LATEST NEWS
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకుంటున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.  మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ప్రచారం కోసం ఏకంగా  ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నే రంగంలోకి దింపాశారు. తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్తవంగా అల్లు అర్జున్ ఆ సర్పంచ్ అభ్యర్థికోసం చేయడంలేదు. అలా చేస్తున్నట్లుగా సదరు సర్పంచ్ అభ్యర్థి ఏఐ టెక్నాలజీతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోను తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 
తమిళనాట కొత్త చిచ్చు రేగింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి. ఇంతకీ విషయమేంటంటే.. మ‌ధురైకి ద‌గ్గ‌ర్లో ఉన్న తిరుపుర‌కుండ్రం అనే కుమార స్వామి క్షేత్రంలో కార్తీక దిపానికి సంబంధించినది. త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా  భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ  కార్తీక దీపం  పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం. అయితే ఇక్క‌డి ద‌ర్గాకు కుమార‌క్షేత్రానికి చారిత్ర‌క సంబంధాలుండ‌టంతో వివాదం  చెల‌రేగింది. ఈ స్తంభంపై కార్తీక దీపం పెట్ట‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో  విషయం కాస్తా  కాస్తా కోర్టు మెట్లు ఎక్కింది.  ఈ విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు, మ‌ధురై బెంచ్ న్యాయ‌మూర్తి స్వామినాథన్ ఈ దీపం ఇక్క‌డ వెలిగించ‌డానికి అధికారులు త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ  చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం..  , ఇక్క‌డ కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చు. అయితే ఇలా చేస్తే  మ‌త ఘ‌ర్ష‌ణకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం  దీపం పెట్ట‌నివ్వ‌కుండా,   హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు  కూడా మ‌ధురై బెంచ్ ఇచ్చిన తీర్పునే స‌మ‌ర్ధించింది. దీంతో దీపం  వ్య‌వ‌హారంలో తిరుపుర‌కుండ్రంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగింది. ఒక వ‌ర్గం వారు ఇక్క‌డ దీపం  వెలిగించాలంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చి  పోలీసులు సైతం గాయ‌ప‌డ్డారు.   లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కార్తీక దీపం వెలిగించాలంటూ   తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథ‌న్ పై అభిశంస‌న తీర్మాన‌రం పెట్టాల‌ని నిర్ణ‌యించారు ఇండి  కూట‌మి ఎంపీలు. వీరంతా  క‌ల‌సి ఈ దిశ‌గా ఒక మెమ‌రాండం సైతం స‌మ‌ర్పించారు.  దీనిపై స్పందించిన   ఏపీ డిప్యూటీ  సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో సుప్రీం  కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హిందూ దేవ‌త‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఏ పార్టీ ఆయ‌నపై అభిశంస‌న  పెట్ట‌డానికి ముందుకు రాకపోగా  ఆయ‌న్నే వెన‌కేసుకొచ్చార‌న్న పవన్ స్వామినాథ‌న్ ఏం చేశార‌ని  అభిశంస‌న పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారో అర్ధం కావ‌డం లేదన్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తకుండా స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్య‌వ‌స‌రం అంటూ  ట్వీట్   చేశారు.
పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.  చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.  తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.
  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
Superstar Mahesh Babu and legendary director SS Rajamouli are coming together for the first time with Vaaranaasi. The movie announcement video has created global sensation with stunning VFX and high-end concept. The movie team have been maintaining a tight lip about shooting updates, post the release of the video.  Now, the rumors about Mahesh Babu playing five roles are going around across the internet. It is stated that along with Lord Rama, Rudra, he is playing roles like Lord Shiva, A traveller King of Ancient India and another hidden role. They are also staring that the movie is being divided into two parts.  Rumors are also aplenty that Mahesh is taking Rs.50 crore salary per annum for the project till the movie shoot is over. He might be looking at a huge paycheck of Rs.150-175 crores as his remuneration for the film. Rajamouli is said to be planning even bigger schedule from January till March 2026, in RFC.  Well, some close sources to the team have rubbished five roles for Mahesh rumors. They stated that he might be appearing in different get-ups but only two roles as Rama and Rudra. And they did not confirm about MB's salary or two parts rumors. Priyanka Chopra and Prithviraj Sukumaran are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
      -నెల్సన్ మల్టీస్టారర్ -ఆ మరో స్టార్ ఎవరు! -ఎన్టీఆర్ కి కథ చెప్పాడా!     దర్శకుడిగా 'జైలర్'(Jailer)తో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు 'నెల్సన్ దిలీప్ కుమార్'(Nelson Dilipkumar). ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన రేంజ్ తో పాటు సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)రేంజ్ ని మరింత పెంచేలా 'జైలర్ పార్ట్ 2 ' ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది జూన్ లో థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఈ చిత్రం తర్వాత నెల్సన్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కథనాలు వినపడుతున్నాయి.       నెల్సన్ ఈ సారి ఇద్దరు బడా హీరోలతో మల్టి స్టారర్ చేయబోతున్నాడని, కానీ తమిళ హీరోలు కాకుండా తెలుగు హీరోలు ఉంటారనే వార్తలు ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తున్నాయి. ఒక హీరోగా మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ఉంటాడని, ఇంకో హీరో కోసం నెల్సన్ వెదుకులాటలో ఉన్నాడని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ నే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనేది నెల్సన్ డ్రీమ్. గతంలో ఎన్టీఆర్‌ కి నెల్సన్ ఒక కథ చెప్పాడని, ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా  వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.      also read:  అఖండ 2 ప్రీమియర్ కి పవన్ కళ్యాణ్! ప్లేస్ చెప్తారా!     సదరు చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో పాటు మరో హీరోతో నెల్సన్ మల్టి స్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ అభిమానుల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఒక వేళ మల్టిస్టారర్ న్యూస్ నిజమైతే ఎన్టీఆర్ తో పాటు ఇంకో హీరోగా చేసేది తెలుగు నుంచా లేక తమిళం నుంచా అనే చర్చలు కూడా వాళ్ళ మధ్య జరుగుతున్నాయి.      
    -అభిమానుల హంగామా -పవన్ చూసేది ఎక్కడ -జాతర కి టైం స్టార్ట్    గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం 'బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపాన్ని మరోసారి వీక్షించడానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపు నైట్ నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో థియేటర్స్ దగ్గర అభిమానుల కోలాహలం మొదలయ్యింది. నిజం చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ డేట్ కి రెండు రోజుల ముందు నుంచే థియేటర్స్ ని డెకరేషన్ చేసి ప్రతి రోజు థియేటర్ కి వెళ్లి కొత్త రిలీజ్ డేట్ కోసం పడిగాపులు కాసారు. బాలయ్య అంటే వాళ్ళకి అంత అభిమానం. ఇప్పుడు ఆ అభిమానాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తుంది.     పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అఖండ 2 ప్రీమియర్ చూడబోతున్నాడని, మోస్ట్ లీ విజయవాడలోనే చూడబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ న్యూస్ పై ఇద్దరు అభిమానులు స్పందిస్తు 'అఖండ 2 ని పవన్ కళ్యాణ్ ప్రీమియర్ రోజు గాని లేదా ప్రత్యేకంగా షో వేయించుకొని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  పవన్ చాలా రోజుల నుంచి అన్ని మతాలని, ప్రజలని ఒకేలా ఆదరించే సనాతన ధర్మాన్ని తన భుజ స్కందాలపై వేసుకొని సనాతన ధర్మ గొప్పతనాన్ని చెప్తూ వస్తున్నాడు.      also read:   చిరంజీవిగా రాలేదు.. పరిశమ్ర వ్యక్తిగా వచ్చాను    ఇప్పుడు అఖండ 2(Akhanda 2)లో బాలయ్య కూడా సనాతన దర్మం యొక్క విశిష్టితని తన క్యారక్టర్ ద్వారా చెప్తూ వస్తున్నాడు. మూవీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా సనాతన ధర్మమే. దీంతో పవన్  అఖండ 2 చూడటం గ్యారంటీ అని అంటున్నారు. పైగా పవన్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం. బాలకృష్ణ తన సహచర ఎంఎల్ఏ అనే విషయాన్నీ కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. పవన్, బాలకృష్ణ ఒకరికొకరు సోదర భావంతో మెదులుతూ ఉంటారనే విషయం కూడా తెలిసిందే.        
      -చిరంజీవి స్పీచ్ వైరల్  -ఏం చెప్పాడు -పరిశ్రమ ఏజెంట్ ని    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తన అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సదరు మూవీ నుంచి రిలీజైన 'శశిరేఖ' సాంగ్ తో సోషల్ మీడియాని షేక్  చేస్తున్నాడు. ఇక చిరంజీవి రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్( Telangana Global Summit)కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.     ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు నేను చిరంజీవిగా గ్లోబల్ సమ్మిట్ కి  రాలేదు. సినిమా పరిశ్రమ తరుపున ఒక రిప్రజెంట్ గా వచ్చాను.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసాను. అప్పుడు నాతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా  తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయిలో హబ్ ని చేస్తాను అని చెప్పారు. కాకపోతే వెంటనే జరుగుతుందా అని అనుకున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ వ్యవధిలోనే తెలుగు సినిమా కేంద్రంగా హైదరాబాద్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.   రేవంత్ రెడ్డి(Revanth Reddy)గారి విజన్ కి ప్రపంచ స్థాయిలో తెరకెక్కే సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ జరగడం ఖాయం. కళాకారుల యొక్క స్కిల్స్ అందరికి తెలిసేలా సినీ వర్క్ షాప్ ని కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు.      also read:  మా పరిస్థితి అర్థం చేసుకోండి.. ఫ్యాన్స్‌కి  డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన        
  2021లో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్న సమంత.. డిసెంబర్‌ 1న కోయంబత్తూరులో దర్శకనిర్మాత రాజ్‌ నిడుమోరును సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. రాజ్‌కి కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న రోజు నుంచీ సమంతపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నారు. ఓ పక్క అక్కినేని అభిమానులు సమంతను ట్రోల్‌ చేస్తుండగా, కొందరు సాధారణ మహిళలు, నటీమణులు కూడా సమంత తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం అనారోగ్యానికి గురైన సమంత.. ఆ తర్వాత క్రమంగా కోలుకొని సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ వస్తున్నారు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని ఎంతో మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు వారే ఆమెను విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకు మించి సమంతపై ట్రోలింగ్‌ జరుగుతోంది. అది రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.  సినిమా రంగానికి సంబంధించిన విషయమైనా, రాజకీయ రంగానికి చెందిన అంశమైనా తన స్పందన తెలియజేయడంలో ఎప్పుడూ ముందుంటారు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత. ఇప్పుడు సమంతను విమర్శిస్తున్న ట్రోలర్స్‌కి రివర్స్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. సమంత పెళ్లి విషయంలో మాధవీలత చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె ఎలా స్పందించారు, ట్రోలర్స్‌కి ఎలాంటి కౌంటర్‌ ఇచ్చారు అనేది తెలుసుకుదాం. ‘పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు ఎంపిక చేసుకుంటారు. ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా. ఆ విషయంలో మీరు సంతోషించాలి. సమంత రెండో పెళ్లి చేసుకుంటే కొందరు బాధపడుతున్నారు. మీకెందుకు అంత బాధ అనేది నాకు అర్థం కావడం లేదు. ఎవరి సంసారమో కూల్చేసింది అన్నట్టుగా కామెంట్‌ చేస్తున్నారు.  అలాంటి కామెంట్స్‌ చేసే వారు.. ముందు తమ పర్సనల్‌ లైఫ్‌లో ఎన్ని రిలేషన్‌ షిప్స్‌లో ఉన్నారో ప్రశ్నించుకోవాలి. మరొకరి సంసారాన్ని చెడగొట్టి పెళ్లి చేసుకునేవారు, విడాకులు ఇవ్వకుండానే వ్యవహారాలు నడిపేవారు ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంటే నాకు నవ్వొస్తోంది. మీరేమీ పతివ్రతలు కాదు కదా. ఇలాంటి కామెంట్స్‌ చేసే వారి గురించి నాకు బాగా తెలుసు’ అంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు మాధవీలత.
    -అఖండ 2 కోసం ఎదురుచూపులు  -డిస్ట్రిబ్యూటర్ల ట్వీట్  -అక్కడ ఏం జరుగుతుంది!     గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ 'బాలకృష్ణ'(Balakrishna)మూవీ రిలీజ్ రోజు అభిమానులు చేసే హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటిది శివ స్తుతుడుగా 'అఖండ 2 'తో బాలయ్య తాండవం చేస్తుంటే వాళ్ళ హంగామా మరో రేంజ్ లో ఉంటుంది. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసినా హంగామా విషయంలో తగ్గేదెలే అనే విధంగా ఉంటారు. ఇందుకు ఓవర్ సీస్ అభిమానులు కూడా మినహాయింపు కాదు . రీసెంట్ గా  ఓవర్ సీస్ అభిమానులని రిక్వెస్ట్ చేస్తు అఖండ 2(Akhanda 2)ని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మోక్ష మూవీస్(Moksha Movies)ఒక ట్వీట్ చేసింది.     సదరు ట్వీట్ లో 'అఖండ 2’ మా సంస్థకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అభిమానులకి,ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే కలతో చాలా ప్లాన్లు చేశాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ చివరి సమయంలో థియేటర్లు అడ్జస్ట్ చేయడం పెద్ద ఛాలెంజ్. అయినప్పటికీ మేము కొంతవరకు విజయం సాధించాం. మీ షెడ్యూల్స్‌కి అనుగుణంగా షోస్ ప్లాన్ చేసేందుకు మీ మద్దతు కావాలి. థియేటర్లు షోటైమ్స్ ఫైనల్ చేస్తున్నాం. ఈ రాత్రికి లేదా రేపు పూర్తి లిస్ట్ ప్రకటిస్తాం. 11న USAలో గ్రాండ్ ప్రీమియర్స్ ఉంటాయని సదరు ట్వీట్ లో పేర్కొంది.     Also Read:   అఖండ 2 ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా పడిన కొత్త చిత్రాలు       అభిమానులు కూడా మోక్ష మూవీస్ ట్వీట్ పై  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఎంత ఇబ్బంది వచ్చినా అఖండ 2 ని గ్రాండ్‌గా చూపిస్తారనే నమ్మకం ఉంది. లేటైనా సరే బెస్ట్ థియేటర్లల్లో మూవీ చూస్తామంటు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అభిమానులైతే ఏకంగా కొన్ని థియేటర్లని ట్యాగ్ చేస్తూ, అదనపు స్క్రీన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఓవర్ సీస్ లో అఖండ 2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.     https://x.com/MokshaMovies/status/1998460031784948194?s=20
Two of Telugu cinema’s most celebrated names come together once again. The highly awaited Venkatesh x Trivikram, #Venky77 film now has a title “Aadarsha Kutumbam House No: 47 - AK47” It’s a catchy and intriguing title, with a logo that clearly indicates a wholesome family entertainer infused with a hint of thrilling elements. Venkatesh appears in a refined, classy, family-man look in the first look, setting the tone for an engaging and emotionally rooted narrative. Aadarsha Kutumbam shoot commenced its shoot today at Aluminium Factory, Hyderabad, marking the beginning of what promises to be a memorable cinematic experience for audiences. This collaboration has been the talk of the industry for months, and for good reason. Watching Venkatesh step into a character shaped by Trivikram’s distinct storytelling style is something cinephiles have long anticipated. Known for crafting emotionally rich family dramas with humour and heart, Trivikram is expected to present yet another universally appealing film. Aadarsha Kutumbam is eyeing a Summer 2026 release, promising to arrive as a grand treat for audiences across all sections. Produced by S. Radha Krishna (Chinababu) under the prestigious Haarika & Hassine Creations banner, this rare and magical combination has already set high expectations. Fans and film lovers alike eagerly await what unfolds when Venkatesh’s charm blends with Trivikram’s narrative brilliance on the big screen. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
      -బాలయ్య సునామి స్టార్ట్ -పక్కకి తప్పుకున్న సినిమాలు -నైట్ నుంచే జాతర స్టార్ట్      అన్ని అడ్డంకులు తొలగించుకొని గాడ్  ఆఫ్ మాసెస్ 'బాలకృష'(Balakrishna)అఖండ విజయనాదాన్నిచేసుకుంటు రేపు బెనిఫిట్ షోస్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో శివస్తుతుడుగా తాండవం చేయబోతున్నాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, సినీ సర్కిల్స్ లో ఇప్పటికే ప్యూర్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగా అఖండ 2(Akhanda 2)సాధించే సింహగర్జన ఏ రేంజ్ లో ఉంటుందనే లెక్కలు కూడా మొదలయ్యాయి. దీంతో బాలయ్య సునామి ఖాయమైన నేపథ్యంలో 12 న విడుదల కావాల్సిన చిత్రాలు తమ రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంటున్నాయి.     అందులో భాగంగా సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటూ వస్తున్న నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్దార్ధ్'(psych siddhartha)ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.సైక్ సిద్దార్ధ్ లో నందు హీరోగా చేస్తుండటంతో పాటు నిర్మాతగాను వ్యవహరించడం విశేషం. జనవరి 1 న వస్తున్నామని ప్రముఖ హీరో రానా(Rana)దగ్గుబాటితో ఒక ఫన్నీ వీడియో చెయ్యడం ద్వారా తెలియచేసాడు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల నట వారసుడు రోషన్ కనకాల హీరోగా వస్తున్న మోగ్లీ కూడా ఈ నెల 12 న రావాల్సి ఉండగా 13 కి వాయిదా పడింది.     Also read:    ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఈ రోజే.. అభిమానుల్లో జోష్       ఇక అఖండ 2 పన్నెండున రాదేమో అని మొత్తం ఎనిమిది చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పై వస్తున్నట్టుగా ప్రకటించాయి. వాటిల్లో రెండు ఇప్పటికే బాలయ్య ని గౌరవిస్తూ పక్కకి తప్పుకున్నాయి. ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి మరిన్ని తప్పుకుంటాయేమో అనే వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. 'అన్నగారు వస్తారు' తో కార్తీ  12 నే బాక్స్  ఆఫీస్ వద్ద అడుగుపెట్టనున్నాడు.        
      -అభిమానుల్లో భారీ అంచనాలు  -ak 47 అంటే ఏంటి! -వెంకీ, త్రివిక్రమ్ మాయాజాలం షురూ      తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్(Venkatesh),మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikiram)కలయికలో కొత్త మూవీ గురించి అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఇద్దరి కలయికలోని మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళ్తుందా అని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే  ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.     వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా తెరకెక్కుతుండగా “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్ ని  ఖరారు చేశారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది. టోటల్ గా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్ గా కనిపిస్తున్నారు. అదే టైం లో హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది.      Also read:  అఖండ-2 కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్స్ ఇవే      త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు ఉన్నాయి.వెకంటేష్ త్రివిక్రమ్ కలయిక మరోసారి ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.   ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. .  టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ అద్భుత కలయిక తెరపై ఏ మాయ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో వెండితెరపై వినోదాల విందుని అందించడానికి టీం మొత్తం రెడీ అవుతుంది.      
        -జీవో జారీ చేసిన ప్రభుత్వం -టికెట్ రేట్స్ ఇవే -నైట్ నుంచే బాలయ్య జాతర      ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)ప్రభుత్వం “అఖండ-2 తాండవం'(Akhanda 2)చిత్రానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ (జనరల్-ఎ) శాఖ నుంచి డిసెంబర్ 9న జారీ చేసిన మెమో ప్రకారం,ఈ సినిమా విడుదలకు ముందురోజు అనగా డిసెంబర్ 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక్క బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ బెనిఫిట్ షోకు టిక్కెట్ ధరని  600 రూపాయలు (జీఎస్‌టితో సహా)*గా ప్రభుత్వం నిర్ణయించింది.     తాజా పరిణామాల్లో భాగంగా చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ LLP సమర్పించిన అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పూర్వ ఉత్తర్వులను అధిగమిస్తూ ఈ అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా సినిమా విడుదలైన డిసెంబర్ 12వ తేదీ నుంచి పది రోజులపాటు సాధారణ ఐదు షోలకూ ప్రత్యేక చార్జీలను కూడా ఆమోదించింది.     ఇందులో భాగంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు అదనపు ఛార్జీ (జీఎస్‌టితో సహా)... అలాగే మల్టీప్లెక్సుల్లో 100 రూపాయిల అదనపు ఛార్జీ (జీఎస్‌టితో సహా) ప్రవేశ రుసుముల పెంపుదలకు జీ.ఓ.ఎం.ఎస్. నెం.13 (07.03.2022)లో ఉన్న మార్గదర్శకాలకు సడలింపులు కల్పిస్తూ ఈ ప్రత్యేక అనుమాతులు అమల్లోకి వస్తాయి. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.     Also read:  ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మారుతి      ఈ నిర్ణయంతో అఖండ-2 తాండవం చిత్రానికి రిలీజ్‌కి పూర్తిగా లైన్ క్లియరైంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కాను న్నాయి. అలాగే మరుసటి రోజు డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ జరగనుంది.      
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
  పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు. కానీ చాలా బంధాలు విచ్చిన్నం అవ్వడానికి,  వివాహం నిలబడకపోవడానికి కారణం వారి ఆలోచనలే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. కేవలం వయసు చూసి పెళ్లి చేయడం సరికాదని, కొన్ని లక్షణాలు వచ్చాకే పెళ్ళి చేయాలని   అంటున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఇక పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదట.   వయసు కాకుండా పెళ్లి  చేసుకోవడానికి ఉండాల్సిన  ముఖ్యమైన లక్షణాలు ఏంటి? తెలుసుకుంటే.. నేను కాదు మనం.. పెళ్లి అంటే కేవలం ఇంకొక వ్యక్తితో కలిసి జీవించడం మాత్రమే కాదు, అది  జీవితాన్ని వేరొకరితో పంచుకోవడం. పెళ్లి చేసుకోవడాన్ని కేవలం  స్వంత ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వచ్చే భాగస్వామి, వారి  కుటుంబాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే ప్రతిది తనకు నచ్చినట్టు,  తను కోరుకుంటున్నట్టు ఉండేది కాదు.. అందరికీ నచ్చినట్టు, అందరూ కలిసి ఉండేలా ఉండాలి.  చేతిలో ఒక్క పండు ఉన్నా దాన్ని ఒక్కరే కాకుండా అందరూ కలిసి పంచుకుని తినాలి అనే మనస్తత్వం ఉండాలి. ఇలా ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఒక లక్షణం ఉన్నట్టే. సమస్యలు, పరిష్కారాలు.. వివాహం అయ్యాక భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా వస్తాయి. కానీ చాలామంది వాటిని పరిష్కరించడంలో విఫలం అవుతారు.  భార్యాభర్తల మధ్య సమస్య లేదా గొడవ వస్తే కోపం చేసుకుని దాన్ని పెంచుకోవడానికి బదులు దాన్ని ఎలా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి.  సాధారణంగా సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు కలిగి ఉంటే వివాహ బంధంలో కూడా అది చేయగలుగుతారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే స్వభావం కూడా ఉండాలి. అలాగే ఎదుటివారు తప్పు చేసినప్పుడు దాన్ని క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి. ఇలా ఉంటే ఒక మంచి లైప్ పార్టనర్ అవుతారు. వాస్తవ జీవితం.. చిన్నతనం నుండి కొన్ని కలలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమాలు, టీవీలు,  పుస్తకాల ప్రబావం వల్ల భాగస్వామి గురించి,  వివాహం తర్వాత జీవితం గురించి చాలా డ్రీమ్స్ పెట్టుకుంటారు. కానీ నిజానికి వివాహం తర్వాత జీవితంలో కలలను వెతక్కూడదు.  వాస్తవిక జీవితంలోనే బ్రతకాలి. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా ఉండరు. అలాగే జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి చాలా ఆశలు, అంచనాలు పెట్టుకోకూడదు.  వాస్తవాన్ని, వ్యక్తి ఎలా ఉంటారో దాన్నే అంగీకరించాలి.  యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ లక్షణం ఉంటే జీవితంలో అసంతృప్తి ఫీలవడం చాలా తక్కువ. మంచి భాగస్వామి కాగలుగుతారు. ఆర్థిక బాధ్యతలు.. వివాహానికి ముందు వివాహం తర్వాత ఆర్థిక విషయాలలో చాలా మార్పులు వస్తాయి.  ఒక్కసారిగా భార్యాభర్తల ఇద్దరి మీద బాధ్యతలు పెరుగుతాయి.  ఖర్చులు ఎలా చేయాలి? దుబారా ఎలా తగ్గించాలి? భవిష్యత్తు కోసం పొదుపు ఎలా చేయాలి? ఇవన్నీ ఆలోచించేవారు,  వీటిని ఎలా నిర్వహించాలి అనే విషయం తెలిసిన వారు అయితే కుటుంబాన్ని పోషించే క్వాలిటీ ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. సంతోషం.. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండగలగడం  పెళ్లికి సిద్దంగా ఉండే గొప్ప లక్షణం. ఇది చాలామందికి వింతగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఏ వ్యక్తి అయినా తన సంతోషం ఇతరుల మీద ఆధారపడి ఉండేలా ఉండకూడదు. పెళ్లి చేసుకోగానే తాము ఇతరుల సంతోషమే చూడాలి అనుకోవడం చాలా తప్పు. ఎవ్వరూ లేకపోయినా తాను సంతోషంగా ఉండగలను అనే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా తనను తాను సంతోషంగా ఉంచుకునే వ్యక్తి ఇతరులను సంతోష పెట్టడంలో ఎప్పుడూ విఫలం కారు.  కష్టాలు.. బాలెన్సింగ్.. ఒంటరిగా ఉన్నా, జంటగా ఉన్నా జీవితం ఎప్పుడూ సులువుగా ఉండదు. కాకపోతే జంటగా ఉన్నప్పుడు సవాళ్లు, సమస్యలు, కాస్త ఎక్కువ ఉంటాయి.  అయితే అలాంటివి ఫేస్ చేయడానికి బంధంలో మరొకరు కూడా తోడుగా ఉంటారు. జీవితంలోకి వచ్చే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా,  ఆర్థిక సమస్యలలో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, పరిస్థితులు ఏవైనా సరే.. అన్ని సమయాలలో ఓపికతో కలిసి ఉండే ధైర్యం,  అన్నింటిని అధిగమించే నైపుణ్యం కలిగి ఉండాలి.  ఈ లక్షణం కూడా కలిగి ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేనట్టే.. పైన చెప్పుకున్న లక్షణాలు అన్నీ ఉన్నవారు పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పైన చెప్పుకున్న లక్షణాలు లేకపోతే మాత్రం వయసు వచ్చినా సరే.. పెళ్లి చేసుకోవడానికి  మీరు కరెక్ట్ కాదని అర్థం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ వల్ల మీ లైఫ్ లోకి వచ్చే భాగస్వామి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  కొన్ని పరిస్థితులలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు,  విడిపోవడానికి దారితీసే గొడవలు కూడా రావచ్చు.                                  *రూపశ్రీ.
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.                                  *రూపశ్రీ.
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది.  పరిస్థితులు, సందర్భాలు ఏవైనా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల ఇబ్బంది కలిగినా గత్యంతరం లేక ఇలా చేస్తుంటారు.  అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అనేది చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. దీని వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంతకూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? శరీరానికి కలిగే ప్రమాదాలేంటి? తెలుసుకుంటే.. చలికాలం కష్టం.. చలికాలం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.  వాటిలో మూత్రానికి వెళ్లడానికి బద్దకించే వారు కూడా ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది చాలా నిజం. ఇదే కాకుండా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా గుడి,  పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.  ఇలా మూత్రాన్ని ఆపుకోవడం చాలా డేంజర్. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు.. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కలిగే చాలా పెద్ద నష్టం మూత్రంలో ఇన్పెక్షన్ ఏర్పడటం.  మూత్రం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలో ఉండే విష పదార్థాల ప్రభావం వల్ల మూత్రాశయ ద్వారం ఇన్పెక్షన్ కు లోనవుతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇది మూత్ర పిండాల సంబంధిత  సమస్యలకు దారితీస్తుంది.   మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాలా ప్రముఖమైనవి. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది.  మూత్రాశయ కండరాలు బలహీనం అవుతాయి.  ఇది మూత్రం లీకేజికి దారి తీస్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలోని మలినాలు, విసర్జక పదార్థాలు కలిసి గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఈ సమస్య కిడ్నీలను మరింత ప్రమాదానికి గురిచేస్తుంది.  అందుకే మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు.                                  *రూపశ్రీ.  
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...