LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్  ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం  కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ  మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది.  ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.   ఈ ప్రజాబాటలో  భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ  సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై  ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు.  వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్  ప్రజలతో నేరుగా  కలిసే అవకాశాలకు తాళం వేసేశారు.   ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే  2024 ఎన్నికల్లో వైసీపీ  కేవలం 11 స్థానాలకే  పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్  భావిస్తోంది.  
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి  కల్వకుంట్ల కవిత.. మాటలతో గారడీ చేసే విద్యను తండ్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె శైలి ఒకింత భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత రాజకీయ ఉనికి కోసం వివాదాస్పద విమర్శల దారి ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు.  ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.   వర్షాల కారణంగా అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కుర్చీ నీరు కారుతోందని, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు పడవల్లో తిరుగుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పవన్ కళ్యాణ్‌తో కవితకు ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే, ఆమె రాజకీయ స్థాయిలో ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ..  ఆమె అమరావతిపై విమర్శలు చేయడంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతంది.   రాజకీయాల్లోని విభజన, ప్రాంతీయత అంశాన్ని  గతంలో కేసీఆర్   వీలైనంతగా వాడుకున్నారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఆమె అమరావతి లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  తన రాజకీయ ఉనికి కోసం కవిత అమరావతిపై విషం కక్కడం వ్యర్థ ప్రయత్నంగా పరిశీలకులు అభివర్ణిస్తుననారు. 
  ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడిన విధేయత, సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా పెద్దల సభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణ, ప్రస్తుత ఎంపీ సానా సతీష్ బాబు, యువ నాయకుడు చింతకాయల విజయ్ స్థానం దక్కించుకున్నారు. శనివారం రాత్రి వీరందరికీ చంద్రబాబు స్వయంగా పార్టీ తరఫున బీ-ఫామ్‌లను అందజేశారు. దీంతో గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యంగా మూడో స్థానం ఎంపికలో పార్టీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు చివరి నిమిషం వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీడీపీ ఇన్‌ఛార్జిగా సాంకేతిక విభాగంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలపై నమోదైన కేసుల ఉపశమనానికి విశేషంగా శ్రమించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినా పొత్తుల వల్ల త్యాగం చేయాల్సి రావడంతో ఇప్పుడు పెద్దల సభకు పంపుతున్నారు. మరో అభ్యర్థి, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ పార్టీ విపక్షంలో ఉన్న కష్టకాలంలో ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ టికెట్ దక్కకపోయినా పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ పదవి దక్కింది. ఇక కాకినాడకు చెందిన సానా సతీష్ బాబు గత ఉప ఎన్నికల్లో కేవలం ఏడాదిన్నర కాలానికే ఎన్నికవ్వడంతో, సామాజిక సమతూకం దృష్ట్యా ఆయనకు చంద్రబాబు మరోసారి పూర్తి కాలానికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాలలో కూటమి ఒప్పందం ప్రకారం మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. జనసేన తరఫున ఇప్పటికే లింగమనేని రమేష్ నామినేషన్ వేయగా, టీడీపీ అభ్యర్థులు సోమవారం తమ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ నేపథ్యంలో ఈ నలుగురి ఎన్నిక కేవలం ఏకగ్రీవంగా పూర్తి కావడం లాంఛనంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో యువతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ముగ్గురు నేతలు గళం విప్పుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
చింతకాయల విజయ్ అంటే కేవలం చింతకాలయ అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసుడు మాత్రమే కాదు.  ఉన్నత విద్యావంతుడు.  విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి, రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఐటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాలపై ఆయనకున్న అవగాహన  టెక్నాలజీని రాజకీయ వ్యూహాల్లోకి ఎలా అమలు చేయాలో  నేర్పింది. ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్,  కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా  రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత   టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో..  సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది. ఆ సమయంలో టీడీపీ ఐటీ వింగ్,  సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను విజయ్ భుజానికెత్తుకున్నారు.  పార్టీ కోసం ఒక పటిష్టమైన సోషల్ మీడియా ఆర్మీని అంటే టీడీపీ డిజిటల్ వింగ్ ను నిర్మించారు.   కేవలం అమరావతి, హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామ స్థాయి వరకు వాట్సాప్, ఎక్స్), ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా పార్టీ లూప్‌ను కనెక్ట్ చేశారు.   అప్పటి అధికార వైసీపీ  ఐప్యాక్   టీమ్ సోషల్ మీడియాలో సంధించే విమర్శలను, ట్రోల్స్‌ను అంతే వేగంగా డిజిటల్ వేదికలపై తిప్పికొట్టడంలో విజయ్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి.  2019, 2024 మధ్య కాలంలో ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినందుకు, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించినందుకు విజయ్ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లను, న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్ సర్కార్  విజయ్‌పై పలు కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు లొంగకుండా ఆయన నిలబడటం, న్యాయపోరాటం చేయడం ద్వారా పార్టీ క్యాడర్‌లో ఆయనపై గౌరవం పెరిగింది. కేవలం ఏసీ రూముల్లో కూర్చునే నేత కాదనీ.. , పార్టీ కోసం కేసులు ఎదుర్కొనే  ఫైటర్  అనీ తెలుగుదేశం క్యాడర్ గుర్తించింది. దీంతో యూత్ లో చింతకాలయ విజయ్ కు ఫాలోయింగ్ పెరిగింది.  ఇక విజయ్ తండ్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ కాలంగా ఉత్తరాంధ్ర   రాజకీయాల్లో బలమైన బీసీ  సామాజికవర్గ నేతగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉండటంతో ప్రత్యక్ష రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ..  ఉత్తరాంధ్రలో పార్టీ యువతను సమూహపరచడంలో విజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్నిటికీ మించి చింతకాయల విజయ్ కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితమైన నాయకుడు కాదు. సాంకేతికతను, సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ డిజిటల్ క్యాడర్‌ను లీడ్ చేసిన అనుభవం ఆయనకుంది. అందువల్లే, నేటి ఆధునిక రాజకీయాల్లో, మారుతున్న ఢిల్లీ సమీకరణాలకు అనుగుణంగా ఇలాంటి  టెక్-సావీ, అలాగే దూకుడుగా వ్యవహరించే యువనాయకుడిగా గుర్తించిన తెలుగుదేశం అధినాయత్వం చింతకాలయ విజయ్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకుంది.  
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించగా  ఆ పార్టీ తమ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ఎంపిక చేసింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం కూడా ఇద్దరు అభ్యర్థుల ఖరారు సజావుగా సాగిపోయింది. మూడో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం సమయం తీసుకుని మరీ  చింతకాయల విజయ్ ను ఖరారు చేసింది. ఈ స్థానం కోసం చివరి నిముషం వరకూ టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పోటీ పడ్డారు.  చివరికి పార్టీ అధినేత చంద్రబాబు చింతకాలయ విజయ్ కే మొగ్గు చూపారు.  ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని  చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.   ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం   అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది. అందుకే ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి పట్టున్న నాయకుడు. ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాతో మాట్లాడాలన్నా, పార్లమెంట్ లో పాయింట్ టు పాయింట్ వాదించాలన్నా విజయ్ లాంటి యంగ్  అయితేనే కరెక్ట్ ఆప్షన్ అని భావించి ఆయనను చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ   గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు.. సోషల్ మీడియా వేదికగానూ,  క్షేత్రస్థాయిలోనూ టీటీడీ వాయిస్ ను  ఐటీ వింగ్   ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే నెక్స్ట్ జనరేషన్ నాయకులను  తయారు చేయాలన్న లక్ష్యంతోనే  చంద్రబాబు   చింతకాయల విజయ్ కు రాజ్యసభ ఇచ్చినట్లు చెబుతున్నారు.   అలాగే.. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో చింతకాయల అయ్యన్నపాత్రుడి కుటుంబం పాత్ర   ఉంది. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా  జాతీయ స్థాయిలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత ఇఇచ్చినట్లు అవ్వడమే కాకుండా..  ఉత్తరాంధ్ర యువతకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద పీట వేసినట్లు అవుతుంది.  అదలా ఉంటే..   దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల విమర్శలను ఒంటిచేత్తో తిప్పికొట్టిన వర్ల రామయ్యకు అన్యాయం జరిగినట్లేనని పార్టీలోని కొందరు అంటున్నారు. అయితే.. "వర్ల రామయ్య గారి సీనియారిటీకి తగని గౌరవం ఇస్తూనే.. ఆయన సేవలను పారటీ రాష్ట్ర రాజకీయాలలోనే ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తోందని అధిష్ఠానం చెబుతున్నది.  అలాగే . వర్ల రామయ్యకు   ఎమ్మెల్సీగా అవకాశమో,  కీలకమైన నామినేటెడ్ పదవో కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  అలాగే  జాతీయ స్థాయిలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకునే చింతకాయల విజయ్ కు రాజ్యసభ చాన్స్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, తమిళనాట రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే వార్తలు అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో, తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ రాఘవ లారెన్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో "తిరుచ్చి ఈస్ట్" నియోజకవర్గం నుండి లారెన్స్ బరిలోకి దిగబోతున్నారంటూ విస్తృతంగా కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై లారెన్స్ స్పందిస్తూ, వీటికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను లోకేష్ కనగరాజ్ సమర్పణలో, భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పూర్తి దృష్టి సినిమాపైనే ఉన్నప్పటికీ, తనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించడానికే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. "జూన్ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు, నా జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తాను అని లారెన్స్ పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అంతేకాకుండా, “మా అమ్మ ఆశీర్వాదంతో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సస్పెన్స్‌ను మరింత పెంచాయి. లారెన్స్‌కు తన తల్లిపై ఉన్న భక్తి, గౌరవం అందరికీ తెలిసిందే. అమ్మ పేరిట ఆయన ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. అలాంటిది అమ్మ ఆశీస్సులతో తీసుకోబోయే ఆ 'పెద్ద నిర్ణయం' రాజకీయాలకు సంబంధించిందా? లేక ఆయన నడుపుతున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరేదైనా భారీ సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. సినీ పరిశ్రమలో లారెన్స్ కేవలం నటుడిగానే కాకుండా, ఎంతోమంది అనాథ పిల్లలకు, వికలాంగులకు అండగా నిలుస్తూ ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కుతుందని కొందరు అభిప్రాయపడుతుండగా, జూన్ 11న రాబోయే ఆ ప్రకటన కోసం అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ తీసుకోబోయే ఆ కీలక నిర్ణయం ఆయన సినీ జీవితాన్ని లేదా సామాజిక ప్రస్థానాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ లైనప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ యంగ్ హీరో, తాజాగా మరో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్‌తో తేజ్ చేయబోయే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక విలక్షణమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు మేకర్స్ 'పార్వేట' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డిజిటల్ స్క్రీన్‌పై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఫేమ్ తేజా కాకమాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఒక అవుట్ అండ్ అవుట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి పెట్టిన 'పార్వేట' అనే టైటిల్ వెనుక ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం దాగి ఉందని టాక్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే సాంప్రదాయ ఉత్సవాన్ని 'పార్వేట' అని పిలుస్తారు. ఈ సాంస్కృతిక విశిష్టతను బేస్ చేసుకుని దర్శకుడు ఈ కథను అద్భుతంగా మలిచినట్లు తెలుస్తోంది. సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న 'సంబరాల ఏటి గట్టు' అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీనితో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లోనూ ఆయన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తేజా కాకమాను సినిమాను కూడా లైన్‌లో పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ సరికొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కథకు సరిపోయే నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వెబ్ సిరీస్‌తో తన మార్క్ చూపించిన యంగ్ డైరెక్టర్, ఇప్పుడు మెగా హీరోను ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తారోనని అభిమానులు ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ క్రేజీ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఫస్ట్ లుక్ మరియు అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సమాయత్తమవుతోంది. ఒకప్పుడు ఒక సినిమా భారీ విజయం సాధిస్తేనే దానికి పొడిగింపుగా సీక్వెల్ గురించి ఆలోచించేవారు. కానీ ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కథను రాసుకునే దశలోనే దానిని మల్టిపుల్ పార్ట్స్‌గా, ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్‌గా మలిచేందుకు టాలీవుడ్ మేకర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే మూడేళ్లలో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ట్రేడ్ వర్గాల తాజా అంచనాల ప్రకారం.. కేవలం ఈ రాబోయే సీక్వెల్స్ మార్కెట్ విలువ, బిజినెస్ పొటెన్షియల్ దాదాపు రూ. 5,000 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ మెగా సీక్వెల్స్ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా రాబోతున్న 'కల్కి 2' షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సలార్' సైతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'సలార్ 2: శౌర్యాంగ పర్వం' షూటింగ్‌ను 2027లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే, 2028 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పక్కా షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'ఓజి'. ముంబై అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు సుజీత్ ఎంతో స్టైలిష్‌గా తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మొదటి భాగానికే ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత డేట్స్‌ను బట్టి 'ఓజి 2' కథను మరింత వైలెంట్‌గా, గ్లోబల్ స్టాండర్డ్స్‌లో సుజీత్ సిద్ధం చేస్తున్నట్లు టాక్. అంతా అనుకూలిస్తే 2027 ద్వితీయార్థంలో ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది. గ్లోబల్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చూపించేలా ఈ స్క్రిప్ట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఇక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా, 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU) కు బలమైన పునాది వేశారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'జై హనుమాన్' చిత్రం ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లింది. మొదటి భాగం సృష్టించిన మైలురాయిని అధిగమించేలా, మరింత భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో బలమైన పురాణ కథాంశంతో ఈ సీక్వెల్‌ను ప్రశాంత్ వర్మ మలుస్తున్నారు. భక్తి, కమర్షియల్ ఎలిమెంట్స్ కలయికగా రాబోతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. దీనితో పాటు సూపర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న 'మిరాయ్' చిత్రానికి కూడా పార్ట్-2 గా 'మిరాయ్ 2' ను అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే తేజ సజ్జాతోనే ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో రాబోతున్న 'జాంబీ రెడ్డి 2' కూడా లైన్ లో ఉంది. ఈ క్రేజీ లైనప్ అంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్స్ ఈ భారీ ఫ్రాంచైజీల అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ చిత్రాల టీజర్స్, ట్రైలర్స్ మరియు రిలీజ్ డేట్స్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త షూటింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామా తదుపరి కీలక షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ విదేశాలకు ప్రయాణం కానుంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెలలో ‘డ్రాగన్’ టీమ్ శ్రీలంకలో ల్యాండ్ అవ్వబోతోంది. అక్కడ ప్లాన్ చేసిన సుదీర్ఘ షెడ్యూల్‌లో తారక్‌పై కొన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారు. ఈ లంక షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన ఒక మేజర్ టాకీ మరియు యాక్షన్ పార్ట్ పూర్తవుతుందని ఇండస్ట్రీ టాక్. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్ గ్లిమ్స్’ సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్రిటీష్ కాలం నాటి అంతర్జాతీయ ఓపియం డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ డార్క్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు తారక్‌ను చూడని ఒక విలక్షణమైన, క్రూరమైన గెటప్‌లో ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ ఎవర్గ్రీన్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని అందిస్తున్నారు.   ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లంక షెడ్యూల్ గురించిన వార్తలు ట్రెండ్ అవుతుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్, వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
  'మంజుమ్మేల్ బాయ్స్' తో  దర్శకుడు చిదంబరం(Chidambaram)సృష్టించిన విషయం తెలిసిందే. కంటెంట్ కి ఉన్న దమ్ము ఏంటో చూపించడమే కాకుండా సినిమానే నమ్ముకున్న మేకర్స్ కి సరికొత్త ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు  జూన్ 19 న  సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్  'బాలన్: ది బాయ్'తో వస్తున్నాడు. ఆవేశం సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న జితు మాధవన్ కథ అందించడం, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 మార్చే డ్యు ఫిల్మ్ విభాగంలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకోవడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోగ్రాండ్‌గా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా  తెలుగు అఫీషియల్ ట్రైలర్‌ని  విడుదల చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. 2 నిమిషాల 29 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఒక తీవ్రమైన సస్పెన్స్, మిస్టరీ క్రైమ్ డ్రామాగా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కథ పరంగా ట్రైలర్ చూస్తే, మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి, ఆ తల్లి ఏం చేస్తుందో తెలియక సతమతమయ్యే ఒక చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు అకస్మాత్తుగా మిస్ అవ్వడం, అతడి కోసం పోలీసులు వెతకడం వంటి అంశాలతో సినిమా చాలా ఇంటెన్సివ్ మూడ్‌ని క్రియేట్ చేసింది. సుషిన్ శ్యామ్ అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, షైజు ఖాలిద్ విజువల్స్ ట్రైలర్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. అయితే విజువల్స్ పరంగా ఎంతో సీరియస్ మూడ్‌ని  క్రియేట్ చేసిన ఈ ట్రైలర్‌కు తెలుగు డబ్బింగ్ మాత్రం అతి పెద్ద మైనస్‌గా మారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తెలుగులో సరైన డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పిస్తే ఎక్కడ బడ్జెట్ పెరిగిపోతుందో అని భావించారో ఏమో కానీ, మేకర్స్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగించి డబ్బింగ్ చెప్పించినట్లు స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. Also read: స్టేజ్‌పై నడుము పట్టుకున్న ఆకతాయి.. చెంప పగలగొట్టిన డాన్సర్ డింపుల్ చౌదరి ఈ ఏఐ డబ్బింగ్ కారణంగా ట్రైలర్‌లోని ఏ ఒక్క డైలాగ్‌లోనూ కనీస ఎమోషన్ కూడా కనెక్ట్ కాలేదని, సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలకి వచ్చే డబ్బింగ్ కూడా దీనికంటే ఎంతో బెటర్‌గా ఉంటుందని సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో, వారు ఇలాంటి ఘోరమైన డబ్బింగ్‌ని ఎలా ఎంకరేజ్ చేశారంటూ టాలీవుడ్ వర్గాలు.ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ డేట్ జూన్ 19 కి ఇంకా సమయం ఉన్నందున, అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు చిత్ర బృందం ఈ భారీ లోపాన్ని గమనించి, థియేట్రికల్ రిలీజ్ నాటికైనా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులతో ఒరిజినల్ ఎమోషన్స్ పండేలా రీ డబ్బింగ్ చేయిస్తారని టాలీవుడ్ సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు.     
Ram Charan's Peddi success celebrations took an adorable turn with his daughter joining them. Upasana Konidela posted a heartwarming reel of entire house staff of Ram Charan and Upasana dancing for Chikiri song. We see them resembling his steps and dancing in their own style.  Even viral bodyguard of Ram Charan joined them. Cutely stopping them all, Klin Kaara's voice in the background wishes Charan on the success and says, "This is For You Nanna. Love You Nanna". The reel is going viral on Internet with many fans getting to hear the voice of Klin Kaara.  Ram Charan and Upasana never shared an image of her face, they have been blurring and keeping her away from social media exposure. But giving a voice note in this fashion makes it heartwarming and pleasant. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
   ఒక ప్రైవేట్ పుట్టినరోజు వేడుక కార్యక్రమానికి ప్రముఖ హరియాణ్వీ స్టేజ్ డాన్సర్ డింపుల్ చౌదరి(Dimple choudhary)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఆమె ఎంతో ఉత్సాహంగా డాన్స్ పెర్ఫార్మ్ ఇస్తుండగా, ఆమెను చూసేందుకు వందలాది మంది గ్రామీణులు, స్థానిక ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఒక  యువకుడు ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకువచ్చి, డాన్సర్ డింపుల్ చౌదరి నడుముని  తాకుతూ  అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ దారుణమైన ఘటనతో డింపుల్ చౌదరి తీవ్ర షాక్‌కి  గురయ్యారు. కానీ ఏమాత్రం భయపడకుండా, వెంటనే ఆ ఆకతాయి చెంప చెళ్లుమనిపించింది. నడిరోడ్డుపై, అందరి ముందూ స్టేజ్ పైనే ఆ కీచకుడి చెంప పగలగొట్టారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. డింపుల్ చౌదరి అక్కడితో ఆగకుండా, వెంటనే మైక్ అందుకుని మహిళా కళాకారుల పట్ల ఇలాంటి అసభ్య ప్రవర్తనని సహించేది లేదని హెచ్చరిస్తూ, పర్ఫార్మెన్స్‌ను మధ్యలోనే నిలిపివేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. Also read: Prabhas: ప్రభాస్ తండ్రి మాకు ముందుగానే చెప్పారు.. ప్రముఖ నిర్మాత వ్యాఖ్యలు వైరల్  డింపుల్ చౌదరి స్వయంగా  ఈ వీడియోని  తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. జూన్ 3 న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి సురేష్ కుమార్‌ను అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథరస్ జిల్లా స్థానిక శాసని పరిధిలోని నగ్లా నాయి గ్రామంలో సంఘటన జరిగింది.సదరు వీడియో యూట్యూబ్ లో వైరల్ కూడా అవుతుంది.  
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం పౌజీ, కల్కి 2 ,స్పిరిట్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ముడు చిత్రాలపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ప్రీవియస్ కెరీర్‌ ని ఒకసారి చూసుకుంటే  భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన  చిత్రాల్లో 2012లో విడుదలైన 'రెబల్' ఒకటి. ఈ సినిమా కమర్షియల్‌గా తీవ్ర నష్టాలని  మిగల్చడమే కాకుండా, అప్పట్లో నిర్మాతలు  దర్శకుడు రాఘవ లారెన్స్ మధ్య ఒక పెద్ద వివాదానికి దారితీసింది. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రెబల్ చిత్ర నిర్మాతలు జె. భగవాన్ మరియు జె. పుల్లా రావు పాల్గొని, ఆనాటి చేదు జ్ఞాపకాలను మరియు లారెన్స్‌తో జరిగిన గొడవలని మరోసారి బహిరంగంగా పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. వాళ్ళు మాట్లాడుతు రెబల్ ని  కేవలం 22.5 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేస్తానని  లారెన్స్  హామీ ఇచ్చాడు.బడ్జెట్ పరిమితులకి లోబడే ఫస్ట్ కాపీని అందిస్తానని లిఖితపూర్వకంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు . అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత లారెన్స్ ప్రవర్తన, సినిమా మేకింగ్ శైలి పూర్తిగా మారిపోయింది. ప్రణాళిక లేని రీషూట్‌లు, షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడం వల్ల సినిమా నిర్మాణం దాదాపు రెండు సంవత్సరాల పాటు సాగింది. దీనివల్ల ప్రాజెక్ట్ ఖర్చు అంచనాలకు మించిపోతూ వచ్చింది. చివరికి  22.5 కోట్ల బడ్జెట్ కాస్తా  40 కోట్లకి చేరుకుంది. అంటే దాదాపు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు పెట్టించాడు. ఆ సమయంలో ప్రభాస్ మార్కెట్ పరిధిని మించి ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం భారీ రిస్క్‌గా మారింది. Also read: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ.. డేట్ ఇదే   సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్న సమయంలోనే రాఘవ లారెన్స్ తన సొంత ప్రాజెక్ట్  'కాంచన' పూర్తి చేసి విడుదల చేసుకున్నాడు. కానీ 'రెబల్'ని మాత్రం నిర్లక్ష్యం చేసాడు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభాస్ పెదనాన్న దివంగత ప్రముఖ నిర్మాత కృష్ణంరాజు గారు ఈ ప్రాజెక్ట్ విషయంలో  ముందే హెచ్చరించారు. లారెన్స్‌తో సినిమా చేసేటప్పుడు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బందులు వస్తాయి" అని ఆయన ముందే తమకు చెప్పారు. కానీ ఆ సమయంలో తాము ఆ హెచ్చరికని  సీరియస్‌గా తీసుకోలేకపోయాం. లారెన్స్‌ను నమ్మి ముందుకు వెళ్లడం వల్లే అంత పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వారు ఓపెన్‌గా అంగీకరించారు. సినిమా మొదటి వారంలో 35 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి, టోటల్‌గా 44 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. దీనివల్ల భారీగా నష్టపోయామని భగవాన్, పుల్లారావు వెల్లడించారు .        
కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు నిర్మించడం మలయాళ చిత్రసీమ స్పెషాలిటీ.  అందుకే చాలా చిత్రాలు తెలుగులోను డబ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి. ఓటిటిలో కూడా వచ్చి రికార్డులు సృష్టిస్తున్నాయి.ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులలో మలయాళ కామెడీ, డ్రామా సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథలతో పాటు సహజత్వానికి దగ్గరగా ఉండటం వలన ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో కేవలం నెల రోజుల క్రితం థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ కామెడీ 'అతిరడి' 'సోనీ లివ్' (SonyLIV) వేదికగా జూన్ 19, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ  అందుబాటులోకి రానుండటం విశేషం.టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ కీ రోల్స్. 2021లో వచ్చిన సూపర్ హీరో చిత్రం 'మిన్నల్ మురళి' తర్వాత టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. కథ విషయానికి వస్తే.. ఇది ఒక ఆసక్తికరమైన క్యాంపస్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అయిన సామ్‌కుట్టి (బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో కొన్నేళ్ల క్రితం ఒక దురదృష్టకరమైన తొక్కిసలాట కారణంగా నిషేధానికి గురైన 'ఆరోహణ్' అనే ప్రతిష్టాత్మక కల్చరల్ ఫెస్టివల్‌ను మళ్లీ ప్రారంభించాలని పట్టుబడతాడు. ఎలాగైనా ఆ ఫెస్ట్‌ని ఘనంగా నిర్వహించి, తన కలలను నిజం చేసుకోవాలని చూస్తుంటాడు. అయితే, అతని ప్రయత్నాలకు ఒక ఊహించని అడ్డంకి ఎదురవుతుంది. గతంలో ఆ కాలేజీ ఫెస్ట్ బ్యాన్ అవ్వడానికి కారణమైన మాజీ రౌడీ, ప్రస్తుత సంగీతకారుడు శ్రీకుట్టన్ వెల్లాయణి (టొవినో థామస్) రూపంలో సామ్‌కుట్టికి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. తన లైవ్ మ్యూజిక్ షోని సక్సెస్ చేసుకోవాలనే ఈగోతో శ్రీకుట్టన్ మళ్లీ పాత రౌడీ అవతారమెత్తి కాలేజీ ఫెస్టివల్‌ని  ఆపాలని చూస్తాడు. Also read: Madhuri dixit: మహిళా క్యారక్టర్లపై మాధురీ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు ఈ ఇద్దరి మధ్య జరిగే ఇగో క్లాషెస్, ఆధిపత్య పోరు మరియు కామెడీ సన్నివేశాలతో దర్శకుడు అరుణ్ అనిరుధన్  అద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాకుండా, సినిమాలో వచ్చే ఒక సర్ప్రైజ్ కామియో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది. విష్ణు విజయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని మరో లెవెల్‌కి  తీసుకెళ్లింది. రియా షిబు, వినీత్ శ్రీనివాసన్, జరిన్ షిహాబ్, షాన్ రెహమాన్, దర్శన రాజేంద్రన్ వంటి స్టార్ కాస్టింగ్ మిగతా క్యారెక్టర్స్ లలో కనిపించారు.   
The buzz around Mahesh Babu’s appearance as Lord Ram in Varanasi continues to grow, and writer Vijayendra Prasad has now added more excitement by speaking about the much-discussed sequence. At the Varanasi To World event, it had already been unveiled that Mahesh Babu would appear as Lord Ram in a major war episode.  Vijayendra Prasad has now further hyped up the sequence by confirming that the stretch will run for nearly 30 minutes and feature a massive clash with Prithviraj Sukumaran’s Kumbhakarna. The veteran writer described the sequence as one of the film’s major highlights and suggested that the battle has been mounted on a grand scale.  Expectations are naturally soaring given Rajamouli’s reputation for staging visually immersive action and elevating confrontations into theatrical spectacles. The Lord Ram–Kumbhakarna battle is already emerging as one of the most talked-about portions of the film.  With Mahesh Babu entering mythological territory and Prithviraj taking on one of the epic’s most powerful characters, the sequence has become a major point of anticipation surrounding Varanasi. Several reports suggest that makers are now concentrating on closing OTT deal on higher pricing than the market is offering at the moment but movie is locked for 7th April 2027 release under any circumstances.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది.  భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు  ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని,  ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే.. కార్మిక హక్కులు.. బ్రిటిష్ పాలన కాలంలో  ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని  వెనుక ఒక  కథ ఉంది. ఆదివారం సెలవు వెనుక కథ.. ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు.  ఎందుకంటే  బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు. 7ఏళ్ల పోరాటం.. కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881,  1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం,  లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది.   జూన్ 10, 1890న, భారతదేశంలో  ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది. ఆదివారం సెలవు వెనుక అసలు కారణం.. ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన,  ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి. ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతి,  హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి,  కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి,  పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి. 1700 సంవత్సరాల చరిత్ర.. ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది  భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్,  తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది.  వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.                                        *రూపశ్రీ.
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు. తరువాత  దాని గురించి పశ్చాత్తాపపడతారు. చాలా వరకు ప్రతి వ్యక్తి తన నిర్ణయం సరైనదని నమ్ముతాడు, కానీ కాలక్రమేణా, వారి భ్రమలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం వారి మనస్సు , మెదడు డైరెక్షన్ ద్వారా నడుస్తుంది.  ఈ విషయాన్ని స్వయానా ఆచార్య  చాణక్యుడు స్పష్టం చేశాడు. మనిషి మనస్సు , మెదడు పూర్తీ సామరస్యంతో లేనంత వరకు, వారి నిర్ణయాలు తప్పు అని రుజువవుతాయని చాణక్యుడు నమ్ముతాడు. మనస్సు , మెదడు సంపూర్ణ సామరస్యంతో లేకపోతే, వారి సొంత మనస్సే వారికి శత్రువుగా మారుతుంది.ఒక వ్యక్తికి తన సొంత మనస్సే శత్రువుగా మారడానికి గల ఐదు కారణాలను ఆచార్యుడు స్పష్టంగా వివరించాడు.  అవేంటో తెలుసుకుంటే.. బాలెన్స్ లేకపోవడం.. నిర్ణయం తీసుకునే సామర్థ్యం  వ్యక్తి యొక్క మనఃస్థితి , మెదడుపై ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటాడు. అందువల్ల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, ఆ నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యక్తి భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.  దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దురశాతో ఆధిపత్యం చెలాయించడం.. దురాశ  మనిషిని  ఆవరించినప్పుడు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చాణక్యుడు చెబుతాడు. లాభాపేక్ష అనే ఆలోచనే మనిషిలో దురాశ పుడుతుంది.   ప్రయోజనాల కారణంగా జరిగే నష్టాల గురించి ఆలోచించరు. ఈ అలవాటు నేటికాలంలో చాలామందిలో చాలా ఎక్కువగా ఉంది.  వ్యాపారవేత్తలు కూడా అధిక లాభాల ఆశతో పెట్టుబడుల నుండి వచ్చే  నష్టాలను తరచుగా పట్టించుకోరు. చాణక్యుని దృష్టిలో, దురాశ , తొందరపాటు మనసును శత్రువుగా మారుస్తాయి. కోపం.. కోపం ముఖ్యమైన సంబంధాలను కూడా క్షణాల్లో విచ్ఛిన్నం చేస్తుంది.  చాణక్యుని ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, ఇతరులు చెప్పే విషయాన్ని వినాలనే ఆసక్తిని కూడా అణిచివేస్తుంది.  కోపంలో ఉన్నప్పుడు మనిషి తన కోపాన్ని బయటకు వ్యక్తం చేస్తాడు అంతే కానీ.. ఆలోచించి  జరిగిన విషయం గురించి ఆలోచించి సమస్యను పెద్దది కాకుండా ఆపే విచక్షణ ఉండదు. అందుకే తన కోపమే తన శత్రువు అని అన్నారు.ఈ కోపం మనిషి మనసును కూడా శత్రువుగా మారుస్తుంది. అతిగా ఎమోషనల్ బాండింగ్.. ఆచార్య చాణక్యుని ప్రకారం మితిమీరిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగపరంగా చాలా గాఢంగా ముడిపడి ఉన్నప్పుడు, వారు నిజానిజాలు సరిచూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పరిస్థితిలో భ్రమల ఏది, నిజం ఏది తెలుసుకోలేరు.  తమ భ్రమ పడే విషయమే నిజం అని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే అపార్థాలు కూడా చాలా సులువుగా వచ్చేస్తాయి. సందేహంతో తీసుకునే నిర్ణయాలు.. చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చాడు. అసంపూర్ణ జ్ఞానం భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది.    పూర్తి నిజం తెలుసుకోకుండా తుది నిర్ణయానికి రావడం చాలా ప్రమాదమని,  దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతాడు. సందేహంతో తీసుకునే   నిర్ణయాలు కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు మనిషిని నష్టానికి దూరంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్తే స్టెంట్ వేయాలని లేదా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఆహార నియమాలతో, ఆపరేషన్లు లేకుండానే గుండె బ్లాకులను తొలగించుకోవచ్చని మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు ఈ VIDEO లో వివరించారు. మనం ఈ మార్పును ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) సాధారణంగా గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే సర్జరీ వైపు మొగ్గు చూపుతాము. అయితే, సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సర్జరీ భయం లేకుండా: స్టెంట్ లేదా బైపాస్ సర్జరీల అవసరం లేకుండానే 20% నుండి 40% వరకు బ్లాకులను సహజంగా తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఎటువంటి ఇంజెక్షన్లు లేదా కెమికల్ మెడిసిన్స్ లేకుండా కేవలం కూరగాయల రసాలు మరియు ఆయుర్వేద పద్ధతులతో చికిత్స పొందవచ్చు. సమగ్ర ఆరోగ్యం: ఇది కేవలం గుండెకే కాదు, షుగర్, బీపీ, మరియు కిడ్నీ సమస్యలను కూడా ఒకేసారి అదుపులోకి తెస్తుంది. ఏమి చేయకూడదు? (What Not to Do?) ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కన్నా ముందు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం: నూనె వాడకం: నూనెతో వేయించిన పదార్థాలను (Oil-fried foods) పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రిజర్వేటివ్స్ మరియు సాల్ట్: బ్రెడ్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బీపీని మరియు కిడ్నీ సమస్యలను పెంచుతాయి. తెల్ల అన్నం మరియు గోధుమలు: కనీసం మూడు నెలల పాటు వైట్ రైస్ మరియు గోధుమలను దూరం పెట్టి, సిరిధాన్యాలు లేదా బార్లీ రొట్టెలు తీసుకోవాలి. పొగత్రాగడం: గుండె సమస్యలకు ప్రధాన కారణమైన స్మోకింగ్ వంటి అలవాట్లను తక్షణమే మానేయాలి. ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గం (How to do?) డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు సూచించిన ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి: 9 వారాల జ్యూస్ థెరపీ: మొదటి వారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ (200 ml). రెండో వారం: సొరకాయ జ్యూస్. మూడో వారం: కీరా (కుకుంబర్) జ్యూస్. ఈ విధంగా ఈ మూడు వారాల చక్రం 9 వారాల పాటు (మొత్తం 3 సార్లు) కొనసాగించాలి. ఆహార నియమాలు (Plate 1 & Plate 2): మొదటి ప్లేట్‌లో కేవలం పండ్లు (బ్లూబెర్రీస్, ఆపిల్, జామకాయ) మరియు మొలకలు తీసుకోవాలి. రెండవ ప్లేట్‌లో నూనె లేకుండా వండిన కూరలు, బార్లీ లేదా రాగి రొట్టెలు తీసుకోవాలి. కిడ్నీ మరియు బీపీ కోసం సహజ టీలు: కొలెస్ట్రాల్ తగ్గడానికి దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. బీపీ అదుపులో ఉండటానికి కరివేపాకు డికాక్షన్ తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు 5 వేపాకులు, 3 రావి ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి మార్పులు: సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవాలి (Barefoot walking), దీనివల్ల పాదాలలోని ఆక్యుప్రెషర్ పాయింట్లు స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణ సందేహాలు (Q&A) ప్ర: డయాలసిస్ ఆపడం సాధ్యమేనా?  జ: అవును, సహజ ఆహారం మరియు వేపాకు, రావి ఆకుల కషాయం వంటి నాచురల్ ట్రీట్‌మెంట్ ద్వారా క్రియాటినిన్ తగ్గించి డయాలసిస్ అవసరం లేకుండా చేయవచ్చని డాక్టర్ గారు అబ్సర్వ్ చేశారు. ప్ర: ఆయిల్ లేకుండా వంటలు రుచిగా ఉంటాయా?  జ: ఖచ్చితంగా! ఇడ్లీ కుక్కర్‌లో స్టీమ్ చేసిన మిర్చి బజ్జీలు లేదా బొండాలు వంటి వాటిని నూనె లేకుండానే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్ర: హార్ట్ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?  జ: 40 ఏళ్లు దాటిన వారు కనీసం 4-5 ఏళ్లకు ఒకసారి 'సిటీ కరోనరీ యాంజియోగ్రామ్' (CT Coronary Angiogram) చేయించుకోవాలి. AI సాయంతో కేవలం 2 నిమిషాల్లోనే రిపోర్ట్ వస్తుంది.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166     మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
  చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో 'ఖల్లీ వాతం' అని అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లోనే ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగే ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు చెప్పిన మాటలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం.   కాళ్ల పిక్కలు పట్టేయడానికి ప్రధాన కారణాలు: శరీరంలో వాత దోషం పెరగడం. డీహైడ్రేషన్ లేదా శరీరంలో నీటి శాతం తగ్గడం. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం. విటమిన్లు, ఖనిజాల (మెగ్నీషియం, పొటాషియం) లోపం. డా. చిట్టిభొట్ల సూచించిన అద్భుత ఆయుర్వేద హోం రెమెడీ: ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి మన వంటగదిలో దొరికే మూడు సహజసిద్ధమైన పదార్థాలతో సులువైన మందును తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శొంఠి పొడి (Ginger Powder) మిరియాల పొడి (Black Pepper Powder) జీలకర్ర పొడి (Cumin Powder) తయారుచేసే విధానం మరియు వాడే పద్ధతి: పైన పేర్కొన్న మూడు పదార్థాలను సమాన మోతాదులో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు లేదా మీ వైద్యుల సలహా మేరకు అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఈ చిట్కా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, వాతాన్ని తగ్గించి, కండరాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు వైద్యులు కూడా ఓఆర్ఎస్ తీసుకోమని చెబుతుంటారు. ఓఆర్ఎస్ అనగానే మార్కెట్లో దొరితే  రెడీమేడ్ ఓఆర్ఎస్ గుర్తుకు వస్తుంది.  వీటిని బాగా మరిగించి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలని చెబుతారు.   కానీ వాటిని ప్రతిరోజూ కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఇది మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఓఆర్ఎస్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ, పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. ఓఆర్ఎస్ తయారు చేసే విధానం.. కావలసిన పదార్థాలు..  1 లీటరు శుభ్రమైన లేదా మరిగించిన చల్లటి నీరు  6 టీస్పూన్ల చక్కెర (సుమారు 30 గ్రాములు)  ½ టీస్పూన్ ఉప్పు (సుమారు 3 గ్రాములు) ఎలా తయారు చేయాలి? ముందుగా 1 లీటరు నీటిని మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో లేదా సీసాలో నీళ్ళు పోయాలి. దానికి 6 టీస్పూన్ల చక్కెర , అర టీస్పూన్ ఉప్పు కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలపాలి.  ఇలా చేస్తే ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దీనిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. విరేచనాలు, వాంతులు లేదా అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో  డీహైడ్రేషన్ కలగవచ్చు. ఓఆర్ఎస్ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ గా మార్చడంలో  సహాయపడుతుంది. ఓఆర్ఎస్ లో ఉండే ఉప్పు , చక్కెర శరీరంలో సోడియం, పొటాషియం , ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. డీహైడ్రేషన్  వల్ల కలిగే అలసట, తలతిరగడం , నీరసాన్ని తగ్గించడంలో ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  తీవ్రమైన వేడి , వడగాలుల సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది , అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. విరేచనాలు, వాంతుల సమయంలో పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ చాలా సహాయపడుతుంది. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని నీరు , ఖనిజాల లోపాలను భర్తీ చేయడం ద్వారా వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఓఆర్ఎస్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఓఆర్ఎస్ ను 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు.  ఎల్లప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటిని వాడాలి. ఉప్పు, చక్కెర పరిమాణాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ పరిమాణం హానికరం కావచ్చు. విరేచనాలు, వాంతులు లేదా డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.  చిన్న పిల్లలు , తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఓఆర్ఎస్ ను నమ్ముకోకుండా  వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                         *రూపశ్రీ.