LATEST NEWS
'కేజీఎఫ్' మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న కన్నడ స్టార్ యశ్ హత్యకు కుట్ర చేసిన స్లమ్ భరత్ అనే మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. భరత్ పై ఓ మర్డర్ కేసు సహా 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదిగా యశ్ ను హత్య చేసేందుకు భరత్ ప్లాన్ చేస్తుండగా, అతను ప్లాన్ ను అమలు చేయకముందే పోలీసులు దాన్ని భగ్నం చేశారు. భరత్ ని గత సంవత్సరం యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు, కర్ణాటకకు తీసుకువచ్చారు. కాగా, ఓ కేసుకి సంబంధించి సీన్ రీ కన్ స్ట్రక్షన్ నిమిత్తం తాజాగా అతన్ని బయటకు తీసుకెళ్లగా, పోలీసులపై అతను దాడికి దిగాడని, దీంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి  జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం భరత్ తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భరత్.. యశ్ హత్యకు కుట్ర పన్నినట్టు తెలిపాడు. ఈ వార్త కలకలం రేపింది. ఈ వార్తలపై అప్పట్లో యశ్ కూడా స్పందించాడు. ఇలాంటి వార్తలు తనను బాధిస్తున్నాయని, తనపై ఎటువంటి కుట్రలూ జరుగడం లేదని అప్పట్లో యశ్ మీడియాకు వెల్లడించాడు. తనకు ఎలాంటి థ్రెట్స్ లేవని, ఈ విషయమై హోమ్ మంత్రితో పాటు, డీజీపీతో మాట్లాడానని అన్నారు. యశ్ అప్పుడు ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఇప్పుడు, అదే క్రిమినల్ ఎన్ కౌంటర్ లో హతం అవడం చర్చనీయాంశమైంది.
టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రజలలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఈ తొమ్మిది నెలల కాలంలో.. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆయన ఏదైనా సమస్య మీద నిరసన తెలపాలి అనుకున్న ప్రతిసారి ఆయనను నిర్బంధిస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయనను నాలుగు సార్లు నిర్బంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రికంగా సృష్టించిందని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిరసన బాట పట్టగా.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో టీడీపీ కార్యకర్తలపై.. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని అప్పుడు టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని టీడీపీ చెప్పుకొచ్చింది. ఆ దాడులకు నిరసనగా చంద్రబాబు 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు. అయితే, చంద్రబాబును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంగా ఈ పర్యటనను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక కొద్ది రోజులుగా రాజధాని అంశం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు తెరలేపడంతో.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు  ఉద్యమం బాట పట్టారు. ఆ ఉద్యమానికి టీడీపీ అండగా నిలిచింది. చంద్రబాబు కూడా వారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే, ఒకసారి అమరావతి జేఏసీ బస్సు యాత్రని ప్రారభించాల్సిన సమయంలో.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు పాదయాత్రగా బస్సుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.  తాజాగా విశాఖ పర్యటన అయితే సరే సరి. జగన్ తొమ్మిది నెలల పాలనలో చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా చంద్రబాబు 'ప్రజా చైతన్య యాత్ర'కు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గురువారం చంద్రబాబు విశాఖకు వెళ్లగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట చంద్రబాబు కాన్వాయ్ ని అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకొని.. కాన్వాయ్ పైకి చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. వారిని పోలీసులు నిరువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని వెనక్కి పంపారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతిచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళన కారుల్ని అడ్డుకోవాల్సింది పోయి, ఇలా అనుమతిచ్చి మరీ ప్రతిపక్ష నేతని అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. తమ నేతని కావాలనే ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, టొమాటోలు, చెప్పులు విసిరారు. పోలీసులు వారిని నిలువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అనుమతి ఇచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు, ఎయిర్ పోర్ట్ వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌, ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా?.. చట్టం ముందు అందరూ సమానమే కదా? అని ప్రశ్నించింది. అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేసింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వాళ్లని కదా?.. మరి, ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు? అని హైకోర్టు నిలదీసింది. దీనిపై వచ్చే నెల 2న కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని ఆదేశించింది. అదే రోజే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
ALSO ON TELUGUONE N E W S
తమిళ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధిస్తుందని విడుదలకు ముందు ఎవరూ ఊహించలేదు. అప్పటికి కార్తి నటించిన రెండు మూడు సినిమాలు అంచనాలను తల్లకిందులు చేయడంతో ‘ఖైదీ’ని లైట్‌ తీసుకున్నారు. అనూహ్యంగా ప్రేక్షకులు అందరినీ ఆ సినిమా ఆకట్టుకుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో తీసిన సినిమా కాదు. అందులో హీరోయిన్‌ లేదు. అయినా... సూపర్‌ స్ర్కీన్‌ప్లే, డైరెక్టర్‌ టేకింగ్‌ తోడవడంతో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అందులో అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తున్నారు. హిందీలో ఆయనే ‘ఖైదీ’ అన్నమాట! తమిళంలో సినిమాను నిర్మించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ హిందీలో అజయ్‌ దేవగణ్‌ ఫిల్మ్స్‌, రిలయన్స్‌తో కలిసి ప్రొడ్యూస్‌ చేస్తోంది. సినిమా అనౌన్స్‌ చేయడంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
  "క్రైం హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్ టైం" అని ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తోన్న సంపత్ రాజ్ చెప్పడంతో 'రెడ్' టీజర్ మొదలైంది. ఆ కేసే 'రెడ్' సినిమాకు కీలకమని భావించవచ్చు. బహుశా ఆ కేసు చుట్టూనే కథ నడుస్తుందని మనం ఊహించగలం. ఏమిటా కేసు? ఆ కేసుకీ, ఇద్దరు హీరోలకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. "సిద్ధార్థ్, ఆదిత్య.. ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్, డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్" అంటూ చెప్పే గొంతు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తోన్న నివేతా పేతురాజ్‌ది.  'రెడ్' మూవీలో ఈ రెండు క్యారెక్టర్లనీ హీరో రామ్ పోషిస్తున్నాడు. సిద్ధార్థ్ జోడీగా మాళవికా శర్మ, ఆదిత్య సరసన అమృతా అయ్యర్ కనిపిస్తున్నారు.  సత్య, పోసాని కృష్ణమురళి పాత్రలు వినోదానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. నాజర్ జడ్జి పాత్రలో కనిపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 'రెడ్' టీజర్‌ను తన 'రామ్ పోతినేని' హ్యాండిల్లో యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు రామ్. 1 నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో రామ్ చేస్తున్న రెండు పాత్రల్నీ రివీల్ చేశారు. గడ్డంతో చూపులకు ఇద్దరూ ఒకేలా ఉన్నప్పటికీ, మేకప్ పరంగా ఇద్దరినీ భిన్నంగా చూపించే ప్రయత్నం చేసినట్లు కంపిస్తుంది. ఇద్దరి హెయిర్ స్టైల్స్ భిన్నంగా కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ పాత్ర కళ్లజోడు పెట్టుకుంటుంది. "వాంటెడ్‌గా నన్ను ఇందులో ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్‌లో వాడికున్న ఒన్ అండ్ ఓన్లీ అబ్సెషన్ నేనే" అని రామ్ అంటున్నాడు. డైలాగ్ డిక్షన్‌ను బట్టి ఆ మాటలు అంటోంది సిద్ధార్థ్ పాత్రధారి అనిపిస్తోంది. ఆదిత్యను ఉద్దేశించి అవి చెబ్తున్నాడని భావించాలి.  నిజానికి సిద్ధార్థ్, ఆదిత్య కవలలు.. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు.. తల్లిదండ్రులు విడిపోతే, ఒకరు తల్లి వద్దా, ఇంకొకరు తండ్రి వద్దా పెరుగుతారు. తల్లి దగ్గర పెరిగిన ఆదిత్య గ్యాంబ్లర్‌గా మారితే, తండ్రి దగ్గర పెరిగిన సిద్దార్థ్ బిజినెస్‌మేన్ అవుతాడు. ఒక కేసు వాళ్ల జీవితాల్ని మార్చేస్తుంది. పోలీసుల ఇన్వాల్వ్‌మెంట్ కనిపిస్తోంది కాబట్టి ఇది క్రైం మేళవించిన యాక్షన్ థ్రిల్లర్‌గా భావించవచ్చు. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ 'రెడ్'కు ఎస్సెట్స్ అని చెప్పాలి. రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో ఇదివరకు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగి' సినిమాలు వచ్చాయి. ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న ఈ మూవీతో వాళ్లు భారీ హిట్‌పై కన్నేశారు.
  భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో, కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్‌ ఫిల్మ్‌ 'ఓ పిట్ట కథ'. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు హీరోలుగా, నిత్యా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌ కానుంది. బ్రహ్మాజీ ఒక కీలక పాత్ర చేశారు. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతుండటం విశేషం. ఈ విషయాన్ని నిర్మాత వి. ఆనందప్రసాద్‌ తెలియజేస్తూ, "కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌" అన్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి సునీల్ కుమార్ ఎన్. సినిమాటోగ్రాఫర్.
రెగ్యులర్‌ గ్లామర్‌ హీరోయిన్‌ రోల్‌ కాకుండా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో రాశీ ఖన్నా నటించారు. కాలేజ్‌ ఎపిసోడ్స్‌లో తప్ప మ్యాగ్జిమమ్‌ సీన్స్‌లో ఏడుస్తూ కనిపించారు. బోల్డ్‌ సీన్స్‌ చేయడానికి వెనుకడుగు వేయలేదు. ఆర్టిస్ట్‌గా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ, రిజల్ట్‌ రివర్స్‌ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన విజయ్‌ దేవరకొండ సినిమా బోల్తా కొట్టింది. హీరో, ప్రొడ్యూసర్‌ మధ్య ఏవో సెటిల్‌మెంట్‌ ఇష్యూలు నడుస్తున్నాయనుకోండి. అవి పక్కన పెడితే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ విడుదల తర్వాత రాశీ ఖన్నా పెద్ద కనపడలేదు. రీసెంట్‌గా మళ్లీ తమిళ సినిమా ‘ఆరణ్మనై 3’ సెట్స్‌లో కనిపించారు. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్‌ కామెడీ ఫ్రాంఛైజీలో మూడో సినిమా ఇది. ప్రజెంట్‌ షూటింగ్‌ జరుగుతోంది. తన క్యారెక్టర్‌కు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో అని సెట్స్‌లో వెయిట్‌ చేస్తున్న ఫొటోను రాశీ ఖన్నా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. చూస్తుంటే అందులో మోడ్రన్‌ అమ్మాయి రోల్‌ చేస్తున్నట్టున్నారు.
  Cast: Dulquer Salmaan, Ritu Varma, Gautham Menon, Niranjani & others Background Music: Harsavarsan Ramesvaran Producer: Anto Joseph Director: Desingh Periyasamy Release Date: 28th Feb 2020 Dulquer Salmaan because close to Telugu audience with movies like 'OK Bangaram' & 'Mahanati'. And now his latest Telugu flick is Kanulu Kanulanu Dochayante. So how is this movie? Let us read the review. Story: Sid alias Siddharth(Dulquer Salmaan) & his friend call themselves as software developers but in real they are two big cheaters. Using various online & offline technologies, they cheat people & lead a jolly life. Sid falls in love with a freelance beautician Mira (Ritu Varma). Mira's friend likes Sid's crime partner. In this way the 4 keep meeting each other. Due to a crime done by Sid, a small incident occurs in DCP Pratap Sinha's (Gautham Menon) house. Does DCP finds out that? What is the reason behind Sid turning into a cheater? Answer to all these questions form the movie Kanulu Kanulanu Dochayante. Analysis: This movie is a Romantic thriller. But more than romance, there is thrill in this movie. The emotional scenes are not very deep in the movie. In the starting 17 mins, director just showcases hero's lifestyle. They will surely not entertain the audience. Later we are introduced to the actual story slowly. Once we start seeing the scams done by the hero, it will surely make the audience think twice about buying goods online. And slowly the story reaches the intermission. The twist revealed before the interval is too good. The second half of the movie is much more interesting. It will keep the audience on toes.   Plus Points: Story & twists in the story Ritu Varma's acting Dulquer - Ritu combination The second half Background music Minus Points: Opening scenes in first half Few scenes which do not have logics Conversations Performances: Dulquer - Ritu combination was too good to watch. There was a wonderful chemistry between the two. Specially, Ritu Varma's acting is a very big plus for the movie. All the others performed very well. But among them Gautham Menon must be truly appreciated. He surprises the audience everytime he is seen onscreen. TeluguOne Perspective: By seeing the movie title, we can easily tell that hero heroine will fall in love with each other. Though the twists in the movie are predictable the scenes on screen will give audience a superb thrill. It will give a feeling of watching a decent movie. The movie warns everyone about the scams that occur online. It also advises the youth, that they need to be careful while speaking to the strangers. Rating:3/5
Cast: Aberaam Varma, Kirti Garg, Prabhakar, Satyam Rajesh, Subbu Vedula & others Music Director: Praveen Lakkaraju Editor: Amar Reddy Producer: AVR Swamy Director: Subbu Vedula Release Date: 28th Feb 2020 Raahu is one among the small budget films released this friday. Though the cast & crew of the movie is new, there was some kind of expectation with this movie by the audience. And particularly the song sung by Sid Sriram bought craze among the audience. Now lets see, if the movie entertained the audience. Story: Bhanu (Kriti Garg) loses her mother at the age of six. Her mother battles cancer & passes away. From then onwards, Bhanu comes under the impression that there is no need to fight when we cannot win a battle. Bhanu suffers from conversion disorder. She cannot see anything, if she sees blood. She comes under stress & loses sight for sometime. Bhanu's father (Subbu Vedula) is a police commissioner. He catches hold of a gangster during Bhanu's childhood. During that point, the gangster promises to kill Bhanu at some point in time. So happens? Does he kill Bhanu? Does conversion disorder save Bhanu? Answers to all these questions forms the movie Raahu. Analysis: There are many mythological stories. And to make a story line which can connect to the audience is a good initiative. However the outcome depends on how effective the effort is. When it comes to the movie Raahu, eclipse and its effects are detailed in pur puranas. Similarly, in the life of a girl there is an eclipse which is trying to win over her. But this story line has not been convincingly narrated by the director. Plus Points: A major turning point in second half Heroine fight in the climax Song sung by Sid Sriram Minus Points: Cast Direction Entertainment Love story & its narration Conversations Performances: Kirti Garg did justice to Bhanu's character. But her acting scope was too less for thr audience to specially comment on her acting skills. Aberaam Varma is very hard to bear on screen. Instead of Subbu Vedula, had someone else performed that role, the character would have got elevated. Prabhakar has done justice to his role. There is nothing else to speak about other actors in the movie, it is sheer waste of time. TeluguOne Perspective: Director Subbu Vedula was unable to narrate a good storyline to the audience. Songs were good. Though it is little difficult, if one feels like encouraging new talent they can go & watch the movie. Rating: 1.5/5
నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, గౌతమ్ మీనన్, రక్షణ్, నిరంజని తదితరులు సినిమాటోగ్రఫీ:  కె.యం. భాస్కరన్     స్వరాలు: మసాలా కాఫీ నేపథ్య సంగీతం: హర్షవర్షన్ రామేశ్వరన్  నిర్మాతలు: వయాకామ్ 18 పిక్చర్స్, అంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ సంస్థలు తెలుగులో విడుదల: కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం: దేసింగ్ పెరియసామి విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2020 'ఓకే బంగారం', 'మహానటి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన తాజా చిత్రం 'కనులు కనులను దోచాయంటే'. హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.  కథ: సిద్ అలియాస్ సిద్ధార్థ్ (దుల్కర్ సల్మాన్), కల్లీస్ (రక్షణ్) స్నేహితులు. పైకి మొబైల్ అప్లికేషన్ డెవలపర్, యానిమేటర్ అని చెప్పుకుంటారు. కానీ, ఇద్దరు పెద్ద మోసగాళ్లు. టెక్నాలజీ ఉపయోగించి వివిధ రకాల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోసాలు చేస్తూ జాలీగా, హ్యాపీగా జీవిస్తుంటారు. అప్పుడప్పుడూ తమ ఎదురింటికి వచ్చి వెళుతుండే ఫ్రీలాన్స్ బ్యూటీషియన్ మీరా (రీతూ వర్మ)తో సిద్ ప్రేమలో పడతాడు. మీరా స్నేహితురాలు శ్రేయ (నిరంజని)ని కల్లీస్ ప్రేమిస్తాడు. సిద్ చేసిన ఒక మోసం వల్ల డిసిపి ప్రతాప్ సింహ (గౌతమ్ మీనన్) ఇంట్లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంటుంది. ప్రమాదం చిన్నదైనా దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని దర్యాప్తు ప్రారంభిస్తాడు. కొత్తగా మరో మోసం చేయబోయి ప్రతాప్ సింహ పన్నిన వల నుండి సిద్ తృటిలో తప్పించుకుంటాడు. మోసాలన్నీ ఆపేసి అప్పటివరకు కూడబెట్టిన డబ్బుతో గోవా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటాడు. సిద్, మీరా, కల్లీస్, శ్రేయ... నలుగురు గోవా వెళతారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఒక క్లూ పట్టుకుని ప్రతాప్ సింహ గోవా వెళ్లి... అక్కడ సిద్, కల్లీస్ ను పట్టుకుంటాడు. అయితే... అమ్మాయిలు ఇద్దరు అక్కడ ఉండరు. వాళ్లు ఎలా అదృశ్యమయ్యారు? వాళ్ల అదృశ్యం వెనుక ఉన్న కథేంటి? మళ్లీ సిద్, కల్లీస్ ని ఎలా కలిశారు? అసలు, ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.     విశ్లేషణ: ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. అయితే... చిత్రంలో రొమాన్స్ కంటే థ్రిల్ ఎక్కువ ఉంటుంది. ప్రేమకథలో లోతైన సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే భావనలు కొరవడ్డాయి. ప్రారంభంలో ఒక పదిహేను నిమిషాలు కథానాయకుడి జీవనశైలి, విధానం చూపించడానికి దర్శకుడు సమయం తీసుకున్నాడు. ఆ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవు. తర్వాత నిదానంగా అసలు కథలోకి వెళ్లడం ప్రారంభించాడు. కథానాయకుడు చేసే మోసాలు చూస్తుంటే.... ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. అలా అలా అలా సినిమా విశ్రాంతికి చేరుకుంటుంది. విశ్రాంతికి ముందు ప్రేక్షకులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఒకటి వస్తుంది. విశ్రాంతి తర్వాత నుండి కథలో వేగం మరింత పుంజుకుంది. హీరో వేసే ఎత్తులు, పై ఎత్తులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు కూడా కథను పరుగులు పెట్టించాడు. కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ద్వితీయార్థంలో వచ్చే ప్రతి మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకు మించి ఎక్కువ చెబితే థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు థ్రిల్ మిస్ అవుతుంది. ఈ చిత్రంలో లోపల విషయానికి వస్తే... పాటలు కథా గమనానికి కాస్త అడ్డుతగిలాయని చెప్పాలి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం మాత్రం చిత్రానికి బలంగా నిలిచింది. ఉత్కంఠతో ప్రేక్షకుడు ఫీలయ్యేలా మంచి నేపథ్య సంగీతం అందించారు. ముఖ్యంగా వినోదంలో తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. తమిళంలో పాపులర్ అయినా రజనీకాంత్ డైలాగులను హీరో స్నేహితుడి చేత పేరడీ చేయించినట్లు ఉన్నారు. తెలుగులోకి ఆ వినోదం యధాతధంగా తర్జుమా కాలేదు. సంభాషణలు కూడా బాలేదు. తెలుగు లో డైలాగులు రాసింది ఎవరో కానీ 'బ్రేక్ ఫాస్ట్ కి భావన... లంచ్ కి లావణ్య', ' 'అమ్మాడి అమ్మాడి అంటూ గున్న గున్న మామిడి సాంగ్ వేశారు' అంటూ సంభాషణల్లో ప్రాసకోసం పాకులాడారు.  ప్లస్‌ పాయింట్స్‌: కథ, కథలో మలుపులు  రీతూ వర్మ నటన  దుల్కర్-రీతూ జోడి ద్వితీయార్థం  నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌: ప్రథమార్థంలో ప్రారంభ సన్నివేశాలు వినోదంలో తమిళ వాసనలు లాజిక్కులు లేని కొన్ని సన్నివేశాలు తెలుగు సంభాషణలు నటీనటుల పనితీరు: దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జోడి చూడముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా రీతూవర్మ నటన ఈ చిత్రానికి బలం అని చెప్పాలి. మిగతా నటీనటులు అందరు బాగా చేశారు. అయితే... అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం గౌతమ్ మీనన్ గురించే. తెరపై కనిపించిన ప్రతిసారీ తన నటనతో ఆయన ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. పోలీస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తెలుగుఒన్‌ పర్ స్పెక్టివ్‌: 'కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం' - మణిరత్నం దర్శకత్వం వహించిన దొంగ దొంగ చిత్రంలో పాటలోని లైన్ ఇది. టైటిల్ బట్టి హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారని సులభంగా ఊహించవచ్చు. శుక్రవారం సాయంత్రానికి కథలో మలుపులను ఎవరైనా బయటకు చెప్పేయవచ్చు. మలుపులు తెలిసినా... ఊహించగలిగినా... తెర పై వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. ఒక మంచి చిత్రం చూశామనే అనుభూతిని అందిస్తాయి. ఆన్ లైన్ మోసాలపై చిన్నపాటి హెచ్చరిక చేస్తోందీ సినిమా. అపరిచిత అమ్మాయిలతో మాట్లాడుకునే అబ్బాయిలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సందేశం ఇస్తుంది. రేటింగ్‌: 3/5
  సినిమా పేరు: హిట్ తారాగణం: విష్వక్ సేన్, రుహానీ శర్మ, భానుచందర్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, చైతన్య, హరితేజ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: మణికందన్ ఎడిటింగ్: గ్యారీ బీహెచ్ ఆర్ట్: అవినాష్ కొల్లా స్టంట్స్: నభా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం సమర్పణ: నాని నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని రచన-దర్శకత్వం: డాక్టర్ శైలేష్ కొలను బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2020 'ఫలక్‌నుమా దాస్' మూవీతో లైంలైట్‌లోకి వచ్చిన హైదరాబాదీ యాక్టర్ విష్వక్ సేన్ హీరోగా నాని ప్రొడక్షన్ కంపెనీ వాల్ పోస్టర్ సినిమా తీస్తున్న మూవీగా 'హిట్' వార్తల్లో నిలిచింది. శైలేష్ కొలను అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ నిర్మించిన ఈ క్రైం థ్రిల్లర్‌ను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడం నలుగురి దృష్టినీ ఆకర్షించింది. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి రాజమౌళి సహా పలువురు ప్రశంసలు కురిపించడంతో 'హిట్'లో ఏదో విషయం ఉందనే అభిప్రాయం కలిగింది. ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఆ సినిమా అందుకు తగ్గట్లే ఉందా? చూద్దాం... కథ:  సీఐడీ డిపార్ట్‌మెంట్‌లోని 'హిట్' (హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్)లో పనిచేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు (విష్వక్ సేన్).. గతంలో తన జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల మానసికంగా పానిక్ ఎటాక్స్‌కు గురవుతుంటాడు. అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అతని గాళ్ ఫ్రెండ్ నేహ (రుహానీ శర్మ) సూచనతో ఆరునెలలు సెలవుపెట్టి రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. అతను సెలవులో ఉండగా నేహ కనిపించడంలేదనే విషయం తెలుస్తుంది. ఆమెను కనిపెట్టాలని, ఆ కేసును టేకప్ చేయాలనుకుంటాడు. కానీ పై అధికారి (భానుచందర్) ఆ కేసును మరో ఆఫీసర్‌కు అప్పగిస్తాడు. అయితే అప్పటికే రెండు నెలలుగా ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న ప్రీతి అనే యువతి మిస్సింగ్ కేసుకూ, నేహ మిస్సింగ్‌కూ లింకు ఉందనే అభిప్రాయంతో ప్రీతి మిస్సింగ్ కేసును టేకప్ చేస్తాడు విక్రమ్. ఆ క్రమంలో అతడు ఎదుర్కొన్న అనుభవాలు, పరిస్థితులు ఏమిటి? నేహ సేఫ్‌గా దొరికిందా? ప్రీతి ఏమయ్యింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న హస్తం ఎవరిది?.. ఈ ప్రశ్నలకు సెకండాఫ్‌లో మనకు సమాధానాలు లభిస్తాయి. విశ్లేషణ: డైరెక్టర్‌కు శైలేంద్రకు ఇది తొలి సినిమా అంటే నమ్మబుద్ధి కాదు. అంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లేను అతను అల్లుకున్నాడు. ఈ కథను, స్క్రీన్‌ప్లేను తయారుచేసుకోవాలంటే ఎంతో రీసెర్చి అవసరం. ఒక మిస్సింగ్ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో, ఎలా చేయవచ్చో ఈ సినిమాలో డైరెక్టర్ చూపించాడు. తొలి పది నిమిషాల సేపు విక్రమ్ ఎదుర్కొనే పానిక్ ఎటాక్స్, దానివల్ల అతడు సఫర్ అవడం కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచీ ప్రీతి మిస్సింగ్ కేసు, ఆ తర్వాత నేహ మిస్సింగ్ కేసు కలిపి ఈ సినిమాని పరుగులెత్తించాయి. క్రైం థ్రిల్లర్ అయిన 'హిట్'.. దానికి తగ్గట్లే తర్వాత ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగించడంలో సక్సెసయ్యింది. కేసును విక్రమ్ దర్యాప్తు చేస్తుంటే, అతడితో పాటు మనమూ ప్రయాణిస్తాం. అయితే మన ఊహలకు, అంచనాలకు అందని రీతిలో కథనాన్ని నడిపి ఆశ్చర్యం కలిగించాడు దర్శకుడు. విక్రమ్ పాత్రతో పాటు, అతడి స్నేహితుడు రోహిత్ (చైతన్య) పాత్రను కానీ, కథకు కీలకమైన మిగతా పాత్రల్ని కానీ చిత్రించిన విధానం, సన్నివేశాల్ని కల్పించిన తీరూ మనల్ని ఆకట్టుకుంటాయి. పాత్రలూ నమ్మదగ్గ రీతిలో ప్రవర్తిస్తే, సన్నివేశాలూ లాజికల్‌గా అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ అయిపోయాక మరో పావుగంట సేపు సినిమా చూడాల్సి రావడం మాత్రం కాస్త ఇబ్బందికరం. కథకు అది అవసరమే కానీ, అప్పటిదాకా సినిమా నడిచిన తీరు ఒక విధంగా ఉండి, చివరి పావుగంట ఇంకో రకంగా ఉండటంతో ఒకింత అసహనం కలిగే అవకాశం ఉంది. హీరో హీరోయిన్ల మధ్య మరికొన్ని ఆకర్షణీయమైన సన్నివేశాలకు స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు.  టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌లో ఈ సినిమా ఉంది. డైరెక్టర్ శైలేష్ స్క్రీన్‌ప్లేకి వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్, మణికందన్ సినిమాటోగ్రఫీ తోడై సన్నివేశాలకు అవసరమైన థ్రిల్స్‌ను చేకూర్చాయి. సంభాషణలు కూడా ఎక్కువ తక్కువ కాకుండా సన్నివేశాల మూడ్‌కు తగ్గట్లు సాగాయి. విష్వక్ బాడీ లాంగ్వేజ్‌కి అతను చెప్పే డైలాగ్స్ సరిగ్గా సరిపోయాయి. స్ర్కీన్‌ప్లేకి సంబంధించిన ఒక లోటు.. ఎమోషన్స్ కంటే ఇన్వెస్టిగేషన్‌కే ఎక్కువ సన్నివేశాలు కేటాయించడం. విక్రమ్ ఎందుకు అంత పానిక్ అవుతున్నాడనే విషయాన్ని సెకండాఫ్‌లో కొంచెం రివీల్ చేశారు కానీ, అందులో ఎమోషనల్ కంటెంట్ లోపించింది. పైగా కథకు, విక్రమ్ క్యారెక్టర్‌కు కీలకమైన అతని పానిక్ ఎటాక్స్‌కు కారణమైన గతానికి సంబంధించి ప్రశ్నలు కొన్ని అలాగే మిగిలిపోతాయి. ఈ మూవీని 'ఫస్ట్ కేస్'గా పేర్కొని, ముగింపులో 2021లో సెకండ్ కేస్ వస్తుందన్నట్లు చూపారు. అంటే 'హిట్.. సెకండ్ కేస్'లో దాని గురించి చెబుతారేమో చూడాలి. ప్లస్ పాయింట్స్: పకడ్బందీ స్క్రీన్‌ప్లే విక్రమ్ పాత్ర చిత్రణ, ఆ పాత్రలో విష్వక్ సేన్ నటన సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇన్వెస్టిగేషన్ చూపించే తీరు మైనస్ పాయింట్స్: ఎమోషనల్ కంటెంట్ లోపించడం సినిమా ముగింపు సన్నివేశాలు రిలీఫ్ పాయింట్ లేకపోవడం హీరోయిన్ పాత్రతో పాటు మరికొన్ని పాత్రల్ని సరిగా మలచకపోవడం నటీనటుల అభినయం: విక్రమ్ క్యారెక్టర్‌లో విష్వక్ సేన్ చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించాడు. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్' సినిమాల్లో కనిపించిన విష్వక్‌కు పూర్తిభిన్నమైన విష్వక్‌ను ఈ సినిమాలో మనం చూస్తాం. విక్రమ్ గా హావభావాలు, పానిక్ ఎటాక్ అప్పుడు చూపించే అభినయం, ఇన్వెస్టిగేషన్ సందర్భంగా కనిపించే బాడీ లాంగ్వేజ్, ఆ సందర్భంగా ప్రదర్శించే కోపతాపాల విషయంలో అతను మెప్పించాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంది. అతని గాళ్ ఫ్రెండ్ నేహ పాత్రలో రుహానీ ఫర్వాలేదు. ఆమెకు కథలో ఎక్కువ నిడివి లభించలేదు. ఆమెకంటే షీలా అనే పాత్ర చేసిన హరితేజకు ఎక్కువ నిడివి లభించింది. ఇప్పటిదాకా కనిపించని హరితేజను ఈ మూవీలో చూస్తాం. కానీ అది ప్రేక్షకుల్ని అలరించే క్యారెక్టర్ కాదు. ఇబ్రహీం అనే సబ్ ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ మురళీ శర్మ లాంటి నటుడికి ఇవ్వాల్సింది కాదు. తనకిచ్చిన ఆ చిన్న పాత్రను సునాయాసంగా ఆయన చేశాడు. భానుచందర్, బ్రహ్మాజీ తమకిచ్చిన పాత్రల పరిధి మేరకు చేశారు. విక్రమ్ స్నేహితుడు, అతని సహోద్యోగి రోహిత్ పాత్రలో చైతన్య అనే నటుడు రాణించాడు. తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్: క్రైం థ్రిల్లర్స్ కోసం ఎదురుచూసేవాళ్లను మెప్పించే అంశాలున్న 'హిట్'.. రెగ్యులర్ ఆడియెన్స్‌ను అలరించే విషయంలో కొంత తడబాటుకు గురయ్యింది. ఒక వర్గం ప్రేక్షకుల్ని మాత్రమే ఈ సినిమా ఆకట్టుకొనే అవకాశాలున్నాయి. రేటింగ్: 2.75/5 - బుద్ధి యజ్ఞమూర్తి
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  
కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  
సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.
2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.
    Are you tired of finding excuses to skip your workouts?? Either you are too lazy to move out for your warm and cozy home sweet home to sweat out  Or are you too tired to drive and hand-over yourself to your ruthless trainer! Any day dancing at your will to your favorite tracks can be a reliable savior! Dance is a form of emotional expression, social interaction, exercise or to attain spiritual calmness. Dancing need not be professional; it can be freestyle or hooligan-style unless you don’t harm others or yourself! While dancing, make sure you shake and stretch every muscle. Dancing is not a complete substitute of your workouts. When compared to workouts, dancing does not aim to tone up certain targeted areas. Dance is generally regarded as aerobic exercise which reduces the risks of cardiovascular diseases, weight control and other diseases related to physical fitness. Psychological well-being is also noted in people who enjoy grooving to tunes!! Dancing at your will is a great stress-buster; it makes you feel much better than your workouts at gym as you are not forced to dance! Strathclyde University inferred from their findings that even in old and middle-aged women who were dancers were more agile and have stronger legs than women of same age who indulged in exercises like swimming, walking or any other form of physical exercises. Dancing for 15 minutes is equivalent to 10 minutes of workout for average-built people. Dancing is also a Therapy besides being a Pastime!!
Adhesive Capsulitis of shoulder is the clinical term for the condition which we commonly call the 'Frozen Shoulder'. It is a painful and disabling disorder of the unknown origin, due to which the shoulder capsule and connective tissue of the shoulder joint become inflamed and stiff, estricting the movement and causing chronic pain. This pain is usually constant, but worsens at night and with cold weather.This condition sets at a slower pace and fades away gradually may be within a year or more. Frozen shoulder develops when the shoulder is seldom used due to pain, injury or health conditions like diabetes or stroke. Any shoulder problem may go further to develop into a frozen shoulder if its not employed to keep full range of motion. This obstructing disorder most often occurs after surgeries or injuries, in the age groups 40 - 70 years, in poeple with chronic diseases. It is more often seen in women than in men especially in post-menopausal women. Treatment includes the pain killer drug therapy and soothed by the application of heat to the affected area, followed by gentle streching. By applying ice the pain and swelling can be reduced. Physio-therapy can increase the range of motion of the shoulder. Most of the cases of frozen shoulder are preventable! Gentle, progressive range-of-motion exercises, stretching, and usage of the shoulder more often may help in preventing  frozen shoulder after surgery or an injury. But be patient and stick to your doctors advice, as frozen shoulder always get better over time! Take Care!! Stay Healthy!! ....SIRI