LATEST NEWS
కమ్యూనిస్టులపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ చేసిన వాఖ్యలను సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాసరావు తప్పుపట్టారు.  విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో  జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న పనికిరాని పాత చింతకాయ పచ్చడినే పవన్ కల్యాణ్‌ మరోమారు వండి వార్చారని, ఆ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అపరిపక్వతకు నిదర్శనమన్నారు.  పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు.   ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు   అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు చేగువేరా, భగత్‌సింగ్ ఆదర్శాల గురించి చెప్పిన ఆయన నేడు కమ్యూనిజమే కాలం చెల్లిన సిద్ధాంతమంటున్నారని ఎద్దేవా చేశారు.   గతంలో కమ్యూనిస్టులతో పనిచేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత బిజెపి సరసన చేరి సనాతన ధర్మం గురించి   హడావుడి చేశారనీ.. ఇప్పుడేమో.. ఆంధ్ర ప్రజల్లో ప్రాంతీయ అభిమానం కూడా లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారనీ, ఇలా రోజుకో మాట, పూటకో విధానాన్ని మార్చే ఆయన కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీశ్రీనివాసరావు విమర్శించారు.  మతతత్వ బిజెపితోచేరి యువతలో వస్తున్న మార్పుల్ని పవన్ కల్యాణ్ గుర్తించడం లేదని వీశ్రీనివాసరావు అన్నారు. 
తమిళనాట మరో రాజకీయ పార్టీ తెరమీదకు రానుంది.  కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించి,  తన  మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం ఒక పొలిటికల్ సునామీలా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏ ఇతర రాజకీయ నాయకుడికైనా ఇది ఒక తీరని కల అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే  తమిళనాట విజయ్  సునామీ   ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు  పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇప్పటికే రజినీకాంత్ ఒక సారి రాజకీయ పార్టీ అంటూ హడావుడి చేసి.. వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ తాజా రాజకీయ అడుగులపై  చర్చ నడుస్తోంది. ఇందుకు  ప్రధాన కారణం రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ ప్రారంభించిన ప్రజా ఉద్యమం. ఆమె తమిళనాడులో  మక్కల్ మేడై అంటే తెలుగులో ప్రజల వేదిక  అనే ఒక పౌర వేదికను అధికారికంగా ప్రారంభించారు. స్థానిక స్థాయిలో సరికొత్త నాయకులను తయారు చేయడం, వారి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం తన  మక్కల్ మేడై   ముఖ్య ఉద్దేశంగా ఆమె  ప్రకటించారు. ఒక రకంగా ఇది సమాజ సేవకు, రాజకీయ అవగాహనకు సంబంధించిన మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీని వెనుక ఉన్న టైమింగ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. సరిగ్గా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన తరుణంలోనే ఈ సంస్థను తీసుకురావడం వెనుక  పొలిటికల్ స్ట్రాటజీ   ఉందని నెటిజనులు అనుమానిస్తున్నారు.     దళపతి విజయ్‌కు వస్తున్న విపరీతమైన క్రేజ్, స్టార్‌డమ్ ను రజినీకాంత్ జీర్ణించుకోలేకపోతున్నారా అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.  విజయ్ ఇమేజ్‌ను,  ప్రజాదరణను ఏదో మేరకు  తగ్గించేందుకే రజినీకాంత్ కుటుంబం ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరపైకి తెచ్చిందంటున్నారు.    మక్కల్ మేడై  సంస్థను స్థాపించింది రజినీకాంత్ కాదు, ఆయన భార్య లతా రజినీకాంత్ అయినప్పటికీ.. ఆమో తన సంస్థకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించినప్పటికీ..  దీని వెనుక ఖచ్చితంగా రజనీకాంత్ ఉంటారనీ, ఉన్నారనీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రజినీకాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దళపతి విజయ్ రాజకీయ ఎదుగుదలను చూసి తాను ఎంతో సంతోషిస్తున్నానని   చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు  శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఒకవైపు రజినీకాంత్ ఇలా సానుకూలంగా స్పందించినా.. తాజాగా రజనీకాంత్ భార్య ప్రారంభించిన మక్కల్ మేడై సంస్థ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఇది కేవలం సేవా సంస్థగానే మిగిలిపోతుందా.. ముందు ముందు  విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ అస్త్రంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ వర్సెస్ రజనీ అన్న చర్చకు కేంద్రంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఆ తదననంతర పరిణామాలు  హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఎపిసోడ్ ఊహించని విధంగా పెద్ద వివాదంగా మారడంతో..  పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ రూట్‌ను మార్చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో..  పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది. అయితే  తెలంగాణ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్‌ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఫోకస్ కావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు పవన్ వరుసగా  జాతీయ మీడియా ఛానళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే నిదర్శనమంటున్నారు పరిశీలకులు. నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రాజకీయాలకో లేక ఆంధ్రప్రదేశ్ పరిణామాలకో పరిమితం కావడం లేదు. దేశవ్యాప్త ప్రాధాన్యత ఉన్న అంశాలు, జాతీయ ప్రయోజనాలపై ఆయన   గట్టిగా గళం వినిపిస్తున్నారు. పహెల్గాం ఉగ్రదాడి వంటి సున్నితమైన అంశాలపై జాతీయ మీడియాలో స్పందిస్తూ..  లౌకికవాదం పేరుతో కొందరు చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు.  పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫోకస్ పై దృష్టి పెట్టారనీ,  తద్వారా పొలిటికల్ ఇమేజ్‌ను, జనసేన మైలుజ్ నును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ వివాదాల నుండి పుట్టుకొచ్చిన ఈ వేడిని, పవన్ కళ్యాణ్ తన జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఎటాక్  ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్లుగా..  ఒకవైపు తెలంగాణలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తూనే, మరోవైపు ఢిల్లీ స్థాయి ఫోకస్ సాధించడంపై ఆయన కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.  
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   మహా సంక్షోభం తలెత్తింది. పదిహేనేళ్ల పాటు రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి ఎదుర్కొంటోంది.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి.  పార్టీ అధినేత్రి,  మాజీ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు.  గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ రాజకీయ హైడ్రామాలో  మొత్తం ఉన్న 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మంది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు పక్షాన నిలిచారు. ఈ రెబెల్ వర్గం అంతా ఏక తాటిపైకి వచ్చి ప్రత్యేక క్యాంప్ నిర్వహించడమే కాకుండా..  శాసనసభలో తామే అసలైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందారు. పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీకి ఈ 58 మంది శాసనసభ్యుల  మద్దతు ఉండటంతో.. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఆయన్ను అధికారికంగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా  గుర్తించారు. 15 ఏళ్లపాటు తిరుగులేని అధికారంలో ఉన్న మమతకు ఇది కోలుకోలేని గట్టి దెబ్బ అనడంలో సందేహం లేదు.  అయితే ఈ తిరుగుబాటు వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ అసమ్మతి జ్వాలలు మమతా బెనర్జీపై కంటే..  ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి   అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా పార్టీలోని సీనియర్ నేతలను పక్కనపెట్టి..  అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయించడంపై పార్టీ నేతల్లో లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది. ఎన్నికల ఓటమితో ఆ అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది.  రెబెల్స్ క్యాంప్‌లోని మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఆమెను  ప్రధాన సలహాదారు పాత్రకు పరిమితం కావాలంటున్నారు.  మరోవైపు   23 మంది టీఎంసీ ఎంపీలు కూడా ఈ తిరుగుబాటు వర్గంతో  చేతులు కలిపినట్లు సమాచారం.  ఈ భారీ సంక్షోభం నుంచి పార్టీని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ   ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే  శుక్రవారం (జూన్ 5) తన నివాసంలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని  నిర్వహించారు. రీతబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ  సోమవారం (జూన్ 8) నాడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని మమత నిర్ణయించారు.  అంతేకాకుండా..  పార్టీలో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేసేందుకు వీలుగా బెంగాల్‌లోని అన్ని కీలక రాష్ట్ర కమిటీలతో పాటు ఫ్రంటల్ సంస్థలను దీదీ రద్దు చేశారు. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తరహాలోనే ఇప్పుడు బెంగాల్‌లో కూడా పార్టీ పేరు, గుర్తు కోసం కోర్టుల్లో న్యాయపోరాటం జరగే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  
  జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా  లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన అధికారికంగా ప్రకటించారు. 2015 నుంచి జనసేన పార్టీతో పాటు పవన్ కళ్యాణ్‌తో లింగమనేని రమేష్‌కు సన్నిహిత అనుబంధం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ జనసేన సిద్ధాంతాలపై, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోకుండా నిలిచిన వారికి జనసేన ప్రాధాన్యం ఇస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీతోనే కొనసాగిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపాయి. అదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో కూడా పవన్ కళ్యాణ్ అనుసరించినట్లు పార్టీ వెల్లడించింది.
ALSO ON TELUGUONE N E W S
Ram Charan's Peddi, directed by Buchi Babu Sana, sparked intense debates over controversial scenes involving Janhvi Kapoor. Amidst the backlash, actress Anasuya Bharadwaj shared a lengthy statement on the responsibility of cinema. Her reaction drew immediate attention, as she was labelled as hypocrite, but staying silent on few problematic women portrayal in Sukumar films like Pushpa. But she did not stay silent on Buchi Babu Sana's Peddi. Still, her reaction looked more measured and not her firebrand self.  Anasuya revealed in her detailed post that she had previously lost roles for voicing her opinions. Her extensive explanation this time appeared to be a careful attempt to speak up without directly hurting anyone involved. She advocated for consciousness over censorship, stating that while films reflect society, they should not carry the sole burden of educating it. She emphasized that creative freedom and social responsibility must always find a way to coexist. Clarifying her strong stance, the actress stated she is advocating for "consciousness," not censorship or moral policing. She emphasized that creative freedom is essential, but it must coexist with an awareness of responsibility. She believes the answer lies somewhere in the middle, stating that we should not expect films to parent society, but we also cannot pretend they have no influence. Concluding her thoughts, Anasuya noted that while movies alone cannot be blamed for everything, she hopes everyone involved becomes more socially aware. She expressed her happiness over social media voices stepping up to question narratives and encourage critical thinking. Ultimately, she believes that shaping a healthy culture remains a "collective responsibility" for creators, performers, and audiences alike. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ 'పెద్ది' (Peddi). బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ మూవీ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు తెలిపారు. అభ్యంతకర సన్నివేశాలను తొలిగిస్తామని చెప్పారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుండగా, తాజాగా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. సినిమా అనేది ఎప్పుడూ సమాజానికి ప్రతిబింబంగానే ఉంటుందని, అయితే సమాజాన్ని కేవలం సినిమాలే మార్చాలని లేదా చైతన్యపరచాలనే పూర్తి బాధ్యతను వాటిపైనే నెట్టేయడం కరెక్ట్ కాదని అనసూయ అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిగా మనందరికీ ఏది తప్పు, ఏది రైట్ అని తెలుసుకునే విచక్షణ, బాధ్యత ఉండాలని, సినిమాల ద్వారా పేరెంటింగ్ జరగాలని తాను నమ్మడం లేదని అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయాన్ని చెబుతూనే, కథకులుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల బాధ్యతను తక్కువ చేసి చూపించలేమని ఆమె అన్నారు. సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం అని పేర్కొన్నారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది సమాజంలో చర్చలను లేవనెత్తుతుందని, ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుందని, కొన్నిసార్లు ప్రవర్తనను కూడా ప్రేరేపిస్తుందని ఆమె గుర్తు చేశారు.  పూర్వ కాలంలో ప్రేక్షకులు ఒక కథలోని నైతిక విలువలను చాలా సులభంగా అర్థం చేసుకునేవారని, హీరో అంటే ఆదర్శంగా తీసుకునే పాత్రగా, విలన్ అంటే మనం అనుకరించకూడని నెగటివ్ పాత్రగా స్పష్టత ఉండేదని వివరించారు. కానీ నేటి రోజుల్లో ఆ గీత చాలా వరకు చెరిగిపోయిందని, క్యారెక్టర్లు ఎంతో క్లిష్టంగా మారిపోవడంతో కొన్నిసార్లు పాత్రలను చూపించడమే కాకుండా వాటిని గ్లోరిఫై చేయడం కూడా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇటువంటి సామాజిక విషయాలపై మాట్లాడిన ప్రతిసారీ.. సెన్సార్‌షిప్ చేయాలనో లేక మోరల్ పోలీసింగ్ చేయాలనో డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం బాధ్యతాయుతమైన స్పృహ మాత్రమే కోరుకుంటున్నానని అనసూయ తెలిపారు.  ఒక కథను ప్రజల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సంబంధించిన రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడితో పాటు చూసే ప్రేక్షకులకు కూడా దాని ప్రభావంపై పూర్తి బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు.  తాను ఎప్పుడూ నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటానని, అందుకే ఒక షో టీమ్ యొక్క క్రియేటివిటీకి తన అభిప్రాయాలు అడ్డురాకూడదనే ఉద్దేశంతో ఆ షో నుండి తప్పుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత పరిశ్రమలో తన ప్రతిభకు తగ్గ ప్లాట్‌ఫామ్ దక్కించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని, అయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని అన్నారు. సినిమాల్లో క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంత ముఖ్యమో, అదే సమయంలో సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని అనసూయ చెప్పారు. ఈ రెండూ కలిసికట్టుగా సాగాలన్నదే ఆమె అభిప్రాయం. సినిమాలు సమాజానికి తల్లిదండ్రుల్లా బుద్ధులు నేర్పాలని ఆశించలేము, అలాగని సినిమాలకు అసలు ప్రభావమే లేదని కూడా అనలేమని ఒక అద్భుతమైన ముగింపునిచ్చారు. అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   https://www.instagram.com/p/DZPBfBNmAWl/
పెద్ది(Peddi)అలియాస్ చరణ్ తో కలిసి అచ్చాయమ్మ ఉరఫ్ జాన్వీకపూర్ థియేటర్స్ లో  సందడి చేస్తుంది. ఫ్యాన్స్ తో పాటు మెజారిటీ ప్రేక్షకులు జాన్వీ రోల్ కి సరైన ఇంపార్టెన్స్ లేదని, పైగా వల్గారిటీగా చూపించారనే విమర్శలు చేస్తున్నారు. విమర్శలు వస్తూనే ఉన్నా కలెక్షన్స్ మాత్రం పెద్ది బాగానే కొల్లగొడుతుంది. ఇక అచ్చాయమ్మ  క్యారక్టర్ కి  పక్కా లోకల్ యాసలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పిన ఆ వాయిస్ ఎవరిదనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  తొలి చిత్రం దేవర'లో  తంగం క్యారక్టర్ కి ఆర్జే శ్వేత డబ్బింగ్ చెప్పి మెప్పించిన సంగతి తెలిసిందే. కానీ ఈ 'పెద్ది' సినిమాలో మాత్రం జాన్వీ కపూర్ క్యారక్టర్ కి టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, యాంకర్ సమీరా భరద్వాజ్ డబ్బింగ్ చెప్పారు. బుల్లితెరపై పలు రకాల మ్యూజిక్ షోలు, ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, ఎంతోమంది అభిమానులని  సంపాదించుకున్న సమీరా భరద్వాజ్ జాన్వీ కి తన గొంతుని అద్దారు. ఈ విషయాన్ని సమీరా స్వయంగా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. Also read: LB sRIRAM: ఎల్బీ శ్రీరామ్‌కి అవమానం.. షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కారణం ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, "పెద్ది సినిమాలో అందాల నటి జాన్వీ కపూర్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు" అంటూ సమీరా భరద్వాజ్ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమీరాకు, ఆమె కూతురు ఆద్యకు నెటిజన్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఒక బ్లాక్‌బస్టర్ సినిమాలో స్టార్ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పి, అచ్చియమ్మ పాత్ర అంతగా పండటానికి కారణమైన సమీరా భరద్వాజ్‌పై నెటిజన్లు, మెగా అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సమీరా తనలోని సరికొత్త టాలెంట్‌ని  నిరూపించుకుందని కామెంట్స్ చేస్తున్నారు.     
  అప్పుల అప్పారావు మూవీలో 'అప్పు'డే తెల్లారిందా అనే చమక్కుతో కూడిన డైలాగ్ అయినా, హిట్లర్ లో అంతొద్దు..ఇది చాలు అనే స్మాల్ పవర్ ఫుల్ డైలాగ్ రాయాలన్నా  అది ఎల్ బి శ్రీరామ్(Lb Sriram)కే సాధ్యం. నటుడుగా కూడా కామెడీ, సెంటిమెంట్ తో కూడిన క్యారెక్టర్స్ చేసి బహుముఖ ప్రజ్ఞాశీలిగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 40కి పైగా సినిమాలకి  అద్భుతమైన డైలాగ్స్ అందించి, నటుడిగా 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన హఠాత్తుగా వెండితెరకి   దూరమయ్యారు? ప్రస్తుతం యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్  తీస్తున్నారు? ఈ విషయాలపై ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, తనను కలచివేసిన సంఘటనలను ఎంతో ఆవేదనతో పంచుకున్నారు. నా సుదీర్ఘ కెరీర్‌లో అత్యుత్తమ నటనకి  ఐదు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులని  అందుకున్నాను. కానీ పరిశ్రమ ఒకే రకమైన క్యారెక్టర్స్ కే  పరిమితం చేసింది.  టాలీవుడ్‌లో టాప్ 10 కమెడియన్లలో ఒకరిగా నిలిచి, ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేసి మెప్పించినా కేవలం సెంటిమెంటల్, సానుభూతి లేదా ఏడిపించే వాటికే  పరిమితం చేశారు.. తనలోని నటుడిని, కళాకారుడిని కేవలం ఒకే రకమైన భావోద్వేగాల పరిధిలో ఉంచడం ఇష్టం లేకే సినిమాలని తగ్గించుకున్నాను. సినిమా రంగంలో  రంగులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాలు లేదా క్రికెట్ కంటే కూడా విపరీతమైన స్పందన సినీ పరిశ్రమలోనే కనిపిస్తుంది. కెరీర్ తొలినాళ్లలో ఒక పెద్ద సినిమాకి డైలాగ్ రైటర్‌గా రాత్రింబగళ్లు ఏడాది పాటు కష్టపడినా, కనీసం టైటిల్ కార్డ్స్‌లో నా పేరు కూడా వేయలేదు. ఆ సంఘటన నన్ను వ్యక్తిగతంగా ఎంతో కదిలించింది. Also read: PEDDI vs DRISHYAM 3: ఎవరు ఎవర్ని దెబ్బ కొడుతున్నారు అయినప్పటికీ జీవితంలో వైరాన్ని శాశ్వతం చేసుకోకూడదనేది నా తత్వం.పేజీ తిప్పేసి ముందుకు సాగాలని నమ్ముతాను. ఎంత కోపం వచ్చినా అది తాటాకు చప్పుడు లాంటిదే, తప్పు అవతలి వారిదైనా నేనే ముందుగా పలకరిస్తాను. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నటుడిగా ప్రోత్సహించారు. ఇప్పుడున్న జెన్ జీ (Gen Z) తరం స్పీడ్‌ని  అందుకోవడం చాలా కష్టంగా ఉంది. నేటి కామెడీ పోకడలు విచిత్రంగా మారాయి. జోక్ ఏంటో అర్థం చేసుకునేలోపే బ్యాక్ గ్రౌండ్‌లో నవ్వుల శబ్దాలు వచ్చేస్తున్నాయి. దానికి నవ్వాలో లేదో తెలియని పరిస్థితి ఉంది. పెద్ద సినిమాల్లో ఆత్మసంతృప్తి లేకపోవడం వల్లే  'ఎల్బీ శ్రీరామ్ హార్ట్ (Heart) ఫిలిమ్స్' బ్యానర్‌ స్థాపించి, మానవీయ విలువలతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ నాలోని నటుడిని సంతృప్తి పరుస్తున్నానని చెప్పుకొచ్చాడు.   
Prakash Raj publicly stated that they are not slaves to blindly follow leaders and sheep. He further triggered controversy by keeping a harsh tone in his wording to change their thought process. Nagababu supporting Pawan Kalyan, AP Deputy CM and Janasena party leader, had posted a message on X, asking cadre to follow leader. He said, “A leader’s word is final. None have seen devils and demons in his path, he alone knows what is right and what is wrong. Shut your doubts, silence your tongue, and follow the leader without questions.” The post quickly attracted attention and mixed reactions from users. Responding directly, Prakash Raj questioned the idea of absolute obedience and pushed back strongly against the message. In his reply, he wrote, “What do you mean by ‘shut your doubts, silence your tongue and follow the leader without questions’? We are not sheep. We are not here to live a slave’s life.” He further asked Nagababu not to issue threats and argued that questioning leadership is a democratic right. Prakash Raj added that any leader — including someone who believes he alone is the leader — has a responsibility to answer questions. Ending his response with his familiar phrase #JustAsking, Prakash Raj’s post has once again opened debate online around leadership, criticism and accountability in public life. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మలయాళ చలనచిత్ర పరిశ్రమలో (Mollywood) తనదైన అద్భుతమైన హాస్యంతో, విలక్షణమైన నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరపగలిగని ముద్ర వేసుకున్న జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు సలీమ్ కుమార్ (Salim Kumar) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా మారింది.  గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కేరళలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తక్షణమే ఐసీయూ (ICU) విభాగానికి తరలించి, ప్రస్తుతం వెెంటిలేటర్ సపోర్ట్‌పై (Ventilator Support) ఉంచి చికిత్స అందిస్తున్నారు.  సలీమ్ కుమార్ ఆసుపత్రిలో చేరారనే వార్త మాలీవుడ్‌తో పాటు మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన అభిమానులు, తోటి సినీ ప్రముఖులు ఈ వార్త విని ఆందోళన చెందుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, సలీమ్ కుమార్ గత కొంతకాలంగా కాలేయం మరియు మూత్రపిండాల (Liver and Kidney) సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ఆయన పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. అయితే, తాజాగా ఆయన అంతర్గత అవయవాల పనితీరు క్షీణించడం మరియు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తడంతో పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఆసుపత్రిలోని నైపుణ్యం కలిగిన ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షిస్తోంది. సలీమ్ కుమార్ వయస్సు ప్రస్తుతం 56 సంవత్సరాలు కాగా, ఈ వయస్సులో ఇటువంటి తీవ్రమైన ఆర్గాన్ ఇష్యూస్ రావడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆసుపత్రి వర్గాలతో పాటు మలయాళీ సమాజం మొత్తం ప్రార్థిస్తోంది. సలీమ్ కుమార్ మలయాళీ సినిమా చరిత్రలో ఒక లెజెండ్ అని చెప్పాలి. మూడు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్‌లో ఆయన దాదాపు 350 కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై కామెడీ కింగ్‌గా ఎదిగారు. కేవలం నవ్వులు పూయించడమే కాకుండా, సీరియస్ మరియు ఎమోషనల్ పాత్రలను కూడా అద్భుతంగా పండించగలనని నిరూపించారు. 2010లో విడుదలైన 'ఆదామింతె మకన్ అబు' (Adaminte Makan Abu) అనే క్లాసిక్ సినిమాలో ఆయన కనబరిచిన అసాధారణ నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును (National Film Award for Best Actor) అందుకున్నారు. దీనితో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడు రాష్ట్ర అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు.  
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ఎనర్జీతో, మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తూ దూసుకుపోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) సరికొత్త ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ 'RAPO23' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకతోనే ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్వయంగా రామ్ పోతినేని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి టెక్నికల్ టీమ్ గురించిన ఆసక్తికరమైన చర్చలు నడుస్తుండగా, తాజాగా మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లోకి ఇండియన్ సినిమా రంగంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు (DOP Tirru) అధికారికంగా అడుగుపెట్టారు. నేషనల్ అవార్డ్ విన్నర్ తిరు ఎంట్రీ ఇవ్వడంతో 'RAPO23' ప్రాజెక్ట్ రేంజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ అద్భుతమైన నియో-నాయిర్ (Neo-Noir Style) యాక్షన్ ప్రపంచాన్ని, అందులోని హై-వోల్టేజ్ అడ్రినలిన్ రష్, పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు గుండెలను పిండేసే ఎమోషన్స్‌ను తన అసాధారణమైన కెమెరా కంటితో క్యాప్చర్ చేసేందుకు తిరు రంగంలోకి దిగారు.  '24', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి ఎన్నో భారీ సినిమాలకు డీఓపీగా పనిచేసిన తిరు, తన అద్భుతమైన లైటింగ్ మరియు కలర్ ప్యాలెట్‌తో సరికొత్త విజువల్స్ చూపించడంలో సిద్ధహస్తుడు. రామ్ పోతినేని కెరీర్‌లోనే ఇదొక అత్యంత ప్రయోగాత్మకమైన, మునుపెన్నడూ చూడని సరికొత్త నియో-నాయిర్ స్టైల్ డార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది. తిరు మార్క్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.   https://x.com/RAPO_Cinematics/status/2063133112415236402
Ram Pothineni’s upcoming project #RAPO23 has added a key name to its technical team with cinematographer Tirru officially coming on board. The film is particularly notable as it marks Ram’s debut as both writer and director. Announced earlier with Ram introducing his character Veera, the film is being described as a psychological action thriller set against a neo-noir backdrop. While the makers had already hinted at a visually driven approach, the addition of Tirru gives a clearer idea of the direction the team is aiming for. Tirru is known for his strong visual language and ability to build atmosphere through lighting and framing. His filmography across industries and National Award recognition make him one of the more established cinematographers currently working in Indian cinema. Produced by Krishna Pothineni under the newly launched Rapo Cinematics banner, #RAPO23 is being positioned as an emotional action drama with the tagline The Story of a Lone Wolf. With the cinematographer now locked, attention will shift to the rest of the cast and technical crew announcements in the coming weeks. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  మోహన్ లాల్(Mohan Lal), వర్సెస్ రామ్ చరణ్(Ram Charan).. ఆ వర్సస్ అనే వర్డ్ ని వింటామని బహుశా ఆ ఇద్దరి అభిమనులు అసలు అనుకోని ఉండరు. కానీ బాక్స్ ఆఫీస్ వార్ ఆ పరిస్థితిని కల్పించింది. 'దృశ్యం 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డుల వేట సాగిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కుని  దాటేసి, మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యంత వేగంగా ఆ  మైలురాయిని అందుకున్న సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ జార్జ్ కుట్టి పై ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ వల్ల థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రెండు వారాలు తిరక్కుండానే 226.55 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసి, ఆల్‌టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ మలయాళ సినిమాల క్లబ్‌లోకి  చేరిపోయింది. అయితే, ఇలాంటి టాప్ గేర్‌లో దూసుకుపోతున్న మోహన్ లాల్ కలెక్షన్ల వేగానికి మెగా పవర్ స్టార్ రూపంలో ఊహించని బ్రేక్ పడింది. 'పెద్ది'కి వస్తున్న  భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ కారణంగా అప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యం వహించిన 'దృశ్యం 3' వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా విదేశీ మార్కెట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో 'దృశ్యం 3' కలెక్షన్ల వేగం గణనీయంగా తగ్గింది. 16వ రోజు నాటికి 'దృశ్యం 3' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 231.26 కోట్ల రూపాయలకు చేరుకున్నప్పటికీ, మునుపటి రోజులతో పోలిస్తే కలెక్షన్లలో 14 శాతం మేర తగ్గుదల నమోదైంది. కేరళ మినహా మిగిలిన ఏరియాల్లో థియేటర్ల కౌంట్ తగ్గడం, ప్రేక్షకులు చరణ్ నయా లుక్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్‌తో కూడిన 'పెద్ది' వైపు మొగ్గు చూపడం వల్ల  బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్ మారాయి. మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ జోరుకు రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా గట్టి పోటీనిస్తూ గ్లోబల్ మార్కెట్‌లోనూ గట్టి షాక్ ఇచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Also read: Peddi: పెద్ది సెకండ్ కలెక్షన్స్  ఇవే! 'పెద్ది'  థియేట్రికల్ బిజినెస్ దాదాపు 218 కోట్ల రూపాయల మేర జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సిన భారీ టార్గెట్ ఈ సినిమా ముందుంది. రెండు రోజుల్లోనే 180 కోట్ల గ్రాస్ వరకు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ 'బుక్ మై షో'లో కేవలం ఒక గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కల్కి 2898 ఏడీ, సలార్, పుష్ప 2 చిత్రాల సరసన నిలిచి, గంటకు 40 వేల టికెట్ల మార్కుని దాటిన నాలుగో తెలుగు చిత్రంగా 'పెద్ది' అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.   
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఒక మహిళకు బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా, ఆమెకు ఏమాత్రం భయం కలగకుండా ఉండేందుకు వైద్యులు స్క్రీన్‌పై సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. అది కూడా ఆమెకు ఎంతో ఇష్టమైన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' (OG) మూవీ చూపిస్తూ, మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని ప్రాణాంతకమైన గడ్డను విజయవంతంగా తొలగించి ప్రాణాలు కాపాడారు. వైద్య పరిభాషలో 'అవేక్ క్రేనియోటమీ' (Awake Craniotomy) అని పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ప్రముఖ డీవీసీ (DVC) ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ వినూత్న సర్జరీ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వైద్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అరుదైన ఆపరేషన్ వెనుక ఉన్న పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ అనే మహిళ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక చిన్న కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో స్పృహతప్పి కిందపడిపోయారు. కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమెను తక్షణమే మెరుగైన చికిత్స నిమిత్తం వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కోటేశ్వరమ్మకు వైద్య పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల నివేదికలు చూసిన వైద్యులకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఆమె మెదడులో ఒక ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మెదడులో ట్యూమర్ ఉండటమే కాకుండా, అది ఉన్న ప్రదేశం వైద్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆ గడ్డ మెదడులోని అత్యంత కీలకమైన, మనిషి శరీర కదలికలను మరియు రోజువారీ పనితీరును నియంత్రించే అత్యంత సున్నితమైన నరాల ప్రాంతానికి (Motor Cortex) చాలా దగ్గరగా విస్తరించి ఉందని తేలింది. సాధారణ పద్ధతిలో రోగికి పూర్తిగా మత్తు (General Anesthesia) ఇచ్చి శస్త్రచికిత్స చేస్తే, ఆ సున్నితమైన నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు విశ్లేషించారు. ఒకవేళ నరాలు దెబ్బతింటే కోటేశ్వరమ్మ జీవితాంతం పక్షవాతం (Paralysis) బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి, నాడీ వ్యవస్థ తీరును లైవ్‌లో గమనిస్తూ సర్జరీ చేయాలని డాక్టర్లు భావించారు. ఇందుకోసం రోగి పూర్తి స్పృహలో ఉండగానే, అంటే మెలకువగా ఉంచి చేసే 'అవేక్ క్రేనియోటమీ' విధానాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రక్రియలో ఆపరేషన్ జరుగుతున్నంత సేపు రోగి మాట్లాడుతూ, కదలికలు చూపిస్తూ ఉండాలి. అయితే, తల తెరిచి మెదడుకు సర్జరీ చేస్తున్నప్పుడు రోగి తీవ్రమైన భయాందోళనలకు గురికావడం సహజం. రోగి మనస్సును మళ్లించి, ప్రశాంతంగా ఉంచడం కోసం వారికి ఇష్టమైన అంశాలను స్క్రీన్‌పై చూపించడం ఈ చికిత్సా విధానంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇందులో భాగంగానే వైద్యులు కోటేశ్వరమ్మను మీకు ఇష్టమైన నటుడు ఎవరని ప్రశ్నించగా, ఆమె ఏమాత్రం ఆలోచించకుండా 'పవన్ కళ్యాణ్' అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆపరేషన్ థియేటర్‌లోనే ఆమె కళ్ల ముందు స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా ప్లే చేశారు. కోటేశ్వరమ్మ ఎంతో ఆసక్తిగా ఆ సినిమా చూస్తూ, నవ్వుతూ, డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, వారి సూచనల ప్రకారం చేతులు, కాళ్లు కదిలిస్తూ సహకరించారు. ఈ అనుకూలమైన వాతావరణంలో న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్‌కుమార్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా, నాడీ వ్యవస్థకు ఎలాంటి చిన్న హాని కూడా కలగకుండా మెదడులోని గడ్డను 100 శాతం విజయవంతంగా తొలగించింది. ఆపరేషన్ ముగిసే వరకు కోటేశ్వరమ్మ ఎంతో ధైర్యంగా సినిమా చూస్తూనే ఉండటం విశేషం.  ఈ అసాధారణమైన క్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని డీవీసీ ఆసుపత్రి ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రత్యేకంగా కలిసి అభినందించారు.  ప్రస్తుతం కోటేశ్వరమ్మ పూర్తిగా కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం సురక్షితంగా మరియు నిలకడగా ఉందని వైద్యులు అధికారికంగా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరుదైన ఘట్టం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రజలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు. తరువాత  దాని గురించి పశ్చాత్తాపపడతారు. చాలా వరకు ప్రతి వ్యక్తి తన నిర్ణయం సరైనదని నమ్ముతాడు, కానీ కాలక్రమేణా, వారి భ్రమలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం వారి మనస్సు , మెదడు డైరెక్షన్ ద్వారా నడుస్తుంది.  ఈ విషయాన్ని స్వయానా ఆచార్య  చాణక్యుడు స్పష్టం చేశాడు. మనిషి మనస్సు , మెదడు పూర్తీ సామరస్యంతో లేనంత వరకు, వారి నిర్ణయాలు తప్పు అని రుజువవుతాయని చాణక్యుడు నమ్ముతాడు. మనస్సు , మెదడు సంపూర్ణ సామరస్యంతో లేకపోతే, వారి సొంత మనస్సే వారికి శత్రువుగా మారుతుంది.ఒక వ్యక్తికి తన సొంత మనస్సే శత్రువుగా మారడానికి గల ఐదు కారణాలను ఆచార్యుడు స్పష్టంగా వివరించాడు.  అవేంటో తెలుసుకుంటే.. బాలెన్స్ లేకపోవడం.. నిర్ణయం తీసుకునే సామర్థ్యం  వ్యక్తి యొక్క మనఃస్థితి , మెదడుపై ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటాడు. అందువల్ల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, ఆ నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యక్తి భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.  దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దురశాతో ఆధిపత్యం చెలాయించడం.. దురాశ  మనిషిని  ఆవరించినప్పుడు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చాణక్యుడు చెబుతాడు. లాభాపేక్ష అనే ఆలోచనే మనిషిలో దురాశ పుడుతుంది.   ప్రయోజనాల కారణంగా జరిగే నష్టాల గురించి ఆలోచించరు. ఈ అలవాటు నేటికాలంలో చాలామందిలో చాలా ఎక్కువగా ఉంది.  వ్యాపారవేత్తలు కూడా అధిక లాభాల ఆశతో పెట్టుబడుల నుండి వచ్చే  నష్టాలను తరచుగా పట్టించుకోరు. చాణక్యుని దృష్టిలో, దురాశ , తొందరపాటు మనసును శత్రువుగా మారుస్తాయి. కోపం.. కోపం ముఖ్యమైన సంబంధాలను కూడా క్షణాల్లో విచ్ఛిన్నం చేస్తుంది.  చాణక్యుని ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, ఇతరులు చెప్పే విషయాన్ని వినాలనే ఆసక్తిని కూడా అణిచివేస్తుంది.  కోపంలో ఉన్నప్పుడు మనిషి తన కోపాన్ని బయటకు వ్యక్తం చేస్తాడు అంతే కానీ.. ఆలోచించి  జరిగిన విషయం గురించి ఆలోచించి సమస్యను పెద్దది కాకుండా ఆపే విచక్షణ ఉండదు. అందుకే తన కోపమే తన శత్రువు అని అన్నారు.ఈ కోపం మనిషి మనసును కూడా శత్రువుగా మారుస్తుంది. అతిగా ఎమోషనల్ బాండింగ్.. ఆచార్య చాణక్యుని ప్రకారం మితిమీరిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగపరంగా చాలా గాఢంగా ముడిపడి ఉన్నప్పుడు, వారు నిజానిజాలు సరిచూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పరిస్థితిలో భ్రమల ఏది, నిజం ఏది తెలుసుకోలేరు.  తమ భ్రమ పడే విషయమే నిజం అని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే అపార్థాలు కూడా చాలా సులువుగా వచ్చేస్తాయి. సందేహంతో తీసుకునే నిర్ణయాలు.. చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చాడు. అసంపూర్ణ జ్ఞానం భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది.    పూర్తి నిజం తెలుసుకోకుండా తుది నిర్ణయానికి రావడం చాలా ప్రమాదమని,  దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతాడు. సందేహంతో తీసుకునే   నిర్ణయాలు కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు మనిషిని నష్టానికి దూరంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా,  భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు.  అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే..  ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు  కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే..  సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా  చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని  తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి  ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి  అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో  కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు   భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం  ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో  కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా  రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం,  పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు  సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు.  ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.   జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు.                                         *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్తే స్టెంట్ వేయాలని లేదా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఆహార నియమాలతో, ఆపరేషన్లు లేకుండానే గుండె బ్లాకులను తొలగించుకోవచ్చని మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు ఈ VIDEO లో వివరించారు. మనం ఈ మార్పును ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) సాధారణంగా గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే సర్జరీ వైపు మొగ్గు చూపుతాము. అయితే, సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సర్జరీ భయం లేకుండా: స్టెంట్ లేదా బైపాస్ సర్జరీల అవసరం లేకుండానే 20% నుండి 40% వరకు బ్లాకులను సహజంగా తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఎటువంటి ఇంజెక్షన్లు లేదా కెమికల్ మెడిసిన్స్ లేకుండా కేవలం కూరగాయల రసాలు మరియు ఆయుర్వేద పద్ధతులతో చికిత్స పొందవచ్చు. సమగ్ర ఆరోగ్యం: ఇది కేవలం గుండెకే కాదు, షుగర్, బీపీ, మరియు కిడ్నీ సమస్యలను కూడా ఒకేసారి అదుపులోకి తెస్తుంది. ఏమి చేయకూడదు? (What Not to Do?) ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కన్నా ముందు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం: నూనె వాడకం: నూనెతో వేయించిన పదార్థాలను (Oil-fried foods) పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రిజర్వేటివ్స్ మరియు సాల్ట్: బ్రెడ్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బీపీని మరియు కిడ్నీ సమస్యలను పెంచుతాయి. తెల్ల అన్నం మరియు గోధుమలు: కనీసం మూడు నెలల పాటు వైట్ రైస్ మరియు గోధుమలను దూరం పెట్టి, సిరిధాన్యాలు లేదా బార్లీ రొట్టెలు తీసుకోవాలి. పొగత్రాగడం: గుండె సమస్యలకు ప్రధాన కారణమైన స్మోకింగ్ వంటి అలవాట్లను తక్షణమే మానేయాలి. ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గం (How to do?) డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు సూచించిన ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి: 9 వారాల జ్యూస్ థెరపీ: మొదటి వారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ (200 ml). రెండో వారం: సొరకాయ జ్యూస్. మూడో వారం: కీరా (కుకుంబర్) జ్యూస్. ఈ విధంగా ఈ మూడు వారాల చక్రం 9 వారాల పాటు (మొత్తం 3 సార్లు) కొనసాగించాలి. ఆహార నియమాలు (Plate 1 & Plate 2): మొదటి ప్లేట్‌లో కేవలం పండ్లు (బ్లూబెర్రీస్, ఆపిల్, జామకాయ) మరియు మొలకలు తీసుకోవాలి. రెండవ ప్లేట్‌లో నూనె లేకుండా వండిన కూరలు, బార్లీ లేదా రాగి రొట్టెలు తీసుకోవాలి. కిడ్నీ మరియు బీపీ కోసం సహజ టీలు: కొలెస్ట్రాల్ తగ్గడానికి దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. బీపీ అదుపులో ఉండటానికి కరివేపాకు డికాక్షన్ తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు 5 వేపాకులు, 3 రావి ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి మార్పులు: సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవాలి (Barefoot walking), దీనివల్ల పాదాలలోని ఆక్యుప్రెషర్ పాయింట్లు స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణ సందేహాలు (Q&A) ప్ర: డయాలసిస్ ఆపడం సాధ్యమేనా?  జ: అవును, సహజ ఆహారం మరియు వేపాకు, రావి ఆకుల కషాయం వంటి నాచురల్ ట్రీట్‌మెంట్ ద్వారా క్రియాటినిన్ తగ్గించి డయాలసిస్ అవసరం లేకుండా చేయవచ్చని డాక్టర్ గారు అబ్సర్వ్ చేశారు. ప్ర: ఆయిల్ లేకుండా వంటలు రుచిగా ఉంటాయా?  జ: ఖచ్చితంగా! ఇడ్లీ కుక్కర్‌లో స్టీమ్ చేసిన మిర్చి బజ్జీలు లేదా బొండాలు వంటి వాటిని నూనె లేకుండానే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్ర: హార్ట్ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?  జ: 40 ఏళ్లు దాటిన వారు కనీసం 4-5 ఏళ్లకు ఒకసారి 'సిటీ కరోనరీ యాంజియోగ్రామ్' (CT Coronary Angiogram) చేయించుకోవాలి. AI సాయంతో కేవలం 2 నిమిషాల్లోనే రిపోర్ట్ వస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
  చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో 'ఖల్లీ వాతం' అని అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లోనే ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగే ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు చెప్పిన మాటలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం.   కాళ్ల పిక్కలు పట్టేయడానికి ప్రధాన కారణాలు: శరీరంలో వాత దోషం పెరగడం. డీహైడ్రేషన్ లేదా శరీరంలో నీటి శాతం తగ్గడం. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం. విటమిన్లు, ఖనిజాల (మెగ్నీషియం, పొటాషియం) లోపం. డా. చిట్టిభొట్ల సూచించిన అద్భుత ఆయుర్వేద హోం రెమెడీ: ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి మన వంటగదిలో దొరికే మూడు సహజసిద్ధమైన పదార్థాలతో సులువైన మందును తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శొంఠి పొడి (Ginger Powder) మిరియాల పొడి (Black Pepper Powder) జీలకర్ర పొడి (Cumin Powder) తయారుచేసే విధానం మరియు వాడే పద్ధతి: పైన పేర్కొన్న మూడు పదార్థాలను సమాన మోతాదులో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు లేదా మీ వైద్యుల సలహా మేరకు అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఈ చిట్కా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, వాతాన్ని తగ్గించి, కండరాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు వైద్యులు కూడా ఓఆర్ఎస్ తీసుకోమని చెబుతుంటారు. ఓఆర్ఎస్ అనగానే మార్కెట్లో దొరితే  రెడీమేడ్ ఓఆర్ఎస్ గుర్తుకు వస్తుంది.  వీటిని బాగా మరిగించి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలని చెబుతారు.   కానీ వాటిని ప్రతిరోజూ కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఇది మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఓఆర్ఎస్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ, పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. ఓఆర్ఎస్ తయారు చేసే విధానం.. కావలసిన పదార్థాలు..  1 లీటరు శుభ్రమైన లేదా మరిగించిన చల్లటి నీరు  6 టీస్పూన్ల చక్కెర (సుమారు 30 గ్రాములు)  ½ టీస్పూన్ ఉప్పు (సుమారు 3 గ్రాములు) ఎలా తయారు చేయాలి? ముందుగా 1 లీటరు నీటిని మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో లేదా సీసాలో నీళ్ళు పోయాలి. దానికి 6 టీస్పూన్ల చక్కెర , అర టీస్పూన్ ఉప్పు కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలపాలి.  ఇలా చేస్తే ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దీనిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. విరేచనాలు, వాంతులు లేదా అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో  డీహైడ్రేషన్ కలగవచ్చు. ఓఆర్ఎస్ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ గా మార్చడంలో  సహాయపడుతుంది. ఓఆర్ఎస్ లో ఉండే ఉప్పు , చక్కెర శరీరంలో సోడియం, పొటాషియం , ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. డీహైడ్రేషన్  వల్ల కలిగే అలసట, తలతిరగడం , నీరసాన్ని తగ్గించడంలో ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  తీవ్రమైన వేడి , వడగాలుల సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది , అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. విరేచనాలు, వాంతుల సమయంలో పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ చాలా సహాయపడుతుంది. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని నీరు , ఖనిజాల లోపాలను భర్తీ చేయడం ద్వారా వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఓఆర్ఎస్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఓఆర్ఎస్ ను 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు.  ఎల్లప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటిని వాడాలి. ఉప్పు, చక్కెర పరిమాణాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ పరిమాణం హానికరం కావచ్చు. విరేచనాలు, వాంతులు లేదా డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.  చిన్న పిల్లలు , తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఓఆర్ఎస్ ను నమ్ముకోకుండా  వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                         *రూపశ్రీ.