LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, జాతీయ స్థాయిలో మోదీ-అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో, బలమైన ప్రాంతీయ శక్తులు సైతం కేంద్ర పెద్దల చాణక్యానికి తలవంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ప్రాంతీయ అధినేతల అహంకారం, వ్యూహాత్మక తప్పిదాలు వారి పతనానికి ఏ విధంగా దారితీస్తున్నాయో  తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు.  రాజకీయాల్లో ఎప్పుడైనా పోరాటం ఉండాలని, ఎక్కడైతే రాజీ పడతారో అక్కడే పతనం ప్రారంభమవుతుందని  జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన  మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను తీసుకుంటే..  మమతా బెనర్జీ బలమైన నాయకురాలైనప్పటికీ, ఇండియా బ్లాక్‌లో ఉంటూనే కాంగ్రెస్, సీపీఎంతో సరైన రీతిలో కలవలేకపోవడం ఓట్ల చీలికకు దారితీసిందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైందన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, జగన్ ,  కేసీఆర్.. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీల అధిపతుల్లో ఉండే అహంకారమే ఒక్కోసారి వారి సొంత రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..  బీఆర్ఎస్ తీవ్రమైన నైతిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. గతంలో వచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నాయకుల ప్రవర్తన ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సైతం స్థానికంగా అంతర్గత వివాదాలు, నైతిక సమస్యల వల్ల ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదంలో పడిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన వివిధ ఉద్యమాలు, కొత్త శక్తుల ఆవిర్భావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన లౌక్యం అద్భుతమని కొనియాడారు. విపక్షాలు లేదా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఉద్రిక్తతలు సృష్టించి మైలేజ్ పొందాలని చూసిన ప్రతిసారీ, అమిత్ షా   వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అరెస్టులు చేసి అనవసరంగా హీరోలను చేయడం కంటే, చట్టపరమైన వెసులుబాటు కల్పించి వారి వ్యూహాలనే నీరుగార్చడంలో కేంద్రం సఫలమైందని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్ల కాలం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమని, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే అహంకారాన్ని వీడి ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయకపోతే ప్రాంతీయ శక్తుల మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. 
తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ  హయాంలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో పెను సంచలనం రేపే భారీ కుంభకోణం వెలుగుచూసింది.  2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస అర్హత మార్కులు రాని వారికి తెరవెనుక నుంచి ఉద్యోగాలు కట్టబెట్టారని బాధితులు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన బాధితులకు  నాటి అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు, అనుచరుల నుంచి ప్రాణాపాయ హెచ్చరికలు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు   45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే..  అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో శ్రీకాకుళం, ప్రకాశం తదితర జిల్లాల్లో జరిగిన నియామకాల డిజిటల్ డేటాను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. వికలాంగుల కేటగిరీలో 45 మార్కులు రావాల్సి ఉండగా, కేవలం 40.75 మార్కులు సాధించి అనర్హుడిగా మిగిలిన ఒక అభ్యర్థికి రోస్టర్ పాయింట్ల ఆధారంగా 42 వేల పైచిలుకు ర్యాంకు ఉన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతకంటే మెరుగైన ర్యాంకులు, అర్హత మార్కులు సాధించిన ఎంతో మంది ప్రతిభావంతులను పక్కనబెట్టి, తెర వెనుక దందాతో అనర్హులకు కాల్ లెటర్లు పంపారని బాధితులు నిలదీస్తున్నారు. మరింత విచిత్రంగా, కేవలం రెండు నెలల్లో ముగియాల్సిన ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఏకంగా రెండేళ్ల పాటు సాగదీశారు. 2020 నవంబర్‌లో ప్రారంభమైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ 2022 జనవరి వరకు   కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల పరిధిలోకి వచ్చే మహిళా కానిస్టేబుల్   పోస్టుల్లో వినికిడి లోపం   ఉన్న వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోస్టుకు ఫిట్ నెస్ ను పక్కనబెట్టి దొంగ సర్టిఫికేట్లతో పైరవీకారులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు  అప్పుడే ఒక మంత్రిని కలిసి మొరపెట్టుకోగా.. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కానీ, మీకే ఇస్తామని చెప్పామా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను మాజీ మంత్రి కుమారుడు తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ వివరాలు బయటపెడితే బాధితుల కుటుంబాలను లేకుండా చేస్తామంటూ గూండాలతో హెచ్చరికలు పంపడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. లక్షలాది మంది నిరుద్యోగుల కష్టాన్ని, తల్లిదండ్రుల ఆశలను కాలరాస్తూ జరిగిన ఈ సచివాలయ ఉద్యోగాల దందాపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి. బాధితులంతా సమాచార హక్కు చట్టం (  ద్వారా వివరాలు సేకరించి, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిల్   దాఖలు చేయాలని మేధావులు సూచిస్తున్నారు. నిలిపివేసిన అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, అభ్యర్థుల మార్కులతో కూడిన సమగ్ర మెరిట్ జాబితాను విడుదల చేయడమే కాకుండా, దీనిపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఏపీ నిరుద్యోగ లోకం గళమెత్తుతోంది.
  బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. వచ్చే ఐదేళ్ల చిట్టినాయుడు, అండ్ టీం'కు సినిమా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన కాలంలో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ, తమ పార్టీ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీతో కలిసి నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తాయని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ యుద్ధంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రతి అక్రమ కేసును చట్టపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని, అధికార పక్షానికి చుక్కలు చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. వర్దన్నపేట వేదికగా కేటీఆర్ చేసిన ఈ సుదీర్ఘ, ఘాటైన ప్రసంగం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం అనిపించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి త్వరలో భారీ వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన  ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారన్న వార్త  ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.  గత ఎన్నికల తర్వాత ఏపీలో  అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి తిరుగులేని ఐక్యతతో ముందుకు సాగుతోంది. అయితే..  ఆ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని వైసిపి పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారింది.  ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ గూటికి చేరనన్నారన్నవార్తలు గట్టిగా వినిపిస్తుననాయి.   పార్లమెంటు ముంగిటకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందన్న వార్తలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.   పునర్విభజన బిల్లు  ఆమోదం పొందితే, ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా దాదాపు 80 అసెంబ్లీ స్థానాలు,  13 లోక్ సభ స్థానాలు పెరిగే  అవకాశం ఉంది.  ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరిగితే, భవిష్యత్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీకిి  బలమైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని అంటున్యనారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోలన మొదలైందిజ ఈ నేపథ్యంలోనే వచ్చే కొద్దిరోజులలో  వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.   ఈ మారుతున్న పరిణామాలను గమనించిన జనసేన పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేసి, వలసలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి  ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వచ్చే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడానికి ఈ ఎంపీలు కమలం గూటికి చేరడమే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  డీలిమిటేషన్  బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అన్నది కేవలం నంబర్స్ మాత్రమే కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే..   వైసిపికి, ఆ పార్టీలో కొనసాగితే.. తమకూ రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతలు.. పార్టీ మారడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ముగ్గురు వైసీపీ ఎంపీలు కమలం గూటికి చేరడానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు. అయితే  ఈ వలసల పర్వం ఈ ముగ్గురితో ఆగే అవకాశం లేదనీ, ముందు ముందు మరింత మంది వైసీపీయులు కూటమి పార్టీలలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
Actress Mamta Mohandas delivered a powerful and deeply personal speech at the Silver Jubilee celebrations of the Basavatarakam Indo-American Cancer Hospital. As a cancer survivor herself, she praised Nandamuri Balakrishna for his continued dedication to the institution and its 25-year legacy of helping patients. During her address, Mamta addressed past rumors, clarifying that she was not diagnosed with breast cancer, but rather Refractory Hodgkin’s Lymphoma—a rare and aggressive type of blood cancer. She spoke about her gruelling journey, which included extensive chemotherapy and a bone marrow transplant. When standard treatments failed, a 2014 clinical trial in the United States for the drug Opdivo saved her life. Mamta shared a profound shift in her perspective, explaining that she no longer focuses on the elusive concept of a "cure." Instead, she concentrates on daily survival, mental resilience, and making the most of her life. She also highlighted a crucial gap in Indian medical care, noting the absence of routine "Quality of Life Assessments" that are standard in the US to monitor a patient's emotional well-being. She had a strong message for families of cancer patients: empathize, don't just sympathize. She warned against the "toxic support" of caregivers constantly showing their worry, as patients need strength and positivity from their homes. Mamta concluded by rejecting the notion that cancer survivors are fragile, stating that the battle makes them incredibly strong, and she urged society to offer genuine love and support to make every patient's fight a little easier. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  దర్శకుడు కంట తడి పెట్టడం సినిమాకి, సినీ ప్రేమికులకి పెద్దగా మంచిది కాదనే నానుడి ఉంది. దర్శకుడు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, , రాత్రింబగళ్లు ఒక మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడతాడు. కానీ  చివరి నిమిషంలో వచ్చే కొన్ని అడ్డంకులు ఆ చిత్ర భవిష్యత్తునే కొన్ని సార్లు మార్చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక చేదు అనుభవమే ఇవాళ 'దీవాన' (Deewana)చిత్ర బృందానికి ఎదురైంది. 'మెయిల్', 'శుభం' వంటి లఘు మరియు చిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి సోలో హీరోగా నటించిన సరికొత్త న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 'దీవాన'. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాటి నుంచి  విమర్శకుల ప్రశంసలు, పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. డే బై డే థియేటర్లలో జెన్యూన్ మౌత్ టాక్‌తో బుకింగ్స్ కూడా పుంజుకుంటున్న తరుణంలో సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికేట్ రూపంలో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. ఈ చిత్రం ప్రమోషన్స్ మరియు సక్సెస్ మీట్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామానాయుడు స్టూడియోస్‌లో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో సినిమా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబుతూ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి వేదికపైనే భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ కూడా మాట్లాడుతూ సెన్సార్ బోర్డ్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి మరియు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఉండే కొన్ని పెద్ద సినిమాల్లో విపరీతమైన బూతు డైలాగులు, అశ్లీల సీన్లు ఉన్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం తెలపకుండా చాలా సులభంగా U/A సర్టిఫికేట్ ఇస్తారని, కానీ తాము ఎక్కడా అసభ్యత లేకుండా పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా కలిసి చూసేలా ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీని నిర్మిస్తే  ఏకంగా 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చారని వాపోయారు. Also read: Samantha: 150 కోట్ల క్లబ్ లోకి మా ఇంటి బంగారం! సెన్సార్ బోర్డ్ ఇచ్చిన ఈ ఒక్క 'A' రేటింగ్ వల్ల సినిమా చూడటానికి వెళ్లే సాధారణ ప్రేక్షకుల మనసులో నెగెటివ్ ఒపీనియన్ ఏర్పడిందని, దీని వల్ల సినిమా ఓపెనింగ్ కలెక్షన్లకు భారీగా గండి పడిందని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. చిత్ర నిర్మాత వాసు దేవ్ కొప్పీనేని అయితే తమ సినిమాని మరింత మంది ప్రేక్షకులకి చేరువ చేయాలనే ఉద్దేశంతో  సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో  టిక్కెట్ ధరని 100 గా ఫిక్స్ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. . కేవలం ఒక సర్టిఫికేట్ వల్ల సినిమాను తప్పుగా అర్థం చేసుకోకుండా, థియేటర్లకు వచ్చి దీవానాని   చూసి చిన్న చిత్రాలను మరియు సరికొత్త ప్రతిభను సపోర్ట్ చేయాలని చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులను చేతులు జోడించి అభ్యర్థిస్తోంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నే దీవానా ని రిలీజ్ చేసాడు.    
  స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తన సరికొత్త చిత్రం 'మా ఇంటి బంగారం'(Maa inti Bangaram)తో థియేటర్స్ కి సందడి చేస్తుంది. మూవీకి వస్తున్న టాక్, కలెక్షన్స్ చూస్తుంటే సమంత కట్అవుట్ కి ఉన్న క్రేజ్ చాలా క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ప్రాథమిక నివేదికలు మరియు ఇండస్ట్రీ వర్గాల టాక్ ఆధారంగా పెద్ది తర్వాత మా ఇంటి బంగారం ఎగ్జిబిటర్స్ తో పాటు అందరకి లాభాలు తెచ్చిపెడుతుంది. మౌత్ టాక్ కూడా బాగుండటంతో ఇంకొన్ని రోజులు స్ట్రాంగ్ రన్ లో ఉంటుంది. దీంతో 150 కోట్ల దాకా వసులు చెయ్యవచ్చు. ఇక సమంత కెరీర్ లోనే మా ఇంటి బంగారం ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. సమంత, దర్శకురాలు నందిని రెడ్డి ఇద్దరికీ కమ్ బ్యాక్. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. మహిళలే కాదు పురుషులు,యూత్ అందరూ మూవీకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. మా ఇంటి బంగారం ప్రస్తుతం మూడు రోజ్జులో 41 .79 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.  Also read: Peddi: బాక్సాఫీస్ వద్ద పెద్ది అరాచకం..మూడో వారంలో చరణ్ సంచలనం  
మెగా పవర్ స్టార్  రామ్ చరణ్(Ram charan)వన్ మాన్ షో  'పెద్ది'(peddi)తగ్గేదేలే అనే విధంగా విడుదలైన 18 రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు కొంత వరకు  తగ్గుతుంది. కానీ 'పెద్ది' విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ చరణ్ కి బాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినాకి నిదర్శనంగా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో ఏకంగా 50 వేల టికెట్లు అమ్ముడవడం చూస్తుంటే ఈ సినిమా రేంజ్ ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.  థియేటర్లలో అదనంగా జోడించిన సరికొత్త సీన్లు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాను ఇప్పటికే చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం ఆ కొత్త సీన్లని  వెండితెరపై చూసి ఎంజాయ్ చేయడానికి 'రిపీట్ ఆడియన్స్' గా మళ్లీ మళ్లీ థియేటర్ల మెట్లు ఎక్కుతున్నారు. 18వ రోజున ఏకంగా 44.6% భారీ గ్రోత్ నమోదుతో  ఆదివారం నాడే ఇండియా వ్యాప్తంగా 2.82 కోట్ల నెట్ వసూళ్లని  సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. దీనికి ముందు రోజు శనివారం నాడు 1.95 కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం, ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా క్యాష్ చేసుకుంది.   Also read: Rajasekhar: అన్నయ్య ఎప్పుడు వస్తాడు.. రాజశేఖర్ అంటే అంతే మరి   ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. మూడో వీకెండ్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో  అరాచకం సృష్టిస్తోంది. ఆదివారం ఒక్క రోజే ఈ రెండు రాష్ట్రాల నుండి 2.75 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. కర్ణాటకలో 25 లక్షలు సాధించింది.  
  రాజశేఖర్.. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన హీరో.. యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే రాజశేఖర్ తన  ఒంటి చేత్తో వందరోజులు ఆడించిన సినిమాలు ఎన్నో. భారీగానే అభిమాన ఘనాన్ని సంపాదించుకున్న రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి నితిన్ నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్, రీసెంట్ గా శర్వానంద్ తో బైకర్ మూవీలో చేసాడు. బైకర్ మూవీలో శర్వానంద్ తండ్రిగా అద్భుతమైన పెర్ఫార్మ్ చేసి పాత రాజశేఖర్ ని మరిపించడంతో పాటు తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నేను ఉన్నన్నని సినీ ప్రియుల కడుపు నిండేలా అనిపించాడు. . ప్రెజెంట్ రాజశేఖర్  ఎలాంటి కొత్త చిత్రంలో చేయడం లేదు. దీంతో అన్నయ్య ఎప్పుడు వస్తాడంటూ  తన అప్ కమింగ్ మూవీ కోసం అభిమానులు,మూవీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. Also read: Pawan Kalyan: పవన్ మూవీ థియేటర్స్ లోకి ఎప్పుడు రావచ్చు!  
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గత కొన్ని సంవత్సరాలుగా భారీ బడ్జెట్, గ్రీన్ మ్యాట్లు, స్టూడియోలు, విపరీతమైన సీజీఐ హంగులతో కూడిన సినిమాలే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ పంథాకు పూర్తిగా బ్రేక్ వేస్తూ ఒక రా అండ్ రియలిస్టిక్ వరల్డ్‌లోకి ప్రభాస్‌ను తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit) ప్రభాస్ కెరీర్‌లోనే ఒక టోటల్ రీసెట్ లాంటిదని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.  ఎలాంటి స్టూడియో సెట్టింగులు లేకుండా, సహజసిద్ధమైన రియల్ లొకేషన్లలో ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూళ్లను హైదరాబాద్‌లోని విమల్ థియేటర్, బాలానగర్, హైటెక్ సిటీ వంటి బిజీ ఏరియాల్లోని వీధుల్లో అత్యంత పక్కాగా షూట్ చేశారు. అంతేకాకుండా, నేరస్థుల వేట నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు కాంప్లెక్స్‌లో రీసెంట్‌గా చిత్రీకరించి ఈ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించారు. సందీప్ రెడ్డి వంగా సాధారణంగానే తన సినిమాల్లో క్యారెక్టరైజేషన్లను ఎంతో రాగా, వైలెంట్‌గా చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే 'స్పిరిట్' సినిమా కోసం ఆయన ఒక అసాధారణమైన ప్లాన్‌ను సిద్ధం చేశారు. సాధారణంగా ఇలాంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పూర్తి చేయడానికి వందల రోజులు పడుతుంది. కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 95 రోజుల్లోనే ఈ సినిమా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని సందీప్ రెడ్డి వంగా టైట్ షెడ్యూల్ లాక్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ 95 రోజుల పక్కా ప్లానింగ్ కోసం సీన్లు, డేట్లు, రియల్ లొకేషన్లను ముందే ఖరారు చేశారు.  ఈ చిత్రంలో ప్రభాస్ ఒక అత్యంత శక్తివంతమైన ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన 'స్పిరిట్ మేహెమ్' పోస్టర్‌లో ప్రభాస్ చేతులకు తెల్లటి బ్యాండేజ్ కట్టి ఉన్న విజువల్స్ చూస్తేనే, ఈ సినిమాలో సందీప్ రెడ్డి మార్క్ ఇంటెన్స్ వైలెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లలో చూసి అలవాటు పడిన ఫ్యాన్స్‌కు, ఒక పక్కా లోకల్ గ్రౌండెడ్ జోన్ లో వింటేజ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఈ సినిమా ద్వారా మళ్లీ తీసుకురాబోతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రారంభించారు. 'స్పిరిట్' సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ గ్రాఫిక్స్ హంగులు లేకపోయినా కేవలం సందీప్ రెడ్డి వంగా మార్క్ ఎమోషన్, ప్రభాస్ ఊరమాస్ లుక్స్ తోనే ఈ సినిమా థియేటర్లలో సరికొత్త ఊచకోత కోయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  
  సెల్యులాయిడ్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్ అవుట్ కి ఉన్న పవర్ తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చాడు. ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. అభిమానులని, ప్రేక్షకులని కూడా నిరుత్సాహ పరుస్తూ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అభిమానులు పవన్ హిట్ కొడితే చూడాలని ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ పవన్ లిస్ట్ లో మాత్రం ఓజి 2 , సురేందర్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నే స్వయంగా తన సీన్ జర్నీపై మాట్లాడుతు సినిమాలు మాత్రం ఆపనని చెప్పాడు. ఈ క్రమంలో ఆ చిత్రాలు ఎప్పుడు కంప్లీట్ చేసుకొని పవన్ హిట్ కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. Also read: రివ్యూలతో సినిమాని చంపేస్తారా? ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన డైరెక్టర్    
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మెగా 158' (Mega158) సినిమా అప్‌డేట్స్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని పొల్లాచ్చిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కీలకమైన సన్నివేశాలతో కూడిన మొదటి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.  ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెండవ షెడ్యూల్‌ను భాగ్యనగరం హైదరాబాద్‌లో మేకర్స్ ప్రారంభించారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. "హైదరాబాద్‌లో #MEGA158 రెండవ షెడ్యూల్ ప్రారంభమై, అత్యంత వేగంగా సాగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి షాట్‌ను ఒక అద్భుత దృశ్యంగా, ప్రతి సన్నివేశాన్ని ఒక పండుగలా మారుస్తున్నారు." అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ లొకేషన్లలో ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. మెగాస్టార్ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఫెరోషియస్ అవతార్‌ను దర్శకుడు బాబీ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే కేవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వరా రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా అనస్వరా రాజన్ ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో కనిపించబోతోందని ఇండస్ట్రీ టాక్. అలాగే 'కూలీ' ఫేమ్ రచితా రామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.  సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఒక పక్కా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోసం సరికొత్త మేకోవర్, లుక్ టెస్టులు నిర్వహించిన చిత్రబృందం, ఆయన కొత్త లుక్ లీక్ అవ్వకుండా సెట్స్‌లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన సమయంలో దర్శకుడు బాబీ కొన్ని బీహైండ్ ది సీన్స్ (BTS) ఫొటోలను పంచుకున్నారు, కానీ అందులో ఎక్కడా చిరంజీవి లుక్ రివీల్ కాకుండా జాగ్రత్తపడడం అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో మెగాస్టార్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ పార్ట్, కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.   https://x.com/KvnProductions/status/2069006708534604240
  కొత్త మూవీ మార్కెట్ లోకి వచ్చిందంటే సగటు ప్రేక్షకుడు ముందుగా ఆ మూవీ తాలూకు రివ్యూ చూడటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రివ్యూ సంస్థలు ఉన్నట్టే ఈ జన్మ ఎత్తింది ఒక సినిమా నాశనం కోసమే అనేలా కావాలని రివ్యూ ఇచ్చే సంస్థలు ఉంటాయి. కొందరు రివ్యూల పేరుతో సినిమాని పూర్తిగా చంపేస్తున్నారనే ఆవేదన ఇండస్ట్రీ వర్గాల నుంచి  సైతం వ్యక్తమవుతు ఉంటుంది.   .ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమకి  చెందిన ప్రముఖ దర్శకుడు ఏబీ బినీల్(Ab binil)ఈ తీవ్రమైన అంశంపై నేరుగా రంగంలోకి దిగారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌ని  కలిసి ఈ సినిమా రివ్యూల వివాదం, దాని వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న నష్టాలపై అధికారికంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సినిమా నిర్మాణం వెనుక ఎంతోమంది శ్రమ, కోట్లాది రూపాయల పెట్టుబడి దాగి ఉంటాయని దర్శకుడు బినీల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో వచ్చే మితిమీరిన ప్రతికూల విమర్శలు ప్రేక్షకులు థియేటర్లకి  రాకుండా అడ్డుకుంటున్నాయి. కేవలం వ్యూస్, లైక్స్ కోసం కొందరు వ్యక్తులు చేసే నెగెటివ్ ప్రచారం వల్ల సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ డిజిటల్ రివ్యూల వ్యవస్థపై ప్రభుత్వం తగిన నిఘా ఉంచి చిత్ర పరిశ్రమని  కాపాడటానికి కఠినమైన నిబంధనలు లేదా మార్గదర్శకాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. Also read: Transfer trimurthulu: 100 కథల్ని విని ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో వచ్చాడు.. మరి హిట్ కొట్టాడా! ఈ అంశంపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ స్పందిస్తూ  చిత్ర పరిశ్రమకి  ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రివ్యూల పేరుతో జరుగుతున్న బ్లాక్‌మెయిలింగ్ లేదా దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం. ఒక సినిమా విజయం లేదా అపజయాన్ని నిర్ణయించే పూర్తి హక్కు కేవలం సాధారణ ప్రేక్షకుడికి మాత్రమే ఉంటుందని, ఉద్దేశపూర్వకంగా సినిమాను దెబ్బతీసేలా చేసే నెగెటివ్ రివ్యూల ట్రెండ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇక బినీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పొంగాల మూవీ కొన్ని రోజుల క్రితం విడుదలవ్వగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అదే మూవీ ఇప్పుడు ఓటిటి వేదికగా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.  
Megastar Chiranjeevi seems to be in full flow for Mega158, his much-awaited reunion with director Bobby Kolli after the blockbuster success of Waltair Veerayya. Mounted as a high-octane action entertainer and produced by KVN Productions on a grand scale, the film is progressing at a brisk pace. The team has successfully wrapped an explosive schedule in Pollachi where crucial action episodes were canned. One of the major highlights of the schedule reportedly featured Chiranjeevi performing intense stunt sequences, including driving a jeep in adrenaline-pumping moments. What stood out was director Bobby Kolli’s reaction to the output. Deeply impressed by Chiranjeevi’s energy and performance, Bobby was heard appreciating the actor for completely living the character and bringing tremendous intensity to the scenes. The team believes these sequences will offer fans a chance to witness the Megastar in a powerful and refreshed action avatar. Following the completion of Pollachi shoot, the film has now moved to Hyderabad for its next massive schedule starting today. Anaswara Rajan and Nivetha Pethuraj play the leading ladies in the film. The makers promise Mega158 to be a cinematic action spectacle designed for a grand theatrical experience. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు. కానీ వీటి వెనుక గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉండొచ్చు. శరీరంలో నీటి కొరత, తప్పుడు ఆహారపు అలవాట్లు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను మరింత పెంచవచ్చు. ఈ వీడియోలో నీటిని సరైన సమయంలో, సరైన విధంగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, గట్ హెల్త్‌ను మెరుగుపరచే సులభమైన మార్గాలు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే గట్ హెల్త్ మరియు మెదడు ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధం, రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా తెలియజేశారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా చాలామంది నెయ్యి లేకుండా భోజనం చేయరు.  చాలా రకాల తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి వాడతారు.  నెయ్యి కలపడం వల్ల వాటి రుచి పెరగడమే కాకుండా, శరీరానికి కొవ్వు కూడా అందుతుంది, ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే చాలామంది భారతీయుల ఇళ్లలో నెయ్యి కనిపిస్తుంది. వెనుకటి కాలంలో నెయ్యిని ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ ఇప్పుడు నెయ్యిని మార్కెట్లో కొనడం అలవాటు అయిపోయింది. శరీరానికి నెయ్యి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో  నెయ్యిని తినడానికి వెనుకాడుతున్నారు. దీనికి కారణం నెయ్యిలో కల్తీ పెరిగిపోవడమే. ఈ కల్తీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా హాని కలిగిస్తోంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారు? కల్తీ నెయ్యిని చౌక నూనెలు, కొవ్వులు, రసాయనాలు, బంగాళాదుంపలు, యూరియా, ఫ్రెషనర్లు, స్వీటెనర్లతో పాటు దాని నాణ్యత , భద్రత రెండింటినీ తగ్గించే అనేక ఇతర హానికరమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది నెయ్యి యొక్క పోషక విలువను తగ్గించి, ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగంటే.. ఒక పరీక్ష నాళికలో 1 మి.లీ కరిగించిన నెయ్యి తీసుకోవాలి. దీనికి 1 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl) కలపాలి. తర్వాత అర టీస్పూన్ చక్కెర కలపాలి.  మిశ్రమాన్ని కనీసం రెండు నిమిషాల పాటు బాగా కదిలించాలి.  తర్వాత దాన్ని ఒకపక్కన ఉంచాలి. నెయ్యి స్వచ్ఛమైనదైతే దాని రంగులో ఎలాంటి మార్పు ఉండదు.  నెయ్యిలో కల్తీ జరిగితే, దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. పరీక్షించేటప్పుడు జాగ్రత్త.. ఇంట్లో HCl ఉపయోగించి నెయ్యిలో కల్తీని పరీక్షించాలని అనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక బలమైన ఆమ్లం , కొన్ని చుక్కలు  శరీరంపై పడినా హానికరం కావచ్చు. ఇది నెయ్యిని పరీక్షించడానికి, నెయ్యి స్వచ్ఛతను నిర్థారించడానికి సహాయపడుతుంది.  అవసరమైతే నెయ్యిని ల్యాబ్ టెస్ట్ కూడా చేయించవచ్చు.                            *రూపశ్రీ.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!