LATEST NEWS
తమిళనాట మిత్రపక్షాలుగా ఉన్న టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలకు, సంక్షోభానికీ కారణమైన ప్రధాని అభ్యర్థి వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ వివాదానికి స్వయంగా టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ ముగింపు పలికారు.  ఇటీవల ఇండియా టుడే,  సీఓటర్ సంయుక్తంగా  నిర్వహించిన  మూడ్ ఆఫ్ ద నేషన్  సర్వే దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారనే విషయంలో సర్వే ప్రకారం  ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో   విజయ్ నిలిచారు. జాతీయ స్థాయి అగ్రనేతలను దాటుకుని విజయ్ కు దేశవ్యాప్తంగా జనం భారీగా మద్దతు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ ను విస్మయ పరిచింది.  అయితే..  ఈ సర్వే ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడులో పొత్తులో ఉన్న కాంగ్రెస్,  టీవీకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని రేసులో  విజయ్ ఉన్నారని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా సవాల్ చేస్తున్నారన్న ప్రచారం మొలైంది. టీవీకే కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ ను జాతీయ నేతగా ప్రాజెక్ట్ చేస్తూ, భావి  ప్రధాని అంటూ  డిజిటల్ క్యాంపెయిన్ ఆరంభించారు. దీంతో కాంగ్రెస్, టీవీకేల పొత్తుపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ వివాదానికి తెర దించుతూ విజయ్ ఇండియా కూటమి ప్రదాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అన్న స్పష్టత ఇచ్చారు.     ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.  కాంగ్రెస్ - టీవీకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కూటమి పొత్తులు  దృఢంగా ఉన్నాయని స్పష్టం చేశారు.   [Vijay Clarity on PM Candidate, Tamilnadu Cm Vijay, Rahul Gandhi, TVK Congress Rift, Mood of the Nation Survey, PM Face INDIA Bloc, Telugu One]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో  పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.   తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై  వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో  వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం..  రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు.   వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు.  సాధారణంగా  పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు  వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  గతంలో  అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో   తెలుగుదేశం   అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి   సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న  వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే  చెప్పారు.   అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల  జగన్ పాలన తరువాత   పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న  వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి.   ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి.  అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.    Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One
తెలంగాణ కాంగ్రెస్ లో  ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది.  పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె  వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.    పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం   పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో  ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.   [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One] 
వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు.  స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో  ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట.  ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.   ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు.   అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు.   [Botsa New Interpretation on  Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies,   AP Politics, Telugu One]
  బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.   MLA Mohammed Mubeen, Rajendranagar  MIM in-charge, AIMIM, Asaduddin Owaisi,  MLC Rahmat Beg, Telugu news, Telugu one 
ALSO ON TELUGUONE N E W S
    భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్  బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే  ప్రేక్షకులకి ఈ మూవీ  ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్‌కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్‌ని  పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్‌ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్‌కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. Also read:  కోట్ల మందికి ఇన్ స్ప్రెషన్:  ఈమె కథతో సినిమా వస్తుందా!  సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి  నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్‌కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్ హామీ. ఇప్పటికే రెహమాన్ ఈ సినిమా కోసం 2 అద్భుతమైన పాటల కంపోజిషన్ పూర్తి చేశారనే వార్త సంగీతాభిమానులను ఎంతగానో అలరిస్తోంది.         [ ManiRatnam, Vijay Sethupathi, sai Pallavi, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood ]    
  సినిమా.. ఒకేసారి కొన్ని కోట్ల మందికి ఇన్ స్ప్రెషన్ కలిగించడంతో పాటు మంచి మార్గంలో పయనించేలా చేసే ఏకైక సాధనం. కాకపోతే  ఆకాశంలో నక్షత్రాలని లెక్కపెట్టడం ఎలా అయితే అసాధ్యమో, సినిమా వల్ల మంచి జరిగిన వాళ్ళని లెక్కపెట్టడం కూడా అసాధ్యం. అందుకే ఇన్ స్ప్రెషన్ కలిగించే సినిమాలు అడపాదడపా రావాలని సినీ ప్రేమికులు, ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రీసెంట్ గా 47 ఏళ్ల 'రమాబాయి' అనే మహిళ  చూపిన పోరాటపటిమ.  రమాబాయి రణ్‌వీర్ ది మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగై ప్రాంతం. భర్త ప్రమాదంలో చనిపోయిన తర్వాత కుటుంబ భారమంతా రమాబాయి భుజాలపైపడింది. రోజువారీ వంట మనిషిగా పనిచేస్తూ, రెక్కల కష్టం మీద ఇద్దరు కుమార్తెలను పోషిస్తోంది. పెద్ద కుమార్తె పూజ పోలీస్ ఉద్యోగానికి, చిన్న కుమార్తె బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏనాడూ తన పేదరికాన్ని పిల్లల చదువుకు అడ్డంకిగా మారనివ్వలేదు ఈ ధీర వనిత. అంబాజోగైలో భారతీయ शिक्षण ప్రసారక్ సంస్థ కోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ అమృత మహోత్సవ వేడుకల సందర్భంగా 'అమృత్ దౌడ్' పేరిట భారీ మారథాన్ పరుగు పందెం నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుండి భాగ్యనగర్ చౌక్ వరకు సాగిన ఈ మారథాన్‌లో గెలిచిన విజేతకు రూ. 3,000 నగదు బహుమతి ప్రకటించారు. ఆ మూడు వేల రూపాయల బహుమతి మొత్తం రమాబాయి కంటపడింది. ఆ డబ్బులు ఉంటే తన కుమార్తెలకు పుస్తకాలు, పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని ఆమె భావించింది. వంటగది పనికే పరిమితమైన ఆమె, ఎలాంటి ముందస్తు శిక్షణ లేదా అనుభవం లేకుండానే మారథాన్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. పోటీ రోజున గ్రౌండ్‌లో దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు ట్రాక్‌సూట్లు, బ్రాండెడ్ రన్నింగ్ స్పోర్ట్స్ షూస్ ధరించి రన్‌కు సిద్ధమైన ఎందరో యువతీ యువకులు. మరొకవైపు సాధారణ నేత చీర, కాళ్లకు మామూలు చెప్పులతో నిలబడిన 47 ఏళ్ల రమాబాయి. ఈమె మారథాన్‌లో పరిగెత్తగలదా అని చూసేవారు పెదవి విరిచారు. కానీ విజిల్ మోగగానే రమాబాయి పరుగు లంకించుకుంది. పరుగు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె వేసుకున్న చెప్పులు జారిపోతూ వేగానికి అడ్డంకిగా మారాయి. ఏమాత్రం ఆలోచించకుండా ఆ చెప్పులను ఊడదీసి చేతుల్లో పట్టుకుంది. పదునైన రాళ్లు, గరుకు రోడ్డును కూడా లెక్కచేయకుండా బరిగాలితోనే పరుగెత్తడం ప్రారంభించింది. ఒక చేతిలో చెప్పులు, మరో చేతితో కొంగును సర్దుకుంటూ రమాబాయి కనబరిచిన వేగం సమస్త ప్రేక్షకులను స్తంభింపజేసింది. ప్రతి అడుగులోనూ ఆమెకు తన పిల్లల భవిష్యత్తు, వారి చదువుల ఆశయాలే కనిపించాయి. ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్ షూస్ ధరించిన కుర్రకారును ఒక్కొక్కరిగా వెనక్కి నెడుతూ ఆమె ముందంజ వేసింది. ఆఖరికి అందరికంటే ముందుగా ఫినిషింగ్ లైన్‌ను దాటి మొదటి స్థానంలో నిలిచి  3,000 నగదు బహుమతిని దక్కించుకుంది. విశేషమేమిటంటే, ఆమె కుమార్తె పూజ కూడా ఈ పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలవడం విశేషం. Also Read: బడ్జెట్ 2 కోట్లు: కలెక్షన్ల తుఫాన్.. వందల కోట్లతో తెరకెక్కినా దీని ముందు దిగదుడుపే   పోటీ నిర్వాహకులు బహుమతి అందజేస్తున్నప్పుడు రమాబాయి కళ్లలో ఆనందభాష్పాలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించాయి. బహుమతి సొమ్ము 3,000 ను పూర్తిగా తన కుమార్తెల పుస్తకాలు, ఫీజుల కోసమే ఉపయోగిస్తానని గర్వంగా చెప్పింది. ఒక సాదాసీదా తల్లి చూపిన ఈ అసాధారణ పట్టుదల, కన్నబిడ్డల పట్ల ఉన్న అపరిమితమైన ప్రేమ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచంలో అమ్మకంటే గొప్ప యోధులు ఎవరూ లేరని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. తల్లే తొలి పాఠశాల, తల్లే గెలుపుకు నిజమైన ప్రేరణ అని రమాబాయి తన అద్భుత విజయంతో మరోసారి నిరూపించింది! దీంతో రమాబాయి జీవిత కథని సినిమాగా తెరకెక్కిస్తే డబ్బు విలువ తెలియడంతో పాటు ఆడవాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తుందనే మాటలు ప్రజల నుంచి వినపడుతున్నాయి. మరి సినిమాగా వస్తుందేమో చూడాలి.  ఎందుకంటే ఆమె పోరాటం  మూడువేలు కోసమే కావచ్చు. కానీ ఆ పోరాటం ఎంతో మంది గుండెల్లో కసి, పట్టుదల, స్ఫూర్తి నింపే ఆయుధ కర్మాగారం.     [47 Year Old Mother,  Marathan, Ramabai Ranveer, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]    
Karthi’s Sardar was a major success in Telugu as well as Tamil, so the expectations on Sardar 2 were always going to be high. The trailer now reveals that the sequel is taking a very different route. It is a prequel centred on Subhash Chandra Bose and the transformation of a cheerful drama artist into a spy carrying the burden of guilt. That guilt appears to be the emotional core of the film. Karthi plays Bose as someone who begins as a happy-go-lucky performer before entering the dangerous world of espionage, with the consequences of his choices eventually affecting him physically and psychologically. The trailer deliberately keeps the reason behind his guilt as a mystery, giving the story a stronger hook beyond its spy-thriller packaging. The other major attraction is SJ Suryah, who plays a character claiming to be a fan of Bose while eventually standing against him. That makes the conflict more interesting than a straightforward hero-versus-villain setup. Suryah brings his trademark style and swagger to the role, but there is also an unsettling quality to his character’s motivation that could make him one of the film’s biggest talking points. Karthi once again looks completely at home in the role, particularly in the emotional portions, while the trailer gives considerable weight to the scale of the world PS Mithran has created. The Lord Murugan and Vel parallels, the village carnival setting and the elaborate aeroplane sequence stand out, suggesting that the filmmaker is using spectacle to build the spy narrative rather than allowing the action to overwhelm it. Sam CS’s score adds to the tension, while Malavika Mohanan and Ashika Ranganath are part of the principal cast. Produced by Prince Pictures, Sardar 2 is releasing worldwide on September 10, with Annapurna Studios handling the Telugu release. The trailer suggests a film that wants to go deeper into the man behind the spy rather than simply deliver another franchise actioner.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Maadhav is not getting a routine hero launch with Maremma. The trailer makes it clear that the debutant is stepping into a rooted rural drama built around faith, a sacred bull and a village caught in a serious conflict. That gives the film a clear identity, instead of selling it purely on Maadhav being Ravi Teja’s nephew. Ram Pothineni unveiled the trailer and said, "Happy to unveil the MAREMMA trailer. The trailer looks absolutely raw, riveting & like a pure tale of the soil. Wishing Maadhav & the entire team all the very best." The interesting part of the trailer is the bull at the centre of the story. Maadhav’s character is entrusted with protecting Maremma’s bull, but that responsibility becomes dangerous when the village comes under threat. The visuals also hint at a sacrifice, making the bull an important part of the conflict rather than just a religious element added for atmosphere. For a debut, Maadhav has chosen a fairly demanding character. He has to look convincing in a completely rustic setup and carry a story where his character’s actions are tied to the village and its beliefs. The trailer shows good screen presence, body language and a certain Ravi Teja-like energy, but Maadhav seems to be finding his own space rather than merely leaning on the family image. Director Manchala Nagaraju appears to have built the film around the village and its belief system. The world-building is one of the trailer’s stronger aspects, with the production design and VFX helping establish the setting. Prashanth Vihari’s music and Pradeep Dutta’s BGM further push the earthy and tense mood. Produced by Mayur Reddy Bandaru, Maremma now has a genuine theatrical question around it: can this unusual rural conflict translate into a gripping commercial drama? The trailer gives enough of a hook to find out. The film releases worldwide on September 10. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఈక్వెషన్ యష్ విషయంలో శృతి తప్పింది. యష్ హోమ్ స్టేట్ కర్ణాటకలో టాక్సిక్ కి తగిలిన షాక్ ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. షాక్ కి గురి చేయడమే కాదు ఎందుకు ఇలా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.  యష్‌ కి ఉన్న క్రేజ్, మాస్ ఇమేజ్‌ని బట్టి కర్ణాటకలో టాక్సిక్ చాలా తేలికగా  100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరుతుందని అందరూ ఆశించారు. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా వచ్చిన . 140 కోట్ల గ్రాస్  లో కర్ణాటకలోనే దాదాపు 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డుల బోణీ కొట్టింది. కానీ, రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కర్ణాటకలో ఎలాంటి సినిమా లేకపోయినా కూడా ప్రేక్షకులు టాక్సిక్ థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.  దీంతో  కర్ణాటక  థియేట్రికల్ రన్‌లో కనీసం  100 కోట్ల గ్రాస్ మార్జిన్‌  అందుకోలేక చేతులెత్తేసింది. అయితే  ఉత్తరాది హిందీ బెల్ట్‌లో మాత్రం ‘టాక్సిక్’ అద్భుతమైన ప్రదర్శనతో ఊరటనిస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్‌లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కుతుండటం విశేషం. హిందీ బెల్ట్‌లో తొలి రోజే ఏకంగా 55 కోట్ల మేర సాలిడ్ కలెక్షన్లు సాధించి, సౌత్ ఇండియా సినిమాల్లోనే హిందీ వెర్షన్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా కంటెంట్‌కి, యశ్ స్క్రీన్ ప్రజెన్స్‌కి బ్రహ్మరథం పడుతుండటంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. also read: ఒకే ఒక్క ఛాన్స్.. ఆ స్టార్ హీరో పక్కన ఒకే అయ్యిందా! అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ పరిస్థితిని పరిశీలిస్తే మరో రకమైన షాకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగులో మొదటి రోజు 20.1 కోట్ల గ్రాస్ సాధించి సాలిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్నప్పటికీ, రెండో రోజు నుంచే థియేటర్లలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆడియన్స్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో పలు థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితులు కూడా చూసింది. ఫలితంగా తెలుగులో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలి బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.     [Toxic, yash, Geethu Mohandas, Karanataka collections, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]    
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ ప్రకాష్ కుమార్, తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్వరాలు అందించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన, మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా హీరోగా కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. విడిపోయినా కూతురి కోసం ఎంతో మెచ్యూర్డ్‌గా కో-పేరెంటింగ్ చేస్తున్నారని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు విడిపోవడం ఎందుకంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా జీవీ ప్రకాష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.     [GV Prakash Kumar, Saindhavi Divorce, GV Prakash Wife, Tamil Music Director, Entertainment News Telugu]
ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.  ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో.. హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్‌లో వివరించారు. కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ .. ‘‘వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి, ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు. నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. ‘‘ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్. మాకోసం వచ్చిన నాగబాబు గారు, సాయి రాజేష్ గారు, మెహర్ రమేష్ గారు, వీఎన్ ఆదిత్య గారు, ఎస్‌కేఎన్ గారికి థాంక్స్. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని అన్నారు. సాత్విక మాట్లాడుతూ .. ‘‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ సినిమా నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
The teaser of Kurma Avatar attempts something more ambitious than a conventional mythological film. Starring Shiva Rajkumar, Varalaxmi Sarathkumar, Raj Tharun, Shivaji and Sai Kumar, the film combines the mythology surrounding Lord Vishnu’s Kurma Avatar with a contemporary conflict involving the rise of demonic forces on Earth. Sai Kumar’s narration establishes the central idea of the teaser, explaining the presence of Lord Vishnu within every human while setting up the threat of a powerful demon king. Instead of presenting the mythology in isolation, director Harsha Vardhan Kadiyaala appears to have built a story around the idea of evil taking over the present-day world and Vishnu returning to restore balance. Shiva Rajkumar is easily the biggest highlight of the teaser. He is introduced in a striking yogi look before being linked to the Kurma Avatar, creating curiosity around how his character fits into the larger conflict. The actor’s screen presence gives the teaser the weight it needs, particularly in the more intense moments. The teaser also deliberately keeps the characters played by Varalaxmi Sarathkumar, Raj Tharun and Shivaji under wraps. Their appearances suggest that each of them has an important place in the story, but very little is revealed about their actual roles. That restraint helps the teaser build curiosity rather than explain the entire premise. Visually, Kurma Avatar stands out for the scale of its world-building. The VFX-heavy imagery, grand sets and Ajaneesh Loknath’s background score create the larger-than-life mythological atmosphere the concept demands. More importantly, the idea of taking the Kurma Avatar mythology and placing it against a conflict rooted in the modern world gives the film a distinct hook. The teaser looks like a promising attempt to combine mythology, fantasy and commercial thrills without revealing too much before the theatrical release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా..  లెనిన్  విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని  భావిస్తోందట.  Also Read: రీ రిలీజ్ బాక్సాఫీస్ సునామీ: వామ్మో అడ్వాన్స్ బుకింగ్ లో అన్ని కోట్లా! ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే.    [ Bhagyashri Borse , Ram Charan, Sukumar, Akhil Akkineni, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]        
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నాయకత్వంలో మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనియన్‌లో చిచ్చుపెట్టేందుకు చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన సుమలత, ఫిల్మ్ ఫెడరేషన్ వైఖరిని అలాగే రఘు మాస్టర్ వర్గం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. తమ అసోసియేషన్‌కు ఏ నిబంధన ప్రకారం ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తోందో సూటిగా ప్రశ్నించారు. అసోసియేషన్‌ను రెండు ముక్కలు చేయాలని ఎవరు చూసినా, అలాంటి వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కొడతామంటూ చాలా ఘాటుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నిర్వహించిన అడ్ హాక్ కమిటీ సమావేశం ఎంతమాత్రం చెల్లదని సుమలత స్పష్టం చేశారు. ఆ కమిటీలో ఉన్న కొందరు సభ్యులు గతంలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినవారేనని ఆమె ఆరోపించారు. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ యూనియన్‌ను ముక్రాజ్ మాస్టర్ ఎంతో శ్రమించి స్థాపించారని, ఎవడో ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తి వచ్చి అడ్ హాక్ కమిటీ వేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. గతంలో తమ అసోసియేషన్ తరఫున నిర్వహించిన ఉపఎన్నికలు చట్టబద్ధంగానే జరిగాయని ఆమె సమర్థించుకున్నారు. 500 మంది ఉన్న యూనియన్‌లో 114 మంది ఓటు వేసినా అది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియే అవుతుందని, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి మాత్రమే తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. లీగల్‌గా తమ కమిటీకే అన్ని అధికారాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలే ఫెడరేషన్ సహాయ నిరాకరణ, జానీ మాస్టర్ సస్పెన్షన్ పొడిగింపు వార్తల మధ్య రఘు మాస్టర్ కు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఫెడరేషన్ తీరు మారకపోతే తాము కూడా ప్రత్యమ్నాయ చర్యలకు వెనుకడమని సుమలత తేల్చిచెప్పారు. డ్యాన్సర్ల ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఎంత దూరమైనా వెళ్తామని సుమలత స్పష్టం చేయడంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ఫెడరేషన్ మద్దతుతో రఘు మాస్టర్ వర్గం ముందుకు వెళ్తుంటే, మరోవైపు సుమలత చట్టపరమైన హెచ్చరికలతో తిరుగుబాటు చేయడం వల్ల ఈ అసోసియేషన్ సంక్షోభం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.       [Sumalatha Jani, Jani Master Wife, TFTDDA Dispute, Raghu Master Dancers Union, Tollywood Film Federation]
మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో, నిత్య పూజల్లో మరియు ఆయుర్వేద వైద్యంలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకమైనది. పసుపు కేవలం వంటకాలకు రంగు, రుచి ఇచ్చే సాధారణ సుగంధ ద్రవ్యము మాత్రమే కాదు, అది మన ప్రాచీన మహర్షులు అందించిన ఒక అద్భుతమైన దివ్య ఔషధం. ప్రతి ఇంట్లో ఉండే పసుపులో అనేక రకాల వ్యాధులను నయం చేసే సహజసిద్ధమైన మూలికా గుణాలు నిండివున్నాయి. శతాబ్దాల కాలంగా మన ఆయుర్వేద వైద్యంలో పసుపును ప్రతి రోగానికి ఒక తిరుగులేని బ్రహ్మాస్త్రంలా ఉపయోగిస్తున్నారు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా పసుపులోని విశిష్టమైన ఔషధ గుణాలను అంగీకరిస్తూ, దానిపై అనేక పరిశోధనలు జరిపి సంచలన విషయాలను వెల్లడించింది. పసుపులో ప్రధానంగా 'కర్కుమిన్' (Curcumin) అనే అత్యంత శక్తివంతమైన జీవ క్రియాశీల సమ్మేళనం (Bioactive Compound) ఉంటుంది. ఈ కర్కుమిన్ అనేది శరీరంలో జరిగే రకరకాల ఇన్ఫెక్షన్లు మరియు వాపులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఉచిత రాడికల్స్‌తో (Free Radicals) పోరాడి, కణజాల దెబ్బతినకుండా రక్షిస్తాయి. ప్రతిరోజూ మన ఆహారంలో పసుపును తగిన పరిమాణంలో భాగం చేసుకోవడం వల్ల లేదా గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల శరీరానికి అమితమైన శక్తి మరియు అంతర్గత రక్షణ లభిస్తుంది. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా వర్షాకాలం, చలికాలంలో వేధించే సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు పాలు (Turmeric Milk) ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. రాత్రి పడుకునే ముందు వేడి పాలలో పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడి, గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గిపోతాయి. మిరియాలలో ఉండే 'పైపరైన్' (Piperine) అనేది పసుపులోని కర్కుమిన్ శోషణను (Absorption) శరీరంలో ఏకంగా 2000% వరకు పెంచుతుందని సైంటిఫిక్ అధ్యయనాల్లో తేలింది. అందుకే పసుపును మిరియాలతో కలిపి తీసుకున్నప్పుడు దాని ఔషధ ప్రభావం రెట్టింపు అవుతుంది.       How to use turmeric for immunity and skin, turmeric milk benefits for cold and joint pain.
నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు ఒకేచోట కూర్చొని పనిచేయడం చాలామందికి సర్వసాధారణమైపోయింది. కానీ నిరంతరం కూర్చోవడం అనేది మన ఆరోగ్యాన్ని లోపలి నుంచి ఎంతగా దెబ్బతీస్తుందో తెలుసా? గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. అంతకంటే ప్రమాదకరంగా శరీరంలో అంతర్గతంగా క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ భయంకరమైన సమస్యకు అత్యంత సరళమైన పరిష్కారాన్ని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. ప్రముఖ హెల్త్ జర్నల్ 'బీఎంసీ మెడిసిన్' (BMC Medicine) ప్రచురించిన సరికొత్త పరిశోధన అధ్యయనం ప్రకారం, రోజుకు కేవలం 3 నిమిషాల పాటు వేగవంతమైన తీవ్రమైన శారీరక శ్రమ (Vigorous Activity) చేయడం ద్వారా దాదాపు 13 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చని తేలింది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఏకంగా 60,000 మందికి పైగా వ్యక్తుల దైనందిన శారీరక శ్రమ మరియు ఆరోగ్య వివరాలను ఎంతో లోతుగా విశ్లేషించారు. అధ్యయనంలో భాగంగా సేకరించిన శాస్త్రీయ డేటా ప్రకారం, ప్రతిరోజూ క్రమం తప్పకుండా 3 నిమిషాల పాటు వేగంగా మెట్లు ఎక్కడం మరియు దిగడం (Stair Jogging) లేదా రన్నింగ్ వంటి హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు దాదాపు 7% వరకు తగ్గుతుందని తేలింది. అలాగే రోజువారీ జీవితంలో శారీరక శ్రమ పెరిగే కొద్దీ మొత్తంగా క్యాన్సర్ రిస్క్ ఏకంగా 17% నుండి 18% వరకు తగ్గే అవకాశం ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మనం రోజూ కేటాయించే ఆ 3 నిమిషాల వేగవంతమైన కదలిక అనేది సాధారణంగా చేసే 90 నిమిషాల లేదా 1.5 గంటల తేలికపాటి వ్యాయామంతో సమానమైన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే డెస్క్ ఉద్యోగాలు చేసేవారు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నిలబడటం లేదా నడవడం అలవాటు చేసుకుంటే, అది 15 నిమిషాల వాకింగ్ ఫలితంతో సమానమని ఈ స్టడీ తెలిపింది. రోజూ వేగంగా పరుగెత్తడం, స్ప్రింటింగ్, స్కిప్పింగ్ లేదా మెట్లు వేగంగా ఎక్కడం వంటి చిన్నపాటి కదలికల వల్ల ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, అలాగే ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణాశయం (గ్యాస్ట్రిక్) మరియు పేగు సంబంధిత తీవ్రమైన 13 రకాల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు నిపుణులు గుర్తించారు.         Sitting hours cancer risk and three minute solution, daily 3 minute workout benefits cancer risk reduction.
మన నిత్య జీవితంలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పక్కన, పొలం గట్ల మీద అనేక రకాల మొక్కలు పిచ్చి మొక్కల్లా కనిపిస్తుంటాయి. చాలామంది వీటిని చూసి ఎలాంటి ఉపయోగాలు లేని వ్యర్థమైన మొక్కలుగా భావించి నిర్లక్ష్యంగా తీసి పారేస్తుంటారు. కానీ మన పూర్వీకులు మరియు ఆయుర్వేద మహర్షులు ప్రాచీన కాలం నుంచే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోని దివ్య ఔషధ గుణాలను గుర్తించి మానవాళికి అందించారు. అటువంటి అత్యంత శక్తివంతమైన, అరుదైన ఆయుర్వేద మూలికలలో  చెన్నంగి మొక్క  (సెన్నా ప్లాంట్) ఒకటి. తెలుగునాట చెన్నంగిగా పిలువబడే ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, అధిక ఒత్తిడి మరియు వేళాపాలు లేని జీవనశైలి కారణంగా అనేకమందిని తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య మలబద్ధకం. రోజువారీ మలవిసర్జన సరిగ్గా జరగక కడుపులో అసౌకర్యం, నీరసంతో బాధపడేవారికి చెన్నంగి మొక్క ఒక సంజీవనిలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ మొక్క ఆకులలో సహజసిద్ధంగా లభించే అనేక రకాల రసాయనాలు మరియు ఔషధ కాంపౌండ్లు నిండి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆకులలో  సెన్నోసైడ్లు (Sennosides) అనే ప్రత్యేకమైన సహజ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ సెన్నోసైడ్లు జీర్ణవ్యవస్థలోని పేగుల కదలికలను (Bowel movements) వేగవంతం చేసి, తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహిస్తాయి. రాత్రి సమయంలో చెన్నంగి ఆకుల కషాయం తయారుచేసుకుని తగిన పరిమాణంలో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యల నుంచి అతి త్వరగా విముక్తి లభిస్తుంది. ఈ మూలిక పేగులను వేగంగా ప్రేరేపించడం వల్ల సులభంగా విరేచనమై కడుపు తేలికపడుతుంది. అందువల్ల ఎవరైతే వారాల తరబడి తీవ్రమైన మలబద్ధకం, సరిగా మలవిసర్జన కాక ఇబ్బంది పడుతున్నారో, వారు వైద్యుల మార్గదర్శకత్వంలో పరిమిత కాలం పాటు చెన్నంగి కషాయాన్ని సేవించడం వల్ల పూర్తి ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆకుల రసం తాగడం ద్వారా జీర్ణక్రియ సమర్థవంతంగా జరిగి గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ, నెమ్మదిగా ఉండే జీర్ణశక్తి మరియు కడుపు ఉబ్బరం వంటి సకల జీర్ణకోశ సమస్యలు నయమవుతాయి.         Natural constipation relief senna plant, senna leaves health benefits and precautions.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.