LATEST NEWS
  తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనత పార్టీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. అనుకొగానే బీజేపీ  అధికారంలోకి రావడానికి "ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కేంద్ర మంత్రి  అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, "ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు" అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ కామెంట్స్ రానున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో  బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలను అవకాశం ఉంది
తెలంగాణ‌లో  మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో బాగంగా తొలి రెండు విడతల పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయా అనిపించేలా ఉన్నాయి. రెండు విడతలలోనూ కూడా కాంగ్రెస్ హవా బ్రహ్మాండంగా సాగింది. ఈ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అయితే.. 193 మండలాల పరిధిలోని 3వేల‌, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు  గాను  1,728 మంది స‌ర్పంచ్‌లు కాంగ్రెస్ మద్దతుదారులే.   తొలి విడతలో కాంగ్రెస్ హవాతో కంగుతిన్న బీఆర్ఎస్ రెండో విడత వచ్చే సరికి అప్రమత్తమైంది. రెండో విడ‌త‌లో  తడాఖా చూపాలని బీఆర్ఎస్ అగ్రనాయత్వం తన కేడర్ కుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది  అయినా కూడా రెండో విడతలోనూ బీఆర్ఎస్ చతికిల పడింది. కేవలం  912 స‌ర్పంచ్ స్థానాలలోనే విజయం సాధించింది.  గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్‌కు ప్ర‌జ‌ల నుంచి పెద్దగా మద్దతు లేదని ఈ రెండు విడతలలోనూ రూఢీ అయిపోయింది.   వాస్తవానికి తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ తమదేనని బీఆర్ఎస్ భావించింది. కానీ ఫలితాలు వెల్లడైన తరువాత ఆ పార్టీకి విషయం బోధపడింది.  పోలింగ్ శాతం అధికంగా ఉన్న చోట్లా, , స్వల్పంగా నమోదైన చోట్లా కూడా కాంగ్రెస్ ఆధిపత్యం సుస్పష్టంగా కనిపించింది.  మొత్తంగా.. రెండు విడతల్లోనూ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా లేదనీ, ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందనీ తేటతెల్లమైంది.  ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పంచాయతీల్లో చతికిలబడటానికి కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. జగజాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత వ‌రంగ‌ల్‌, క‌రీంగ‌న‌గ‌ర్‌, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు.  ఆయా జిల్లాల్లోని ప‌ల్లెల్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. మొత్తానికి క‌విత దెబ్బ కూడా బీఆర్ ఎస్‌కు గట్టిగానే త‌గిలింద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
సింగిల్ ఓట్ విన్న‌ర్స్ అనే మాట వినే ఉంటాం ఆ మాట‌కొస్తే ల‌క్కీ డ్రా విన్న‌ర్స్ అనే క్యాప్ష‌న్ కూడా చ‌దివే ఉంటాం.. ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.  స‌ర్పంచ్ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన  రాజుది ఓ  విషాద గాథ‌. మ‌ద్ధ‌తుదారులు స‌హ‌క‌రించ‌డం లేద‌నీ, ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుకు డ‌బ్బుల్లేవ‌న్న మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు రాజు. ఈ నెల 8న అత‌డు ఉరి వేసుకుని చ‌నిపోగా.. సర్పంచ్ ఎన్నికలలో అతడు  గెల‌వ‌డం పంచాయితీ  ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డుగా న‌మోద‌య్యింది. అత‌డి మ‌ర‌ణం కార‌ణంగా మ‌ళ్లీ ఎన్నిక నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. ఏది ఏమైనా రాజు సూసైడ్ విన్న‌ర్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించాడ‌న్న చర్చ జరుగుతోంది. ఇక సింగిల్ ఓట్ విన్న‌ర్లు ఎవ‌రెవ‌రున్నారో చూస్తే.. నిర్మల్ జిల్లా, బాగాపూర్ గ్రామంలో ముత్యాల శ్రీవేద అనే మహిళ ఒకే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచారు, ఈమెకు పోటీగా బ‌రిలో నిలిచిన హ‌ర్ష స్వాతికి  కూడా 180 ఓట్లే వ‌చ్చాయి. దీంతో పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కించగా..  ఒక్క ఓటు కార‌ణంగా శ్రేవేదను విజ‌యం వ‌రించింది. అమెరికా నుంచి వచ్చిన తన మామ వేసిన పోస్టల్ ఓటు ఆమె విజయానికి కారణమైంది.   కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్‌ఖుర్ద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బెస్త సంతోష్ సంచలన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది.. చివరకు సంతోష్ తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంతోష్‌ను చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రతి ఓటూ కీలకమని ఈ ఫలితం నిరూపించిందని అంటున్నారు అధికారులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడు గ్రామ పంచాయతీలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారుడైన రమేశ్ నాయక్, కాంగ్రెస్ మద్దతుదారుడిపై విజయం సాధించారు. అయితే ఈ విజయం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎంతో స‌స్పెన్స్ తో  జరిగిన కౌంటింగ్‌లో రమేశ్ నాయక్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రత్యర్థిని ఓడించి సర్పంచ్ పీఠాన్ని కైవ‌సం  చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, రామాపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఇదే తరహా ఫలితం వెలుగు చూసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవి తన ప్రత్యర్థి నుంచి తీవ్ర  పోటీని ఎదుర్కొన్నారు. చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఓట్లు సమానంగా వస్తాయేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. చివరకు ఫలితం వెలువడేసరికి రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలుపు సాధించారు.
అమరావతి వేదికగా తాజాగా  జరిగిన రెండు సమావేశాలు.. రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఓ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగితే.. మరో సమావేశం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. అదేంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఉపముఖ్యమంత్రి, ఐదు శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరవ్వాలి కదా? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? అనే  అనుమానాలు మీకు కలగవచ్చు... మీకే కాదు.. కూటమిలో ఉన్న నేతలతో పాటు రాజకీయ నాయకులకు ఇదే అనుమానం కలుగుతోంది.  అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, కార్యదర్శులు , మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశం నిర్వహించారు.  ఈనెల 17, 18 తేదీల్లో జరగబోతున్న కలెక్టర్స్ కాన్ఫిరెన్స్ కి కర్టెన్ రైజర్ గా జరిగింది ఈ సమావేశం. పరిపాలకు సంబంధించినటు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ  రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్  కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి  సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.  వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎన్డీఏలో అత్యంత యాక్టివ్‌గా కనిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వేగంగా విస్తరిస్తోంది. మొదటి రోజుల్లో జరిగిన ప్రతి ముఖ్య సమావేశానికి స్వయంగా హాజరై, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందున్న జనసేనాని, ఇటీవల మాత్రం కీలక అధికారిక ఈవెంట్స్‌కి కూడా హాజరుకాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ముఖ్య మీటింగ్‌లకు కూడా పవన్ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అమరావతిలోనే ఉన్నప్పటికీ...సీఎం చేపట్టే అత్యావశ్యక కార్యక్రమాలకు వెళ్లకుండా, ఆయన సొంత షెడ్యూల్‌ని ఫాలో అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఐబీపీ సమావేశాలు, విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్, సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం, రాజధాని ప్రాజెక్టుల రివ్యూ, పెన్షన్ల పంపిణీ వంటి ప్రభుత్వ ముఖ్య వేడుకలు, మీటింగ్‌లు, లాంచింగ్‌లు.. వీటి వేటిలోనూ  పవన్ కనిపించకపోవడం చిన్న విషయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి భాగస్వామ్యంలో ఇలాంటి గ్యాప్… ముఖ్య కార్యక్రమాల్లో పవన్ కనిపించకపోవడం… సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందంటున్నారు.  అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా చేస్తున్నారా? లేక ముందస్తుగానే షెడ్యూల్ అయిన కారణంగానే  సీఎం సమావేశానికి హాజరు కాలేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది. అంతే కాదు  పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పాలనలో తన ఇమేజ్‌ని పెంచుకోవాలని భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్టీ అధినేతగా  విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం ద్వారా.. దాని ఇంపాక్ట్ క్యాడర్ మీద కూడా పడే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి సభల్లో  మూడు పార్టీల కార్యకర్తలు కలిసి ఉండాలని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని... కార్యకర్తలు, నేతల ప్రవర్తన కారణంగా కూటమి ఐక్యతను దెబ్బతీయొద్దంటూ  పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్.... ఆచరణలో తాను స్వయంగా ఎందుకు ఫాలో కావట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏమైనా గానీ.. పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం.. కూటమి కలిసి చేస్తున్న  కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వల్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్  అవుతుందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ వినపడుతోంది. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కీలకమైన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంగా  ఉన్న మల్లు భట్టి విక్రమార్క  కచ్చితంగా పాల్గొంటున్నారు.. కర్ణాటకలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సమావేశాలకు, కూటమి నిర్వహించే సమావేశాలకు పవన్ దూరంగా ఉండడం వెనుక  మతలబు ఏంటో జనసేన నాయకులే చెప్పాలంటున్నారు. మొత్తానికి తాజాగా జరిగిన హెచ్ఓడీలు, సెక్రటరీల సమావేశానికి పవన్ రాకపోవడం.. అమరావతి లోనే  తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వెనుక మతలబు ఏంటనే దానిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.
తెలంగాణలో  రెండో విడత పంచాయతీలకు పోలింగ్‌  ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది ఆ తరువాత  ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రెండో విడతలో భాగంగా 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా  ఐదు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. ఇక పోతే 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను  108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.   31 జిల్లాల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు,   153 మంది ఇతరులు ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు.   
ALSO ON TELUGUONE N E W S
  బాలయ్య బాక్సాఫీస్ గర్జన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో అఖండ-2  సోమవారం సాలిడ్ బుకింగ్స్   'అఖండ-2'తో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించారు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. వరుసగా ఐదోసారి బాలకృష్ణ ఈ ఫీట్ సాధించడం విశేషం. (Akhanda 2 Thaandavam)   2021లో వచ్చిన 'అఖండ'తో బాలయ్య హిట్ స్ట్రీక్ మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడదే బాటలో 'అఖండ-2' పయనించింది.   అఖండ-2 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు, మూడో రోజు కలిపి మరో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.   Also Read: 'ధురంధర్' బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లో 550 కోట్లు..!   ఇప్పట్లో అఖండ-2 జోరుకి బ్రేకులు పడేలా లేవు. నాలుగో రోజైన సోమవారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. బుక్ మై షోలో గంటకు ఐదు వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ఈ మూవీ మండే టెస్ట్ పాస్ అయినట్లే.   వీక్ డేస్ లో నిలబడిందంటే.. సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ప్రస్తుత బుకింగ్స్ చూస్తుంటే.. అఖండ-2 కి లాంగ్ రన్ ఉండటం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.150-200 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో అఖండ-2 బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశముంది.    
      -ఆయన ఓకేనా! -వారణాసి అప్ డేట్ ఏంటి  -ఫ్యాన్స్ ఏమంటారు     సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli)అభిమానులే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులు మొత్తం 'వారణాసి'(Varanasi) ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని తమ ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. దీంతో నిత్యం వారణాసి అప్ డేట్స్ గురించి సెర్చ్ చేయడం వాళ్ళ నిత్యదినచర్యల్లో ఒక భాగమైపోయింది.ఈ క్రమంలోనే వారణాసి కాస్టింగ్ కి సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక న్యూస్ వాళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది.     అంతలా వాళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి కారణం వారణాసిలో లెజండ్రీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)నటిస్తూ ఉండటమే. అవును వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో చేస్తున్నాడని, సదరు క్యారక్టర్ మహేష్ తండ్రి క్యారక్టర్ అని కూడా అంటున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబో. ఎక్కువ శాతం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా చేసిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. వారణాసి చిత్ర యూనిట్ ప్రకాష్ రాజ్ చేస్తున్న విషయాన్నీ త్వరలోనే అధికారకంగా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.     Also read:   ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్!      ఇక ఈ న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టుని మహేష్ తండ్రిగా ఎంచుకున్నారంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై వండర్ ని సృష్టించే క్యారక్టరే అయ్యి ఉంటుంది. పైగా ప్రకాష్ రాజ్ కూడా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఒప్పుకుంటాడు. ఆల్రెడీ మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడిందని అంటున్నారు. ఇక వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 2027 వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.         
      చంపింది ఎవరు! ఎందు కోసం చంపారు! దర్శకుడిగా ఎన్నో హిట్ మూవీస్  నటుడుగా కూడా సుదీర్ఘ ప్రయాణం        తండ్రి వారసత్వంతో సినీ రంగంలోకి ప్రవేశించి సదరు వారసత్వాన్ని బలంగా చాటి చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్ళల్లో 'రాబ్ రీనర్' కూడా ఒకరు. ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ సెల్యులాయిడ్ పై తనదైన ముద్ర వేసి హాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులకి ఇష్టమైన దర్శకుడిగా మారారు. దిస్ ఈజ్ స్పైనల్ టాప్, స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, ఏ ఫ్యూ గుడ్ మెన్, ది అమెరికన్ ప్రెసిడెంట్, రూమర్ హాజ్ ఇట్, ఆల్బర్ట్ బ్రోక్స్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. నిన్న రాబ్ రీనర్ 'లాస్ ఏంజెల్స్' లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఆయనతో పాటు భార్య మైకేల్ సింగర్ కూడా విగత జీవిలా పడి ఉంది. ఈ ఇద్దరు ఒంటిపై కత్తి పోట్లు ఉండటంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ సినీ సర్కిల్స్ లోనే కాకుండా వరల్డ్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు గల రాబ్ రీనర్ 1984 లో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ దర్శకుడి కంటే ముందే ఇరవై ఏళ్ళ వయసులోనే నటుడుగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విశిష్టమైన క్యారెక్టర్స్ పోషించాడు. అభిమాన గణం కూడా ఎక్కువే.     also read:   అఖండ 2 చూస్తున్న మహిళకి పూనకం.. పూర్తి నిజం ఇదే      ఈ ఏడాది సెప్టెంబర్ 25 న 'ది స్పైనల్ టాప్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన 'ది స్పైనల్ టాప్ 2 ' అనే మాక్యుమెంటరీ కామెడీ ఫిలింలో కనిపించాడు. దర్శకుడు కూడా ఆయనే. విచిత్రం ఏంటంటే దర్శకుడిగా పరిచయమైన మూవీ కూడా స్పైనల్ టాప్ నే. దీంతో మొదటి చిత్రమే ఆఖరి చిత్రంగా మిగలడం అభిమానులని కంట తడి పెట్టిస్తుంది.  సుమారు ఇరవై చిత్రాల వరకు దర్శకత్వం వహించిన రాబ్ నిర్మాతగానూ ఎన్నో గోప్ప సినిమాలని నిర్మించాడు. 1971 లో 'పెన్నీ మార్షల్' అనే నటిని వివాహం చేసుకొని 1984 లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతే మైకేల్ ని 1989 లో వివాహం చేసుకున్నాడు. మొత్తం నలుగురు పిల్లలు. ఇక తండ్రి కార్ల్ రినర్ అమెరికన్ సినీ ప్రపంచంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన లెజండ్రీ సినీ పర్సన్.    
Bad Girlz, an entertainer directed by Phani Pradeep Dhulipudi, who has previously directed the successful '30 Rojullo Preminchadam Ela', locked release date. The film is being produced under the banners of Prashvitha Entertainment, Neeli Neeli Aakasam Creations, and NVL Creations. Anchal Gowda, Payal Chengappa, Roshini, Yashna, Rohan Surya, and Moin are the main actors in 'Bad Girlz'. The tagline for the film, 'Kani Chala Manchodlu', contradicts with the title in an interesting way. Sasidhar Nalla, Emmadi Soma Narsaiah, Ramisetti Rambabu, and Ravula Ramesh are producing this film. This Entertainer film is set to release on December 25th, on the occasion of Christmas. Director Phani Pradeep  Dhulipudi has described his movie as a complete entertainer that explores what it would be like if female characters headlined a Jathi Ratnalu or a MAD.    "We are very happy with how the film has shaped up. It's for everyone to like. You are in for a thorough entertainer," the director said. He added that the talented Anup Rubens has provided excellent music, and that the Oscar-winner Chandra Bose penned the lyrics for all the songs.  He further said, "The songs have come out very well. The recently releasaed song Ila Chusukuntane received very good response with 6 Million views. And Bad Girlz Anthem song is getting a good response as well in Social Media. We will be releasing the remaining songs soon. Please watch our movie in theatres."  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
      -అఖండ 2 జోరు  -బాలయ్య, శివుడి తాండవంకి భారీ రెస్పాన్స్  -ఆ మహిళ ఎవరు -ఎక్కడ జరిగింది     ప్రస్తుతం 'అఖండ 2 '(Akhanda 2)మానియాతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా మొత్తం ఊగిపోతోంది. డేవోషనల్ కంటెంట్ కి అన్ని రకాల ఎమోషన్స్ కుదరడంతో పాటు శివస్థుతుడైన అఘోరగా బాలయ్య(Balakrishna)తన నట విశ్వరూపాన్ని చూపించడంతో అభిమానులే కాకుండా ప్రేక్షకలోకం మొత్తం అఖండ కి దాసోహమయ్యింది. ఎంతలా అంటే మూవీలో  ని చాలా సీన్స్ చాలా మందికి ఫేవరేట్ గా నిలవడమే కాకుండా సదరు సీన్స్ గురించి చాలా గర్వంగా తమకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. రిపీట్ ఆడియెన్సు కూడా పెద్ద సంఖ్యలోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నారు. బాలయ్యకి తోడుగా పరమేశ్వరుడు, థమన్ కలవడంతో కొంత మంది ఆడవాళ్ళకైతే థియేటర్స్ లోనే పూనకాలు కూడా వస్తున్నాయి.     ఇందుకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లోని ఒక మహిళ తన భర్త తో  కలిసి  అఖండ 2 చూడటానికి వెళ్ళింది. క్లైమాక్స్ సీన్  లో శివుడు, అఖండ తాండవం ఆడే సీన్‌ని చూస్తూ సదరు మహిళ ఆ ఇద్దరికి దండం పెడుతూ చేతులు ఊపుతూ, శరీరాన్ని కదిలిస్తూ పూనకంతో ఊగిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఆమె భర్త అదుపు చేసే ప్రయత్నం చేశాడు. థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఆమెను చూస్తు ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ మారింది. దీన్ని బట్టి మూవీ ప్రారంభం నుండే ప్రేక్షకులు అఖండ కి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.     ఇక స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి విజిల్స్‌, చప్పట్లతో హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్‌ దగ్గరయ్యే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు అందర్నీ ఊర్రూతలూగిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్న అభిప్రాయం కలగడంతో పాటు పిల్లలు, పెద్దలు అంతా మువీని ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్త మంది అభిమానులైతే థియేటర్‌ల వద్ద ఏకంగా పూజలు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య రికార్డు కలెక్షన్స్ సాధించడం పక్కా.        
  'అఖండ-2'తో బాలయ్య మరో సంచలనం నార్త్ అమెరికాలో అరుదైన రికార్డు సీనియర్ స్టార్స్ లో ఒకే ఒక్కడు   'అఖండ-2'తో బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ.. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో అడుగుపెట్టి బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఓవర్సీస్ లోనూ అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. (Akhanda 2 Thaandavam)   నార్త్ అమెరికాలో అఖండ-2 సినిమాని మోక్ష మూవీస్ విడుదల చేసింది. ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ లోనే నార్త్ అమెరికాలో 750K డాలర్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మోక్ష మూవీస్ ప్రకటించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. ఈ వారంలో 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే బాలయ్య వరుసగా ఐదోసారి ఈ ఫీట్ సాధించినట్లు అవుతోంది.    Also Read: అఖండ ప్రభంజనంలో మోగ్లీ ఎంత కలెక్ట్ చేసిందంటే..?   2021లో విడుదలైన 'అఖండ'తో బాలకృష్ణ విజయ పరంపర మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు నార్త్ అమెరికాలో 1 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. ఇప్పుడదే బాటలో 'అఖండ-2' పయనిస్తోంది. సీనియర్ స్టార్స్ లో ఇలా వరుసగా ఐదుసార్లు 1 మిలియన్ ఫీట్ సాధించిన ఏకైక హీరో బాలకృష్ణ కావడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు.    
  అఖండకు పోటీగా విడుదలైన మోగ్లీ అఖండ ప్రభంజనంలో నిలబడిందా? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది?   ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అఖండ ప్రభంజనం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండకు సీక్వెల్ గా రూపొందిన 'అఖండ-2' డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టి.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. దీంతో అఖండ ప్రభంజనంలో విడుదలైన 'మోగ్లీ' సినిమా పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. (Akhanda 2 Thaandavam)   నిజానికి అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 12కి వాయిదా పడింది. దీంతో డిసెంబర్ 12న విడుదలవ్వాల్సిన 'మోగ్లీ' పోస్ట్ పోన్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఒక్కరోజు వెనక్కి జరిగి.. డిసెంబర్ 12 రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టి.. మోగ్లీ టీమ్ ఊహించని సాహసం చేసింది. అయితే సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. (Mowgli 2025)   Also Read: అఖండ-2 రెండు రోజుల కలెక్షన్స్.. బాలయ్య బాక్సాఫీస్ తాండవం!   ఓ వైపు అఖండ తాండవం, మరోవైపు పాజిటివ్ టాక్ రాకపోవడంతో.. మోగ్లీ అసలు బాక్సాఫీస్ దగ్గర నిలబడగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ మూవీ ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు రూ.1.22 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. పెద్ద సినిమాకి పోటీగా విడుదలైన చిన్న సినిమా.. మొదటి రోజు కోటి కలెక్ట్ చేయడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.   కాగా, మోగ్లీలో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా.. సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.    
  వచ్చే ఏడాది బాక్సాఫీస్ దగ్గర మెగా సందడి చూడబోతున్నాం. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలు 2026లో విడుదల కానున్నాయి. అప్పుడే ఫస్ట్ సింగిల్స్ తో ఈ మూడు సినిమాలు మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం విశేషం.   చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్లా' సాంగ్ అక్టోబర్ లో విడుదలైంది. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ సాంగ్ ఇప్పటికే 83 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం విశేషం. (Meesaala Pilla)   రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'పెద్ది'. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి 'చికిరి చికిరి' అంటే సాగే ఫస్ట్ సింగిల్ నవంబర్ లో విడుదలై సోషల్ మీడియాని షేక్ చేసింది. యూట్యూబ్ ఇప్పటికే 97 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. (Chikiri Chikiri)   గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా 'దేఖ్‌లేంగే సాలా' తాజాగా విడుదలైంది. దేవి ఎనర్జిటిక్ మ్యూజిక్, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్, పవన్ వింటేజ్ స్టెప్స్ తో ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.  24 గంటలలోపే దాదాపు 30 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. (Dekhlenge Saala)   మెగా హీరోలు సినిమాలలో పాటలు బాగుంటాయనే పేరుంది. ఇప్పుడు దానిని నిజం చేస్తూ.. మెగా హీరోల అప్ కమింగ్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ అన్నీ హిట్ అవ్వడం మెగా ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.  
  అఖండ-2 బాక్సాఫీస్ తాండవం వంద కోట్లకు చేరువ బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా పరుగులు   నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'అఖండ 2: తాండవం' (Akhanda 2 Thaandavam). 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్ళతో సత్తా చాటుతోంది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది.   డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్స్ తో బాక్సాఫీస్ దగ్గర అఖండ తాండవం మొదలైంది. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ.. రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.   మొదటి రోజు దాదాపు రూ.60 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ తో.. మొదటి రెండు రోజుల్లోనే 'అఖండ 2' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. మూడో రోజు ఆదివారం కావడంతో రూ.35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా రూ.125 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటనుంది.   2021లో విడుదలైన 'అఖండ' సినిమా ఫుల్ రన్ లో రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన 'అఖండ 2'.. కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే రూ.125 కోట్లు రాబడుతుండటం విశేషం. ప్రస్తుత జోరు చూస్తుంటే.. సెకండ్ వీకెండ్ కి ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తోంది.  
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని 2026 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా 'దేఖ్‌లేంగే సాలా' విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. (Ustaad Bhagat Singh)   పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమాని ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ప్రకటించారు. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ఆయన ఈ సినిమాకి తగిన సమయం కేటాయించలేకపోవడంతో.. ఆలస్యమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అందులో వాస్తవం లేదని, నిజానికి ఈ సినిమా నా వల్లే ఆలస్యమైందని చెప్పి షాకిచ్చాడు హరీష్ శంకర్.   'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల అసలు ఆలస్యం అవ్వలేదు. మొదట ఒక ప్రేమ కథ చేయాలనుకున్నాం. కానీ, అభిమానులు గబ్బర్ సింగ్ లాంటి సినిమా కావాలని కోరుతుండటంతో సందిగ్ధంలో పడిపోయాం. అదే సమయంలో పాండమిక్ వచ్చింది. ఏ కథ చేయాలనే సందిగ్ధంలో నా వల్లే కొంచెం సమయం వృధా అయింది. ఒక రీమేక్ చేద్దామనుకొని అది కూడా పక్కన పెట్టాము. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, అభిమానులందరూ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా చేయాలనుకున్నాం. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వల్లే చిత్రీకరణ త్వరగా పూర్తయింది. ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ కి విజయవాడ వెళ్ళిపోయేవారు. రెండు రోజులు షూటింగ్ ఉండదేమో అనుకునేవాళ్ళం. కానీ, ఆయన రాత్రి పూట షూటింగ్ కి సమయం కేటాయించేవారు. ఉదయమంతా ప్రజాసేవలో ఉండి, రాత్రి ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చి తెల్లవారుజాము వరకు షూటింగ్ చేసి, మళ్ళీ మంగళగిరి వెళ్ళిన రోజులున్నాయి. 18 గంటలు, 20 గంటలు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని చెప్పాడు.   హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తే.. ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్ధం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది కానీ, పవన్ కళ్యాణ్ వల్ల కాదని అర్థమవుతోంది.   
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు,  సమస్యలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్న స్నేహితుల అవసరం,  వారి సహాయం ఎంతో అవసరం అవుతుంది.  అయితే ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీగా ఉన్న, నిజమైన స్నేహితులు ఉండరు. కొందరి జీవితాలలో నకిలీ స్నేహితులు కూడా ఉంటారు.  కేవలం స్వార్థం కోసం, మోసం చేయాలనే ఉద్దేశంతో స్నేహం చేసే వారు ఉంటారు. నకిలీ స్నేహితులు వెనక గోతులు తీస్తూ ఉంటారు. చాలా నష్టాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. నిజమైన స్నేహితుడికి,  నకిలీ స్నేహితుడికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పే మార్గాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. దూరం.. నకిలీ స్నేహితులను బయటపెట్టే మంచి మార్గం వారు పాటించే దూరం. స్నేహితులు సమస్యలు ఏమీ లేకుండా బాగున్నప్పుడు,  పార్టీలు చేసుకుంటున్నప్పుడు,  ఆర్థికంగా  బాగున్నప్పుడు,  ప్రయాణాలు ప్లాన్  చేస్తున్నప్పుడు  అందరికంటే ముందు వీళ్లే కనిపిస్తారు.  కానీ స్నేహితులు ఏవైనా సమస్యలలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు  దూరం మెయింటైన్ చేస్తారు. అంతేకాదు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడం  లేదా ఫోన్  ఆఫ్ లో ఉందని చెప్పడం లాంటివి చేస్తారు. కొన్నిసార్లు కేవలం దూరంగా ఉంటూ మాటల్లో సానుభూతి తెలుపి తప్పించుకుంటారు. ఈర్ష్య.. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల  విజయాన్ని తనదిగా భావిస్తాడు.  కానీ  నకిలీ స్నేహితులు తన స్నేహితులు  అభివృద్ధి చెందడం చూసి ఎప్పటికీ సంతోషించడు.  ప్రమోషన్ వచ్చినప్పుడు లేదా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు ఓర్వలేరు.  పైగా   అలాంటి సంతోష సమయాల్లో  నీ అదృష్టం బాగుంది అందుకే నీకు అవన్నీ దొరికాయి వంటి ఎగతాళి మాటలు కూడా మాట్లాడతారు.  విజయం పట్ల అసూయ పడే స్నేహితులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. అవమానం.. స్నేహితుల మధ్య జోకులు వేసుకోవడం, ఆటపట్టించడం సర్వసాధారణం, కానీ నకిలీ స్నేహితులు  తరచుగా అందరిముందు   తక్కువ చేయడానికి, తక్కువ చేసి మాట్లాడటానికి  ప్రయత్నిస్తారు. బలహీనతలు బయటపెట్టడం,  ఎగతాళి చేయడం వంటివి చేస్తారు.  అలాంటి సందర్భాలలో బాధపడితే నేను జోక్ చేశా.. దీనికే బాధపడాలా, కనీసం ఫ్రెండ్ గా నేను ఇలా కూడా మాట్లాడకూడదా అని కవరింగ్ కూడాచేస్తారు. రహస్యాలు.. స్నేహితులు  ఇతరుల రహస్యాలను కథలు కథలుగా లేదా కబుర్లు లాగా చెప్పేవాడు అయితే అతను  ఇక్కడ వినే రహస్యాలు కూడా అవతలి వారికి చెప్పేస్తాడు. నకిలీ స్నేహితుడు ఎప్పుడూ రహస్యాలను దాచి ఉంచలేరు.  పోస్ట్‌మ్యాన్ లాగా వ్యవహరించి అవతలి వారి విషయాలను ఇవతలికి,  ఇవతలి వారి విషయాలను అవతలికి చెబుతూ ఉంటారు.  ఇలాంటి వ్యక్తి అస్సలు మంచివాడు కాదు. స్వార్థం.. నకిలీ స్నేహితులు ఎప్పుడూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు.  ఎవరైనా తన దగ్గర  ఏదైనా  చెప్పుకునేటప్పుడు మధ్యలో తన సమస్యలు,  తన ఇబ్బందులు చెప్పి తన స్నేహితుల మాటలు డైవర్ట్ చేస్తారు. ఇతరుల భావాలు, ఎమోషన్స్ అస్సలు వారికి పట్టవు. అందరూ తను చెప్పేది వింటే చాలని అనుకుంటారు తప్ప అందరి విషయాలు తనకు అవసరం లేనట్టు బిహేవ్ చేస్తారు. పైన చెప్పుకున్న లక్షణాలు మీ స్నేహితులలో ఉంటే దయచేసి వారిని దూరం ఉంచడం ఉత్తమం. వారికి పర్సనల్ విషయాలు,  ముఖ్యమైన విషయాలు, జీవితంలో ఏవైనా రహస్యమైన విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది. అలాంటివారి కోసం సమయాన్ని వృథా చేయడం కూడా తప్పే.                             *రూపశ్రీ.
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే అనే ఫీలింగ్ కలిగిస్తుంది.  వారి ప్రవర్తన,  వారి స్వభావం ఇవన్నీ పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా వచ్చేవే అయినా పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు,  జ్యోతిష్కులు. ఇంతకీ డిసెంబర్ నెలలో ఫుట్టిన వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తులు  వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటారు.  అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా ఇతర నెలల్లో పుట్టిన వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది.   సంఖ్యాశాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట.  వీరిది సహజమైన ఆకర్షణ అని, డబ్బు, హోదా, పలుకుబడి ద్వారా వచ్చే ఆకర్షణ కాదని సంఖ్యాశాస్ర్త నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు వారి ప్రవర్తన,  హావభావాలు, వారి మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారట.  ఇతరుల నుండి మెప్పు పొందడం, ఇతరులతో ఆకట్టుకునేలా మాట్లాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎమోషన్ పరంగా చాలా పీక్స్ లో ఉంటారట.  వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు.  దీని వల్ల వారు చాలా సార్లు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో సంబంధాల విషయంలోనూ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. మోసపోవడంలో కూడా డిసెంబర్ లో పుట్టిన వారు ఫస్ట్ అని చెప్పవచ్చు.  వీరు ఇతరులను చాలా తొందరగా నమ్మేస్తారు. అంతకు మించి వీరిది చాలా స్వచ్చమైన హృదయమట.  ఈ కారణంగా వీరు ఇతరుల విషయంలో  సులువుగా బోల్తా పడతారు.   డిసెంబర్ లో పుట్టిన వారితో ఎలాంటి సంకోచం లేకుండాస్నేహం చేయవచ్చట. ఎందుకుంటే ఈ నెలలో పుట్టిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారట.  అలాగే నమ్మకమైన స్నేహితులుగా ఉంటారట. స్నేహం పట్ల పూర్తీ విధేయతతో ఉంటారట. కొందరు వ్యక్తుల చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారిలో డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ఉంటారట.  వీరి చుట్టూ సానుకూల శక్తి ఉంటుందట.  ఈ కారణంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులకు మంచి జరుగుతుందని,  ఎవరికైనా మంచి సలహాలు, పరిష్కారాలు లభించి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటారు. సలహాలు ఇవ్వడంలో డిసెంబర్ లో పుట్టిన వారు ది బెస్ట్ అని చెప్పవచ్చు. వీరు మంచి సలహా దారులు,  సమస్యను పరిష్కరించడానికి మంచి సలహాలు,  సరైన ప్రణాళిక ఇవ్వగలరట.కాకపోతే వీరిది చంచలమైన మనసు.. అలాగే వీరి స్వభావం కూడా మొండిగా ఉంటుంది. ఈ కారణంగా వీరు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.   ఇది డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం. అందరూ ఇలానే ఉంటారని కాదు.. సంఖ్యా శాస్ర్తం ప్రకారం నిపుణులు పేర్కొన్న వివరాలే ఇవి.                                *రూపశ్రీ.
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి.  ఒకరు చాలా సీరియస్ గా భావిస్తే.. మరొకరు చాలా సులువుగా బంధాన్ని వదిలేస్తారు. మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది కొందరికి అలవాటుగా కూడా మారింది.  డబ్బు, వస్తువులు కోల్పోతే పోతే పోయాయని సర్థి చెప్పుకోవచ్చు. కానీ మనసుకు గాయం చేసి, నమ్మకాన్ని దెబ్బతీసి,  జీవితంలో ఆశల మీద నీళ్లు చల్లే పనులు చేసే మోసగాళ్లు ఉంటారు.  ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసపోయేవారు. కానీ ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు.  మోసం చేసేముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తారట. అవేంటో తెలుసుకుంటే ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా అలాంటి సంఘటనలు ఎదురైతే జాగ్రత్త పడవచ్చు. మోసాన్ని గ్రహించి మనసు గాయపడకుండా కాపాడుకోవచ్చు. మాట్లాడే విధానం.. అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా జరిగేటప్పుడు కనిపంచే మొదటి మార్పు మాట్లాడే విధానం మారడం. ఒకప్పుడు ఆప్యాయంగా,  ఎక్కువగా కేర్ తీసుకుంటూ,  ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే అమ్మాయి,  ఒక్కసారిగా మాట్లాడటం తగ్గించడమే కాకుండా క్రమంగా కఠినంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తొందరలోనే బ్రేకప్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. ఫోన్ కాల్స్.. అమ్మాయిలు పదే పదే బంధువులు లేదా కుటుంబ సభ్యులు కాల్ చేశారని చెబుతూ దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఆమె దూరం అయ్యే సూచనలు ఇస్తుందట.  మోసం చేసే అమ్మాయిలు తరచుగా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారని అంటారు.   మాటల్లో మార్పు.. ప్రేమించిన అమ్మాయి మొదట్లో ఎంతో ఆప్యాయంగా,  కేరింగ్ గా మాట్లాడుతుంది. కానీ ఆ తరువాత ఆమె ఆ రిలేషన్ నుండి తప్పించుకోవాలని,  వేరే రిలేషన్ లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆమె మాటతీరు మారుతుందట.  ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ స్థానంలో చిరాకు, అసహనం,  వ్యంగ్యం వచ్చి చేరతాయట. కొన్ని సార్లు చాలా ఘాటుగా కూడా మాట్లాడతారట. సమయం తగ్గించడం.. బయట కలవడం అయినా,  ఫోన్ లో మాట్లాడటం అయినా ప్రేమించిన అమ్మాయి గతంలో లాగా ఎక్కువసేపు మాట్లాడటం, కబుర్లు చెప్పడం కాకుండా  కేవలం రెండు మూడు నిమిషాలలో మాట్లాడటం,  రెండు మూడు ముక్కలలో సమాధానం చెప్పి పోన్ పెట్టేయడం,  తర్వాత మాట్లాడతాను అని చెప్పడం.. వంటివి చేస్తుంటే ఆమె తొందరలోనే బ్రేకప్ చెప్పేస్తుందని అర్థమట. కారణాలు.. సమయం లేకపోవడం, పనిలో బిజీగా ఉండటం లేదా మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి సాకులు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆమెకు మాట్లాడే ఆసక్తి లేదని అర్థం. నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అలా కారణాలు చెబుతూ ఉంటారు. మార్పులు.. లైఫ్ స్టైల్ మార్చుకోవడం,  కొత్త అలవాట్లు,  సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వంటివి చేస్తుంటే ఆ అమ్మాయి మరొకరితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిందని అర్థం.  ఇవన్నీ కనివిస్తే ఆ అమ్మాయి మోసం చేస్తోందని అర్థం.  ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అబ్బాయిలు జాగ్రత్త పడితే మనసుకు గాయం కాకుండా జాగ్రత్త పడవచ్చు.                                       *రూపశ్రీ.
  ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు.  ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని,  ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా  చరక మహర్షి శిష్యుడైన  వాగ్భటాచార్యుడు  చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట.  ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు,  వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే  85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం  15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. తాగునీరు.. 3 నియమాలు.. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు.  మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ  నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని  గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం  ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీరు.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి  9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది,  పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ  పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు  ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం  జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది.  బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్,  అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు  అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు,  ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ,  మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది.  శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...