LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
  భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం (జులై 7)  ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన  విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు.   సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.   నరసింహారెడ్డి  తన 19 ఏళ్ల వయసులోనే..  1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.   Bhuvanagiri, Former, Mla, Values
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు ఆర్కే రోజా దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆర్కే రోజా.. మావిగన్ అంటే అమరావతేనని కుండబద్దలు కొట్టేశారు. ఓ వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.  జగన్ మావిగన్ ప్రతిపాదన తరువాత.. వైసీపీ ఆ పేరును తెగ ప్రచారం చేస్తున్నది. అయితే..  జగన్, వైసీపీ నేతల ప్రచారం జనాలు పెద్దగా పట్టించుకోలేదనుకోండి అది వేరు సంగతి.  జనం దాకా ఎందుకు వైసీపీలో పలువురు నేతలు కూడా మావిగన్ ప్రతిపాదనపై పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెంది ధర్మాన వంటి నేతలైతే.. అంతర్గత సంభాషణల్లో జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇక ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత మావిగన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రోజా తన అయోమయాన్ని బయటపెట్టుకున్నారు. అదే సమయంలో మావిగన్ పట్ల తన వైఖరినీ బయటపెట్టారు. మావిగన్, అమరావతి రెండూ ఒకటే కదా అని రోజా ఆ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మావిగన్ ను ప్రమోట్ చేస్తున్న వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం రోజా వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు. మావిగన్, అమరావతి ఒకటే అయినప్పుడు జగన్ మావిగన్ పాట పాడటం ఎందుకు, అమరావతిపై విషం చిమ్మడం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. జగన్ మావిగన్ జపం మాని రోజాను ఫాలో అవుతూ రెండూ ఒకటే అని ప్రకటించేయవచ్చుగా అంటూ వైసీపీలో మావిగన్ వ్యతిరేకులు కూడా అంటున్నారు.   జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన, ఆయన పార్టీ నేతలూ    అమరావతిని  శ్మశానంతో పోలుస్తూతీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అమరావతిపై విషం చిమ్ముతున్నారు. తాను అధకారంలోకి వస్తే.. మావిగన్ ను ఏపీ రాజధానిగా చేస్తామంటూ జగన్ ప్రకటనను గుప్పిస్తున్నారు. అయితే..  అనూహ్యంగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. అమరావతికి అనుకూలంగా గళం ఎత్తడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    అభివృద్ధి, వైభవం పరంగా అమరావతి  అంతటి  స్థాయి కలిగిన ప్రాంతమని రోజా అనడంతో వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ ఏం మాట్లాడాలో అర్ధం కాని అయోమయంలో పడిపోయారు.   రోజాయే అమరావతి మావిగన్ ఒకటే అని చెప్పడంతో జగన్ మావిగన్ ప్రతిపాదనపై నెటిజనులు తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అయోమయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. అమరావతిపై అకారణ ద్వేషం వినా.. వైసీపీకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ అంటూ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  Roja Comments on Amaravati, YCP Capital Row, Roja Mavigan Controversy, AP Politics, Telugunews
ALSO ON TELUGUONE N E W S
Nikhil Siddhartha participated in a school kit distribution drive in Bhimavaram, where educational kits were handed over to 1,000 students studying in government schools. The initiative, organized in association with the Rakshadal organization, received a positive response from students, parents, and the local community. The event was conducted under the guidance of Rakshadal's Mahender, with the aim of supporting children from government schools as they prepare for the new academic year. Each kit included essential study materials such as textbooks, notebooks, and stationery required for daily classroom learning. Interacting with the students, Nikhil stressed the importance of education and encouraged them to make the most of the opportunities available to them. He said education has the power to transform lives and urged the children to work hard, pursue their goals, and always respect their parents and teachers. The actor also appreciated Rakshadal for consistently taking up social service initiatives and contributing to the welfare of the community. According to the organizers, the group plans to continue conducting similar educational and welfare programs in the future to support students and families in need. Nikhil has been associated with several community initiatives over the years, and this latest drive adds to his efforts to promote education and encourage students through direct interaction. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మలయాళ చిత్ర పరిశ్రమ (Mollywood) లో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత వివాదాలు ఇప్పుడు తీవ్రరూపానికి దారితీశాయి. ‘అమ్మా’ (Association of Malayalam Movie Artists - AMMA) అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి ప్రముఖ సీనియర్ నటీమణులు రేవతి ఆశా కేలుణ్ణి, పద్మప్రియ జానకిరామన్ అధికారికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు వారు తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనను విడుదల చేశారు. తాము ఎంతో ఆవేశంతోనో లేదా కేవలం ఏదో ఒక చిన్న సంఘటనను మనసులో పెట్టుకునో ఈ కఠిన నిర్ణయం తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా తాము ఎంతో ప్రేమించే మలయాళ సినిమా రంగాన్ని మరింత మెరుగైన, సురక్షితమైన ప్రదేశంగా మార్చడం కోసమే తాము ఈ సుదీర్ఘ పోరాటం చేశామని వారు పేర్కొన్నారు. గత పదేళ్లుగా తాము అడుగుతున్నది కేవలం ఒకటేనని, మహిళా ఆర్టిస్టులకు పని ప్రదేశాల్లో కనీస భద్రత, ఆత్మగౌరవం, జవాబుదారీతనం, సమానత్వం కావాలనేదే తమ ఏకైక డిమాండ్ అని వారు స్పష్టం చేశారు. అయితే ఈ డిమాండ్లపై అసోసియేషన్ యాజమాన్యం నుండి తమకు కేవలం నిశ్శబ్దమే సమాధానంగా లభించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత, ఈ సంస్థ ప్రస్తుతమున్న రూపంలో ఏమాత్రం మారడానికి సిద్ధంగా లేదనే కఠినమైన నిజాన్ని తాము ఆలస్యంగా గ్రహించామని రేవతి, పద్మప్రియ వివరించారు. పరిశ్రమలో న్యాయమైన హక్కుల కోసం గళం విప్పినందుకు గాను తాము ఒంటరితనానికి గురయ్యామని, తమ తోటి సహచరులకు, స్నేహితులకు, ఒకప్పుడు సొంత ఇల్లులా భావించిన ప్రొఫెషనల్ స్పేసెస్‌కు దూరం కావాల్సి వచ్చిందని వారు భావోద్వేగానికి లోనయ్యారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల సమస్యలపై 2024లో వచ్చిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనంతరం కూడా ‘అమ్మా’ అసోసియేషన్‌లో ఎలాంటి నిజాయితీతో కూడిన మార్పులు రాలేదని వారు విమర్శించారు. హేమ కమిటీ నివేదిక తర్వాత అప్పటి అధ్యక్షుడు మోహన్‌లాల్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం రాజీనామా చేయడం కేవలం జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికే తప్ప, వ్యవస్థను సంస్కరించడానికి కాదని వారు ఆరోపించారు. ప్రజల దృష్టి ఈ సమస్య నుండి మరలగానే మళ్లీ పాత రోజుల్లో లాగే పితృస్వామ్య ధోరణి, అధికార రాజకీయాలు రాజ్యమేలడం మొదలుపెట్టాయని, సంస్థ వ్యవస్థాపక ఆశయాలు పూర్తిగా బలహీనపడిపోయాయని వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నటి శ్వేతా మీనన్ నేతృత్వంలోని నూతన కార్యవర్గం కూడా అంతర్గత విభేదాల వల్ల రాజీనామా చేయడం సంస్థలో నెలకొన్న తీవ్ర గందరగోళాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు సంస్థ నుండి బయటకు రావడం తమ ఓటమి కాదని, అది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని రేవతి, పద్మప్రియ ప్రకటించారు. కేవలం ఒక అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంటేనే తాము సినిమా రంగానికి సేవ చేయాల్సిన అవసరం లేదని, భవిష్యత్ తరాల మహిళలు ఇలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం లేని ఒక ఆరోగ్యకరమైన చిత్ర పరిశ్రమ కోసం తాము బయట ఉండి కూడా నిరంతరం శ్రమిస్తామని వారు స్పష్టం చేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకోలేనప్పుడు సంస్థలు తమ ఉనికిని కోల్పోతాయని చెబుతూ, రాబోయే రోజుల్లో వెండితెరపై మళ్లీ కలుద్దామంటూ ఈ సీనియర్ నటీమణులు తమ అధ్యాయాన్ని ముగించారు.     Revathi, Padmapriya, AMMA, Malayalam, Cinema
  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),కింగ్  నాగార్జున(Nagarjuna).. తెలుగు సినీ రంగాన్ని ఏలిన, ఏలుతున్న హీరోలు.   ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనే రూమర్స్ ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రూమర్ అయినా సరే న్యూస్ మాత్రం మెగా అభిమానులకి, అక్కినేని అభిమానులకి పూనకాలు తెప్పిస్తోంది.   ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఈ ఇద్దరికి సంబంధించిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కథాంశం ఇద్దరు మెచ్యూర్డ్ వ్యక్తుల మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందట. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు, నాగార్జున క్లాస్ అండ్ స్టైలిష్ లుక్‌కు సరిగ్గా సరిపోయేలా ఈ క్యారెక్టర్స్ ని  డిజైన్ చేశారని టాక్. టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక నిర్మాణ సంస్థ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకూ సమానమైన ప్రాధాన్యత, స్క్రీన్ టైమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఏ ఒక్కరి క్యారక్టర్ తగ్గినా అభిమానులు నిరాశ చెందుతారు కాబట్టి, ఇద్దరికీ 50-50 బ్యాలెన్స్ కుదిరేలా డైరెక్టర్ స్క్రిప్ట్‌ని  పక్కాగా లాక్ చేశారని సమాచారం. Also read: Lenin: రిలీజ్ కి ముందే 34 కోట్లు వసూలు చేసిన లెనిన్ . దట్ ఈజ్ అఖిల్  ఈ క్రేజీ మల్టీస్టారర్ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ కాంబినేషన్ క్రేజ్ సంపాదిస్తోంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఈ సినిమా గనుక అధికారికంగా ప్రకటిస్తే, కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో మరో 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే వీలుంది. అంటే సినిమా షూటింగ్ మొదలుకాకముందే 250 కోట్ల టర్నోవర్ క్లియర్ గా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్, 'ఆచార్య'లో రామ్ చరణ్ కనిపించినప్పటికీ, నాగార్జున లాంటి సమకాలీన స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. అటు నాగార్జున కూడా రీసెంట్‌గా మల్టీస్టారర్ కథలపై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ మెగా-అక్కినేని కాంబోపై ఒక అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది, అప్పటివరకు ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  chiranjeevi, nagarjuna
సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతుంటాయి. అయితే, తాజాగా ఆయన వదిన, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ మహేష్ బాబుకు సంబంధించిన ఒక సరదా విషయాన్ని బయటపెట్టి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ సీజన్ 5 రియాలిటీ షోలో పాల్గొన్న శిల్పా శిరోద్కర్, తన మరిది మహేష్ బాబుతో ఉన్న ఒక ఫన్నీ సీక్రెట్‌ను పంచుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు వివాహం జరిగిన కొత్త రోజులను శిల్పా శిరోద్కర్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మహేష్ బాబుకు మరాఠీ భాష అస్సలు తెలియదని, ఆయన కేవలం తెలుగులో మాత్రమే మాట్లాడేవారని శిల్పా వివరించారు. ఇదే విషయాన్ని నమ్మి.. నమ్రత, శిల్పా శిరోద్కర్ తమ మధ్య ఏవైనా రహస్య విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే, నిర్భయంగా మరాఠీ భాషను ఉపయోగించేవారట. తమకు మరాఠీ వచ్చు కదా, మహేష్ బాబుకు అర్థం కాదులే అని వారు భావించేవారు. కానీ, ఇక్కడే మహేష్ ఇద్దరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చారు. పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒకానొక సందర్భంలో శిల్పా, నమ్రత ఏదో విషయం గురించి మరాఠీలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా మహేష్ జోక్యం చేసుకుని, “అచ్చా, అలాగా?” (Accha, asa kaay?) అని మరాఠీలో స్పందించారు. ఇది వినగానే శిల్పా, నమ్రతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మహేష్ కు మరాఠీ వచ్చు అని, ఆయన ఇన్నాళ్లూ ఆ విషయాన్ని తమ దగ్గర దాచిపెట్టారని తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. మహేష్ బాబు నవ్వుతూ, “నాకు మరాఠీ అర్థమవుతుంది” అని చెప్పడంతో తమ సీక్రెట్ లీక్ అయిందని నమ్రత, శిల్పాలు నవ్వుకున్నారట. “మంచిదైంది, మేము ఆ సమయంలో ఏవైనా పెద్ద రహస్యమైన విషయాలు మరాఠీలో మాట్లాడలేదు, లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో” అని శిల్పా శిరోద్కర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మహేష్ బాబు తన వదిన, భార్యను సరదాగా ఇలా ఆటపట్టించడం ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. సూపర్ స్టార్‌కు భాషల పట్ల ఉన్న పట్టు, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంత సరదాగా ఉంటారో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.     Mahesh Babu, Namrata Shirodkar, Shilpa Shirodkar, TeluguOne   
అక్కినేని అఖిల్(Akhil)అప్ కమింగ్ మూవీ  'లెనిన్'(lenin)ఈ నెల 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా  ఇప్పుడు బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని రీతిలో భారీ ధర పలికాయి. అఖిల్ మార్కెట్ స్టామినాతో సంబంధం లేకుండా 'లెనిన్' చిత్రం ఏకంగా 34 కోట్ల నాన్ ది  యేట్రికల్ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇందులో శాటిలైట్, డిజిటల్ (ఓటీటీ), మరియు ఆడియో హక్కులు అన్నీ కలిపి ఉన్నాయని తెలుస్తోంది. 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద కేవలం 13 కోట్ల లోపే వసూలు చేసి తీవ్ర నిరాశ పరిచినప్పటికీ, 'లెనిన్' కథా బలం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చూసి ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థలు పోటీ పడి ఈ హక్కులని  దక్కించుకున్నాయి. ఒక ప్లాప్ హీరో తదుపరి చిత్రానికి  34 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. also read: Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు కేవలం నాన్-థియేట్రికల్ పరంగానే కాకుండా, థియేట్రికల్ బిజినెస్‌లోనూ ఈ సినిమా జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏరియా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అంటే దాదాపు 9 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు నైజాం, సీడెడ్, మరియు ఓవర్సీస్ హక్కుల బిజినెస్ కూడా ముగింపు దశకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ఎంతగానో నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'లెనిన్' సినిమా చివరి 40 నిమిషాలు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో సాగుతుందని, థియేటర్లలో అఖిల్ క్యారెక్టర్ చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse)కథానాయికగా చేస్తుండగా మురళి కృష్ణ అబ్బూరి దర్శకుడు.  
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో 'లెనిన్' చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. థియేటర్లలో అఖిల్ అక్కినేని మాస్ జాతరను కళ్లారా చూసేందుకు అక్కినేని అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ సినిమాతో ఒక భారీ హిట్ కొట్టి, హీరోగా నిలదొక్కువాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ముఖంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది.  అఖిల్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 10న థియేటర్లలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి అఖిల్ ఆ నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి. https://x.com/SitharaEnts/status/2074414405589389346   Akhil Akkineni, Lenin Movie, Bookings, TeluguOne  
  తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత కే. భాగ్యరాజ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల వయసులో హఠాత్తుగా సంభవించిన గుండెపోటు కారణంగా ఆయన మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భాగ్యరాజ్ కేవలం నటుడే కాదు, కథను నడిపించడంలో అద్భుతమైన ప్రతిభ ఉన్న అగ్రశ్రేణి సృష్టికర్త. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 25 కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, 75కి పైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన  క్యారక్టర్లతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడు భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన చిరకాల కోరిక ఒకటి ఇప్పుడు నెరవేరింది. మరణించడానికి కొద్దిరోజుల ముందే భాగ్యరాజ్ తన జీవిత ప్రయాణాన్ని, సినీ రంగానికి సంబంధించిన మధుర స్మృతులను క్రోడీకరిస్తూ 'పడిచ్చా పుడిచిర్లాం' అనే పేరుతో ఒక అద్భుతమైన స్వీయచరిత్రాన్ని (ఆటోబయోగ్రఫీ) రాసుకున్నారు. ఈ పుస్తకానికి ఒక మనోహరమైన ముందుమాట (ఫోర్‌వర్డ్) రాయాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం 2026 జూన్ 17వ తేదీన తన పుస్తక ప్రతినోకదాన్ని ప్రముఖ గీత రచయిత, కవి వైరముత్తుకు పంపించి, ప్రేమతో ముందుమాట రాసివ్వాలని కోరారు. ఆ సమయంలో వైరముత్తు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల "కొంచెం సమయం కావాలి" అని అడగ్గా, భాగ్యరాజ్ ఎప్పటిలాగే తన మార్కు చిరునవ్వుతో "సరే" అని సమాధానమిచ్చారు. కానీ అదే వారి మధ్య చివరి సంభాషణ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత సరిగ్గా పది రోజులకు, అంటే జూన్ 27వ తేదీన భాగ్యరాజ్ మరణించారనే వార్త వైరముత్తును తీవ్రంగా కలచివేసింది. భాగ్యరాజ్ మరణానంతరం వైరముత్తు ఆ స్వీయచరిత్ర పుస్తకాన్ని పూర్తిగా చదివారు. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ ఆయనని ఎంతగానో కదిలించింది. భాగ్యరాజ్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికం, అవమానాలు, పరాజయాలు, పోరాటాలు మరియు అనుభవించిన మానసిక వేదనలను చూసి వైరముత్తు కంటతడి పెట్టారు. భాగ్యరాజ్ బతికుండగా ఆ కోరికని తీర్చలేకపోయాననే బాధతో, ఆయన మరణించిన తర్వాత పూర్తి భావోద్వేగంతో ఆ పుస్తకానికి అద్భుతమైన ముందుమాటని  రాశారు. సాధారణంగా అయితే దీనిని ఈమెయిల్ ద్వారా పంపవచ్చు, కానీ భాగ్యరాజ్ పై ఉన్న గౌరవంతో వైరముత్తు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కొడుకు శాంతనులను కలిసి ఆ ముందుమాట ప్రతిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ భాగ్యరాజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పుస్తకం ఒక మనిషి జీవిత స్పందన అని, దీనిని త్వరలోనే ప్రచురించాలని వైరముత్తు ఆకాంక్షించారు. Also read: Prakash raj: ఈ నటుడుకి కులం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్     
ప్రపంచ సినిమా రంగంలో క్రిస్టోఫర్ నోలన్ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన 'ఓపెన్‌హైమర్' చిత్రం తర్వాత నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త విజువల్ వండర్ 'ది ఒడిస్సీ'. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే గ్లోబల్ వైడ్‌గా అత్యధిక చర్చకు కారణమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ సినిమా చుట్టూ నడిచిన డిస్కషన్ మొత్తం మొదట్లో సానుకూలంగా సాగిందా అంటే అస్సలు కాదు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రయాణం ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన 'ది ఒడిస్సీ' అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శల పాలైంది. నోలన్ ఎంచుకున్న క్యాస్టింగ్, విజువల్ టోన్, అలాగే క్లాసిక్ పురాణ గాథను ఆయన తెరకెక్కించిన విధానంపై నెటిజన్లు, హాలీవుడ్ వర్గాలు పెద్ద ఎత్తున పెదవి విరిచాయి. ఏకంగా యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు భారీ స్థాయిలో డిస్‌లైక్స్ రావడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ డిస్‌లైక్స్, ట్రోలింగ్ కారణంగా సినిమాపై నెగిటివ్ ప్రచారం ఒక్కసారిగా ముదిరిపోయింది. నోలన్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కెరీర్‌లోనే ఇది ఒక పెద్ద డ్యామేజ్ లాగా కనిపించింది. ట్రైలర్ చూసి సినిమా ఫ్లాప్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో తీర్పులు కూడా ఇచ్చేశారు. కానీ, అసలు సిసలైన నోలన్ మ్యాజిక్ ఏంటో వరల్డ్ ప్రీమియర్ షో తర్వాత తెలిసొచ్చింది. ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ అనంతరం పరిస్థితి 180 డిగ్రీలు పూర్తిగా మారిపోయింది. సినిమాను నేరుగా వీక్షించిన టాప్ సినీ విమర్శకులు, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీకి ఈ మొదటి రెస్పాన్స్ గట్టి బ్రేక్ వేసింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్, కథను భారీ స్థాయిలో ఆవిష్కరించిన తీరు, నోలన్ సిగ్నేచర్ విజువల్ స్టైల్ అద్భుతంగా ఉన్నాయంటూ రివ్యూలు వెలువడుతున్నాయి. ట్రైలర్ ఆధారంగా సినిమాను తక్కువ అంచనా వేసిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అద్భుతమైన పాజిటివ్ టాక్ తో సినిమా చుట్టూ ఇప్పుడు సరికొత్త బజ్ క్రియేట్ అయింది. జూలై 17న 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ఇంకా కచ్చితంగా 10 రోజులు సమయం ఉండగానే, ఈ రేంజ్‌లో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ముందస్తు సానుకూల వాతావరణం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీగా కలిసిరానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూట్యూబ్ డిస్‌లైక్స్ నుండి థియేటర్లలో స్టాండింగ్ ఓవేషన్ వరకు సాగిన 'ది ఒడిస్సీ' ప్రయాణం, జూలై 17న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించబోతుందోన‌ని ప్రపంచ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Christopher Nolan, The Odyssey, The Odyssey First Reactions, Nolan Next Movie, Hollywood Epic Film, The Odyssey Premiere Talk
  ప్రకాష్ రాజ్.. నటుడుగా పది కాలాల పాటు పదితరాల వారు చెప్పుకునేంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సమాజంలో కులం, మతం అనే అంశాలపై ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో గళం విప్పుతూనే ఉంటాడు. అయితే, ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక తీవ్ర శోకం నేపథ్యంలో ఆయన పంచుకున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ మాతృమూర్తి స్వర్ణలత గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత ప్రయాణం, తమ కుటుంబ నేపథ్యం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతు 'సమాజంలో ఎవరైనా తనని  పరిచయం అడిగితే, నేను  ఏ కులానికో లేక మతానికో చెందినవాడినని చెప్పనని, అందరికంటే ముందుగా నేను ఒక 'మనిషిని' అని గర్వంగా చెప్పుకుంటాను. నటన అనేది కేవలం తన వృత్తి మాత్రమే. చదవడం, రాయడం నాకున్న ముఖ్యమైన అభిరుచులు. నా  తల్లి స్వర్ణలత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకి వలస వచ్చారు. మా అమ్మకు 12 ఏళ్ల వయసులోనే తల్లి మరణించగా, ఆ తర్వాత తండ్రి కూడా దూరమయ్యాడు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మని ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేసింది. వాళ్లకు తమ జాతి, కులం, బంధువులు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె చివరి కోరికను గౌరవిస్తూ బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. Also read: ఆ మూవీని ప్రమోట్ చేస్తే పెద్దిని డామేజ్ చేస్తున్నావ్ అనేవారు.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు   
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది గ్లామర్ డాళ్‌ శ్రీలీల. కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. తనదైన అద్భుత అందం, చలాకీతనం, అంతకుమించిన డ్యాన్సింగ్ ప్రతిభతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదిస్తూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి పోస్ట్ కేవలం క్షణాల వ్యవధిలోనే నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోతోంది. తాజాగా శ్రీలీల తన అధికారిక‌ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజా పోస్ట్‌కు "ఏ డే వెల్ స్పెంట్" అంటే ఈరోజు చాలా బాగా గడిచింది అంటూ ఒక క్యూట్ క్యాప్షన్‌ను జోడించారు. తెల్లటి హార్ట్ ఎమోజీని క్యాప్ష‌న్ కి జత చేయ‌గా.. ఈ లేటెస్ట్ సోషల్ మీడియా అప్‌డేట్ ప్రస్తుతం నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ లైకుల వర్షం కురిపిస్తోంది. ఈ పోస్ట్ చూసిన మెజారిటీ నెటిజన్లు శ్రీలీల అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ పోస్ట్ లో గ్రూప్ ఫోటో చూడ‌గానే ఎంబిబిఎస్ శ్రీ‌లీల త‌న క్లాస్ మేట్ల‌తో ఫోటో దిగిందా? అంటూ ప‌లువురు నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో అభిమానులు బ్యూటీ క్వీన్.. డ్రీమ్ గర్ల్ అని కొనియాడుతుంటే.. మరికొందరైతే ఏకంగా సౌత్ ఇండస్ట్రీస్ నెం.1 హీరోయిన్ అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎప్పటికైనా మీతో కలిసి పని చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన కలని వెల్లడించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శ్రీలీల నటిస్తూనే ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన‌ సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు నా గర్ల్‌ఫ్రెండ్ శ్రీలీల MBBS.., సత్యా MBBS కి జాన్ అంటూ చాలా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తమ కామెంట్లు హైలైట్ అవ్వడం కోసం, లైకులు రావడం కోసం రకరకాల వింత వింత కామెంట్లతో ఈ పోస్ట్ కింద హంగామా సృష్టిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క పోస్ట్‌తో శ్రీలీల క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఇక శ్రీలీల సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కూడా పాగా వేసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన న‌టిస్తున్న తదుపరి బాలీవుడ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా ఒక భారీ మ్యూజిక‌ల్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.   Sreeleela, Sreeleela MBBS, RT75 Sreeleela
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)