LATEST NEWS
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదేళ్ల చిన్నారిని అపహరించి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటే.. అలాంటి వ్యక్తే కిడ్నాప్, హత్యకు పాల్పడటం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కమ్యూనిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన వ్యక్తులే ఇలాంటి నేరాలకు పాల్పడితే చిన్నారుల రక్షణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. కౌకూర్‌లోని ఆర్కిడ్ కమ్యూనిటీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. రూ.20 లక్షల డబ్బు కోసం ఐదేళ్ల మోజెస్ అరెలియాను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేసినట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. ఈ కేసులో బిహార్‌కు చెందిన విక్రమ్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ వెల్లడించారు. నిందితుడు అదే కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడని, ఇటీవల విల్లా నిర్వాహకులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారని వివరించారు. అయితే, ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కమ్యూనిటీ సభ్యులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నారుల రక్షణకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి పేరుతో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించిన ఈ ఘటనలో పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధ్యులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు సమాచారం.       [ Bollaram Child Murder Case, Moses Aurelia, Secunderabad Crime News, Malkajgiri CP Sumathi, Vikram Arrest, Child Kidnapping Case, ₹20 Lakh Kidnap Motive, Bollaram Protest, Security Guard Arrest, Koukur Orchid Community, Child Safety, Hyderabad Crime ]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  అక్రమాస్తుల కేసులు మరోసారి చర్చనీయంశంగా మారాయి.  ఈ కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయడాన్ని తెలుగుదేశం స్వాగతించింది. జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.   తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆదివారం (అక్టోబర్ 11) మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి జగన్‌పై నమోదైన కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నలు సంధించారు. 2011లో సీబీఐ కేసులు నమోదు చేసినప్పటికీ, ఇంతకాలం గడిచినా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం ఆందోళనకరమన్నారు. ఈ కేసుల్లో న్యాయప్రక్రియ వేగంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు  దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసుగా  అభివర్ణించారు.   తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రూ.43 వేల కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టారని ఆరోపించిన ఆయన.. డిశ్చార్జి పిటిషన్ల పేరుతో విచారణను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సంబంధించిన కేసుల విచారణతో పోల్చుతూ, జగన్ కేసుల్లోనూ న్యాయప్రక్రియ త్వరగా పూర్తికావాలన్నారు.  అదలా ఉంటే.. జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం తీసుకునే నిర్ణయం, విచారణను వేగవంతం చేసేందుకు ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఈ కేసులు రాజకీయ విమర్శలకు కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఆరోపణలు, ప్రతివాదనలు పక్కనపెడితే, కేసులపై న్యాయస్థానాల్లో సకాలంలో విచారణ జరగడం, ఆధారాల ఆధారంగా నిర్ణయాలు వెలువడటం ప్రజలకు కీలకం.  ఇప్పటికైనా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రోజు వారీ జరిగి, ఇకెంత మాత్రం జాప్యం లేకుండా తుది తీర్పు వెల్లడి కావాలని పలువురు కోరుతున్నారు.    [TDP MLA Somireddy On Jagan Cases, Somireddy Chandramohan Reddy, Jagans Disproportionate Assets Case, ED Petition, AP Politics, Telugu One]
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు. ఇండయా కూటమి నేతలు తన సమస్యలను పిషిషన్ రూపంలో కోర్టు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. దీంతో  నేడు  ఇండియా కూటమి నేతల చలో సుప్రీం కోర్టు మార్చ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   కాగా సీజేఐ ఇండియా కూటమి నేతల భేటీని తిరస్కరించడానికి వారు.. ఇప్పటికే   విచారణలో ఉన్న అంశాలపై తనతో చర్చించాలని భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే వారి అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారనీ, పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానాల విధి అని ఆయన పేర్కొన్నారనీ తెలుస్తోంది.   ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు కట్టుబడి ఉందని, న్యాయస్థానం తలుపులు అందరికీ ఎల్లవేళలా తెరిచే ఉంటాయనీ సీజేఐ పేర్కొన్నట్లు సమాచారం.  ఎస్‌ఐఆర్‌లో అక్రమాలు జరిగాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌  జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశంపై సోమవారం (అక్టోబర్ 12) చలో సుప్రీంకోర్టు   మార్చ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిరసన ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాదని, భారతీయులందరిదీనని కాంగ్రస్ అగ్రనేత, లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఇండియా కూటమి ఇప్పటికే  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సీఈసీ రాజీనామా, 2023 చట్టం రద్దు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిలిపివేత, తొలగించినట్లు ఆరోపిస్తున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్ల పునరుద్ధరణ కోరుతూ ఆ వినతి పత్రం సమర్పించింది.    [CJI Surya Kant Reject, INDIA Bloc Plea, Rahul Gandhi, Mallikarjun Kharge, Supreme Court, , Vote Theft Allegations, Election Commission, SIR, Telugu One]
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే ఒక్క విచిత్రమైన వార్త ట్రెండింగ్‌లో నిలిచింది. సాధారణంగా ఈ కాలంలో ఒక్క పెళ్లి చేసుకోవడమే చాలా మందికి గగనంగా మారుతున్న రోజులివి. అలాంటిది బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఏకంగా 21 మందిని వివాహం చేసుకుని అందరినీ నివ్వెరపరిచాడు. కేవలం పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా, తన వింత జీవన శైలితో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు మోరు మియా. ఒక పూరి గుడిసెలో నివసిస్తూ, రోజూ భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్న ఈయన గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భిక్షాటనే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఒక సాధారణ బిచ్చగాడికి ఇన్ని పెళ్లిళ్లు ఎలా సాధ్యమయ్యాయి అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. ఈ విచిత్రమైన ఉదంతానికి సంబంధించి మోరు మియా స్వయంగా మీడియా ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తనను ఎవరూ బలవంతం చేయలేదని, తానే స్వయంగా ఎవరికీ ఎలాంటి పెళ్లి ప్రతిపాదనలు తీసుకెళ్లలేదని స్పష్టం చేశాడు. ఆశ్చర్యకరంగా మహిళలే స్వయంగా తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటామని అడుగుతుండేవారని తెలిపాడు. తనతో వివాహానికి ముందుకు వచ్చిన వారిలో కొందరు మహిళలు తన కంటే వయసులో చాలా పెద్దవారైనప్పటికీ, వారు తనపై చూపిన అభిమానాన్ని లేదా పెళ్లి కోరికను కాదనలేకపోయానని ఆయన వివరించాడు. ఎవరైనా మహిళ తనను పెళ్లి చేసుకుంటానని కోరినప్పుడు వారిని తిరస్కరించడం తనకు ఇష్టం ఉండేదని కాదు, అలా చేస్తే వారికి మనస్తాపం కలుగుతుందని భావించి వారి ప్రతిపాదనలను అంగీకరించినట్లు తెలిపాడు. అలా ఒక్కరి తరువాత ఒకరుగా అంగీకరిస్తూ పోవడంతో అతని భార్యల సంఖ్య ఏకంగా 21కి చేరుకుందని అతను వెల్లడించాడు. అయితే, ఇంతమంది భార్యలు ఉండటం వల్ల మోరు మియాకు ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. అదేమిటంటే, ఏకంగా 21 మంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి వారిలో కేవలం 8 మంది పేర్లు మాత్రమే గుర్తున్నట్లు మీడియా ఇంటర్వ్యూలో బయటపడింది. జర్నలిస్టులు అతని భార్యల పేర్లు అడగగా, ఆయన తడుముకోకుండా షీలా, నర్గిస్, సెలీనా, ఆలియా, తారా, జ్యోత్స్నా, రాబియా  పారుల్ అనే ఎనిమిది పేర్లను మాత్రమే చెప్పగలిగాడు. మిగతా వారి పేర్లు తనకు సరిగ్గా గుర్తులేవని ఆయన అమాయకంగా అంగీకరించడం అక్కడున్న వారందరినీ నవ్వించింది. 21 మంది భార్యలు ఉన్నప్పటికీ అతని దైనందిన జీవితం ఎంతో సాధారణంగా, పేదరికంలోనే సాగుతోంది. రోజువారీ భిక్షాటన చేసే సమయంలో ఆయన విచిత్రమైన పద్ధతిని పాటిస్తాడు. రోజూ భిక్షాటనకు వెళ్లేటప్పుడు తన 21 మంది భార్యలలో కేవలం ఒక్కరిని మాత్రమే తన వెంట సరికొత్త భాగస్వామిగా మారుస్తూ తిరుగుతుంటాడు. ఇలా వంతుల వారీగా అందరితోనూ గడుపుతుంటానని ఆయన పేర్కొన్నాడు. ఈ వింతైన వార్తకు సంబంధించిన వీడియోలు, ఇంటర్వ్యూలు నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పరిస్థితిని చూసి సరదాగా నవ్వుకుంటూ జోకులు పేలుస్తుంటే, మరికొందరు మాత్రం బిచ్చగాడైనప్పటికీ ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం ఎలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో వివాహం కాని ఒంటరి మహిళలు లేదా ఆశ్రయం లేని వారికి అతను ఒక రకంగా తోడుగా నిలిచి ఉంటాడని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, 35 ఏళ్ల చిన్న వయసులో 21 మంది భార్యలను సంపాదించి, కేవలం 8 మంది పేర్లు మాత్రమే గుర్తుంచుకున్న ఈ బంగ్లాదేశ్ బిచ్చగాడి ఉదంతం మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.     [ Bangladesh beggar 21 wives, Moru Mia viral story, beggar with 21 wives, weird viral news, 35 year old beggar, viral video 21 wives,Telugu News, TeluguOne ] 
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు, పోలీసుల అరెస్టులు దేశ రాజధానిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ సీజేపీ నాయకుడు అశుతోష్ రాంకా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రత్యేక సవరణ (SIR) కింద ఓటర్ల జాబితా నుంచి సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, ఇది పెద్ద ఎత్తున మోసానికి దారితీసిందని సీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన సీజేపీ నేతలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసి, దాదాపు 6,000 మందికి పైగా ఆందోళనకారులు మరియు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తీవ్ర పరిణామాలపై స్పందించిన అశుతోష్ రాంకా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ఉద్యమం కేవలం ఒక పార్టీకి పరిమితం కాలేదని, దేశ ప్రజల హక్కుల కోసం సాగుతున్న చారిత్రాత్మక పోరాటమని ఆయన అభివర్ణించారు. ఈ నిరసనల్లో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మానిక్ సర్కార్  పినరయి విజయన్ వంటి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు వీధుల్లోకి వచ్చి యువతకు మద్దతుగా నిలవడం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరాటంలో 5 వామపంతి విద్యార్థి సంఘాలు సైతం సంయుక్తంగా భాగస్వామ్యం పంచుకున్నాయని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ పోలీసులు తమపై  ఇతర నాయకులపై కఠినమైన నిర్బంధ చర్యలు ప్రయోగించినప్పటికీ, న్యాయస్థానం జోక్యంతో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి విడుదలైన తరువాత సీజేపీ నాయకులు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్  అశుతోష్ రాంకా ధైర్యంగా తమ గళాన్ని వినిపించారు. "పోరాటం ఇప్పుడే మొదలైంది, నియంతృత్వానికి వ్యతిరేకంగా మా ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది" అని వారు హెచ్చరించారు. ఓటర్ల జాబితా తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.     [ CEC resignation, Ashutosh Ranka, CJP protest, Jantar Mantar agitation, voter list row, Delhi police detentions,Cockroach Janata Party,  Abhijit Dipke, Gyanesh Kumar,  Supreme Court Delhi protests ]
ALSO ON TELUGUONE N E W S
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవల రకరకాల వార్తలు వినిపించాయి. స్క్రిప్ట్ విషయంలో అల్లు అర్జున్ సంతృప్తిగా లేరని.. దీంతో సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ కథ అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకు వెళ్లిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా లోకేష్ కనగరాజ్ చేసిన ఓ పోస్ట్ ఈ గాసిప్స్‌కు తెరదించింది. అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన లోకేష్.. “ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో 'AA23' ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్.. ఈ ముగ్గురి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో ఉంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్త ఫ్యాన్స్ కి నిరాశ కలిగించింది. అయితే తాజాగా లోకేష్ ట్వీట్ తో అందరిలో ఉత్సాహం తిరిగొచ్చింది. త్వరలో అప్‌డేట్స్ వస్తాయని దర్శకుడు లోకేష్ స్వయంగా చెప్పడంతో.. ఆ అప్‌డేట్స్ ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది.  ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనండి.. నరేశ్ షాకింగ్ కామెంట్స్.! https://x.com/Dir_Lokesh/status/2109559502840508514       [AA23 Latest Update, Lokesh Kanagar Tweet, AA23 Shelved News, Allu Arjun Next Movie, AA23 Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Anirudh Ravichander, Telugu Film News]  
పెళ్లి చేసుకోవడం కరెక్టా? కాదా? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. కొందరు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరికొందరు లివింగ్ టుగెదర్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇంకొందరు మాత్రం పెళ్లి ఊసే వద్దనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నటుడు వీకే నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని మాత్రం కనండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే వినోదాత్మక కథతో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వీకే నరేశ్.. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, బంధాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం సరైనదా? కాదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా రెండూ కరెక్టేనని అన్నారు. లివింగ్ టుగెదర్ కూడా తప్పు కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు ఒక ఈవెంట్‌లా మారిపోయాయని నరేశ్ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని, ఆ తర్వాత విడాకుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని నరేశ్ అభిప్రాయపడ్డారు. రూరల్ సొసైటీలో పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. చాలామందికి సంబంధాలు కుదరడం లేదని అన్నారు. చివరగా.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదని, పిల్లల్ని మాత్రం కనాలని సలహా ఇచ్చారు. ‘క్రేజీ కళ్యాణం’ ఈవెంట్‌లో నరేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రయాణం.. అల్లు అరవింద్ మనసులో మాట.!       [VK Naresh Shocking Comments, VK Naresh Marriage Comments, Crazy Kalyanam Trailer, Crazy Kalyanam Movie, VK Naresh Speech, Anupama Parameswaran, Tharun Bhascker, Telugu Film News]  
సినిమా తెరపై కనిపించే సన్నివేశాల వెనుక నటీనటులు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటారో తెలిపే ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’ షూటింగ్ సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రచయిత, నిర్మాత కోన వెంకట్ షేర్ చేశారు. ఇందులో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ప్రమాదవశాత్తూ కింద పడబోయి తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2025 ఫిబ్రవరిలో మంగళూరు సమీపంలోని అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా శ్రీకాంత్ అయ్యంగార్ అదుపు తప్పి పడిపోబోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న సిబ్బంది, తోటి వ్యక్తులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి తాజాగా కోన వెంకట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కోన వెంకట్ భావోద్వేగంగా స్పందించారు. నటీనటులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి సినిమాల కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. సినిమానే ప్రాణంగా భావించి పనిచేసే తమకు ప్రేక్షకులు సినిమాను ఆదరించి విజయవంతం చేస్తే అది మరో జన్మ లాంటి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ విజయంతో శ్రీకాంత్ అయ్యంగార్‌తో పాటు చిత్రబృందం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ‘కామ్రేడ్ కల్యాణ్’లో శ్రీ విష్ణు సరసన మహిమ నంబియార్ నటించారు. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో, ప్రేక్షకులను అలరించేందుకు సినిమా బృందం పడిన శ్రమపై చర్చ జరుగుతోంది.       [Kona Venkat, Comrade Kalyan Movie, Srikanth Iyengar Accident Video, Sree Vishnu, Comrade Kalyan Shooting Video, Kona Venkat Latest News, Mahima Nambiar, Janakiram Marella, Telugu Cinema News, Comrade Kalyan Behind The Scenes] ​https://x.com/konavenkat99/status/2109230651748798497
Lokesh Kanagaraj and Allu Arjun are coming together for their big film, AA23. The makers have announced the project with a popular glimpse. Anirudh Ravichander music for the video made it highly popular while the animation and presentation increased intrigue about the story and screenplay.  Recently, the reports have suggested that the movie has been dropped. Few reports also suggested that Allu Arjun did not like the final script and gave three months to finalise it better with another draft. But the PR of Allu Arjun stated that these reports are baseless.  Lokesh now posted a picture of him in discussion with Allu Arjun and stated, "Interesting updates coming soon." So, with this image, he cleared all the rumors and made it clear that AA23 is in progress with Mythri Movie Makers producing it and Anirudh Ravichander composing music. Let's wait for these updates.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ప్రయాణం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక లేఖ రాశారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా విడుదలై మూడు దశాబ్దాలు పూర్తయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. సినిమాలకు అతీతంగా సమాజం కోసం ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. “మనిద్దరం కలిసి చేసిన తొలి సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యంతో పాటు షాక్‌కు గురయ్యాను” అంటూ అల్లు అరవింద్ తన లేఖను ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ సాగించిన ప్రయాణాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించారు. 30 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎంచుకునే మార్గం ఏదైనా.. అందులో మరిన్ని విజయాలు, సంతృప్తి లభించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా సమాజం పట్ల పవన్‌కు ఉన్న విస్తృతమైన దృక్పథాన్ని, సినిమాలకు మించి ఆయన చేస్తున్న సేవలను అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సమాజం పట్ల మీకున్న విస్తృతమైన దృక్పథాన్ని, సినిమా రంగానికి అతీతంగా మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు. మరోసారి అభినందనలు తెలియజేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడూ తన ప్రేమ, ఆశీస్సులు ఉంటాయని లేఖలో తెలిపారు. పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం 1996లో విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రారంభమైంది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.  ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి vs హరీష్ శంకర్.. బాలయ్యతో సినిమా కోసం దర్శకుల పోటీ.! https://x.com/GeethaArts/status/2109542427287531785       [Pawan Kalyan 30 Years in Cinema, Pawan Kalyan First Movie, Akkada Ammayi Ikkada Abbayi, Pawan Kalyan, Allu Aravind, Geetha Arts, Telugu Film News]  
Sukumar and Devi Sri Prasad have been a strong director-composer bond that looked irreplacable and unbreakable. After Arya, even though Sukumar went through a lean phase, DSP never gave an unsuccessful album and vice versa, when DSP looked out-of-form before Pushpa franchise, Sukumar did not replace him.  But Sukumar's association with Mythri Movie Makers seem to have drawn a wedge between the combination. While not trying to antagonise anyone involved, the growing disastisfaction between Mythri and DSP about delays, quality of work seem to have finally taken effect.  During Pushpa 2 final composition sessions, Mythri had been under severe pressure to release the film, by 5th December all over the world. During the time, openly, both parties commented about work process. DSP had been replaced from Good Bad Ugly as well at the same time. DSP openly stated that people who talk about delays should respect working style and provide content on time.  Sam CS worked on background score of Pushpa 2, due to these open fights but DSP completed songs and climax BGM for the film. Thaman announced that he did work for first half but makers did not accept his contribution while Sam expressed concern about crediting as additional BGM while most of his work had been retained.  But many thought for RC17, Sukumar would sort out all the issues and bring Rangasthalam trio back. Ram Charan has said to have given full creative control of the film to Sukumar and he is more or less waiting for the script work to be completed at the moment.  Meanwhile, reports are emerging that Anirudh Ravichander is being considered for the film to compose music after team said to have held discussions with Shashwat Sachdev. Reasons might be speculative but it looks like Sukumar and DSP combination has come to an end after a historical journey of two decades.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత కొరటాల శివతో కలిసి పనిచేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ ఇద్దరూ బాలయ్యకు కథలు వినిపించారట. దీంతో వీరిద్దరిలో బాలకృష్ణ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఈసారి ఎలాంటి కథతో వస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో డిసెంబర్‌ 24న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన 112వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణతో కొరటాల శివ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే బాలయ్య తదుపరి సినిమా విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. బాలయ్యను కొత్త తరహా పాత్రలో చూపిస్తూ.. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకూ ప్రాధాన్యం ఇచ్చి అనిల్ రావిపూడి మెప్పించారు. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేసేందుకు ఆయన ఓ కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అనిల్ ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ పేరు కూడా బాలయ్య తర్వాతి సినిమాల జాబితాలో వినిపిస్తోంది. ఇటీవలే ఆయన బాలకృష్ణకు ఓ పవర్‌ఫుల్ కథ వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య నుంచి సానుకూల స్పందన రావడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవైపు ‘భగవంత్ కేసరి’తో బాలయ్యకు విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి.. మరోవైపు మాస్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్. ఇద్దరూ బాలకృష్ణతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: చివరికి గెలిచేది నిజమే.. 28 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన యూట్యూబర్ నందన.!       [Balakrishna Next Movie, Balakrishna Anil Ravipudi Movie, Balakrishna Harish Shankar Movie, NBK112 Movie, Dada Movie, Anil Ravipudi, Harish Shankar, Telugu Film News]  
యూట్యూబర్ నందన మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వివాదాలు, కేసులతో వార్తల్లో ఉన్న ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. 28 రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయని ఆమె పేర్కొనడం ఆసక్తిని పెంచుతోంది. ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నందన తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 4న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. గత 28 రోజులు తనకు ఎన్నో విషయాలను నేర్పించాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, బాధను అనుభవించానని చెప్పారు. అయితే తాను చేదు అనుభవాలతో వెనుదిరగలేదని.. విలువైన పాఠాలు, ధైర్యం, ఆశతో తిరిగి వచ్చానని నందన రాసుకొచ్చారు. నిజాయితీగా ఉండే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని, సత్యానికి ఇంకా విలువ ఉందని తన అనుభవం ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన విలువలను వదులుకోకూడదని ఆమె సందేశమిచ్చారు. దసరా సందర్భంగా కూడా నందన ఓ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయని పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా, లండన్‌లో ఉద్యోగాలు, వీసాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ నందన, ఆమె భర్త మధుకర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో నందన హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి విచారణ జరిపారు. మొత్తానికి గత కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో ఉంటున్న నందన.. ఇప్పుడు తన పోస్ట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.  ఇది కూడా చదవండి: ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. సీజేపీ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసులపై నటి ఫైర్.! https://www.instagram.com/p/DeW4JrPM3X-/       [YouTuber Nandana Case, Nandu World Case, Nandana Viral Post, Nandana Instagram, YouTuber Nandana, Nandu World, Telugu News]  
బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలకు తనదైన మాస్ స్టెప్పులతో కొరియోగ్రఫీ అందించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆయన బయోపిక్‌గా తెరకెక్కిన ‘గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక సాధారణ డ్యాన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా ఎదిగే క్రమంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, త్యాగాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా సెలబ్రిటీల జీవిత కథలను ఇతర దర్శకులు తెరకెక్కిస్తుంటారు. కానీ గణేశ్ ఆచార్య మాత్రం తన జీవిత కథకు తానే రచన చేసి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన కుమార్తె సౌందర్య ఆచార్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, కలలను నిజం చేసుకునేందుకు చేసిన పోరాటాన్ని ఎంత సహజంగా తెరపై చూపించారన్న ఆసక్తి ట్రైలర్‌తో పెరిగింది. ఈ చిత్రంలో గణేశ్ ఆచార్య పాత్రలో యువ నటుడు శివాంశు సోని నటిస్తున్నారు. అలోక్ షా, సుకన్య కలన్, సాక్షి పవస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డ్యాన్స్‌ సన్నివేశాలతో పాటు భావోద్వేగభరితమైన ఘట్టాలు కూడా ట్రైలర్‌లో చోటుచేసుకున్నాయి. జునైద్ కుమార్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడటం, ఎన్నో త్యాగాలు చేయడం అవసరమనే అంశాన్ని ఈ సినిమా ప్రధానంగా చూపించనుంది. ‘గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్’ చిత్రాన్ని డిసెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నారు. తన జీవితంలోని అనుభవాలను గణేశ్ ఆచార్య ఏ విధంగా తెరపై ఆవిష్కరించారు? కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదుగుదల వెనుక ఉన్న పోరాటం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది సినిమా విడుదలయ్యాక తెలియనుంది.     [Ganesh Acharya Biopic, Ganesh Dust to Stardust, Ganesh Acharya Movie, Ganesh Dust to Stardust Trailer, Shivanshu Soni, Soundarya Acharya, Bollywood Choreographer, Ganesh Acharya Life Story, Ganesh Biopic Release Date, Hindi Movie News]
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుటుంబానికి చెందిన నటి జైన్ మేరీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలో పాల్గొన్న ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విడుదలైన తర్వాత తన శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘‘మమ్మల్ని మరీ ఎక్కువగా భయపెట్టాలని చూడకండి.. అలా చేస్తే మాలో భయం అనేదే లేకుండా పోతుంది’’ అంటూ జైన్ మేరీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్టోబర్ 10న ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనకు పలువురు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో నటి జైన్ మేరీతో పాటు నటుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన స్నేహితురాలు లేఖా వాషింగ్టన్ కూడా పాల్గొన్నారు. అయితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని, కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. అనంతరం జైన్ మేరీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో చేతులు, వేళ్లు, కాళ్లపై ఉన్న గాయాల గుర్తులను చూపించారు. తమను భయపెట్టే ప్రయత్నాలు చేయొద్దని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: బాలయ్య 100 కోట్ల ప్యాలెస్.. ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే.! https://www.instagram.com/reel/DeWIRLUKyop/       [Zayn Marie Injured, Zayn Marie Injury Video, Aamir Khan Niece Zayn Marie, Aamir Khan, Zayn Marie, Imran Khan, CJP Protest, Telugu News]  
మనలో చాలామందికి ఎండలో కొద్దిసేపు గడపడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు. అయితే ఏ సమయంలో ఎండలో ఉండాలి? ఉదయం సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుందా లేక మధ్యాహ్నం ఎండలోకి వెళ్తేనే శరీరానికి ఎక్కువ విటమిన్ డి అందుతుందా అనే సందేహాలు సర్వసాధారణం. సూర్యరశ్మి పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన సమయంలో బయటకు వెళ్లకపోవడం మరియు శరీరానికి ఎంత మేరకు సూర్యరశ్మి తగులుతుందనే అంశాలను పట్టించుకోకపోవడం వల్ల కొందరిలో విటమిన్ డి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ సూర్యరశ్మి సమయం, దాని వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాను వివరించారు. ఉదయం వేళ లభించే సూర్యరశ్మి శరీరంలోని సహజ జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు ప్రశాంతమైన నిద్రకు తోడ్పడటానికి ఉపయోగపడితే, విటమిన్ డి ఉత్పత్తికి మాత్రం మధ్యాహ్నం సమయంలో లభించే ప్రత్యేకమైన UVB కిరణాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంటే మంచి నిద్ర కోసం ఎండలోకి వెళ్లే సమయం మరియు విటమిన్ డి కోసం ఎంచుకోవాల్సిన సమయం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. మంచి నిద్ర మరియు జీవ గడియారం యొక్క క్రమబద్ధీకరణ కోసం ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య ఎండలో ఉండటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి శరీరంలోని సర్కేడియన్ రిథమ్‌ (Circadian Rhythm) అని పిలిచే సహజ జీవ గడియారాన్ని సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ జీవ గడియారం మనకు ఎప్పుడు మెలకువగా ఉండాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనే అంశాలతో పాటు శరీరంలోని అనేక దైనందిన ప్రక్రియలను అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు సహజ వెలుతురులో గడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆరోగ్యకరమైన అలవాటు చక్కటి నిద్రకు, మానసిక స్థితి మెరుగుపడటానికి, పగటిపూట పూర్తి చురుకుదనానికి అలాగే జీవక్రియల సక్రమ క్రమబద్ధీకరణకు ఎంతో తోడ్పడుతుంది. రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లేటప్పుడు లేదా బయట కాసేపు గడిపేటప్పుడు ఈ సహజ సూర్యరశ్మిని సులభంగా పొందవచ్చు. అయితే, ఉదయాన్నే ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి పెద్ద మొత్తంలో లభిస్తుందని భావించకూడదు, ఎందుకంటే ఆ సమయంలో UVB కిరణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు, శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా తయారవడానికి చర్మంపై UVB కిరణాలు నేరుగా పడటం చాలా ముఖ్యం. సూర్యుడు ఆకాశంలో తగినంత ఎత్తులో ఉన్నప్పుడు ఈ కిరణాలు అత్యధికంగా అందుబాటులో ఉంటాయి. అందుకే విటమిన్ డి ఉత్పత్తి కోసం ఉదయం కంటే మధ్యాహ్నం సమయం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. డాక్టర్ సుధీర్ కుమార్ సూచన ప్రకారం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య సుమారు 15 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరశ్మిని పొందడం వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఈ విధంగా మధ్యాహ్నపు ఎండలో గడపడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, మన శరీర చర్మంలో సుమారు 20 నుంచి 30 శాతం మేర సూర్యరశ్మికి గురికావడం కూడా విటమిన్ డి ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన సూచనగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అందరికీ ఒకే రకమైన సమయం సరిపోతుందని చెప్పలేం; చర్మం రంగు, ధరించే దుస్తులు, వాతావరణ పరిస్థితులు, కాలాలు, భౌగోళిక ప్రాంతం మరియు UV కిరణాల తీవ్రతను బట్టి శరీరంలో తయారయ్యే విటమిన్ డి పరిమాణంలో మార్పులుంటాయి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు బయట ఉండటం వల్ల చర్మం కాలిపోవడం వంటి వేడి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, విటమిన్ డి కోసం ఎప్పుడూ అతిగా ఎండలో గడపకూడదని గుర్తుంచుకోవాలి.     Vitamin D Deficiency, Midday Sun Exposure, UVB Rays, Sunlight Timing, Bone Health, Indian Skin Tone, Melanin and Vitamin D, Sunlight Benefits, Sun Safety, Vitamin D Supplements.
ప్రస్తుత కాలంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యలు చాలా మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వయసు పెరగడం, వంశపారంపర్య కారణాలు మరియు ఇప్పటికే గుండె సమస్యలు ఉండటంతో పాటు, మన ఆధునిక రోజువారీ జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారత్‌లో గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందకపోవడం, ప్రాథమిక ప్రాణరక్షణపై అవగాహన తక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, అమెరికా వంటి దేశాల్లో కార్డియాక్ అరెస్ట్‌ నుంచి బయటపడే అవకాశాలు సుమారు 15 నుంచి 20 శాతం వరకు ఉండగా, భారత్‌లో మాత్రం అవి 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, హార్వర్డ్ హెల్త్ నిపుణుల సూచనల ప్రకారం.. కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, తగిన వ్యాయామం మరియు నిద్ర వంటి మూడు కీలక అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ ముప్పును ఏకంగా 80 శాతం వరకు తగ్గించుకోవచ్చని తేలింది. మొదటిగా, మన ఆహారపు అలవాట్లలో సమూలమైన మార్పులు చేసుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. మొక్కల ఆధారిత ఆహారం లేదా మెడిటరేనియన్ డైట్ విధానాన్ని అనుసరించడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ డైట్‌లో తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, డ్రై నట్స్‌ మరియు ఆరోగ్యకరమైన నూనెలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను వీలైనంత వరకు పరిమితం చేయడం చాలా అవసరం. ఒకవేళ మద్యం సేవించే అలవాటు ఉంటే దాని పరిమాణంపై కూడా తీవ్రమైన శ్రద్ధ పెట్టాలి. వారానికి 100 గ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మరియు అకాల మరణాల ముప్పు పెరుగుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన మరియు పౌష్టికాహారాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. రెండవదిగా, శారీరక చురుకుదనం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను పదిలంగా ఉంచుతుంది. శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన తీవ్రతతో కూడిన ఏరోబిక్ వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంటే వారంలో కనీసం ఐదు రోజులు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వేగంగా నడవడం, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటి వాటిని ఎంచుకోవచ్చు. కేవలం వ్యాయామ సమయమే కాకుండా, రోజంతా చురుగ్గా ఉండటం ముఖ్యం. ఎక్కువసేపు కూర్చునేవారు ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు నడవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా రోజువారీ శారీరక చురుకుదనాన్ని పెంచుకోవచ్చు. చివరిగా, ఆహారం మరియు వ్యాయామంతో పాటు నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి సమానంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. పెద్దలు ప్రతిరోజూ రాత్రి పూట కనీసం ఏడు గంటల గాఢమైన నిద్ర పొందాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి స్థాయిలు విపరీతంగా పెరగడం, వాపు సంబంధిత ప్రక్రియలు ప్రభావితం కావడం మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ నేరుగా గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు తగినంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. అంతేగాక, గుండె సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సొంతంగా ఆస్పిరిన్ మాత్రలను వేసుకోవడం చాలా ప్రమాదకరమని, వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.     Heart Attack Prevention, Lower Heart Attack Risk, Heart Health Habits, Cardiovascular Health, Preventive Cardiology, Daily Exercise, Healthy Diet, Quality Sleep, Harvard Health Tips, Lifestyle Medicine.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో మన శరీర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పూర్తిగా మన ప్రేగులలో ఉండే సూక్ష్మజీవుల (గుట్ బాక్టీరియా) సమతుల్యతపై ఆధారపడి ఉంటున్నాయని అనేక శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మానవ శరీరంలోని ప్రేగులలో సుమారు 1000 రకాల సూక్ష్మజీవులు లేదా బాక్టీరియాలు నివసిస్తుంటాయి. వీటిలో మంచి బాక్టీరియా మరియు చెడ్డ బాక్టీరియా అనే రెండు ప్రధాన రకాలుంటాయి. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. ఒకవేళ ఈ సమతుల్యత దెబ్బతింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం (షుగర్), ఊబకాయం, నిరంతరం మానసిక ఒత్తిడి మరియు తీవ్రమైన ఆందోళన వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువు ప్రేగులలోని బాక్టీరియా వృద్ధి ప్రక్రియ ప్రారంభమవుతుంది. గర్భవతిగా ఉన్న సమయంలో ఫైబర్, ప్రోటీన్లు మరియు తగిన పోషకాలు లేని వేయించిన పదార్థాలు, పులుసులు, పచ్చళ్ళు వంటి ఆహారాన్ని తీసుకుంటే, పుట్టకముందే బిడ్డలో చెడ్డ బాక్టీరియా పెరిగి మంచి బాక్టీరియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, బిడ్డకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వయసు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం వల్ల మంచి బాక్టీరియా బాగా వృద్ధి చెంది చెడ్డ బాక్టీరియా అదుపులో ఉంటుంది. ఈ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు శరీరానికి రోజంతా శక్తిని అందించడంలో పీచు పదార్థాల పాత్ర చాలా కీలకం. సరిగా అరగని మరియు కరగని పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మన ప్రేగులలోని మంచి బాక్టీరియాకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. ముఖ్యంగా సాయంత్రం పూట గుప్పెడు కందిపప్పు వంటి పప్పుధాన్యాలను పొట్టు తీయకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కందిపప్పుతో పాటు పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వాటిని తొక్క తొలగించకుండా వినియోగించడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే, పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పిండితో చేసిన అట్లు మరియు ఇడ్లీలలో మంచి బాక్టీరియా పుష్కలంగా వృద్ధి చెందుతుంది. పాలిష్ పట్టని ముడి బియ్యం, వివిధ రకాల మిల్లెట్లు, వాటితో తయారు చేసిన రవ్వలు, మల్టీగ్రెయిన్ పుల్కా వంటివి అధిక పీచును అందించి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజువారీ ఆహారంలో వాల్‌నట్స్, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు మరియు పొద్దుతిరుగుడు గింజలు వంటి విత్తనాలను చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పీచు లభించి మంచి బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి విరుద్ధంగా తెల్లటి బియ్యం, మైదా పిండి, తెల్లటి రవ్వ మరియు పంచదార వంటివి పీచు పదార్థాలు లేకుండా నేరుగా చక్కెరగా మారి చెడ్డ బాక్టీరియాను గణనీయంగా పెంచుతాయి. రసాయనాలు, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు మరియు ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రేగు వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి, సహజసిద్ధమైన పీచు పదార్థాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అలవరుచుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారి నుండి సులభంగా రక్షణ పొందవచ్చు.     Toor Dal Benefits, Kandipappu Health Benefits, Gut Microbiome, Good Gut Bacteria, Digestive Health, Plant Protein, Sustained Energy, Nutrition & Diet, Prebiotics, Indian Pulses.  
ఈ రోజుల్లో బరువు తగ్గడానికో లేదా ఆరోగ్యం కోసమో చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా ఉపవాసం చేస్తే వయసు త్వరగా మళ్లినట్లు కనిపిస్తారని, వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అసలు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో  చాలా మందికి తెలియదు. ఉపవాసం సరైన విధానంలో చేస్తేనే అది శరీరానికి మేలు చేస్తుంది. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం తప్పుగా చేస్తే జరిగేది ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. ఉపవాసం చేస్తే వృద్ధాప్యం రావడానికి  కారణాలు..   పోషకాహార లోపం.. ఉపవాసం ఉండే సమయంలో లేదా ఉపవాసం పూర్తయిన తర్వాత శరీరానికి కావలసినంత విటమిన్లు, మినరల్స్ , ప్రోటీన్లు తీసుకోకపోతే చర్మం తన మెరుపును కోల్పోతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు వచ్చి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. కండరాల క్షీణత.. సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం ఆకలితో అలమటిస్తే, శరీరం కొవ్వుతో పాటు కండరాల కణజాలాన్ని కరిగించడం ప్రారంభిస్తుంది. కండరాలు తగ్గడం వల్ల శరీరం , ముఖం వేలాడబడినట్లు అయి, వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. డీహైడ్రేషన్.. ఉపవాసం సమయంలో చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారిపోయి, మెరుపు తగ్గిపోతుంది. ఇది కూడా త్వరగా ముసలితనం రావడానికి ఒక ప్రధాన కారణం. తీవ్రమైన ఒత్తిడి.. పద్ధతి లేకుండా కఠినమైన ఉపవాసాలు చేయడం వల్ల శరీరంలో కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ అధికమైతే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ దెబ్బతింటుంది. ఉపవాసం సరిగ్గా చేయాలంటే ఏం చేయాలి? ఉపవాసం అనేది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి కానీ దెబ్బతీయకూడదు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. ఉపవాసం ఉన్న సమయంలో , మిగతా సమయంలో తగినంత నీరు, నిమ్మరసం లేదా కొబ్బరిబోండాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఉపవాసం విరమించేటప్పుడు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ ఉన్న మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకేసారి కఠినమైన ఉపవాసాలు ప్రారంభించకుండా, చిన్నగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం. సరైన పద్ధతిలో చేసే ఉపవాసం యవ్వనాన్ని అందిస్తుంది. కానీ అవగాహన లేని ఉపవాసం వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటిస్తూ ఉపవాసం ఉండటమే శ్రేయస్కరం.                         • రూపశ్రీ.
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..ఈ తప్పే కారణం కావచ్చు! బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం. ఈ క్రమంలో చాలామంది వేగంగా ఫలితాలు సాధించాలనే తొందరలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు చేస్తుంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పడే శ్రమ, సరైన పద్ధతిలో లేకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వెయిట్ లాస్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని చెప్పే ప్రధానమైన తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం లేదా స్కిప్ చేయడం.. బరువు తగ్గే క్రమంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు. త్వరగా బరువు తగ్గవచ్చనే అపోహతో ఉదయం పూట టిఫిన్ లేదా రాత్రి భోజనాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందదు. దాంతో తీవ్రమైన అలసట, నీరసం ఏర్పడతాయి. అంతేకాకుండా, తర్వాత పూట అతిగా తినే ప్రమాదం పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడానికి బదులు మరింత పెరగడానికి కారణమవుతుంది. ఎనర్జీ, కేలరీల ప్రాధాన్యతను విస్మరించడం.. కేలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనలో శరీర జీవక్రియలకు అవసరమైన కనీస శక్తిని కూడా ఇవ్వకపోవడం సరైనది కాదు. రోజువారీ పనులు చేసుకోవడానికి, ఉత్సాహంగా ఉండటానికి సరైన పరిమాణంలో క్యాలరీలు అవసరం. అతి తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు మందగిస్తుంది. ఫలితంగా శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. పోషకాహార లోపం..  బరువు తగ్గే ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సమస్య. కేవలం కేలరీల లెక్కింపు పైనే దృష్టి పెట్టి, తింటున్న ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ ఉన్నాయో లేదో గమనించకపోవడం పెద్ద తప్పు. కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులను పూర్తిగా పక్కన పెట్టేయడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందవు. దీనివల్ల జుట్టు రాలడం, చర్మం నిస్తేజంగా మారడం, ఎముకలు బలహీనపడటం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు తగినంత తీసుకోకపోవడం.. నీరు తగినంత తీసుకోకపోవడం  శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. చాలామంది దప్పికను, ఆకలిని సరిగా గుర్తుపట్టలేక దప్పికైనప్పుడు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ప్రతిరోజూ శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు తాగడం వల్ల టాక్సిన్లు బయటకు పోవడమే కాకుండా, జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. వ్యాయామం.. వ్యాయామం విషయంలో కూడా తీవ్రమైన తేడాలు కనిపిస్తుంటాయి. కొందరు అసలు వ్యాయామమే చేయకుండా కేవలం డైటింగ్ పై ఆధారపడితే, మరికొందరు మితిమీరిన వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం కష్టపెట్టడం వల్ల కండరాల బలహీన పడతాయి,  గాయాలు అయ్యే అవకాశం ఉంది. నిద్ర.. బరువు తగ్గే ప్రయాణంలో నిద్ర పాత్ర చాలా కీలకమైనది. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి. మానసిక ఒత్తిడి.. మానసిక ఒత్తిడి కూడా బరువు తగ్గే ప్రక్రియకు పెద్ద అడ్డంకి. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలై పొత్తికడుపు భాగంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. ప్రతిరోజూ బరువు చూసుకుంటూ తీవ్ర ఆందోళనకు గురికావడం వల్ల కూడా ఎలాంటి పాజిటివ్ ఫలితాలు రావు. బరువు తగ్గడం అనేది చాలా చిన్న  ప్రక్రియ కాదు, అదొక ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పు. ఎనర్జీ , పోషకాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, సమతుల్యాహారాన్ని సరిపడా పరిమాణంలో తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, మంచి నీరు బాగా తాగడం వంటి అలవాటు పాటించడం ద్వారా మాత్రమే పూర్తిగా బరువు తగ్గడం లో   ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు.                          *రూపశ్రీ.
నేటి ఆధునిక జీవనశైలిలో మనిషి అలవాట్ల నుండి ఆహారం వరకు అన్నీ మారిపోయాయి.  ఉదయాన్నే ఆఫీసులకు పరిగెత్తే హడావుడిలోనో లేదా సాయంత్రం వేళల్లో కాస్త  ఆకలి వేసినా సరే.. ఇంట్లో వండుకోవడం లేదా బయట వండినవి తినడానికి బదులుగా..   ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపైన డిపెండ్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ షెల్ఫుల్లో ఆకర్షణీయమైన రంగురంగుల ప్యాకెట్లలో మెరిసిపోయే చిప్స్, ఇన్స్టెంట్ నూడుల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, రెడీ టూ ఈట్ వంటకాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితాల్లోనూ భాగమైపోయాయి. వీటిని ప్యాకెట్ విప్పడం, వెంటనే తినేయడం చాలా సులభం. రుచి కూడా నాలుకను బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పెను ప్రమాదం దాగి ఉందన్న విషయం  చాలామంది గమనించడం లేదు. ఆరోగ్య నిపుణులు, వైద్య ప్రపంచం ఇప్పుడు ఈ ఆహారాల పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ప్యాకింగ్ ఆహారాలు  శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతాయో వివరంగా తెలుసుకుంటే.. ప్యాక్ ఫుడ్ లేదా ప్రాసేస్ ఫుడ్.. ప్యాక్ చేసిన లేదా ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసిన ఆహారాలను  ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు. వీటిని తయారుచేసే విధానంలో రుచి, రంగు, వాసన ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి అనేక రకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు , అడిటివ్‌లను కలుపుతారు. ఈ తరహా ఆహారాలలో కేలరీలు, ఉప్పు, చక్కెర, హానికరమైన క్రొవ్వు పదార్థాలు చాలా అధిక పరిమాణంలో ఉంటాయి. విచారకరమైన విషయమేమిటంటే, శరీరానికి అత్యంత అవసరమైన పీచు పదార్థం , విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు వీటిలో దాదాపు శూన్యం. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. పోషకాలు లేని ఈ ఖాళీ కేలరీలు అనారోగ్యానికి మూలకారకాలుగా మారుతాయి. ప్యాకేజ్ లేదా ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల జరిగేది ఏంటి ? ఈ ప్రాసెస్డ్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్య విపరీతమైన బరువు పెరగడం. చిన్న వయస్సులోనే పిల్లలు, యవ్వనంలో ఉన్నవారు ఊబకాయం బారిన పడటానికి ఈ అలవాటే ప్రధాన కారణమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి శరీరంలోకి చేరిన తర్వాత తొందరగా  కొవ్వుగా మారి పేరుకుపోతాయి. అలాగే, వీటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడితోనే ఆగకుండా, ప్యాకెట్ ఆహారాలలో అధికంగా ఉండే సోడియం అంటే ఉప్పు , సంతృప్త కొవ్వుల వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు, కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందడానికి పీచు పదార్థం చాలా ముఖ్యం. కానీ ప్యాక్ చేసిన ఆహారాలలో ఈ ఫైబర్ కంటెంట్ బొత్తిగా ఉండదు. ఫలితంగా దీర్ఘకాలిక మలబద్ధకం, పేగుల వ్యాధులు , జీర్ణక్రియ లోపాలు ఎదురవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇటువంటి ఆహార అలవాట్లు వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్యాకెట్లపై కనిపించే ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లు ప్రజలను   బలహీనులను చేస్తాయి. అందుకే వాటి వైపు చాలా ఆకర్షితులు అవుతారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడానికి కొంత ముందస్తు జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఏదైనా ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్యాకెట్ వెనుక ఉన్న న్యూట్రిషన్ లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వుల పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎప్పుడూ  బయట దొరికే ప్రాసెస్డ్ స్నాక్స్ స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్  వంటి సహజమైన ఆహారాన్ని మన దినచర్యలో భాగం చేసుకోవాలి. మన శరీరం మనం తినే ఆహారంతోనే నిర్మితమవుతుంది కాబట్టి, నోటికి ఇచ్చే తాత్కాలిక రుచి కంటే శరీరానికి ఇచ్చే శాశ్వత ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం.                                                                                                                                                                                                                                                                                                            *రూపశ్రీ.