LATEST NEWS
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే మెగా డీఎస్సీ నిర్వహణపై  మంత్రి నారా లోకేష్  స్పష్టత ఇచ్చారు. గత కొన్ని నెలలుగా  వైసీపీ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై చేస్తున్న ఆరోపణలను   తీవ్రంగా ఖండించడమే కాకుండా,  సభకు రాకుండాబయట వైసీపీ  లేవనెత్తిన ప్రతి అనుమానానికీ, సవాల్ కూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సభలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇకనైనా వైసీపీ విమర్శలు, ఆరోపణలూ మానుకుని సభలో చర్చకు రావాలన్నారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు   విక్రమ్ పోలా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  వైసీపీ తీరు చూస్తుంటే.. ఇటీవల జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లలో  కొన్ని టీమ్ లు టోర్నీ ఆరంభానికి ముందు దూకుడు ప్రదర్శించి వాస్తవంగా మ్యాచ్ వచ్చేసరికి చతికిల బడినట్లుగా ఉందన్నారు.  మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ చేసిన, చేస్తున్న ఆరోపణలు, అనుమానాలను లోకేష్ ప్రస్తావించి క్లారిటీ ఇచ్చారు. దీంతో కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు.  డీఎస్సీ విషయంలో వైసీపీ ఆరోపణల్లో పస లేదని లోకేష్ వివరణతో తేటతెల్లమైందన్నారు. ఇప్పటికే డీఎస్సీ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని విక్రమ్ పోలా అన్నారు. ఇప్పుడు ఇక లోకేష్ వివరణతో.. వైసీపీ ఇకపై డీఎస్సీ విషయంలో ఆందోళనలు చేయడం సాధ్యం కాదన్నారు. అందకే మండలిలో అచ్చెంనాయుడు బొత్సపై అనుచిత వ్యాఖ్యలు చేశరంటూ చేసిన ఆరోపణలు గుప్పిస్తూ ఎదురుదాడికి దిగిందన్నారు.  డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆందోళన దొంగేదొంగ అని అరిచినట్లుగా ఉందని వైసీపీ హయాంలో గ్రూప్ వన్ అవకతవకలపై కోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తును ప్రస్తావించారు. వైసీపీ తీరు ప్రజలకు కూడా అర్థమైందని విక్రమ్ పోలా అన్నారు.  విక్రమ్ పోలా ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ లో వీక్షించండి  MegaDSC, NaraLokesh, NaraLokeshAPAssemblySpeech, APMegaDSCClarification, YCPvsTDPMegaDSC. AP Assembly Meetings
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొడుకు జోగి రాజీవ్ తన తండ్రిపై తిరగబడినట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జోగి రాజీవ్ వివాహం, ఆ తదనంతర పరిణామాలపై దాఖలైన కేసు ఆధారంగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అంశాలకు ఈ వీడియోలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ విషయంపై  సీనియర్ జర్నలిస్ట్  డీవీ శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.    మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియో.. ఆమె ఫిర్యాదుకు బలం చేకూర్చడమే కాకుండా.. కేసు తీవ్రతను తేటతెల్లం చేశాయి. ఆమె ఫిర్యాదు, తాజాగా విడుదల చేసి తాజా వీడియో ఆధారాలు సమస్య తీవ్రతను స్పష్టం చేస్తున్నాయని డీవీ శ్రీనివాస్ అన్నారు. లీక్ అయిన వీడియోలో రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ ఎదుటే గట్టిగా నిలదీస్తూ కేకలు వేయడం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన ఆ వీడియోలో.. తనకు మేఘనను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదనీ, తనకు నువ్వే బలవంతంగా చేశామనీ తండ్రి జోగి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.    అదంతా పక్కన పెడితే.. మేఘన తన ఫిర్యాదులో  పేర్కొన్న అంశాలు చాలా తీవ్రమైనవని పేర్కొన్న డీవీ శ్రీనివాస్.. 50 లక్షల రూపాయల పెళ్లి ఖర్చుల అంశంతో పాటు అదనపు కట్నం కోసం ఒత్తిడి,  గోవా పర్యటనలోనూ, ఇబ్రహీంపట్నంలోని నివాసంలోనూ తనపై హత్యాయత్నం జరిగిందని మేఘన ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని డీవీ శ్రీనివాస్ అన్నారు.  సామాన్యుల విషయంలో ఇలాంటి తీవ్ర ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, మాజీ మంత్రి ఫ్యామిలీ విషయంలో ఎందుకు విచారణ వేగవంతం చేయలేదని నిలదీశారు.   గతంలో ప్రతిపక్ష నేతల నివాసాలపై దాడి చేయడం, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా నిత్యం వివాదాలలో నిలిచిన   జోగి రమేష్‌కు ఈ వ్యవహారం రాజకీయంగా  ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జోగు రమేష్ కు కర్మ రిటర్న్ అయ్యిందన్న చర్చ జరుగుతోందన్న డీవీ శ్రీనివాస్.. ఇది జోగి రమేష్ కు రాజకీయ సమాధిగానే చూడాలన్నారు.     డీవీ శ్రీనివాస్  ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి Jogi Ramesh, Jogi Rajiv, Meghana, Familydispute, SonRevolt #Jogi Ramesh Family Issue, TeluguOne, DVSrinivas
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.     శాసనమండలి ప్రాతినిధ్యంలో భాగంగా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం  పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,  రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గ మహిళా నాయకురాలు, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో సైతం విధానపరమైన అంశాలపై గళం విప్పిన వర్ల రామయ్య సేవలకు తగిన గుర్తింపునిచ్చేందుకు వర్ల రామయ్య, అలాగే  ప్రజా సమస్యలపై పోరాడుతూ స్థానిక స్థాయిలో బలమైన ముద్ర వేసిన మహిళకు అవకాశం కల్పించచాలన్న ఉద్దేశంతో దళవాయి రమాదేవిని చంద్రబాబు ఎంపిక చేశారని అంటున్నారు.  వీరి అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.    AP Governor Quota MLC, Varla Ramaiah, Dalavai Ramadevi, TDP MLC Candidates, AP Legislative Council, CBN, APpolitics, TeluguOne
  ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..! ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ నేత, పార్టీ వక్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయనను ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సెల్స్, విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.  దీంతో ఇప్పటివరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికలపై బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి, రాజకీయ అంశాలపై అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండటంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైన సమన్వయ బాధ్యత లభించింది. ఒకే జాతీయ కార్యవర్గంలో ఏపీకి చెందిన నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటు యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.  యువతతో అనుసంధానం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఇక దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వినియోగించుకునే అవకాశం లభించింది. ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పార్టీ వక్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత లభించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది. S. Vishnuvardhan Reddy, BJP, D Purandeswari, Ram Madhav, Smriti Irani, Andhra Pradesh BJP, Telangana BJP, Pm modi, Nitin Nabin, Smriti Irani, Vasundhara Raje
పంద్రాగస్టున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన దిమాగీ నక్సల్ అన్న పదంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా  రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆ ప్రసంగంలో  పీఎం మోదీ ప్రయోగించిన  దిమాగీ నక్సల్  అంటే ఆలోచించే లేదా మేధో నక్సలైట్లు  అని అర్ధం.   ఈ పద ప్రయోగంపై విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులపై ముద్ర వేయడానికే ఈ పదాన్ని సృష్టించారంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ.  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విధానాలను విమర్శించే వారికి నక్సల్ బ్రాండ్ వేసే ప్రయత్నంలో భాగమే మోడీ నోటి వెంట దిమాగీ నక్సల్ అన్న పదం రావడానికి కారణమన్నారు. గతంలో అర్బన్ నక్సలైట్లు అని మేధావులపై బ్రాండ్ వేసిన సంగతిని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఉన్న అర్బన్ నక్సల్,   రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు  దిమాగీ నక్సల్'అనే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో  నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు  ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేసినా,  ప్రజాసమస్యలపై ప్రశ్నించినా వారిని దిమాగీ నక్సల్  అకౌంట్‌లో వేసి, భయాందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. గతంలో నక్సల్ ముక్తి భారత్ అన్నట్లుగానే.. దిమాగి నక్సల్ విముక్తి భారత్ అని పరోక్షంగా హెచ్చరించడమే దీని ఉద్దేశమని భరధ్వాజ విశ్లేషషించారు. అంటే.. ఇండియాను  మెదడు లేదా ఆలోచన రహిత భారత్ వైపు నడిపించాలని మోడీ అనుకుంటున్నారా అన్న సందేహం వస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను, విమర్శకులను టార్గెట్ చేస్తూ వరుసగా బ్రాండింగ్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు భరద్వాజ.  స్వాతంత్ర్య దినోత్సవం రోజున అహింసా మార్గాన్ని స్మరించుకుంటూనే, మరోవైపు ఎర్రకోట ప్రాంగణం నుంచే  దిమాగీ నక్సల్స్ అంటూ హెచ్చరించడం ద్వారా ప్రధాని జనాలకు ఏం సందేశమిచ్చారో స్పష్టమేనన్న భరద్వాజ ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి నిర్బంధాన్ని మించి దారుణ పరిస్థితులున్నాయన్నారు.   భరద్వాజ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించడండి.  PM Modi Dimagi Naxal Comments,  Red Fort,  Independence Day Speech,  controversial speech, Opposition reaction, TeluguOne   
ALSO ON TELUGUONE N E W S
సినిమా అంటేనే చిత్ర విచిత్రాల‌తో కూడుకున్న మాధ్య‌మం. భారీ బ‌డ్జెట్‌తో తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతుంటాయి. అదే స‌మ‌యంలో త‌క్కు వ బ‌డ్జెట్‌తో చేసిన కొన్ని సినిమాను సూప‌ర్‌హిట్ అయి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి. సినిమా అనేది ప్రారంభ‌మైన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి అరుదైన సంఘ‌ట‌న‌లు చాలా సంద‌ర్భాల్లో జ‌రిగాయి.  ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌ర‌గ‌ని ఒక విచిత్ర‌మైన విష‌యం చైనాలో నిర్మించిన ఒక యానిమేష‌న్ సినిమాకు జ‌రిగింది. ఎలాంటి ప్రచారం లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో రూపొంది, ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది చైనా భాష‌లో రూపొందిన నియు లై.  86 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రచార చిత్రాలు, ట్రైలర్లు ఏవీ లేకుండా విడుదలైన ఈ సినిమా, ఆ తర్వాత సోషల్ మీడియా ధాటికి ఏకంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చైనాకు చెందిన తల్లి, కుమారుడు జిన్ యుమెంగ్, సన్ లీఫాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ చిత్రాన్ని సుమారు రూ.1 లక్ష బడ్జెట్‌తో రూపొందించడం విశేషం. పాత సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను ఉపయోగించి ఐదేళ్ల పాటు శ్రమించి ఈ యానిమేషన్ చిత్రాన్ని సిద్ధం చేశారు. ఓ చిన్న దూడ, స్కైలార్క్ పక్షి మధ్య జరిగే క‌థ‌తో ఇది తెరకెక్కింది. ఆగస్టు ప్రారంభంలో థియేటర్లలో ఈ చిత్రం విడుద‌లైంది. మొదటి పది రోజుల్లో కేవలం రూ.1 లక్ష మాత్రమే వసూలు చేసి డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. అయితే సోష‌ల్ మీడియాలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాల వ‌ల్ల మొత్తం సీన్ మారిపోయింది.  సినిమాలోని అత్యంత నాసిరకం గ్రాఫిక్స్, అసంపూర్ణ వాయిస్ ఓవర్లు, పాత్రల డిజైనింగ్‌ను నెటిజన్లు మీమ్స్ రూపంలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో అసలు "ఈ సినిమా ఎంత చెత్తగా ఉందో మనమే వెళ్లి చూడాలి" అనే ఆసక్తి ప్రేక్ష‌కుల్లో పెరిగిపోయింది. నెటిజన్లు చూపించిన ఈ నెగటివ్ క్యూరియాసిటీయే ఈ చిత్రానికి ఊహించని పబ్లిసిటీగా మారింది.  ప్రేక్షకులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లకు క్యూ కట్టడంతో ఇప్పటివరకు 15 మిలియన్ యువాన్లకు పైగా అంటే భార‌త క‌రెన్సీ ప్ర‌కారం 20 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. నెగటివ్ పబ్లిసిటీ కూడా కొన్నిసార్లు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనడానికి ఈ 'నియు లై' చిత్రం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.  ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్‌ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం. Also read: శ్రీలీలని వెంటాడుతున్న దురదృష్టం.. వైఫే లా ఉండదు కదా!    ఇక బాక్సాఫీస్ వద్ద  విశ్వనాధ్ అండ్ సన్స్  కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. Viswanath And Sons, Suriya, Mamitha Bhaiju, Venky Atluri  
సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుండెలకు హత్తుకునేలా చూపుతాయి. రీసెంట్‌గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలోని ఒక సీన్ వెనుక ఉన్న రియల్ ఇన్సిడెంట్ గురించి డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. మనం స్క్రీన్ మీద చూసి భావోద్వేగానికి గురయ్యే సీన్స్ వెనుక దర్శకులు తమ నిజ జీవితంలో చూసిన, అనుభవించిన ఘటనలు ఉంటాయి. వెంకీ అట్లూరి రాసిన ఒక డ్రైవర్ ఇంటర్వ్యూ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఏడిపించేసింది. అయితే అసలు ఆ సీన్ రాయడానికి ఇన్స్పిరేషన్ దిల్ రాజు అని వెంకీ తెలిపారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. 2012-2013 ప్రాంతంలో తాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దగ్గర పనిచేస్తున్నప్పటి ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో SVC బ్యానర్ కాస్త క్లిష్టమైన పరిస్థితులలో ఉంది. అదే సమయంలో సెట్స్‌లో పనిచేసే ఒక లైట్‌మ్యాన్, తన కొడుకుకి యూఎస్‌లోని కాలేజీలో సీటు వచ్చిందని, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆర్థిక సాయం కావాలని కోరాడు. ఆ రోజుల్లో ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ ధర దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజుకి అది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, ఇచ్చినా మాట ప్రకారం ఆ పిల్లాడి ట్రావెల్ కు అయ్యే డబ్బులు తక్షణమే చెల్లించి సహాయం చేశారు. ఒక సాధారణ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం పడే తపన, ఆయనకు అండగా నిలిచిన మనుషుల మంచితనం.. ఈ ఘటనే వెంకీ అట్లూరి మనసులో బలంగా నాటుకుపోయింది. అదే ఆ ఎమోషనల్ సీన్ రాయడానికి ప్రధాన ఇన్స్పిరేషన్‌గా మారింది. అంతేకాదు, సినిమాలో ప్రతీ ఎమోషనల్ కన్వర్జేషన్ తర్వాత వాతావరణాన్ని తేలికపరచడానికి చిన్న జోక్ జోడించడం తన రైటింగ్ ఐడియాలజీ అని వెంకీ అట్లూరి స్పష్టం చేశారు. సీరియస్ ఎమోషన్ హృదయానికి హత్తుకున్న వెంటనే ప్రేక్షకుడిని తేలికపాటి నవ్వుతో రిలాక్స్ చేయడమే ఒక దర్శకుడిగా తన శైలి అని చెప్పారు. రియల్ లైఫ్ సంఘటనలను ఇంత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన వెంకీ అట్లూరి రైటింగ్ ప్రతిభపై ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది.       Vishwanath and Sons, Venky Atluri, Interview, Dil Raju  
    బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయనే సామెత శ్రీలీల ప్రస్తుత సినీ  కెరీర్ విషయంలో నిజం కాబోతుందా అనే గుసగుసలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. శ్రీలీలపై ఎవరకి వ్యకిగత ద్వేషాలు లేవు. ఆమె సినీ ట్రాక్ ని బట్టే బళ్ళు, ఓడలు సామెత వినిపిస్తుంది.    టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో వరుస ఆఫర్స్ తో  సంచలనంగా మారిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కెరీర్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని  ఎదుర్కొంటోంది. ఒక్క ఏడాదిలోనే వరుసగా దాదాపు 9 సినిమాల్లో నటించి ఇండస్ట్రీ చూపునంతా తనవైపు తిప్పుకున్న ఈ భామ, అనుకోని రీతిలో అవకాశాలు తగ్గిపోవడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఒకప్పుడు రోజుకు రెండు కాల్షీట్లు ఇస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మకు, ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ రాకపోవడం ఫ్యాన్స్‌ని   కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే ఈ బ్యూటీ కొండంత ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరచడంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే టాలీవుడ్ పరిశ్రమ మర్చిపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు తగ్గడంతో శ్రీలీల తన దృష్టిని కోలీవుడ్‌ వైపు మళ్లించింది. తమిళంలో శివకార్తికేయన్ సరసన బిగ్ ప్రాజెక్ట్ 'పరాశక్తి' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ, ధనుష్ సరసన భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'ఓం చాప్టర్ 1' లో శ్రీలీలకు ఓ కీలక పాత్ర దక్కింది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ సాయి పల్లవి కూడా నటించబోతుండటంతో, శ్రీలీల పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అది ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. Also read: ధ్రువ్ విక్రమ్ ఘాటు వ్యాఖ్యలు.. అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ కామెంట్స్‌పై రియాక్షన్ ఇదే మరోవైపు బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్ వంటి క్రేజీ స్టార్ల సరసన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అవుదామని భావించినా, ఆ చిత్రాల  విడుదలపై క్లారిటీ రావడం లేదు.కార్తీక్ ఆర్యన్ మూవీ అయితే రీ షూట్స్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టుగా కూడా టాక్ నడుస్తుంది. మరి శ్రీలీలకి వరుస ఫ్లాప్‌లు,  క్యారెక్టర్స్ లో వైవిధ్యం లేకపోవడం వల్ల ఆఫర్లు తగ్గాయా లేదా తన MBBS మెడికల్ చదువుపై ఫోకస్ పెట్టడం కోసమే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏదేమైనా శ్రీలీల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరైన కథలను ఎంచుకుని, క్రేజీ ప్రాజెక్ట్‌లతో మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అప్పటి దాకా బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయ్యాయా అనే సామెత సినీ సర్కిల్స్ లో రన్ అవుతూనే ఉంటుంది. Sreeleela, kartik Aaryan, Pawan kalyan  
  అనుపమ పరమేశ్వరన్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'నేను గత రెండు సంవత్సరాలుగా ఒక శాడిస్ట్ బిహేవియర్ లాంటి వ్యక్తి ప్రేమ నుంచి బయటపడ్డాను. మొదట్లో శాడిస్ట్ అని తెలియకుండా బాగానే మానేజ్ చేసాడు. ఆ తర్వాత నిదానంగా తెలుసుకున్నాను. నాలాగా ఆడపిల్లలు అమాయకత్వంతో వేరే మగవాళ్ళని నమ్మి మోసపోవద్దు.  ఆత్మహత్య  చేసుకోవాలనుకొని కూడా విరమించుకున్నానని చెప్పి అనుపమ పెద్ద సంచలనమే సృష్టించింది.      అనుపమ ఈ వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినా, సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తి ధ్రువ్ విక్రమేనంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభించారు. దీంతో ఈ వివాదంపై ధ్రువ్ విక్రమ్ ఏ విధంగా స్పందిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇండియా టుడే రౌండ్ టేబుల్ వేదికగా ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ విమర్శలు, వార్తలపై తొలిసారిగా నోరు విప్పారు. "నాపై వస్తున్న పరిశీలనలు, విమర్శలు నన్ను అస్సలు ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. ఖచ్చితంగా ఇవి నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కానీ ఇటువంటి కష్టసమయాల్లో మనం దేనికి కట్టుబడి ఉన్నాం, మన అసలు గుర్తింపు ఏంటి అనేది గ్రహించి వాస్తవంలో నిలబడటం చాలా ముఖ్యం.మీరు ప్రేమిస్తున్న వ్యక్తులను, మీకు అత్యంత ముఖ్యమైన వారిని గట్టిగా కాపాడుకోవడమే మీ మొదటి ప్రాధాన్యత కావాలి. మీరు నిజం వైపు నిలబడినప్పుడు ఎలాంటి విమర్శలైనా ఒక హద్దు వరకే పనిచేస్తాయి.  Also read: అలాంటి వాళ్లే రావాలంట.. నవదీప్ వ్యాఖ్యలు వైరల్   ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు మానసికంగా ఒక సైన్యంలా మారి, మీ సొంత ప్రపంచాన్ని, అంతర్గత శాంతిని కాపాడుకోవాల్సి ఉంటుంది" అని ధ్రువ్ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో తాను పెద్దగా సక్రియంగా ఉండకపోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువుల వీడియోలను ఎడిట్ చేసుకోవడం మాత్రమే తనకిష్టమని, సినిమా ప్రమోషన్ల సమయంలోనే బయటకు వస్తానని చెప్పారు. తన జీవితంలో జరుగుతున్న ఈ వివాదాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చి ధ్రువ్ విక్రమ్ ఆత్మవిశ్వాసం చాటుకున్నారు.  దక్షిణాది చిత్రసీమలో గత కొన్ని రోజులుగా యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ల డేటింగ్, బ్రేకప్ వార్తలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. అనుపుమ, ధ్రువ్ కలిసి గత ఏడాది వచ్చిన  ‘బైసన్' మూవీలో జోడీగా నటించిన విషయం తెలిసిందే. Anupama Parameswaran, Dhruv Vikram
యువ ప్రేక్షకులను అలరించే రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో ఇటీవల కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రం 'మోద కవిదా వాతావరణ'. డైరెక్టర్ సింపుల్ సుని తెరకెక్కించిన ఈ సస్పెన్స్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్లో తెలుగు వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో షీలం ఎమ్ స్వామి, మోక్ష కుషాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. హిల్ స్టేషన్ నేపథ్యం, మేఘాలు కమ్మిన అందమైన వాతావరణంలో జరిగే కథ కావడంతో ఓటీటీ ప్రియుల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. మరి ఈ రొమాంటిక్ మిస్టరీ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే.. ఛరీష్, సాత్విక అనే జంట సరదాగా గడపడం కోసం ఒక హిల్ రిసార్ట్‌కు వెళ్తారు. అదే సమయంలో ధనుశ్, సౌపర్ణిక అనే మరొక జంట కూడా అక్కడకు చేరుకుంటారు. అయితే సౌపర్ణికను చూసిన మొదటి చూపులోనే ఛరీష్ ఆమె వైపు ఆకర్షితుడవుతాడు. తక్కువ సమయంలోనే వారిద్దరూ క్లోజ్ అవుతారు. ఈ క్రమంలోనే సౌపర్ణిక తన గతం గురించి, పాఠశాల రోజుల నాటి నుండి తనను నీడలా వెంటాడుతున్న ఒక రహస్య వ్యక్తి గురించి ఛరీష్‌కు చెప్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఛరీష్ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ మిస్టరీ చిక్కుముడి వీడిందా లేదా అనేదే ఈ చిత్ర అసలు కథాంశం. సినిమా ప్రథమార్ధంలో హిల్ స్టేషన్ లొకేషన్లు, కథలో సస్పెన్స్ బిల్డప్ చేయడం కొంతవరకూ బాగానే ఉన్నప్పటికీ, ద్వితీయార్ధంలో కథనం నెమ్మదించింది. ముఖ్యంగా రొమాంటిక్ థ్రిల్లర్ నుండి ఆశించే ఫీల్ గుడ్ ఎమోషన్స్, బలమైన సన్నివేశాలు లోపించాయనే చెప్పాలి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఫొటోగ్రఫీ, అందమైన దృశ్యాలు మరియు నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్లుగా నిలిచినా, కథా బలం లేకపోవడం మరియు నెమ్మదించిన సన్నివేశాలు ప్రతికూలంగా మారాయి. రొటీన్ సస్పెన్స్ డ్రామాలను ఓటీటీలో సమయం కేటాయించి చూడాలనుకునే వారు ఒకసారి ప్రయత్నించవచ్చు.
  క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అద్భుత దృశ్య కావ్యం 'చందమామ' మూవీ వన్ ఆఫ్ ది హీరో నవదీప్. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుల ఫ్యామిలీ నుంచి వచ్చిన నవదీప్, క్యారక్టర్ కి తగ్గ పెర్ ఫార్మెన్స్ ప్రదర్శించడంలో దిట్ట. కానీ ఎందుకో హీరోగా,నటుడిగా పెద్ద ప్రభావం చూపించలేకపోతున్నాడు.   బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అరుదైన అవకాశం కల్పిస్తూ జియో హాట్‌స్టార్ వేదికగా 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' డిజిటల్ ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. నవదీప్ జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.  ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రసారమవుతున్న ఈ డిజిటల్ ఆడిషన్లలో కంటెస్టెంట్ల ప్రతిభ, మానసిక సహనాన్ని పరీక్షించడానికి కఠినమైన టాస్కులు రూపొందించారు. అయితే ఈ ఆడిషన్స్ చుట్టూ ఇప్పుడు ఊహించని రీతిలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర వివాదం రాజుకుంది.  సోషల్ మీడియాలో తన వైవిధ్యమైన డ్యాన్స్ వీడియోలు, రీల్స్‌తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు ఈ 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. గ్రూప్ డిస్కషన్లు, పలు రకాల పోటీ రౌండ్లను విజయవంతంగా దాటుకుంటూ ఫైనల్ రౌండ్ వరకు చేరుకున్న బాలు, ఆఖరి నిమిషంలో ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో వదిలాడు. ఆడిషన్స్ పేరుతో తనను పిలిచి దారుణంగా అవమానించారని, ఫైనల్ రౌండ్‌లో ప్రతిభను చూడకుండా తాను చేసే వీడియోలు జుగుప్సాకరంగా (Vulgar) ఉన్నాయంటూ నలుగురిలో హీనంగా మాట్లాడి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యాడు.  ఈ వివాదంలో ప్రధానంగా జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ నటుడు నవదీప్‌ను లక్ష్యంగా చేసుకుని బాలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మీరు చేసే వీడియోల వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? జడ్జి సీట్లో కూర్చున్నాం కదా అని మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కష్టపడే మమ్మల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రం తగదు" అని నవదీప్‌ని  నేరుగా ప్రశ్నించాడు. Also read: నా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒకే ఒక పని అదే.. వైరల్ అవుతున్నప్రముఖ నటి మాట   ఉప్పల్ బాలు ఆరోపణలపై  నవదీప్  స్పందిస్తూ 'హారర్ సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చి.. ఇక్కడ భయపెడుతున్నారు అని గోల చేస్తే ఎలా ఉంటుంది? 'అగ్నిపరీక్ష' అనే కాన్సెప్టే కంటెస్టెంట్లను మైండ్ గేమ్‌లతో ట్రిగ్గర్ చేయడం. షో డిజైన్ చేసిందే దానికోసం. నా లాంటి వాళ్లు ఎన్ని విమర్శలు, ఒత్తిళ్లు తెచ్చినా తట్టుకుని నిలబడే శక్తి, ధైర్యం ఉంటేనే ఈ షోకి రావాలి. అలా ఒత్తిడిని తట్టుకోలేని వాళ్లు అసలు బిగ్ బాస్ షోకే రావొద్దు" అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు.  Navadeep, Tollywood, Krishnavamsi  
ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. చెన్నై సిటీ బ్యాగ్రౌండ్‌లో రూపొందిన ఈ క‌మింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇద్దరు యువ హృదయాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ లవ్‌లోని ఉత్సాహం, అమాయకత్వం, ప్రేమలో ఎదురయ్యే బాధలను దాటుకుంటూ వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు.. ఎదిగే క్రమంలో తమను తాము తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకుంటారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఆగ‌స్టు 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.     Chennai Love Story, OTT Release, Kiran Abbavaram, Sri Gouri Priya  
  గ్లామరస్ రోల్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన అందాల భామ నిధి అగర్వాల్ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి వైవిధ్యమైన కథాంశంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ముద్దుగుమ్మ ఒక సరికొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈసారి నిధి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యం ఉన్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటించనుండటం విశేషం. వరాహ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'తంత్ర' ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకు ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకను సెట్స్‌పై పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖులు కెమెరా స్విచాన్ చేయగా, సరికొత్త ఉత్సాహంతో మొదటి రోజే షూటింగ్ ప్రక్రియను కూడా మేకర్స్ ప్రారంభించారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో నిధి ఒక సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'హరి హర వీర మల్లు', రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'ది రాజా సాబ్' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించి వరుస అవకాశాలు అందుకుంటున్న నిధి అగర్వాల్, ఈ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తన నటనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక చేతిలో దీపాన్ని ఆర్పకుండా రక్షిస్తున్నట్లు, బ్యాక్‌గ్రౌండ్‌లో దేవుడి ఆకృతి కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ వైరల్ కావడంతో నిధి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఈసారి నిధి ఖాతాలో గ్యారెంటీ హిట్ పడబోతోంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.   Nidhhi Agerwal, Nidhhi Agerwal New Movie, Srinivas Gopishetti, Mythological Thriller, Varaha Films, Telugu Cinema News
  ఇనయ సుల్తానా.. అందానికే అసూయ పుట్టెంత అందం తన సొంతం. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ కి కటీఫ్ చెప్పేసింది. గతంలో తనే ఎంతో వైభవంగా బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. ఆ సమయంలో ఆమె ఆనందాన్ని చూసి ఆ ఇద్దరు కలకాలం కలిసి ఉండాలని దీవించారు. కానీ ప్రస్థుతానికి ఇనయ సింగిల్.  ఇనయ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సాధారణ వ్యక్తులు చేసిన పని లేదా మాట్లాడిన మాట అంతగా వైరల్ అవ్వదు.., కానీ సెలబ్రిటీలు మాట్లాడితే మాత్రం మీడియా దాన్ని పెద్దది చేస్తుంది. ఇది పీఆర్ గేమ్స్‌లో భాగం కావచ్చు. సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఇలా జరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను  జిమ్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. దాన్ని అధిగమించడానికి కొత్త విషయాలని  అన్వేషించాలని అనుకుంటున్నాను. జిమ్ నా జీవితంలో ఒకే ఒక సంతోషాన్నిచ్చే పని . డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు.  కానీ శరీరాన్ని కొనలేం, మార్చలేం. జిమ్‌లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పది, అందుకే  కేవలం జిమ్ ఫోటోలు మాత్రమే ఇన్ స్టాలో షేర్ చేస్తానని  స్పష్టం చేశారు.   also Read: ఎందుకు వెళ్లిపోయిందో తెలిసింది.. కేరళ యూట్యూబర్ అఖిల్ భార్య సంచలనం బిగ్ బాస్ షో ద్వారా  పాపులర్ అయిన ఇనయ  సినిమాలు, టీవీ షోలలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన హవా డల్ నెస్ ని సొంతం చేసుకుంది.     
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)