LATEST NEWS
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు.  ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి..  మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.  ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి..  మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని   జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ   దృష్టిపి  సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.  ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ,  పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు.   కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.  ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో  బీజేపీ  ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4)   తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.  ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.   
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తలరాతలు మార్చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ప్రభుత్వాధినేత పినరయి విజయన్‌లు మాజీలుగా మిగిలిపోనున్నారు. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. అదనంగా పశ్చిమబెంగాల్‌లో ఎన్టీఏ హవా కొనసాగింది. కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఎల్‌డీఎఫ్ విజయకేతనం ఎగరవేసింది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ సారథ్యంలోని టీవీకే చెక్ పెట్టింది.  పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ..  2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి   ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.  ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కరుణానిధి తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిదే విజయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల అధిపత్యాన్ని తుడిచిపెట్టింది.  దాంతో పదేళ్ల తర్వాత డీఎంకేను తిరిగి అధికారంలోకి తెచ్చిన సీఎం స్టాలిన్ మాజీగా మిగిలిపోనున్నారు. కేరళ చరిత్రలో వరుసగా రెండు సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పినరయి విజయన్‌కు తాజా ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పలేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తూ ప్రభుత్వాన్ని మార్చేసే కేరళ ఓటర్లు సీపీఐ(ఎం)కు చెందిన విజయన్‌పై నమ్మకంతో వరుసగా రెండో సారి పట్టం కట్టారు.  2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి నుంచి గెలిచి మొదటి సారి సీఎం అయి, పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుని, తిరిగి 2021 ఎన్నికల్లో ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ క్రమంలో పినరన్ మాజీ సీఎంల జాబితాలో చేరనున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, పుదుచ్చేరిల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్డీఏ సీఎంలు  హిమంత బిశ్వ శర్మ, ఎన్.రంగస్వామిలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి గెలుపొందడం విశేషం.
తమిళనాడు రాజకీయాల్లో  నటుడు విజయ్ పార్టీ  తమిళగ వెట్రి కజగం  (టీవీకే) విజయం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణలో సొంత పార్టీ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత విజయం రాజకీయ ప్రభంజనంపై హర్షం వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు. భ్రష్టుపట్టిపోయిన   రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు తమ తీర్పు ద్వారా నిరూపించారని  ఎక్స్ వేదికగా పేర్కొన్న కవిత.. 
సంకోచాలు, సవాళ్లు, వ్యక్తిగత వివాదాలు ఇవేవీ విజయ్ ను నిలువరించలేకపోయాయి.   తమిళనాట  దళపతి రాజకీయ ప్రభంజనం సృష్టించారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.  తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినీ గ్లామర్‌తో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు విజయ్ సమాధానంగా నిలిచారు. తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది.  ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు. భార్యతో విడాకుల ప్రచారాలు, నటి త్రిషాతో ముడిపెట్టి చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భాష్యాలు చెప్పారు. కానీ..  తమిళ ఓటర్లు వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేశారు.  ప్రచార పర్వంలో జరిగిన ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సరైన అనుమతులు లేకపోవడంతో విజయ్ మలేషియాకు వెళ్లి అక్కడి నుండే డిజిటల్ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని కొనసాగించారు. జాతీయ స్థాయి విశ్లేషకులు టీవీకే పార్టీకి స్వల్ప స్థానాలే దక్కుతాయని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తేల్చాయి. కానీ.. ఫలితాలు మాత్రం యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి..  ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకునే  మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువకు చేరుకున్నారు.   దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి ఆయన బ్రేక్ వేశారు.  విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఆయన సినిమా ఇమేజ్ వల్ల వచ్చింది కాదు. ప్రజల్లో ఆయనపై ఉన్నఅపార విశ్వాసానికి  నిదర్శనం. ఎంజీఆర్, జయలలిత వంటి చారిత్రాత్మక నాయకుల వారసత్వాన్ని విజయ్ నిలబెడతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అవినీతి రహిత, ప్రజాహిత పాలనను ఆయన అందిస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు.  ఇక దళపతి ‘విజయ్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
1. 'విశ్వంభర' నుంచి కీరవాణి అవుట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' టీమ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం 'హనుమాన్' ఫేమ్ హరి గౌరను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హరి గౌర తన పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2. NBK112 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న 'NBK112' మ్యూజిక్ డైరెక్టర్‌ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆయన రేసులో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌లలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. 3. 'ఫౌజీ' చిత్ర యూనిట్ లో ఒకరు మృతి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర యూనిట్ కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 4. 'RC17' షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్  రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'RC17' మూవీ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్.. త్వరలోనే  'RC17' షూటింగ్ మొదలుపెట్టనున్నారు. జూన్ 25 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  5. ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. పార్ట్-1 లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం మరో 40 రోజుల సమయాన్ని కేటాయించిందని సమాచారం. యాక్షన్ పార్ట్ ముగిసిన వెంటనే.. సాంగ్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆపై టాకీ పోర్షన్ తో షూటింగ్ ను ముగించనున్నారు.  6. సాయిపల్లవి వల్ల 'కల్కి 2' షూటింగ్ కు బ్రేక్ 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్‌లో సోమవారం ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. సాయి పల్లవి అనారోగ్యం కారణంగా ఈ షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దీపికా పదుకొణె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం. 7. డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు విరాళం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'డైరెక్టర్స్‌ డే 2026' వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  8. 20 రోజులకే ఓటీటీలోకి 'పాపం ప్రతాప్'  తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ కామెడీ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, IMDBలో 7.8 రేటింగ్ సాధించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. 9. ప్రముఖ నటుడు కన్నుమూత మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 10. ఆస్కార్ రేంజ్ విజువల్స్ తో 'ది ఒడిస్సీ' ట్రైలర్! ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మూవీ 'ది ఒడిస్సీ' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి.  
    -సినిమా ఇండస్ట్రీలో పెను విషాదం  -యాక్సిడెంట్ లో నటుడు మృతి  -భార్య పరిస్థితి విషమం  ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని రోజులు. ప్రముఖ మలయాళ నటుడు సంతోష్ నాయర్(Santhosh Nair)కి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ మాటని మరో సారి గుర్తు చేస్తుంది. కేరళలోని  పతనం తిట్ట జిల్లాలోని ఏనాత్ సమీపంలో జరిగిన ఆ ప్రమాదంలో సంతోష్ నాయర్ చనిపోయారు. ఆయన భార్య తీవ్రంగా గాయపడగా,  ప్రస్తుతం ఆమె పరిస్థితి  విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, సంతోష్ నాయర్ తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా  ప్రమాదం సంభవించింది. పతనం తిట్ట జిల్లాలోని ఏనాత్  వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ఇద్దర్ని  బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రీట్ మెంట్ సమయంలో సంతోష్ నాయర్ కి హార్ట్ అటాక్ రావడంతో మరణించడం జరిగింది. ఆయన భార్యకు తల మరియు శరీర భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, అతివేగమే ప్రమాదానికి కారణమని భావించి ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సంతోష్ నాయర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లో సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించగా సుమారు వంద చిత్రాల వరకు ఆయన లిస్ట్ లో ఉన్నాయికేవలం వెండితెరపైనే కాకుండా పలు సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా కేరళలోని  ఇంటింటికి సుపరిచితులయ్యారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల మలయాళ సినీ ప్రముఖులు మరియు సహ నటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also read: The Kashmir Files: మమతా బెనర్జీ ఓటమిపై కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన వీడియో రిలీజ్  సంతోష్ నాయర్ మరణవార్త తెలుసుకున్న అభిమానులు, సినీ పెద్దలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచెయ్యడంతో పాటు  ఆయన భార్య కోలుకోవాలని కోరుకుంటున్నారు. సంతోష్ నాయర్ వయసు నలభై ఐదు సంవత్సరాలు కాగా భార్య పేరు రాజ్య లక్ష్మి. లాస్ట్ మంత్  ఏప్రిల్ 10 న రిలీజైన 'మోహిని యాట్టం' అనే మూవీకి సంతోష్ నాయర్ నే దర్శకుడు.   
    ఎందుకు! ఏమిటి! ఎలా! అని ఆలోచించే లోపే బెంగాల్ ప్రజలు 'దీదీ తేరా దీవర్ దీవానా' అనే సాంగ్  పాడుకుంటూ తమ ప్రియమైన దీదీ మమతా బెనర్జీ కి సెండ్ ఆఫ్ చెప్పారు. ఈ విషయంలో మమతా బెనర్జీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు గాని 'దీదీ గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు 'ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్  వివేక్ అగ్నిహోత్రి రిలీజ్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో అలా రీలీజ్ అయ్యిందో లేదో నెటిజన్స్ ని టైం చూసుకునే తీరిక కూడా లేకుండా చేస్తుంది. మరి ఆ వీడియోలో ఏముందో చూద్దాం ఎవరకి తెలియని కొన్ని విషయాలంటూ  రిలీజ్ చేసిన వీడియోలో వివేక్ మాట్లాడుతు కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)రిలీజ్ తర్వాత మమతా బెనర్జీ  నన్ను పశ్చిమ బెంగాల్ నుంచి నిషేధించారు.సినిమా కూడా రిలీజ్ కానివ్వలేదు. ది బెంగాల్ ఫైల్స్ చిత్రాన్ని కూడా అడ్డుకున్నారు. కనీసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరగనివ్వలేదు. నాతో పాటు చిత్ర యూనిట్ పై దాడులు జరిగాయి. ఎఫ్ ఐఆర్ నమోదు చెయ్యడంతో పాటు గవర్నర్ చేతుల మీడియా అవార్డు తీసుకోనివ్వలేదు.  ప్రజాస్వామ్య దేశంలో ఒక దర్శకుడిని ఇలా నియంత్రించడం భావప్రకటనా స్వేచ్ఛని  హరించడమే. కానీ బెంగాల్ ఫైల్స్ చిత్రాన్ని బెంగాల్ వ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి రహస్యంగా చూపించాం. మా శక్తి మేర పోరాడినందుకు విజయం రూపంలో తగిన ప్రతిఫలం దక్కిందని చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  Also read: Toxic: టాక్సిక్ లోని బోల్డ్ సీన్స్ పై సంచలన రిప్లై ఇచ్చిన కియారా అద్వానీ   వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మరియు 'ది ఢిల్లీ ఫైల్స్' చిత్రాలు బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ల మారణకాండని  చూపిస్తూ తీసిన కాశ్మీర్ ఫైల్స్ పై మమతా బెనర్జీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. మరి ది బెంగాల్ ఫైల్స్ పబ్లిక్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందేమో చూడాలి.  
  తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన 'పీపుల్స్ స్టార్' ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారు. తాజాగా దర్శకుల దినోత్సవం (Directors Day 2026) వేడుకల్లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాన్య ప్రేక్షకుడికి సినిమా దూరం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ఆకాశంలో ఉంది.. కానీ పాతాళంలో కూడా! ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లి ఆకాశమంత ఎత్తులో ఉందని కొనియాడారు. అయితే అదే సమయంలో పరిశ్రమ అట్టడుగు పాతాళంలో కూడా ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ సంస్కృతి, విపరీతంగా పెరుగుతున్న సినిమా టికెట్ ధరలు సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్నాయని ఆవేదన చెందారు. సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా ఎందుకని ఆయన ప్రశ్నించారు. దాసరి, కృష్ణలే మనకు స్ఫూర్తి సినిమా ఇండస్ట్రీ నిత్యకళ్యాణం పచ్చతోరణంలా ఉండాలంటే హీరోలు, దర్శకులు ఎక్కువ సినిమాలు చేయాలని నారాయణమూర్తి పిలుపునిచ్చారు. "మా గురువు గారు దాసరి నారాయణరావు గారు వందలాది సినిమాలు డైరెక్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు వందలాది సినిమాల్లో నటించారు. అలా ఎక్కువ సినిమాలు వస్తేనే ఇండస్ట్రీలో అందరికీ పని దొరుకుతుంది, పరిశ్రమ బాగుంటుంది" అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఏటా ఒకటో రెండో సినిమాలు చేస్తూ కూర్చుంటే కింది స్థాయి కార్మికుల పరిస్థితి ఏంటని అన్నారు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి సినిమా అంటే కేవలం డబ్బు ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్నవారికి కూడా ఒక వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. దర్శకులు కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. పాన్ ఇండియా సినిమాల హడావుడిలో మన స్థానిక కళాకారులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఇది పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించారు. భావోద్వేగానికి లోనైన పీపుల్స్ స్టార్ ఈ వేడుకలో ప్రదర్శించిన కొన్ని సన్నివేశాలు చూసి ఆర్. నారాయణమూర్తి కన్నీళ్లు పెట్టుకున్నారు. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజున ఈ వేడుకను ఇంత ఘనంగా జరుపుతుంటే, తన గురువు గారే కళ్ల ముందు కనిపిస్తున్నట్లు ఉందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆర్. నారాయణమూర్తి ప్రసంగం సినీ ఇండస్ట్రీలోని లోటుపాట్లను ఎండగట్టడమే కాకుండా, భవిష్యత్తులో పరిశ్రమ ఎలా ఉండాలో ఒక దిశానిర్దేశం చేసింది. టికెట్ ధరల తగ్గింపు, ఎక్కువ సినిమాల నిర్మాణం, కొత్త వారికి అవకాశాలు అనే అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ 'విశ్వంభర' (Vishwambhara). గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం మే 15న ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని న్యూస్ వినిపిస్తోంది. 'విశ్వంభర' విడుదల తేదీపై గత కొన్ని నెలలుగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తొలుత సంక్రాంతికి అనుకున్నా, ఆ తర్వాత సమ్మర్ 2026కు వాయిదా పడింది. అయితే, తాజా రిపోర్ట్స్ ప్రకారం జూలై 10, 2026ను ఈ చిత్రానికి ఫైనల్ రిలీజ్ డేట్‌గా చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మే 15న రాబోయే అప్‌డేట్‌లో ఈ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  జూన్ నెలలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదలవుతుండటంతో, తండ్రీకొడుకుల సినిమాల మధ్య నెల రోజుల గ్యాప్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమాపై మేకర్స్ పని చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. మే 15న రాబోయే ఈ అనౌన్స్‌మెంట్ ఒక టీజర్ రూపంలో ఉంటుందా లేదా పోస్టర్ రూపంలో ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా, చాలా కాలం తర్వాత 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తరహాలో చిరంజీవిని ఒక సోషియో ఫాంటసీ రోల్‌లో చూడటం అభిమానులకు పండుగే.  
  యష్(Yash)వన్ మాన్ షో 'టాక్సిక్'(Toxic)న్యూస్ రాని రోజు  సోషల్ మీడియాకి వాల్యూనే లేదు అనే రీతిలో డైలీ నెట్టింట 'టాక్సిక్' హంగామా కొనసాగుతూనే ఉంది. ఈ సారి అందుకు కారణంగా అందాల తార కియారా అద్వానీ(Kiara Advani)నిలిచింది. యష్ కి జతగా కియారా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి సంబంధించి వచ్చిన స్టిల్స్ కూడా అభిమానులు, మూవీ లవర్స్ గుండెల్లో టాక్సిక్ ని భద్రంగా ఉంచుతున్నాయి. కానీ కొన్ని రోజులుగా టాక్సిక్ విషయంలో  కియారా తన రొమాన్స్ సన్నివేశాలని తొలగించమందనే న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ న్యూస్ కి  వైరల్ అవ్వడానికి ఎలాంటి అర్హత లేదనే విషయం అర్దమవుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం  సదరు న్యూస్ పై  కియారా టీమ్ స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. కేవలం వ్యూస్ కోసం సృష్టించిన తప్పుడు ప్రచారాలవి. కియారా ఎప్పుడూ కథకి ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ లనే  ఎంచుకుంటుంది. అర్థం లేని బోల్డ్ సీన్స్ వార్తలని నమ్మకండి. కథ ప్రకారం కియారా అద్వానీ కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో చేసిందని,  భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని సైతం నమ్మద్దు. స్క్రిప్ట్ డిమాండ్ చేయని ఏ సన్నివేశంలోను  కియారా చేయలేదని కన్ఫర్మ్ చేసారు.  Also read: Sandeep Reddy Vanga: విజయ్‌ గెలుపుపై సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు.. సినిమా పవర్ అంటే ఇదేనా! మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geetu Mohandas)తెరకెక్కించిన టాక్సిక్ ఎందుకనో రిలీజ్ విషయంలో తర్జన భర్జన పడుతుంది. ఈ విషయంలో కూడా పలు రకాల పుకార్లు వినిపిస్తున్నా పుకార్లని నమ్మకూడదని అభిమానులు, సినీ ప్రియులు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉంది ప్యూర్  పాన్ ఇండియా కట్ అవుట్ యష్. డ్రగ్ మాఫియా నేపథ్యంలో టాక్సిక్ తెరకెక్కింది.  
- తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్  - 13 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి సమాధానం ఈ గెలుపు - నాడు సీఎం ఇంటి ముందు.. నేడు సీఎం కుర్చీ మీద.. వెండితెరపై హీరోలు ప్రతీకారం తీర్చుకోవడం మనం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో, అది కూడా రాజకీయ రణరంగంలో ఒక స్టార్ హీరో తనకి జరిగిన అవమానానికి 13 ఏళ్ల తర్వాత బదులు తీర్చుకోవడం అనేది అరుదైన విషయం. తమిళ సినీ ఇండస్ట్రీలో 'దళపతి'గా వెలుగొందుతున్న విజయ్ (Thalapathy Vijay) ప్రస్థానంలో జయలలితతో సాగిన ఆ 'కోల్డ్ వార్' ఒక సంచలనం. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఇంటి గేటు ముందు గంటల తరబడి నిలబడ్డ విజయ్, నేడు అదే గడ్డపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇది 2013 నాటి మాట. విజయ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు 'తలైవా' సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ సినిమా పోస్టర్‌పై ఉన్న "Time to Lead" అనే చిన్న ట్యాగ్ లైన్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు ఆగ్రహం తెప్పించింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తే తన అధికారానికి ముప్పు పొంచి ఉందని భావించిన ఆమె, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని సినిమా విడుదలను అడ్డుకున్నారు. బాంబు బెదిరింపుల సాకుతో థియేటర్ల వద్ద భయాందోళనలు సృష్టించి, విజయ్ ని రాజకీయంగా ఎదగకముందే అణచివేయాలని చూశారు. సినిమా ఆగిపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో విజయ్ నేరుగా జయలలితను కలిసి వివరణ ఇచ్చేందుకు కొడనాడ్ ఎస్టేట్‌కు వెళ్లారు. తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో కలిసి వెళ్ళిన విజయ్‌ను జయలలిత కనీసం గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఒక స్టార్ హీరో అని చూడకుండా గంటల తరబడి ఎండలో బయటే నిలబెట్టారు. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా, కనీసం మాట్లాడేందుకు ఎవరినీ పంపలేదు. ఇది విజయ్‌కు మాత్రమే కాదు, మొత్తం సినీ రంగానికే జరిగిన అవమానంగా అభిమానులు భావిస్తారు. జయలలిత అక్కడితో ఆగకుండా విజయ్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ట్యాక్స్ మినహాయింపులు కూడా నిరాకరించారు. గత్యంతరం లేని స్థితిలో విజయ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, "నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాను, దయచేసి మా సినిమాను విడుదల చేయనివ్వండి" అని ఎమోషనల్ అయ్యారు. ఒక మాస్ హీరో అలా దీనస్థితిలో వేడుకోవడం తమిళనాడు ప్రజలను కలిచివేసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2013లో ఏ గేటు బయట అయితే విజయ్‌ను నిలబెట్టారో, నేడు అదే తమిళనాడు ప్రజలు అసెంబ్లీ గేట్లు తెరిచి ఆయనను ఆహ్వానిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో విజయ్ తన సొంత పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) తో సంచలనం సృష్టించారు. 2026 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన విజయ్.. జయలలిత వారసత్వ పార్టీ అయిన అన్నా డీఎంకేను మూడో స్థానానికి పరిమితం చేయడమే కాకుండా, ఏకంగా 108 సీట్లు గెలిచి సరికొత్త చరిత్ర లిఖించారు. త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఓట్ల గెలుపు మాత్రమే కాదు, అది 13 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి కాలం ఇచ్చిన సమాధానం. నాడు ఒక ముఖ్యమంత్రి ముందు నిస్సహాయంగా నిలబడ్డ వ్యక్తి, నేడు ప్రజల మద్దతుతో అదే ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నాడు.   
  కళాకారులు దేశాలని ఏలతారని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినట్టుగా అచ్చు గుద్దినట్టుగా జరుగుతు ఉంది. ఆ కారణ జన్ముడి మాటలని నిజం చేస్తు రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(VIjay)తమిళనాడు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాడు. దీంతో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా విజయ్ మా సినిమా వాడు అంటు పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందులో బిగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఒకడు. మరి ఏం చెప్పాడో చూద్దాం. ఎక్స్  వేదికగా విజయ్ గెలుపుపై స్పందిస్తు సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. ఒక బలమైన ఆయుధం. నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారి వెనుక ఉండే లక్షలాది మంది అభిమానుల బలం, దేశ భవిష్యత్తుని మార్చగలదు. నటులు కూడా కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి రావడం గొప్ప పరిణామం. ముఖ్యంగా దక్షిణాదిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ కాలం నుండి సినిమా స్టార్లు రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేశారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.  దీంతో  సినిమాకి ఉన్న శక్తి కూడా ఏ పాటిదో మరో సారి తెలిసిందని ట్వీట్ చేసాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రికార్డ్స్ లైక్స్ తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. Also read: Trisha: త్రిషకి అదిరిపోయే గిఫ్ట్ పంపించిన మంచు లక్ష్మి.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు   సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో (స్పిరిట్) చేస్తున్న విషయం తెలిసిందే.     
  తమిళ నాట ఎన్నికల్లో తన సన్నిహితుడు విజయ్(Vijay)ఘన విజయం సాధించడంతో త్రిష(Trisha)ఫుల్ జోష్ లో ఉంది. పైగా రిజల్ట్ వచ్చిన నిన్న తన పుట్టిన రోజు కూడా కావడంతో జోష్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు మంచు లక్ష్మి నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ కూడా తనని ఆనందంలో ముంచెత్తుతుందనేది నిజం. ఎందుకంటే ఆ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచి మంచి స్నేహితులు. ఆ డీటెయిల్స్ చూద్దాం  త్రిష బర్త్ డే పై సోషల్ మీడియా వేదికగా  మంచు లక్ష్మి(Manchu lakshmi)స్పందిస్తు "ఎన్ని ఏళ్లు గడిచినా నీలో అందం, ఉత్సాహం తగ్గలేదు. నువ్వు ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలి అంటూ గతంలో ఆ ఇద్దరు కలిసి దిగిన ఓల్డ్ పిక్స్ ని కూడా షేర్ చేసింది. త్రిష కూడా  స్పందిస్తూ "థాంక్యూ మై డార్లింగ్ లక్ష్మి" అంటూ రిప్లై ఇవ్వడంతో ఆ ఇద్దరి ట్రాన్సక్షన్ మొత్తం వైరల్ గా మారింది. Also read: Fauji: ఫౌజీ షూటింగ్ కి వెళ్తున్న కారు నుజ్జు నుజ్జు.. ఒకరు మృతి  మంచు లక్ష్మి  కేవలం విషెస్‌తో సరిపెట్టకుండా త్రిషకి ఎంతో ఇష్టమైన  ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు, ఒక ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్‌ని  పంపినట్లు సమాచారం.  త్రిష ఈ నెల 14 న సూర్య తో కలిసి 'కరుప్పు'(karuppu)తో సందడి చేయనుంది  
టాలెంటెడ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ విలేజ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'పాపం ప్రతాప్' (Papam Prathap). 'మసూద', 'పరేషాన్', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో ఏప్రిల్ 17న విడుదలైన 'పాపం ప్రతాప్' ప్రేక్షకుల నుంచి పరవాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఈటీవీ విన్ అధికారికంగా ప్రకరించింది. కథాంశం ప్రతాప్ (తిరువీర్) తన తండ్రి (అజయ్ ఘోష్) ఇష్టానికి వ్యతిరేకంగా తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లయిన మూడు రాత్రులకే ప్రతాప్‌లో ఏదో లోపం ఉందని ఆరోపిస్తూ బుజ్జమ్మ పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్ ఎదుర్కొంటున్న వింత సమస్య ఏమిటి? దానిని ప్రతాప్ ఎలా పరిష్కరించుకున్నాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. 'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఈ సినిమాలో అమాయకపు ప్రతాప్ పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ పండించిన కామెడీ ఆకట్టుకుంది. 1990ల కాలం నాటి పల్లెటూరి వాతావరణం, భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. తిరువీర్ నటన, గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వైవిధ్యమైన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు 'పాపం ప్రతాప్' ఒక మంచి వినోదాన్ని అందిస్తుంది. గ్రామీణ వాతావరణం, సహజసిద్ధమైన కామెడీతో కూడిన ఈ సినిమాను మే 7 నుంచి ఈటీవీ విన్ లో వీక్షించవచ్చు.    https://x.com/etvwin/status/2051520221551464689
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం,  ఎదుగుదల మందగించడం జరుగుతుంది.  అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా,  ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది.   అదేంటో తెలుసుకుంటే.. మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది.  కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో  మజ్జిగను పోసినప్పుడు నేల  pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి  మజ్జిగను ఉపయోగించవచ్చు.                               *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
  వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది.  పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం.  అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు.  కానీ ఎంతో  ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే  చెరకు రసం  తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది.  వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే.. వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు.  చెరకు రసం  శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది.  చెరకు రసంలోని  సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో   ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.  చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెరకు రసం పరిశుభ్రత.. చెరకు రసం విషయంలో ఉన్న మరొక  ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు  రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు.  పైగా చెరకు రసం తీసే చోట  యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్  శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే.. చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు,  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.                                *రూపశ్రీ.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.