటీని పెంచేలా క్లైమాక్స్ ట్విస్ట్ ఉండాలి. అప్పుడే ఆరు నెలల తర్వాత వచ్చే పార్ట్ 2 కు థియేటర్ల వద్ద భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కంటెంట్ లో దమ్ము లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంతటి భారీ బడ్జెట్ పెట్టినా ఆశించిన ఫలితం దక్కడం కష్టమేనని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ చిత్రాలతో సీక్వెల్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో బాక్సాఫీస్ వద్ద నిరూపించారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా విషయంలో వినిపిస్తున్న ఈ ఆరు నెలల గ్యాప్ థియరీ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. నిజంగానే ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ నుంచి రెండు పార్టులు వస్తే మాత్రం అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు అవుతుంది. ఈ ప్రచారంపై డ్రాగన్ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
సినీ సెలబ్రిటీలు ఎక్కడ ఏం మాట్లాడినా ఆ కామెంట్స్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోజులివి. అయితే పూర్తి వీడియోను చూడకుండా, అందులోని కొన్ని సెకన్ల క్లిప్లను మాత్రమే చూసి అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయింది. ఒకరి మాటలను లేదా కామెంట్ ను అసలు సందర్భం నుంచి పూర్తిగా విడదీసి కేవలం వ్యూస్ కోసం వైరల్ చేయడం వల్ల ఇండస్ట్రీలో కొత్తకొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. తర్వాత అసలు విషయం బయటకు వచ్చి సదరు సెలబ్రిటీ ఎంత వివరణ ఇచ్చినా, అప్పటికే జరగాల్సిన నష్టం, పరువు నష్టం జరిగిపోతోంది. తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా వ్యవహారం మరోసారి టాలీవుడ్‌ లో ఈ ఇష్యూను తీవ్ర చర్చలోకి తీసుకొచ్చింది. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్ మహా. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని ప్రెజెంటేషన్ లో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఈయన సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘రావు బహదూర్’ సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మూడేళ్ల క్రితం తన వ్యాఖ్యలపై వచ్చిన ఒక పెద్ద వివాదానికి మరోసారి క్లారిటీ ఇస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ‘దర్శకుల రౌండ్ టేబుల్’ కార్యక్రమంలో వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీ వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారితీశాయి. అప్పట్లో ఒక భారీ హిట్ సినిమా కథను, పాత్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కేజీఎఫ్’ (KGF) సినిమాపై చేసిన విమర్శలుగా భావించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా కేజీఎఫ్ అభిమానులు, నెటిజన్లు ఆయనపై 100 శాతం తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. కేవలం 2 సినిమాలు మాత్రమే తీసిన ఒక చిన్న దర్శకుడు, అంతటి భారీ కమర్షియల్ చిత్రాలను, స్టార్ డైరెక్టర్లను ఎలా విమర్శిస్తాడంటూ అప్పట్లో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ వివాదంపై ఇప్పుడు వెంకటేష్ మహా మరింత స్పష్టతనిచ్చారు. ఆ సమయంలో తాను ఏ కమర్షియల్ సినిమాను లేదా కమర్షియల్ సినిమాలను అసలు విమర్శించలేదని వెంకటేష్ మహా స్పష్టం చేశారు. తాను మాట్లాడింది కేవలం సినిమాల్లో విచ్చలవిడిగా చూపించే అల్ట్రా వయలెన్స్ (Ultra Violence) గురించి మాత్రమేనని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు తన కామెంట్స్ ను మధ్యలో కట్ చేసి, దానికి వేరే రంగు పులిమి సోషల్ మీడియాలో మరోలా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పూర్తి కన్వర్జేషన్ బయటకు రాకపోవడం వల్లే తాను కమర్షియల్ సినిమాలకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడినట్లు బయట తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. తనకు కమర్షియల్ సినిమాలపై ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని, అలాంటి మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని వెంకటేష్ మహా చెప్పారు. అయితే సమాజంపై తీవ్ర ప్రభావం చూపే వైలెన్స్ ను అదే పనిగా ప్రోత్సహించే కథల విషయంలో మాత్రం తాను వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తగా ఉంటానని వివరించారు. దర్శకులుగా సమాజానికి కథలు చెప్పే తమకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుందని చెప్పడమే తన ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. తాను మాట్లాడిన సుదీర్ఘమైన వీడియోను కేవలం కొద్ది సెకన్ల పాటు ఎడిట్ చేయడం వల్లే ఇంత పెద్ద అపార్థం జరిగిందని, ఒకవేళ ఆరోజు జనాలు పూర్తి వీడియో చూసి ఉంటే అసలు విషయం అందరికీ అర్థమయ్యేదని చెప్పారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో నడుస్తున్న ‘వైరల్ క్లిప్ కల్చర్’ ప్రభావంపై తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో చిన్న చిన్న వీడియో క్లిప్స్, షార్ట్ కట్స్ ఆధారంగానే సెలబ్రిటీలపై అభిప్రాయాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల ఇండస్ట్రీలో అనవసర వివాదాలు, వ్యక్తిగత విమర్శలు, నెగిటివిటీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వెంకటేష్ లేటెస్ట్ కామెంట్స్ తో అప్పటి వివాదం మళ్లీ టాలీవుడ్ లో తెరపైకి వచ్చింది. ఆయన చెప్పిన క్లారిటీని కొందరు సినిమా విశ్లేషకులు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం అప్పటి వ్యాఖ్యలే అసలు వివాదానికి కారణమని ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మొత్తం విషయం పూర్తిగా తెలుసుకోకుండా కేవలం సోషల్ మీడియా వైరల్ క్లిప్‌ల ఆధారంగా ఒక వ్యక్తిపై నిర్ణయాలకు రావడం ఎంతవరకు సరైందనే ప్రశ్నకు వెంకటేష్ మహా ఇష్యూ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.
సినిమా ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు జూలై మొదటి వారం సిద్ధమైపోయింది. ఈ వారం ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అస్సలు కొదవ లేదు. థియేటర్లలో 'నాగబంధం', 'రావు బహదూర్' లాంటి విభిన్నమైన తెలుగు చిత్రాలతో పాటు ఆలియా భట్ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఆల్ఫా' సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే థియేటర్లకే వెళ్లకుండా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే సినీ లవర్స్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 15 కి పైగా సరికొత్త ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీ రేసులో డిఫరెంట్ తెలుగు వెబ్ సిరీస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టాలెంటెడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త ఒరిజినల్ తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బ' జూలై 2 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక దురదృష్టవంతుడైన టీచర్, అసలు ఏమాత్రం అనుకూలంగా లేని ఒక పల్లెటూర్లో 'సెక్స్ ఎడ్యుకేషన్' బోధించాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ క్రేజీ స్టోరీ రాబోతోంది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్ భారీ క్రేజ్ ఉన్న 'ఎనోలా హోమ్స్ సీజన్ 3' కూడా జూలై 16 వ తేదీన డిజిటల్ స్క్రీన్స్ పై అలరించడానికి వస్తోంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ 'పెద్ది' కూడా ఇదే రోజున అంటే జూలై 16 వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సూపర్ కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐishwarya రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ 'ఇసకపట్నం' జూలై 2 వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. దీనితో పాటు లేటెస్ట్ గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ 'అబ్సెషన్' జూన్ 30 వ తేదీ నుండి ప్రైమ్‌లో రెంట్ మోడల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక జియో హాట్‌స్టార్ విషయానికి వస్తే, 'ప్రేమలు' సినిమా ఫేమ్ నస్లెన్ నటించిన మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా 'మాలీవుడ్ టైమ్స్' జూలై 3 వ తేదీ నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. మంచి క్లీన్ కామెడీ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ వీకెండ్‌లో ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. రీజినల్ ఓటీటీలు అయిన జీ5 మరియు ఆహా యాప్స్ కూడా ఈ వారం సరికొత్త సరిహద్దులను దాటుతున్నాయి. జీ5 ఓటీటీలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సస్పెన్స్ క్రైమ్ డ్రామా తెలుగు సిరీస్ 'మర్మదేశం' జూలై 3 వ తేదీ నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. అలాగే మన తెలుగు ఓటీటీ 'ఆహా' లో సరికొత్త రియాలిటీ షో 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్' జూలై 3 వ తేదీ నుండి గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతోంది. సోషల్ మీడియా స్టార్స్ హంగామాను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. సైన్స్ ఫిక్షన్ కథలను, మిస్టరీ థ్రిల్లర్స్‌ను అమితంగా ఇష్టపడే వారి కోసం ఆపిల్ టీవీ ప్లస్‌లో మోస్ట్ అవేటెడ్ 'సిలో సీజన్ 3' జూలై 3 వ తేదీ నుండి వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ కానుంది. ఇవే కాకుండా సన్ నెక్స్ట్ ఓటీటీ లో 'హ్యాంగ్ మ్యాన్' అనే ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా కూడా జూలై 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సస్పెన్స్, కామెడీ, యాక్షన్, మిస్టరీ ఇలా అన్ని జోనర్ల సినిమాలు ఈ వారం లైన్‌లో ఉన్నాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్‌ను బట్టి మీ ఫేవరెట్ మూవీస్, సిరీస్‌ల లిస్ట్‌ను ఇప్పుడే నోట్ చేసుకుని మీ వీకెండ్ ఓటీటీ ప్లాన్‌ను పక్కాగా సెట్ చేసుకోండి.
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ట్రామా బాండింగ్.. ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది. ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది? ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని.. రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది. ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.  ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది. ట్రామా బాండింగ్ సిగ్నల్స్.. ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.    సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం. ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,  ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.  సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం. ఎలా బయట పడాలి.. ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.    మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం  మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.  ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.  తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం.. ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.                                  *రూపశ్రీ.
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు.  కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా,  బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి.. విద్య, నైపుణ్యాలు.. విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు. ఆడపిల్ల  విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు. విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని  ఇస్తుంది,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి  కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే  కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.   ఆర్థిక భద్రత.. నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు  బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం  ఉంచుకోవాలి. ఇంటి ఆడపిల్లకు  ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే  పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా  తెలపాలి.  అలాగే ఆడపిల్లల  ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది. ఆత్మవిశ్వాసం.. జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి.  ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను  ప్రోత్సహించాలి.  జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల  ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు. నడవడిక, విలువలు.. సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది.  కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది.  మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు  ప్రతిచోటా గౌరవం ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం.. పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి.  ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి  ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది.  ఆడపిల్లలకు  కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది.  సంబంధాల పట్ల  నమ్మకం కూడా నిలిచి ఉంటుంది.  తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్  ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.                               *రూపశ్రీయ
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక కీలక శారీరక ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో డాక్టర్ హరిత మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు, ఆ లోపం శరీరంపై చూపే ప్రభావం గురించి సులభంగా వివరిస్తారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: మెగ్నీషియం అంటే ఏమిటి? మెగ్నీషియం శరీరానికి ఎందుకు అవసరం? మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కండరాల తిమ్మిర్లు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు మెగ్నీషియం సంబంధం డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం ప్రాముఖ్యత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం ఎలా సహాయపడుతుంది? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎప్పుడు సప్లిమెంట్లు అవసరం అవుతాయి? మెగ్నీషియం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్యుల సూచనలతో మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని  ఆహార నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు పోషకాలతో నిండి ఉండి, పగటిపూట శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కానీ వాటిని రాత్రిపూట తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆహార  నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట తప్పుడు ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, నిద్ర , విశ్రాంతిపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు పగటిపూట శరీరానికి మేలు చేస్తాయని  అనుకుంటారు, , కానీ  ఆ ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉదయం అమృతంలా ఉండి రాత్రికి విషంగా మారే ఆహారాలు ఏమిటో, వాటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుంటే.. పెరుగు.. పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పెరుగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా నమ్ముతారు. అయితే, రాత్రిపూట పెరుగు తినడం హానికరం కావచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. పెరుగులో ఉండే చలువ చేసే గుణం శ్లేష్మం ఉత్పత్తికి కారణం కావచ్చని, కొంతమందికి కడుపులో గ్యాస్ , బరువుగా ఉన్నట్లు కూడా అనిపించవచ్చని అంటున్నారు. పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి , దాదాపు ప్రతిఒక్కరికీ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.  అయితే పండ్లను  పగటిపూట తినడం ఉత్తమం. రాత్రిపూట పండ్లు తినడం కొంతమందికి వివిధ అనారోగ్య  సమస్యలను కలిగిస్తుంది. పండ్లలో సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పండ్లు తినడం వల్ల గ్యాస్ , మలబద్ధకం కూడా కలగవచ్చు. చికెన్.. కోడి మాంసం లేదా చికెన్ ను ప్రోటీన్‌కు మంచి మూలంగా చెబుతారు. అయితే అందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ సమయం , శక్తి అవసరం. అందుకే రాత్రిపూట చికెన్  తినడం జీర్ణక్రియ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ  రాత్రిపూట చికెన్  తినాలని అనుకుంటే దానిని పరిమిత పరిమాణంలో , సమతుల్యంగా తినడం మంచిది. ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్.. రాత్రిపూట నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల, వాటిని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల తగినంత విశ్రాంతి లభించక, నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే నిపుణులు రాత్రిపూట కొవ్వు పదార్థాలను తినవద్దని సిఫార్సు చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్.. ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఉదయం పూట తినడం వల్ల శక్తి , పోషణ లభిస్తాయి. అయితే, వాటిని సాయంత్రం ఆలస్యంగా లేదా రాత్రిపూట తినడం వల్ల జీర్ణ సమస్యలు , కడుపులో భారంగా అనిపించడం వంటివి ఎదురవుతాయట, ఎందుకంటే కడుపులోని ఎంజైమ్‌లు డ్రై ప్రూట్స్ ను  సులభంగా విచ్ఛిన్నం చేయలేవు. క్రూసిఫెరస్ కూరగాయలు.. క్రూసిఫెరస్ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్లు , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , జీర్ణ సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల, ఈ కూరగాయలను పగటిపూట తినడం మంచిది.                                      *రూపశ్రీ.