LATEST NEWS
అనుకున్నట్టే జరిగింది. మెట్రోమేన్ శ్రీధరన్ ను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. పార్టీ జాతీయ కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రన్ అధికారికంగా శ్రీధరన్ పేరు ప్రకటించారు.  కేరళలో బీజేపీకి ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులే ఖరారు కాలేదు. అందరికంటే ముందు సీఎం అభ్యర్థి మాత్రం డిసైడ్ అయిపోయారు. ఢిల్లీ మెట్రో మేన్ గా దేశమంతా సుపరిచితమైన శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు. సీఎం కేండిడేట్ కు సై అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఇక శ్రీధరనే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టే.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది పార్టీ. గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని శ్రీధరన్ చెప్పారు.  శ్రీధరన్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొచ్చి అర్బన్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. రాజధాని నుంచి బరిలో దిగితే.. యావత్ రాష్ట్రంపై ఆయన ప్రభావం ఉంటుందని లెక్కలేస్తోంది కమలదళం. మిస్టర్ క్లీన్ గా, మెట్రో మ్యాన్ గా పాపులారిటీ ఉన్న శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావిస్తోంది.  గతంలో ఢిల్లీలోనూ బీజేపీ ఇలాంటి ప్రయోగమే చేసింది బీజేపీ. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీని సీఎం కేండిడేట్ గా ప్రకటించి ఎన్నికల బరిలో దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కేరళలోనూ శ్రీధరన్ తో ఢిల్లీ తరహా ఎక్స్ పర్మెంట్ చేస్తోంది. LDF, UDF కూటములు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఎలాగూ గెలిచే అవకాశం లేని చోట మాత్రమే.. బీజేపీ కిరణ్ బేడీ, శ్రీధరన్ లాంటి మిస్టర్ క్లీన్ లను ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తూ.. ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంటుందనే ఆరోపణ ఉంది. అదే, పక్కా గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రం RSS మూలాలున్న లీడర్లను మాత్రమే ముఖ్యమంత్రులను చేస్తుందనేది విమర్శ వినిపిస్తుంటుంది. అయితే, విద్యాధికులు ఎక్కువగా ఉండే కేరళలో శ్రీధరన్ ఇమేజ్ కమలదళానికి ఏ మేరకు కలిసొస్తుందో...
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో  ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు.  ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెప్పారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని భయానక పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు.  ఏపీలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ విధ్వంసానికి పెద్దపీట వేశారని మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా?.. ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు చంద్రబాబు.   
యాక్సిడెంట్ లో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. మూడో రోజూ అతడిలో చలనం లేదు. క్షతగాత్రుడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  శంకర్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష చేయడానికి సిబ్బంది సిద్ధమయ్యారు. కత్తితో డెడ్ బాడీపై గాటు పెట్టబోతుండగా.. శంకర్ చేయి సడెన్ గా కదిలింది. పోస్ట్ మార్టం సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు. అదేంటి? మృతదేహం చేయి కదలడమేంటి? అని షాక్ అయ్యారు. అంతలోనే తేరుకున్నారు. శంకర్ చనిపోలేదని, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. వెంటనే అతన్ని మార్చురీ నుంచి ఆసుపత్రి వార్డుకు తరలించారు. ప్రభుత్వ వైద్యులు అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంతోనే.. బతికున్న శంకర్ చనిపోయాడని పోస్ట్ మార్టంకు తరలించారని ప్రభుత్వ వైద్యులు మండిపడుతున్నారు. కర్ణాటక, బెల్గావిలో జరిగిన ఈ దారుణంతో.. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై మరోసారి చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.
విశాఖకు కొత్త పరిశ్రమలు రావడం లేదు.. గతంలో వచ్చినవి మూత పడుతున్నాయి.. ఏపీకి రావాలంటనే పారిశ్రామిక వేత్తలు వణికిపోతున్నారు.. ఇవి విద్యార్థులతో జరిగిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో విద్యార్థులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి సర్కార్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  ఒక్క ఛాన్స్ అడిగి సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తారని  లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచారు. ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని చెబుతున్నారన్నారు. పక్కనే ఉన్న జింక్ మూసేసారు ఇప్పుడు కార్మికులు రోడ్డున్న పడ్డారని మండిపడ్డారు. విశాఖలో ఆధాని డేటా సెంటర్ వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు.  విశాఖపట్నానికి రెండేళ్లు ఏం చేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోకేష్. విశాఖపట్నం రాజధాని అంటున్న జగన్.. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.  విశాఖలో రౌడీ దిగాడు.. A2 మొత్తం భూములు దోచుకుంటున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. విశాఖకు ఐటీ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం కన్నా ఉన్న పరిశ్రమలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ రావడానికి భయపడుతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కావాలన్నామని.. కానీ దాన్ని  వైసీపీ ప్రభుత్వం వెల్లగొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చాలా బాధగా ఉందన్నారు నారా లోకేష్.  రాష్ట్ర ప్రభుత్వం వైఖరీ ఇలాగే కొనసాగితే వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.    
పశ్చిమ బెంగాల్ లో ఓట్లను పోలరైజ్ చేసేందుకు బీజేపీ జైశ్రీరామ్ నినాదం ఎత్తుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్మరణ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న సభలో మమతా బెనర్జీ లేచి ప్రసంగం చేయబోతుండగా.. బీజేపీ నాయకులు ఒక్కసారిగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో.. ఆమె ప్రసంగించకుండానే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  తాజాగా బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఇక బీజేపీ ఫాలో అవుతున్న "హార్డ్‌కోర్ హిందుత్వ" కి కౌంటర్ గా సీఎం మమత నేతృత్వంలోని తృణమూల్ ఇకపై "సాఫ్ట్ హిందుత్వ" ను ఫాలో కావాలని డిసైడ్ అయింది..రాముడికి విరుగుడుగా మమత శివుణ్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో ఆమె తన ఎన్నికల నామినేషన్‌ను మహా శివరాత్రి పర్వ దినాన దఙ్ఖలు చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఆమె అక్కడే తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటు అక్కడ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆమె నామినేషన్ వేయడానికి ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు గ తెల్సుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్రను చేపట్టాలని మమత డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయిన పాదయాత్రను మమత నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రతి రోజు ఆమె కొన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లుగా సమాచారం. అంతేకాకుండా "బెంగాల్ కూతురే ఇక్కడ సీఎం కావాలి" అనే నినాదంతోనే ఎన్నికల్లోకి దూసుకెళ్లాలని ఇప్పటికే మమత నిర్ణయించారు.    
ALSO ON TELUGUONE N E W S
  న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. గురువారం 'జాతిర‌త్నాలు' ట్రైల‌ర్‌ను ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ముంబైలో లాంచ్ చేశారు. హీరో హీరో‌యిన్లు న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా, క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి, డైరెక్ట‌ర్ అనుదీప్ త‌దిత‌ర యూనిట్ మెంబ‌ర్స్ ముంబైలో ప్ర‌భాస్ నివాసానికి వెళ్లి మ‌రీ ఆయ‌న‌ చేతుల మీదుగా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయించ‌డం విశేషం. న‌వీన్ పోలిశెట్టిది జోగిపేట‌. అందుకే "జోగిపేట - ముంబై" అంటూ ఓ వీడియోను రూపొందించి, తామెలా ప్ర‌భాస్‌ను క‌లుసుకున్నామో వినోదాత్మ‌కంగా చూపించింది చిత్ర బృందం. త‌న‌ ఇంట్లో ఒక న‌వారు మంచంపై కూర్చొని 'జాతిర‌త్నాలు' ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్ ఆవిష్క‌రించారు. హీరోయిన్‌ను చూసి, "ఈమేంటి ఇంత పొడ‌వుంద"‌ని ఆశ్చ‌ర్యం ప్ర‌క‌టించారు. ట్రైల‌ర్‌ను చూసి, "సూప‌ర్‌.. చాలా బాగుంది" అని ప్ర‌శంసించారు. "టీజ‌ర్ నాకు గుడ్ అనిపించింది. ట్రైల‌ర్ అయితే ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సూప‌ర్బ్‌. ట్రైల‌ర్ చూసి ప‌దిసార్లు న‌వ్వానంటే, సినిమా ఇంకెంత‌సేపు న‌వ్విస్తుందో ఊహించుకోవాల్సిందే. సినిమా అంతా హిలేరియ‌స్‌గా ఉంటుంద‌ని అనుకుంటున్నాను. కోవిడ్ త‌ర్వాత ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా న‌వ్వుకొంటూ ఎంజాయ్ చేసే సినిమా అనుకుంటున్నాను. డైరెక్ట‌ర్ అనుదీప్‌కు, యాక్ట‌ర్స్‌కు, ప్రొడ్యూస‌ర్ నాగ్ అశ్విన్‌కు, ఎంటైర్ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్తున్నాను." అన్నారు ప్ర‌భాస్‌. ఆయ‌న చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ అయినందుకు యూనిట్ అమితానందాన్ని వ్య‌క్తం చేసింది. ఇదివ‌ర‌కు టీజ‌ర్ చూసిన‌ప్పుడు ఈ సినిమా క‌థ రూ. 500 కోట్ల చుట్టూ న‌డుస్తుంద‌ని అర్థ‌మైంది. ట్రైల‌ర్ అయితే మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచీ ముగిసే దాకా న‌వ్విస్తూనే ఉంది. దీన్ని బ‌ట్టి ప్ర‌భాస్ చెప్పిన‌ట్లు సినిమా చూస్తుంటే మ‌నం పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వ‌డం ఖాయం. ఈ సినిమాలో శ్రీ‌కాంత్ (న‌వీన్‌)‌, శేఖ‌ర్ (ప్రియ‌ద‌ర్శి)‌, ర‌వి (రాహుల్ రామ‌కృష్ణ‌) ముగ్గురు ఫ్రెండ్స్ అని ఇదివ‌ర‌కు టీజ‌ర్ ద్వారానే మ‌నం తెలుసుకున్నాం. శ్రీ‌కాంత్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంది. హీరోయిన్‌ను ప‌టాయించ‌డానికి మ‌నోడు ఎన్ని వేషాలు వేస్తాడో ట్రైల‌ర్ చూపించింది. బీటెక్ చ‌దివిన అత‌ను 'శ్రింగార్‌ లేడీస్ ఎంపోరియం' న‌డుపుతుంటాడ‌ని మ‌నం తెలుసుకుంటాం. ఎంతో జోవియ‌ల్‌గా ఉండే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చంచ‌ల్‌గూడ జైలుకు ఖైదీలుగా ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందనేది ఆసక్తిక‌రంగా, ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా డైరెక్ట‌ర్ చిత్రీకరించి ఉంటార‌ని మ‌నం ఊహించ‌వ‌చ్చు. జైలులో ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌కి వెన్నెల కిశోర్ కూడా తోడ‌వుతాడు. ఇంక న‌వ్వులకు కొద‌వ ఉంటుందా! చివ‌ర‌లో జ‌డ్జిగా క‌నిపించిన బ్ర‌హ్మానందం "మీ త‌ర‌ఫున వాదించ‌డానికి ఎవ‌రైనా ఉన్నారా?" అన‌డిగితే, బోనుమీద చేత్తో కొడ్తూ న‌వీన్ సీరియ‌స్‌గా, "మా కేస్ మేమే వాదించుకుంటాం యువ‌రాన‌ర్" అని చెప్తాడు. దాంతో బ్ర‌హ్మానందం "తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా".. అని త‌న స‌హాయ‌కుడితో, "రేయ్‌.. మ‌న‌మెందుకిక్క‌డ‌? వెళ్లిపోదాం రండి" అని చైర్‌లోంచి లేవ‌డం ఎంతగా న‌వ్విస్తుందో.. ఇలా జాతిర‌త్నాలు ట్రైల‌ర్‌ ఆద్యంతం న‌వ్వులు కురిపిస్తోంది. ర‌ధ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. మార్చి 11న 'జాతిర‌త్నాలు' థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.
  "నేను చేసిన ప్రతి సినిమా నుంచీ ఏదోక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది. అడవిలో ఉండటం.. ఏనుగులతో గడపడం వల్ల మనుషులతో నా రిలేషన్‌ మరింత బలపడింది." అని చెప్పారు రానా ద‌గ్గుబాటి. ఆయ‌న టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'అర‌ణ్య'‌. విష్ణు విశాల్‌, శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్‌ ముఖ్య పాత్రదారులు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఈరోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మార్చి 26న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తోంది.  'అర‌ణ్య' ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో రానా మాట్లాడుతూ, ‘‘నాలుగేళ్ళ తరువాత 'అరణ్య' సినిమా వస్తోంది. ప్రభు సాల్మన్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది.  ఈ చిత్రంలో అరణ్య క్యారెక్టర్ ప్లే చేశాను.. ప్రభు సాల్మన్ స్టయిల్ లోనే ఈ చిత్రం ఉంటుంది. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో.. అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లలేం’ అనేది అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ‘ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఆ భూమిని నువ్వు చూసుకుంటే.. అది నిన్ను మళ్లీ చూసుకుంటుంద’ని. సిటీ, టౌన్ లో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్ చేస్తూ.. వాటిని ఎలా కాపాడాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. అని తెలిపాడు. ప్రభు సాల్మ‌న్‌తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ నిచ్చిందని రానా చెప్పాడు. "ఆయనది ఒక సెపరేట్ స్కూల్. అనుకున్న సీన్ వచ్చేదాకా తను ఎన్ని టేక్ లైనా తీస్తాడు. థియేటర్స్ లో ప్రేక్షకులకు మనం చెప్పే కథ నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతాడు. అందుకని వారికి నచ్చే సీన్స్ చేయాలి అని ప్రభు చెప్తుంటాడు.. ఆయనలో నాకు బాగా నచ్చిన విషయం ఇది. నాకింత మంచి చిత్రం ఇచ్చినందుకు ప్రభుకు థ్యాంక్స్‌. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్ మూడు భాషల్లో చేశాం. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని  థియేటర్లలోనే చూపించాలన్న ఉద్దేశంతో ఈరోస్ నిర్మాతలు ఏడాది పాటు వెయిట్ చేసి మార్చి 26న వరల్డ్ వైడ్ గా బిగ్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్లకి నా స్పెషల్ థ్యాంక్స్‌".. అని చెప్పుకొచ్చాడు రానా.
రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే ద‌ర్శ‌కుల్లో శాండిల్ వుడ్ కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ ఒక‌రు. అప్పుడెప్పుడో 2014లో `ఉగ్రం` చిత్రాన్ని త‌న ఫ‌స్ట్ వెంచ‌ర్ గా తెర‌కెక్కించిన ప్ర‌శాంత్.. ఆపై నాలుగున్న‌రేళ్ళ‌కు పైగా గ్యాప్ తో 2018లో `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1`తో  ప‌ల‌క‌రించారు. భారీ విరామంతో వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ సెన్సేష‌న్స్ గా నిలిచాయి. అయితే .. `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1` తరువాత వ‌స్తున్న `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2` విష‌యంలో ఆ గ్యాప్ కొంచెం త‌గ్గించుకుని.. రెండున్న‌రేళ్ళ విరామం అనంత‌రం సంద‌డి చేయ‌నున్నారాయ‌న‌. ఒక‌విధంగా చూస్తే.. ప్ర‌శాంత్ నీల్ రూప‌క‌ల్ప‌న‌లో వేగం పెరిగిన‌ట్టే. క‌ట్ చేస్తే.. నెక్స్ట్ వెంచ‌ర్ విష‌యంలో మ‌రింత స్పీడ్ చూపిస్తున్నారు ప్ర‌శాంత్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో ప్ర‌శాంత్ నీల్ `స‌లార్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని 2022 ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అంటే.. `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2`కి `స‌లార్`కి మ‌ధ్య కేవ‌లం తొమ్మిది నెల‌ల గ్యాప్ మాత్ర‌మే ఉంద‌న్న‌మాట‌. మొత్త‌మ్మీద‌.. ప్ర‌శాంత్ తీత‌లో ఇది అనూహ్య వేగ‌మ‌నే చెప్పాలి.  మ‌రి.. ఫాస్టెస్ట్ పిక్చ‌రైజైష‌న్ తోనూ ప్ర‌శాంత్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారేమో చూడాలి. 
  రామ్ గోపాల్‌వ‌ర్మ స్కూల్ నుంచి వ‌చ్చిన వాళ్ల‌లో అత్య‌ధిక శాతం మంది ఓ ప‌ట్టాన కాంప్ర‌మైజ్ కారు. అక్క‌డ ఎవ‌రున్నా స‌రే వారి బ్రెయిన్‌ వాష్ చేసేస్తుంటారు. ఇక అదే స్కూల్ నుంచి వ‌చ్చిన  జేడీ చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికీ త‌న‌దైన పంథాని అనుస‌రిస్తూ సినిమాలు చేస్తున్నారాయ‌న‌. ఇట‌వ‌ల '70 ఎం.ఎం.' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చి షాకిచ్చారు జేడీ. ఇంట‌ర్వ్యూలో భాగంగా హీరోయిన్ మ‌హేశ్వ‌రికి సంబంధించిన టాపిక్ రావ‌డంతో జేడీ స్పందించారు. 1995లో వ‌చ్చిన 'గులాబీ' చిత్రం అప్ప‌ట్లో ఏ స్థాయి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇందులో జేడీ చ‌క్ర‌వ‌ర్తి, మ‌హేశ్వ‌రి జంట‌గా న‌టించారు. ఆ టైమ్‌లో వీరిద్ద‌రు ప్రేమ‌లో వున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి. ఇదే విష‌యాన్ని జేడీని యాంక‌ర్ అడిగితే ఫైర‌య్యాడు. "మీతో న‌టించిన హీరోయిన్‌ల‌తో ట‌చ్‌లో వున్నారా?..'సిస్ట‌ర్ మ‌హేశ్వ‌రి'అని అంటారుగా ఆమెతో ట‌చ్‌లో వున్నారా?" అని యాంక‌ర్ జేడీని ప్ర‌శ్నించడంతో.. జేడీ చ‌క్ర‌వ‌ర్తికి ఎక్క‌డో కాలింది.. దీంతో "సిస్ట‌ర్ మ‌హేశ్వ‌రి అని నీతో చెప్పానా?.. నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు క‌దా అని చెప్పి వుంటాను. నీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలా.. ఏజ్‌లో ఆమె కంటే ఒక‌టి రెండేళ్లు పెద్ద కావ‌చ్చు కానీ ఇంట‌లిజెన్స్‌లో మ్యాగీ (మ‌హేశ్వ‌రీ) కంటే చిన్నోడినే." అంటూ క్లారిటీ ఇచ్చాడు జేడీ. 
కోలీవుడ్ స్టార్ విజ‌య్ - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజ‌య్ కి జంట‌గా పూజా హెగ్డే ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని టాక్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ హీరో శివ‌కార్తికేయ‌న్ సాహిత్య‌మందించబోతున్న‌ట్లు తెలిసింది. త‌మిళ‌నాట అగ్ర యువ క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా రాణిస్తున్న శివ‌.. అన‌తికాలంలోనే బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. న‌ట‌న‌తో పాటు నిర్మాణం, గానం, సాహిత్యం.. ఇలా ప‌లు విభాగాల్లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారాయ‌న‌. ఇక నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన `కొల‌మావు కోకిల‌`తోనే గీత‌ర‌చ‌యిత‌గా తొలి అడుగేసిన శివ కార్తికేయ‌న్.. ఆపై `గుర్ఖా`, `న‌మ్మ వీట్టు పిళ్ళై`,  `ఆదిత్య వ‌ర్మ` చిత్రాల‌కు ఒక్కో పాట చొప్పున సాహిత్య‌మందించారు. అంతేకాదు.. త‌నే క‌థానాయ‌కుడిగా నెల్స‌న్ రూపొందించిన `డాక్ట‌ర్` చిత్రంలో రెండు పాట‌ల‌కు లిరిక్స్ రాశారు.   మ‌రి.. విజ‌య్ సినిమాకి శివ‌కార్తికేయ‌న్ సాహిత్యం ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, `విజ‌య్ 65`గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందించ‌నున్నారు.
`కేజీఎఫ్`తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు క‌న్న‌డ క‌థానాయ‌కుడు య‌శ్. నేష‌న‌ల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాలూకు  రెండో భాగం `కేజీఎఫ్ ఛాప్టర్ 2` జూలై 16న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. `ఛాప్ట‌ర్ 1`కి మించిన హీరోయిజం `ఛాప్ట‌ర్ 2`లో ఉండ‌బోతుందంటూ టీజ‌ర్ లో స్ప‌ష్టం కావ‌డంతో.. య‌శ్ పై మ‌రింత అంచ‌నాలు పెరిగాయి. ఇదిలా ఉంటే.. `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2` త‌రువాత `మ‌ఫ్టీ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని రూపొందించిన శాండ‌ల్ వుడ్ కెప్టెన్ న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పాన్ ఇండియా మూవీని సెట్ చేసుకున్నారు య‌శ్. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ వెంచ‌ర్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ లోపే.. ఇంకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట రాకీ భాయ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ విష్ణు ఇందూరి నిర్మాణంలో య‌శ్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య ప‌లుమార్లు దీనికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని టాక్. కాగా, న‌ర్త‌న్ కాంబినేష‌న్ మూవీ పూర్త‌య్యాకే ఈ ఫ్లిక్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ని టాక్. త్వ‌ర‌లోనే య‌శ్ - విష్ణు ఇందూరి కాంబో వెంచ‌ర్ పై క్లారిటీ వ‌స్తుంది. Yash in talks with 83 producer Vishnu Induri for a Pan India film after KGF 2,gf star yash PAN India Movie,Yash going to turn a producer Vishnu Induri
నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన `హిట్` చిత్రం.. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లై స‌ర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. విశ్వ‌క్ సేన్, రుహానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ద్వారా శైలేశ్ కొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. క‌ట్ చేస్తే.. ఈ సినిమాకి సీక్వెల్ గా `హిట్ 2` రాబోతుందంటూ త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇటీవ‌ల నాని ప్ర‌క‌టించేశారు. కొన‌సాగింపు చిత్రాన్ని కూడా శైలేశ్ కొల‌నునే డైరెక్ట్ చేయ‌నున్నారు. కాగా, ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర కోసం మాస్ మ‌హరాజా ర‌వితేజ `ఖిలాడి`లో ఓ హీరోయిన్ గా న‌టిస్తున్న మీనాక్షి చౌద‌రిని ఎంచుకున్న‌ట్లు టాక్. ఇప్ప‌టికే ఈ మేర‌కు మీనాక్షితో `హిట్ 2` టీమ్ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని, పాత్ర న‌చ్చ‌డంతో మీనాక్షి కూడా ఓకే చెప్పింద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే `హిట్ 2`లో మీనాక్షి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. `ఖిలాడి` వేస‌వి కానుక‌గా మే 28న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. అంతకంటే ముందు.. సుశాంత్ కి జంట‌గా మీనాక్షి చౌద‌రి న‌టించిన `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` రిలీజ్ కానుంది.  మ‌రి.. ఒక్క సినిమా విడుద‌ల కాక‌ముందే వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతున్న మీనాక్షి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాలి.
90ల్లో తెలుగునాట తిరుగులేని క‌థానాయిక‌గా రాణించారు అభినేత్రి మీనా. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లోనూ అదే హ‌వాను సాగించారు. క‌ట్ చేస్తే.. పెళ్ళ‌య్యాక సినిమాల‌ను త‌గ్గించుకున్న మీనా.. అడ‌పాద‌డ‌పా న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు. వ‌య‌సుకు త‌గ్గ వేషాల్లో అల‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య `సాక్ష్యం` సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కి అమ్మ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన మీనా.. ప్ర‌స్తుతం త‌న‌కు అచ్చొచ్చిన  సీనియ‌ర్ స్టార్స్ కి జోడీగానే న‌టిస్తున్నారు. రీసెంట్ గా విడుద‌లైన మ‌ల‌యాళ చిత్రం `దృశ్యం 2`లో మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌‌న్ లాల్ కి జంట‌గా క‌నిపించిన మీనా.. ఇప్పుడు ఆ సినిమాకి తెలుగు వెర్ష‌న్ గా రూపొందుతున్న `దృశ్యం 2`లో విక్ట‌రీ  వెంక‌టేశ్ కి జోడీగా న‌టిస్తున్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న‌ త‌మిళ చిత్రం `అణ్ణాత్తే`లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కి పెయిర్ గా యాక్ట్ చేస్తున్నారు. అదే విధంగా.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకి జోడీగా `స‌న్ ఆఫ్ ఇండియా`లోనూ మీనా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్త‌మ్మీద‌.. త‌న ల‌క్కీ స్టార్స్ తో మ‌రోమారు జుట్టుక‌డుతూ ఆయా ప‌రిశ్ర‌మ‌ల్లో వార్త‌ల్లో నిలుస్తున్నారు మీనా.‌
  'ఫ‌న్ బ‌కెట్' ఒక బ్రాండ్‌.. తెలుగు యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ప‌య‌నీర్ అయిన తెలుగువ‌న్‌లో అర్ధ ద‌శాబ్దం పై నుంచీ వ్యూయ‌ర్స్‌ను అల‌రిస్తూ వ‌స్తోన్న న‌వ్వుల టానిక్‌! టీవీ చాన‌ళ్ల‌లో ఎన్ని కామెడీ షోలు వ‌చ్చినా, వ‌స్తున్నా వాట‌న్నింటికీ ప‌య‌నీర్ అయిన ఫ‌న్ బ‌కెట్ ఫ‌న్ బ‌కెట్టే! వారానికి ఒక‌టి చొప్పున ఇప్ప‌టికి 278 ఎపిసోడ్ల‌ను పూర్తి చేసుకున్న బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ సిరీస్ మొత్త ర‌న్ టైమ్ క‌లిపితే 40 గంట‌లు దాటింది. అంటే నాన్‌స్టాప్‌గా దాదాపు రెండు రోజుల పాటు చూడొచ్చ‌న్న మాట‌! మాన‌సిక ఒత్తిడి, ప‌ని ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎలాంటి మెడిసిన్ తీసుకోకపోయినా హాయిగా న‌వ్వ‌గ‌లిగితే అదే మంచి మెడిసిన్ అని ఎన్న‌డో నిరూపిత‌మైంది. డాక్ట‌ర్లు సైతం అదే చెబుతుంటారు. అందుకే తెలుగు ప్ర‌జానీకాన్ని ఒత్తిడి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చి ప్ర‌శాంత‌మైన జీవితాన్ని అందించాల‌నే ల‌క్ష్యంతో 2015లో తెలుగువ‌న్ ప్రారంభించిన నాన్‌స్టాప్ కామెడీ సిరీస్ 'ఫ‌న్ బ‌కెట్'‌. పొట్ట‌చ‌క్క‌ల‌య్యేలా న‌వ్వించే ఆరోగ్య‌క‌ర‌మైన కామెడీతో, ఎలాంటి అస‌భ్య‌త‌కు తావు లేకుండా 278 ఎపిసోడ్లుగా  హాయిగా న‌వ్విస్తూ, ఆరోగ్యాన్ని అందిస్తుండ‌టం 'ఫ‌న్ బ‌కెట్'‌కే సాధ్యం. ఇప్ప‌టివ‌ర‌కూ 200 మిలియ‌న్ల మందికి పైగా ఫ‌న్ బ‌కెట్‌ను వీక్షించారంటే ఈ సిరీస్ ఎంత‌టి బ్లాక్‌బ‌స్ట‌రో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సిరీస్‌లో న‌టించిన ప‌లువురు వ‌ర్థ‌మాన క‌మెడియ‌న్లు సినిమాల్లో అవ‌కాశాలు సంపాదించుకొని రాణిస్తూ ఉండ‌టం మ‌రో విశేషం. ఫ్యామిలీ లైఫ్‌లోని వివిధ ఘ‌ట్టాలు, అంశాల‌తో పాటు స‌మ‌కాలీన రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌ను కూడా హైలైట్ చేస్తూ స్కిట్స్ రూపొందిస్తుండ‌టం 'ఫ‌న్ బ‌కెట్' విజ‌య ర‌హ‌స్యం.
త‌మిళ‌నాట తిరుగులేని న‌టుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి. ఒకవైపు హీరోగానూ.. మ‌రోవైపు విల‌న్ గానూ విభిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తూ.. ప్రేక్ష‌కుల్ని ఫిదా చేస్తున్నారాయ‌న‌. తెలుగులోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్న విజ‌య్ సేతుప‌తి.. ఈ ఏడాది వేస‌విలో ఏకంగా నాలుగు కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. ఆ వివ‌రాల్లోకి వెళితే.. 2021 స‌మ్మ‌ర్ లో విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `లాభ‌మ్`, `మామ‌ణిద‌న్`, `తుగ్ల‌క్ ద‌ర్బార్`, `యాదు‌మ్ ఊరే యావ‌రుమ్ కేళిర్` చిత్రాలు త‌మిళ‌నాట విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. సేతుప‌తికి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. తెలుగులోనూ ఈ సినిమాలు అనువాద రూపంలో జ‌నం ముందుకొచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. కాగా, విజ‌య్ సేతుప‌తి కొంత కాలం క్రితం న‌టించిన త‌మిళ చిత్రాలు `జుంగా`, `ఒరు న‌ల్ల నాల్ పాతు సోల్రేన్` సినిమాలు.. తెలుగులో `విక్ర‌మార్కుడు`, `ఓ మంచి రోజు చూసి చెప్తా` పేర్ల‌తో మార్చి 5, మార్చి 19న అనువాద రూపంలో ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. మొత్త‌మ్మీద‌.. ఈ వేస‌విలో విజ‌య్ సేతుప‌తి హ‌వా ఓ స్థాయిలో ఉండ‌బోతుంద‌న్న‌మాట‌.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
రోడ్లన్నీ రద్దీ. గుంపులు గుంపులుగా జనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గుళ్లు, పండగలూ ఇలా జనజీవనం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. కరోనా లేదు. గిరోనా లేదు. ఇండియన్ల ముందు చైనీస్ వైరస్ తోకముడిచిందంటూ గొప్పలు. మాస్కులు పెట్టుకోవడం తగ్గించేశారు. శానిటైజర్లు రాసుకోవడం మానేశారు. మనకేం కాదులే అనే ధీమా. అందుకు తగ్గట్టే కొంతకాలం పాటు కొవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. ప్రజల్లో కరోనా భయం ఇప్పుడు అస్సలు లేదు. ఇదే అంతా చేస్తున్న తప్పు. కరోనా ఎక్కడికీ పోలేదు. మనతోనే ఉంది. మనమధ్యే మాటు వేసి ఉంది. వేటాడే పులి రెండు అడుగులు వెనకకు వేసినట్టు.. కాస్త సైలెంట్ అయింది అంతే. ఇప్పుడు అదును చూసి సెకండ్ వేవ్ తో మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది.  ఆ మేరకు రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. మార్చి మొదటి వారం నుంచి కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య  హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలో నైతే మళ్లీ లాక్ డౌన్ పెట్టారు. ముంబైలో మాస్కులు లేకపోతే ఫైన్లు వేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొవిడ్ కేసులు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కరోనా ముంచెత్తుతోంది. కరీంనగర్‌ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మంది కొవిడ్‌ బారినపడటం షాక్ కు గురి చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో 10 మందికి కరోనా సోకడం కలకలంగా మారింది. ఇలా వేగంగా మహమ్మారి వ్యాపిస్తుండటం పొంచి ఉన్న సెకండ్ వేవ్ కు ముందస్తు సిగ్నల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 27 రోజుల తరువాత మరోమారు అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే.. దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? ఇది కొత్త స్ట్రెయినా? ముందుముందు మరింత ప్రమాదం తప్పదా? అనే భయాందోళనలు అందరిలోనూ. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. తెలంగాణలో సడెన్ గా కేసులు నమోదవడం కంగారు పెట్టిస్తోంది. తెలంగాణ, ఏపీలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలను గట్టిగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్న కేసుల కంటే క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు మరింత అధికం. నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి పెరిగి వైరస్ కు వాతావరణం అనుకూలంగా మారింది. అందుకే.. కేసులు భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ లెక్కన మార్చి నెలలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య వేత్తలకే కొత్త స్ట్రెయిన్ మీద సరైన అవగాహన లేని ప్రస్తుత తరుణంలో ఇక సామాన్య ప్రజలు ఛాన్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరమే. అందుకే, ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటే మంచిది. కరోనా లేదని బిందాస్ గా ఉండకుండా.. కొవిడ్ ఎలాగైనా రావొచ్చనే అనుమానంతో అప్రమత్తంగా ఉంటే బెటర్. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. జాగ్రత్తే.. కొవిడ్ నుంచి రక్ష.   
నడిరోడ్డుపై కత్తులతో స్వైర విహారం. పట్టపగలు దారుణ హత్యలు. తల్వార్లు, వేట కొడవళ్లతో మనుషులను నరకడమేంటి? ఈ తెలంగాణకు ఏమైంది? ఏమిటీ అరాచకాలు?  పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఖాకీలంటే భయం పోయిందా? కొందరు ఎందుకింతలా బరితెగిస్తున్నారు?. వరుసగా జరుగుతున్న ఘటనలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు  అదుపు తప్పుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ కాప్స్ కు.. పట్టపగలే జరుగుతున్నమర్డర్లు  మచ్చగా మారుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్లీ పోలీసింగ్  విఫల ప్రయోగమా? తెలంగాణ మరో బీహార్ లా మారుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17న జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసు సంచలనం. అంతకు మించి దారుణం. పట్టబగలు, నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగా నరికి నరికి చంపేశారు దుండగులు. హత్య చేసిన తీరు మాత్రం అత్యంత హేయనీయం. విచక్షణారహితంగా కత్తి పోట్లతో విరుచుకుపడ్డారు. ఆ మనుషులు మృగాళ్లలా  ప్రవర్తించారు. మహిళను సైతం అత్యంత పైశాచికంగా చంపేశారు. ఆ మారణకాండను అక్కడున్న జనమంతా నోరెళ్లి బెట్టి చూశారే కానీ, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. నడిరోడ్డు మీదే మర్డర్ జరగడంతో.. అటుగా వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. రెండు ఆర్టీసీ బస్సులు ఆగి పోయాయి. వాటి నిండా జనం ఉన్నారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి.. ఆ మర్డర్ సీన్ ను తమ మొబైల్ లో వీడియో తీశారే కానీ, కనీసం అరవడమో, ఆపడమో, అడ్డుకోవడమో చేయలేదు. నడిరోడ్డుపై కత్తులతో మర్డర్ జరగడం తెలంగాణలో ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు. 2018 సెప్టెంబర్ 26న హైదరాబాద్ అత్తాపూర్ లోనూ అచ్చం ఇలాంటి దారుణమే జరిగింది. కిషన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ లు కలిసి రమేశ్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. మెట్రో పిల్లర్ కు సమీపంలోనే, పట్టబగలే, వందలాది మంది జనం చూస్తుండగానే జరిగిన ఈ మర్డర్ అప్పట్లో సంచలనం స్పష్టించింది. ఆ సమయంలోనూ జనమంతా ఆ మర్డర్ ను కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ అడ్డుకోలేదు. కసిగా గొడ్డలితో నరికి చంపి.. ఆ తర్వాత తీరిగ్గా నిందితులు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. బీహార్ తరహా హత్య అంటూ అప్పట్లోనే ఆ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లాయర్ దంపతుల మర్డర్ తో మరోసారి తెలంగాణలో బీహార్ తరహా హత్యలంటూ చర్చ జరుగుతోంది. 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను కూడా ఈ కోవలోనే చూస్తున్నారు. కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్ష్యతో ప్రణయ్ ను కిరాతకంగా మర్డర్ చేయించాడు అమృతరావు.  సుపారీ గ్యాంగ్ వేట కొడవలితో ప్రణయ్ ను ఆసుపత్రి ప్రాంగణంలో నరికి చంపేసింది. ఆ కేసు తెలంగాణను షేక్ చేసింది. 2021 జనవరి 28న జనగామ జిల్లా కేంద్రంలో  దారుణం చోటుచేసుకుంది.  జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అక్కడే మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నాలుగు ఘటనలే కాదు.. కెమెరాలకు చిక్కని కేసులు ఇంకా అనేకం. ఏ ఘటనకు అదే అత్యంత దారుణం. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ భేష్ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. అలాంటిది ఆయన పార్టీ మండల స్థాయి నేత ఇలా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపడం చిన్న విషయమేమీ కాదు. అందులోనూ.. ఏకంగా హైకోర్టు లాయర్లను హత్య చేయడం వారి బరితెగింపునకు నిదర్శనం. ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థపైనే పరోక్ష దాడి అని అంటున్నారు. అందుకే, హైకోర్టు సైతం ఘటనపై సీరియస్ గా స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. న్యాయవాది దంపతుల కేసులో పోలీసుల ఉదాసీన వైఖరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీహారులోనే ఇలా జరుగుతుందని.. తమకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని బెదిరించడం, చంపడం అక్కడ కామనేనని.. ఇప్పుడు తెలంగాణలోనూ బీహార్ లాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. బంగారు తెలంగాణ తెస్తామని.. ఆటవిక తెలంగాణ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంటున్నారు. భూముల ఆక్రమణలు, నడిరోడ్డుపై మర్డర్లతో తెలంగాణ బీహార్ నే మించేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విఫల ప్రయోగమని.. పాలకుల చేతగాని తనం వల్లే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలంగాణ మరో బీహార్ లా మారిపోతోంది.
మరో పక్షం రోజుల్లో ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారా? అందుకోసం వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఖరారు అయిందా అంటే ఢిల్లీ రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. “మార్చి మొదటివారంలో మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా ఉంటుంది, ఇదులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని  పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ లేదా పునఃవ్యవస్తీకరణ ఉంటుందని వార్తలు వచ్చినా, ఓ వంక ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళన, రిపబ్లిక్ డే రోజున చోటు చేసుకున్న సంఘటనలు,  మరో వంక కొవిడ్ కారణంగా అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు ఇంకా పూర్తిగా సర్డుకోక పోవడం వంటి అనేక కారణాల చేత మంత్రి వర్గవిస్తరణ అప్పట్లో వాయిదా పడిందని అంటున్నారు. ఈ నెల 15తో బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసాయి. విశ్రాంతి అనంతరం మలివిడత సమావేశాలు మార్చి 8 తేదీన ప్రారభమవుతాయి. ఈనేపధ్యంలో మార్చి మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్టాల నుంచి కనీసం ఒక్కొక్కరికి అయినా మంత్రి వర్గంలో స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి సిఎం రమేష్, టీజీ వెంకటేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే, తెలంగాణలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి శాఖ మార్చే అవకశం ఉందని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకుని, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యాన్మాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమల దళం, అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగాగానే మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్’ కి, తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఎపీలోనూ కాపు వర్గానికి చెందిన సోము వీర్రజును పార్టీ అధ్యక్షునిగా నియమించడంతో పాటుగా, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ (జన సేన)తో పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలోనూ అదే ఫార్ములాను అనుసరించే పక్షంలో ఏపీలో సీఎం రమేష్’కు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.టీజీ వెంకటేష్ పేరుకూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీఎం రమేష్’ వైపుకే క్యాస్ట్ కాటా మొగ్గుచూపుతోందని, సో .. ఇతర పరిణామాలు ఏవీ ప్రతిబంధకం కానీ పక్షంలో ‘సీఎం బనేగా మినిస్టర్’ అనుకోవచ్చని అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికివస్తే, ధర్మపురి అరవింద్’ పేరుతొ పాటుగా బండి సంజయ్ పేరు వినిపిస్తున్నపప్పటికీ, అయన ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసులలో తప్పించి ఒకే వ్యక్తి రెండు పదవులు అనేది పార్టీ  విధానాలకు విరుద్ధం. కాబట్టి,ధర్మపురినే అదృష్టం వరిస్తుందని పార్టీ వర్గాల సమాచారం. కిషన్ రెడ్డి శాఖ మార్పు ? ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకైక మంత్రిగా ఉన్న హోం శాఖ సహాయ మంత్రి క్రిషన్ రెడ్డి, పని తీరు పట్ల హోం మంత్రి అమిత్ షా అంత సంతృప్తి కరంగా లేరని అంటున్నారు. అత్యంత కీలక శాఖలో సహాయ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్’లో గడపడం కూడా ఆయనకు నచ్చడం లేదని, కాబట్టి కిషన్ రెడ్డి శాఖ మార్పు ఖాయమని అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు కిషన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించడం కారణంగా చూపింఛి ఆయన శాఖను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.  
ఒక్కడు కదిలాడు. ఒక్కో అడుగు ముందుకేశాడు. ఉప్పెనలా ఉప్పొంగాడు. రైతు కోసం రావిరాలలో రణభేరి మోగించాడు. రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి ఎలుగెత్తి చాటాడు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను ప్రకటించాడు. సునామీలా తిరిగి ఉప్పెన సృష్టిస్తానని.. ఆ ఉప్పెనలో కేసీఆర్‌ను కప్పేస్తానని, టీఆర్‌ఎస్ ను గద్దె దించుతానని.. సమరశంఖం పూరించాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ భుజం మీదుగా మోదీపై గురి.. రావిరాల సభతో రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయంపై ఓ అంచనాకు రావొచ్చు. కేసీఆర్ భుజాల మీదుగా కేంద్రంపై వ్యవసాయ చట్టాలపై ఫిరంగి పేల్చిన తీరుకు విమర్శకుల నుంచే ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర చట్టాలను సవరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని గుర్తుచేస్తూ.. కేంద్ర బంతిని రాష్ట్ర కోర్టులోకి నెట్టారు. కేసీఆర్ మోదీ జట్టు వీడి.. సాగు చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలంటూ గులాబీ బాస్ ను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు.  రావిరాల వేదికగా కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పంపిన మెసేజ్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయింది. ఢిల్లీ డైరెక్షన్ లోనే.. చెప్పేశారు. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పాదయాత్రతో తన రాజకీయ బాటను మరింత సుస్థిరం చేసుకోనున్నట్టు రావిరాల సభలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రకటించి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆదేశం మేరకే రూట్‌ మ్యాప్‌ ఉంటుందని స్పష్టం చేసి తన గాడ్ ఫాదర్ ఢిల్లీనే అంటూ సంకేతాలు పంపించేశారు. 10 జన్ పథ్ అనుమతితోనే కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని.. లోకల్ సీనియర్లకు చెప్పకనే చెప్పేశారు. నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు.. తేలిపోయింది. రావిరాల సభతో రేవంత్ రెడ్డితో కలిసి నడిచేదెవరో తేలిపోయింది. కాంగ్రెస్ లో  ఎవరు ఏ గ్రూపో పాలు, నీళ్లలా తేలిపోయింది. నో డౌట్. సీతక్కే ఆ లిస్ట్ లో అందరికన్నా ముందున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్‌ షెట్కార్‌, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్‌, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రావణ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సభకు హాజరు కావడంతో వీరంతా ఆయన బ్యాచ్ అంటూ ప్రచారం మొదలైపోయింది. ఇక.. సభకు రాని వారిలో హేమాహేమీలే ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్యయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు మీటింగ్ కు అటెండ్ అవలేదు. అయితే.. రణభేరి సభ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రొగ్రామ్ కాదని వారంతా బయటకు చెబుతున్నా.. ఆ సో కాల్డ్ సీనియర్లంతా రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారేనంటున్నారు ఆయన అభిమానులు. ఆసక్తిరేపిన సురీడు.. రేవంత్ రెడ్డి నిర్వహించిన రణభేరి సభలో జరిగిన రెండు ఆసక్తికర అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఆయన వెన్నంటే ఉండేవాడు వ్యక్తిగత అనుచరుడు సురీడు. వైఎస్ మరణం తర్వాత బహిరంగంగా సురీడు కనిపించింది లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి సభలో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యాడు ఆ సురీడు. ఇప్పటి వరకూ ఏ జగన్ సభలోనూ, ఏ షర్మిల మీటింగ్ లోనూ జాడ లేని సూరీడు సడెన్ గా రేవంత్ రెడ్డి రణభేరిలో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనే దానిపై పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది. నాడు వైఎస్.. నేడు రేవంత్ -కొండా సురేఖ కామెంట్స్ రణభేరి సభలో కీలక నేత కొండా సురేఖ చేసిన కామెంట్స్ భవిష్యత్ పరిణామాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రను.. గతంలో వైఎస్సార్ చేసిన యాత్రతో పోల్చారు కొండా సురేఖ. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ సైతం వ్యూహాత్మకమే అంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ కు వైఎస్ ఎలానో.. ఈనాడు హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి స్థాయి కూడా అలాంటిదేనంటూ పరోక్షంగా ప్రస్తావించారని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న కొండా దంపతులు.. ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డికి సైతం స్ట్రాంగ్ సపోర్టర్స్ గా నిలిచే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. రావిరాల సభతో  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి స్ట్రామినా ఏంటో.. అది ఉప్పెనలా ఉప్పొంగి, తెలంగాణలో సృష్టించే పొలిటికల్ సునామీ ఎంతో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి బలం, బలగం, భవిష్యత్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సభ జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ మరింత అదిరిపోతుందని..  పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు ఫ్యాన్స్.    
భారతీయ జనతా పార్టీ కి లోక్ సభలో 303 మంది సభ్యులున్నారు, మిత్ర పక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య 350 దాటుతుంది. రాజ్య సభలో సెంచరీకి చేరువలో ఉంది.అన్ని రాష్టాలలో కలిపి దేశం మొత్తంలో కమలం గుర్తుమీద గెలిచిన  ఎమ్మెల్ల్యేలు1374 మంది ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలు 29 అయితే అందులో 12 రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలున్నాయి. మరో ఆరు రాష్ట్రాలలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ ... అంతే కాదు, పార్టీ సభ్యత్వం లేకుండా ఐడియాలజికల్ కమిట్మెంట్’తో పనిచేసే అదృశ్య కార్యకర్తలు దేశ విదేశాల్లో లక్షల్లో ఉన్నారు.  అయితే, ఇంత బలం, బలగం ఉన్న బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మాత్రం ఆటలో అరటి పండుగానే మిగిలిపోతోంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కనీసం కాసింత గౌరవప్రదమైన ఓట్లయినావచ్చాయా,అంటే అదీలేదు.నిండా ఒక శాతం ఓట్లు రాలేదు.  చివరకు ‘నోటా’ కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు.  అలాగని, రాష్ట్రంలో పార్టీకి పునాదులు లేవా ... అంటే రాష్ట్ర విభజనకు ముందు, ఒంటరిగా పోటీచేసిన సందర్భాలలో కూడా బీజేపీకి ఓట్లే కాదు సీట్లు కూడా వచ్చాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏడు సీట్లు గెలిస్తే అందులో మూడు (రాజమండ్రి, నరసాపురం, తిరుపతి) స్థానాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి 18 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీ 2019 ఎన్నికల్లో ఎందుకు అలా తుడిచి పెట్టుకు పోయింది. ఎందుకు తిరిగి  పుంజుకోలేక పోతోంది ? అందుకు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పునాదులు పటిష్టంగా ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కమల దళం ఎదగకుండా చేస్తున్నాయని, పార్టీ నాయకులే వాపోతున్నారు.రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. చివరకు అందుకు ప్రత్యాన్మాయంగా ఇస్తామని వాగ్దానం చేసిన ప్రత్యేక ప్యాకేజికి కేంద్రం పంగనామాలు పెట్టింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణానికి గానీ,లోటు బడ్జెట్ భర్తీకి  వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఇలా ఇస్తామన్న నిధులేవీ తొలి ఐదేళ్ళలో ఇవ్వలేదు. ఆకారణంగానే తెలుగు దేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో,రాష్ట్ర ప్రజల్లో కూడా బీజేపీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో బీజీపీ ‘నోటా’ తో పోటీపడి ఓడిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా ఒంటరిగా పోటీ చేసి 18 శాతం వరకు ఓట్లు, మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 0.8 శాతం ఓట్లకు పడిపోయింది.  అందుకే, రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండడం, కార్యకర్తలు, స్థానిక నాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా  సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో పొత్తు కొనసాగించడం,సమర్ధ నాయకత్వం లేక పోవడం ఇలా ఇంకా అనేక ఇతర  కారణాలున్నా  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.   ప్రస్తుత విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, అన్యమత ప్రచారం, మత మార్పిడులు, క్రైస్తవీకరణ ఆగడాలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా వంటి పాత గాయాలను మరిచి పోయి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపారు. అయితే, ఇంతలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన తెర మీదకు రావడంతో కథ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు,విశాఖ ఉక్క ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధి బృదం కేంద్ర ఉక్కు మంత్రి  ధర్మేంద్ర  ప్రధాన్ ‘ను కలిసి వినప్తి పత్రం సంర్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.  అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగి పోయింది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని, ఇందుకు సంబంధించి ప్రజల సెంటిమెంట్’ను కార్మికులు ఆందోళనను చాల చాకచక్యంగా తమకు అనుకూలంగా మలచుకుంది. ముందుగా స్థానిక ఎమ్మెల్ల్యే, మాజీ మంత్రి   మాజీ మంత్రి, ఎమ్మెల్ల్యే గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా  చేశారు. మరో వంక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్ల్యే పల్లా శ్రీనివాస ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసినా, పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చేస్తే...ప్రతిపక్షంగా తాము కూడా ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనడంతో పాటుగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసేందుకు కుడా సిద్దమని ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడు, బంతిని వైసీపీ కోర్టులోకి డ్రైవ్ చేశారు. అంతే కాకుండా స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖపట్నం ఉనికే లేదని, అటువంటి కర్మాగారాన్ని అమ్మేస్తుంటే...ముఖ్యమంత్రి తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారా?...అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మరో సెంటిమెంటల్ బాణాన్ని సందించారు.అలాగే, స్టీల్ ప్లాంట్ బేరం వెనక జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని రాష్ట్ర్ర వయ్పితం చేసే లక్ష్యంతో ఈనెల 18న స్టీల్‌ప్లాంట్‌ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు.  ఈ నేపధ్యంలోనే అధికార వైసీపీలోనూ కదలిక వచ్చింది. పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 20 న స్టీల్ ప్లాంట్ పరిరక్షన యాత్ర చేస్తానని ప్రకటించారు. అలాగే ముఖ్యంత్రి కార్మిక నాయకులతో సమావేసమవుతారని, ఇదే విషయాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరరాని కూడా విజయసాయి చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. .సో .. విశాఖ ఉక్కు ఉద్యమం వేడెక్కుతోంది. ఈ దశలో కేంద్రం సానుకూలంగా స్పదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా .. బీజేపీకివచ్చే ప్రయోజనం శూన్యంగానీ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే ఆంధ్ర ప్రదేశ్’లో పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయని.. రాష్ట్ర బీజేపీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     
అంతా బాగున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిది ..ఎవరి గ్రూపు వారిది అన్నట్లుగా కథ నడిచింది.అంతర్గత కుమ్ములాటలు,జుట్టూ జుట్టూ పట్టుకోవడాలు,ఒకరిపై ఒకరు దుమ్మెతి పోసుకోవడాలు,ఒకటని కాదు అలాంటి లక్షణాలన్నీ కాంగ్రెస్ కల్చర్’గా, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ ఉన్న ‘సుగుణాలు’గా ముద్ర పడిపోయింది.అదే మంటే, ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువండీ’ అంటూ కాంగ్రెస్ నాయకులు తప్పించుకోవడం,అందరికీ తెలిసిన గతం.  అయినా అప్పట్లో పార్టీ అధిష్టానం బలంగా ఉండేది కాబట్టి పార్టీలో ఎన్ని గ్రూపులున్నా, నాయకుల మధ్య ఎన్ని విబేధాలున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా చివరకు అధిష్టానం మాటే వేదంగా చెలామణి అయింది.నిజానికి,అప్పట్లో బలమైన ప్రాతీయ నాయకులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పార్టీ అధిష్టానమే రాష్ట్రాల్లో గ్రూపులను ప్రోత్సహించేదని కూడా ఆనాటి మాటగా అంటారు.  సరే  అదంతా గతం. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ అధినాయకత్వం ఎంత బలహీనంగా వుందో వేరే చెప్పనక్కర లేదు. కేంద్రంలో అధికారం లేదు. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదు. చివరకు సుమారు, రెండు సంవత్సరాలుగా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేరు. పార్టీ సీనియర్ నాయకులు ‘తిరుగుబాటు బావుటా’ ఎగరేశారు. ఏకంగా 21 మంది అధిష్టానానికి అసమ్మతి లేఖ  రాశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని,తక్షణమే పూర్తి  స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని వత్తిడి తెచ్చారు. అయినా, తూతూమంత్రంగా సీడబ్ల్యూ సమావేశం నిర్వహించి, అధ్యక్షుని ఎన్నిక క్రతువును జూన్’ వరకు వాయిదా వేశారు. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.   దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డిటో డిటోగా ఇంచుమించుగా అంతే అధ్వాన్నంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన పార్టీ ఎమ్మెల్ల్యేలలో ఇంచుమించుగా సగం మంది అధికార తెరాసలోకి వెళ్లి పోయారు.దుబ్బాక,జీహెచ్ఎంసీ పరాభవం తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుని ఎన్నికకు పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్’ కొంత కసరత్తు చేశారు. కొన్ని పేర్లను పైకి తీసారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క ... మరి కొని పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. మాణిక్ ఠాగూర్ జాబితాలో పేరు లేని జగ్గా రెడ్డి లాంటి వారు నొచ్చుకున్నారు. ‘మా సేవలకు గుర్తింపు ఏదని వాపోయారు. ఇంతమంది పార్టీలో పుట్టి,పార్టీలో పెరిగిన సీనియర్లు ఉండగా, నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి’ని ఎలా అధ్యక్షుని చేస్తారని వీహెచ్ లాంటి కొందరు సీనియర్లు చిందులేశారు... అయినా మాణిక్ ఠాగూర్ ఎంపిక చేసిన జాబితా సోనియా గాంధీ టేబుల్ మీదకు చేరింది. ఆమె టిక్’  కూడా పెట్టేశారుయ  ఏ క్షణంలో అయినా కొత్త అధ్యక్షుని నియామక ప్రకటన వెలువడుతుందని అనుకున్నారు. ఇంతలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక తెర మీదకు వచ్చింది. ఆ స్థానం నుంచి పోటీ చేసే పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అభ్యర్ధన మేరకు, ఉప ఎన్నికల వరకు పార్టీలో  ఐక్యతను కాపాడేందుకు పీసీసీ అధ్యక్షుని ఎన్నిక వాయిదా పడింది.ఉత్తమ కుమార్ రెడ్డి అందాకా తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతారు. అంటే,ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయిలలో తల లేని మొండెం లాగా అధ్యక్షుడు లేని పార్టీగా మిగిలింది. అదొకటి అలా ఉంటే, పార్టీలో ఐక్యత ఆశించి అధ్యక్ష ఎంపికను వాయిదావేస్తే, అధ్యక్ష పదవి పోటీలో ఉన్న వారు ఎవరికీ వారు పోటాపోటీగా పాదయాత్రల బాట పట్టారు. ఇప్పటికే, రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఎవరి దారిన వారు పాదయాత్రల సాగిస్తున్నారు.ఈ నెల 20 నుంచి కోమటి రెడ్డి తమ స్వగ్రామం నల్గొండ జిల్లా బ్రహ్మనవెళ్ళం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టున పూర్తి చేయాలన్న డిమాండ్’తో పాద యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.అలాగే సిద్ధిపేట ఎమ్మల్యే జగ్గ రెడ్డి కూడా ఈ నెల 22 నుంచి పాదయాత్రకు సిద్దమయ్యారు.   అయితే కాంగ్రెస్ నాయకుల పాద యాత్రలు విమర్శలు ఎదుర్కుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు, తెరాస, బీజేపీ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసమే కాంగ్రెస్ నాయకులు పాదయత్రాలు  చేస్తున్నారని ఆరోపిస్తుంటే, సొంత పార్టీ కార్యకర్తలు క్రింది స్థాయి నాయకులు ఇలా పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు పాదయాత్రలు చేయడం వలన పార్టీకి మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని  ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్త చేస్తున్నారు. ఓ వంక తెరాస, బీజేపీ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా  నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సిద్డంవుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పాదయాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి  వారు కాకుండా అందరూ కలిసి కార్యకరమాలు నిర్వహిస్తే కార్యకర్తలు ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని, అలా కాకుండా ఇలా ఎవరి దారినవారు పొతే ప్రయోజనం ఉండదని అంటున్నారు. అయితే పార్టీ నాయకులు మాత్రం యాత్రలు వేరైనా అందరి గమ్యం,లక్ష్యం ఒక్కటే అని, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొంటున్నారు. మరో వంక ఈ పాద యాత్రలు చివరకు కాంగ్రెస్ పార్టీని ఈ గమ్యం చేరుస్తాయో ... కాలమే నిర్ణయిస్తుంది అనుకోవడమే కాంగ్రెస్ కార్యకర్తల విధి ...  దట్స్ ఇట్ .
మనకి పైపైన కనిపించే చర్మం వేరు. కాస్త సూక్ష్మంగా చూస్తే అందులో ఒక ప్రపంచమే ఉంటుంది. స్వేదరంధ్రాలు, బ్యాక్టీరియా, వెంట్రుకల కుదుళ్లు... ఇలా చర్మం కాస్త వింతగా కనిపిస్తుంది. కానీ దాని మీద ఒక ఏకకణ జీవి (unicellular organism) కూడా బతికేస్తోందని ఈ మధ్యనే బయటపడింది. ఇక అప్పటి నుంచి దాని లక్షణాలు ఏమిటి, లాభనష్టాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.   మన చర్మం మీద ఆర్కియా అనే ఏకకణజీవి బతుకుదోందని ఈమధ్యనే గ్రహించారు. ఏడాది వయసున్న పిల్లవాడు మొదలుకొని 75 ఏళ్ల వృద్ధుల వరకూ అనేకమందిని పరిశీలించిన తర్వాత తేలిన విషయమిది. ఎక్కడో అంటార్కిటికా మంచుపలకల మీదా, వేడి నీటి బుగ్గలలోనూ మాత్రమే ఉందనుకునే ఈ చిత్రమైన జీవి ఏకంగా మన శరీరం మీదే నివసిస్తోందని బయటపడింది.   ఆర్కియా మన చర్మాన్ని ఆశించి బతికేస్తోందని తేలిపోయింది. కానీ దీని వల్ల లాభమా నష్టమా అన్న ఆలోచన మొదలైంది. పొడిచర్మం ఉన్నవారి మీద ఈ ఆర్కియా చాలా ఎక్కువ మోతాదులో కనిపించింది. బహుశా వారి చర్మాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇది దోహదపడుతూ ఉండవచ్చు. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలలోనూ, 60 ఏళ్లు దాటిన వృద్ధులలోనూ ఆర్కియా ఎక్కువగా కనిపించింది. బహుశా ఆయా వయసులలో సున్నితంగా ఉండే చర్మాన్ని ఈ ఆర్కియా కాపాడుతూ ఉండవచ్చు.   అంతేకాదు! చర్మం మీద కనిపించే ఆర్కియా, అమ్మోనియా మీద ఆధారపడి జీవిస్తోందని తేలింది. మన చెమటలో అమోనియా ఒక ముఖ్యభాగం. ఆ అమోనియా మన చర్మం మీద పేరుకుపోకుండా ఈ ఆర్కియా ఉపయోపడుతోందని భావిస్తున్నారు. చర్మం మీద PH లెవల్స్ని తగ్గించడంలో కూడా ఈ జీవి ఉపయోగపడుతోందన్నది మరో విశ్లేషణ. PH లెవల్స్ తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్లు కూడా తక్కువగా ఏర్పడతాయి.   ఆర్కియా ఉపయోగాలు సరే! మరి అది మన శరీరం మీద అధిక మోతాదులో పేరుకుపోతే కలిగే అనర్థాలు ఏమిటో తెలియడం లేదు. పైగా వ్యోమాగాములు అంతరిక్షంలో తిరిగేటప్పుడు, వారితో పాటుగా ఈ జీవులు కూడా ఇతర గ్రహాల మీదకి చేరే అవకాశం ఉంది. MARS వంటి గ్రహాల మీదకి కనుక ఈ ఆర్కియా చేరితే, అక్కడి వాతావరణం మొత్తం కలుషితం అయిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.   లాభమో, నష్టమో! మొత్తానికి మన చర్మానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంగతి బయటపడింది. ఇహ వైద్యప్రపంచంలో ఆర్కియాకి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. - నిర్జర.  
Sedentary lifestyle.  అబ్బో ఈ మాటని ఈమధ్య చాలా ఎక్కువగానే వింటున్నాం. ఎలాంటి శారీరిక శ్రమా లేకుండా, నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలిని sedentary lifestyle అంటారని మనకి తెలుసు. నిరంతరం కూర్చుని కూర్చుని ఉంటే, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల పొట్ట మీద ఒత్తిడి పెరిగి జీర్ణవ్యవస్థ పాడైపోవడం, మెదడుకి చేరే రక్తప్రసారంలో లోపం ఏర్పడటం, వెన్నెముక బలహీనపడిపోవడం, ఇన్సులిన్‌ ఉత్పత్తి దెబ్బతినడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు పెళుసుబారిపోవడం వంటి నానాసమస్యలూ దరిచేరతాయి. ఇవి డయాబెటిస్‌, పక్షవాతం, గుండెపోటు లాంటి తీవ్రమైన ప్రమాదాలకి దారితీస్తాయి.   కూర్చుని ఉండటం వెనుక ఎన్నో ప్రమాదాలు దాగిఉన్నాయని తేలిపోయింది. పోనీ రోజూ కాసేపు వ్యాయామం చేద్దామా అంటే... అది అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి అసలు కూర్చోవడంలోనే ఏమన్నా మార్పు తీసుకురావచ్చునేమో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం దాదాపు ఎనిమిదివేల మందికి ఓ యంత్రాన్ని అమర్చారు. ఆ యంత్రం ద్వారా వారి శరీరకదలికల మీద నిఘా ఉంచారు.   ఎనిమిదివేల మంది అభ్యర్థులలో దాదాపు 77 శాతం మంది నిరంతరం కూర్చునే ఉంటున్నారని తేలింది. వీరి రోజులో సగభాగం కూర్చునే సాగిపోతోందట. మరో నాలుగేళ్లు గడిచిన తర్వాత వీరిలో ఓ 340 మంది చనిపోయారు. అయితే దఫాకు ఓ గంట నుంచి గంటన్నర పాటు కదలకుండా కూర్చునేవారే తొందరగా చనిపోతున్నట్లు తేలింది. అరగంటకి ఓసారి లేచి అటూఇటూ తిరిగేవారి ఆయుష్షు ఎక్కువగానే ఉన్నట్లు గమనించారు. అంటే రోజంతా కూర్చునే ఉన్నాకూడా, మధ్యమధ్యలో లేస్తూ ఉండటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుందన్నమాట. వినడానికి బాగానే ఉంది కదా! మరింకేం ఆచరించేస్తే సరి. - నిర్జర.  
ప్రపంచం డిజిటల్ మనీ, ఈ మనీ వైపు పరుగులు తీస్తుంది. కానీ, వేలాది సంవత్సరాలుగా డబ్బుగా చెలామణి అయినవి నాణెలు మాత్రమే.  లోహంతో తయారు చేయబడి  చెలామణిలో ఉన్న నాణెలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే  కాగితం కరెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నాణెల ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.  ప్రపంచంలో అరుదైన నాణెలుగా రికార్డు సృష్టించిన నాణెలు ఎన్నో ఉన్నాయి. వాటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. మరి వాటి వివరాలు ఎంటో చూద్దామా.. 6. లిబర్టీ హెడ్ నికెల్ మోర్టన్ స్మిత్ ఎలియాష్ బర్గ్ (1913 ) ఖరీదు 4.5మిలియన్ డాలర్లు (33,33,96,675  రూపాయలు) ఈ నాణెం ఖరీదు 2018లో వేలం ద్వారా 4,560000 డాలర్లకు చేరుకుంది. అత్యంత ప్రసిద్ధ చెందిన ఈ నాణెం ఈ భూగ్రహం మీద ఉనికిలో ఉన్న నాణెం ఐదు నమూనాలలో ఇది ఒకటి. వేలంపాటతో ధర పెరుగుతూ వచ్చి 2018లో 4.5మిలియన్ డాలర్లకు మించి ధర పలికింది. ఈ నాణెం పై భాగం నునుపుగా అద్దం వలే కనిపిస్తుంది. ఇలాంటి ఫినిషింగ్ ఉన్న నాణెం అరుదుగా ఉంటుంది. దీని  విలువ  ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. అంతేకాదు ఈ నాణెం ముద్రణ గురించి  అధికారిక రికార్డులు లేనందున ఇది ఏ కాలం నాటిది అన్న విషయంపై చాలా వివాదాలు ఉన్నాయి.  కేవలం ఐదు లిబర్టీ నికెల్ నాణాలు మాత్రమే లభించాయి.  ఇవన్నీ అనధికారంగా తయారుచేశారంటారు. అయితే 1913 లో లిబర్టీ నికెల్ నాణెలను తయారు చేయడానికి  చట్టం అనుమతించింది. కాని కొంతమంది  మింట్ ఉద్యోగులు కొన్ని అక్రమ నమూనాలను ముద్రించారన్న ఆరోపణ ఉంది. ఈ ప్రసిద్ధ నాణెం 1972 నుండి రికార్డులను బద్దలు కొడుతున్నాయి. 100,000 కు అమ్ముడైన మొదటి నాణెం ఇదే. ఆ తర్వాత 1996 లో దీని ధర  ఒక మిలియన్ డాలర్లు పలికింది.  ప్రస్తుత రికార్డ్ హోల్డర్ ఎలియాస్‌బర్గ్ స్పెసిమెన్, గ్రేడెడ్ పిసిజిఎస్ పిఎఫ్ 66.  ఇది 2018 లో  4.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. 5.ఎడ్వర్డ్ 111 ఫ్లోరిన్ (1343) ఖరీదు 6.8 మిలియన్ డాలర్లు(50,37,99,420 రూపాయలు) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణాల్లో ఇది ఒకటి. అంతేకాదు చాలా పురాతనమైన నాణెం.  దాదాపు 670ఏండ్ల చరిత్ర ఉంది. ఈ నాణెం విలువ ఎక్కువగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఇది అతి పురాతన నాణెం కావడం. ఒకే విధమైన నాణాల్లో మూడు మాత్రమే అనేక శతాబ్దాల నుంచి చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంటే ఇది చాలా విలువైనది మాత్రమే కాదు, అరుదైనది కూడా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నాణెలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.  ఈ నాణెం 2006 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరంలో వేలంపాట ద్వారా దీన్ని విక్రయించారు. ఆ తర్వాత 1857 లో టైన్ నదిలో కనుగొనబడిన మిగిలిన రెండు నాణేలు ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 4.బ్రషర్ డబులూన్ (1787) ఖరీదు 7.4 మిలియన్లు(54,82,50,830 రూపాయలు) న్యూయార్క్ రాష్ట్రంలో నాణాల తయారిలో బంగారం బదులు రాగిని ఉపయోగించాలన్న బ్రషర్ లక్ష్యం  మేరకు రూపుదిద్దుకున్న నాణెలు. అయితే బంగారానికి బదులుగా రాగి నాణెలు తయారుచేయాలన్న ఎఫ్రియం బ్రషర్ల ప్రతిపాదనను ఆ రాష్ట్రం ఒప్పుకోలేదు. బంగారు నాణెలనే చెలామణిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే  బ్రషర్ ప్రతిభావంతుడైన స్వర్ణకారుడు. అతను స్టేట్ చేసిన సూచనను విస్మరిస్తూ కొత్త నాణెలను ముద్రించాడు. వాటిలో ఎక్కువ భాగం కాంస్యంతో తయారు చేయబడ్డాయి. వాటిలో కొన్ని 22 క్యారెట్ల బంగారంతో కూడా తయారుచేశాడు. ఈ నాణెలు చాలా అరుదుగా లభిస్తాయి. అంతేకాదు ఆసక్తి గల  కథ వీటిపై ఉంటుంది. కాబట్టి, అవి చాలా విలువైనవి.  ఒక వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 2011 లో  వేలంలో 7.4 మిలియన్ డాలర్లకు ఒక నాణెం కొనుగోలు చేసింది. 3.సెయింట్ గౌడెన్స్ బబుల్ ఈగిల్ (1907) ఖరీదు 7.6 మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు) ఈ నాణాలను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం అనుకున్న దానికన్నా చాలా కష్టమని తేలింది. సంక్లిష్టమైన రూపకల్పన కారణంగా  వీటి ఉత్పత్తిని నిలిపివేశారు.  ఆ తర్వాత కొన్ని మార్పు చేశారు. యు.ఎస్. మింట్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించే చార్లెస్ బార్బర్ ఈ నాణెం పై దేవుడిని మేం విశ్వసిస్తున్నాం అన్న పదాలను తొలగించాడు. నాణెం మార్పులో,  తయారీ బాధ్యత పూర్తిగా అతనే తీసుకున్నాడు.  కానీ దీన్ని సమావేశంలో అంగీకరించలేదు. అయినప్పటికీ నాాణెం తయారీ మాత్రం ఆగలేదు.  ఇప్పుడు అది అత్యంత విలువైన నాణెంగా రికార్డు నెలకొల్పింది. 2. డబుల్ ఈగల్ (1933) ఖరీదు 7.6మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు) డబుల్ ఈగిల్ 1933 అనేది యునైటెడ్ స్టేట్స్ 20 డాలర్ల బంగారు నాణెం. ఈ నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అప్పటివరకు సాధారణ ప్రజల మధ్య వాడకంలో ఉన్న ఈ నాణెలు కరిగించబడ్డాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడైన థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రజలు బంగారం కలిగి ఉండకుండా ఈ నాణాలను నిషేధించాడు. ఆ సమయంలో నెలకొనిఉన్న బ్యాంకింగ్ సంక్షోభానికి ఇది సహాయపడుతుందని అతను భావించాడు.  అయితే  కొద్ది మొత్తంలో ఈ నాణాలు ముద్రణాలయం నుంచి బయటకు వచ్చాయి.  ఏలా వచ్చాయి అన్నది మాత్రం స్పష్టం తెలియదు. కానీ, ఈ నాణాలను కలిగి ఉండటం అనేది చట్టవిరుద్ధం. ఎవరితోనైనా ఈ నాణెం ఉందని తెలస్తే దాన్ని వెంటనే స్వాధీనం చేసుకునేవారు. కానీ, ఎక్కడ నాణెలు ఉన్నాయి అన్నది తెలుసుకునే లోగానే ఇది ఒక కాయిన్స్ కలెక్టర్ వద్దకు చెేరింది. అవుతుంది. ఏదేమైనా, ఒక ప్రైవేట్ యజమాని ఒక నాణెం పొందగలిగాడు. ఇది మొదట ఈజిప్ట్ రాజు ఫరూక్ దగ్గర ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తి దీన్ని పొందాడు. నాణెం  విక్రయించి లాభాలను యుఎస్ మింట్ కు తో విభజించాడు. ఏదీ ఏమైనా 4,455.,000 నాణెలు ముద్రించబడినప్పటికీ ఏదీ అధికారిక నాణెంగా వాడుకల్లోకి రాలేదు. 1. ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్, కాపర్ డాలర్ (1794) ఖరీదు 10 మిలియన్ డాలర్లు (74,21,43,500 రూపాయలు) ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెం ఇది. పరిశోధకుల అంచనా ప్రకారం వెండితో తయారుచేయబడిన మొదటి నాణెం ఇది.  యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం చేత ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మొదటి వెండి నాణెంగా గుర్తింపు పొందింది. అంతేకాదు  2013 లో ఈ నాణెం మరో రికార్డు సాధించింది. ఇది ఇప్పటివరకు అమ్మకానికి వచ్చిన అతి ఖరీదైన సింగిల్ కాయిన్ గా ప్రపంచ కొత్త రికార్డును సృష్టించింది. వెండి నాణేల ముద్రణకు వెళ్ళేముందు మింట్ 1792లో ముద్రణకు సంసిద్ధం అయ్యింది.  రాగి, వెండి నమూనా నాణేలను మాత్రమే తయారు చేసింది. అయితే ఈ నాణాలను సేకరించేవారు ఈ చారిత్రాత్మక,  అత్యంత విలువైన నాణెంను 200 సంవత్సరాలకు పైగా సంరక్షించారు. నాణేల ముద్రణ వెనుక ఉన్న కథ దాని విలువను పెంచుతుంది. చాలా సార్లు అంతకన్నా ఎక్కువే ఉంటుంది.
మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్‌ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి.   పరిశోధన గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట.      వేటి నుంచి? ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్‌ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్‌స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది.   తీవ్రమైన హాని ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్‌ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం.     దుమ్ము దులుపుకోవడమే! మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.
ఒక్క యాపిల్ పండు తింటే చాలు శరీరానికి9 రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో ఏ పద్దతిలో పండించిన యాపిల్‌నైనా తింటే చాలు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. ప్రపంచంలో ఉత్తమ మైన పండు ఏది అని అంటే మాత్రం యాపిల్ అని అందరు అంటారు. ప్రపంచం లో 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయని నిపుణులు పేర్కొనారు. యాపిల్ ను ముక్కలు కోసుకుని తిన్నా లేదా యాపిల్ మొత్తంగా తిన్నా, జ్యుస్ తీసుకుని తాగినా, ఒక్కో యాపిల్‌లో 80 క్యాలరీల ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. 1 గ్రాము న్యుట్రీన్ 19 గ్రాముల సహజ మైన చక్కెర ఫ్యాట్ సోడియం  కొలస్ట్రాల్ ఉండదు. యాపిల్ లో 2/3 వంతుల పీచు పదార్ధం ఉంటుంది. అది మీ ఆహారం అరుగుదలకు ఉపయోగ పడుతుంది. యాపిల్ పైన ఉండే తళ తళ లాడే తొక్క యాంటీ ఆక్సిడెంట్ సబ్ స్టన్స్ గా పని చేస్తుంది. మీ ఇతర సెల్ల్స్ ద్వారా వచ్చే డ్యామేజ్ ని క్యాన్సర్ ను నివారిస్తుంది. గుండె సంబందిత సమస్యలను నివారిస్తుందని నిపుణులు తేల్చారు.  అయితే  తినే ముందు యాపిల్ ను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి తినాలని సూచించారు. యాపిల్ ద్వారా వచ్చే ఫ్లవో నోయిడ్స్ సెల్ ను రక్షిస్తుంది. మీ మెదడులో  జ్ఞా  పక శక్తి  ని తగ్గించే అల్జీమర్స్  వ్యాధిని  యాపిల్ నివారిస్తుంది. మెదడులో  జరిగే  రక రకాల  డ్యామేజి లను  నివారించేందుకు యాక్సిడెంట్  శాతం  చాలా  ఎక్కువగా  ఉంటాయి. ఒక పరిశోదనలోయాపిల్ జ్యూస్  అతనిలో వారి ప్రవర్తన  మూడ్ ను  గమనించామని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఫ్యంక్రియటిస్, క్యానర్ ను నివారిస్తుంది. యాపిల్ నుండి వచ్చే  ఫ్లవొనొయిడ్స్ వాతా వరణం లో  హాని చేసే  వివిధ రకాల రసాయనాల నుండి యాపిల్ రక్షిస్తుంది.  శరీరంలో చర్మం కణాలు అందులో ఉండే రసాయనాలు బ్రెయిన్ సెల్ల్స్ , ఫ్యంక్రియా టిక్  సెల్ క్యాన్సర్ రాకుండా కాపాడు తుంది. ఇంకా వీటి పై  పరిశోధన  కోన సాగిస్తున్నారు. ఫ్యంక్రియాస్ విడుదల చేసే ఇన్సూలిన్ సరిగా లేకుంటే వచ్చే టైప్ 2  దయాబె  టిస్  ఫ్లవో నోయిడ్స్ ఫ్యాంక్రియాస్ ను  ఆరోగ్యంగా  ఉంచుతుంది. టైపు 2 డయాబెటిస్ ను  కొంత వరకు  రిస్క్  తగ్గిస్తుంది.      రోజుకు2  కంటే ఎక్కువ యాపిల్స్ తింటే  2 8 % డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.  ఒక యాపిల్  లో  3 గ్రాముల పీచుఉంటె మీ ఆహారం అరుగుదల  కు ఉపయోగ పడు తుంది. ఆకలి వేసినప్పుడు ఒక యాపిల్ తింటే బరువు తగ్గి పోయే అవకాశం ఉందని తెలిపారు. కొలస్ట్రాల్ క్యాన్సర్.   రోజుకు ఒక్క యాపిల్ తిన్న వారిలో కాలాన్ క్యాన్సర్  వచ్చే అవకాశం తక్కువే అని ఫ్లవొనొయిడ్స్  వాళ్ళ ఇపెద్ద పేగులు, చిన్న పేగులు, ఆరోగ్యంగా ఉంచు తాయి. గట్ హెల్త్ ----  యాపిల్ నుంచి వచ్చే పెక్టిన్ లో బల మైన పీచు పదార్ధం  మీ డైజేస్టివ్ సిస్టం  ను కాపాడు తుంది. మన శరీరం లో కి పెరు గు  ద్వారా  వచ్చే  బ్యాక్టీరియా ను పెక్రి యాస్ క్యాన్సర్  ను నిరోదిస్తుంది.  బరువు తగ్గించేందుకు యాపిల్ దోహదం చేస్తుంది----- ఒక యాపిల్ లో 3 గ్రాముల  పీచు పదార్ధం ఉంటుంది. మీ అరుగుదాలను పెంచు తుంది. దీర్ఘ కాలం పాటు  ఆకలి లేకుండా చేస్తుంది. అయితే చాలా తక్కువ శాతం గ్లై సిమిక్ ఉండడం వల్ల  ఇది మీ శరీరంలో చక్కర శాతాన్ని పెంచు తుంది.  అది ఇంకా మీ ఆకలిని పెంచు తుంది.  దీనిని ఒక  స్నాక్ గా తీసుకుంటే అది మీ బరువును  తగ్గించడంలో   ఉపక రిస్తుంది.                    గుండె ను ఆరోగ్యంగా ఉంచేది యాపిల్.. ఒక ల్యాబ్ లోనిర్వహించిన పరీక్షలో కొన్ని రకాల మొక్కల లోని ఉన్న రసాయనాలు పెక్టిన్ యాపిల్ లో ఉండే పీచు పదార్ధం గుండెను, రక్తనాళాన్ని  కణాలను డ్యామేజ్ చేయకుండా సహక రిస్తుంది. పెక్టిన్ పీచు పదార్ధంl d c అంటే చెడు కొలస్ట్రాల్ వల్ల ఆర్తరైటిస్, హార్ట్ డిసీజ్, కు దారి తీసుస్తుంది. ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్.. ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్ ఎంతో ఉప యుక్తమని అంటున్నారు వైద్యులు. యాపిల్ లేదా ఇతర పండ్లు కూరాగాయలు శరీరంలో ఉండే ఇంఫ్లమేషన్ కు వ్యతి రేకంగా ఆస్తమా కు వ్యతిరేకంగా ఇతర ఊపిరి తిత్తుల సమస్యలను యాపిల్ పూర్తిగా ఉపయోగ పడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఇందుకు ఉదాహరణగా గర్భ వతిగా ఉన్న మహిళకు యపిల్ ను తిని పిస్తే ఆమె ప్రసవించిన పిల్లలకు ఆస్తమా లక్షణాలు లేక పోవడం గమనించామని నిపిణులు తేల్చి చెప్పారు. ఎవరైతే తక్కువ పండ్లు ఫలాలు తీసుకుంటారో, వారికీ ఆస్తమా వచ్చే అవకాశం తాక్కువే అని తేల్చారు.  యాపిల్ ఇమ్యూన్ బూస్టర్... శరీరం లో ఇమ్యునిటి లేక ఇబ్బంది పడు తున్న వారికీ  శుభ వార్త. ఇమునిటీ పెరగ దానికి  ఒక ఒక బత్తాయి మాత్రమే కాదు. యాపిల్ లో 1 ౦ % విటమిన్ సి  ప్రతి రోజూ ఇస్తుంది. యాపిల్ లో ఉండేపీచు పదార్ధం ద్వారా పెక్టిం లభిస్తుంది. ఇది అత్యంత రుచికరమైన పండు మాత్రమే కాదు. ఇతర క్రిముల వల్ల మన శరీరం లోని ఇమ్యునిటీ పై దాడి చేయ కుండా  నిలువ రించేశక్తి యాపిల్ కు  ఉందని నిపిణులు స్పష్టం  చేసారు. మీరు అనా రోగ్యంతో సత మత మౌతున్నప్పుడు ఒక్క యాపిల్ తింటే చాలు. మళ్ళీ మీరు లేచి తిరగడం ఖాయం.   స్టీర్ర్ క్లియర్ విత్తనాలు.. స్టీర్ర్ క్లియర్ విత్తనాలు యాపిల్ లో ఉండే స్టీర్ క్లియర్ విత్తనాలు ఇందులో అమ్యగ్దలింగ్ ఉంటె సైనిడ్ ఉన్నట్టే. ఒక వేళ ఆవిత్తనాన్ని  అను కోకుండా తిన్న అది మీకు విషం కాదు.  సైనిడ్ ఉన్న శరీరంలో డి టాక్సీఫై  చేస్తుంది. ఆ విత్తనాలు యాపిల్ లోనే ఉంటాయి. అందుకే యాపిల్ ను తినే టపుదు జాగ్రత్తగా తినాలి. అమ్యగ్దన్ కనుక మీశరీరంలో ఉంటె చాలా జాగ్రత్తగా ఉండాలి. చదివారా   యాపిల్ వల్ల  ఎన్ని లాభాలో సో -- యాపిల్ తినండి ఆరోగ్యంగా ఉండండి.
చాలా మంది కళ్ళు తిరిగి పడి పోతే బిపి,లేదా షుగర్ వచ్చి ఉండచ్చు... లేదా హార్ట్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. అయితే  బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణితలు వచ్చినా సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. గతంలో మెదడులో కణితలకు సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. అప్పట్లో 50,50 మాత్రమే బతకడానికి అవకాసం ఉండేది. ఇప్పుడు వచ్చిన ఇమ్యూన్ తెరఫీతో బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ కు సైతం చికిత్స చేయవచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. బ్రెయిన్‌లో వచ్చే వివిధ రకాల ట్యూమర్‌లకు ఇమ్యూన్ తెరఫీ పద్దతిని వైద్యులు కనుగోన్నారు. క్యాన్సర్  చికిత్సకు ఈ వైద్యం చేయవచ్చని అన్నారు. ఈ పద్ధతి వల్ల శరీరంలో ఇమ్యూనిటి పెరిగిందని ఈ తెరఫీ పై ల్యాబోరేట్రీలో చేసిన పరిశోదనలుమంచి ఫలితాలు ఇచ్చాయని శాస్త్రజ్ఞులు వివరించారు. ఇమ్యూన్ తెరఫీ అంశంపై వారు మాట్లాడుతూ  నూతనంగా కనుగొన్న ఇమ్యునో తెరఫీ ద్వారా మాలిగ్నెంట్, బ్రెయిన్ ట్యూమర్‌ను ఇమ్యునిటీని పెంచడం ద్వారా దీనిని సాధించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇమ్యునో తెరఫీతో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స అంశాన్ని సెల్ జర్నల్ లో  ప్రచురించారు. ల్యబో రేట్రీలో చేసిన పరిశోదనలో ఈ చికిత్స సత్వరం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని శాస్త్రజ్ఞులు తెలిపారు. దానా ఫార్బార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మసాచుసెట్స్ ఆసుపత్రి, బ్రాడ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎం ఐ టి కు చెందిన హార్వార్డ్ మాట్లాడుతూ మా లిక్యుల్ క్యాన్సర్ ను నిరోదిస్తుందని తేల్చారు. ఇమ్యూన్ సెల్ తో పోరాడడం ద్వారా తెల్ల రక్తకణాలు వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన సెల్ల్స్  ట్యూమర్ గా మారతాయని కనుగొన్నారు.  ట్యూమర్ నివారించేందుకు cd 1 61 malikyul resepterను కనుగొన్నామని వివరించారు. టి సెల్ల్స్ ఐసోలేట్  అయి ఫ్రెష్ బ్రెయిన్ ట్యూమర్ శాంపిల్ తీసుకుని వాటి పై ప్రయోగించామని ఈ విధానంతో ట్యూమర్ సెల్ల్స్ లేకుండా పోవడాన్ని గమనించా మని స్పష్టం చేసారు. వైరస్  వల్ల ఇన్ఫెక్ట్ అయిన సెల్ల్స్ లేదా ట్యూమర్ సెల్ల్స్ లేదా క్యాన్సర్ సెల్ల్స్ c d161 యాక్టివ్ కాగానే  clec2d మాలిక్యుల్  బ్రెయిన్ ట్యూమర్ సెల్ల్స్ ను నిరోదిస్తుందని. పరిసోదకులు  వివరించారు. c d 16 1  యాక్టివ్ అయిన వెంటనే టి సెల్ ట్యూమర్ సెల్ల్స్ స్పందించడం  తాము గమనించా మని  నిపుణులు అయితే టి సెల్ల్స్ శక్తిని అలాగే  ఉంచుతాయని అవి గ్లోమల్ సెల్ల్స్ పై దాడి చేస్తాయని  వివరించారు. ఈ పద్దతిలో క్యాన్సర్ కణాలను చంపి వేయ వచ్చని విశ్వాసం వ్యక్తం చేసారు. ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోదన  విజయ వంతమైనదని అన్నారు . క్యాన్సర్ సెల్ల్స్ బ్రెయిన్ లో  వచ్చే ట్యూమర్ లు మేలినోమా, లంగ్, కోలాన్, లివర్ క్యాన్సర్, ను నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తామని అయితే టి సెల్ల్స్ పెరగడం పెద్ద సమస్యగా మారిందని ఈ సమస్యను అదిగ మిస్తే  పూర్తిగా  క్యాన్సర్ పైన విజయం తో ఇమ్యూన్ తెరఫీ చికిత్స అందుబాటులో కి తేవచ్చునని డైరెక్టర్ ఫర్ క్యాన్సర్ సెంటర్ క్యాన్సర్ ఇమ్యునో తెరఫిస్ట్  మసాచు సెట్ట్స్  జనరల్ ఆసుపత్రి కి చెందిన మారి యో సువా  వెల్లడించారు. కాగా బ్రాడ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన అవివ్ రేగేర్ డానాఫార్బార్ క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ లో  న్యూరో క్లినికల్ ఆంకాలజీ  డేవిడ్ రేఅర్దోన్  మాట్లాడుతూ  చాలా మందికి క్యాన్సర్ రోగులకు ఇమ్యునో తెరఫీ మందును మా లిక్యుల్ వల్ల క్యాన్సర్ సెల్ల్స్ తగ్గి పోయాయని అన్నారు. ఈ పరి సోధనలో  శరీరం లో ఇమ్యునిటీ సిస్టం మెకానిజం చేయ గలిగామని అన్నారు. ఆధునిక సాంకేతిక  త తో సింగల్ సెల్   r n a   t cell  ను ఉపయోగించి క్యాన్సర్ పెరగడం  నివారించ గాలిగా మని అన్నారు. కొత్తగా వచ్చిన ట్యూమర్ సెల్ల్స్ ను  3 1 మందినుండి   సేకరించి నట్లు చెప్పారు. సి డి1 6 1 ప్రోటీన్లు కే ఎల్ అర్  బి 1 జీన్ ను ఉపయోగించి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ తో సి డి 1 6 1 తో ట్యూమర్ సెల్ల్స్ ను చంపేస్తామని తెలిపారు  ఈ విధానాన్ని ఇప్పటికే రక రకాల జంతువులపై  ప్రయోగించామని అన్నారు  మనుషులపై  ట్రైల్స్ల్స్ చేసిన తరు వాతే తెరఫీ అందుబాటులోకి వస్తుందని  నిపుణులు స్పష్టం చేసారు.