Home

»

Latest News

అబ్సెషన్ ఓటిటి కోసం బాలీవుడ్ స్టార్స్: రసవత్తరంగా మారిన పరిణామాలు!  

Oct 27, 2026 6:55PM


హర్రర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' మూవీ వరల్డ్ వైడ్ గా సృష్టించిన సంచలనం తెలిసిందే. ఎటువంటి హడావిడి లేకుండా, హడావిడి బడ్జెట్ లేకుండా అంచనా వేయలేని క్యారెక్టర్స్ తీరుతో కథ, కథనాన్ని ఉత్కంఠభరితంగా చెప్పి నాలుగువేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. 

ఈ చిత్రం ఈ నెల 30 నుంచి ఓటిటి(జియో హాట్ స్టార్) వేదికగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హిందీ ప్రేక్షకులని మరింతగా మెస్మరైజ్ చేయడానికి  వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ప్రధాన పాత్రలైన 'బేర్', 'నిక్కీ' క్యారెక్టర్స్ కి ఈ ప్రముఖ తారలు ప్రాణం పోశారు. ఒక మ్యూజిక్ స్టోర్ లో సాధారణ ఉద్యోగిగా పనిచేసే బేర్ క్యారక్టర్ కి వరుణ్ ధావన్,  సహోద్యోగి నిక్కీ కి కృతి తన గాత్రాన్ని అందించారు.


ఇది కూడా చదవండి: హఠాత్తుగా మాయమైన నిధి అగర్వాల్: అసలు మ్యాటర్ తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో!

 

 

 జియోహాట్‌స్టార్ లోని 'పీకాక్ హబ్' (Peacock Hub) వేదికగా అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ మరియు కృతి సనన్‌ల ప్రత్యేక వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది.

 

[varun Dhawan And Kriti Sanon In Obsession, Varun Dhawan, Kriti Sanon, Obsession movie, JioHotstar,Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com