LATEST NEWS
  దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థుల హక్కుల కోసం సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించిన  కాక్రోచ్ జంతాపార్టీ ఆరంభం అద్భుతం అయినా ప్రభావం మాత్రం శూన్యంగా మారింది. ఆ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజా క్షేత్రంలో ఎటువంటి ప్రభావం చూపలేదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.   దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు.   పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.   సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో దాదాపు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, ఒకేసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కాక్రోచ్ జనతాపార్టీ..  వ్యూహ వైభల్యాలతో ఎంత వేగంగా జనాదరణ పొందిందో, అంతే వేగంగా ప్రజల నిరాసక్తతను చవి చూస్తోంది.   కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అభిజీత్ దీప్కే  వర్చువల్ ప్రపంచంలో  చూపిన ఉధృతి..  ఆయన ప్రసంగాలలో ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఆరంభంలో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖుల మద్దతు లభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా జన సమూహాలను నిలిపి ఉంచడంలో..  ఉద్యమ తీవ్రతను కాపాడటంలో నాయకత్వం విఫలమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమౌతోంది. 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు రానున్న స్థానక ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ఉంది.   రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగేందుకు ముహూర్తం దగ్గరపడిన  నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయవేడి రగులుతోంది.   ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో   స్థానిక ఎన్నికల జరిగే అవకాశం   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు   సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం (జులై 15) జరగనుంది.  సాధారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నేతలు  ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించే ఎన్నికలు. అయితే..  ఈ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే, కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ.  ఒకే గ్రామంలో లేదా మండలంలో కూటమికి చెందిన వేర్వేరు పార్టీల నేతలు పట్టు కోసం ప్రయ త్నించడం వల్ల అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అందుకే అలాంటి పొరపచ్చాలు, టికెట్ల కేటాయింపు ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన  చర్యలు ఏమిటన్నదే బుధవారం (జులై 15) భేటీలో ప్రధాన అజెండా అని అంటున్నారు.  గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలను  ఏర్పాటు చేసి, ఎలాంటి అసంతృప్తులు లేకుండా సీట్ల సర్దుబాటు చేయాలని కూటమి పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. ఎ  స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ నాయకులను అలెర్ట్ చేశారు.ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ లతో పాటు కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ హాజరు కానున్నారు.   అయితే..  సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఇటీవల ఆయన  ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ లో  భుజానికి సర్జరీ చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే.   పవన్ ఈ సమావేశానికి ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినప్పటికీ, ఆయన సూచనల మేరకు జనసేన ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొని వ్యూహాలను ఖరారు చేయనున్నారు.   Kutami Targets Clean Sweep Local Bodies Elections, AP Sarpanch Elections, Chandrababu Naidu, Pawan Kalyan Health Update, AP Local Body Polls, TDP Janasena BJP Coalition, AP Panchayat Elections 2026
బీఆర్ఎస్ కీలక నేత,  పార్టీలో  ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇప్పుడు తానే ఒక ట్రబుల్ లో చిక్కుకున్నారు.  సాధారణంగా రాజకీయ వ్యూహాలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటాలతో నిత్యం ప్రజలతో మమేకమై వార్తల్లో ఉండే హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.  మిల్చి మిల్క్ బ్రాండ్, ఆర్ఎన్ఎస్ నేచర్స్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై రాజకీయ వర్గాల్లో  ఇప్పుడు హాట్ హాట్ చర్చ జోరందుకుంది.  2020 ఆగస్టులో.. అంటే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో   ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచే నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తామంటూ హరీశ్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఈ  మిల్చి మిల్క్ బ్రాండ్‌ను  మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రారంభంలో పూర్తిగా హైజెనిక్ పద్ధతుల్లో, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ఇంటికే స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తామని ప్రకటించిన ఈ సంస్థ, ఆ తర్వాత కాలంలో   విస్తరించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేట్ డెయిరీ సంస్థకు అనుకూలంగా కొన్ని అధికారిక నిర్ణయాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు,  ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేసే క్రమంల.. , ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయా డెయిరీని కాదని, హరీశ్ రావుకు  చెందిన ఈ ప్రైవేట్ డెయిరీల నుండి  టెండర్లు లేకుండానే సరఫరా చేయడానికి మార్గం సుగమం చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనివల్ల విజయా డెయిరీ కోట్లాది రూపాయల మేర నష్టపోయిందని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనీ పేర్కొంటూ..  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. మరోవైపు సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు కూడా ఈ వ్యవహారాన్ని  వివాదాస్పదం చేశాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు దూరమై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పెట్టిన   ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  హరీశ్ రావుకు చెందిన దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలోని భారీ ఫామ్‌హౌస్‌, డెయిరీ ఫామ్ పై బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఈ 400 ఎకరాల ఫామ్‌హౌస్ వెనుక ఉన్న పెట్టుబడులు, నిధుల మూలాలు ఏమిటనే దానిపై కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పిస్తోంది.  ప్రభుత్వ విభాగాల నుండి నివేదికలు కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విజయా డెయిరీ నష్టాలు, గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన కాంట్రాక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ అండదండలతోనే మిల్చి మిల్క్ మార్కెట్లో స్వల్ప కాలంలోనే బలపడిందనే వాదనలకు, కల్వకుంట్ల కవిత విమర్శలు, రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా  అధికారులకు ఇచ్చిన ఆదేశాలు బలం చేకూర్చాయి.  రాజకీయంగా   క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీశ్ రావుకు ఇప్పుడు ఈ డెయిరీ వివాదం మచ్చ తెచ్చి పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అన్నిటికీ మించి.. తెలంగాణ అవసరాలు తీరిన తరువాతే ఆంధ్రప్రదేశ్ కు జలాల విడుదల అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న హరీష్ రావు.. మిల్చీ మిల్క్ ఏపీలోని పలు బడా సంస్థలకు ముఖ్యంగా చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నిలదీయడంతో డిఫెన్స్ లో పడ్డారు. ఏపీకి జలాల విషయంలో తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీష్.. తన డైరీ ప్రోడక్ట్స్ ను మాత్రం ఏపీలోని ‘చైనా ’ చైతన్య, నారాయణ)సంస్థలు సహా బడా సంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నిస్తున్నది. దీంతో పొలిటికల్ గా హరీష్ రావు డిఫెన్స్ లో పడ్డారని పరిశీలకులు చెబుతున్నారు.  Harish Rao, Milchy Milk, RNS Natures Products, Kavitha on Harish Rao, Vijaya Dairy Probe, Telangana Politics
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే  అధినేత విజయ్.. వేద నిలయంను తన నివాసంగా చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చెన్నై నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసంలోకి మారేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నివాసం గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత  జె. జయలలిత అధికారిక నివాసం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వేదనిలయాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు.  . పోయెస్ గార్డెన్ (Poes Garden) లో ఉన్న ఈ చారిత్రాత్మక బంగ్లాను  350 కోట్ల కొనుగోలు చేసి, ఆ భవనానని తన నివాసంగా మార్చుకు ఉద్దేశంలో జగన్ ఉన్నట్లు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతోంది.  దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళనాడు రాష్ట్ర అధికార కేంద్రంగా, కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచిన వేద నిలయం ఇప్పుడు  కొత్త రాజకీయ శకానికి సాక్ష్యంగా నిలవబోతుందా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.  a ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక క్రమశిక్షణ గల పాలకుడిలా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న విజయ్.. నీలాంకరి నుంచి ప్రతిరోజూ దాదాపు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పోయెస్ గార్డెన్‌లోకి మారాలని విజయ్   నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేద నిలయం  24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఉంది. దీనిని జయలలిత ఆమె తల్లి సంధ్యతో కలిసి 1967 జూలైలో కేవలం రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. 1968 మే 15న గృహప్రవేశం చేసిన నాటి నుంచి 2016 డిసెంబర్‌లో ఆమె కన్నుమూసేంత వరకు ఈ నివాసమే తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అయితే జయలలిత మరణానంతరం ఈ ఇల్లు  న్యాయవివాదాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చినా..  సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాసు హైకోర్టు దీనిని ఆమె వారసులైన జె. దీప, జె. దీపక్‌లకు అప్పగించింది. ఇప్పుడు విజయ్ ఈ ఇల్లు కొనుగోలు చేయడానికి సిద్ధమై  ఆ వారసులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.   poes garden house, jayalalithaa veda nilayam buying, vijay buy jaya home 350 crore, thalapathy vijay new residence chennai
రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు అయినా... ఉభయ తెలుగురాష్ట్రాల మధ్యా  ఎన్ని విభేదాలు ఉన్నా.. తెలుగు ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని  టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన)  అధినేత్రి  కల్వకుంట్ల కవిత అన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి  పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు.   తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.  ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ భాషా యాసలు, సంస్కృతిపై జరుగుతున్న కొన్ని వివాదాల నేపథ్యంలో  కవిత వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇరు రాష్ట్రాల పరంగా విభేదాలు ఉండొచ్చు..  రాజకీయంగా భిన్నమార్గాలలో పయనిస్తుండొచ్చు.. కానీ..  ప్రజలుగా తెలుగువారు ఐక్యంగా ఉండాలన్నారు కల్వకుంట్ల కవిత.  రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే   శక్తిమంతమైన మాధ్యమం సినిమా అన్న ఆమె.. సాంస్కృతిక బంధాలు రాజకీయాల కంటే మిన్నవన్నారు.  గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర, తెలంగాణ యాసలపై, సంస్కృతిపై కొన్ని చిత్రాల విషయంలో   వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరి భాషను మరొకరు తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో మాటల యుద్ధం జురుగుతోంది.. ఈ నేపథ్యంలో  టీఆర్ఎస్ అధినేత్రి  కతిత సాంస్కృతిక ఐక్యతకు పిలుపునివ్వడం విశేషం.  రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు వారంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగాలని, సినిమా వంటి కళా రూపాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కవిత ఆకాంక్షించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు సినీ వర్గాల నుంచి, ఇటు ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది.  Kavitha calls for unity og telugu people, Cinema, Cultural, Bridge, Telangana, Andhra Pradesh, Teluguone
ALSO ON TELUGUONE N E W S
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)లో ఉన్న తుఫాన్ లాంటి యాక్టింగ్ కి సంబంధించిన మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్న మూవీ డ్రాగన్. ఈ విషయం టీజర్ ద్వారా చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అభిమానులైతే రిలీజ్ డేట్ 2027 జూన్ 11 త్వరగా వస్తే ఎంత బాగుండు అని తమ ఊహల్లో సదరు డేట్ ని తలుచుకుంటూనే ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్  నీల్ తన ప్రీవియస్ చిత్రాలైన 'కేజీఎఫ్' సిరీస్  'సలార్' ని మించి డ్రాగన్ ని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న డ్రాగన్ కి   సంబంధించిన సరికొత్త అప్‌డేట్ నెట్టింట  వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో ఒక భారీ నైట్ షెడ్యూల్  చిత్రీకరణ) జరుగుతోంది. అత్యంత చలి వాతావరణంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, భారీ సెట్స్ మధ్య రాత్రి వేళల్లో ఈ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్ పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సినిమాకు వెన్నెముక లాంటి కొన్ని కీలకమైన సీన్లను ప్రశాంత్ నీల్ అర్ధరాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారట. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ డోస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ మరింత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా, ఏకంగా 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ని  ప్లాన్ చేశారు. అంతేకాకుండా, ఇప్పటివరకు తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ జోలికి పెద్దగా వెళ్ళని ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ చార్ట్‌బస్టర్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఒక ప్రత్యేకమైన సెట్ వేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ అల్టిమేట్ డ్యాన్స్ పవర్‌కు సరిపోయేలా, ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి ఈ స్పెషల్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. Also read: shah rukh khan: షారుఖ్ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే.. ఎందుకు ఇలా చేసారు!   ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన 'ఇన్విన్సిబుల్' అవతార్ కోసం ఎన్టీఆర్ గుబురు గడ్డంతో, చాలా లీన్‌గా మరియు రగ్గడ్ బాడీతో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ముగిసిన వెంటనే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాటిక్ విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా అభిమానులకి,ప్రేక్షకులకి  థియేటర్లలో ఒక మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.     
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి' చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్‌లో మరో కీలక మైలురాయిని కూడా ఈ చిత్రం చేరుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. అలాగే శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా ఇప్పటికే తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మహాకాళి పాత్రలో భూమి శెట్టి నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహాకాళి రూపంలో కనిపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ కూడా భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో  భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథాలజికల్ చిత్రాల్లో ఒకటిగా 'మహాకాళి' రూపుదిద్దుకుంటోంది.  ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సురేష్ రగుతు, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. విడుదల తేదీతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.     HanuMan Universe, Mahakali Movie, Prasanth Varma, Tollywood  
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి సిద్ధమవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ నటుడు, తాజాగా తన కొత్త సినిమాతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేశాడు. ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలవడం విశేషం. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసి, ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రాలో రూ. 8 కోట్లు, సీడెడ్ లో రూ. 3 కోట్లు, నైజాం రూ. 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం రూ. 4 కోట్ల బిజినెస్ నమోదు చేసింది. వీటన్నింటినీ కలిపితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. నాన్-థియేట్రికల్ విషయానికి వస్తే, 'బేబీ' సినిమాతో బ్లాక్‌బస్టర్ ఆడియోను అందించిన మేకర్స్ కావడంతో, టీ-సిరీస్ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రైట్స్ (ఓటీటీ) పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ డీల్ సెట్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ రైట్స్‌ను రూ. 14 కోట్లకు లాక్ చేసింది. హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ డీల్స్ ఇంకా క్లోజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా మొత్తం బిజినెస్ వాల్యూ రూ. 42 కోట్లకు చేరుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఈ సినిమాకి 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్ కథ అందించగా.. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.      Kiran Abbavaram, Chennai Love Story, Business  
  -రాకాలో మరో హీరోయిన్ ఫిక్స్ - అధికారకంగా వెల్లడి చేసిన భామ  - 18 ఏళ్ళ కలల ప్రాజెక్ట్    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ(Atlee)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రాకా'(Raaka). ఎప్పుడెప్పుడు షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని తమ ముందుకొస్తుందా అని ఎదురుచూడని అభిమాని, ప్రేక్షకుడు లేడు. సన్ పిక్చర్స్ సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా  ఒక్కొక్కరిగా క్రేజీ నటీనటులు వచ్చి చేరుతుండటంతో 'రాకా' పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.  మూవీలో పలువురు హీరోయిన్లకు చోటుందని, కథాగమనంలో వారందరి క్యారెక్టర్స్ చాలా  కీలకమైనవనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపించినా అధికారకాంగా మాత్రం ఖరారు కాలేదు. కానీ మలయాళ క్రేజీ భామ  ఫెమినా జార్జ్  తాను రాకాలో చేస్తునట్టు అధికారకంగా ప్రకటించింది. ఇప్పుడు   పంజాబీ నటి నైలా గ్రేవల్ రాకాలో కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా స్వయంగా ఒక ఇంటర్వ్యూ ఓ వెల్లడి చేసింది. ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు 'దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయాలనేది తన చిరకాల కల అని, ఆ కల ఈ చిత్రంతో నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది  అట్లీ 18 ఏళ్ల నాటి కలల ప్రాజెక్ట్ 'రాకా'. ఇలాంటి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నాకు అవకాశం లభించడం కెరీర్‌లో ఒక మైలురాయి లాంటిది. కేవలం హిందీ చిత్రాలకే పరిమితమైన నన్ను నమ్మి, భారీ పాన్ ఇండియా  సినిమాలో కీలకమైన పాత్రకు ఎంపిక చేసినందుకు అట్లీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.    Also read: మైఖేల్ బయోపిక్ సరికొత్త రికార్డు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయిల సునామీ హిందీలో 'తమాషా', 'బరేలీ కి బర్ఫీ', 'తప్పడ్', 'ఇష్క్ విశ్క్ రీబౌండ్' వంటి విభిన్న చిత్రాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ 'మామ్లా లీగల్ హై'లో అడ్వకేట్ అనన్య ష్రాఫ్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నైలా గ్రేవల్, 'రాకా' సినిమాతోనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్  దీపికా పదుకోణె రాకాలో కీ రోల్ పోషిస్తున్న  విషయం తెలిసిందే.  
    హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రికార్డు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను దశాబ్దాల పాటు తన డ్యాన్స్  పాటలతో ఊపేసిన పాప్ దిగ్గజం, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' (Michael Movie) బయోపిక్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా, ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1 బిలియన్ డాలర్స్ అంటే  సుమారుగా  9,500 కోట్లకి పైగా  వసూళ్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్రని  లిఖించింది. సినిమా చరిత్రలోనే ఈ స్థాయి భారీ వసూళ్లను సాధించిన మొట్టమొదటి బయోపిక్ చిత్రంగా మైఖేల్ గ్లోబల్ రికార్డులను తిరగరాసింది. దర్శకుడు ఆంటోనీ ఫుక్వా అద్భుతమైన విజన్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించడం విశేషం. జాఫర్ జాక్సన్‌కు ఇదే తొలి సినిమా అయినప్పటికీ, తన నటనతో మరియు డ్యాన్స్ మూమెంట్స్‌తో మైఖేల్ జాక్సన్‌ను స్క్రీన్ పై పునఃసృష్టి చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఏప్రిల్ 2026 లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, తొలి వీకెండ్‌లోనే అమెరికాలో 97.2 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 217 మిలియన్ డాలర్లు వసూలు చేసి అప్పట్లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించిన మ్యూజికల్ బయోపిక్‌గా నిలిచింది. రన్‌టైమ్ ముగిసే సరికి ఈ సినిమా ఏకంగా 1.001 బిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ చారిత్రాత్మక విజయంతో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజికల్ బయోపిక్ 'బోహేమియన్ రాప్సడీ' (911 మిలియన్ డాలర్లు) రికార్డును మైఖేల్ సులువుగా బద్దలు కొట్టింది. అంతేకాకుండా, రియల్ లైఫ్ పర్సన్ ఆధారంగా తెరకెక్కిన చిత్రాల విభాగంలో లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ఆస్కార్ అవార్డుల విజేత 'ఓపెన్‌హైమర్' (975.8 మిలియన్ డాలర్లు) కలెక్షన్లను కూడా దాటేసి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ బయోపిక్‌గా అవతరించింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రం సాధించిన 629.8 మిలియన్ డాలర్లు, అలాగే నార్త్ అమెరికాలో సాధించిన 371.8 మిలియన్ డాలర్ల వసూళ్లు హాలీవుడ్ దిగ్గజ సంస్థ లయన్స్ గేట్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బిలియన్ మార్కును దాటిన చిత్రంగా నిలిచింది. Also read: Kiran abbavaram: కిరణ్ అబ్బవరంపై ఈ  హీరోలు పగబట్టారా!.. 24 న ఏం జరగబోతుంది సినిమా థియేటర్లలో సాధించిన ఈ కలెక్షన్ల ప్రభంజనం కేవలం బాక్సాఫీస్ వద్దే ఆగలేదు. ఈ సినిమా విడుదల తర్వాత మైఖేల్ జాక్సన్ పాపులారిటీ సోషల్ మీడియాలో, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో అమాంతం పెరిగిపోయింది. ప్రముఖ ఆడియో ప్లాట్‌ఫామ్ స్పాటిఫై (Spotify)లో మైఖేల్ జాక్సన్ మంత్లీ లిజనర్స్ సంఖ్య కేవలం 68 మిలియన్ల నుండి ఏకంగా 105 మిలియన్లకు పెరిగిపోవడం ఒక రికార్డు. అలాగే ఆయన పాడిన టాప్ 60 పాటల స్ట్రీమింగ్స్ ఒక్కసారిగా 467 మిలియన్ల నుండి 1.21 బిలియన్లకు చేరుకున్నాయి. కింగ్ ఆఫ్ పాప్ క్రేజ్ దశాబ్దాలు గడిచినా ప్రపంచవ్యాప్తంగా ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, త్వరలోనే మరింత మంది ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.  
Jr NTR has once again made his stance on politics clear—this time through an official clarification issued by his office. In a strongly worded statement, the actor's team distanced him from an organisation operating under the name "RAW NTR," stating that neither the actor nor his office has any association with it and urging people not to believe unauthorised claims made in his name. The clarification is significant because it continues a pattern that has become increasingly evident in recent years. Despite persistent political speculation surrounding him, NTR has consistently avoided any move or public gesture that could be interpreted as a step towards active politics. Whether during film promotions, public appearances or media interactions, the actor has remained focused on his film career rather than entertaining political discussions. The latest statement reinforces that approach. By making it clear that any charitable initiative, public welfare activity or official communication involving NTR will only come through his authorised team, the actor's office has drawn a firm boundary against individuals or organisations attempting to project an association with him. It also requested the media, social media users and fans not to circulate unverified information. Speculation around NTR's political future has surfaced repeatedly over the years, largely because of his family background and immense popularity. However, the actor has repeatedly chosen not to fuel those conversations. Instead, he has maintained that official announcements related to him will only come from verified channels, while keeping his public focus firmly on cinema. The "RAW NTR" clarification serves as another reminder of that consistent position. Rather than allowing rumours or unofficial associations to gather momentum, NTR's office has once again acted to ensure there is no ambiguity about where the actor stands, reinforcing that any claims linking him to political or organisational activities without official confirmation should not be treated as authentic. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాము. అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ సహకారానికి, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Jr NTR's office has issued an official statement clarifying that the actor has no connection whatsoever with an organisation operating under the name "RAW NTR." The clarification comes amid reports and speculation that the organisation's activities could create an impression of being officially associated with the actor. In the statement, NTR's office categorically stated that neither the actor nor his team has any affiliation, involvement or association with RAW NTR. It also clarified that the organisation is not authorised to represent the actor or communicate on his behalf in any capacity. The statement further emphasised that any charitable initiatives, public welfare activities or official announcements involving Jr NTR will only be communicated through the actor or his authorised team. Fans and the general public have been advised not to treat information or activities circulated by unauthorised individuals or organisations as authentic. Calling it their final communication on the issue, NTR's office expressed hope that the clarification would put an end to the ongoing rumours and speculation. The statement also urged traditional media, social media platforms and fans to refrain from sharing or giving credibility to unverified information related to the matter. The actor's team concluded the statement by thanking fans and well-wishers for their continued understanding and support while reiterating that only official channels should be relied upon for any updates concerning NTR. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The appreciation for Rao Bahadur continues to grow with each passing day. After winning over audiences and earning praise from leading filmmakers and actors like Mahesh Babu, Sukumar, Naga Chaitanya, Nani and Adivi Sesh, the Venkatesh Maha directorial has now found another high-profile admirer in filmmaker Sandeep Reddy Vanga. Known for rarely sharing public reviews, Vanga took to X after watching Rao Bahadur and hailed the film as a reminder of why people fall in love with cinema. "Just watched RAO BAHADUR. This is one of those rare, rich films that reminds you why we fell in love with cinema in the first place," he wrote, calling it a deeply rewarding theatrical experience. The Animal director didn't stop there. He urged audiences to experience the film on the big screen, writing, "I have one request to every genuine film lover... give this film three hours of your life. It deserves your attention, your patience, and your applause." He concluded his post by congratulating the entire team, adding that films like Rao Bahadur deserve to be celebrated. The latest endorsement further strengthens the film's growing reputation. Rao Bahadur has been enjoying exceptional word-of-mouth ever since its release, with critics, filmmakers and actors alike praising its storytelling, performances and cinematic craft. The film has also received an overwhelmingly positive response from members of the Tamil film industry after a special screening in Chennai. With appreciation pouring in from some of Indian cinema's most respected voices, Rao Bahadur is emerging as one of the year's biggest critical successes, proving that strong storytelling continues to resonate across industries. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది. అదే 'లెనిన్'. యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 67.2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఏ సినిమాకైనా మొదటి వారాంతం ఎంత కీలకమో, ఆ తర్వాత వచ్చే సోమవారం కూడా అంతే కీలకం. సాధారణంగా సోమవారం వచ్చిందంటే కలెక్షన్లు తగ్గుతాయని అంటుంటారు, కానీ 'లెనిన్' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సోమవారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లతో తన జోరును ప్రదర్శించింది. ఈ వసూళ్ల స్థాయి చూస్తుంటే, 'లెనిన్' మరో బ్లాక్‌బస్టర్ వారానికి సిద్ధమైందని స్పష్టమవుతోంది. ఈ విజయం చిత్ర బృందానికి, అక్కినేని అభిమానులకు ఒక గొప్ప సంబరంగా మారింది. సినిమా సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణం దానిలోని ఎమోషన్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ లు, మేకింగ్ స్టైల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో సఫలీకృతమైంది. ప్రొడక్షన్ విలువలు, మ్యూజిక్, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది.  67.2 కోట్ల మార్కును కేవలం నాలుగు రోజుల్లోనే అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో 'లెనిన్' మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  https://x.com/AnnapurnaStdios/status/2076921164040134695 Akhil Akkineni, Lenin Movie, Box Office  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
తండ్రిలో ఉండే ఈ అలవాట్లు  పిల్లలను బలహీనులను చేస్తాయ్ పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు కేవలం వినడం ద్వారానే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటారు.  తండ్రి  రోజువారీ అలవాట్లే  అతని పిల్లల భవిష్యత్తును పాజిటివ్ గా ఉండాలా లేదా నెగిటివ్ గా ఉండాలా అనే విషయం డిసైడ్ చేస్తాయి.  ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.. తండ్రి అలవాట్లు పిల్లలను బలహీనంగా కూడా మారుస్తాయి.  తండ్రిలో ఉండే ఏ అలవాట్లు పిల్లలను బలహీనులను చేస్తాయో  తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికి తిట్టడం లేదా కోపగించుకోవడం... ఎప్పుడూ తిట్టడం లేదా గట్టిగా మాట్లాడటం వల్ల పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సంకోచించవచ్చు. తండ్రి ఇలా ఉండే పిల్లలు తండ్రికి భయపడతారు,  చాలామంది తండ్రి అంటే పిల్లలకు భయం ఉండాలని అనుకుంటారు, కానీ పిల్లలు మనసు విప్పి ఏదైనా మాట్లాడగలిగినప్పుడు, చెప్పగలిగినప్పుడు వారి మనసులో ఉండే ఎన్నో సందేహాలు,  దిగులు భయాలు తొలగిపోతాయి. ఏం చేయాలి? పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ముందు మొత్తం వినాలి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి చెప్పేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి,  పిల్లల వ్యక్తిత్వం గురించి కాకుండా, వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి.  పోలిక.. "చూడు, నీ స్నేహితుడు నీకంటే గొప్పవాడు"  చుట్టాలబ్బాయికి నీ కంటే మంచి మార్కులు వచ్చాయి,  ఆ పిల్లాడు నీ కంటే చాలా బెటర్.. ఇలాంటి మాటలు చెప్పడం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఏం చేయాలి? పిల్లలను పోల్చకూడదు,  ప్రతి పిల్లవాడిలో విబిన్న ప్రతిభ ఉంటుంది,  పిల్లలలో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి ప్రోత్సహించాలి. చిన్న ప్రయత్నాలను సైతం అభినందించాలి,  పోల్చకుండా స్ఫూర్తినివ్వాలి. సమయం కేటాయించకపోవడం.. తీరికలేని  కారణంగా, కొన్నిసార్లు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం  చాలామంది తండ్రులకు  తగ్గిపోతుంది. ఇది ఎంత మాత్రం పిల్లలు భరించలేని విషయం. ఏం చేయాలి? ప్రతిరోజూ మొబైల్ కాకుండా  పిల్లలతో కొంత సమయం గడపాలి,  కలిసి ఆడుకోవడం, చదవడం లేదా కబుర్లు చెప్పుకోవడం చేయాలి. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాటిలో పార్టిసిపేట్ చేయాలి. మాట తప్పడం.. తండ్రి పదేపదే తన పిల్లలకు ఇచ్చిన మాటను  నెరవేర్చడంలో విఫలమైతే, పిల్లల నమ్మకం బలహీనపడుతుంది. ఏం చేయాలి? తండ్రి  నెరవేర్చగల ప్రామిస్ లను మాత్రమే పిల్లలకు చేయాలి. . ప్రణాళికలు మారితే, కారణం వివరించాలి. నిజాయితీకి, నమ్మకానికి ఆదర్శంగా ఉండాలి. పిల్లల ఎమోషన్స్ పట్టించుకోకపోవడం.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, బాధపడినప్పుడు,  అలిగినప్పుడు వారిని పట్టించుకోవాలి. . లేకపోతే వారు మానసికంగా చాలా దెబ్బతింటారు. తమకు ప్రాముఖ్యత లేదని అనుకుంటారు. ఏం చేయాలి? పిల్లల ఎమోషన్స్ ను గుర్తించాలి, వారి బాధను, వారు చెప్పే విషయాలను  ఓపికగా వినాలి. సమస్యకు కలిసి పరిష్కారం కనుగొందామని వారిని ఊరడించాలి.   చెడు ప్రవర్తన.. పిల్లలు తరచుగా ఇంట్లో చూసే వాటి నుండే నేర్చుకుంటారు. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఏవి మరచిపోవాలి, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు.. అందరితో మర్యాదగా ఎలా ఉండాలి?  ఇలాంటి విషయాలు పిల్లలకు వివరించాలి.  సామాజికంగా ఎలా ఉండాలో తెలియజెప్పాలి. నిర్ణయాలు.. పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడూ లభించకపోతే, వారి ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడానికి ఆటంకం కలగుతుంది. ఏం చేయాలి? వయసుకు తగిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి,  నిర్ణయాలు తీసుకునే ముందు ఏం ఆలోచించాలో పిల్లలకు వివరించాలి. చదువు మాత్రమే కాదు.. మంచి మార్కులు ముఖ్యమే కావచ్చు, కానీ పిల్లల పూర్తిగా అభివృద్ధి  చెందడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఏం చేయాలి? క్రీడలు, కళలు , సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  ఫలితాన్ని మాత్రమే కాకుండా, చేసిన ప్రయత్నాన్ని కూడా అభినందించాలి.  నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని పిల్లలకు తెలిజెప్పాలి.                                        *రూపశ్రీ.  
కుటుంబ వాతావరణం ఆరోగ్యంగా ఉందా లేదా?  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
అజినమోటో  ఆరోగ్యానికి మంచిదేనా?  చౌ మెయిన్, మోమోస్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, పిజ్జా.. ఇవి మాత్రమే కాకుండా  అనేక ఇతర చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ లో  ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను తరచుగా ఉపయోగిస్తారు. దీని అసలు పేరు మోనోసోడియం గ్లుటామేట్ (MSG), ఇది కూడా ఒక రుచిని పెంచే పదార్థమే. అయితే దీని గురించి  చాలా కాలంగా చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. పరిశోధన ప్రకారం, చాలా మంది ఆరోగ్యవంతులకు అజినమోటో మితమైన మోతాదులో తీసుకోవడం మంచిదే, కానీ కొంతమందిలో, దీన్ని తీసుకోవడం వల్ల  తలనొప్పి, దాహం, వేడి ఆవిర్లు, వికారం లేదా అసౌకర్యం వంటి లక్షణాలను కలుగుతాయి. అసలు అజినోమోటో అంటే ఏమిటి, దాని వినియోగం ఎప్పుడు హానికరంగా మారుతుంది?  ఎవరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి  వైద్యులు చెప్పిన నిజాలేంటో తెలుసుకుంటే.. అజినమోటో.. అజినోమోటో  రసాయన నామం మోనోసోడియం గ్లుటామేట్ (MSG). ఇది ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ఫ్లేవర్ ఎన్‌హాన్సర్. ఇది గ్లుటామేట్ యొక్క ఒక రూపం, ఇది టమోటాలు, చీజ్ , పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాలలో సహజంగా కూడా లభిస్తుంది. అజినమోటో ఎక్కువ వాడితే కలిగే సమస్యలు.. తలనొప్పి , అసౌకర్యం.. అజినమోటో అధికంగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత కొంతమందికి తలనొప్పి, ముఖం ఎర్రబడటం, చెమట పట్టడం లేదా అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇది అందరిలోనూ జరగదు. సోడియం.. అజినోమోటోలో సోడియం ఉంటుంది. దీనిని అధిక ఉప్పు ఉన్న ఆహారాలతో తరచుగా తీసుకుంటే, మొత్తం సోడియం తీసుకోవడం పెరుగుతుంది, ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది కాదు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం.. ప్రాసెస్ చేసిన , ఫాస్ట్ ఫుడ్స్‌లో తరచుగా అజినమోటో ను  ఉపయోగిస్తారు. అలాంటి ఆహారాలలో ఉప్పు, నూనె , కేలరీలు కూడా అధికంగా ఉంటాయి, దీనివల్ల బరువు పెరగడం , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు. సెన్సిటివిటీ ఉన్నవారికి అసౌకర్యం.. కొంతమందికి అజినమోటో తీసుకుంటే సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది అలాంటి వ్యక్తులు అధిక మొత్తంలో తీసుకున్న తర్వాత వికారం, నీరసం, దాహం లేదా తేలికపాటి అసౌకర్యం కలుగుతుంది. ఇలా పదేపదే జరిగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. అజినమోటో విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అధిక రక్తపోటు ఉన్న రోగులు,  మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు,  రక్తపోటు  అధికంగా ఉండే   వ్యక్తులు, చిన్న పిల్లలు మొదలైనవారు అజినమోటో విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                     *రూపశ్రీ.  
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణురాలు డా. శ్రీలత రోజూ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సులభంగా వివరించారు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అలాగే ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
  వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్నలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా చూసినా మొక్కజొన్న చాలా మంచిది.   అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది, కాబట్టి మొక్కజొన్నను సరైన పద్ధతిలో , సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం.  వర్షాకాలంలో మొక్కజొన్న తినడం కొందరికి ఆరోగ్యపరంగా మేలు చేస్తే.. మరికొందరికి హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కజొన్న తినడంలో  పాటించాల్సిన జాగ్రత్తలు ,  మొక్కజొన్న తినడానికి సేఫ్ మార్గం.. ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొక్కజొన్న.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం  మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మొక్కజొన్నలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం , బి విటమిన్లు కూడా శక్తిని అందించడానికి , శరీరంలో జరిగే క్రియలను నిర్వహించడానికి తగిన శక్తి అందిస్తుంది. అందుకే వాతావరణ పరంగానే కాకుండా  ఆరోగ్య పరంగా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలామంచిది. అసిడిటి, గ్యాస్, ఉబ్బరం సమస్యలుంటే.. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి, ఉడికించిన మొక్కజొన్న  మంచిది. ఉడికించిన మొక్కజొన్న మృదువుగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అయితే, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం వల్ల దానిలోని కొన్ని పోషకాలు , రెసిస్టెంట్ స్టార్చ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఐబియస్ ఉన్న వ్యక్తులకు..  ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంటే, మొదట్లో దీనిని అర కంకికి, అంటే సుమారు 35–40 గ్రాములకు పరిమితం చేసుకుని తినడం మంచిది. ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్  తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , ఉబ్బరం పెరగవచ్చు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత.. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఉడకబెట్టిన లేదా ఆవిరి మీద ఉడికించిన మొక్కజొన్న మంచిదిగా. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, వేయించిన మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. ఒకసారికి అర కప్పు ఉడికించిన మొక్కజొన్న లేదా ఒక చిన్న మొక్కజొన్న కంకి సరిపోతుంది. మొక్కజొన్నలో ల్యూటిన్ , జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొక్కజొన్నను కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఈ పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. మొక్కజొన్న తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. మొక్కజొన్నపై అధికంగా వెన్న, చీజ్ లేదా ఉప్పు వేసుకుని తినకూడదు.  అసిడిటీ సమస్యలు ఉంటే, మసాలాలు , నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. మాడిపోయిన లేదా బాగా వేయించిన మొక్కజొన్నను తినడం మానుకోవాలి.  ఎల్లప్పుడూ తాజాగా, బాగా ఉడికించిన మొక్కజొన్నను తినడం మంచిది. మొక్కజొన్నను బాలెన్స్డ్ గా తీసుకోవడం మంచిది.  అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.                                    *రూపశ్రీ.