LATEST NEWS
తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.  తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం (ఏప్రిల్ 29)న ఘనంగా జరిగింది.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతనంగా ఎంపికైన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.   యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  లోకేష్ తో పాటుగా   కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.  నూతన కార్యవర్గంలో మొత్తం 29 మందికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో, కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా..  రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.    
  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, బుధవారం (ఏప్రిల్ 29)  రెండో, చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఈ విడతలో   142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారు.  అధికార తృణమూల్ కాంగ్రెస్  తన  అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి ఎలాగైనా బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.  అదలా ఉంచితే బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో     దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతం మమతా బెనర్జీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే, ఈసారి ఈ కోటను బద్దలు కొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.   ఇక పోతే..  భవానీపూర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.   ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించిన సువేందు, మరోసారి ఆమెను సొంత గడ్డపై సవాల్ చేస్తున్నారు. దీంతో ఈ పోరు కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, ఇద్దరు నేతల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది.    ప్రభుత్వ వ్యతిరేకత,  అవినీతి అంశాలను ఈ సారి ఎన్నికలలో బీజేపీ ప్రచారాస్త్రాలుగా సంధిస్తే..  సంక్షేమ పథకాలు,  బెంగాలీ సెంటిమెంట్‌తో మమతాబెనర్జీ ప్రచారాన్ని హోరెత్తించారు.  వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 4న విడుదల అవుతాయి.
బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.  తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.  వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు. 
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
ALSO ON TELUGUONE N E W S
Baby duo Anand Deverakonda and Vaishnavi Chaitanya are back with a movie sequel to the 90's web show. Titled EPIC, the film is directed by Aditya Haasan and expands on the world of his successful web series '#90's - A Middle Class Biopic'. The original show, which streamed on Aha and starred Shivaji, Mouli, and Vasuki, was known for its relatable middle-class family drama. The newly released teaser for EPIC is happening in a similar space. It continues the journey of second son of Shivaji and Vasuki in the show going to USA and his modern youth lifestyle. His love story and the kind of new things he faces in a different country with new-age relationships. The teaser presents normal conversations, family dynamics, and straightforward romantic situations between Anand and Vaishnavi. The film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the Sithara Entertainments and Fortune Four Cinemas banners. On the technical side, Hesham Abdul Wahab is composing the music, and Azeem Mohammad is handling the cinematography. The editing is done by Navin Nooli, with Avinash Kolla taking care of the production design and Phani K Varma acting as the executive producer.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  భారతీయ చలనచిత్ర చరిత్రలో హారర్ థ్రిల్లర్ జోనర్ కి  కొత్త అర్థం చెప్పిన సినిమా 'తుంబాద్'(Tumbbad 2). 2018లో విడుదలవ్వగా  విజువల్ వండర్‌ తో పాటు కల్ట్ క్లాసిక్ హోదాని పొందింది.  సోహమ్ షా ముఖ్యమైన క్యారక్టర్ చేసిన  చిత్రం అప్పట్లో ఒక ప్రేక్షకులను ఒక సరికొత్త భయానక లోకంలోకి తీసుకెళ్లింది.. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆశతో ఎదురుచూస్తు వస్తున్నారు. తాజాగా, అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ 'తుంబాద్ 2'  సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. తుంబాద్ 2 ని నిర్మిస్తున్న పెన్ మూవీస్ ఎక్స్ వేదికగా రిలీజ్ డేట్ ని ప్రకటించింది.  వచ్చే సంవత్సరం డిసెంబర్ 3 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మోదటి భాగం ఏ స్థాయిలో విజువల్స్ అందించిందో, అంతకు మించి అంతర్జాతీయ ప్రమాణాలతో సీక్వెల్‌ ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. 'పాపం మరియు దురాశ' అనే థీమ్ చుట్టూనే ఈసారి కూడా కథ తిరగనుంది. 'తుంబాద్ 2' అనౌన్స్‌మెంట్ రావడంతోనే హాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. భారతీయ సినిమాల్లో నిజమైన హారర్ అనుభూతిని ఇచ్చే సినిమా ఇదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొదటి భాగం ముగిసిన తీరు చూస్తే, సీక్వెల్‌లో వినాయక్ కొడుకు పాత్ర ఏం చేయబోతోంది? హస్తర్ మళ్లీ తిరిగి వస్తాడా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  Also read: Venakatesh: వెంకటేష్ పై దృశ్యం పాప ఎస్తేర్ అనిల్ సూపర్ కామెంట్స్   ఏది ఏమైనా మొత్తానికి 'తుంబాద్ 2' ద్వారా భారతీయ బాక్సాఫీస్ వద్ద మరో విజువల్ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప ట్రీట్ అని చెప్పవచ్చు. సోహమ్ షా తన డ్రీమ్ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను ఈ సీక్వెల్ కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి మరి. ఇటీవల 'తుంబాద్' ని  రీ రిలీజ్ చేసినప్పుడు  వచ్చిన రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అయ్యాయి. కొత్త సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లని  రాబట్టింది.  మొదటి భాగాన్ని తెరకెక్కించిన 'అనీల్ రాహి బర్వె' నే దర్శకుడు.    https://x.com/PenMovies/status/2049431294237634989?
King Nagarjuna Akkineni has shared a highly encouraging update regarding his son Akhil Akkineni's highly anticipated film, Lenin. Taking to his official social media account, Nagarjuna revealed that he recently watched the first cut of the movie. Expressing immense pride and confidence in the final product, the veteran actor assured fans that they are about to witness a completely new side of Akhil.  His enthusiastic endorsement has instantly multiplied the expectations surrounding the action entertainer. Along with his high praise, Nagarjuna officially announced that Lenin will hit the big screens on June 26, 2026, urging fans to mark the date. Interestingly, this grand release date announcement has confirmed a major box office showdown for the Tollywood audience.  The makers of another highly awaited project, Peddi, are currently planning to release their film just a day prior, on June 25th. This sets the stage for an intense and exciting clash at the ticket windows, as both major films will vie for the audience's attention during the same opening weekend. Fans and trade circles are now eagerly preparing for what promises to be a thrilling cinematic battle at the theaters.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కుటుంబం అనే బండి సజావుగా సాగాలంటే దానికి చక్రాలు భార్యాభర్తలు. అయితే, మన సమాజంలో మగవారికి ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) ఉంటుంది కానీ, ఆడవారికి మాత్రం చాకిరీ నుంచి విముక్తి ఉండదు. ఇదే అంశాన్ని ఎంతో హృద్యంగా, కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం 'అమ్మ రాజీనామా'. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమాలోని ఒక సన్నివేశం, నేటి తరం ఆలోచించాల్సిన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ సన్నివేశంలో అమ్మ (శారద) తన ఇంటి బాధ్యతల నుండి 'రాజీనామా' చేస్తుంది. వంట మనిషిని వద్దని పంపించేసి, తన స్నేహితురాలిని గౌరవిస్తుంది. అమ్మ వంట చేయకపోవడంతో ఇంటి కోడళ్ళు వంట గదిలోకి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా, ఆ ఇంట్లో ఒక రకమైన హాస్యాస్పదమైన, అదే సమయంలో జాలి కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. కోడళ్ళు చేసిన వంటలు తినలేక, కడుపులో గడబిడతో ఇల్లంతా బాత్రూమ్‌ల చుట్టూ తిరగడం చూస్తుంటే నవ్వు వస్తుంది కానీ, దాని వెనుక ఉన్న అంతరార్థం గమనించాలి. "కోడి కూయకపోయినా తెల్లారుతుంది" అని గర్వంగా మాట్లాడిన వారు, ఒక్క పూట అమ్మ వంట లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఈ సీన్ అద్భుతంగా చూపిస్తుంది. యజమాని (భర్త) తన 35 ఏళ్ల ఉద్యోగ ప్రయాణం గురించి గొప్పగా చెబుతూ, తనకు విశ్రాంతి కావాలంటాడు. అప్పుడు అమ్మ అడిగే ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. "మగవారికి ఆదివారాలు, పండగ సెలవులు, ఇన్సూరెన్స్‌లు, ప్రావిడెంట్ ఫండ్‌లు ఉంటాయి. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఇవేమైనా ఉన్నాయా?" అని ఆమె నిలదీస్తుంది. ఒళ్ళు బాగోకపోయినా, మనసు బాగోకపోయినా ఆడది వంటింట్లో గరిటె తిప్పాల్సిందేనా? అనే ప్రశ్న సమాజపు పితృస్వామ్య పోకడలపై విసిరిన విసురు. తన ఇన్నాళ్ల సంపాదన, ఖర్చుల లెక్కలను అప్పగించి, తన బాధ్యత తీరిపోయిందని అమ్మ ప్రకటించడం ఈ సన్నివేశంలో హైలైట్. కూతురు కడుపుతో ఇంటికి వచ్చినప్పుడు కూడా, "కన్నతల్లివా.. కసాయిదానివా" అని భర్త ప్రశ్నిస్తే, "నేను తల్లినని ఎవరు చెప్పారు? నేను రాక్షసిని" అని ఆమె ఆవేదనతో అనడం గుండెలను పిండేస్తుంది . కన్న ప్రేమను కేవలం వంట చేసి పెట్టడంతోనే కొలుస్తారా? అని ఆమె అడిగే ప్రశ్న నేటికీ ప్రాసంగికమే. 'అమ్మ రాజీనామా' సినిమాలోని ఈ సీన్ కేవలం ఒక నటన కాదు, అది కోట్లాది మంది గృహిణుల అంతర్మథనం. అమ్మంటే కేవలం వంట చేసే యంత్రం కాదు, ఆమెకూ ఇష్టాలు, అయిష్టాలు, విశ్రాంతి అవసరమని గుర్తించినప్పుడే ఆ కుటుంబం నిజమైన సుఖసంతోషాలతో ఉంటుంది. ఇప్పటికైనా ఇంట్లోని ఆడవారి శ్రమను గౌరవిద్దాం, వారికి తగిన గుర్తింపును ఇద్దాం. ఇలాంటి సందేశాత్మ‌క వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  తెలుగు చలన చిత్ర సీమలో వెంకటేష్(Venkatesh)నటనకి ఉన్న స్టామినా గురించి  ఎవరైనా  చెప్పడం స్టార్ట్ చేస్తే.. కొత్త నిజాన్ని కనిపెట్టవా ఏంటని మన ముఖాన్ని విచిత్రంగా చూసే పరిస్థితి.  ఎందుకంటే  ఆ లెజండ్రీ సృష్టించిన, సృష్టిస్తున్న ప్రభంజనం గురించి అందరకి తెలిసిందే. కానీ మోహన్ లాల్ కంటే నేను బాగా చేయలేనని వెంకటేష్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం. మోహన్ లాల్(Mohan Lal)దృశ్యం(Drushyam)మూవీని వెంకటేష్ కూడా అదే పేరుతో తెలుగులో చేసిన విషయం తెలిసిందే. రెండు చోట్ల వెంకటేష్ చిన్న కూతురు 'అను' గా 'ఎస్తేర్ అనిల్' చేసింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మోహన్ లాల్ గారు ఇచ్చిన కొన్ని ఎక్స్ ప్రెషన్ ని నేను ఇవ్వలేను. అది కేవలం ఆయనకి మాత్రమే సాధ్యమని అన్నారని చెప్పుకొచ్చింది.  వెంకటేష్ కూడా దృశ్యం విషయంపై మాట్లాడుతు మోహన్ లాల్ వంటి లెజెండరీ నటుడు చేసిన క్యారక్టర్ ని తిరిగి చేయడం అనేది ఏ నటుడికైనా కత్తి మీద సామే. మోహన్ లాల్ గారు  జార్జి కుట్టిగా అద్భుతంగా నటించారు.  Also read: Swagatha Krishnan: ఆ మ్యూజిక్  డైరెక్టర్ నాపై లైంగిక దాడి చేసాడు.. ప్రముఖ సింగర్  సంచలన కామెంట్స్ ఆయన నటనని కాపీ కొట్టడం నా ఉద్దేశ్యం కాదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, ఆ తండ్రి పడే ఆవేదనను నాదైన రీతిలో చూపించడానికి ప్రయత్నించాను. అసలు దృశ్యం వంటి బలమైన కథ ఉన్నప్పుడు, నటుడిగా పని సులభం అవుతుంది. ఆ కథలోనే ఒక మ్యాజిక్ ఉందని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మోహన్ లాల్ దృశ్యం 3 చేస్తున్నారు. వెంకటేష్ మాత్రం తెలుగులో రీమేక్ చెయ్యడం లేదు.    
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ రఘురామ్ (52) కన్నుమూశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, మంగళవారం సాయంత్రం సమయంలో ఆయన వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. గత కొన్నాళ్లుగా ఆయన శ్వాసకోస సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. (Director Raghu Ram) రఘురామ్ స్వస్థలం జగిత్యాల జిల్లా. జర్నలిజంపై మక్కువతో పలు ప్రముఖ వార్తా సంస్థల్లో పని చేశారు. అయితే, సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన వెండితెర వైపు అడుగులు వేశారు. ప్రముఖ దర్శకుడు సానా యాదిరెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి మెళకువలు నేర్చుకున్నారు. 2004లో విడుదలైన 'వరం' సినిమాతో రఘురామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, దర్శకుడిగా ఆయన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలకు రచయితగా పని చేశారు. రఘురామ్ కు భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని మధురా నగర్‌లో నివసిస్తోంది. రఘురామ్ మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి దర్శకుడిని, అంతకంటే గొప్ప జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.  
1. కొత్త మార్కెట్ పై వారణాసి గురి మహేష్ బాబు-రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' అంతర్జాతీయ స్థాయిలో కొత్త మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే నార్త్ అమెరికా, జపాన్ వంటి దేశాల్లో సత్తా చాటిన రాజమౌళి.. ఈ సినిమాతో సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. 2. మెగాస్టార్ కు అరుదైన గౌరవం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'దొంగ' సినిమాలోని ఐకానిక్ 'గోలీమార్' సాంగ్ లుక్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ గెటప్‌ను ప్రతిబింబించేలా అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీ 'యాక్షన్ ఫిగర్‌'ను మార్కెట్లోకి విడుదల చేసింది. హాలీవుడ్ సూపర్ హీరోల తరహాలో ఒక భారతీయ నటుడికి ఇలాంటి గుర్తింపు రావడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఫిగర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 3. చెప్పిన డేట్ కే 'లెనిన్'  అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ వాయిదా వార్తలకు నాగార్జున చెక్ పెట్టారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుందని స్పష్టం చేశారు. 'లెనిన్' ఫస్ట్ కట్ చూసిన నాగార్జున.. వెండితెరపై ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూడబోతున్నారని నమ్మకం వ్యక్తం చేశారు. కంటెంట్ పై నమ్మకం ఉందని, జూన్ 26న థియేటర్లలో కలుద్దామని నాగ్ ట్వీట్ చేశారు. 4. 80 అడుగుల ఎత్తు నుంచి రష్మిక జంప్ రష్మిక మందన్న తన తాజా చిత్రం 'మైసా' కోసం డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి రిస్కీ యాక్షన్ స్టంట్ చేసింది. సీన్ సహజంగా రావాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చూసి.. మూవీ టీంతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టంట్ సమయంలో ఆమెకు చిన్న గాయాలైనా లెక్కచేయకుండా షూటింగ్‌ను కొనసాగించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు రవీంద్ర పుల్లె కొనియాడారు. 5. దర్శకుడు కన్నుమూత టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. జర్నలిస్టు, దర్శకుడు రఘురామ్ మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. జగిత్యాలకు చెందిన ఆయన జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. అలాగే, 2004 లో వచ్చిన 'వరం' సినిమాతో దర్శకుడిగా మారారు. పలు సినిమాలకు రైటర్ గానూ పనిచేశారు.  6. మళ్ళీ వాయిదా పడిన 'టాక్సిక్' రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి సినిమా 'టాక్సిక్' వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్‌తో విడుదల చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని, అందుకే మరింత సమయం తీసుకుంటున్నామని యశ్ పేర్కొన్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. 7. టైగర్ తో బాలీవుడ్ ఎంట్రీ ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'.. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 8. ఆ యాక్టర్ తో పూజా హెగ్డే డేటింగ్  ప్రముఖ నటి పూజా హెగ్డే డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె బాలీవుడ్ యాక్టర్ రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో కనిపిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై పూజా హెగ్డే కానీ, ఆమె సన్నిహితులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 9. నిత్యా మీనన్ బోల్డ్ స్టేట్‌మెంట్ పెళ్లి, మాతృత్వంపై నటి నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం వయసు అయిపోతుందనే కారణంతో పెళ్లి, పిల్లలు వద్దని స్పష్టం చేశారు. తల్లి కావాలనేది ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని.. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనే మార్గాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో తనకు పెళ్లి కాకపోయినా.. పిల్లల కోసం దత్తత తీసుకునే ఆలోచన ఉందని నిత్య తెలిపారు. 10. శివాజీకి గాయత్రీ గుప్తా కౌంటర్ మహిళల డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన శివాజీకి తాజాగా నటి గాయత్రీ గుప్తా గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వేసుకునే బట్టలతో నిర్ణయించలేం" అని ఆమె కుండబద్దలు కొట్టారు. తనను జడ్జ్ చేసే అధికారం ఎవరికీ లేదని, ఏ బట్టలు వేసుకోవాలో అనేది మహిళల వ్యక్తిగత ఇష్టమని ఆమె స్పష్టం చేశారు. గాయత్రీ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.  
    సింగర్  స్వాగత కృష్ణన్(Swagatha Krishnan)..తమిళ సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆమె గళం నుంచి వచ్చాయి. ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా సినీ రంగాన్ని వదిలి రిషికేష్ వెళ్లి వ్యాపార రంగంలో స్థిరపడింది. అందుకు కారణం ఒక సంగీత దర్శకుడు నాపై చేసిన లైంగిక దాడి కారణమని చెప్తుంది. ఇప్పుడు ఈ విషయం సౌత్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో స్వాగత కృష్ణన్ మాట్లాడుతు అప్పుడు నాది చిన్న వయసు. బ్రేక్ అప్ అయ్యి డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఒక సంగీత దర్శకుడు నా లైఫ్ లోకి వచ్చాడు. నా పరిస్థితిని అనుకూలంగా చేసుకుని మాయమాటలు చెప్పి గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. నా చేత పాటలు పాడించి రెమ్యునరేషన్ ఇవ్వలేదు.  పైగా  నా దగ్గరే భారీ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టాడు. స్టూడియోలో నాపై   బలవంతంగా లైంగిక దాడి చేసి అదంతా రికార్డు  చేసి నన్ను బెదరించాడు. ఆ తర్వాత నాపై దొంగతనం మోపడంతో పాటు లేనిపోనీ వదంతులు సృష్టించడంతో  మనోవేదన చెంది ఇండస్ట్రీ వదిలి వెళ్లానని చెప్పుకొచ్చింది.  Also read: Gayatri Gupta: శివాజీకి గాయత్రి గుప్తా సావేజ్ రిప్లై.. నీతులు చెప్పడం ఆపండి ఇంత కాలం ఈ విషయాన్ని ఎందుకు దాచారన్న ప్రశ్నకి స్పందిస్తు ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. సినీ పరిశ్రమలో ఎవరికి చెప్పాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. కానీ ఇటీవల ఒక యువతీని కూడా నాలాగే మోసం చేసాడు. ఆ అమ్మాయి నాతో ఆ బాధ చెప్పుకుంది. మరి కొంత మంది అమ్మాయిలు అతని మోసానికి గురయ్యారు. దీంతో మరెవరకి అన్యాయం జరగకూడదని న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది. యెనో పెన్నే , కాదల్ కన్మణి లాంటి పాటలు స్వాగత కృష్ణన్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీత దర్శకుడి పేరుని మాత్రం ఆమె వెల్లడి చెయ్యలేదు.     
  గాయత్రి గుప్తా(Gayatri Gupta)ఏంటి నన్ను పట్టించుకోవడంలేదని నెట్టిల్లు కొన్ని రోజుల నుంచి డల్ గా ఉంది. ఇప్పుడు ఆ డల్ ని పోగొట్టడానికి  గాయత్రి గుప్తా వచ్చేసింది. రావడం రావడమే శివాజీపై కౌంటర్ అటాక్ చేసి తనపై నమ్మకం పెట్టుకున్న నెట్టింటికి సరికొత్త జోష్ తీసుకొచ్చింది. రీసెంట్ గా  గాయత్రి గుప్తా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. కొన్ని రోజుల క్రితం నటుడు శివాజీ(SIvaji)మహిళల డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ గురించి మీ స్పందన ఏంటనే ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ నేను ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది నా వ్యక్తిగత ఇష్టం. ఎవరో శివాజీ గారు చెప్పారు కదా అని నేను చీర కట్టుకోను. "పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఉంది ఆయన వ్యవహారం. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదు. Also read: Faria Abdullah: బుర్ర పనిచేయకపోతే ఇలాగే ఉంటుంది ఫరియా.. షాక్ లో ఫ్యాన్స్ మహిళలు ఏం వేసుకోవాలో చెప్పే బదులు, పురుషులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని చెప్పాలని ఆమె హితవు పలికారు. గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొందరు గాయత్రిని సమర్థిస్తూ డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అందులో ఇతరుల జోక్యం అనవసరం" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివాజీకి మద్దతుగా నిలుస్తూ 'శివాజీ గారు ఒక పెద్దన్నలా సలహా ఇచ్చారు తప్ప, విమర్శించలేదు  అని అభిప్రాయపడుతున్నారు.  
  టాలీవుడ్ 'చిట్టి'గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న ఫరియా అబ్దుల్లా(Faria Abdullah)కి బుర్ర పని చేయలేదా. ఇప్పుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోను ఇదే చర్చ. మరి ఆ వార్తలు నిజామా కాదా చూద్దాం. ఫరియా మే 1 న గాయపడ్డ సింహంతో మరో సారి సెల్యులాయిడ్ పై తన చరిష్మా చాటడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో  ఆమె మాట్లాడుతు తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ ల బ్లాక్ బస్టర్ హనుమాన్(Hanuman)లో హీరోయిన్ ఆఫర్ మొదట నా దగ్గరకే వచ్చింది. కానీ అప్పట్లో నాకు బ్రెయిన్ లేదు. జాతి రత్నాలు హిట్ అయిన జోష్‌తో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. అందుకే 'హనుమాన్' స్టోరీ విన్నప్పుడు దాని రేంజ్‌ను అంచనా వేయలేకపోయాను. నా  కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు కూడా 'హనుమాన్' వదులుకోవడమే. ఆ సినిమా సాధించిన విజయం ఇప్పటికి నా కళ్ళ ముందు ఉంది. Also read: Ramyakrishna: తెల్లారితే పెళ్లి.. నైట్ 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్నాను ఇప్పటికీ  తేజ, ప్రశాంత్ వర్మను కలిసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చి బాధపడుతుంటాను. నా క్యారక్టర్ లో  అమృత అయ్యర్ చాలా బాగా చేసింది. కానీ, ఆ ఛాన్స్ నేను తీసుకుని ఉంటే నా కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేది" అని ఫరియా ఆవేదన వ్యక్తం చేసింది.      
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.