రిటైర్మెంట్ తరువాత వైసీపీలోకి ఐఏఎస్ శ్రీలక్ష్మి!?

posted on: Jun 29, 2026 1:01PM

సీనియర్ ఐఏఎస్ అధికారి  శ్రీలక్ష్మి రిటైర్‌మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.  మంగళవారం (జూన్ 30) శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్ అయిన తరువాత ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి..  జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా  పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  

22 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్‌గా ఎంపికైన శ్రీలక్ష్మి  కెరీర్‌ మొత్తం వివాదాస్పదంగానే సాగింది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ సీఎస్‌గా పనిచేసిన శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొని,  వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో ఆరో నిందితురాలిగా ఉన్నారు.  2011 నుంచి 2013 మార్చి వరకు చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

బెయిల్‌పై వచ్చిన శ్రీలక్ష్మి  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌లో కొనసాగి.. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి వచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమెను కూటమి ప్రభుత్వం రాగానే పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తాజాగా రిటైర్‌మెంట్‌కు 4 రోజుల ముందు ఆమెకు పోస్టింగ్ దక్కింది. ఇప్పుడు జగన్‌ కేసుల్లో సహనిందితురాలిగా ఉన్న అనుబంధం, తనకున్న ఫైనాన్షియల్ బ్యాంక్‌గ్రౌండ్‌తో శ్రీలక్ష్మి వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతుండటం రాజకీయవర్గాల్లో బర్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...