LATEST NEWS
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.! అస్సాంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం యావత్ రాష్ట్రాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన భారీ కంటెయినర్ ట్రక్కు అదుపుతప్పి ఒక ప్రయాణికుల మినీ బస్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దుర్ఘటన అస్సాంలోని ప్రసిద్ధ కాజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో చోటుచేసుకుంది. కొహోరా పరిధిలోని రంగాజన్ ప్రాంతంలో ఉన్న హాతిఖులి టీ ఎస్టేట్ సమీపంలో నేషనల్ హైవే-715పై ఈ ప్రమాదం సంభవించింది. బోకాఖత్ నుండి నాగావ్ వైపు వెళ్తున్న మినీ బస్సును ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాద తాకిడికి మినీ బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న అనేక మంది ప్రయాణికులు ఛిన్నాభిన్నమైన వాహన భాగాల మధ్య ఇరుక్కుపోయారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పలువురు కళాశాల విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. తరగతులు ముగించుకుని లేదా ఇతర పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న సమయంలో ఈ మృత్యువు కబళించింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీపంలోని కొహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కబళించబడిన వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గోలాఘాట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వప్ననీల్ దేకా మాట్లాడుతూ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. ఈ కఠినమైన రోడ్డు ప్రమాదంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులపై భారీ వాహనాల అతివేగం, నిబంధనల ఉల్లంఘనపై ప్రయాణికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా రవాణా శాఖ అధికారులు, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలని, భారీ వాహనాల రాకపోకలపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దారుణ ఘటన స్థానిక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, అస్సాం వ్యాప్తంగా ఈ వార్త కలకలం రేపింది.     [ Kaziranga road accident, Assam accident, mini bus truck collision, Kohora road crash, Assam news updates]  
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్   ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఏపీ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ (APEX) కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన 6 ప్రతిభావంతమైన స్టార్టప్ ల నిర్వాహకులను అభినందించి, ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి చెందిన 31 స్టార్టప్ లకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ-2024 కింద తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందించారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన అప్రూవల్ లెటర్స్, చెక్కులను ఆయా స్టార్టప్ సంస్థలకు అందజేశారు. రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ ల అభివృద్ధి.! ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్ వంటి సంప్రదాయ రంగాల నుంచి క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల వరకు ఈ ఎకోసిస్టమ్‌లను నిర్మిస్తున్నాం. ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను సందర్శించినప్పుడు అక్కడ ఎన్నో అద్భుతమైన విజయగాథలు విన్నాను. అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి.  ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన విడిభాగాల తయారీ వైపు కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను మలచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఏపీలో క్వాంటం ఎకోసిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్, స్టీల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంగాట్, సోలార్, వేఫర్, సెల్ తయారీ, ఎయిర్ కండిషనింగ్, ఆక్వా, క్వాంటం, మెడికల్ డివైజెస్, ఫార్మా, డేటా ఎకోసిస్టమ్ వంటి మొత్తం 25 రంగాలకు సంబంధించిన ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ప్రతి ఎకోసిస్టమ్‌లో వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ తయారు కావాలంటే అనేక విడిభాగాలు ఒకచోట కలవాలి. బ్యాటరీ, కెమెరా మాడ్యూల్, కెమెరా లెన్స్, స్క్రీన్, ఇతర ఉపకరణాలు, ప్యాకేజింగ్, టెస్టింగ్ ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ మొత్తం సరఫరా వ్యవస్థ, తయారీ ప్రక్రియ దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలోనే అందుబాటులో ఉండాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తోంది. నైపుణ్యాభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఖాకీ వెనుక ఓ సామాజిక యోధుడు..హైదరాబాద్ కొత్త సీపీ మహేష్ భగవత్ ప్రస్థానం.! రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయి. బీచ్ శాండ్ నుంచి వీటి తవ్వకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో కలిసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి, దానికి అనుగుణంగా ప్రత్యేక కరిక్యులమ్ రూపొందించడానికి కృషి చేస్తున్నాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (SMR) రంగంలో కూడా మన దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన ఇంజనీర్లను తయారు చేయాల్సిన అవసరం ఉంది.  రతన్ టాటా గారు అందరికీ స్ఫూర్తి.! రతన్ టాటా గారు మనందరికీ నిజమైన స్ఫూర్తి. ఆయన నాయకత్వం మనందరినీ ప్రేరేపిస్తుంది. మనం మరింత ఉన్నత విజయాలు సాధించే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు నైతిక విలువలు, నిజాయతీతో కూడిన మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యం. రతన్ టాటా గారు భారతదేశానికి అందించిన గొప్ప విలువలు ఇవే. ఆయన ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. అందుకే ఈ ఎకోసిస్టమ్‌కు ఆయన పేరు పెట్టడం జరిగింది. మీ అందరితో కలిసి ఈ సమగ్ర ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి మేం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఇంటికో పారిశ్రామికవేత్త ఏపీ లక్ష్యం.! ఇంటికో పారిశ్రామికవేత్త ఏపీ లక్ష్యం. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం, లక్ష్యం. ఆయనకు ఉన్న అపారమైన అనుభవం వల్ల మేం సరైన దిశలో ప్రయాణిస్తూ.. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నాం. ఆయనకు మద్దతుగా యువతరంతో కూడిన, కొత్త ఆలోచనలతో కూడిన మంత్రుల బృందం ఉంది. ముఖ్యమంత్రి  విజన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం మా బాధ్యత. స్కైరూట్, సాగర్ డిఫెన్స్ సంస్థలే ఉదాహరణ.!  పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలపై నమ్మకంతో, వారికి అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు స్కై రూట్, సాగర్ డిఫెన్స్ సంస్థలే ఉదాహరణ. స్కైరూట్ పై నమ్మకంతో 18 నెలల క్రితం స్పేస్ సిటీలో 300 ఎకరాల భూమిని కేటాయించాం. మరోవైపు సాగర్ డిఫెన్స్ సంస్థ రానున్న రోజుల్లో ఐపీవోకు వెళ్లనుంది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సముద్ర రంగంలో ఉపయోగించే డ్రోన్లను సాగర్ డిఫెన్స్ సంస్థ తయారుచేస్తోంది. ఒక పారిశ్రామికవేత్తతో కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ మంత్రి లోకేశ్ తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందిస్తాం.! పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడానికి, వారి ఆలోచనలను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు ఎక్స్ పోజర్ విజిట్స్, వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం కల్పిస్తాం. మీలో పట్టుదల, సాధించాలనే తపన ఉండాలి. మీ విజయాన్ని నిర్ణయించేది, మీ భవిష్యత్తును నిర్దేశించేది ఆ సాధించాలనే తపనే.  ఆ పట్టుదలను, ఆ లక్ష్యసాధన తపనను ఎప్పటికీ కోల్పోవద్దు. గొప్ప విజయాలు సాధించి ఏపీకి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి వంగలపూడి అనిత, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ఎం.సూర్యతేజ పాల్గొన్నారు.  మీకు నచ్చవచ్చు: 1999లోనే చంద్రబాబు ముందుచూపు..నేడు రూ.75 వేల కోట్ల ఆదాయం: గ్రంధి మల్లికార్జునరావు మీకు నచ్చవచ్చు: మీ తాత గ్రేట్.. మా తాత గ్రేట్: విశాఖ వేదికగా లోకేష్, ఉపాసనల ఆసక్తికర సంభాషణ.!     [ RTIH Visakhapatnam, Nara Lokesh, AP Industrial Ecosystems, MSME Parks Andhra Pradesh, CM Chandrababu ]  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కీలక నేత విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంత పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి విదితమే.   వైసీపీ అధినేత జగన్ కు అత్యంత నమ్మకమైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఆయన,  పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. వైయస్ కుటుంబ నీడ నుంచి బయటపడి, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కొత్త పార్టీ ఆవిర్భావ వేదికపై విజయసాయి రెడ్డి ఊహించిన విధంగానే వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మత విశ్వాసాలను ప్రస్తావిస్తూ, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్డి సామాజిక వర్గ మద్దతును ఆశిస్తున్నారంటూ   ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. సాయిరెడ్డి చేసిన ఈ విమర్శలకు,  ఆయన కొత్త పార్టీకి వైసీపీ నుంచి ఎవరు, ఎలాంటి సమాధానం ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.   ఇది కూడా చదవండి: విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? సాయిరెడ్డి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ఆయన సొంత పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడారు. విజయసాయి పేరు నేరుగా  ప్రస్తావించకుండా  జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నంత కాలం కొంతమంది వ్యక్తులు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటారని విమర్శించారు. జగన్ కల్పించిన నమ్మకం, విశ్వసనీయత వల్లే వారికి రాజకీయ వేదిక లభించిందని, కానీ నేడు వారు పార్టీ కంటే తామే గొప్ప అని భ్రమపడుతున్నారని చెవిరెడ్డి అన్నారు.   జగన్ లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఎటువంటి గుర్తింపు, విలువ లేవనే విషయాన్ని   గ్రహించలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి ప్రాధాన్యత లేని, ప్రభావం చూపలేని చిన్న పార్టీల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఇసుమంతైనా ఉండదన్నారు.   మీకునచ్చవచ్చు:  విజయసాయి కొత్త పార్టీ: వైసీపీకి జరిగే నష్ట మేంటి.. రాష్ట్ర రాజకీయాల్లో పీఆర్పీ ప్రభావమెంత.? విజయసాయి కొత్త పార్టీ: వైసీపీ బీ టీమ్ అంటూ చర్చలు.! [Vijaya Sai Reddy  PRP Party, Chevireddy Reaction, YCP TeluguOn]  
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు. నేడు ఆ విమానాశ్రయం వల్ల ఏటా రూ.75 వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి” అని జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు అన్నారు. ఏపీ పారిశ్రామిక భవిష్యత్తుకు సరికొత్త దిశ.! విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026లో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రాంధి మల్లికార్జున రావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తు, ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, నాయకత్వం కీలకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉపాధి.! రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, కార్గో కనెక్టివిటీ అభివృద్ధి చెందితే ఏపీ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రశంసలు.! పెట్టుబడిదారులు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వంపై నమ్మకం, విధానాల్లో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం ఎంతో ముఖ్యమని మల్లికార్జున రావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ముందుచూపు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ప్రశంసించారు. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం.! కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అభినందనీయమన్నారు. బలమైన నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   మీకు నచ్చవచ్చు: సజ్జనార్‌ యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్..సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.! మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌ పోలీస్‌ బాస్‌ మార్పు.. సజ్జనార్‌ స్థానంలో మహేశ్‌ భగవత్‌.! [ CII Partnership Summit 2026,  CM Chandrababu Naidu, GMR Group, Grandhi Mallikarjuna Rao, Shamshabad Airport, Hyderabad Airport ]
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు. పంజాబ్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన ఘటన ఈ నానుడిని అక్షరాలా నిజం చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఒక పేద కుటుంబానికి, పుట్టిన పసిపాప అదృష్టాన్ని మోసుకొచ్చింది. చిన్నారి వెలుగు చూసిన ఒక్క రోజూ తిరగకముందే ఆ తండ్రిని కోట్లలో సంపద వరించింది. పంజాబ్‌లోని మాన్సా జిల్లా బరేటా ప్రాంతానికి చెందిన యుధ్‌వీర్ సింగ్ వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతనికి, ఇల్లు కట్టే క్రమంలో చేసిన అప్పులు పెరిగిపోయాయి. భార్య హర్మన్ కౌర్ గర్భవతిగా ఉన్న సమయంలో కుటుంబ పోషణ భారం మరింత భారంగా మారింది. ఈ తరుణంలో నవంబర్ 4న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక లాటరీ స్టాల్ కనిపించింది. భార్య వారించినప్పటికీ, ఆమె పేరు మీదే రూ. 200 పెట్టి ఒక ‘పంజాబ్ స్టేట్ డియర్ 200 మంత్లీ’ లాటరీ టికెట్‌ను యుధ్‌వీర్ కొనుగోలు చేశాడు. జీవితంలో తొలిసారి అతను ఈ ప్రయోగం చేయడం విశేషం. ఆ తర్వాత నవంబర్ 6న హర్మన్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇంట్లో సిరిమల్లె లాంటి పాప అడుగుపెట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ఆ సంతోషం మరవకముందే మరుసటి రోజు అనగా నవంబర్ 7న వచ్చిన లాటరీ ఫలితాలు ఆ కుటుంబాన్ని నివ్వెరపరిచాయి. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ పోలీస్‌ బాస్‌ మార్పు.. సజ్జనార్‌ స్థానంలో మహేశ్‌ భగవత్‌.! యుధ్‌వీర్ కొన్న ఆ ఒక్క లాటరీ టికెట్‌కు నంబర్ వన్ ప్రైజ్ తగిలింది. ఏకంగా రూ. 1.5 కోట్ల భారీ బహుమతి ఆ కుటుంబం సొంతమైంది. బిడ్డ పుట్టిన 24 గంటలు కూడా గడవకముందే కోటీశ్వరులు కావడంతో బంధుమిత్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తమ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి రూపంలో కూతురు వచ్చిందని భావించి ఆ దంపతులు చిన్నారికి ‘బర్కత్’ అని నామకరణం చేశారు. ఈ అనూహ్య పరిణామంపై యుధ్‌వీర్ స్పందిస్తూ.. దేవుడు తమ కష్టాలను కనుమరులు చేసేందుకే బిడ్డ రూపంలో ఈ అదృష్టాన్ని ప్రసాదించాడని ఆనందం వ్యక్తం చేశాడు. వచ్చిన డబ్బుతో ముందుగా అప్పులన్నీ తీర్చేస్తానని, మిగిలిన మొత్తాన్ని కూతురి భవిష్యత్తు కోసం పక్కాగా పెట్టుబడి పెడతానని తెలిపాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారి పుట్టుకతోనే ఇంట సంపదను నింపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అరుదైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుండటంతో ఆ కుటుంబానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఆ పాప ఉన్నత చదువులు చదివి కుటుంబానికి మరింత పేరు తెస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: NVIDIA సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా.. అసలు కారణం ఇదేనా.! మీకు నచ్చవచ్చు: ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!     [ Punjab State Dear Lottery, Mansa Bareta Punjab, Carpenter wins lottery, Punjab lottery winner, 15 crore lottery jackpot ]  
ALSO ON TELUGUONE N E W S
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల్లోనూ ఎన్నో అద్భుతమైన పాటలు, సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.  అయితే ఇప్పుడు కీరవాణి సంగీతం గురించి కాకుండా ఆయనలో వచ్చిన శారీరక మార్పు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కీరవాణి ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆయన ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  హైదరాబాద్ పర్యటనలో తన ఆప్తమిత్రుడు కీరవాణిని కలిసిన ఆయన.. గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మారిపోయారో తెలియజేస్తూ బిఫోర్, ఆఫ్టర్ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గడం వెనుక ఆయన పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కీరవాణిని కలిసినప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారని చెప్పారు.  ఆయన నడకలో కూడా కొత్త ఉత్సాహం కనిపించిందని, సంతోషంగా ఉన్న తన మిత్రుడిని చూసి ఎంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. సంగీతంలో మేధావి అయిన కీరవాణి ఇప్పుడు ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని అనుపమ్ ఖేర్ కొనియాడారు. అనుపమ్ ఖేర్, కీరవాణి మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో కూడా పలుమార్లు వీరిద్దరూ కలుసుకున్నారు. ఇది కూడా చదవండి: బాలల దినోత్సవం కానుకగా బంపరాఫర్.. ఈ సినిమా టికెట్ రూ.150 మాత్రమే.!  2024 ఫిబ్రవరిలో అనుపమ్ ఖేర్ హైదరాబాద్ వచ్చినప్పుడు కీరవాణిని కలిశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ టోస్ట్ తినడానికి తనను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారని, అయితే అది మూసి ఉండటంతో నిరాశ చెందామని అనుపమ్ సరదాగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ పర్యటనలో కీరవాణిని కలుసుకొని ఆయనలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు.  ప్రస్తుతం కీరవాణి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'వారణాసి'కి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు అనుపమ్ ఖేర్ కూడా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ'లో జటాయువు పాత్రకు వాయిస్ అందించడంతో పాటు కథనంలో భాగమవుతున్నారు. మొత్తానికి 65 ఏళ్ల వయసులో కీరవాణి 22 కిలోల బరువు తగ్గడం, ఆయనలో వచ్చిన మార్పు చూసి అనుపమ్ ఖేర్ ప్రశంసించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: ఇష్టం లేని పెళ్లి.. భర్తపై మర్డర్ కేసు.. కీర్తి సురేశ్ కొత్త సినిమా కథ ఇదే! రణబాలి: ఓటీటీలో ఊహించని రెస్పాన్స్.!     [MMKeeravani, AnupamKher, VaranasiMovie, SSRajamouli, MaheshBabu] 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక తాజాగా దిల్ రాజు స్వయంగా ఈ న్యూస్ పై స్పందించారు. దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన రామాయణ, సీన్ సినిమాలు మంచి వసూళ్ళతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ తో సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. "పవన్ కళ్యాణ్ గారిని సినిమా కోసమే కలిశారా? 'ఓజీ 2' మీ కాంపౌండ్ లో ఉంటుందా?" అనే ప్రశ్న మీడియా నుంచి వచ్చింది. ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ ప్రభంజనం.. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణ’.! దానికి దిల్ రాజు బదులిస్తూ.. "పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ చేసిన ఓ నిర్మాతగా.. అవకాశముంటే ఆయనతో మరో సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే కలిశాను. ఆ ఫొటోలో నా హ్యాపీనెస్ లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే అద్భుతంగా ఉండాలని అనుకుంటాను. ఆ దిశగానే అడుగులు వేస్తాను. అయితే కన్ఫర్మ్ అవ్వకుండా ఇప్పుడే పూర్తి వివరాలు చెప్పలేను." అన్నారు. మీకు నచ్చవచ్చు:  ‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.! నిర్మాతగా మారుతున్న బాలయ్య కుమార్తె.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా.? https://x.com/Theteluguone/status/2121202533846892665       [Dil Raju, Pawan Kalyan, OG 2 Movie, Ramayana, Tollywood]  
Jr NTR and star director Trivikram Srinivas have quietly put an end to speculation surrounding their much-awaited collaboration with a picture of them together. The photograph, shared without any formal announcement, has caught the attention of fans amid reports about differences between Trivikram and producer S Radhakrishna. Rumours have been circulating that Trivikram and his longtime collaborator S Radhakrishna, who backed several films under Haarika & Haasine Creations, have fallen out following the failure of Aadarsha Kutumbam AK47. The reported differences had also fuelled speculation that the NTR-Trivikram project, which was expected to bring the combination together again, had been shelved. However, their latest picture offers a different indication. NTR and Trivikram choosing to appear together at a time when the project is being discussed has naturally triggered fresh interest in their collaboration. Also Read: AR Picchi Premalo celebrates marital love Without giving an announcement they just silently gave confirmation with Nandamuri Kalyanram that the film is going to go on floors for sure. Anything can change after a point in time but for now, this can be seen as rumors being put to rest.  Trivikram Srinivas has said to have completed the script, started pre-production and he will take the movie on floors once NTR finishes Dragon with Prashanth Neel. Aadarsha Kutumbam did end up as a failure at the box office but that doesn't really need to stop a film on Lord Karthikeyan.  Check Out:  Gondhal Movie Review                       Itllu Arjuna Movie Review  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమా టికెట్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఓ చిత్రబృందం పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గిస్తూ మంచి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న 'జయంత్ అండ్ ది జింగో పెన్' సినిమా టికెట్ ధరలను రూ.250 నుంచి రూ.150కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పిల్లలందరికీ ఈ సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించారు. బాలల దినోత్సవం రోజునే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడంతో పాటు, చిన్నారులకు ప్రత్యేక కానుకగా టికెట్ ధరలను తగ్గించారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. తమ సినిమాను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కలిసి ఈ సినిమాను చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరను రూ.150కి తగ్గించినట్లు చెప్పారు. ఇప్పటికే పలు పాఠశాలలు ప్రత్యేక ప్రదర్శనల కోసం థియేటర్లను బుక్ చేసుకున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా, కొందరు ఇప్పుడు తమ సినిమాలను బాలల దినోత్సవ ప్రత్యేక చిత్రాలుగా ప్రమోట్ చేస్తున్నారని, ఆ విషయంలో ప్రేక్షకులు పొరపాటు పడవద్దని ఆయన అన్నారు. నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. పిల్లల మార్కులను మాత్రమే కాకుండా వారి మనసులను కూడా అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. ఇందులోని భావోద్వేగాలు పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా కనెక్ట్ అవుతాయని చెప్పారు. సహ నిర్మాత షఫి కూడా పిల్లలకు కానుకగా టికెట్ ధరలను తగ్గించామని, ఇప్పటికే పలు చోట్ల బుకింగ్స్ బాగున్నాయని వెల్లడించారు. ఇది కూడా చదవండి: ‘DNK’ మూవీ రివ్యూ ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టితో పాటు ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ బొలిశెట్టి సంగీతం అందించడంతో పాటు పాటలు కూడా రాశారు. పిల్లల మనస్తత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనల చుట్టూ ఈ కథ సాగనుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసేందుకు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తి చూపిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు టికెట్ ధరను తగ్గించడం ప్రేక్షకులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.  మీకు నచ్చవచ్చు: ఇష్టంలేని పెళ్లి, భర్తపై మర్డర్ కేసు.. కీర్తి సురేష్ కొత్త సినిమా కథ ఇదే.! ‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ     [JayanthAndTheJingoPen, JayanthBolisetty, NaveenDesaboyina, DivyaPraveen Bolisetty, ChildrensDaySpecial]
Nithiin's upcoming film Alias Rukmini has unveiled its second single, Picchi Premalo, offering a refreshing glimpse into the romantic world of Krishna and Rukmini. Unlike conventional romantic numbers, the song revolves around the growing affection of a husband towards his wife and the beautiful madness of being in love. Vijai Bulganin composes a pleasant melody, with rich instrumentation featuring flute, guitar and subtle percussion. The interludes add a dreamy quality, making it an instantly likeable romantic number. Karthik's soulful vocals bring the emotions alive, while Krishna Kumar's lyrics beautifully capture a husband who is completely smitten by his wife. The writing reflects how Rukmini's arrival gradually makes her the centre of Krishna's world. Nithiin looks charming as Krishna and brings warmth to the character through his performance. His chemistry with Aafiya Sayed feels natural, while the sweet moments between the couple make the song particularly relatable. Also Read: Itllu Arjuna Movie Review  What makes Picchi Premalo interesting is its portrayal of everyday marital romance rather than larger-than-life expressions of love. The song has the potential to connect with married audiences and could even find popularity through social media reels. Presented by Nani and directed by Murali Kanth Devasoth, Alias Rukmini is produced by Deepthi Ganta. The film is scheduled to release on December 4, and this pleasant romantic number has added another interesting dimension to its promotional campaign. Check Out:   DNK Movie Review                       Gondhal Movie Review  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
కీర్తి సురేశ్ ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సత్యవాన్ సావిత్రి'. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్లను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సావిత్రి అనే యువతికి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి జరుగుతుంది. ఆమె భర్త దీపక్‌తో మొదట్లో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే క్రమంగా అతని మంచితనాన్ని అర్థం చేసుకొని అతనికి దగ్గరవుతుంది. ఇంతలో దీపక్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. వెరోనికా అనే మహిళ హత్యకు అతడే కారణమనే ఆరోపణలు వస్తాయి. దీంతో తన భర్తను కాపాడుకోవడం కోసం సావిత్రి లాయర్‌గా కోర్టులో అడుగుపెడుతుంది. అయితే ఈ కేసులో ఆమెకు ఎదురయ్యే ప్రత్యర్థి మరెవరో కాదు.. మిస్కిన్. మార్కండేయన్ అనే సీనియర్ న్యాయవాది పాత్రలో ఆయన కనిపించనున్నారు. అనుభవం ఉన్న న్యాయవాదితో ఓ జూనియర్ లాయర్‌గా కీర్తి సురేశ్ ఎలా పోరాడింది? తన భర్త నిర్దోషి అని నిరూపించగలిగిందా? అసలు వెరోనికా హత్య వెనుక ఉన్న నిజాలేంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. కోర్టు సన్నివేశాలతో పాటు భార్యాభర్తల మధ్య వచ్చే సన్నివేశాలు, కామెడీ, సస్పెన్స్ అంశాలతో ట్రైలర్‌ను రూపొందించారు. ముఖ్యంగా కీర్తి సురేశ్, మిస్కిన్ మధ్య జరిగే వాదోపవాదాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కీర్తి సురేశ్ లాయర్ పాత్రలో కొత్తగా కనిపిస్తుండగా, మిస్కిన్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇది కూడా చదవండి: కాజల్ అగర్వాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఆమె కళ్ల ముందే ముగ్గురు మ‌ృతి ఈ సినిమాలో కీర్తి సురేశ్, మిస్కిన్‌లతో పాటు చారుకేశ్, బాల సరవణన్, శిల్పా మంజునాథ్, ఆర్. సుందరరాజన్, మాలా పార్వతి తదితరులు నటించారు. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. జీ స్టూడియోస్, డ్రంస్టిక్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తొలుత జులై 24న విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా వేశారు. తాజాగా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరి ఈ కోర్టు డ్రామాతో కీర్తి సురేశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. మీకు నచ్చవచ్చు: ‘DNK’ మూవీ రివ్యూ టాలీవుడ్ నెక్స్ట్ నెంబర్‌వన్ అనశ్వర రాజనేనా? ఆ హీరో మాట నిజం కాబోతుందా?     [KeerthySuresh, SathyavanSavithiri, Mysskin, PraveenSVijaay, TeluguMovie]
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అక్టోబర్ 16న విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై ఓటీటీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. 'రణబాలి' విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'టాక్సీవాలా' మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దీనికి తోడు 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమా కావడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానీ థియేటర్లలో మాత్రం సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. బ్రిటిష్ పాలన కాలం, మద్రాస్ కరువు నేపథ్యంలో దర్శకుడు ఓ భారీ కథను చెప్పే ప్రయత్నం చేశారు. విజయ్ నటన, విజువల్స్‌కు ప్రశంసలు వచ్చినా.. కథనం నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో సాగదీత, ఎమోషనల్ కనెక్ట్ తగ్గడం వంటి అంశాలపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రూ.80 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో సినిమాను చూసే అవకాశం రావడంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం, విజయ్ దేవరకొండ నటన, రష్మికతో కెమిస్ట్రీ, బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లూ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఇది కూడా చదవండి: త్రివిక్రమ్, చినబాబు మధ్య విభేదాలు.. 'గాడ్ ఆఫ్ వార్' ఆగిపోయిందన్న వార్తలకు చెక్.! ఓటీటీ ప్రేక్షకుల నుంచి రణబాలి సినిమాకి మంచి స్పందనే లభిస్తోంది. విజయ్ నటనను ప్రశంసిస్తున్నారు. అలాగే విజయ్-రష్మిక మధ్య సీన్స్ తో పాటు, యాక్షన్ సీన్స్, పతాక సన్నివేశాలు బాగున్నాయని కొనియాడుతున్నారు.  మొత్తానికి థియేటర్లలో నిరాశపరిచిన 'రణబాలి'కి ఓటీటీలో మంచి ఆదరణే లభిస్తోంది. ఇది బ్యాడ్ ఫిల్మ్ కాదని, ఇటీవల విజయ్ నుంచి సినిమాల్లో చాలా బెటర్ ఫిల్మ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు:  శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.? 50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన సినిమా.!       [Ranabaali OTT Response, Netflix, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan]  
సెల్యులాయిడ్ పై మలయాళ భామ అనశ్వర రాజన్  పెర్ఫార్మ్ చూస్తుంటే మండే ఎండ సైతం నిండు జాబిలిని తలపిస్తుంది. అంతలా తన క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేసి పడేస్తుంది. ప్రెజెంట్ థియేటర్ లో రన్ అవుతున్న ఇట్లు అర్జున ఒక ఉదాహరణ. ఈ నేపథ్యంలో రీసెంట్ గా అనశ్వర రాజన్ గురించి సినీ సర్కిల్స్ లో ,అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.   2025 చివర్లో విడుదలైన ‘ఛాంపియన్’ తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనశ్వర, తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను తన క్యూట్ లుక్స్, అద్భుతమైన అభినయంతో కట్టిపడేసింది.  బాక్సాఫీస్ వద్ద ఛాంపియన్  ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అనశ్వర నటనకి మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.‘ఇట్లు అర్జున’ లో అనశ్వర నటనకి మంచి స్పందన లభిస్తోంది.  ప్రమోషన్లలో భాగంగా అనశ్వర ధరించిన చీరకట్టు, సంప్రదాయ దుస్తులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు అనశ్వరని 'టాలీవుడ్ న్యూ క్రష్’ అనే  ట్యాగ్‌లైన్‌ ని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆమె టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.  ఇది కూడా చదవండి: ఓంలో సాయి పల్లవి క్యారక్టర్ కి ఇన్ స్పిరేషన్ ఎవరో తెలుసా! ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’లో అనశ్వర అమ్ములు’ గా కీ రోల్ పోషిస్తుంది.   నెక్స్ట్ ఇయర్  జనవరి 13న సంక్రాంతి కానుకగా  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాకుండా, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘7/జి రెయిన్‌బో కాలనీ 2’ చిత్రంలోనూ  హీరోయిన్‌గా  దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.  ఇక్కడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. 2025 డిసెంబర్‌లో జరిగిన ‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్, అనశ్వర డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయారు. పరభాషా నటి అయినప్పటికీ తెలుగు నేర్చుకుని, తన రోల్ కి  తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. "ఈ సినిమా తర్వాత పెద్ద నిర్మాణ సంస్థలు, అగ్ర దర్శకుల నుంచి మీకు వరుస అవకాశాలు వస్తాయి, టాలీవుడ్‌లో మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది" అని రామ్ చరణ్ అప్పట్లోనే జోస్యం చెప్పారు. అంతేకాదు, ఇటీవల జరిగిన ‘ఇట్లు అర్జున’మ్యూజికల్ కాన్సర్ట్‌లోనూ  చరణ్ పాల్గొని, ‘కాకా’ సినిమాలో అనశ్వర నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.  ఒకవైపు అభినయానికి ప్రాధాన్యమున్న రోల్స్  ఎంచుకుంటూనే, మరోవైపు చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాల్లో భాగం కావడం అనశ్వర రాజన్ కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. భాషపై పట్టు సాధించడం, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం, గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి లక్షణాలు ఆమెను మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే, రామ్ చరణ్ అన్నట్లుగానే రాబోయే రెండేళ్లలో అనశ్వర రాజన్ టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ రేసులో అగ్రస్థానంలో నిలవడం ఖాయమని సినీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.  ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజ తులాభారం తో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లు ఉన్నాయి.ఏది ఏమైనా కాలం కలిసొస్తే అనశ్వర రాజన్  నెంబర్ వన్ చైర్ లో కూర్చోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే కాలాన్ని సైతం తన పెర్ఫార్మ్ తో తన ఆధీనంలోనే ఉంచుకోగలదు.    మీకు నచ్చవచ్చు: ఇట్లు అర్జున మూవీ రివ్యూ! మీకు నచ్చవచ్చు: మాయ లేడీ మూవీ రివ్యూ!   [Anaswara Rajan, Itlu Arjuna, Chiranjeevi, Ram Charan, Aneesh]
Cast: Kishor Kadam, Ishita Deshmukh, Yogesh Sohoni, Nishad Bhoir, Anuj Prabhu, Suresh Vishwakarma, Dhruv Thoke Crew:  Cinematography by Amalendu Chaudhary Editing by Ashish Mhatre Music by Ilaiyaraaja Written & Directed by Santosh Davakhar Produced by Santosh Davakhar, Diksha Davakhar Gondhal got huge attention across the nation as it got selected as India's official entry for 99th Academy Awards, Oscars. The movie released in Telugu language on 13th November. The movie explores an 800-year tradition that happens in Maharashtra in villages during wedding. Let's discuss about this Marathi film in detail.  Plot: Bhivaba (Kishor Kadam), a Gondhali, goes to perform at the big wedding of Ananda (Yogesh Sohoni) and Suman (Ishita Deshmukh). But he has an issue with how his daughter-in-law and son are talked about in the village. Mainly, about the fear of Patil (Suresh Vishwakarma) and Sarjerao (Nishad Bhoir). Anandrao is a very friendly and innocent person but people call him impotent. Suman is confused by this talk and she feels she lost an opportunity of being Patilbai as Sarjerao loves her.  Bhivaba advices her to not trust in Sarjerao and tells her that they are bad people. At the event, she is seen very flirtatious with Sarjerao and he challenges to give her Mu Maa, to a local person. Later, she meets Murali, Sahebrao (Anuj Prabhu) and falls in his lap. They both have been in love from a long time and her parents forced her to marry Ananda. She plans to elope with Saheb. Will they elope? Will Sarjerao let her slip away? What will happen in this Gondhal night event? Watch the film to know more.  Analysis:  Santosh Davakhar has created a very realistic village atmosphere to bring this tradition to big screen. His passion is visible in the first 25 minutes - Oner or One shot sequence. The movie tends to go downwards after this sequence even though it is a simple film that majorly focuses on bringing this tradition to life and connect it to the main story.  Also, the movie tends to focus more on the tradition than the story at times making audiences a little bit too restless after a point. Still, technical brilliance is top notch as sound design scores big. The instruments played at Gondhal and authentic voices are restored to give the similar experience that villagers experience at such events.  Also Read: Itllu Arjuna Movie Review Still, movie falters at being an engaging narrative as the twists get darker, the narrative loses the spark it showcased in establishment. Not about continuing with oners but the culmination of events tend to be too convenient. Divine intervention is hinted at places while things tend to be more realistic to a level of being surreal. The flirtatious scenes, the repetitive nature of characters' interactions does tend to make too much to be involved.  Even the lovers of craft tend to think the movie does go overboard trying to be celebration of that art and tradition but loses the focus that the main characters and story had to bring into it. There are Macbeth parallels and performances are really excellent. Ilaiyaraaja score is perfection. While technically movie is sound and well crafted, the craft takes over too much and story appears pale in comparison.  Positives:  Representation of Tradition Performances Technical values Music Negatives: Writing could've better Feels too convenient Twists appear predictable Bottomline: Gondhal is not a ground-breaking achievement but its craft speaks more than the story!  Rating: 2.5/5    Check Out:  DNK Movie Review                        Naslen wraps his next film shooting Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రియాలిటీ'. ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట 'రుత్తూ' ఇప్పుడు సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేమలో పడిన ఇద్దరి మనసుల్లో కలిగే అందమైన భావాలను చాలా సింపుల్‌గా, వినసొంపైన సంగీతంతో ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమలో పడితే ప్రపంచమే కొత్తగా కనిపిస్తుందా?. అవును.. ఈ పాటలో ప్రధానంగా కనిపించే భావం ఇదే. ఒకరిని చూసినప్పుడు కలిగే ఆనందం, వారి చిన్న చిన్న చూపుల్లోనే సంతోషాన్ని వెతుక్కోవడం, వాళ్లతో మాట్లాడిన క్షణాలను పదే పదే గుర్తు చేసుకోవడం.. ఇలా ప్రేమలో పడిన వ్యక్తి మనసులో జరిగే మార్పులను పూర్ణాచారి తన సాహిత్యంలో అందంగా ఆవిష్కరించారు. సాధారణంగా మాస్ బీట్స్, ఫాస్ట్ రిథమ్స్‌తో పాటలను హిట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు మంచి గుర్తింపు ఉంది. కానీ 'రుత్తూ' పాటలో మాత్రం ఆయన తనలోని మరో సంగీత దర్శకుడిని పరిచయం చేశారు. పెద్దగా హడావుడి చేసే మ్యూజిక్ కాకుండా.. మెలోడీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పాటకు కపిల్ కపిలన్ గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేమలోని సున్నితమైన భావాలను పలికించడానికి ఆయన వాయిస్ చక్కగా సరిపోయింది. పాటలోని భావోద్వేగానికి తగ్గట్టుగా మృదువుగా పాడారు. ముఖ్యంగా మెలోడీని ఎంజాయ్ చేసే వారికి ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది. ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.? పూర్ణాచారి సాహిత్యం, భీమ్స్ సంగీతం, కపిల్ కపిలన్ గాత్రం.. ఈ మూడు అంశాలు ఒకదానికొకటి చక్కగా కుదిరాయి. పాటలో కిరణ్ అబ్బవరం, దేవిక భట్ మధ్య కెమిస్ట్రీ కూడా సహజంగా కనిపిస్తోంది. కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బీచ్ దగ్గర రొమాంటిక్ మూమెంట్స్, ఫోన్ సంభాషణలు.. ఇవన్నీ ఒక అందమైన ప్రేమకథను గుర్తు చేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి జీవితాన్ని చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'భజగోవిందం' పాట మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాట 'రుత్తూ'తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 25, 2026న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మీకు నచ్చవచ్చు: ENE Repeat బతుకమ్మ సాంగ్.. శ్రేయా ఘోషల్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్ అదుర్స్.! టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా.. ఈ క్లాసిక్ రొమాంటిక్ సాంగ్ లిరిక్స్‌లో ఉన్న మ్యాజిక్ తెలుసా.?       [Rutthuu Song, Reality Movie, Kiran Abbavaram, Devika Bhatt, Bheems Ceciroleo]  
 జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..! మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు. మరికొందరి దగ్గర డబ్బు పెద్దగా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవిస్తారు. అయితే నిజ జీవితంలో ఎదుగుదలను కోరుకునే ప్రతి ఒక్కరికీ డబ్బుతో పాటు సమాజంలో మంచి పేరు, గౌరవం కూడా ఉండాలనే ఆశ ఉంటుంది. ఈ రెండు విషయాలను బాలెన్స్  చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో కొన్ని ముఖ్యమైన జీవన నియమాలు మనకు మార్గదర్శకం చేస్తాయి. వీటిని పాటిస్తే జీవితంలో డబ్బు, గౌరవం రెండూ లభిస్తాయి.  అవేంటో  వివరంగా తెలుసుకుంటే.. డబ్బు కంటే మన విలువలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం.. కేవలం అధిక లాభాలు లేదా ఎక్కువ సంపాదన కోసం కస్టమర్లకు లేదా వ్యక్తులకు  అనవసరమైన వస్తువులను అంటగట్టడం, వ్యాపారంలో అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేయకూడదు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించినా ఆ సంపాదన ఎక్కువ కాలం నిలబడదు, పైగా నలుగురిలో మన మీద ఉన్న నమ్మకం పోతుంది. ఎంత కష్టపడి సంపాదించినా నిజాయితీ అనే పునాది లేకపోతే ఆ డబ్బుకు ఎలాంటి విలువ ఉండదు. అందుకే ముందుగా విలువలను పెంచుకోవాలి, అలా చేస్తే  ఆటోమేటిక్ గా డబ్బు కూడా  వెనుక వస్తుంది. మాటకు ఇచ్చే విలువ.. ఎవరికైనా మాట ఇచ్చామంటే అది ఎంత చిన్నదైనా తప్పకుండా  నిలబెట్టుకోవాలి. చేయలేని పనులకు తొందరపడి వాగ్దానాలు చేయడం, మాట తప్పడం వల్ల మనుషుల మధ్య నమ్మకం పూర్తిగా సడలిపోతుంది. నోటి నుంచి వచ్చే మాట మన దగ్గర ఉన్న డబ్బు  కంటే ఎంతో విలువైనది. తక్కువగా మాట్లాడినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట మీద నిలబడే తత్త్వాన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో మనపై ఎంతో  గౌరవం పెరుగుతుంది. సంపాదించడం ఎంత ముఖ్యమో, పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం.. చేతికి డబ్బు రాగానే వచ్చిన వెంటనే అనవసరమైన విలాసాలకు, ఖరీదైన వస్తువులకు ఖర్చు పెట్టేయడం సరైన పద్ధతి కాదు. జీవితంలో ఎప్పుడైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆ సమయంలో మనల్ని ఆదుకునేది మనం చేసిన పొదుపే. అందుకే ఆదాయాన్ని కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు , పొదుపుగా విభజించుకుని తెలివిగా నిర్వహించడం నేర్చుకోవాలి. డబ్బు మనకోసం పనిచేసేలా చూసుకోవాలి తప్ప మనం డబ్బుకోసం పరిగెత్తకూడదు. ఇది కూడా చదవండి   పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..! ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం.. మనం ఎంత మంచివారైనా, ఎంత నిజాయితీగా ఉన్నా కొందరు విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి అనవసరమైన విమర్శల గురించి ఆలోచిస్తూ మన లక్ష్యాలను విస్మరించకూడదు. నిజమైన విమర్శ ఏదో గమనించి దాని నుంచి నేర్చుకోవాలి, అసూయతో వచ్చే మాటలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరి అప్రూవల్ కోసం కాకుండా మన విలువల పట్ల మనమే నిజాయితీగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. సహాయం చేసిన వారిని మరవకూడదు.. జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు మన వెన్నంటి   నిలబడిన వారిని గుర్తుంచుకోవాలి. మనం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మన చుట్టూ ఉన్న తోటివారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయాలి. నిజమైన సంపద మన దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనేది కాదు, మన వల్ల ఎంతమంది జీవితాలు మారాయనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. తెలుసుకోవాల్సిన అసలు విషయం..  డబ్బు మాత్రమే ఉండి అహంకారం ఉంటే దానికి విలువ ఉండదు. అలాగే గౌరవం ఒక్కటే ఉండి జీవన ప్రమాణాలు లేకపోయినా ఇబ్బందే. ఈ రెండు సమపాళ్లలో దక్కాలంటే నైపుణ్యంతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు డబ్బు సంపాదించానని, కానీ దానికోసం నా విలువలను కోల్పోలేదని గర్వంగా చెప్పుకునేలా బతకడమే అసలైన విజయం.                                                                                                                                             *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు..!                               మొహమాటం కొద్దీ అందరి ముందూ తలూపుతూ ఉంటారా.!
చలికాలం ప్రారంభం కాగానే వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో జీర్ణక్రియ మందగించడం వల్ల చాలామందిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి మార్కెట్లో విరివిగా లభించే క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ ఒక అద్భుతమైన ఎంపిక.  క్యాప్సికమ్‌లో తగినంత నీటి శాతం మరియు డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. చలికాలంలో తరచూ క్యాప్సికమ్‌ తినటం వల్ల ప్రేగు కదలికలు సక్రమంగా సాగి మలబద్ధకం వంటి ఇబ్బందులను సమర్థవంతంగా నివారించవచ్చు. సాధారణంగా చలికాలంలో శారీరక శ్రమ తగ్గి చాలామంది బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే క్యాప్సికమ్‌లో కేలరీలు చాలా తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బరువును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అతిగా తినడాన్ని (ઓવర్‌ఈటింగ్) సులభంగా తగ్గించవచ్చు. ఇది ఎలాంటి అదనపు కొవ్వును చేరనివ్వకుండా ఆరోగ్యకరమైన రీతిలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది.     ఈ శీతాకాలపు కూరగాయలో విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) శరీరానికి అందిస్తాయి. అంతేకాకుండా, ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని ఈ యాంటీఆక్సిడెంట్లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఇది కూడా చదవండి:డయాబెటిస్ ఉన్నవారు బార్లీ నీళ్లు తాగవచ్చా? నిపుణులు ఏం చెప్తున్నారంటే! క్యాప్సికమ్‌లో ఉండే పొటాషియం రక్తపోటును (బ్లడ్ ప్రెజర్) అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి, గుండె జబ్బుల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించడంలోనూ క్యాప్సికమ్ తోడ్పడుతుంది. ఇది రక్తహీనత (అనీమియా) సమస్యను ఎదుర్కొనేందుకు శరీరానికి అవసరమైన సహజమైన పోషకాలను అందిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరచడంలోనూ క్యాప్సికమ్ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు బీటా క్యారోటిన్ కంటి ఆరోగ్యాన్ని రక్షించి, వయసురీత్యా వచ్చే దృష్టి లోపాలను దూరం చేస్తాయి. చలికాలంలో కూరల్లో, సలాడ్స్‌లో లేదా వేడివేడి సూప్స్‌లో క్యాప్సికమ్‌ను భాగం చేసుకోవడం ద్వారా అద్భుతమైన రుచితో పాటు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్ ఎండు రొయ్యల కారం పొడి.. పర్ఫెక్ట్ కొలతలతో సులభంగా తయారుచేయండి!                                 దిష్టి కాయ కాదు.. రోగాలను తరిమికొట్టే సంజీవని: బూడిద గుమ్మడి జ్యూస్ నిజాలు!       Capsicum Health Benefits, Bell Peppers Immunity, Vitamin C Rich Foods, Nutrition Facts Of Capsicum, Healthy Vegetable Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
వాతావరణం చల్లగా మారినప్పుడు వేడివేడిగా ఏదైనా రుచికరమైనది తినాలనిపించడం సహజం. అలాంటి సమయంలో గుప్పెడు నల్ల శెనగలను ఉడకబెట్టి గుగ్గిళ్లుగా చేసుకుని తింటే ఆ రుచే వేరు. ఇది కేవలం రుచిని అందించడమే కాకుండా, శరీరానికి అద్భుతమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నల్ల శెనగలు పోషకాల ఖజానాగా నిలుస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, శరీరాన్ని దృఢంగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మనం బలం కోసం కేజీల కొద్ది మటన్ లేదా లీటర్ల కొద్దీ పాలను తీసుకుంటూ ఉంటాం. కానీ, కేవలం రెండు గుప్పెళ్ల నల్ల శెనగ గుగ్గిళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నల్ల శెనగలు అంతటి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. మీరు వీటిని మీ ఆహారంలో వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు తింటే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఈ అపురూపమైన శక్తి వనరును అస్సలు మిస్ కాకుండా మీ డైట్‌లో భాగం చేసుకోండి. శక్తి నిల్వల విషయానికి వస్తే, ఒక కోడిగుడ్డు ద్వారా మనకు కేవలం 72 కేలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. కానీ, శెనగ గుగ్గిళ్ల విషయానికి వస్తే, కేవలం 100 గ్రాముల శెనగలు ఏకంగా 340 నుంచి 350 కేలరీల శక్తిని శరీరానికి అందిస్తాయి. అంటే కేజీ మటన్ తిన్నా రానటువంటి శక్తి కంటే నాలుగు రెట్లకు పైగా బలం ఈ నల్ల శెనగల గుగ్గిళ్లలో నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకు, సోయా చిక్కుడు గింజలను పరిశీలిస్తే, 20 గ్రాముల సోయాలో కేవలం 200 కేలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. దీన్ని బట్టి నల్ల శెనగలు ఎంతటి శక్తివంతమైన ఆహారమో అర్థం చేసుకోవచ్చు. మనం ఖరీదైన మటన్ మరియు లీటర్ల కొద్దీ పాల కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే, ఈ నల్ల శెనగలకు పెట్టే ఖర్చు చాలా తక్కువ మరియు ఎంతో లాభదాయకం. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటూ వివిధ రకాల మందుల మీద ఆధారపడాల్సిన దుస్థితి తప్పుతుంది. ఈ పోషకాహారాన్ని పిల్లలకు అలవాటు చేస్తే, వారు ఇతర జంక్ ఫుడ్స్ మరియు అనారోగ్యకరమైన చిరుతిళ్ల వైపు వెళ్లకుండా ఉంటారు. ఇది కూడా చదవండి:చక్కెర బదులు బెల్లం వాడుతున్నారా? డాక్టర్ల షాకింగ్ హెచ్చరిక! మన నిత్య జీవితంలో బొబ్బర్లతో పాటు నల్ల శెనగలను కూడా సులభంగా ఆహారంలో తీసుకోవచ్చు. ఇవి మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో పాటు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని సరిగ్గా ఉడకబెట్టి, తగిన మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన కండరాల బలం, రోగ నిరోధక శక్తి ఇట్టే అందుతాయి. రోజువారీ పనుల్లో అలసటను తగ్గించి, శరీరాన్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే, ఏదైనా సరే పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ ఆహారపు అలవాట్లను మీ దైనందిన జీవితంలో పాటించే ముందు మీ శరీర తత్వానికి తగినట్లుగా వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ అందించిన సమగ్ర వివరాలు కేవలం మీ ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ మీకు ఆరోగ్యరీత్యా ఎలాంటి ప్రత్యేక సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం ఎప్పుడూ శ్రేయస్కరం. మీకు నచ్చవచ్చు:మహిళల ఆరోగ్యం కోసం దివ్యౌషధం! ఐరన్, కాల్షియంతో నిండిన రుచికరమైన లడ్డూ!                            పిల్లల మెదడుపై స్క్రీన్ టైమ్ దాడి: పరిశోధనల్లో వెల్లడైన షాకింగ్ నిజాలు!       Black Chickpeas Benefits, Kala Chana Energy, Soaked Black Gram, High Protein Vegetarian Foods, Stamina Boosting Diet, Doctor Health Advice, Health Tips In Telugu.
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
మన ఆరోగ్యం బాగుండాలంటే రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు (Fiber), యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. మరి మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ ఐదు పండ్లు ఏమిటి? జామ, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, మామిడి పండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లు ఎలా ఉపయోగపడతాయి? ఈ ప్రత్యేక వీడియోలో ఆయుర్వేద డైటీషియన్ శ్రవంతి రఘు గారు ఈ ఐదు పండ్లలోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. జామపండులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియకు ఎలా సహాయపడతాయి? బొప్పాయిలోని పోషకాలు మహిళల ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి? దానిమ్మ శరీరానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? పైనాపిల్ పేగుల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మామిడి పండులోని విటమిన్లు, పోషకాలు మన శరీరానికి ఎలా మేలు చేస్తాయి? అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు కలిగే ప్రయోజనాలు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వీటి పాత్ర, రోగనిరోధక శక్తికి అవసరమైన పోషకాలు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? వాటిని ఏ విధంగా తీసుకుంటే మంచిది? అనే విషయాలను కూడా శ్రవంతి రఘు గారు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖరీదైన ఆహారాలే అవసరం లేదు. మనకు సులభంగా లభించే పండ్లను సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఈ ఐదు పండ్లలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మలబద్ధకం సమస్యకు అవి ఎలా తోడ్పడతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యగా భావించే ఆర్థరైటిస్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. అసలు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అంటే ఏమిటి? ఈ సమస్యకు వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటి? కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కీళ్లు మన శరీర కదలికలకు ఎంతో కీలకం. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, నిలబడటం వంటి రోజువారీ పనులన్నీ కీళ్ల సహకారంతోనే సాధ్యమవుతాయి. అయితే శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కీళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు నొప్పి, బిగుతుగా అనిపించడం, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి, మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారీ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో Dr. Bhaskarకీళ్ల ఆరోగ్యం, ఆర్థరైటిస్, రుమటాయిడ్  ఆర్థరైటిస్ గురించి ముఖ్యమైన విషయాలను వివరించారు. అలాగే మోకాళ్ల కదలికలు మెరుగుపడటానికి, కండరాలు బలపడటానికి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఐదు వ్యాయామాల గురించి తెలియజేశారు. ఈ ఐదు వ్యాయామాలను ఎలా చేయాలి? వాటిని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? కీళ్ల నొప్పులతో బాధపడేవారు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలను ఎంచుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి    పిండికూరతో కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. డాక్టర్ ఏం చెబుతున్నారు కీళ్ల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన వ్యాయామాలు సరిపోవు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తమకు తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. నొప్పి పెరిగేలా బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మోకాళ్ల నొప్పుల పట్ల అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ భాస్కర్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి. మరిన్ని ఆరోగ్య విషయాలు, నిపుణుల సలహాలు, ఉపయోగకరమైన సమాచార వీడియోల కోసం TeluguOne Healthను ఫాలో అవ్వండి.