LATEST NEWS
  తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. గెలిచే అభ్యర్థులను కాపాడుకునే పనిలో టీవీకే అధినేత.. హంగ్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో అలర్ట్...   తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే రాష్ట్రంలో 'రిసార్ట్ రాజకీయాల' వేడి మొదలైంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ, తన అభ్యర్థులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని (హంగ్ అసెంబ్లీ) వస్తున్న విశ్లేషణల నేపథ్యంలో విజయ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం తన పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు విజయ్ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహాబలిపురం సమీపంలోని ఒక ప్రముఖ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరూ నేరుగా ఈ రిసార్ట్‌కు చేరుకోవాలని పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ ముగియగా, మే 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ నెలకొంది. కొన్ని సర్వేలు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటుండగా, మరికొన్ని సర్వేలు డీఎంకే కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఈ సందిగ్ధత మధ్య చిన్నపాటి తేడాతో ప్రభుత్వం మారే అవకాశం ఉంటే, అభ్యర్థుల కొనుగోలు (హార్స్ ట్రేడింగ్) జరిగే ప్రమాదం ఉందని టీవీకే భావిస్తోంది. గతంలో తమిళనాడు రాజకీయాల్లో రిసార్ట్ పాలిటిక్స్ కీలక పాత్ర పోషించాయి. జయలలిత మరణం తర్వాత పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో కూవత్తూరు రిసార్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో విజయ్ తన అభ్యర్థులను ఒకచోట చేర్చడం ద్వారా పార్టీ ఐక్యతను చాటాలని, అలాగే ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా నిలవాలని యోచిస్తున్నారు. మరోవైపు అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే కూటములు కూడా తమ మెజారిటీపై ధీమాగా ఉన్నప్పటికీ, లోలోపల అభ్యర్థుల కదలికలపై నిఘా ఉంచినట్లు సమాచారం. ముఖ్యంగా హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తే స్వతంత్రులు మరియు టీవీకే అభ్యర్థుల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ముందస్తుగా అప్రమత్తమై తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే 24 గంటలు తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఫలితాల అనంతరం ఏ పార్టీ ఎవరితో చేతులు కలుపుతుంది? విజయ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా, తలపతి విజయ్ తీసుకున్న ఈ 'రిసార్ట్ నిర్ణయం' ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు హాట్ టాపిక్ గా మారింది.
  దీదీ కోటలో కమలం గుబాళిస్తుందా.. హంగ్ దిశగా అడుగులు.. ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్!.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. మొత్తం 294 సీట్లలో బీజేపీ, టీఎంసీలకు తలో 100 నుంచి 140 సీట్లు రావొచ్చని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దీంతో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశంపై చర్చ జరుగుతోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ (148)కు దగ్గరగా చేరితే చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోరే అవకాశం ఉంది. అదే టీఎంసీ ముందంజలో ఉంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సహకారం తీసుకునే అవకాశముంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. తాజా అంచనాల ప్రకారం, రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న మమతా బెనర్జీకి ఈసారి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను పరిశీలిస్తే, గతంతో పోలిస్తే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు టీఎంసీకి అండగా నిలుస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో మార్పు కోరుకునే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పు అత్యంత కీలకం కానుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు మహిళలను ఆకట్టుకోగా, మరోవైపు అవినీతి ఆరోపణలు మరియు శాంతిభద్రతల సమస్యలను బీజేపీ ప్రధాన అస్త్రాలుగా మలచుకుంది. దీంతో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈసారి లెఫ్ట్ మరియు కాంగ్రెస్ కూటమి కూడా కొన్ని స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ టీఎంసీ, బీజేపీలలో ఏ ఒక్కరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే, ఈ కూటమి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. కొన్ని సర్వేలు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతుండగా, మరికొన్ని సర్వేలు దీదీనే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఎన్నికలు కేవలం బెంగాల్ భవిష్యత్తునే కాకుండా, జాతీయ రాజకీయాల్లో కూడా కీలక మార్పులకు సంకేతం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఈసారి గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది. అదే సమయంలో, బెంగాల్ గడ్డపై తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ తన సర్వశక్తులూ ఒడ్డారు. ఎన్నికల ఫలితాల ప్రకటనకు సమయం దగ్గర పడుతుండటంతో అటు టీఎంసీ క్యాడర్, ఇటు బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఓట్ల లెక్కింపు తర్వాత గానీ బెంగాల్ సింహాసనంపై కూర్చునేది ఎవరో స్పష్టత రాదు. అప్పటి వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వేడిని పెంచుతూనే ఉంటాయి. చివరికి ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారా లేక సంక్షేమానికా అనేది మే 4న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. అప్పటివరకు ఈ రాజకీయ చదరంగంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
 రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్.. ఈ రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలను చూసిన ప్రజలు ఆ పార్టీకి మరో రెండు దశాబ్దాల పాటు ఓటు వేయరన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో   బీఆర్ఎస్ బ‌లోపేతం,  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ .  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను  ఈ సందర్భంగా అభినందించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న కేటీఆర్.. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై ఒకే సారి దాదాపు వెయ్యి రూపాలయలు పెంచడం అందులో ఒకటన్నారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  
బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
శర్వానంద్ (Sharwanand), రాజశేఖర్ (Rajasekhar) ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘బైకర్’ (Biker). ఈ  మోటోక్రాస్ స్పోర్ట్స్ డ్రామాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ వేదికపైకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఇండియా మూవీ చార్ట్స్‌లో నెం. 2 స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కథా నేపథ్యం: మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్‌గా కనిపిస్తాడు. తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) తో ఉన్న గ్యాప్, రేసింగ్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లు, తనను తాను నిరూపించుకోవడానికి వికాస్ చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఒకవైపు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, మరోవైపు ఒళ్లు గగుర్పొడిచే రేసింగ్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. హైలైట్స్: ఇండియన్ స్క్రీన్‌పై మోటోక్రాస్ రేసింగ్‌ను ఇంత సహజంగా, భారీ స్థాయిలో చూపించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా కోసం శర్వానంద్ ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. ఒక రేసర్‌కు కావాల్సిన బాడీ లాంగ్వేజ్‌ను ఆయన పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు. చాల కాలం తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి మెప్పించారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్లు సినిమాకు ఎమోషనల్ వెయిట్ ఇచ్చాయి. జిబ్రాన్ సంగీతం, యువరాజ్ సినిమాటోగ్రఫీ ఈ రేసింగ్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఓటీటీ రెస్పాన్స్: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కథనం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. రేసింగ్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డెప్త్ సినిమాను మిస్ చేయకుండా చూసేలా చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి థియేటర్లలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ‘బైకర్’, ఇప్పుడు ఓటీటీలో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.  
కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "బాలన్ - ది బాయ్ ". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ స్క్రిప్ట్ అందించగా, "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (Balan: The Boy) "బాలన్" సినిమా ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది. ఈ నెల 14న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బిజినెస్ వింగ్ అయిన మార్ష్ డు ఫిలింలో "బాలన్ - ది బాయ్ " స్క్రీనింగ్ జరగనుంది. తమ మూవీ కేన్స్ లో స్క్రీనింగ్ కానుండటంపై మూవీ మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ.. "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రపంచ సినిమాకు ఇళ్లు లాంటిది. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను నమ్ముతారు. మా "బాలన్ - ది బాయ్ " మూవీ అలాంటి నిజమైన మూవీ లవర్స్ ను హత్తుకుంటుంది. బాలన్ సినిమా చూస్తూ ప్రేక్షకులు అనుభూతికి లోనవుతారు. సినిమా చూశాక ఆ ఫీల్ ను తమతో పాటే తీసుకెళ్తారు. మనం ఎక్కడినుంచి వచ్చాం, ఎక్కడికి ప్రయాణిస్తున్నాం తెలుసుకోవాలనే తపనతో రూపొందించిన చిత్రమిది. ఇలాంటి భావోద్వేగాలను అనుభవించినా చెప్పేందుకు మాటలు దొరకని వ్యక్తి కోసం ఈ సినిమాను తెరకెక్కించాం." అన్నారు. ప్రొడ్యూసర్ వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ.. "మలయాళ చిత్ర పరిశ్రమ తమ కంటెంట్ తో ప్రపంచ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. మా "బాలన్ - ది బాయ్" సినిమా స్క్రిప్ట్ ను బలంగా నమ్మాం కాబట్టే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా మా సినిమా ఉంటుంది." అన్నారు. ప్రొడ్యూసర్ శైలజా దేశాయ్ ఫెన్ మాట్లాడుతూ.. "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం కేన్స్ కు వచ్చినప్పుడు నెక్ట్స్ టైమ్ నా సినిమాతోనే వస్తానని ప్రామిస్ చేసుకున్నా. ఇప్పుడు "బాలన్ - ది బాయ్"తో కేన్స్ కు రావడం సంతోషంగా ఉంది. మేము ఎంతగానో నమ్మకం పెట్టుకున్న "బాలన్ - ది బాయ్" సినిమా కేన్స్ లో ప్రదర్శితం కానుండటం గర్వంగా ఉంది. డైరెక్టర్ చిదంబరం విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. "బాలన్ - ది బాయ్ " ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే బ్యూటిఫుల్ ఫిల్మ్." అన్నారు.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Dragon), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon) గురించి రోజుకో క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రాబోతుండగా, అంతకంటే ముందే రెండు సెన్సేషనల్ విషయాలు లీక్ అయ్యాయి. స్పెషల్ సాంగ్? ప్రస్తుత ట్రెండ్ ప్రకారం భారీ పాన్ ఇండియా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కిర్రాక్ పుట్టిస్తున్నాయి. ‘డ్రాగన్’లో కూడా ఒక అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం ఒక స్టార్ హీరోయిన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. రవి బస్రూర్ అందించే ఊర మాస్ బీట్స్‌కు తారక్ వేసే స్టెప్పులు థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలుస్తోంది. షర్ట్‌లెస్ ఫైట్! సినిమాలోని అత్యంత పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఒక లీక్ బయటకు వచ్చింది. ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్‌లెస్(Shirtless)గా కనిపించబోతున్నారట. ఈ ఫైట్ సీక్వెన్స్‌ను ఒక బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత పవర్ ఫుల్ గా చిత్రీకరించనున్నట్లు టాక్. ఇప్పటికే తారక్ తన బాడీని రిప్డ్ లుక్‌లోకి మార్చుకునే పనిలో ఉన్నారని, ఆ ‘బీస్ట్’ అవతారం చూసి ఫ్యాన్స్ షాక్ అవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఆయన మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అంశాలు ఎన్నో ఉండనున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల కానుంది. ఇందులో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ మూవీ భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. అయితే ‘దేవర పార్ట్ 2’ (Devara 2) ఆగిపోయిందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'తో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల కూడా ఇటీవల బాలకృష్ణతో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. దీంతో ‘దేవర 2’ ఇక ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దేవర సీక్వెల్ నిలిచిపోయిందంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘దేవర 2’ ప్రాజెక్ట్ గురించి నెట్టింట ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో వాస్తవం లేదని, స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాలయ్య సినిమాను పూర్తి చేసిన తర్వాత కొరటాల ‘దేవర 2’ పనులపై దృష్టి పెట్టనున్నారట. అన్నీ కుదిరితే 2027 ప్రథమార్ధంలో ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.  పార్ట్ 1 క్లైమాక్స్‌లో వదిలిన చిక్కుముడులను పార్ట్ 2లో మరింత ఇంటెన్సిటీతో చూపించబోతున్నారు. ముఖ్యంగా దేవర, వర పాత్రల మధ్య సంఘర్షణ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం ‘దేవర 2’ ఆగిపోలేదు, ఆలస్యమవుతుంది అంతే. కావున అభిమానులు ఈ సీక్వెల్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.  
మ్యాచో స్టార్ గోపీచంద్ తన 34వ సినిమాను (Gopichand 34) ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంఛనంగా మొదలైంది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్, ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు షాట్ కు దిల్ రాజు దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దామోదర ప్రసాద్, రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ మునుపెన్నడూ చూడని రీతిలో కనిపించబోతున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఒక చిరుతపులి పర్వతంపై నిలబడి ఉన్న దృశ్యం సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెబుతోంది.  సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షామ్‌దత్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్స్ గా రామకృష్ణ-మోనిక వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భరత వర్ష' చిత్రంలో నటిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌తో పాటే ఈ #Gopichand34 షూటింగ్ కూడా సమాంతరంగా జరగనుంది. ఒక యాక్షన్ మాస్టర్ గోపీచంద్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   https://x.com/Theteluguone/status/2050841002123079705
విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శకుటుంబం: హౌస్ నెం. 47’ (AK 47) చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన హై-వోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. (Aadarsha Kutumbam House No 47) యాక్షన్ మోడ్‌లో వెంకీ మామ: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో కోసం అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి పూర్తిస్థాయి చిత్రం ‘ఆదర్శకుటుంబం’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన భారీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను మేకర్స్ తాజాగా పూర్తి చేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ కుమార్ నేతృత్వంలో కొన్ని రోజుల పాటు జరిగిన ఈ షూట్‌లో వెంకటేష్ పాల్గొని పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లలో మెరిశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇక కొన్ని టాకీ పార్ట్ సీన్లు మాత్రమే మిగిలి ఉండగా, త్వరలోనే సినిమా మొత్తం పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. థమన్ ఎంట్రీతో మారిన మ్యూజిక్: ఈ ప్రాజెక్టు మ్యూజిక్ విషయంలో ఒక ఆసక్తికర మార్పు చోటుచేసుకుంది. మొదట హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ బాధ్యతలను ఎస్.ఎస్. థమన్ స్వీకరించారు. త్రివిక్రమ్-థమన్ కాంబో అంటే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ కావడంతో, ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్, అందులో ఆయన కనిపించిన 'వేర్ వోల్ఫ్' (Werewolf) షేడ్స్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్? తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను అట్లీ సంప్రదించినట్లు తెలుస్తోంది. కథను కీలక మలుపు తిప్పే పాత్ర కావడంతో, దానికి అక్షయ్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే 'జవాన్' సినిమాతో హిందీ బెల్ట్‌లో అట్లీకి మంచి క్రేజ్ ఉంది, దానికి తోడు అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ తోడవ్వడంతో అక్షయ్ కూడా ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. షాకింగ్ కాంబినేషన్స్: కేవలం అక్షయ్ కుమారే కాకుండా, ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, ఇండియన్ స్క్రీన్‌పై ఇది అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుందనడంలో సందేహం లేదు.  ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అని, మైథాలజీ అంశాలు కూడా మిక్స్ అయి ఉంటాయని టాక్. దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.   
హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన ఒక వివాహ రిసెప్షన్ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ నారంగ్ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మాజీ దంపతులు నాగచైతన్య, సమంతలే. చైతన్య, సమంత విడిపోయిన తర్వాత సాధారణంగా ఒకే వేదికపై కనిపించడానికి ఇష్టపడరు. కానీ ఈ వేడుకకు ఇద్దరూ హాజరుకావడం గమనార్హం. నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి, కుటుంబ సభ్యులు నాగార్జున, అమలలతో ఈ వేడుకకు విచ్చేశారు. మరోవైపు సమంత కూడా తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ రిసెప్షన్‌లో సందడి చేశారు. విడాకుల తర్వాత తమ వ్యక్తిగత జీవితాల్లో స్థిరపడిన ఈ జంట, చాలా కాలం తర్వాత ఒకే ఈవెంట్‌లో తారసపడటం సినీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే వీరిద్దరూ నేరుగా మాట్లాడుకున్నారా లేదా అనేది తెలియనప్పటికీ, ఒకే చోట తమ కొత్త భాగస్వాములతో కలిసి కనిపించడం మాత్రం కెమెరా కళ్లకు చిక్కింది. గతంలో 'ఏమాయ చేశావే' సినిమాతో వెండితెరపై మాయ చేసిన ఈ జోడీ, వాస్తవ జీవితంలో కూడా ఒకటిగా మారి అందరినీ మురిపించారు. కొన్ని కారణాల వల్ల విడిపోయిన వీరు, ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. సమంత తన మెడపై ఉన్న 'YMC' టాటూను ఇప్పటికీ అలాగే ఉంచుకోవడం అభిమానుల దృష్టిని మరోసారి ఆకర్షించింది. తమ ప్రేమకు గుర్తుగా కాకుండా, కెరీర్ ప్రారంభించిన సినిమాపై గౌరవంతో ఆమె దానిని ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంతమంది దిగ్గజాలు ఉన్నప్పటికీ, మీడియా ఫోకస్ అంతా చై-సామ్ వైపే ఉండటం విశేషం. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ పరిణామంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగుతూ సంతోషంగా ఉండటం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శోభిత, రాజ్ నిడిమోరులతో కలిసి వారు దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన, ఇటీవల 'డెకాయిట్' (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో అలరించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన మంచి స్పందననే సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'డెకాయిట్' సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మే 8 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మంచి స్పందన లభించిన ఈ చిత్రం, నాలుగు వారాలకే ఓటీటీలో అలరించనుంది. కథా నేపథ్యం: ఈ సినిమా కథ హరిదాస్ (అడివి శేష్) చుట్టూ తిరుగుతుంది. ఒక హత్య కేసులో 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన హరిదాస్, కడప జైలు నుంచి మరో చోటికి మారుస్తున్న సమయంలో తప్పించుకుంటాడు. తనను జైలు పాలు చేసిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని హరి నిర్ణయించుకుంటాడు. అయితే ఆమెను కలిశాక హరిదాస్‌కు ఊహించని విషయాలు తెలుస్తాయి. అసలు వారిద్దరూ ఎందుకు విడిపోయారు? హరిదాస్ తన పగను తీర్చుకున్నాడా? లేదా అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ 'డెకాయిట్' సినిమాకు షానియల్ డియో దర్శకుడు. షానియల్ డియోతో కలిసి అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించారు. అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, వైభవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన వారు మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.  
ప్రస్తుతం టాలీవుడ్‌లో 'నందమూరి బాలకృష్ణ' (Nandamuri Balakrishna) పేరు ఒక సెన్సేషన్. వయసు పెరుగుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య కోసం.. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర చిత్ర పరిశ్రమల దర్శకులు, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఎనిమిది మంది దర్శకులు.. పది మంది నిర్మాతలు! ప్రస్తుతం బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. ఆయన కాల్షీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు ఎనిమిది మంది ప్రముఖ దర్శకులు బాలయ్య కోసం కథలను సిద్ధం చేసుకుని వేచి చూస్తున్నారు. వీరిలో టాలీవుడ్ దర్శకులతో పాటు ఇతర భాషల దర్శకులు ఉండటం విశేషం. కన్నడ, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ముగ్గురు క్రేజీ దర్శకులు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పక్కా యాక్షన్ స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దర్శకులే కాదు, బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయని నమ్ముతున్న పది మందికి పైగా నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ బాలయ్యతో భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారట. లైన్ లో క్రేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి స్క్రిప్ట్ లు రెడీ చేసే పనిలో ఉన్నారు. ఒకప్పుడు సీనియర్ హీరోల మార్కెట్ పడిపోతుందని భావించిన వారందరికీ తన సక్సెస్‌తో బాలయ్య గట్టి సమాధానం ఇచ్చారు. మాస్ పల్స్ తెలిసిన హీరో కావడంతో పాటు, అటు బుల్లితెరపై 'అన్‌స్టాపబుల్' షోతో యువతకు కూడా దగ్గరవ్వడం ఆయనకు ప్లస్ అయ్యింది. మరి గోపీచంద్ మలినేని, కొరటాల శివ ప్రాజెక్ట్ ల తర్వాత  బాలయ్య ముందుగా ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.  
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!