Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉదయం అమృతంగా ఉండి, రాత్రికి విషంగా మారే ఆహారాల గురించి తెలుసా?
posted on: Jun 27, 2026 1:04PM

మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు. నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు.. ఎప్పుడు తినాలనే విషయం కూడా అంతే ముఖ్యమని ఆహార నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు పోషకాలతో నిండి ఉండి, పగటిపూట శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కానీ వాటిని రాత్రిపూట తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట తప్పుడు ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, నిద్ర , విశ్రాంతిపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు పగటిపూట శరీరానికి మేలు చేస్తాయని అనుకుంటారు, , కానీ ఆ ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉదయం అమృతంలా ఉండి రాత్రికి విషంగా మారే ఆహారాలు ఏమిటో, వాటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుంటే..
పెరుగు..
పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పెరుగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా నమ్ముతారు. అయితే, రాత్రిపూట పెరుగు తినడం హానికరం కావచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. పెరుగులో ఉండే చలువ చేసే గుణం శ్లేష్మం ఉత్పత్తికి కారణం కావచ్చని, కొంతమందికి కడుపులో గ్యాస్ , బరువుగా ఉన్నట్లు కూడా అనిపించవచ్చని అంటున్నారు.
పండ్లు..
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి , దాదాపు ప్రతిఒక్కరికీ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే పండ్లను పగటిపూట తినడం ఉత్తమం. రాత్రిపూట పండ్లు తినడం కొంతమందికి వివిధ అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. పండ్లలో సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పండ్లు తినడం వల్ల గ్యాస్ , మలబద్ధకం కూడా కలగవచ్చు.
చికెన్..
కోడి మాంసం లేదా చికెన్ ను ప్రోటీన్‌కు మంచి మూలంగా చెబుతారు. అయితే అందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ సమయం , శక్తి అవసరం. అందుకే రాత్రిపూట చికెన్ తినడం జీర్ణక్రియ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ రాత్రిపూట చికెన్ తినాలని అనుకుంటే దానిని పరిమిత పరిమాణంలో , సమతుల్యంగా తినడం మంచిది.
ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్..
రాత్రిపూట నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల, వాటిని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల తగినంత విశ్రాంతి లభించక, నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే నిపుణులు రాత్రిపూట కొవ్వు పదార్థాలను తినవద్దని సిఫార్సు చేస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్..
ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఉదయం పూట తినడం వల్ల శక్తి , పోషణ లభిస్తాయి. అయితే, వాటిని సాయంత్రం ఆలస్యంగా లేదా రాత్రిపూట తినడం వల్ల జీర్ణ సమస్యలు , కడుపులో భారంగా అనిపించడం వంటివి ఎదురవుతాయట, ఎందుకంటే కడుపులోని ఎంజైమ్‌లు డ్రై ప్రూట్స్ ను సులభంగా విచ్ఛిన్నం చేయలేవు.
క్రూసిఫెరస్ కూరగాయలు..
క్రూసిఫెరస్ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్లు , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , జీర్ణ సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల, ఈ కూరగాయలను పగటిపూట తినడం మంచిది.
*రూపశ్రీ.






