LATEST NEWS
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్  రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే  సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ రెండు విష‌యాలు మ‌నం మాట్లాడుకుంటే  1. నామినేష‌న్ల ప‌ర్వం చాలా పేల‌వంగా, జ‌న‌మే లేకుండా వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. జ‌నాన్ని త‌ర‌లించాలంటే డ‌బ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం క‌దా అని అనుకున్నారేమో కానీ, నామినేష‌న్ల ఘ‌ట్టంలో వైసీపీ అభ్య‌ర్థులు జ‌నాన్ని త‌ర‌లించ‌లేక‌పోయారు.  2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్ర‌చారం జ‌రిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్ర‌క‌టించేశారు.  పాత‌ ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే.  వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.   మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు.  క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మ‌ళ్ళీ పాత పాటే పాడారు.   టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జ‌రుగుతోంది. వీటితో పాటు  జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది.  వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ‌త నెల‌కొంది. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది.  అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత  కొంత కాలం రాజకీయాల్లో ఉండీ  లేనట్లు కొనసాగారు. అంతే  ఆ తర్వాత చిరంజీవి రాజకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు.  తమ్ముడు పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు  ఎన్నికల్లో పోటీ చేసినా చిరంజేవి మాత్రం   ఆ దిక్కు  అడుగేయలేదు సరికదా కనీసం ఓ లుక్కు కూడా వేయలేదు.   కానీ  చిరంజీవి  పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని  భావించారు. ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీటికి వేటికీ స్పందించలేదు. సై అనలేదు. రాజకీయం తన వంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండి పోయారు.  ఆ తరువాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఎప్పుడంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సినిమా టికెట్  రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి  చర్చలు జరిపారు.  ఆ సమయంలో   చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూపెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వాటన్నిటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు.  ఆ తరువాత మరోసారి చిరు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ సందర్భం అల్లూరి సీతారామరాజు జయంతి సభ. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజాలు ఉన్న ఆ వేదికపై ప్రధాని మోడీ వారందరి కంటే చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఎదురెళ్లీ మరీ స్వాగతం పలికారు. ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి బీజేపీ గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. తరువాత మళ్లీ మామూలే చిరంజీవి మాత్రం రాజకీయాలతో తన దూరాన్ని మెయిన్ టైన్ చేశారు.  అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ సారి వాటిని చిరంజీవి ఖండించలేదు. దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి, ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి వెనుకాడరని అన్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే నెల 5 నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు. తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనున్నారు.  చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులూ, బీజేపీ, తెలుగుదేశం శ్రేణులూ కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. అదే విధంగా ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందం టున్నారు. అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం, అనకాపల్లికే పరిమితమైనా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
2014, 2019 ఏపీ ఎన్నికలలో ప్రత్యేక హోదా ప్రముఖ అంశం అయింది కానీ, 2024 ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఆ అంశాన్నే ప‌క్క‌న పెట్టేశాయి.  ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు.  25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి.  గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.   అయితే అంతగా ప్రాధాన్యం లేని కాంగ్రెస్ పార్టీ, అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ ప్ర‌త్యేక హోదా అంటూ జ‌పం చేస్తున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు.  అయినా కాంగ్రెస్ పుంజుకునే సూచనలు కనిపించడం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా, రావా, అనే విషయాన్ని పక్కనపెడితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోదా విషయంలో హామీ ఇవ్వడం మాత్రం విశేషమే.  ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో ఆనాడు బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన ఆ నోళ్లు, ఆ తర్వాత మూతబడ్డాయి.  ఏపీలో కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి కూడా పట్టింది.  ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ఎప్పటికీ నెరవేర్చదనే విషయం తేలిపోయింది. ఏపీలో మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు ఒకే పార్టీకి వచ్చినా ఆ పార్టీ పార్లమెంట్ ముందు తొడగొట్టే అవకాశం లేదు. కేంద్రాన్ని మెడలు వంచేంత సీన్ లేదని ఈపాటికే ఏపీ ప్రజలకు తెలిసొచ్చింది.  అందుకే  నేతలంతా హోదాపై రాజీ పడటంతో ప్రజలు కూడా హోదాపై ఆశలు వదులుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. ప్రత్యేక హోదా  గురించి మాట్లాడుతుంటే జ‌నం వింతగా చూస్తున్నారని  వైఎస్ షర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన పదేళ్లలో ప్రత్యేక హోదా కోసం ప్ర‌ధాన పార్టీలు పోరాటాలు చేయ‌లేద‌ని ఆమె ఆరోపించారు.   ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని.. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ష‌ర్మిల చెబుతున్నారు. 10 ఏళ్లు దాటిన ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలు అభివృద్ది దూసుకెళుతుంటే.. ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని.. అయితే ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదని ష‌ర్మిల చెబుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా, రాజకీయ వివాదంగా మారి ప‌దేళ్ళైంది. అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకుండా ప్రధాని చేత నోటి మాట అనిపించి మమ అనిపించారు. ఆ తరువాత వచ్చిన బీజేపీకి అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసింది. రాజకీయ సుడిగుండంలో త‌మ అవసరాల మేరకు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్యేక హోదా ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నాయి.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
ఇప్పుడు అందరి దృష్టీ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ల ‘కల్కి’ మీదే ఉందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమాలోని అశ్వథ్ధామ క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్‌. అమితాబ్‌ బచ్చన్‌ ఈ క్యారెక్టర్‌లో ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న ఈ సినిమా తప్పకుండా ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు.  భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి రిలీజ్‌ పెద్ద సమస్య అయిపోయింది. ముందుగా అనుకున్న మే 9కి రిలీజ్‌ చెయ్యడానికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. అప్పటికి ఎన్నికల ప్రచారాలు పీక్స్‌లో ఉంటాయి. అలాంటి సమయంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్లకు వస్తారనేది ఓ డౌట్‌ కావచ్చు. అందుకే ‘కల్కి’ని జూన్‌ 27న రిలీజ్‌ చెయ్యాలని ఫిక్స్‌ అయ్యారు. నిన్న మొన్నటి వరకు వార్తగా ఉన్న ఈ రిలీజ్‌ డేట్‌ను శనివారం ఫిక్స్‌ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌.  జూన్‌ 13న రామ్‌చరణ్‌, శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చెయ్యాలని భావిస్తున్నారు. అంటే ఈ సినిమా రిలీజ్‌ అయిన రెండు వారాలకే ‘కల్కి’ రాబోతోంది. అలాగే మోస్ట్‌ ఎవైటింగ్‌ మూవీగా పేరు తెచ్చుకున్న ‘పుష్ప2’ ఆగస్ట్‌ 15న విడుదలవుతోంది. ఈ రెండు సినిమా మధ్యలో ‘కల్కి’ రిలీజ్‌ కానుంది. ‘కల్కి’ రిలీజ్‌కి, ‘పుష్ప2’ రిలీజ్‌కి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. కానీ, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘కల్కి’ మధ్య ఎక్కువ గ్యాప్‌ లేదు. దీనివల్ల గేమ్‌చేంజర్‌ చిత్రం కలెక్షన్లపై ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 
విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి జంటగా శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. అంజలి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.  ఈ సినిమా షూటింగ్‌ పూర్తయి రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 17న సినిమాను రిలీజ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. అందులో భాగంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ ఆద్యంతం ఆకట్టుకుంది. లంకల రత్నగా విశ్వక్‌ ఈ సినిమానలో ఊర మాస్‌ అవతార్‌ నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటుందని టీజర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ‘ఒక్కసారి లంకలో కత్తి కట్టారూ అంటే ఆ మనిషిని సంపకుండా వదల్రు’ అంటూ సాయికుమార్‌ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఆ తర్వాత ‘ఆడి సొంత మనుషులే వాడిమీద కత్తి కడుతున్నాంట్ర’ అని ఒకరు, ‘ఆడి విషయంలో ఊరంతా ఒక్కటై పోయింది.. ఇంక వాడ్ని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి’ అంటూ మరొకరి వాయిస్‌ వినిపిస్తుంది. ఒక పాత బిల్డింగ్‌లో ఉన్న హీరోపై ఒక్కసారిగా దాడి చేస్తారు ఊరి జనం. ఆ జనాన్ని చూసిన హీరో ‘అమ్మోరు పూనేసింద్రా.. ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే..’ అంటూ ఒక్కర్నీ నరకడం మొదలు పెడతాడు. ‘నేను మంచోడ్నో.. సెడ్డోన్నో నాకు తెలీదు.. కానీ, మంచోడన్న సెడ్డ పేరు మాత్రం నాకొద్దు’ అంటూ విశ్వక్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది.  లంకల రత్నకి, ఊరి జనానికి ఉన్న సమస్య ఏమిటి? ఇంతకీ హీరో మంచివాడా, చెడ్డవాడా, ఊరు ఊరంతా అతన్ని ఎందుకు వెంటాడుతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మే 17న దొరుకుతుంది. సినిమా మేకింగ్‌గానీ, మ్యూజిక్‌గానీ అద్భుతంగా ఉన్నాయి. యువన్‌శంకర్‌రాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. మాస్‌ కా దాస్‌ నుంచి వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
కె.విజయభాస్కర్‌.. తెలుగులో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన దర్శకుడు. ఇప్పటికీ టీవీల్లో సందడి చేసే స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ.. వంటి సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన అప్లాజ్‌ రాలేదు. ఆయన చివరిగా తెరకెక్కించిన సినిమా 2013లో వచ్చిన ‘మసాల’.  డైరెక్టర్‌గా చాలా గ్యాప్‌ తీసుకున్న విజయభాస్కర్‌ ఇప్పుడు ‘ఉషా పరిణయం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. తన కుమారుడు శ్రీకమల్‌ను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు విజయభాస్కర్‌. ‘ప్రార్థన’ చిత్రంతో దర్శకుడుగా మారిన విజయభాస్కర్‌కు ఆ సినిమా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత 1999లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆయనకు తోడయ్యాడు. ‘స్వయంవరం’తో ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం ‘జై చిరంజీవ’ వరకు కొనసాగింది. పైన చెప్పుకున్న సినిమాల్లో ‘నువ్వే కావాలి’ తప్ప మిగతా సినిమాలన్నింటికీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథ, మాటలు అందించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి.  చాలా కాలం తర్వాత కొడుకుని హీరోగా పరిచయం చేసేందుకు మెగా ఫోన్‌ పట్టిన విజయభాస్కర్‌కు విషెస్‌ చెప్పేందుకు ‘ఉషా పరిణయం’ సెట్‌కి వెళ్ళారు త్రివిక్రమ్‌. ఈ సినిమాలో శ్రీకమల్‌ సరసన తాన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకమల్‌కు హీరోగా బ్రేక్‌ ఇచ్చేందుకు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు విజయభాస్కర్‌. త్రివిక్రమ్‌ సెట్‌కి వెళ్ళే సమయానికి సీరత్‌ కపూర్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్‌ విజయభాస్కర్‌కి బెస్ట్‌ విషెస్‌ చెప్పి యూనిట్‌ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.  ఒకప్పుడు విజయభాస్కర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే పెద్ద క్రేజ్‌ ఉండేది. ఈ కాంబోలో సినిమా వస్తోందంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి, పంచ్‌ డైలాగ్స్‌కి లోటే ఉండదని ఆడియన్స్‌ నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే చక్కని కథ, కథనాలతోపాటు గిలిగింతలు పెట్టే డైలాగ్స్‌ రాసేవారు త్రివిక్రమ్‌. ఇప్పటికీ ఆ సినిమాలు ఆడియన్స్‌ని నవ్విస్తూనే ఉన్నాయి. ‘ఉషా పరిణయం’ సెట్‌లో సందడి చేసిన త్రివిక్రమ్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నాళకెన్నాళ్ళకు గురుశిష్యులు కలిసారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు. 
తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే  ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ కి కూడా అదే  పరిస్థితి..ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఇప్పుడు  మా అభిమాన హీరో సినిమాని ఆపండని  అంటున్నారు. పైగా వాళ్లెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  పవన్ పార్టీ పెట్టినపుడు  అభిమానుల్లో మెదిలిన  ప్రశ్న ఒక్కటే. పవన్ సినిమాలు చేస్తాడా లేదా అని. వారి ఆశలు ఫలించి వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు ఈ మూవీ మే ఫస్ట్ న రీ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.కానీ ఇప్పుడు అనూహ్యంగా మూవీని రిలీజ్ చెయ్యద్దని  ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పైగా అందుకు కారణాన్ని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ పొలిటికల్ పరంగా బిజీగా ఉంటూ తమకి కావాల్సిన కిక్ ఇస్తున్నాడని  ఈ మూమెంట్  అలాగే  ఉండాలని కోరుకుంటున్నారు.   2021 లో వచ్చిన వకీల్ సాబ్ లో పవన్ ఆడవారి తరుపున పోరాడే లాయర్ పాత్రల్లో సూపర్ గా నటించాడు. ప్రకాష్ రాజ్, అంజలి,  నివేదిత థామస్,  అనన్య నాగళ్ళ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తున్నాడు.మరో వైపు కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు.ఈ టైంలో  ఏది ఏమైనా  పవన్ ఫ్యాన్స్  రీ రిలీజ్ వద్దనడం ఆసక్తిని కలిగిస్తుంది. మరి మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి  
ఎపిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి ప్రచారం చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ఆ విషయాన్ని ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడామె వైసీపి పార్టీ తరఫున అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వంగా గీతను ఓడిరచి తమ్ముడిని గెలిపించాలని పిఠాపురం ఓటర్లను అభ్యర్థించేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ వేసినపుడు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సామాజిక సమీకరణాల ప్రభావం పిఠాపురంలో ఈసారి గెలుపు ఓటములను నిర్దేశించనుంది.  పవన్‌ ఇప్పటికే రెండు సభలు నిర్వహించారు. పిఠాపురం పైన తన విజన్‌ ఏంటో వెల్లడిరచారు. ఇదిలా ఉంటే.. పవన్‌ పార్టీకి కొద్ది రోజుల క్రితం చిరంజీవి రూ 5 కోట్ల విరాళం ఇచ్చారు. టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌బాబుకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. వారిని గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చారు. జనసేన పార్టీని, పవన్‌కళ్యాణ్‌ని గెలిపించేందుకు చిరంజీవి మే 5 నుంచి పిఠాపురంలో ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మొదట పిఠాపురం వచ్చి ఆ తర్వాత గొల్లప్రోలు, పిఠాపురం టౌన్‌లలో రోడ్‌ షో నిర్వహిస్తారు. ఈ రోడ్‌ షోలో చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌, నాగబాబు కూడా పాల్గొంటారని సమాచారం. చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది. చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్‌ కోరుతున్నారు. దీని పై చిరంజీవి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చిరంజీవి తలపెట్టిన ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనేలా అందరికీ సమాచారాన్ని అందించారు. 
‘HanuMan’, starring Teja Sajja, was directed by Prasanth Varma, who took viewers by surprise in January 2024. The movie was a huge hit in Telugu and Hindi, and there is a lot of talk about the sequel, ‘Jai HanuMan’. Although it's still a work in progress, the reports are doing the rounds on the internet that Prasanth Varma and Ranveer Singh are making a massively budgeted period film. Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film soon. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman. Sources say, "Ranveer Singh is a big fan of Prasanth Varma's work and met him right after the release of ‘HanuMan’. The director has been in talks with the actor for a big-budget film for the last three months. They have met multiple times and continue to be in discussions. Ranveer is sold on the idea and acknowledges the fact that it’s a very ambitious project. It’s a yes from Ranveer for the film in principle and the team is now figuring on other modalities to get things started."
ఆనాటి లవకుశ నుంచి నిన్నటి ఆదిపురుష్‌ వరకు ఎప్పుడు రామాయణ గాధను తెరకెక్కించినా అందరూ ఆ సినిమాపై ఆసక్తిని కనబరుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు రామయణాన్ని సిల్వర్‌ స్క్రీన్‌ మీద, బుల్లితెరపై రకరకాలుగా ఆవిష్కరించారు. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌తో రామాయణ గాధను సినిమాగా రూపొందిస్తున్నారనగానే దేశమంతా అలర్ట్‌ అయిపోయింది. ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అందరీలోనూ కనిపించింది. అయితే ఆ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో తెరకెక్కించడంలో దర్శకుడు ఔం రౌత్‌ పూర్తిగా విఫలమయ్యాడు.  ఇప్పుడు ఆ బాధ్యతను నితీష్‌ తివారి తీసుకున్నారు. రణబీర్‌ కపూర్‌, సాయిపల్లవిలతో మరోసారి రామాయణ ఇతివృత్తాన్ని తనదైన శైలిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీరామ నవమి రోజునే ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తారని అంతా ఎదురుచూశారు. కానీ, అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఇప్పుడు సడన్‌గా శ్రీరాముడి గెటప్‌లో రణబీర్‌ కపూర్‌, సీత గెటప్‌లో సాయిపల్లవి కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఈ ఫోటోలు లీక్‌ అయ్యాయి అన్నట్టుగా ఉన్నాయి. ఈ ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. శ్రీరాముడిగా రణబీర్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడని, సీతగా సాయిపల్లవి లుక్‌ కూడా చాలా బాగుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.    ఇదిలా ఉంటే.. ఇంత సైలెంట్‌గా షూటింగ్‌ని ప్రారంభించారా.. అని అందరూ అనుమానంతో కూడిన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. ఎందుకంటే నితిష్‌ తివారి ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో భారీ ఎత్తున తలపెట్టారు. దానికి కన్నడ స్టార్‌ హీరో యశ్‌ సహకారం కూడా ఉంది. ఈ సినిమాలో రావణ పాత్రను యశ్‌ పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇంత భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా షూటింగ్‌ స్టార్ట్‌ చేసేస్తారా అనే కామెంట్స్‌ కూడా మరోపక్క వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఫోటోలు నిజమైనవి కావని, ఎవరో కావాలనే వాటిని క్రియేట్‌ చేసి అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు అంటున్నారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ స్టిల్స్‌ చూసిన తర్వాతైనా నితిష్‌ తివారి ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.  
  సోషల్ మీడియా పుణ్యమా అని ట్రోలింగ్  మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. ఇక సినిమా వాళ్ళ మీద జరిగే ట్రోలింగ్ కి  అయితే మంచి గిరాకీ. తాజాగా హీరో  విజయ్ పై ట్రోలింగ్ జరుగుతుంది.ఏ విషయంలో అలా జరుగుతుందో చూద్దాం విజయ్ దేవరకొండ (vijay devarakonda) హీరోగా వచ్చిన  ఫ్యామిలీ స్టార్ (family star) మొన్న ఏప్రిల్ 5 న థియేటర్స్ లో కి అడుగుపెట్టింది. కంటెంట్ లో ఉన్న లోపాల వల్ల పరాజయాన్ని చవి చూసింది. విజయ్ మాత్రం తన పరిధిలో బ్రహ్మాండంగా నటించాడు. చాలా కొత్తగా కూడా చేసాడు. ఇక ఈ నెల ఇరవై ఆరున ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ ద్వారా  స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోని రెండు సీన్స్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుంది. రవిబాబుకి విజయ్ వార్నింగ్ ఇచ్చే సీన్ అండ్  దోశలు సీన్. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అలాంటి దోశలు వేసుకోరని ఈ ఐడియా ఎలా వచ్చిందో అంటూ ట్రోల్  చేస్తున్నారు.   ట్రైలర్ రిలీజ్ టైం లో కూడా వాటిపైనే ట్రోల్ల్స్ జరిగాయి.  విజయ్ ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్ చెప్పింది  విజయ్ చేసాడంటు సపోర్ట్ గా నిలుస్తున్నారు ఫ్యామిలీ స్టార్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ జత  కట్టింది. జగపతి బాబు, వాసుకి ,రవిప్రకాష్, రోహిణి హట్టంగడి, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించగా  గోపి సుందర్ మ్యూజిక్ ని అందించాడు. 50 కోట్ల బడ్జట్ తో  తెరకెక్కింది    
ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.
విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.
అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.
వేసవి కాలంలో అందరూ ఎం ఇష్టంగా తినే ఖర్భుజాను స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని 'ఖర్బూజా' అని పిలుస్తారు, తమిళంలో దీనిని 'ములం పజం' అని పిలుస్తారు. బెంగాలీలు దీనిని 'ఖర్ముజ్' అని పిలుస్తారు, గుజరాతీలు దీనిని షకర్టెట్టి అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా మాత్రం మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దొరికే అన్ని పండ్లలోకి ఇది చాలా అద్బుతమైనది అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ ఖర్భూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..  ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. తద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . ఇవి సాధారణంగా మూసుకుపోయిన రంధ్రాల్లో పెరిగిమొటిమలుగా కనిపించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ గా జ్యూస్ ప్రయత్నించవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే కేలరీలు బెడద ఉండదు.  బరువు తగ్గించే ఆహారం తీసుకునే వారు ఎప్పుడూ రుచినిచ్చే పదార్థాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు.  కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. ఖర్భూజాలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ను నిరోధించడంలో, క్యాన్సర్ తో పోరాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.  తరచుగా నోటి పుండ్లు మరియు నమలడంలో ఇబ్బంది ఉన్నవారు క్యాన్సర్ రోగులు ఖచ్చితంగా ఖర్భుజా తీసుకోవాలి.  ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు.  ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా  ధమనులను ఆరోగ్యంగా ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరానికి  సరిపడామెగ్నీషియం ఉందులో లభిస్తుంది.  ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.  ఇందులో ఉండే  పొటాషియం  రక్తపోటును నిర్వహించడానికి పని చేస్తుంది. ఎక్కువ శాతం నీటితో నిండిన పండ్లలో ఖర్భూజా ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.  జీర్ణశయానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, నిర్విషీకరణకు సహాయపడుతుంది.  చాలామందిలో తరచుగా వచ్చే  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) తగ్గించండంలో సహాయపడుతుంది.  అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలిని నియంత్రించుకోవచ్చు.  ◆నిశ్శబ్ద.