LATEST NEWS
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. మీరే నా కుటుంబం.. నా ఆత్మబంధువులు.! దీపావళి పండుగ ఉన్నప్పటికీ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలిపారు. "మీరే నా కుటుంబం.. మీరే నా ఆత్మబంధువులు. మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగాను. నేను అడిగిన దానికంటే ఎక్కువగా మీరు నాకు అందించారు. ఇక జీవితంలో నేను ఆశించేది ఏమీ లేదు. మీ అందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చడమే నా లక్ష్యం" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతా.! ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని సీఎం తెలిపారు. 2034 నాటికి ఈ సంఖ్యను కోటి మందికి చేర్చడంతో పాటు, ప్రతి ఒక్కరినీ కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉపాధి.. ఆర్థిక స్వావలంబన.! మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు. దీని ద్వారా ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వ్యాపారం చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ మహిళలను భాగస్వాములను చేశామని తెలిపారు. సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని వెల్లడించారు. గత 34 నెలల్లో మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.79 వేల కోట్ల రుణాలు అందించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కృషిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం.! కొత్తగా మంజూరు చేసిన 4.5 లక్షల పెన్షన్లలో 3.5 లక్షలు ఒంటరి మహిళలు, వితంతువులకే కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. నేత, గీత కార్మికులకు కూడా కొత్త పెన్షన్లను సంతృప్త స్థాయిలో మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు మహిళల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ 37 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు చెల్లించి సంస్థను లాభాల బాటలోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు.! ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఏం చేశారో, ఏం అందించారో ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తుకు భరోసా.! మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు తమ పిల్లల చదువుపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. "మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదు. ఆడబిడ్డలను ఉన్నత చదువులు చదివించండి. చదువే వారి జీవితాలను మారుస్తుంది. మీ పిల్లల చదువులపై మీకు ఎంత శ్రద్ధ ఉందో.. నాకు కూడా అంతే శ్రద్ధ ఉంది" అని పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ తమ పిల్లలకు ఉన్నత విద్య అందిస్తామని మాట ఇవ్వాలని కోరారు. మహిళలు నిలబడాలని, ఆర్థికంగా ఎదగాలని, పారిశ్రామికవేత్తలుగా మారాలని పిలుపునిచ్చారు. మహిళా శక్తే నా శక్తి.! "మీ అన్నగా, మీ తమ్ముడిగా సేవలందించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మీ సంతోషమే నా సంతోషం. మీ కోసమే నేను కష్టపడుతున్నాను. నా పుట్టినరోజును మీ మధ్య జరుపుకోవాలని వచ్చాను. ఈ జన్మదినాన్ని నా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నాను. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దగలిగితే నా జన్మ ధన్యమవుతుంది" అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.   ఇది కూడా చదవండి: అల్లూరి జిల్లాలో వైసీపీ హవా.. 7 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీ స్థానాలు కైవసం. !   [ Women Empowerment, Self Help Groups, CM Revanth reddy, SHG Women, Telangana Government, Women Entrepreneurs, Crorepati Women, Indiramma Canteens, Bank Linkage Loans, Free Bus Travel, Indiramma Indlu, Minister Seethakka, Women Welfare Schemes, Telangana News, KTR ]
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు. కానీ, నెల్లూరు జిల్లాలో ఓ అభ్యర్థి మాత్రం వీటన్నింటికీ దూరంగా ఉండి సంచలన విజయాన్ని నమోదు చేశారు. జైలు గోడల మధ్య రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పోటీ చేశారు. అయితే, ఓ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన జైలుకు వెళ్లాల్సి రావడంతో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఓటర్లను కలవడం, బహిరంగ సభల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆయన విజయం సాధిస్తారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. ఆయన సతీమణి, కుమార్తెతో పాటు సన్నిహితులు గ్రామగ్రామాన తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఇంటింటికీ వెళ్లి ఆయనకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. గతంలో సత్యనారాయణ రెడ్డి చేసిన సేవలు, స్థానికంగా ఆయనకు ఉన్న పరిచయాలు, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఓటర్లకు వివరించారు. అభ్యర్థి స్వయంగా ప్రచారంలో పాల్గొనలేని పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు కుటుంబ సభ్యుల శ్రమ.. ఇటు స్థానికంగా సత్యనారాయణ రెడ్డికి ఉన్న ప్రజాదరణ వెరసి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆయన తన సమీప టీడీపీ ప్రత్యర్థిపై ఏకంగా 1,719 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఒకవైపు జైలు జీవితం.. మరోవైపు ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరం.. అయినప్పటికీ భారీ మెజారిటీతో గెలుపొందడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. అభ్యర్థి తరఫున కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం కూడా ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి, పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల ఫలితం స్థానిక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జైలు గోడల మధ్య ఉన్న అభ్యర్థికి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: బస్తర్‌లో సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు   [ Kamireddy Satyanarayana Reddy, Pellakuru ZPTC Election, Nellore Central Jail, YSRCP, Andhra Pradesh Local Body ElectionsNellore, ZPTC Election Results, Andhra Pradesh Local Body Elections Nellore Central Jail Candidate Win, YSRCP Nellore Election News  ]  
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు. దశాబ్దాల పాటు వామపక్ష తీవ్రవాదంతో అట్టుడికిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఆయన భద్రతా బలగాల మధ్య దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.    చాలా కాలం తర్వాత దేశంలోని ప్రతి జిల్లా నక్సల్స్ బెడద నుంచి పూర్తిగా విముక్తి పొందిన తర్వాత జరుపుకుంటున్న మొట్టమొదటి దీపావళి ఇదేనని ప్రధాని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. బస్తర్‌లోని కరన్‌పూర్‌లోని కోబ్రా ఆపరేషన్స్ బేస్‌ను సందర్శించిన ఆయన, అక్కడి జవాన్లతో మమేకమై వారిని అభినందించారు.దేశ సరిహద్దులను కాపాడే సైనికులతో పాటు, అంతర్గత భద్రతను పటిష్టం చేస్తూ దేశం లోపల శత్రువులతో పోరాడుతున్న భద్రతా సిబ్బంది పాత్ర కూడా ఎంతో కీలకమని మోదీ అభివర్ణించారు.  సంవత్సరాలుగా అసాధ్యంగా మారిన నక్సలిజం ఏరివేత కేవలం బలగాల అంకితభావం, త్యాగాల వల్లే సాధ్యమైందని కొనియాడారు.హింసాత్మక ఘటనలతో దెబ్బతిన్న ఈ ప్రాంతం నేడు ప్రశాంత వాతావరణంలో సరికొత్త అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాత్మక చర్యలు, తెగని పట్టుదలతో మావోయిజం వెన్నువిరిచామని, దీనివల్ల అమాయక ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు నక్సల్స్ ప్రాబల్యంతో వెనుకబడిన బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీఠ వేసింది. రోడ్ల నిర్మాణం, మెరుగైన డిజిటల్ కమ్యూనికేషన్, బ్యాంకింగ్ సేవలు, పోస్టల్ శాఖల విస్తరణ వేగవంతం కావడంతో స్థానిక గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లే ఉందని ప్రధాని తెలిపారు.  ఈ పండుగ వేళ దేశ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించిన ఆయన, దేశ ఐక్యతకు భంగం కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.శాంతి భద్రతలు పూర్తిగా అడుగుపెట్టిన బస్తర్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతుండటంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగై, ఈ ప్రాంతం దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలతో సమానంగా పురోగమిస్తుందని భావిస్తున్నారు.   ఇది కూడా చదవండి: శతవత్సరంలోకి అడుగుపెట్టిన బీజేపీ దిగ్గజం ఎల్.కె. అద్వానీ.!     [ Bastar Diwali celebrations pm modi, Naxalism free India, Chhattisgarh security forces, CoBRA base Karanpur, Left-wing extremism end, Diwali celebrations 2026, Indian Security Forces, CoBRA Commandos, Telugu One, Telugu News ]
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.! కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేశారు.. రోజంతా ఎండనకా, వాననకా కష్టపడ్డారు. చేతికి వచ్చిన కూలీ డబ్బులతో ఇంట్లో వాళ్లకు కాస్త సంతోషాన్ని పంచాలనుకున్నారు. పని ముగించుకుని అలసిన శరీరాలతో ఇంటి దారి పట్టారు. కానీ.. వారు ఇంటికి చేరుకోకముందే మృత్యువు మార్గమధ్యంలో కబళించింది. క్షణాల్లో జరిగిన ఘోర ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పండుగ వేళ ఆనందంగా ఉండాల్సిన ఇళ్లలో అంతులేని రోదనలు మిగిల్చింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అప్పా జంక్షన్ సమీపంలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముచ్చింతల్ ప్రాంతంలో భవనానికి పెయింటింగ్ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో సహా సుమారు 17 మంది ప్రయాణిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని లేదా టిప్పర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆటో నుంచి బయటకు తీసి అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ORR సిబ్బంది సుమారు 20 కిలోమీటర్ల మేర ఆ వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమా? అతివేగమా? సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజంతా కష్టపడి కుటుంబం కోసం సంపాదించుకుని తిరిగి వస్తున్న కూలీలు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు వారి మరణవార్త పిడుగులాంటి దెబ్బగా మారింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం.. మరికొన్ని క్షణాల వేగం.. మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయా? అన్న ప్రశ్నలు ఈ ప్రమాదం తర్వాత మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.!     [ Rajendranagar Road Accident, Hyderabad ORR Accident, Appa Junction, Mucchintal, Telangana Police Academy, Outer Ring Road, Three Workers Killed, Auto Lorry Collision, Labourers Death, 17 Passengers in Auto, Road Accident News, Rangareddy District, Hyderabad News, Rajendranagar Police ]  
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తల్లాచెరువు గ్రామానికి చెందిన బత్తుల మర్రెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిషాంత్‌రెడ్డి (38) గత ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. నిషాంత్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ మృతి చెందిన విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తీవ్ర అనారోగ్య సమస్యలు లేదా కుటుంబపరమైన ఇబ్బందులు ఏమైనా కారణమా అనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారు. అయితే, దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గౌలిదొడ్డిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.       [ Gachibowli Incident, Hyderabad News, Gowlidoddy, Jayabheri Nirvana Apartments, Family Deaths, Bathula Marreddy, Bharathi, Nishanth Reddy, Nagarkurnool, Achampet, Telangana Police, Police Investigation, Clues Team, Postmortem ]  
ALSO ON TELUGUONE N E W S
అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ‘కింగ్ 100’. ఇప్పటికే టబు ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు మరో కీలక పాత్రను పరిచయం చేసింది. తమిళ నటుడు అశోక్ సెల్వన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కర్ణ’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ‘కింగ్ 100’ నుంచి విడుదలైన అశోక్ సెల్వన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఆయన ఓ జైలు ముందు కుర్చీలో కూర్చొని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. పక్కనే పోలీస్ యూనిఫామ్ ఉండటంతో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ‘నో రూల్స్.. నో లిమిట్స్’ అంటూ కర్ణ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ఈ సినిమాలో అశోక్ సెల్వన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా, నాగార్జునకు ప్రధాన ప్రత్యర్థిగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్రబృందం ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫస్ట్ లుక్ చూస్తుంటే కర్ణ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ‘సూదు కవ్వుమ్’, ‘పిజ్జా 2: విల్లా’, ‘తెగిడి’, ‘ఓ మై కడవులే’, ‘పోర్ తొళిల్’ వంటి సినిమాలతో అశోక్ సెల్వన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు నాగార్జున వందో సినిమాలో కీలక పాత్ర దక్కించుకోవడం విశేషం. దర్శకుడు రా. కార్తీక్‌తో అశోక్ సెల్వన్‌కు ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నితమ్ ఒరు వానం’ తెరకెక్కింది. ఇప్పుడు ‘కింగ్ 100’ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ నాగార్జున, టబు కలయిక. దాదాపు 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇందులో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆమె గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. https://x.com/AnnapurnaStdios/status/2119303187446300681       [King 100 Movie, Ashok Selvan As Karna, Akkineni Nagarjuna, Ra Karthik, Ashok Selvan, Nagarjuna, Tabu, Telugu Film News]  
కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. మరికొన్ని సినిమాలు మాత్రం నటీనటుల కెరీర్‌నే మార్చేస్తాయి. అలాంటి సినిమానే పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా శృతి హాసన్ కెరీర్‌కు ఎంత పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడిన శృతి.. తనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శృతి హాసన్ కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’, తమిళంలో ‘7ఆమ్ అరివు’ వంటి సినిమాల్లో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అలాంటి సమయంలో 2012లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గబ్బర్ సింగ్’ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రలో శృతి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చింది. అప్పటివరకు విమర్శించిన వారే గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గబ్బర్ సింగ్’ గురించి మాట్లాడిన శృతి.. ఈ సినిమా తన జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో గుర్తు చేసుకున్నారు. ‘‘గబ్బర్ సింగ్‌కు ముందు శృతి హాసన్ వేరు.. ఆ సినిమా తర్వాత శృతి హాసన్ వేరు. అది చాలా పెద్ద హిట్. నా కెరీర్‌నే మార్చేసింది. టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ భాగ్యలక్ష్మిని అయిపోయాను. నా దశ మారిపోయింది. ఆ తర్వాత రకరకాల కథలు, పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి’’ అని చెప్పారు. తాను తెలుగమ్మాయిని కాకపోయినా తెలుగు ప్రేక్షకులు తనను ఒక తెలుగు అమ్మాయిలాగే ఆదరించారని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఇచ్చిన పేరు, గుర్తింపుకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. కొందరు హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేసి.. డబ్బు, పేరు సంపాదించి.. ఆ తర్వాత తెలుగు సినిమాలనే విమర్శించడం చూస్తున్నాం. కానీ, శృతి హాసన్ మాత్రం తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని, ఆ విజయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా మాట్లాడుతుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.        [Shruti Haasan About Gabbar Singh, Shruti Haasan Interview, Gabbar Singh Movie, Pawan Kalyan, Shruti Haasan, Tollywood, Telugu Film News]  
అక్కినేని హీరో నాగచైతన్య అప్ కమింగ్ మూవీ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఆకట్టుకుంటోంది. ‘వృషకర్మ’ సినిమాలో నాగచైతన్య అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాట ద్వారా ఆ పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అర్జున్ ఒక ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తున్నాడు. తెలియని ప్రదేశాల్లోకి వెళ్లడం, గుహల్లో అన్వేషణ చేయడం, ప్రమాదాలను ఎదుర్కోవడం వంటి సాహసాలు చేసే వ్యక్తిగా అతడి పాత్రను చూపించారు. పాట మొదలైనప్పటి నుంచే అర్జున్ క్యారెక్టర్‌లోని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. చీకటిలో కూడా తన చూపులతో వెలుగులు నింపాలనే భావన, తన ముందు ఎలాంటి సవాళ్లు నిలవలేవనే ధీమా.. ఇలా ప్రతి లైన్‌లోనూ అతడి ఆటిట్యూడ్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ప్రణవ్ చాగంటి రాసిన సాహిత్యంలో అర్జున్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేశారు. తనలో పుట్టుకతోనే స్వాగ్ ఉందని, తన ప్రయాణంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పే భావన పాటలో కనిపిస్తుంది. ముఖ్యంగా ‘సూరీడే చిమ్మచీకట్లో నా చూపుల్లో ఉదయించాలి’ అనే భావం అర్జున్ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. చీకటి ఎంతటి సవాలుగా ఎదురైనా తన దృష్టి, ధైర్యంతో దాన్ని అధిగమించగలననే అర్థం ఇందులో ఉంది. అలాగే సునామీ కూడా తలవంచాలనే భావనతో తన బలాన్ని అతిశయోక్తిగా వర్ణించారు. ‘I'm Born To Rule’ అనే ఇంగ్లీష్ హుక్ లైన్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తాను పరిస్థితులకు లొంగిపోయే వ్యక్తిని కాదని, తనదైన ప్రపంచాన్ని సృష్టించుకునే నాయకుడిననే అర్జున్ మనస్తత్వాన్ని ఈ లైన్ ప్రతిబింబిస్తుంది. మొత్తంగా ఈ పాట ఒక సాహసికుడి ఆత్మవిశ్వాసం, ధైర్యం, గెలవాలనే పట్టుదల చుట్టూ సాగుతుంది. ‘కాంతార’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలతో తన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ పాటకు సంగీతం అందించడమే కాకుండా స్వయంగా పాడారు. ట్రెండీ బీట్స్, టెక్నో గిటార్ రిథమ్స్‌తో పాటను ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. పాటలోని బీట్స్ అర్జున్ పాత్రకు ఉన్న స్టైల్, ఆటిట్యూడ్‌కు సరిపోయేలా ఉన్నాయి.  ‘విరూపాక్ష’తో హారర్ థ్రిల్లర్‌లో తన మార్క్ చూపించిన దర్శకుడు కార్తీక్ దండు.. ఈసారి మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ మంచి మ్యూజికల్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. - Swag of Arjun Lyrical Video        [Vrushakarma Movie, Swag of Arjun Song, Naga Chaitanya, Ajaneesh Loknath, Karthik Dandu, Meenakshi Chaudhary, Telugu Songs 2026, Telugu Film News]  
Superstar Rajinikanth's upcoming film Dharman is getting bigger with an exciting addition to its cast. Energetic Star Ram Pothineni has joined the ambitious project, marking his Tamil debut alongside one of Indian cinema's biggest superstars. The film is also special as it marks Rajinikanth's first collaboration with Kamal Haasan as producer. Directed by Ashwath Marimuthu, Dharman is shaping up as a major action entertainer. Ram is said to be playing a powerful and dynamic character, with the director creating substantial scope for him to share the spotlight with Rajinikanth. Their combination is expected to be one of the film's biggest attractions. Ram, who has established himself as a popular star in Telugu cinema with his energetic performances and distinctive screen presence, will be seen in a new space with this project. Although his character's complete look is yet to be revealed, Anirudh Ravichander has reportedly composed a special background score for it, matching the character's stature and Ram's star image. The film also features Nayanthara, Simran, Sreeleela and Raashii Khanna in prominent roles. With such a formidable ensemble, Dharman is aiming for a grand cinematic experience across languages. Produced by Raajkamal Films International, with Mahendran as producer, the film's shoot is progressing at a brisk pace. Ram's inclusion has further raised expectations around this Rajinikanth-led action spectacle.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
Nandamuri Balakrishna is set to entertain audiences with another high-energy entertainer, Dada, directed by Gopichand Malineni. After generating strong anticipation with its birthday and title glimpses, the film is gearing up for a worldwide theatrical release on December 24. On the occasion of Diwali, the makers unveiled a special poster featuring Balakrishna and Nargis Fakhri dancing together for the song Dada Dhamakha. The grand visuals offer a glimpse of what promises to be a high-voltage mass number. Composed by S Thaman, the song is packed with energetic beats designed to complement Balakrishna's trademark screen presence. His dance moves alongside Nargis Fakhri are expected to be one of the major attractions of the number. The makers have confirmed that Dada Dhamakha will be released on November 13. The special poster has already raised expectations around the song's scale and choreography. Gopichand Malineni is presenting Balakrishna in a particularly stylish and youthful avatar in this action entertainer. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles. Produced by Venkata Satish Kilaru on a lavish scale, Dada is positioned as a major Christmas-season release, with the team aiming to deliver a mass entertainer in theatres.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు దర్శకుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం వశిష్ఠ ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కథలోని ప్రతి అంశాన్ని పక్కాగా సెట్ చేసుకున్న తర్వాతే సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞను తొలి సినిమాతోనే కొత్తగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వశిష్ఠ విభిన్నమైన కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా భారీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనుందని, ఇందులో పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్‌లైన్స్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని టాక్. అంతేకాదు, కథకు తగ్గట్టుగా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట. గతంలో ‘బింబిసార’ సినిమాతో సోషియో ఫాంటసీ జానర్‌లో తన సత్తా చాటిన వశిష్ఠ.. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం మరోసారి అలాంటి జానర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. అదే నిజమైతే తండ్రీకొడుకులను ఒకే సినిమాలో చూడటమనేది నందమూరి అభిమానులకు పండగే.       [Mokshagna Debut Movie Shooting, Balakrishna Son Mokshagna, Mokshagna Movie Shooting Update, Nandamuri Balakrishna, Nandamuri Mokshagna, Director Vassishta, Mythri Movie Makers, Telugu Film News]  
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో రామ్ నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. రాశీ ఖన్నాకు జోడీగా రజనీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటిస్తాడని, అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని రకరకాల ప్రచారాలు జరిగాయి. రామ్ రోల్ ఏంటనేది రివీల్ చేయలేదు కానీ, ‘ధర్మన్’లో రామ్ నటిస్తున్నట్లు అదిరిపోయే గ్లింప్స్‌తో అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన సిమ్రన్ నటిస్తుండగా.. రాశీ ఖన్నా, నయనతార, శ్రీలీల, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. 2027 ఏప్రిల్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ పోతినేని గతంలో ‘ది వారియర్’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు నేరుగా రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు. మరి ‘ధర్మన్’లో రామ్ పాత్ర ఎలా ఉండబోతోంది? రజనీతో ఆయన స్క్రీన్ షేరింగ్ ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. https://x.com/RKFI/status/2119376888405578034       [Ram Pothineni In Dharman, Superstar Rajinikanth, Dharman Movie, Ram Pothineni, Kamal Haasan, Ashwath Marimuthu, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దీపావళి కానుక అదిరిపోయింది. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’ నుంచి మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చేతిలో కొడవలి పట్టుకొని పొలంలో నిలబడి కనిపిస్తున్నారు. ఆయన లుక్, యాక్షన్ మోడ్ చూస్తుంటే సినిమాలో మెగాస్టార్ ఊచకోత ఏ రేంజ్‌లో ఉండబోతుందో పోస్టర్‌తోనే హింట్ ఇచ్చినట్లుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. మరోసారి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘కాకా’పై ఆసక్తి పెరిగింది. అందులోనూ ఈసారి చిరంజీవిని మరింత మాస్ అవతార్‌లో చూపించబోతున్నారనే టాక్ ఉంది. ఇక ఈ పోస్టర్‌తో పాటు సినిమా విడుదల తేదీపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. దీంతో ‘కాకా’ వాయిదా పడుతుందంటూ ఇటీవల వినిపించిన ప్రచారానికి చెక్ పడినట్లయింది. ఈ సినిమాలో కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి సంక్రాంతి బరిలోకి దిగనున్న మెగాస్టార్.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. https://x.com/KaakaMovie/status/2119311973427134527       [Kaaka Diwali Poster, Chiranjeevi Kaaka Movie, Kaaka Sankranthi Release, Kaaka Release Date, Kaaka Movie, Megastar Chiranjeevi, Bobby Kolli, Anaswara Rajan, Telugu Film News]  
సోషల్ మీడియా.. సెలబ్రిటీలకు అభిమానులను దగ్గర చేసే వేదిక మాత్రమే కాదు.. ఒక్కోసారి అదే వేదిక వాళ్లకు తలనొప్పిగా కూడా మారుతోంది. ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా వెంటనే ట్రోలింగ్ మొదలవుతోంది. ఇక యువత పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్ అంటూ సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “మా తరం చాలా అదృష్టవంతులం. మా రోజుల్లో సోషల్ మీడియా లేదు. కానీ ఈ తరానికి సోషల్ మీడియా ఉంది. అది అత్యంత క్రూరమైనది. దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు” అని నాగార్జున అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని, ముఖ్యంగా యువత దాని ప్రభావానికి ఎక్కువగా లోనవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. నాగార్జున సమర్పణలో మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ‘ఇట్లు అర్జున’ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున, అనీష్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు సోషల్ మీడియా ప్రభావంపై నాగార్జున మాట్లాడారు. తాము హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సోషల్ మీడియా లేకపోవడం తమ అదృష్టమని, కానీ ఇప్పటి కొత్త హీరోలు ఈ క్రూరమైన సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేకపోతున్నారని అన్నారు. సోషల్ మీడియా విషయంలో తన తరం అదృష్టవంతులమని నాగార్జున చెప్పడం వెనుక సెలబ్రిటీల అనుభవం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి బయటకు వచ్చే సమాచారం పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు, ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ‘ఇట్లు అర్జున’ సినిమా గురించి కూడా నాగార్జున ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ చిత్రం నేటి యువత ఆలోచనలు, వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని.. యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.       [Nagarjuna Social Media Comments, Akkineni Nagarjuna, Social Media, Itllu Arjuna, Aniesh, Anaswara Rajan, Telugu Film News]  
నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ‘దాదా’ సినిమా నుంచి తొలి పాట విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘దాదా ధమాకా’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 13న విడుదల చేయనున్నారు. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ స్టైలిష్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన పక్కనే బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా ఉన్నారు. ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఈ పాటలో బాలయ్య, నర్గీస్ ఫక్రీ కలిసి స్టెప్పులు వేయబోతున్నారని అర్థమవుతోంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ-తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ‘దాదా ధమాకా’ పాటపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘దాదా’ సినిమా విడుదల తేదీపై కొంతకాలంగా వాయిదా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ ఆలస్యం, బాలకృష్ణకు జరిగిన గాయం కారణంగా సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్రబృందం మాత్రం డిసెంబర్ 24న థియేటర్లలోకి వస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో మరోసారి అదే రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై మంచి అంచనాలు ఉన్నాయి. 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. https://x.com/NBKisDADA/status/2119304488641339633       [Dada First Single, Dada Dhamaka Song, Balakrishna Dada Movie, Nandamuri Balakrishna, Nargis Fakhri, Thaman, Gopichand Malineni, Telugu Songs]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  శరీరంలో కఫం పేరుకుపోవడం వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మారుతున్న కాలం, వాతావరణంలో వచ్చే మార్పులు, వివిధ రకాల అలర్జీల కారణంగా ముక్కు దిబ్బడ, గొంతులో గరగర, ఛాతీలో కఫం గడ్డకట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రకరకాల మందులు, యాంటీబయోటిక్స్ వాడుతుంటారు.  వీటి వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో  తయారు చేసుకునే పానీయం  తాగడం వల్ల ఈ సమస్యను  శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.  ఇంతకూ ఈ పానీయం ఏమిటి? దాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి?  ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కఫం.. మన శరీరంలో కఫం అనేది ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ లేదా ముక్కు భాగాల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పేరుకుపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరం ఎంతో అలసటకు గురవుతుంది. దీనిని నివారించడానికి వంటింట్లో లభించే నాలుగు ముఖ్యమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు..  తేనె.. తేనెలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గొంతును ప్రశాంతంగా ఉంచుతూ, పేరుకుపోయిన గట్టి కఫాన్ని పల్చగా మార్చడానికి తేనె ఎంతగానో సహాయపడుతుంది.  అల్లం.. అల్లంలో జింజిరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒక సహజమైన డికంజస్టెంట్ లా పనిచేస్తుంది. గొంతులో , చాతిలో పేరుకుపోయిన మందపాటి కఫాన్ని కరిగించి, అది సులభంగా శరీరం నుంచి బయటకు వచ్చేలా చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది వాపులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మిరియాలు.. మిరియాలు ముక్కు మార్గాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అక్కడ చిక్కుకున్న కఫాన్ని కరిగించి బయటకు పంపడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అల్లం , తేనెలోని పోషకాలు శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు సహాయపడతాయి. నిమ్మరసం.. నిమ్మరసంలో విటమిన్ సి  పుష్కలంగా  ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కఫానికి కారణమయ్యే అలర్జీలను అరికట్టి, గొంతు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది. పై నాలుగు పదార్థాలను ఉపయోగించి ఈ కింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఫాలో అవుతూ మంచి ఫలితం పొందవచ్చు.. మొదటి పద్దతి.. ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో తాజా అల్లం రసం లేదా అల్లం పొడి కలపాలి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి. ఇది గొంతులో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం ఇస్తుంది. రెండవ పద్ధతి.. ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి, అందులో అల్లం పొడి లేదా తురిమిన అల్లం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం వేయాలి. చివరగా ఒక టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనె కలిపిన తర్వాత నీటిని మరిగించకూడదు. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా తాగితే గొంతుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పైన చెప్పుకున్న రెమిడీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకుంటే రాత్రంతా పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్రలో కఫం అడ్డుపడకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.                                     *రూపశ్రీ.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*