దిమాగీ నక్సల్.. మోడీ టార్గెట్ ఎవరంటే?

posted on: Aug 17, 2026 5:50PM

పంద్రాగస్టున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన దిమాగీ నక్సల్ అన్న పదంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా  రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆ ప్రసంగంలో  పీఎం మోదీ ప్రయోగించిన  దిమాగీ నక్సల్  అంటే ఆలోచించే లేదా మేధో నక్సలైట్లు  అని అర్ధం.   ఈ పద ప్రయోగంపై విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులపై ముద్ర వేయడానికే ఈ పదాన్ని సృష్టించారంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ. 

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విధానాలను విమర్శించే వారికి నక్సల్ బ్రాండ్ వేసే ప్రయత్నంలో భాగమే మోడీ నోటి వెంట దిమాగీ నక్సల్ అన్న పదం రావడానికి కారణమన్నారు. గతంలో అర్బన్ నక్సలైట్లు అని మేధావులపై బ్రాండ్ వేసిన సంగతిని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఉన్న అర్బన్ నక్సల్,   రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు  దిమాగీ నక్సల్'అనే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో  నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.

ఇప్పుడు  ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేసినా,  ప్రజాసమస్యలపై ప్రశ్నించినా వారిని దిమాగీ నక్సల్  అకౌంట్‌లో వేసి, భయాందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. గతంలో నక్సల్ ముక్తి భారత్ అన్నట్లుగానే.. దిమాగి నక్సల్ విముక్తి భారత్ అని పరోక్షంగా హెచ్చరించడమే దీని ఉద్దేశమని భరధ్వాజ విశ్లేషషించారు. అంటే.. ఇండియాను  మెదడు లేదా ఆలోచన రహిత భారత్ వైపు నడిపించాలని మోడీ అనుకుంటున్నారా అన్న సందేహం వస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను, విమర్శకులను టార్గెట్ చేస్తూ వరుసగా బ్రాండింగ్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు భరద్వాజ. 

స్వాతంత్ర్య దినోత్సవం రోజున అహింసా మార్గాన్ని స్మరించుకుంటూనే, మరోవైపు ఎర్రకోట ప్రాంగణం నుంచే  దిమాగీ నక్సల్స్ అంటూ హెచ్చరించడం ద్వారా ప్రధాని జనాలకు ఏం సందేశమిచ్చారో స్పష్టమేనన్న భరద్వాజ ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి నిర్బంధాన్ని మించి దారుణ పరిస్థితులున్నాయన్నారు. 

 భరద్వాజ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించడండి. 

PM Modi Dimagi Naxal Comments,  Red Fort,  Independence Day Speech,  controversial speech, Opposition reaction, TeluguOne   

google-ad-img
    Related Sigment News
    • Loading...