Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కట్నం కన్నా విలువైన బహుమతులు.. ఇవి ఇస్తే కూతుళ్ల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది..!
posted on: Jun 27, 2026 2:12PM

ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు. కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా, బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి..
విద్య, నైపుణ్యాలు..
విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు.
ఆడపిల్ల విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు.
విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది.
పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.
ఆర్థిక భద్రత..
నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం ఉంచుకోవాలి.
ఇంటి ఆడపిల్లకు ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా తెలపాలి. అలాగే ఆడపిల్లల ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది.
ఆత్మవిశ్వాసం..
జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి. ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి.
స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను ప్రోత్సహించాలి. జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు.
నడవడిక, విలువలు..
సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది. మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు ప్రతిచోటా గౌరవం ఉంటుంది.
ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం..
పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి. ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆడపిల్లలకు కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది. సంబంధాల పట్ల నమ్మకం కూడా నిలిచి ఉంటుంది. తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్ ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.
*రూపశ్రీయ





