LATEST NEWS
సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు.  దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు.  ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. అలాగే బీజేపీ రక్తదాన శిబిరాల వంటి  సేవా కార్యక్రమాలు నిర్వహించినా నిర్వహించవచ్చు. అంతేనా అంటే బీజేపీ ముఖ్యనాయకుల నుంచి అంతే అనే సమాధానం వస్తోంది.  నిజంగా అంతే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  కానీ..  మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ.. అంటే గత పదేళ్లుగా జరుగుతున్నది అంతే కావచ్చు. కానీ..  ప్రధానిగా మోదీ జరుపుకునే  11వ పుట్టిన రోజుకు అంతకు మించిన ప్రత్యేకత, ప్రాధాన్యతా ఉంది. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీకి, 2025 సెప్టెంబర్ 17న 75 వంతాలు నిండుతాయి. ఆయన 76వ  వసంతంలోకి అడుగు పెడతారు. అంటేజజ  బీజేపీ అప్రకటిత  పదవీ విరమణ వయోపరిమితి  నియమం ప్రకారం అదే రోజున ప్రధాని మోదీ పదవీ విరమణ చేయవలసి ఉంటుంది.  అంటే రాజీనామా చేయవలసి ఉంటుంది.   అయితే.. బీజేపీ నాయకత్వం ఇప్పటికే  పార్టీ రాజ్యాంగంలో వయో పరిమితి నియమం ఏదీ లేదని ఒకటికి పది సార్లు స్పష్టం చేసింది. అలాగే.. మోదీ ఈ ఐదేళ్లే కాదు ఆ పై ఐదేళ్ళు (2029-2034) కూడా పదవిలో కొనసాగుతారని అమిత్ షా  సహా సీనియర్ నాయకులు వేర్వేరు సందర్భాలలో స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే, పార్టీ అగ్ర నేతలు  అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా.. వయోపరిమితి కారణంగానే క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారని.. నిజానికి, అప్పట్లో 75 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించింది కూడా  మోదీనే కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. స్వయంగా ఆయనే తీసుకువచ్చిన నియమాన్ని, నిబంధనను ఆయనే ఉల్లంగిస్తే ఎలా అనే ప్రశ్న కూడా   తెరపైకి వస్తూనే వుంది. అయినా..  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఇంత వరకు మోదీ రిటైర్మెంట్  గురించి సీరియస్  చర్చ జరిగిన సందర్భాలు లేవు. నిజానికి, ఇంతవరకు   ప్రధాని  మార్పు   సంకేతాలు రాజకీయ వాతావరణంలో  సంకేత మాత్రంగా అయినా కనిపించడం లేదు.  కానీ..  వారో వీరో ఇంకెవరో కాకుండా..  ఏకంగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  ఆర్ఎస్ఎస్  సర్ సంఘ చాలక్ మోహన్‌ భాగవత్‌’ వయోపరిమితి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నెల 9న  నాగాపూర్ లో సంఘ్ ప్రచారక్  మోరో పంత్ పింగ్లే  జీవిత చరిత్ర, పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ..  భాగవత్  రిటైర్మెంట్  ప్రస్తావన తెచ్చారు. ఎప్పుడో, మోరో పంత్ పింగ్లే  తన 75 వ పుట్టిన రోజు నాడు నాకు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మీరంతా నన్ను సత్కరించారు. కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పారంటే.. ఇక నీకు వయసైపోయింది, కాస్త పక్కకు జరుగు, మమ్మల్ని చేయనివ్వు అనే దాని అర్థం  అంటూ చేసిన సరదా వ్యాఖ్యను, మోహన్‌ భాగవత్‌  తనదైన శైలిలో ప్రముఖంగా ప్రస్తావించారు.  75 ఏళ్లు ఒంటిమీదకు వచ్చి శాలువా కప్పించుకున్నామంటేనే.. వయసు మీరిందనీ,  బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి  అని పింగ్లే అనేవారని చెప్పారు.  నిజానికి, మోదీ కంటే ఓ ఆరు రోజులు ముందే అంటే సెప్టెంబర్ 11న తన  75 పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్‌ భాగవత్‌ తన  రిటైర్మెంట్  గురించే వ్యాఖ్య చేశారో.. లేక మోదీకి రిటైర్మెంట్   సమయం దగ్గర పడిందని గుర్తు చేయడానికే ఆయన ఆ వ్యాఖ్య చేశారో తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్య  రాజకీయ, మీడియా వర్గాల్లో   సంచలనంగా మారింది.  ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు  ఆర్ఎస్ఎస్ అధినేత  ప్రధాని మోడీ పదవి నుంచి దిగిపోవలసిన సమయం వచ్చేసిందని పరోక్ష సంకేతం అందించారని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అద్వానీ, జోషీ, జస్వంత్‌ సింగ్‌లకు వర్తించిన నియమం  మోదీ కి ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు.  అయితే..  విపక్షాల విషయం ఎలా ఉన్నా మోదీ రిటైర్మెంట్  తీసుకునే అవకాశం ఉందా  అంటే..  అలాంటి ఆలోచనే లేదని, బీజేపీ  వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్‌ఎ్‌సఎస్‌  కీలక నేత దిలీప్‌ దేవధర్‌ కూడా అన్నారు. బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని ఐదేళ్ల క్రితమే మోహన్‌ భాగవత్‌ వివరణ ఇచ్చారని దిలీప్‌ దేవధర్‌ గుర్తుచేశారు.  అయితే..  కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ, పదేళ్ళలో తొలిసారిగా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యాలయానికి వెళ్లి  మోహన్ భాగవత్ సహా సంఘ్ పెద్దలతో ఏకాంత సమావేశాలు నిర్వహించారు. అప్పట్లోనే మోదీ రిటైర్మెంట్ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపధ్యంలో, మోహన్ భాగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే..  సెప్టెంబర్ 17 తర్వాత, ఏమి జరుగుతుంది,అంటే.. సంఘ్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు  సెప్టెంబర్ 17 తర్వాత ఏమి జరుగుతుంది ..సెప్టెంబర్ 18 వస్తుంది.. అంతకు మించి మరో మార్పు ఉండదని సెటైర్ వేశారు.  అయినా, సెప్టెంబర్ 17 వచ్చి పోయేవరకు  ఈ సస్పెన్స్ కొనసాగేలానే వుందని అంటున్నారు.
కడపలో మధ్యాహ్న భోజన పథకం కోసం దేశంలో మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. కడపమునిసిపల్(మెయిన్ )హైస్కూల్ ల్లో ఈ స్మార్ట్ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నిధులతో ఏర్పాటైంి.  డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్నా బడి  భోజనం పథకంలో భాగంగా ఈ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు.   ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి స్మార్ట్ కిచెన్  ద్వారా రుచికరమైన,శుబ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది.  మొదటి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలలో భాగంగా కడప మునిసిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్   విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే  విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  ఈ పాఠశాలలో కట్టెల పొయ్యి మీద భోజనాలు చేసి పిల్లలకు వడ్డించడాన్నిగమనించిన డిప్యూటీ సీఎం మధ్యాహ్న భోజనాన్ని  శుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో వండించాలన్న ఉద్యేశంతో  తన సొంత నిధులు అందించారు.ఆ నిధులతో స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది.    ఈ ఆధునిక వంటశాల ద్వారా ప్రస్తుతం 12 పాఠశాల లోని దాదాపుగా 2,200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం అత్యంత పరిశుభ్రం గా రుచికరంగా, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.   స్టార్ హోటల్ కిచెన్ తరహాలో  ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్ లో  పని చేస్తున్న వంట కార్మికులు, డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాల తయారీ చేపడుతున్నారు. ఆహార రవాణా వాహన ట్రాకింగ్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు.స్మార్ట్ కిచెన్ లో బల్క్ కుకింగ్ ఏరియా,స్టోరేజ్  రూమ్, గ్రైండింగ్ ఏరియా, వెజిటబుల్ కటింగ్ ఏరియా, ఫ్రూట్ ఆనియన్ స్టోర్ , పాట్ వాష్ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలతో పాటు స్మార్ట్ కిచెన్ భద్రత కట్టు దిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రతి కిచెన్ కు నుండి 3 కిలో వాట్ల సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లు ఏర్పాటు చేశారు.  .మిగిలిపోయిన భోజన పదార్థాలు మరియు కూరగాయల వ్యర్థాలను  బయో డిగ్రేషన్ ద్వారా మిథైన్ గ్యాస్ గా మార్చి వంటకు ఉపయోగిస్తున్నారు. వంట వండే సిబ్బందికి న్యూట్రిషనలిస్టు ద్వారా శిక్షణ ఇప్పిచ్చి వంట వండే విధానం లో న్యూట్రిషన్ విలువలు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థులకు ఒక్కోరోజు ఒక్కో రకమైన మెనూలో కూడిన బోజనాలు అందిస్తున్నారు.  సోమవారం తెల్లన్నం, కూరగాయల కూర, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి అందిస్తున్నారు. మంగళవారం: పులగం,నిమ్మకాయల/ చింతపండు పులిహోర, పల్లి చట్నీ, గుడ్లు, రాగిజావ,   ఇక బుధవారం  తెల్లన్నం, కూరగాయల సాంబార్, ఉడకపెట్టిన గుడ్లు, చిక్కి అందిస్తున్నారు.  గురువారం  కూరగాయల అన్నం, గుడ్ల కూర, రాగిజావ, అలాగే శుక్రవారం  తెల్లన్నం ఆకుకూర పప్పు ఉడకపెట్టిన గుడ్లు, చిక్కిఅందిస్తున్నారు. ఇక శనివారం  తెల్లన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి రాగి జావ  అందిస్తున్నారు
  కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  క్లిఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేసి.. అది నకిలీ ఇ-మెయిల్‌గా తేల్చారు. బాంబు బెదిరింపు తర్వాత సీఎం నివాసాన్ని డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాం.   కానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనబడలేదు’’ అని పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపుల వ్యవహారంతో తాజాగా వచ్చిన ఇ-మెయిల్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు  
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చి పరలోకాలకు తరలిపోయిన నటుడు కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తమ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అలాగే భారత ప్రధాని నరేంద్రమోది తన సంతాప సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంపారు.  ‘‘కోట శ్రీనివాసరావుగారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి’’ అంటూ మోదీ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. 1999 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు కోట శ్రీనివాసరావు. 1999 నుంచి 2004 వరకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందించారు. 
బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావుగారు ఇక లేరు అనే వార్త నన్నెంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఇద్దరం ఒకేసారి సినిమా కెరీర్‌ ప్రారంభించాం. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్‌ అయినా, సీరియస్‌ విలన్‌ అయినా, సపోర్టింగ్‌ క్యారక్టర్‌ అయినా ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్‌గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. శ్రీకోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను.                                                                                                                                             .. చిరంజీవి ............................................................................... ‘తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోట శ్రీనివాసరావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష... యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్‌ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా%ౌ% ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు. శ్రీ కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ప్రాణం ఖరీదుతోనే శ్రీ కోట గారు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్‌, అత్తరింటికి దారేది, గబ్బర్‌ సింగ్‌ తదితర చిత్రాల్లో కలసి నటించాము.  శ్రీ కోట శ్రీనివాసరావు గారు డైలాగ్‌ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. శ్రీ కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.                                                                             ..పవన్‌ కళ్యాణ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి ............................................................................................. ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.                                                                                                                        .. నందమూరి బాలకృష్ణ
1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ నట జీవితాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా అవి నటుడిగా ఎదిగేందుకు ఉపయోగపడలేదు. ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత 1985లో విడుదలైన వందేమాతరం, ప్రతిఘటన చిత్రాల్లో కోట పోషించిన పాత్రలతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయారు. ముఖ్యంగా ప్రతిఘటనలో చేసిన మినిస్టర్‌ కాశయ్య క్యారెక్టర్‌కు విపరీతమైన పేరు వచ్చింది. తండ్రిగా, తాతగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా, కమెడియన్‌గా.. ఇలా ఏ పాత్రనైనా తనదైన స్టైల్‌లో అద్భుతంగా పోషించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్న నటుడు కోట. ఒకప్పుడు కామెడీ విలన్‌ అంటే నాగభూషణం గుర్తొచ్చేవారు. ఆ స్థానాన్ని భర్తీ చేసి ఆ తరహా క్యారెక్టర్లలో సైతం మెప్పించారు కోట. ఇక అన్నిరకాల పాత్రలు పోషించడంలో ఎస్‌.వి.రంగారావు, రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ తర్వాత ఆ స్థానం కోట శ్రీనివాసరావుదే.  తను ఏ పాత్ర పోషించినా అది రెగ్యులర్‌ క్యారెక్టర్‌లా కాకుండా విభిన్నంగా ఉండాలనుకుంటారు కోట. డైరెక్టర్‌ చెప్పిన దాన్ని ఎంతో ఇంప్రవైజ్‌ చేసి ఆ క్యారెక్టర్లకు వన్నె తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏ తరహా క్యారెక్టర్‌ అయినా దానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌, స్లాంగ్‌, ఏదో ఒక ఊతపదం జొప్పించి ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయేలా చేయడం కోటకు వెన్నతో పెట్టిన విద్య. ‘అందరికీ పెడతాండ దండం’, ‘ఈ ఫోనెవడు కనిపెట్టాడ్రా బాబూ..’, ‘థాంక్స్‌’, ‘నాకేంటి.. మరి నాకేంటి..’ వంటి డైలాగ్స్‌ జనం మధ్యలో ఇప్పటికీ మనకి వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని మామూలు మాటల్ని కూడా తన విచిత్రమైన స్లాంగ్‌తో చెప్పి ప్రేక్షకుల్ని నవ్వించారు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్‌లో ఆయన చెప్పిన రామాయణం ఒకప్పుడు క్యాసెట్ల రూపంలో విపరీతంగా పాపులర్‌ అయింది. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో కూడా దాన్ని వాడారు. అలాగే చాలా సినిమాల్లో తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్‌కి మంచి పేరు వచ్చింది.  ప్రతిఘటనలో మినిస్టర్‌ కాశయ్యగా, అహనా పెళ్ళంటలో లక్ష్మీపతిగా ప్రేక్షకుల్ని మెప్పించిన కోట.. గణేశ్‌లో సాంబశివుడుగా, గాయంలో గురు నారాయణగా  ప్రేక్షకుల్ని భయపెట్టారు. మనీ చిత్రంలో అల్లాదీన్‌గా, హలోబ్రదర్‌లో తాడి మట్టయ్యగా, మామగారు చిత్రంలో పోతురాజుగా ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించారు. మధ్య తరగతి తండ్రిగా, అల్లరి చేసే తాతగా, తాగుబోతుగా.. ఇలా ఏ పాత్ర చేసినా ఆ వేరియేషన్‌ చూపించడంలో కోట చాలా దిట్ట. సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్స్‌ కావాలంటే వెరైటీగా ఉంటుందని ఇతర భాషా నటుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. కానీ, తెలుగు విలన్స్‌ ఇతర భాషల్లో నటించి పేరు తెచ్చుకోవడం అనేది చాలా చాలా అరుదు. కానీ, కోట శ్రీనివాసరావు ఆ ఘనత సాధించారు. తమిళ్‌, కన్నడ, హిందీ సినిమాల్లో తన విలనీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తమిళ్‌లోనే 30 సినిమాలు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు విలన్‌ తమిళ్‌లో అన్ని సినిమాలు చెయ్యలేదు. 45 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో 750కి పైగా సినిమాలు చేసి నటుడుగా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు తను చేసిన క్యారెక్టర్లతో ఎప్పటికీ జీవించే ఉంటారు. 
తెలుగు సినిమాలకు సంబంధించి కొన్ని కాంబినేషన్స్‌ రిపీట్‌ అవ్వడం అనేది చాలా తక్కువ. అవి ఎవర్‌గ్రీన్‌గా ఉంటాయి. కామెడీ పాత్రల విషయానికి వస్తే.. పాత రోజుల్లో రేలంగి, రమణారెడ్డి కాంబినేషన్‌, ఆ తర్వాత రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్‌.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. ఆ తర్వాతి రోజుల్లో అలాంటి గొప్ప కాంబినేషన్‌గా కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌ జంట నిలిచింది. వీరిద్దరూ స్క్రీన్‌ మీద కనిపించారంటే నవ్వులే నవ్వులు. ఒక దశలో వీరిద్దరూ లేని సినిమా ఉండేది కాదు. అంతగా పాపులర్‌ అయ్యారిద్దరూ.  కోట శ్రీనివాసరావు కామెడీతోపాటు విలనీ కూడా అద్భుతంగా పోషించగలరు. అందులోనే విలనీ కామెడీతో కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించారు. ఆయనకు బాబూమోహన్‌ తోడవడంతో ఆ కాంబినేషన్‌కి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. వీరిద్దరూ కలిసి 60కి పైగా సినిమాల్లో నటించారు. వాటిలో ఎక్కువ శాతం సూపర్‌హిట్‌ సినిమాలే వుండడం విశేషం. వీరి కాంబినేషన్‌ అంతగా జనంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం వారి కామెడీ టైమింగ్‌. వీరిద్దరి కామెడీని ఎంజాయ్‌ చేసేందుకు ఆ సినిమాలకు రిపీట్‌ ఆడియన్స్‌ కూడా ఉండేవారు. కోట, బాబుమోహన్‌ కలిసి నటించిన తొలి సినిమా బి.గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలిరాజా’. ఇక అప్పటి నుంచి ఈ కాంబినేషన్‌కి తిరుగులేదు అనిపించేలా పోటీపడి మరీ నటించారు. మామగారు, చినరాయుడు, సీతారత్నంగారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాల్లో ఈ జంట చేసిన కామెడీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. వీరి తర్వాత మళ్ళీ అలా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కాంబినేషన్‌ మరొకటి రాలేదనే చెప్పాలి. 
టాలీవుడ్‌లో కామెడీ విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులు మెచ్చిన నటుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట.. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మరణవార్త.. ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. నటుడుగానే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ షాక్‌కి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.  నవరసాలూ పోషించగల నటులు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. పాతతరం నుంచి ఇప్పటివరకు అలాంటి కొందరు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1980వ దశకంలో అలాంటి ఓ నటుడు పరిచయమయ్యారు. అతనే కోట శ్రీనివాసరావు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ నటుడిగా ఎదిగారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించి చాలా ఆలస్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు నేపథ్యం ఏమిటి, సినిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన పోషించిన పాత్రల ద్వారా ఎలాంటి పేరు తెచ్చుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్‌. తండ్రిలాగే తను కూడా డాక్టర్‌ అవ్వాలని చిన్నతనంలో అనుకున్నారు కోట. కానీ, నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల నటనవైపే మొగ్గు చూపారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే తరచూ నాటకాలు వేసేవారు. ఆ సమయంలో సినిమా రంగానికి రావాలన్న ఆలోచన ఆయనకు లేదు. 1977లో కోట, అతని మిత్రులు కలిసి ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. నిర్మాత క్రాంతికుమార్‌కి ఆ నాటకం బాగా నచ్చింది. దాన్ని సినిమాగా తియ్యాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాటకంలో నటించిన వారందర్నీ తన సినిమా కోసం తీసుకొని ‘ప్రాణం ఖరీదు’ పేరుతోనే ఆ చిత్రాన్ని నిర్మించారు క్రాంతికుమార్‌. అలా ఆ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోట. ఈ సినిమా ద్వారానే మెగాస్టార్‌ చిరంజీవి నటుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో కోట చాలా చిన్న క్యారెక్టర్‌ చేశారు. ఆ తర్వాత అమరజీవి, బాబాయ్‌ అబ్బాయ్‌ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆ సినిమాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు.  హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘మీరైతే ఏం చేస్తారు?’ అనే నాటకాన్ని ప్రదర్శించారు కోట బృందం. ఆ నాటకాన్ని దర్శకుడు టి.కృష్ణ చూశారు. అందులో కోట నటన ఆయనకు బాగా నచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత తను రూపొందిస్తున్న ‘వందేమాతరం’ చిత్రం కోసం కోటను కాంటాక్ట్‌ చేసి ఆయనకు ఒక మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. అది ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరం టి.కృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలో చేసిన కాశయ్య పాత్ర కోట నట జీవితాన్నే మార్చేసింది. ఒక్కసారిగా ఆయన ఇమేజ్‌ను పెంచేసింది. దాంతో వరసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్ళంట’ చిత్రం కోటకు మరింత పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత కామెడీ విలన్‌గా కూడా తన సత్తా చూపించారు. ఎంతలా అంటే కొన్ని సినిమాలు కోట శ్రీనివాసరావు ఉండడం వల్లే హిట్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  తెలుగులోనే కాదు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. తెలుగులో ఆయన నటించిన సినిమాల్లో చిత్రం భళారే విచిత్రం, ఆమె, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్‌, ఆ నలుగురు.. ఇలా చెప్పుకోదగిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇవివి సత్యనారాయణ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో కమెడియన్‌గా మంచి పాత్రలు పోషించారు కోట. తన నటనకుగాను 9 సార్లు ఉత్తమ విలన్‌గా, కమెడియన్‌గా, సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారం కూడా కోటను వరించింది.  వ్యక్తిగత జీవితానికి వస్తే.. సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ చరుకుగా పాల్గొన్న కోట శ్రీనివాసరావు.. 1999లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1966లో కోట వివాహం రుక్మిణితో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు కోట ప్రసాద్‌ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు కూడా నటుడే. ఎన్నో సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించారు. 45 సంవత్సరాల తన సినిమా కెరీర్‌లో 750కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు కోట శ్రీనివాసరావు. ఆయన నటించిన చివరి సినిమా 2023లో వచ్చిన సువర్ణ సుందరి. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
  2003లో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఈ 22 ఏళ్లలో 21 సినిమాలు చేశాడు. అందులో ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేయలేదు. అలాంటిది తన నెక్స్ట్ మూవీలో ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది.   అల్లు అర్జున్ తన 22వ సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో బన్నీ నాలుగు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారుల పాత్రలలో అల్లు అర్జున్ సందడి చేయనున్నాడని సమాచారం. ఇంతవరకు ద్విపాత్రాభినయమే చేయని బన్నీ.. ఇప్పుడు అట్లీ సినిమాలో ఏకంగా నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నాడనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.   కాగా, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే పేర్లు లాక్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ నాలుగు పాత్రలు చేయనుండటం, ఐదుగురు హీరోయిన్లు ఉండటం చూస్తుంటే.. అట్లీ ఏం ప్లాన్ చేశాడా అనే ఆసక్తి కలుగుతోంది.  
  నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే చంద్రబాబు ముందే ముఖ్యమంత్రి కాగా, వైఎస్సార్ మాత్రం ఆలస్యంగా అయ్యారు. స్నేహితులు కంటే కూడా.. రాజకీయ ప్రత్యర్థులుగానే వీరు ఎక్కవ మందికి తెలుసు. అలాంటిది వీరి స్నేహం నేపథ్యంలో ఒక సిరీస్ కి శ్రీకారం చుట్టారు ప్రముఖ దర్శకుడు దేవ కట్టా. మయసభ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.   ఇద్దరు మంచి స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులు ఎలా అయ్యారు అనే పాయింట్ తో మయసభ తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఆర్సీఆర్ గా చూపించారు. పార్టీలో ఆర్సీఆర్ భార్య సుశీల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ 160 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసినట్లుగా టీజర్ ప్రారంభమైంది. అదే సమయంలో రెడ్డికి నాయుడు ఫోన్ చేసి సలహా అడిగినట్లుగా చూపించడం ఆసక్తికరంగా ఉంది. "ఇది చావో రేవో అర్థంకావట్లేదు రెడ్డి. స్నేహితుడిగా ఒక మాట చెప్పు .. ఈ ఉచ్చు నుంచి బయటపడతాను అంటావా?" అని నాయుడు అడగగా.. "ఈరోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేవరకు వాడుతూనే ఉంటా" అని రెడ్డి చెప్తాడు. అలాగే "పిల్లనిచ్చిన మామతోనూ నీకోసం పోరాడుతున్నా" అని నాయుడు అనగా.. "ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు.. యుద్ధం నీ ధర్మం" అని రెడ్డి చెప్తాడు. రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో స్నేహితులిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళు అన్నట్టుగా టీజర్ చూపించారు. ఇక టీజర్ చివరిలో లారీలో వెళ్తున్న నాయుడు, రెడ్డి మధ్య జరిగే సంభాషణ బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. "అరక దున్నే కులంలో పుట్టినోడివి నీకెందుకు రాజకీయం" అని నాయుడిని రెడ్డి ఎగతాళి చేస్తాడు. దానికి కౌంటర్ అన్నట్టుగా "వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి.. నీకందుకు వైద్యం" అని నాయడు గట్టిగా నవ్వేస్తాడు. రెడ్డి కూడా నవ్వుతారు.   రాజకీయ నాయకుల గురించి సినిమా అంటే.. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేసి చూపించడం జరుగుతుంటుంది. దాంతో విమర్శలు వస్తుంటాయి. అయితే మయసభ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. కాగా, ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.  
The teaser of VISA… Vintara Saradaga is now out and it hits all the right notes with its vibrant, relatable and quirky tone. Set in the USA, the film promises to be a rollercoaster of emotions as it explores the journeys of Telugu students who step into a new world chasing dreams only to find friendship, love, chaos and unexpected challenges. A unique highlight of the teaser is the hero’s hobby for podcasting, which becomes his personal outlet while navigating life abroad adding a refreshing, creative layer to the character and modern student experiences. Ashok Galla and Sri Gouri Priya headline this youthful entertainer and seem to be perfectly cast their chemistry adds charm and authenticity to the film’s emotional graph. Also featuring Rahul Vijay, Shivathmika Rajasekhar, and the ever-funny Harsha Chemudu, the cast comes together to reflect the lives of a generation navigating life away from home.   Marking the directorial debut of Udbhav Raghu, VISA brings a refreshing voice to Telugu cinema. His storytelling brings together romance, drama, and slice-of-life moments that feel rooted yet contemporary.The teaser is further elevated by a pulsating background score from music director Vijai Bulganin, offering a sneak peek into the musical heartbeat of the film’s world. With rich production values, picturesque visuals and a vibrant setting in the USA, the film promises a visually appealing and technically polished cinema experience. Film is produced by S Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, VISA promises to be a fun-filled new-age entertainer that connects with youth and families alike. Get ready to board this journey ~ VISA  is coming soon with full-on vibes!  
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భాగస్వామి కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పటికీ కొంతమందికి వారి హృదయాలను ముక్కలు చేసే భాగస్వాములు  జీవితంలోకి వస్తుంటారు.  ఇలాంటి పరిస్థితిలో హృదయంతో పాటు, మనస్సును కూడా  చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు, భాగస్వామి సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు తప్పా, ఒప్పా అనే విషయం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది.  చాలా సార్లు ప్రేమ గా ఉన్నప్పుడు ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా సరే.. ఆ తప్పులను  విస్మరిస్తుంటారు. అలా తప్పులను పట్టించుకోకపోవడం అనేది సరైనదే.. కానీ అన్నిసార్లు అది సరైనది కాదు.  మగవాళ్లలో ఉండే మూడు లక్షణాలు పైకి చెప్పుకొన్నంత సాధారణమైని కావు. ఇవి అమ్మాయిల జీవితాలను నరకప్రాయంగా మారుస్తాయి.  అబ్బాయిలలో ఉండే అలాంటి లక్షణాలు ఏంటి తెలుసుకుంటే.. నియంత్రణ.. కొంతమంది అబ్బాయిలు నియంత్రణ స్వభావం కలిగి ఉంటారు. వారు ప్రతి విషయంలోనూ భార్యలను  నియంత్రించాలని కోరుకుంటారు. ఇది అబ్బాయిలలో పెద్ద చెడు లక్షణం.  భర్త భార్యను   ప్రతిదానిలోనూ నియంత్రిస్తుంటే..  ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? ఇలాంటివి అనిపిస్తుంటే అప్పుడు  అమ్మాయిల ఆలోచన  ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా  అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇలా  నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, అది  బలవంతం. అలాంటి భాగస్వాములు భార్యల నమ్మకాన్ని నాశనం చేస్తారు.  దీని కారణంగా  క్రమంగా తమను తాము కోల్పోయామని అమ్మాయిలు బాధపడతారు. టే, ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా మీరు అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ప్రకృతిని నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, బలవంతం. అలాంటి భాగస్వాములు మీ విశ్వాసాన్ని నాశనం చేయవచ్చు, దీని కారణంగా మీరు క్రమంగా కోల్పోయినట్లు అనిపించడం ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ తాము సరైనవారని నిరూపించుకునే అలవాటు.. అబ్బాయిలు ఏ విషయంలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, వారివైపు ఎలాంటి తప్పిదం ఉన్నా సరే.. వారు ఏ పోరాటంలోనైనా, చర్చలోనైనా లేదా సంభాషణలోనైనా తమ తప్పులను చూడరు. వారు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అలాంటి వ్యక్తులు తమ సొంత మాటలను మాత్రమే సరైనవిగా భావిస్తారు.  వాటిపై చర్య తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులతో జీవితం నరకం.  అలాంటి వ్యక్తులు మానసికంగా పరిణతి చెందరు. అలాంటి వ్యక్తితో జీవించడం చాలా నిరాశకు గురి చేస్తుంది. అమ్మాయిలు కోరుకునే అందమైన జీవితం ఇవ్వడంలో ఇలాంటి అబ్బాయిలు కంప్లీట్ గా ఫెయిల్ అవుతారు. అలాంటి వ్యక్తి  మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అతిగా అనుమానించే అబ్బాయిలు.. భార్యలను అనుమానించే భర్తలు చాలానే ఉంటారు.  ఇలా అతిగా అనుమానించే భర్తలు భార్యలకు నరకం పరిచయం చేస్తారు. భాగస్వామి గురించి కొంచెం ఆందోళన చెందడం సరే, కానీ ప్రతిదానిపైనా సందేహం లేదా అసూయ కలిగి ఉండటం చాలా తప్పు. అలాంటి అబ్బాయిలకు తమ భాగస్వామి స్నేహంతో సమస్యలు మొదలవుతాయి.  చేసే ప్రతి పనికి  అనుమానంగా చూస్తారు. అలాంటి సంబంధం నెమ్మదిగా పాయిజన్ గా  మారుతుంది.                                *రూపశ్రీ.  
  ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం  ఉద్దేశ్యం ప్రపంచంలోని జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం. 2025 నాటికి ప్రపంచ జనాభా 806.19 కోట్లు దాటిందని అంచనా. ఐక్యరాజ్యసమితి 1989లో ఈ దినోత్సవాన్ని  ప్రకటించింది. కానీ దీనిని మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జూలై 11, 1990న జరుపుకున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం  అంటే   జనాభా లెక్కలను ప్రజలకు తెలియజేయడమే కాదు, పెరుగుతున్న జనాభా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం,  వాటికి పరిష్కారాలను కనుగొనడం.  ప్రపంచ వ్యాప్తంగా జనాభా విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటున్నాయి.  భారతదేశ జనాభా గురించి, పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంటే.. ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవ వేడుకలు 1990 జూలై 11న ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం పాలక మండలి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రారంభించింది. 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రకటించింది. ఈ రోజు అంటే జూలై 11, 1987న ప్రపంచ జనాభా సంఖ్య 5 బిలియన్లు దాటినప్పుడు ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే సూచనను మొదట డాక్టర్ కె.సి. జకారియా ఇచ్చారు.   2025 ప్రపంచ జనాభా దినోత్సవం  థీమ్.. ఈసారి 2025 ప్రపంచ జనాభా దినోత్సవం  ఇతివృత్తం, యువతకు న్యాయమైన,  ఆశాజనకమైన ప్రపంచంలో తమకు నచ్చిన కుటుంబాన్ని సృష్టించడానికి సాధికారత కల్పించడం. భారతదేశ జనాభా..    ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2025 నాటికి భారతదేశ జనాభా 1,463.9 మిలియన్లుగా ఉండే అవకాశం ఉంది.  భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. నివేదికల ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో ఈ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం  అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా,  ఇథియోపియా ఉన్నాయి. టాప్ 10 దేశాలు ఇవే..   1. భారతదేశ జనాభా (అంచనా) - 1.46 బిలియన్ 2. చైనా జనాభా - 1.42 బిలియన్ 3. అమెరికా జనాభా - 347 మిలియన్లు   4. ఇండోనేషియా జనాభా - 286 మిలియన్లు 5. పాకిస్తాన్ జనాభా - 255 మిలియన్లు 6. నైజీరియా జనాభా - 238 మిలియన్లు 7. బ్రెజిల్ జనాభా - 213 మిలియన్లు 8. బంగ్లాదేశ్ జనాభా - 176 మిలియన్లు 9. రష్యా జనాభా - 144 మిలియన్లు 10. ఇథియోపియా జనాభా - 135 మిలియన్లు                                      *రూపశ్రీ.
విజయం సాధించాలంటే ఎలాంటి మనస్తత్వం వుండాలి? వ్యక్తి ఏరకంగా ఆలోచిస్తే గెలుపు పొందగలడు? అతనిలో ఎలాంటి భావనవుండాలి? ఈ విషయాల గురించి ఒక్కొక్కరు ఒకో విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతారు. అయితే జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి, ఎంతో పరిణితి కలిగిన వ్యక్తి అయితే దానికి చెబుతున్న వివరణ సరైనదేనా కాదా అని చెప్పగలుగుతారు.  ఒకానొకప్పుడు ఒక ఆంగ్ల దినపత్రిక గెలుపుకూ ఓటమికీ తేడా ఎంత??  అనే విషయం గురించి జరిగిన సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ వ్రాసినవారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దానికోసం ఎంతోమంది ఎన్నో విషయాలను కథలుగా రాసి పంపారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు రాసిన కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. ఆ రెండు కథలలో ఒక కథను మనం చదివితే మనకు గెలుపు, ఓటమి గురించి ఓ నిర్ధిష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడుతాయి.  ఒక నట్టనడి సముద్రంలో ఒక ఓడ మునిగిపోయింది. అక్కడ అందరూ తమని తాము కాపాడుకోవడానికి అందులో ఏర్పాటు చేసిన లైఫ్ బోట్ లను, చిన్న పడవలను ఉపయోగించుకుంటున్నారు. అవి కొద్దిమొత్తమే ఉండటంతో ఆ ఓడలో ఉన్న అందరికీ అవి సరిపోలేదు. దాంతో ఎంతోమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సముద్రపు నీళ్లలో ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. సముద్రపు ఒడ్డు ఎంత దూరంలో ఉందొ తెలియకపోయినా ఆశతో ఈదుకుంటూ పోతున్నారు.   ఐదుగురుమాత్రం ఎలాంటి రక్షణ లేకుండా సముద్రంలో  ఈదుతూ వున్నారు. వారికి జీవితం మీద ఆశ వారిని అలా ఈదేలా చేస్తోంది. ఒడ్డు అనేది వారికి వందల మైళ్ళ దూరంలో ఉంది. వారిలో నలుగురికి నిరాశ ఏర్పడింది. ఆఖరుకు మొసళ్ళకు ఆహారం కావలసివస్తుందే అని ఒకడు, ఈనీటిలో చావాలని భగవంతుడు రాసిపెట్టాడని మరొకడు, భార్యాపిల్లలు ఆఖరు క్షణంలో దగ్గరలేక పోయారే అని ఇంకొకడు, తన బ్యాంకులో డబ్బు ఖర్చు చేయకపోతినే అని మరొకడు, ఇలా వాళ్ళకళ్ళముందు తాము అనుభవించని సంతోషాలు, సుఖాల గురించి గుర్తు తెచ్చుకుని బాధపడసాగారు. నలుగురూ తామిక జీవించే ఆశలేదని మనస్సులో నమ్మకానికి వచ్చారు. ఆఖరుకు తమకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం భగవంతుడే అని ఆ భగవంతుని నిందించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి మనస్సులో బలహీనత వచ్చిందో అప్పటినుంచీ వాళ్లు సరిగా ఈదలేక మరణించారు. అయితే ఆ ఐదో వ్యక్తిమాత్రం “నేను చావను. భగవంతుడు నన్ను అనవసరంగా సృష్టించాడంటే నమ్మను. నేను బ్రతికి తీరాలి" అంటూ శక్తినంతా కూడగట్టుకొని ఈదడం ప్రారంభించాడు. అతడలా ఈడుతూ ఉన్నప్పుడు దృఢనిశ్చయం లేని ఆ నలుగురూ మరణించిన ఐదు నిముషాలకే ఒక విమానం అటు రావడం, దానిలోనివారు ఈదుతున్న వ్యక్తిని చూసి రక్షించడం జరిగింది! ఓడ మునుగుతున్నపుడు కెప్టెన్ వైర్ లెస్ ద్వారా చేసిన విజ్ఞప్తి వలన ఆ విమానం అక్కడికి వచ్చిందని అతడు తర్వాత తెలుసుకున్నాడు. మరణించిన నలుగురిని గుర్తు చేసుకొని విజయానికీ ఓటమికీ తేడా ఐదు నిముషాలని అతడు చెబుతాడు. ఇదీ ఓ కథ. మనిషి జీవితంలో విజయం కోసం పోరాడుతూ మధ్యలో ఏదో నిరాశను తెచ్చుకుని దానికారణంగా పోరాటాన్ని అపకూడదని చెప్పే కథ.                                ◆నిశ్శబ్ద.
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.   వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.  దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో  వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే..  ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు,  శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం,  వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన,  కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది,  గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా  అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే,  ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట,  నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్‌నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు  తీసుకోవాలి.  తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం,  నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి.   అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్,  వాటర్ బాటిల్ ఉండాలి.  మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..