LATEST NEWS
బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.
  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.
తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 
ALSO ON TELUGUONE N E W S
  యమలీల మూవీతో ఇంద్రజ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆ పేరు అలాగే ఇప్పటికీ స్థిరపడిపోయింది. ఐతే ఇంద్రజ అసలు తన ఒరిజినల్ నేమ్ కాదంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.    రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రాజాతి అనేది నా రియల్ నేమ్. అది కూడా ముద్దు పేరు. ఇక్కడ కన్నా, బుజ్జి అని ఎలా పిలుస్తారో అలా రాజాతి అని ముద్దుగా పిలిచేవారు. నేను చేసిన ఫస్ట్ మూవీ జంతర్ - మంతర్. భరత్ గారి డైరెక్షన్ లో ఆ మూవీ చేసాను. హీరోయిన్ గా ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. ఫస్ట్ డే పూజ రోజున ఆయన క్యారెక్టర్స్ ని నేరేట్ చేస్తూ ఇంద్రజ పాత్రలో ఈ అమ్మాయి నటిస్తుంది అని చెప్పారు. దాంతో ఆ పేపర్ మీద ఇంద్రజ - శ్రీకాంత్ అని పేరు పడిపోయింది. అప్పుడు మా నాన్న ఒక మాట అన్నారు. పేరు మార్చడం ఎందుకు అలా ఫాలో ఇపోదాం" అని చెప్పారు.    "మీ నవ్వుకు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాన్స్ ఉన్నారు" అని హోస్ట్ చెప్పింది. "అది నాకే తెలీదు జబర్దస్త్ వచ్చేవరకు. నన్ను నాకు తెలియజేసింది జబర్దస్త్ అనే ప్రతీ ఇంటర్వ్యూలో చెప్తాను. ఈటీవీ షోస్ చేస్తున్న దగ్గర నుంచి నన్ను ఇలా ఇష్టపడుతున్నారు అని తెలిసింది. సినిమాలో క్యారెక్టర్స్ లో నటిస్తాం కానీ ఇక్కడ షోస్ లో మనం మనలా ఉండొచ్చు. ఇప్పుడు నేను నాలుగు మూవీస్ లో నటిస్తున్నా. ఇంకా రెండు సినిమాలకి టైటిల్ ఫిక్స్ అవలేదు. చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్టులు నా వరకు వస్తున్నాయి. ఐతే ఈటీవీ, మల్లెమాల వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా ఏదైనా సబ్జెక్టు చేయాలనీ ఈ ఒక్క షోతో స్టిక్ అయ్యి ఉన్నాను." అని చెప్పింది ఇంద్రజ.  
  జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ కి 'డ్రాగన్'(Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బక్కగా అయ్యాడు. దీంతో ఆయన లుక్ పై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఒకే ఒక్క ఫోటోతో.. ఆ ట్రోల్స్ అన్నింటికీ చెక్ పెట్టాడు ఎన్టీఆర్. (NTR Neel)   సినిమా సినిమాకి లుక్ పరంగా వేరియేషన్ చూపించే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈ క్రమంలోనే డ్రాగన్ కోసం బక్కగా అయ్యాడు. దీంతో కొందరు.. ఎన్టీఆర్ బాగా బక్కగా అయిపోయాడని, ఫేస్ లో కళ కూడా పోయిందంటూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఫేస్ లో కూడా మునుపటి కళ కనిపిస్తోంది. డ్రాగన్ లో ఎన్టీఆర్ ని నీల్ అదిరిపోయే లుక్ లో చూపించబోతున్నాడని, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక అందరూ సర్ ప్రైజ్ అవ్వడం ఖాయమని.. ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది.    కాగా, డ్రాగన్ సినిమాని 2026 జూన్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ డేట్ మారనుంది. 2026 చివర్లో లేదా 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.    
  తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రగతి. ఈమెలో నటన మాత్రమే కాదు బరువులు ఎత్తే కళ కూడా ఉంది. పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి దుమ్ము రేపుతున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ లెవెల్ లో గోల్డ్ మెడల్ ని సొంతం చేసుకున్నారు.    టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాష్టర్స్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్ షిప్ లో ఆమె భారత్ ని రిప్రెజెంట్ చేశారు. అలాగే నాలుగు పథకాలను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్నీ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఓవర్ ఆల్ గా సిల్వర్ మెడల్,  డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్, బెంచ్ అండ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో రెండు సిల్వర్ మెడల్స్ ని సాధించారు.    ఇక సెలబ్రిటీస్ ఆమెను అభినందిస్తున్నారు. సింగర్స్ శ్రావణ భార్గవి, శ్రీరామచంద్ర, యాంకర్స్ స్రవంతి, అష్షు రెడ్డి, అరవింద్ కృష్ణా, జ్యోతక్క, మధుశాలిని, యాంకర్ ఝాన్సీ, నిఖిల్ విజయేంద్ర సింహ, నేహా చౌదరి, తేజస్విని గౌడ, రెజీనా కసాండ్ర వంటి వాళ్లంతా అభినందనలు చెప్తున్నారు.    ప్రగతి ఎప్పుడూ జిమ్ లో ఫిట్నెస్ లో రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆమె 2023 నుంచి పవర్ లిఫ్టింగ్ లో ఎంట్రీ ఇచ్చి ఆమె రెండేళ్లలోనే ఎన్నో మెడల్స్ ని కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్, తెలంగాణ స్టేట్ లెవెల్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. తెనాలిలో జరిగిన నేషనల్ లెవెల్ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచారు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ అలాగే  కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు.   ఇక 2024 లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో బ్రోన్జ్ మెడల్ ని సాధించగా ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఒక గోల్డ్ మూడు సిల్వర్ మెడల్స్ ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, ఇండస్ట్రీ ప్రతిష్టను మరింత పెంచారు ప్రగతి.  
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026, మార్చి 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇదే తేదీపై 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కన్నేసినట్లు తెలుస్తోంది.   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారు పవన్. అయితే ఇంకా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.    'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని 2026 మార్చి 26 లేదా మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక రకంగా మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. బాబాయ్, అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ వార్ చూడబోతున్నామా అనే ఆందోళన వారిలో వ్యక్తమవ్వడం సహజం. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా 'పెద్ది' వాయిదా పడుతుందని, అందుకే ఆ డేట్ పై ఉస్తాద్ కన్నేసినట్లు సమాచారం. అంటే మెగా వార్ తప్పినట్లే అన్నమాట.   ఇదిలా ఉంటే, నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతోన్న 'ది ప్యారడైజ్'ను కూడా 2026, మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే, ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.   మరోవైపు, 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.  
  2026 సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే 'మీసాల పిల్ల' అంటూ ఫస్ట్ సింగిల్ తోనే సిక్సర్ కొట్టింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది.   భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి సెకండ్ సింగిల్ గా 'శశిరేఖ'(Sasirekha) తాజాగా విడుదలైంది. 'మీసాల పిల్ల' తరహాలోనే ఇది కూడా మెలోడీ సాంగ్. "ఓ శశిరేఖ..", "ఓ ప్రసాదు.." అంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా.. హీరో హీరోయిన్లు చిరంజీవి, నయనతార మధ్య ఎంతో అందంగా సాగింది ఈ పాట.   భీమ్స్ ట్యూన్ ఎంత వినసొంపుగా ఉందో.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ కూడా అంతే క్యాచీగా, అందరూ పాడుకునేలా ఉన్నాయి. ఇక భీమ్స్, మధుప్రియ కలిసి ఈ పాటను ఆలపించిన తీరు ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో చిరంజీవి, నయనతార కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ముఖ్యంగా చిరంజీవి యంగ్ గా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. భాను మాస్టర్ సాంగ్ కి తగ్గట్టుగా క్యూట్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేసి మెప్పించారు. మెగాస్టార్ తన గ్రేస్ తో ఎప్పటిలాగే మ్యాజిక్ చేశారు. మొత్తానికి 'శశిరేఖ' సాంగ్ తో 'మన శంకర వరప్రసాద్ గారు' మరో సిక్సర్ కొట్టినట్టే అని చెప్పవచ్చు.   షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి జోడిగా నయనతార నటిస్తుండగా, ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనువిందు చేయనున్నారు.   
  Megastar Chiranjeevi’s upcoming mass-and-family entertainer Mana Shankara Vara Prasad Garu, helmed by hitmaker Anil Ravipudi, is steadily building momentum as it races toward its grand Sankranthi 2026 release. The film is backed by producers Sahu Garapati and Sushmita Konidela under Shine Screens and Gold Box Entertainments, with Smt. Archana presenting the project. The promotional blitz is already in high gear, with the team rolling out update after update to keep fans buzzing with excitement. The ever-elegant Nayanthara plays the leading lady, and the first single, Meesala Pilla, featuring the star duo, has exploded into a major chartbuster sensation. Music is composed by Bheems Ceciroleo, and the makers today unveiled the second single Sasirekha, after generating interest with its promo.   Bheems Ceciroleo scored a charming, melodious track infused with irresistible dance moments. As Chiranjeevi humbly describes himself as a poor man, Nayanthara gently reminds him that love rises above all such barriers. Their romantic journey is portrayed beautifully throughout the lyrics of Anantha Sriram. Bheems and Madhu Priya once again elevate the track to the next level with their soulful vocals.   Bhanu Master’s choreography stands out as another major highlight. The pairing of Chiranjeevi and Nayanthara becomes the heart of the number, with their graceful dance moves and sparkling chemistry adding immense charm to the song. Chiranjeevi, in particular, exudes effortless style in traditional and trendy attires, and his graceful moves are an absolute delight to watch. The visuals captured in some exotic locations further beautify the song.   Both Chiranjeevi and Nayanthara grace the screen in elegant traditional attire, infusing the song with a warm, authentic cultural charm. Bheems Ceciroleo crafts the track with rich, multi-layered musical textures- seamlessly blending soothing melodies with infectious, foot-tapping beats, turning it into an instant blockbuster.   Victory Venkatesh plays an important role in the film, while VTV Ganesh and a strong team of talented actors will be seen in important roles.   The movie also has a skilled technical crew. Bheems Ceciroleo is composing the music, Sameer Reddy is handling the cinematography, Tammiraju is responsible for the editing, and AS Prakash is taking care of the production design. The story has been jointly written by S. Krishna and G. Adi Narayana.   With the excitement growing with every new update, Mana Shankara Vara Prasad Garu is shaping up to be one of the most awaited releases of Sankranthi 2026, promising a grand festive entertainer.  
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ‌ ఛైర్మన్‌ సంజయ్‌కిషోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదికపై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.  ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ-  మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని,  సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ-  సినీ రంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథమని,  సినీ రంగంలో ఎంతమంది కథానాయికలున్నా మహానటి మాత్రం సావిత్రిగారే అని కొనియాడారు. నటులు, నిర్మాత మురళీమోహన్‌, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్న దత్‌, రచయిత సంజయ్‌కిషోర్‌, ప్రచురణ కర్త బొల్లినేని కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. సావిత్రి గారి 90వ జయంతి సందర్భంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి గారి పాటల పల్లవులను ఆలపించారు.అనంతరం సావిత్రి గారిపై రూపొందించిన అవార్డు గ్రహీతల డాక్యుమెంటరీలను ప్రదర్శించారు.ఇటీవల నిర్వహించిన సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంజయ్‌ కిషోర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
The 90th birth anniversary of the legendary actress Savitri was celebrated with a grand Savitri Mahotsavam in Hyderabad. Organized by her daughter, Vijaya Chamundeshwari, and the Sangam Foundation, the event saw former Vice President of India, Muppavarapu Venkaiah Naidu, lighting the inaugural lamp. In his tribute, Mr. Venkaiah Naidu highlighted Savitri’s enduring legacy, stating she has not passed away but continues to mesmerize audiences. He made a powerful distinction about her dedication to acting, noting that "Savitri is not seen on screen except the role," emphasizing her complete immersion into every character. MLA Mandali Buddhaprasad, who presided over the function, hailed Savitri as a "textbook on acting" and the true 'Mahanati' of the film industry. The ceremony included the felicitation of the Mahanati film producers, Priyanka Dutt and Swapna Dutt, writer Sanjay Kishore, and publisher Bollineni Krishnayya. The cultural program featured 90 child singers performing Savitri's songs and the screening of award-winning documentaries.   The event, supervised by Sanjay Kishore, was attended by several film personalities, including Murali Mohan and Tanikella Bharani, honoring the irreplaceable icon of Indian cinema.
  అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది. అంచనాల గురించి ఓపెన్ గా.. కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది. ప్రేమతోనే సరిహద్దులు.. అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గతం, అనుభవాలు... అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.   నిర్ణయాలు.. అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొగడ్తలు.. గొప్ప మెడిసిన్.. బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.                              *రూపశ్రీ.
జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.                                      *రూపశ్రీ.  
  మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..  రాజ్యాంగం ఈ దేశానికి కొన్ని నియమాలు, నిబంధనలు, షరతలు విధించింది. దేశ పౌరులకు కొన్ని హక్కులు, మరికొన్ని సరిహద్దు గీతలు గీసింది.  వీటి నుండి ఏ వ్యక్తి అయినా అతిక్రమించి ప్రవర్తించినా,  ఇతరులకు నష్టం కలిగించినా,  ఇతరులకు అన్యాయం చేసినా.. అందరికీ న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.  ఈ న్యాయవ్యవస్థ నుండి ప్రజలకు న్యాయం సమకూర్చి పెట్టడానికి వారధులుగా నిలిచేవారే న్యాయవాదులు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన న్యాయవాదుల దినోత్సవాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్బంగా జరుపుకుంటారు. ఈ సందర్బంగా సమాజంలో న్యాయవాదుల పాత్ర.. న్యాయ వ్యవస్థకు వారి సేవల గురించి తెలుసుకుంటే.. న్యాయానికి వారధులు.. ప్రతి వ్యక్తి  తనకు అన్యాయం జరుగుతోంది అంటే చట్ట బద్దంగా న్యాయాన్ని అర్థించాలంటే దానికి  న్యాయవాదుల సహాయం,  వారి సలహా చాలా అవసరం.  న్యాయవాదులే న్యాయస్థానానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తారు. రాజ్యాంగం ప్రజలకు కేటాయించిన హక్కులను,  రాజ్యంగం పేర్కొన్న నియమాలు, షరతుల ఆధారంగా న్యాయాన్ని చేకూర్చడంలో సహాయపడతారు. కర్తవ్యం.. చాలామంది మేము న్యాయవాదులం అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా గర్వంగా చెప్పుకోవడం అనేది కేవలం న్యాయవిద్య అభ్యసించి న్యాయవాదులు అయిపోగానే వచ్చేది కాదు.. న్యాయవాదికి అసలైన గౌరవం,  అసలైన గుర్తింపు వచ్చేది బాధితులకు, న్యాయం కోసం తనను ఆశ్రయించిన వారికి న్యాయం జరిగేలా చూసినప్పుడే. అందుకే న్యాయవాది కర్తవ్యం ఏమిటంటే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం. అప్పుడే తన  కర్తవ్యాన్ని తను సరిగా నిర్వర్తించినట్టు. వృత్తి-దుర్వినియోగం.. ప్రతి వ్యక్తి తను  చేపట్టే వృత్తి ద్వారానే తన జీవనం సాగిస్తుంటాడు. అలాగే న్యాయవాదులు కూడా తమకు వచ్చే ఆదాయం ద్వారానే తమ జీవితాన్ని సాగిస్తుంటారు.  కానీ చాలా వరకు ఇందులో ఆదాయం గురించి స్పష్టత ఉండదు. తమకు  కేసులు లేకపోతే ప్రైవేటు లాయర్ల జీవనం, వారి కుటుంబ పోషణ సమస్యగా మారుతుంటుంది.  అందుకే కొందరు తప్పటడుగు వేస్తారు.  డబ్బు కోసం న్యాయానికి విరుద్దంగా కూడా ప్రవర్తిస్తారు.  కొన్నిసార్లు న్యాయం వైపు నిలబడ్డామని చెబుతూ అన్యాయం వైపు సమర్థిస్తూ బాధితులను మోసం చేస్తుంటారు.  ఇదంతా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. కానీ కేసులు, ఆస్తులు,  ఆర్థిక విషయాలు అయితే ఇలాంటివి కోల్పోయిన వ్యక్తులు తిరిగి కోలుకుని మళ్ళీ జీవిత పోరాటంలో పడిపోవచ్చు. కానీ .. మానవ సంబంధాలు,  ప్రాణానికి నష్టం కలిగించిన వ్యక్తులు  ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడకుండా చేయడం వల్ల న్యాయ విద్యను అభ్యసించి దాన్ని దుర్వినియోగం చేసినవారవుతారు. ఇలాంటి వారి వల్ల న్యాయ వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుంది. అటు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అందుకే న్యాయ విద్య అభ్యసించడం అంటే ఒక గొప్ప శాస్త్రాన్ని తమ చేతిలో ఆయుధంగా పట్టుకోవడం. న్యాయవాదులు తమ ప్రతిభను నిందితులను కాపాడటానికి బదులుగా బాధితులకు న్యాయం జరిగేలా చేయడానికి వినియోగించాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది.  అన్యాయానికి అడ్డుకట్ట పడుతుంది.                            *రూపశ్రీ.
  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...