LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అతనిపై ఉపా  కేసు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యల ఆధారంగా ఏకంగా దేశద్రోహం, తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ  ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు    తాజా వ్యాఖ్యలు, హోమ్ శాఖకు ఆయన చేసిన హెచ్చరికలపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రశ్నరావణ్ పై ఉపా కేసు కేవలం..  ఒక యూట్యూబర్ అభ్యంతరకర వ్యాఖ్యలకు పరిమితం కాలేదనీ,  దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రావణ్‌కు ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపా చట్టాన్ని ప్రయోగించిందని విమర్శలు వస్తున్న వేళ భరద్వాజ..  సాధారణ ఐపీసీ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉపా కేసు పెట్టడంతో..  సంవత్సరాల తరబడి జైల్లో ఉంచాలనే కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.  ఏపీ ఇంటెలిజజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో కొన్ని వీడియోలు ఎడిట్ చేసినవని, కాంటెక్స్ట్ (సందర్భం) మార్చి రూపొందించిన లింకులను న్యాయస్థానానికి సమర్పించారని ఆయన చెప్పారు. ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే..  న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు. రాజకీయంగా చూస్తే..  ఈ మొత్తం ఎపిసోడ్‌ను జనసేన వర్సెస్ రావణ్ వివాదంగా మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని భరద్వాజ అన్నారు. టీడీపీ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా, జనసైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వివాదాన్ని వైసీపీకి  ముడిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రావణ్‌కు జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి, వైసీపీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.  యూట్యూబ్‌లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసభ్య పదజాలం వాడటం కచ్చితంగా తప్పే అయినప్పటికీ, చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని భరద్వాజ అన్నారు. కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోకుండా, సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న అధికార, ప్రతిపక్షాలకు చెందిన అందరు యూట్యూబర్లపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ఈ ఉపా కేసు వ్యవహారం విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలకు దారితీసింది. ప్రభుత్వం చట్టాన్ని ఆయుధంగా మార్చుకుని పౌర హక్కులను కాలరాస్తోందనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.   Youtuber Ravan Arrest, UAPA Case on Ravan, Pawan Kalyan, Chandrababu Naidu, Jagan Mohan Reddy, AB Venkateswara Rao, Journalist Bharadwaj Analysis, AP Politics
వాస్తవ వేదిక.. తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పడు  కిచెన్ క్యాబినెట్,  కోటరీ అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత   జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చుట్టూ ఉన్న ఆ ముఠాలు ఎవరు?  గ్రౌండ్ రియాలిటీకి, ప్రజా కోణానికి వారు పార్టీల  నేతలను ఎంత దూరం చేస్తున్నారు? అనే అంశాలపై తెలుగువన్ వాస్తవ వేదికలో   జమీన్ రైతు, డోలేంద్ర  ప్రసాద్ ' తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంక్ లు విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   రాజకీయ వ్యూహకర్తలు, కోటరీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న అపకారంపై వారు కూలంకషంగా చర్చించారు.  గతంలో  ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు వంటి అగ్రనేతలు క్షేత్రస్థాయి నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారన్న డోలేంద్ర ప్రసాద్.. ఒక సాధారణ వ్యక్తి ఎదురైనా పిలిచి మాట్లాడి రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ఓపెన్ మైండ్ నాటి ప్రధానులకు ఉండేదన్నారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ తన పాత కోటరీని పక్కన పెట్టి అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్ వంటి కార్పొరేట్ మైండ్స్ ఉన్న వ్యక్తులను కిచెన్ క్యాబినెట్‌లో పెట్టుకున్నారో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు డిస్కనెక్ట్ అయి తీవ్రంగా నష్టపోయిందని  ఉదాహరణలతో వివరించారు. ఇప్పుడు ఇదే తరహా కోటరీ సంస్కృతి   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తోందన్నారు డోలేంద్ర ప్రసాద్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి నమ్మకస్తులైన, రాజకీయ అనుభవజ్ఞులైన కోటరీని  జగన్ పూర్తిగా పక్కన పెట్టేసి భూస్థాపితం చేశారని విమర్శించారు. మరోవైపు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు నాటి సీనియర్లను కాదని, తన చుట్టూ ఒక కొత్త కోటరీని ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.  కిచెన్ క్యాబినెట్లలో ఉన్న వ్యక్తులకు కనీసం ఒక పంచాయతీ వార్డు మెంబర్‌గా గెలిచిన అనుభవం కూడా లేదన్నారు.  ప్రజలతో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎలాంటి సంబంధం లేని ఈ సరికొత్త నాయకులు కేవలం పగలు పైరవీలు, రాత్రికి డిన్నర్ పార్టీలకే పరిమితమవుతున్నారన్నారు ఇలాంటి వారి వల్ల ప్రజలకు,  నేతలకు మధ్య ఉండాల్సిన కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతోందని విశ్లేషించారు. రాబిన్ శర్మ, ప్రశాంత్ కిశోర్, సునీల్ వంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీమ్‌లు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అపకారం చేస్తున్నాయన్నారు. వీరు  మ్యానుఫ్యాక్చర్డ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే కృత్రిమ ప్రజాభిప్రాయాన్ని సృష్టిస్తూ సోషల్ మీడియా, కంట్రోల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా లేని ప్రజాదరణను ఉన్నట్లు చూపిస్తున్నారనీ,  ఈ తప్పుడు నివేదికలను, గ్రాఫ్ లను  అధినేతలు మాత్రమే నమ్ముతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అసలైన ప్రజాభిప్రాయం వేరుగా ఉంటుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ దశలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్..  తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ,  తాను  2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు. దీనికి డోలేంద్రప్రసాద్..   రాజకీయాల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ సంస్థల చేత సర్వేలు చేయించుకునే నేతలు..  నిజాయితీగా గ్రౌండ్ రియాలిటీ చెప్పే విశ్లేషకుల మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.  అధినేతలు ఇప్పటికైనా కృత్రిమ కోటరీలను పక్కన పెట్టి, ప్రజలతో మమేకమయ్యే నేతలను దగ్గరకు చేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర  నష్టాలు తప్పవని చెప్పారు.  AP Politics, YS Jagan Coterie, Nara Lokesh Kitchen Cabinet, Political Analyst Dorendra Prasad, Teluguone MD Ravishankar, Telugu One News Political Debate
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి,  వైసీపీ సీనియర్ నాయకుడు   కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి తప్పించుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.  అదే సమయంలో వైసీపీలో తన ఇంపార్టెన్స్ తగ్గకుండా, పార్టీ క్యాడర్ తనను మరచిపోకుండా  క్రమం తప్పకుండా మీడియా ముందుకు వస్తూ.. ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో  వార్తలలో ఉంటున్నారు.  తాజాగా గుడివాడలో  కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.  ప్రశ్న రావణ్ కేసు విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.  యూట్యూబర్ రావణ్  తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని, ఆయన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడుల కోసమే పనిచేస్తాడని ఆరోపించిన కొడాలి నాని..  ప్రశ్న రావణ్ టిడిపి నాయకులకు వ్యతిరేకంగా ఒక్కవ్యాఖ్య కూడా చేయలేదని కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పారు.  వైసీపీ అధికారంలో  ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారంలో లేని సమయంలోనూ కూడా ప్రశ్న రావణ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా.. తాము ఎప్పుడూ అతడిని అణచివేయడానికి ప్రయత్నించలేదని చెప్పుకొచ్చారు.   అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిని కొత్త చట్టాల పరిధిలోకి తెస్తూ, 'ఉప్మా', 'ఇడ్లీ' కేసులు పెడుతూ జైళ్లలో పెడుతోందంటూ సెటైర్లు వేశారు.  అయితే నాని వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మాత్రం వేరే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలుగుదేశం, జనసేన చెలిమిని చెడగొట్టాలన్న వ్యూహంతోనే కొడాలి నాని.. ప్రశ్న రావణ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం ఉందన్న వాదనను తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు.  అయితే జనం కొడాలి నాని కుట్ర సిద్ధాంతాన్ని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. మిత్రపక్షమైన జనసేన అధినేతకు వ్యతిరేకంగా ప్రశ్న రావణ్ ను తెలుగుదేశం ప్రోత్సహిస్తోందన్న నేరేటివ్ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.  అయితే వైసీపీ ఎకోసిస్టమ్ లోనే పచ్చి అబద్ధాన్ని ఎవరు నమ్మినా నమ్మకున్నా పదే పదే వల్లె వేస్తే కొందరైనా ఆ ఉచ్చులో పడకుండా ఉంటారా?  అనన భావనతో ముందుకు వెళ్లే సంస్కృతి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే కొడాలి నాని  ఇప్పుడు ప్రశ్న రావణ్ వెనుక తెలుగుదేశం అనే కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. ఇక కొంత కాలం పాటు వైసీపీ ముక్తకంఠంతో ఈ ఆరోపణలను గుప్పిస్తూనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద కొత్త కొత్త కుట్ర సిద్ధాంతాలను తెరమీదకు తీసుకురావడంలో వైసీపీలోకోడాలి నానిది ఒక ప్రత్యేక స్టైల్ అని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.   Kodali Nani, Pawan Kalyan, Chandrababu Naidu, TDP Janasena Alliance, YouTuber Ravan Arrest
ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అద్భుత విజయాలను సాధించింది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో  పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలలో ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది.. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీలో 5 వేల కోట్ల రూపాయల  పెట్టుబడితో   తన మూడో భారతీయ ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికే ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుండగా, దీని ద్వారా  పదిహేనువందల మంది ఐటీ, ఎలక్ట్రానిక్స్ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే  వైజాగ్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీపీ) ఏర్పాటు చేయాల్సిందిగా ఎల్‌జీ ప్రతినిధులను లోకేష్ కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపాక్ట్  వైజాగ్ వేదికగా ఏసిప్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో   468 కోట్ల పెట్టుబడితో  ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ద్వారా ఏడాదికి 96 మిలియన్ల సెమీకండక్టర్ పరికరాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు ఏపీ యువతకు సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్  సాంకేతికతల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు అపాక్ట్ అంగీకరించింది. ఆటోమొబైల్,  స్మార్ట్ హెల్త్‌కేర్ విభాగాలలో కూడా ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ టెక్నాలజీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్  ప్రతినిధులతో లోకేష్ జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి.  తిరుపతి లేదా అనంతపురం పరిసనాలకల్లో..  ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి హ్యుందాయ్ హెబిస్ ముందుకు వచ్చింది.   అలాగే రూ. 300 కోట్ల పెట్టుబడితో సరికొత్త స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్ ఉత్పాదక రంగాన్ని ప్రారంభించేందుకు షూఆల్స్  సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో 3 వేలకు పైగా  కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు సోలమ్ గ్రూప్   శ్రీసిటీలో  338 కోట్ల రూపాయల అంచనాతో ఈవీ ఛార్జర్ పవర్ మోడ్యూల్స్,  ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సౌకర్యాన్ని వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో స్టార్టప్ ఇకోసిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు అమరావతి వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్  ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను సృష్టించి, ఒక లక్ష ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ ప్రకటించారు.  వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ అనే అద్భుతమైన విజన్‌తో కొరియా దేశపు ఇన్నోవేటివ్ స్టార్టప్‌లను ఏపీకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఇండియా, కొరియా స్టార్టప్ కారిడార్, అలాగే  ప్రత్యేక కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని క్వాంటం మరియు ఏఐ క్యాపిటల్‌గా మార్చేందుకు సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల ఏర్పాటుకు ఆహ్వానించారు. మొత్తంగా గత 24 నెలల్లో దాదాపు 240 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ కీలక ప్రగతి సాధించిందని, ఈ కొరియా పర్యటన రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని లోకేష్ పేర్కొన్నారు. Nara Lokesh South Korea Tour, AP Investments 2026, LG Sri City Plant, APACT Semiconductor AP
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంఒక వినూత్న తరహా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా..  ఈసారి హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  ఒకవేళ ఇదే జరిగితే..  సైబరాబాద్,  మల్కాజ్‌గిరి కంటే ముందే జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలను నవంబర్ నెలలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్,  తుది తేదీలపై  స్పష్టత రావాల్సి ఉంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ   బీఆర్ఎస్   ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ   48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం  44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పు చోటు చేసుకుంది.   ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.  ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ..  గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే తెరవెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.  ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం..  శాంతిభద్రతల సమస్యలు, రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం  జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికల ప్లాన్ ను తెరపైకి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ఐటీ హబ్ అయిన సైబరాబాద్, అత్యంత పెద్ద నియోజకవర్గ పరిధి కలిగిన మల్కాజ్‌గిరిలను పక్కన పెట్టి, మొదట కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీపైనే ఫోకస్ పెట్టడం వెనుక  పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.   Hyderabad Municipal Elections, GHMC Polls 2026, Telangana Political News, Cyberabad Elections
ALSO ON TELUGUONE N E W S
  తెలుగు సినిమా రంగంలో 'చిరంజీవి'(Chiranjeevi)అనే పేరుకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఎన్ని దశాబ్దాలు దాటుతున్న అదే క్రేజ్. 70 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు. పోటీ ఇవ్వడమే కాదు.. వాళ్ళని బీట్ చేసి తనని క్రాస్ చేయలేని విధంగా దూసుకుపోతున్నాడు. ప్రీవియస్ హిట్ మన శంకర వరప్రసాద్ గారునే ఉదాహరణ. ప్రస్తుతం బాబీ కొల్లి దర్సకత్వంలో తన 158 వ చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ సెట్‌లో చిరంజీవి చూపిస్తున్న నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి  సంబంధించిన రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో అత్యంత వేగంగా, శరవేగంతో జరుగుతోంది. ఈ  సరికొత్త షెడ్యూల్‌లో ఒక భారీ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌  ప్లాన్ చేశారు. ఇక్కడే మెగాస్టార్ తన అసలైన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్‌ డిజైన్ చేశారు. ఈ భారీ వింటేజ్ యాక్షన్ ఎపిసోడ్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక రోమాంచితమైన వర్షం బ్యాక్‌డ్రాప్ (Rain Action Scene) లో సాగే ఫైట్. కండలు తిరిగిన యువకులే చలిలో, వర్షంలో గంటల తరబడి ఫైట్లు చేయడానికి వెనకాడుతుంటారు. అలాంటిది 70 ఏళ్ల వయసులో చిరంజీవి ఏమాత్రం డూప్ లేకుండా, స్వయంగా తానే రంగంలోకి దిగి ఈ రిస్కీ స్టంట్లను పూర్తి చేస్తుండటం విశేషం. ఈ వర్షం ఫైట్ సీన్ కోసం చిరంజీవి గంటల తరబడి తడుస్తూ, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో శత్రువులను చీల్చిచెండాడుతున్న తీరు చూసి సెట్స్‌లోని యూనిట్ సభ్యులంతా రోమాంచితం అయ్యారు. ఈ వయసులోనూ ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం, కష్టపడే తత్వం చూసి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్' అనే పవర్‌ఫుల్ టాగ్‌లైన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చిరంజీవి పాత్ర చాలా రౌద్రంగా, వైల్డ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సినిమా కోసం చిరంజీవి పడ్డ ఫిజికల్ మేకోవర్ శ్రమ కూడా సామాన్యమైనది కాదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మెగాస్టార్ జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తూ కఠినమైన వర్కవుట్లు చేశారు. ఆ 60 సెకన్ల జిమ్ వీడియో సోషల్ మీడియాలో విడుదలైనప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అయింది. Also read: Pawan kalyan: రేపు ముంబైకి పవన్ కళ్యాణ్.. ఎన్నో రోజులు ఉంటారంటే గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తెగా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే 'జైలర్', 'డాకు మహారాజ్' వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన విజయ్ కార్తీక్ కన్నన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సాంకేతికంగానూ ఎక్కడా రాజీ పడకుండా విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని, గుండెల్లో ప్యాషన్ ఉంటే ఎంతటి రికార్డులనైనా తిరగరాయవచ్చని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపిస్తున్నారు. థియేటర్లలో ఈ వర్షం ఫైట్ సీన్ చూస్తున్నప్పుడు అభిమానులకి  పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.  chiranjeevi, bobby, mega 158
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఇటీవల తన అప్ కమింగ్ మూవీ 'ఓజి 2' కి సంబంధించిన పనులని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కి సంబంధించిన ఒక కీలకమైన వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ చికిత్స నిమిత్తం రేపు ముంబై నగరానికి వెళ్తున్నారు.  పవన్ రెండు భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు 'రొటేటర్ కఫ్' (Rotator Cuff) అనే నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి అయిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఇప్పటికే ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల అనంతరం ఆయన రెండు భుజాల కండరాలు చిట్లిపోయినట్లు మరియు గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు అక్కడి నిపుణులైన వైద్యులు నిర్ధారించారు. భుజాల కండరాల పరిస్థితి జఠిలంగా మారడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే  ప్రత్యేక వైద్య చికిత్స తీసుకోవాలని వైద్య బృందం ఆయనకు గట్టిగా సూచించింది. చికిత్స పూర్తయిన తర్వాత కచ్చితంగా కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవడం అత్యంత అవసరమని కూడా డాక్టర్లు స్పష్టం చేశారు. Peddi: ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది.. థియేటర్ వర్షన్‌కి, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కి తేడాలు ఇవే! నిజానికి పవన్ కళ్యాణ్ గత ముంబై పర్యటనలోనే తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ఈ ఆసుపత్రిని సందర్శించి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు అప్పుడే సర్జరీకి సిఫార్సు చేసినప్పటికీ, అప్పటికే షెడ్యూల్ అయిన పలు అధికారిక, పాలనాపరమైన కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమీక్షలు ఉండడం వల్ల ఆయన కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకవైపు ప్రభుత్వ శాఖల సమీక్షలు, మరోవైపు ప్రజా పర్యటనలు, దీనికి తోడు పాత సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఒత్తిడి కారణంగా ఆయన తన ఆరోగ్యాన్ని కొంతవరకు నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. ఈ విపరీతమైన శారీరక శ్రమ మరియు ఒత్తిడి కారణంగానే రెండు భుజాల కండరాల గాయం మరింత తీవ్ర రూపం దాల్చింది. అయితే ఇప్పుడు ముందుగా నిర్ణయించుకున్న అత్యవసర పాలనాపరమైన బాధ్యతలను ఒక కొలిక్కి తెచ్చిన పవన్ కళ్యాణ్, చివరకు తన భుజాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముంబైలో చికిత్స పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ చికిత్స అనంతరం ఆయన కొద్దిరోజుల పాటు రాజకీయాలకు, పర్యటనలకు దూరంగా ఉండి పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోనున్నారు. జనసేనాని త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.  pawan kalyan, og2, mumbai
Rashmika Mandanna is pushing herself physically for her upcoming pan-India action thriller Mysaa. The actress is currently filming a demanding underwater action sequence, and her commitment to performing the stunt herself has become a major talking point within the industry. According to the makers, Rashmika spent nearly 20 hours underwater over two days to complete the high-intensity sequence. Instead of opting for an action double, she reportedly performed the entire fight on her own after undergoing extensive preparation for the challenging shoot. Filming action scenes underwater is considered one of the most technically demanding aspects of filmmaking, requiring precise coordination, breath control and stamina. The production team says Rashmika's dedication throughout the schedule impressed not only the film's crew but also the specialised underwater technicians and the cinematography team, who witnessed the sequence firsthand. Mysaa is directed by Rawindra Pulle and produced by Ajay and Anil Sayyapureddy as a pan-India action entertainer. While the makers have been highlighting the film's large-scale action set pieces, this underwater sequence is expected to be one of its major attractions. With Mysaa, Rashmika appears to be exploring a more action-oriented role than ever before. If the effort behind the sequence translates effectively on screen, the film could showcase a new side of the actress and add another ambitious female-led action film to Indian cinema. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై సత్తా చాటిన పెద్ది(Peddi)ఏ రోజు నుంచి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా  స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా 450 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించిన పెద్ది ఓటిటిలో కూడా తన సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ త్వరలోనే రాబోతోందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అయితే థియేటర్లలో చూసిన పెద్దికి  ఓటీటీ పెద్దికి మధ్య  కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. ముఖ్యంగా రన్‌టైమ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. థియేటర్లలో ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా ఉండగా,  రన్‌టైమ్‌ని  3 గంటల 5 నిమిషాలుగా అప్‌డేట్ చేశారు. అంటే దాదాపు 4 నిమిషాల నిడివి గల కొన్ని  సన్నివేశాలను డిజిటల్ వెర్షన్ నుండి తొలగించారు. అదే సమయంలో థియేట్రికల్ రిలీజ్ సమయంలో జాన్వీ కపూర్ క్యారక్టర్ కి  సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వివాదాస్పద సీన్లు, డైలాగులు  ఓటీటీ వెర్షన్‌లో చాలా సున్నితంగా ఎడిట్ చేసి సరిచేశారు.  మరోవైపు థియేటర్లలో కట్ అయిపోయిన కొన్ని ఎమోషనల్ బిట్స్ ,చరణ్ క్రికెట్ ప్రాక్టీస్ సీన్స్‌ని  ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేసినట్లు సమాచారం. ఈ సరికొత్త ఎడిటింగ్ పెద్దికి సరికొత్త ఫీల్‌ని  ఇస్తోంది. డబ్బు కోసం మాత్రమే ఆడే ఒక సాధారణ క్రీడాకారుడు, తన గ్రామం యొక్క ఆత్మగౌరవం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టే ఒక నిబద్ధత గల క్రీడాకారుడిగా ఎలా మారాడనే కోణంలో దర్శకుడు బుచ్చిబాబు సానా కథని ఎమోషనల్ గా నడిపించారు. Also read: Trikala: త్రికాల ఓటీటీలోకి వచ్చేసింది.. అమ్మవారి దైవత్వాన్ని మిస్ అవ్వకండి   పెద్ది క్యారక్టర్  కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు చరణ్ కనుబొమ్మకు తీవ్రమైన గాయమై ఎనిమిది కుట్లు పడ్డాయి. కంటికి తృటిలో ప్రమాదం తప్పినప్పటికీ, ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా షూటింగ్‌లో పాల్గొనడం చరణ్ అంకితభావానికి నిదర్శనం. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి కఠినమైన శిక్షణ పొందడం, అర్ధరాత్రి వరకు షూటింగ్‌లో పాల్గొనడం వంటి చరణ్ శ్రమను చూసి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సైతం గర్వపడ్డారు. సినిమాలో గ్లామర్ అండ్ ఎమోషనల్ టచ్ ఇస్తూ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించని అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. "ఆట మారొచ్చు కానీ మొనగాడు మాత్రం మారడు" అంటూ నెట్‌ఫ్లిక్స్ వదిలిన ఈ స్పోర్ట్స్ డ్రామాని  ఈ వీకెండ్‌లో హోమ్ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి ఓటీటీ ప్రియులు సిద్ధమవుతున్నారు.  peddi, ram charan, janvi kapoor, sivaraj kumar, buchibabu sana
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘అగధ’. ఈ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. ‘అగధ’ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఆ మధ్య విడుదలైన ‘అగధ’ టీజర్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ వాతావరణం, గ్రాండియర్ మేకింగ్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 14 మిలియన్ల మంది ఈ టీజర్ ని వీక్షించారంటేనే, ఎంతలా ప్రేక్షకుల్లోకి రీచ్ అయ్యిందో అర్థమవుతోంది.  ‘అగధ’ గురించి దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, "అగధ నా డ్రీమ్ ప్రాజెక్ట్. టీజర్‌లో చూసింది ఈ సినిమా ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే. సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ వండర్‌లా అనిపించే సినిమా. అలాగే ఎమోషన్స్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. ప్రేక్షకులు థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఓ ఎమోషనల్ రోలర్ కోస్ట్ రైడ్ లా రూపొందిన ‘అగధ’ చిత్రం ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది" అని తెలిపారు. నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, "అగధను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాం. టీజర్‌కు వచ్చిన స్పందన మా ఆనందాన్ని మరింత పెంచింది. ఆగస్ట్ 14న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం" అన్నారు. నటి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, "మహాదేవి పాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది" అన్నారు. హీరో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, "డర్టీ హరి తర్వాత మళ్లీ ఎం.ఎస్. రాజు గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘అగధ’లో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి" అన్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నాని చమిడిశెట్టి, ఎడిటర్ గా జునైద్ సిద్ధిఖీ వ్యవహరిస్తున్నారు.     MS Raju, Agadha Movie, Kamakshi Bhaskarla, TeluguOne  
  సెల్యులాయిడ్ పై అలరించిన వైవిద్యభరితమైన పలు చిత్రాలు ఓటిటి వేదికగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వాటిల్లో ఆధ్యాత్మిక, సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం 'త్రికాల'(Trikala) (ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్). శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, నటుడు అజయ్ కీ రోల్స్ పోషించగా  ఏఏ రోజు నుంచి  ప్రముఖ సౌత్ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మణి తెల్లగుటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఈ ఏడాది మే 28న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సనాతన ధర్మం, ప్రాచీన రహస్యాలు, కాల గమనం చుట్టూ తిరిగే ఈ కథ ఇప్పుడు ఓటీటీ వీక్షకులను థ్రిల్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కథ పురాణ కాలానికి చెందిన అద్భుతమైన 'కుమారి ఖండం' అనే పౌరాణిక ప్రదేశం నుండి ప్రారంభమవుతుంది. అక్కడ ఉండే శక్తివంతమైన మునులు లోకానికి అత్యంత ప్రమాదకరమైన కొన్ని దైవిక గ్రంథాలను రహస్యంగా దాచి ఉంచుతారు. అలాగే చెడు శక్తులను అంతం చేయడానికి 'శక్తి ఏథా' అనే ఒక దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని త్రికాల్ వర్మ అనే పరాక్రమవంతుడైన యోధుడికి అప్పగిస్తారు. ఆ యోధుడు దుష్ట శక్తులతో పోరాడుతూ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. అయితే కలియుగంలో మళ్లీ ఆ రాక్షస శక్తులు, చీకటి సామ్రాజ్యం తిరిగొస్తుందని ముందుగానే ఊహించిన ఆ మునులు, త్రికాల్ వర్మ ఆత్మను ఒక విశ్వగుడ్డు (Cosmic Egg) లో భద్రపరుస్తారు. ప్రపంచానికి అవసరమైనప్పుడు అతను మళ్లీ మేల్కొంటాడని వారు నమ్ముతారు. ప్రస్తుత కాలానికి వస్తే, ఈ కథ మూడు విభిన్న జీవితాల చుట్టూ తిరుగుతుంది. తన ప్రియురాలు నిధి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో, ఆమె కోసం వెతికే శివ అనే యువకుడికి ఒక వింతైన మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ వెనుక ఏదో అతీతమైన సూపర్ నేచురల్ శక్తి దాగి ఉంటుంది. మరోవైపు వైతరణ్ అనే వ్యక్తి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ, ఒక పెద్ద పాత బంగళాలో ఆత్మగా మారి సంచరిస్తూ ఉంటాడు. ఆ ఆత్మే పూర్వజన్మలో వీరయోధుడు త్రికాల్ వర్మ అని ఆ తర్వాత తెలుస్తుంది. ఇక మూడవ పాత్ర అయిన సైకియాట్రిస్ట్ మాయ, ఈ వింత సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని అన్వేషించడానికి రంగంలోకి దిగుతుంది. Also read: payal raj put: పాయల్ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్.. ప్రైవేట్ కంటెంట్ తో డబ్బు కోసం హద్దులు దాటాలా! ఇలాంటి సమయంలోనే ఒక పురాతన రాక్షస రాజు భూమిపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతుంటాడు. ఆ రాక్షస శక్తులకు తోడుగా ఒక రహస్య తాంత్రిక ముఠా ఆ విశ్వగుడ్డును దక్కించుకుని, అందులోని శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. అటు శివ అన్వేషణ, ఇటు మాయ ఇన్వెస్టిగేషన్, మరియు త్రికాల్ వర్మ పునర్జన్మ.. ఈ మూడూ ఒకే చోట ఎలా కలిశాయి? వెలుగుకి, చీకటికి మధ్య జరిగిన ఆ మహా యుద్ధంలో లోకం ఎలా రక్షించబడింది అనేది ఈ 'త్రికాల' కథ. సైన్స్, మైథాలజీ మరియు హారర్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ చిత్రాన్ని అసలు మిస్ అవ్వకండి.  
Fresh off the success of Shambhala, Aadi Sai Kumar has moved on to his next project, Sairabanu. The makers have announced the completion of the film's first shooting schedule by releasing a behind-the-scenes video that offers a glimpse into the making of the romantic entertainer. The BTS video showcases the camaraderie on the sets while teasing the film's light-hearted tone. Aadi Sai Kumar, Bandhavi Sridhar and comedian Vennela Kishore are seen filming several comic moments, indicating that humour will be a key element of the narrative. Directed by Phani Krishna Siriki, Sairabanu is built around an unconventional love story between a Hindu boy and a Muslim girl. With the tagline, "A Fun Filled Journey of Love, Faith & Destiny," the film appears to combine romance, comedy and emotions against the backdrops of Hyderabad and Rajahmundry. The team recently completed a 15-day schedule on a specially constructed software office set in Hyderabad, where a major portion of the film featuring the lead cast was shot. Production is expected to continue with the second schedule shortly. Produced by Razesh Danda with Krishnakanth Paruchuri as co-producer, Sairabanu is shaping up as another interesting outing for Aadi Sai Kumar as he looks to continue the momentum created by Shambhala. More updates on the film are expected in the coming weeks. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The first trailer for Dune 3 has finally arrived, and it is clear that director Denis Villeneuve isn't trying to outdo the scale of the previous films with bigger explosions or larger battle sequences. Instead, the footage suggests that the filmmaker is focusing on the emotional and psychological consequences of everything Paul Atreides has become. While the trailer still features breathtaking visuals, massive sandworms, and the grandeur fans expect from the franchise, its biggest strength lies in the interpersonal conflicts. Every frame hints at fractured relationships, moral dilemmas, and the burden of leadership rather than simply showcasing another epic war for Arrakis. Denis appears to be treating the film as a character study first and a spectacle second. Timothée Chalamet's Paul Atreides looks increasingly consumed by power and prophecy, while the supporting characters seem to challenge, question, or fear the path he has chosen. The tension between ideology, love, faith, and destiny takes center stage, making the emotional stakes feel even higher than the physical ones. Visually, Dune 3 continues the franchise's signature aesthetic with stunning cinematography, haunting sound design, and meticulously crafted production values. But unlike conventional blockbuster trailers that rely heavily on action montages, this one builds intrigue through expressions, silence, and conversations that hint at irreversible choices. If the trailer is anything to go by, Denis Villeneuve is aiming to conclude the saga with a deeply human story wrapped inside a visually magnificent sci-fi epic. Rather than delivering spectacle for spectacle's sake, Dune 3 looks poised to explore the cost of power, making it one of the most anticipated cinematic events on the horizon. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ఒకే ఒక్క సినిమాతో యువత, ప్రేక్షకుల గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుకోవాలంటే ఎంతో  అదృష్టం ఉండాలి. ఆర్ ఎక్స్ 100 తో అలాంటి అదృష్టం దక్కించుకున్న భామ పాయల్ రాజ్‌పుత్. రీసెంట్ గా పాయల్ చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం తన నామధేయంతో ఉగిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు, గ్లామరస్ వీడియోలతో నిరంతరం అభిమానులను అలరించే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం   ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ ప్రారంభించింది. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పాయల్ కి నెటిజన్ల నుండి  వింతైన, ఇబ్బందికరమైన అభ్యర్థనలు ఎదురయ్యాయి. దీంతో ఆమె తీవ్ర అసహనానికి లోనై, సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ని షేర్ చేసింది. ఆ నోట్ లో 'కొంత మంది  నెటిజన్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ప్రైవేట్, ఎక్స్‌క్లూజివ్ హాట్ కంటెంట్ దొరుకుతుందని తప్పుగా భావిస్తున్నారు. నా ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌ని  కేవలం నా కెరీర్, షూటింగ్ లోకేషన్ అప్‌డేట్స్, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని మధురమైన క్షణాలని మాత్రమే పంచుకోవడానికి ఉపయోగిస్తాను. అంతే తప్ప, కేవలం డబ్బులు చెల్లించినంత మాత్రాన గ్లామర్ హద్దులు దాటి ప్రైవేట్ కంటెంట్ ఆశిస్తే మాత్రం నా ఇన్‌స్టాని సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దు. దాదాపు 100 శాతానికి పైగా ప్రొఫెషనల్, జెన్యూన్ కంటెంట్‌ మాత్రమే నా సబ్‌స్క్రైబర్ల కోసం అందిస్తాను. ఎవరైతే నన్ను ఒక నటిగా, ఒక వ్యక్తిగా నిజంగా ప్రేమిస్తూ,  అప్‌డేట్స్ తెలుసుకోవాలని అనుకుంటారో, వారు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి. Also read: Suman: 170 ఎకరాల భూమిని దానం చేసిన సుమన్.. వాల్యూ ఎంతో తెలుసా! గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, కేవలం డబ్బు కోసం ఆ హద్దులు దాటడానికి  సిద్ధంగా లేను. నా గౌరవాన్ని తగ్గించే ఏ పనిని కూడా నేను  ప్రోత్సహించనని చెప్పుకొచ్చింది. Payal rajput, tollywood  
  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కి పోటీ ఇస్తూ తెలుగు సినిమాపై తన సిగ్నేచర్ ఉండేలా చేసిన హీరో సుమన్(Suman).. సుమన్ లాంటి అందగాడు తన భర్తగా రావాలని కోరుకున్న లేడీ అభిమానులకైతే లెక్కే లేదు. ఈ ఒక్క మాట చాలు సుమన్ చరిష్మా ఏ విధంగా కొనసాగిందో చెప్పుకోవడానికి. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం తన సత్తా చాటుతున్న సుమన్ గురించి రీసెంట్ గా బయటకి వచ్చిన న్యూస్ వైరల్ గా మారడమే కాకుండా సుమన్ గొప్పతనాన్ని చాటి చెప్తుంది. చాలా ఏళ్ల క్రితం సుమన్ భవిష్యత్తు అవసరాలు, సినిమా కెరీర్‌ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న భువనగిరి ప్రాంతంలో 170 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో  భారీ సినిమా స్టూడియోని  నిర్మించాలని, ఆ తర్వాత దానిని కమర్షియల్‌గా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనేది ఆయన ప్లాన్. అయితే అదే సమయంలో కార్గిల్ యుద్ధం జరగడం, దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ వందలాది మంది భారత జవాన్లు వీరమరణం పొందడం సుమన్‌ని  తీవ్రంగా కదిలించింది. టీవీల్లో, వార్తల్లో అమరవీరుల కుటుంబాలు పడుతున్న బాధలను, వారి దీన స్థితిని చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ వీరుల కుటుంబాలకు తన వంతుగా ఏదైనా శాశ్వతమైన సహాయం అందించాలని  నిశ్చయించుకున్నారు. Also read: లెనిన్ బాక్సాఫీస్ టార్గెట్..అఖిల్ హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు రాబట్టాలా?  భువనగిరిలో ఉన్న తమ 170 ఎకరాల విలువైన భూమిని దేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనికుల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తే బాగుంటుందని సుమన్ కి భార్య  సూచించారు. భార్య ఇచ్చిన సలహా సుమన్‌కి ఎంతో నచ్చింది. వందల కోట్ల కమర్షియల్ విలువ ఉన్న భూమి అని కూడా ఆలోచించకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ 170 ఎకరాల భూమిని పూర్తిగా భారత సైనికుల, అమర జవాన్ల కుటుంబాల అవసరాల కోసం రాసిచ్చేశారు. కుడిచేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదనే సామెతను నిజం చేస్తూ, ఇంత పెద్ద దానాన్ని ఆయన ఎప్పుడూ మీడియా ముందుగానీ, సినిమా ఇండస్ట్రీలోగానీ ప్రచారం చేసుకోలేదు. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రాగా సుమన్ స్వయంగా స్పందిస్తూ ఆనాటి సంఘటనని  ధృవీకరించారు. అంతేకాదు, ఈ గొప్ప నిర్ణయం వెనుక తన భార్య ఆలోచనే ప్రధాన కారణమని ఎంతో వినమ్రంగా చెప్పారు.  దీంతో  ఇప్పుడు అభిమానులతో పాటు ప్రతి ఒక్క ఇండియన్ సుమన్‌ కి సెల్యూట్ చేస్తున్నారు. suman, tollywood, 170 acres
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది.  టెస్ట్ లలో  విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు..  ఎప్పుడూ  అలసటగా మరియు బలహీనంగా అనిపించడం.  చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం,   తలతిరగటం,  చర్మం పసుపు రంగులోకి మారడం,  దేని మీదా ఏకాగ్రత లేకపోవడం,  మానసిక స్థితిలో వేగంగా  మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి.  పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి.  కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి.  గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు.   ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా  తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల  బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు,  న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12   లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు.                                 *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం? థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్,  అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు.  చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.  ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి.  అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా  అద్బుతమైన ఫలితాలు చూస్తారు.  30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు.  ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది.  దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది.  రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి.  డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ.  ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది.  దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ,  బేకరీ ఫుడ్స్,  కేక్స్, ఆయిల్ ఫుడ్స్  వంటివి తినడం వల్ల శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.   జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి,  బలాన్ని ఇస్తాయి,  ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.