LATEST NEWS
తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ విలువని మరిచిపోయిందా? అందుకే ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను గాలికొదిలేసిందా? అంటూ సగటు ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎన్టీఆర్ జయంతి,వర్థంతి సమయాల్లో.. ప్రభుత్వ తరఫున ఎన్టీఆర్ ఘాట్ లో కనీస ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ ఆనవాయితీని పక్కన పెడుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అనేక విగ్రహాలు, ఘాట్ లు.. పూల అలంకరణ, మరమ్మత్తులకు నోచుకుంటున్నాయి.. కానీ ఎన్టీఆర్ ఘాట్ మాత్రం కొంతకాలంగా అనాథలా మిగిలిపోయింది. గత ఏడాది కూడా ఎన్టీఆర్ వర్థంతికి.. ఘాట్‌లో కనీస ఏర్పాట్లు చేయకపోవటంతో నందమూరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు అప్పటికప్పుడు పూలు తెప్పించి, ఘాట్ ని అలంకరించి నివాళులర్పించారు.  ఈ సంవత్సరం కూడా అధికారులు ఎన్టీఆర్ ఘాట్ ని పట్టించుకోలేదు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఎన్టీఆర్ ఘాట్ శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపోయి కళా విహీనంగా మారింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ట్రస్ట్ సొంత ఖర్చులతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు చేసి వర్థంతి వేడుకలకు ముస్తాబు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యపు వైఖరిని ఎన్టీఆర్ అభిమానులు తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్ సహా ఎందరికో రాజకీయంగా అండగా నిలబడ్డ నేత వర్ధంతికి కనీసం ఏర్పాట్లు కూడా చేయలేదంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ సహా ఎందరో నేతలు.. తమకి ఎన్టీఆర్ ఆదర్శమని, ఆయనను మేం అభిమానిస్తామని చెప్తుంటారు. అయితే ఆ అభిమానమంతా కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఆ అభిమానాన్ని చేతల్లో ఏ మాత్రం చూపలేకపోతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో రాజధాని పోరాటం మరింత ఉధృతమవుతోంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలు.. రాజధానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. వైసీపీ సర్కార్ రాజధాని మార్పు విషయంలో వేగంగా అడుగులు వేస్తుండటంతో.. ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. దీక్షలు, ధర్నాలు, హోమాలు, గవర్నర్ కి ఫిర్యాదులు, ప్రధానికి లేఖలు ఇలా అన్ని రకాల శాయశక్తులా పోరాడుతున్నారు. అయితే తాజాగా నలుగురు యువకులు రాజధాని కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సెల్ టవర్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ... ఇప్పుడు దేశమంతా వీటి గురించే చర్చ... మొత్తంగా మూడింటి సారాంశం ఒక్కటే... భారతీయ పౌరసత్వం... లేదా మీరు భారతీయులేనా?... జాతీయ జనాభా నమోదు... ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి... మొత్తంగా చూస్తే మీరు భారతీయులేనా? అనే ప్రశ్న కొన్ని వర్గాలను భయపెడుతోంది... అంతేకాదు, మత ప్రాతిపదికన మోడీ ప్రభుత్వం ఇవన్నీ తీసుకొచ్చిందని విపక్షాలు, కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ బీజేపీపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు, బిల్లులతో దేశంలో పలు వర్గాలు భయపడుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు... లేదంటే అమెరికా పోవచ్చన్న కామెంట్స్ ఆయా వర్గాలను ఇబ్బంది పెడుతున్నాయి. మీ భారతీయతను నిరూపించుకోవాలన్న కొందరి వ్యాఖ్యలతో కొన్ని వర్గాలు తీవ్రంగా భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ వాసి ఒకరు.... ప్రధాని మోడీ భారతీయతనే ప్రశ్నించారు. నరేంద్రమోడీ అసలు భారత పౌరుడేనా? మోడీ భారతయుడేనని నిరూపించుకునేందుకు ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఆర్టీఐ కార్యకర్త జోషి దరఖాస్తు చేశారు. దాంతో, జోషి దరఖాస్తును.... కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపించారు. అయితే, సీఏఏ గురించి కోట్లాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నందుకే, ప్రజాప్రయోజనార్ధం ఈ దరఖాస్తు చేశానని ఆర్టీఐ కార్యకర్త జోషి తెలిపాడు.
ALSO ON TELUGUONE N E W S
  ఇది నిజంగా సెన్సేషనల్ న్యూస్! సంచల తార కీర్తి సురేశ్ స్థానంలో వెటరన్ హీరోయిన్ ప్రియమణి వచ్చింది!! అవును. అజయ్ దేవ్‌గణ్ హీరోగా రూపొందుతోన్న బాలీవుడ్ ఫిల్మ్ 'మైదాన్'లో నాయికగా ఎంపికైన కీర్తి సురేశ్.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. నిజానికి ఆమె ఒక రోజు షూటింగ్‌లోనూ పాల్గొంది. స్క్రిప్ట్ ప్రకారం ఆమె అజయ్ భార్యగా, బిడ్డల తల్లిగా కనిపించాలి. కానీ ఆమె మరీ యంగ్‌గా కనిపిస్తోందని ఇటు ఆమె, అటు దర్శకుడు అమిత్ రవీందర్‌నాథ్ శర్మ కూడా భావించారు. ఫుట్‌బాల్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో సాధ్యమైనంతవరకు ఎలాంటి లోటుపాట్లూ లేకుండా దర్శక నిర్మాతలు చూసుకుంటున్నారు. అందుకే పరస్పర అంగీకారంతోనే ఆ సినిమా నుంచి కీర్తి తప్పుకుంది.  ఇప్పుడు ఆమె స్థానంలోకి ప్రియమణి రావడం విశేషంగా చెప్పుకోవాలి. కీర్తి ఇమేజ్ ముందు ప్రియమణి ఇమేజ్ ఏమాత్రం సరితూగదు. సౌత్‌లో ఇవాళ కీర్తి సెన్సేషనల్ స్టార్ అయితే, ప్రియమణికి ఏమాత్రం డిమాండ్ లేదు. అయినప్పటికీ 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌లో హీరో మనోజ్ బాజ్‌పేయి భార్య పాత్రలో చక్కగా రాణించి, మంచి పేరు తెచ్చుకోవడం ఆమెకు ఈ అవకాశం లభించేలా చేసింది. ఇంకో విషయం ఏమంటే, కీర్తి తరహాలోనే ప్రియమణి కూడా జాతీయ ఉత్తమ నటి. ప్రస్తుతం ఆమె 'అసురన్' తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ జోడీగా, జయలలిత బయోపిక్ 'తలైవి'లో శశికళగా నటిస్తోంది. జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరుణవ జాయ్ సేన్‌గుప్తా కలిసి నిర్మిస్తోన్న 'మైదాన్' మూవీ 2020 నవంబర్ 27న విడుదల కానున్నది.
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. తమ్ముడి కుమారుడితో మరోసారి కృష్ణంరాజు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ వచ్చే వేసవిలో వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూరప్‌ నేపథ్యంలో ప్రేమకథతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు యూరప్‌లో ఓ షెడ్యూల్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన స్పెషల్‌ సెట్‌లో తాజా షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ సినిమాలోనే కృష్ణంరాజు నటిస్తున్నారు. కృష్ణంరాజు పుట్టినరోజు సోమవారం. ఈ సందర్భంగా శనివారం ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు... తనయుడితో కలిసి నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్‌పై ఈ సినిమా నిర్మిస్తోంది. షూటింగ్‌ షెడ్యూల్స్‌ గురించి కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘మూడు నెలలు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తాం. ఏప్రిల్‌, మేలో విదేశాల్లో షూటింగ్‌ ఉంటుంది. ఈ ఇయర్‌ ఎండ్‌కి షూటింగ్‌ పూర్తి చేసి, వచ్చే ఇయర్‌ సమ్మర్‌కి సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.
  మాస్ మహారాజాగా అభిమానులు పిలుచుకొనే రవితేజ జనవరి 24న 'డిస్కో రాజా'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో ఆకట్టుకున్న వి.ఐ. ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. ఏడాది పైగా గ్యాప్ తీసుకుని రవితేజ చేసిన ఈ సినిమాపై మొదట్లో పెద్ద బజ్ కనిపించలేదు. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సెకండ్ టీజర్‌తో ఒక్కసారిగా 'డిస్కో రాజా'పై అందరి చూపూ పడింది. ఒకప్పటి సంగీత సంచలనం బప్పీలహరితో పాటు రవితేజ సైతం గొంతు కలిపిన 'రమ్ పమ్ బమ్' సాంగ్ కూడా వైరల్ అవడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కొంత కాలంగా కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్ ఎదుర్కొంటూ వస్తున్న రవితేజకు ఈ సినిమా హిట్టవడం మినహా వేరే దారిలేదు. రవితేజ చివరి హిట్ ఫిల్మ్ 'రాజా ద గ్రేట్'. దాని తర్వాత ఆయన చేసిన 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలను ఆడియెన్స్ తిరస్కరించారు. వీటిలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా అయితే మరీ ఘోరంగా ఫ్లాపయింది. "హాయ్‌రే హాయ్.. జాంపండురోయ్.. చూడగానే నోరూరెరోయ్.." అంటూ 'సిందూరం'లో హీరోయిన్ సంఘవిని అల్లరిపెడుతూ కనిపించిన రవితేజ చాలా వేగంగా స్టార్ రేంజికి చేరుకున్నాడు. పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇడియట్' మూవీ రవితేజ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తనకే ప్రత్యేకమైన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు రవితేజ. ఆ సినిమా నుంచి చాలా కాలం దాకా ఆయన వెను తిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు.  ఆ తర్వాత 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', 'వెంకీ', 'భద్ర', 'విక్రమార్కుడు', 'దుబాయ్ శీను', 'కృష్ణ', 'కిక్', 'డాన్ శీను', 'మిరపకాయ్', 'బలుపు', 'పవర్', 'రాజా ది గ్రేట్' వంటి హిట్లిచ్చాడు రవితేజ. 2011లో వచ్చిన 'మిరపకాయ్' మూవీ తర్వాత రవితేజ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వరుస ఫ్లాపులతో ఆయన మార్కెట్ విలువ పడిపోయింది. 'బలుపు', 'పవర్' సినిమాలతో మళ్లీ బరిలోకి వచ్చిన ఆయనను 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' సినిమాలు దెబ్బకొట్టాయి. 'రాజా ది గ్రేట్' హిట్టయిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2018లో హాట్రిక్ ఫ్లాపులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 'నేల టిక్కెట్టు' ఫ్లాపైతే, 'టచ్ చేసి చూడు', 'అమర్ అక్బర్ ఆంటోని' డిజాస్టర్లయ్యాయి. ఆందోళన కలిగించిన విషయమేమంటే ఆ రెండూ 10 కోట్ల రూపాయల షేర్ కూడా సాధించలేకపోవడం. ఆయన కెరీర్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆ సినిమాలు హెచ్చరిక పంపాయి. ఇప్పుడు పెద్ద హిట్టు వస్తే తప్ప ఆయన మార్కెట్ వాల్యూ పెరగదు. కథల విషయంలో, పాత్రల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంతకాలంగా నిర్మించుకుంటూ వచ్చిన కెరీర్ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తూ వి.ఐ. ఆనంద్ చెప్పిన 'డిస్కో రాజా' స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వెంటనే షూటింగ్‌కు వెళ్లలేదు. స్క్రిప్ట్ విషయంలో కొన్ని సందేహాలు తలెత్తడంతో డైరెక్టర్‌ను మరింత గ్రిప్పింగ్‌గా స్క్రీన్‌ప్లే రాయాల్సిందిగా కోరాడు. తనకు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ నచ్చిన తర్వాతే సెట్స్ మీదకు వెళ్లాడు. అందువల్లే మునుపటి సినిమాకూ, 'డిస్కో రాజా'కూ మధ్య ఏడాది పైగా గ్యాప్ వచ్చింది.  రవితేజ సినిమా అంటే ఉండే జోష్‌తో పాటు యాక్షన్ ప్రియుల్ని అలరించే ఫైట్లూ ఈ సినిమాలో ఉంటాయని డైరెక్టర్ చెబుతున్నాడు. ప్రతిభావంతుడైన నటుడిగా పేరుపొందిన బాబీ సింహా ఈ మూవీలో విలన్‌గా కనిపించనున్నాడు. టీజర్ ప్రకారం అతడి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనేది స్పష్టం. రవితేజలోని అల్లరోడికి మరో ఇద్దరు అల్లరోళ్లు.. సునీల్, వెన్నెల కిశోర్ తోడయ్యారు. వాళ్లు ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తారని టాక్. ఇప్పుడు టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా ఎలా నడుస్తుందో చెప్పాల్సిన పనిలేదు కదా! 'ఢిల్లీవాలా', 'రమ్ పమ్ బమ్' సాంగ్స్‌తో 'డిస్కో రాజా' కూడా లైంలైట్‌లోకి వచ్చేశాడు. 'ఆర్ఎక్స్ 100', 'వెంకీమామ' సినిమాలతో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్, 'ఇస్మార్ట్ శంకర్'తో గ్లామర్ కురిపించిన నభా నటేశ్ మరోసారి ఈ సినిమాతో మెరుపులు మెరిపించడానికి సిద్ధమయ్యారు. ఎలాంటి బజ్ లేని స్థితి నుంచి ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవేపు తిప్పుకున్న 'డిస్కో రాజా'గా రవితేజ ఆకట్టుకుంటాడా? చూడాలి.
  2020 సంవత్సరంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ఫిల్మ్ ఏదంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు 'ఆర్ ఆర్ ఆర్'. నంబర్ వన్ ఇండియన్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూలై 30న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉందంటూ ప్రచారంలోకి రాగా, అంతర్గత సంభాషణల్లో యూనిట్ సభ్యులు మాత్రం అనుకున్న సమయానికే సినిమా వస్తుందని చెబుతూ వచ్చారు. ఆఖరికి తారక్ సైతం తన అభిమానులతో జూలై 30నే ఈ సినిమా విడుదలవుతుందని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా రిపోర్టుల ప్రకారం 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ మారనున్నది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు తరణ్ ఆదర్శ్, కోమల్ నహతా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు. తరణ్ ఆదర్శ్ అయితే సినిమా పేరు వెల్లడించకుండా "సౌత్ ఇండియా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ తీసున్న బిగ్ ఫిలింకు కొత్త రిలీజ్ డేట్.. అందిన సమాచారం ప్రకారం ఆ మూవీ 2020 అక్టోబర్‌లో రిలీజవుతుంది. ఆ సినిమా ఏదో మీరే ఊహించండి" అని ట్వీట్ చేశాడు. మరోవైపు కోమల్ నహతా డైరెక్టుగా "యస్.యస్. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' 2020 అక్టోబర్‌లో రిలీజవుతుంది అంతర్గత వర్గాలు ధ్రువీకరించాయి" అని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై సినిమా యూనిట్ నుంచి ఇంతదాకా ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి, ఆ రోజున ఈ సినిమా విడుదలవుతుందని కూడా ప్రచారంలోకి వచ్చింది. చూద్దాం.. ఈ ప్రచారం ఏ మేరకు నిజమవుతుందో!
  మహేశ్ హీరోగా నటించిన 'దూకుడు' సినిమా సూపర్ హిట్ అయ్యిందనే విషయం మనకు తెలిసిందే. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై ఆ మూవీని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించారు. ఇప్పుడు అనిల్ సుంకర సపరేట్‌గా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై సినిమాలు తీస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆ బేనర్‌పై మహేశ్ హీరోగా నిర్మించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 'బ్లాక్‌బస్టర్ కా బాప్' అంటూ ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వరంగల్‌లో ఈ సినిమా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో 'సరిలేరు నీకెవ్వరు' 100 కోట్ల రూపాయల షేర్ సాధించిందంటూ పోస్టర్ ప్రదర్శించారు.  ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ 'దూకుడు' సినిమాకి 100 కోట్ల గ్రాస్‌ని తానే అనౌన్స్ చేశాననీ, ఇప్పుడు మొదటి వారంలోనే 'సరిలేరు నీకెవ్వరు' 100 కోట్ల షేర్‌ని అనౌన్స్  చేయడం సంతోషంగా ఉందనీ అన్నారు. "అందరూ మహేశ్ బాబు ఈ సినిమాలో మాస్ చేశారు, బ్లాక్‌బస్టర్ కావాలి అన్నారు. కానీ బ్లాక్‌బస్టర్ సరిపోలేదు, బ్లాక్‌బస్టర్ కా బాప్ అయింది. 'మైండ్ బ్లాక్' సాంగ్ ఒక్కటి చాలు.. సినిమా ఏ రేంజికి తీసుకువెళ్తుంది అనేదానికి. ఏడవ రోజు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రాఫిట్స్‌లోకి వచ్చారని వారి మొహంలో చిరునవ్వు తెలియజేస్తోంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి మొదటి రోజు నుండి మాకున్న నమ్మకాన్ని కలెక్షన్స్ రూపంలో తీసుకువచ్చారు. మహేష్ బాబు అభిమానిగా నాది ఒకటే కోరిక. ప్రతి సినిమాలో ఒక మైండ్ బ్లాక్ సాంగ్ కావాలి. ఎందుకంటే థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు, మైండ్ బ్లాక్ సాంగ్ ఒకెత్తు. అన్ని వయసుల వారు డాన్స్ వేస్తున్నారు" అని చెప్పారు అనిల్.  
'తలైవి'లో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి ఆహార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సీఎం ఎంజీఆర్ ను అచ్చుగుద్దినట్టు అరవిందస్వామి దింపేశాడని సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ లుక్ రావడం కోసం ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, 'రోజా' హీరో చాలా కష్టపడ్డాడట. జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'తలైవి'. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఎంజీఆర్ జయంతి సందర్భంగా సినిమాలో ఆయన పాత్ర పోషిస్తున్న అరవిందస్వామి లుక్, టీజర్ శుక్రవారం విడుదల చేశారు. ప్రేక్షకులు చూస్తున్న లుక్ మొదట అనుకోలేదు. ఈ లుక్ రావడానికి ముందు అరవిందస్వామి ఎనిమిది లుక్స్ ట్రై చేశాడని దర్శకుడు ఎ.ఎల్. విజయ్ చెప్పారు. అంతే కాదు... అరవిందస్వామి ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు కూడా వెళ్లారట. ఎందుకంటే... ఆయన పళ్లవరస, ఎంజీఆర్ పళ్లవరసలా ఉండాలని ప్రయత్నించారట. క్యారెక్టర్ కోసం అంత డెడికేషన్ తో అరవిందస్వామి వర్క్ చేశారు. ఎంజీఆర్ పాత్రకు ఆయన తప్ప మరొకరు సూట్ అవ్వరని, ఈమాట ఎందుకు చెబుతున్నానో సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు తెలుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.
'ఇస్మార్ట్ శంకర్' హిట్ దర్శకుడు పూరి జగన్నాథ్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. సూపర్ డూపర్ సక్సెస్, ఇండస్ట్రీ హిట్స్ పూరికి కొత్త కాదు. కానీ, కొన్ని ప్లాప్స్ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' రావడంతో అతడు మళ్లీ ఫుల్ రీఛార్జ్ అయ్యాడు. ఈ హుషారులో విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' తీయడానికి రెడీ అవుతున్నాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత 'అర్జున్ రెడ్డి' హీరో నటించనున్న సినిమా ఇదే.   పాన్ ఇండియన్ ఫిలింగా 'ఫైటర్'ను తెరకెక్కించనున్నట్టు పూరి జగన్నాథ్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఫేమస్ హిందీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాలో ప్రొడక్షన్ పార్టనర్ గా జాయిన్ అయ్యాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాకు ఇంటర్నేషనల్ అప్పీల్ తీసుకురావడానికి పూరి ట్రై చేస్తున్నాడట. 'ఫైటర్'లో కొన్ని క్యారెక్టర్స్ కు బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్ ల్యాండ్ వెళ్ళాడు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.  త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే, ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ కాలేదు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు వినబడుతోంది.
శ్రీమతి సమంత కోసం యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య చెన్నైలో ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నాడట. కొనడం ఎందుకు? ఆల్రెడీ ఓ ఇల్లు ఉన్నట్టుంది కదా అని కొందరి సందేహం. నిజం చెప్పాలంటే... సమంతది చెన్నై. ఆమె తల్లితండ్రులకు అక్కడ సొంత ఇల్లు ఉంది. చైతన్య తల్లి ఉంటున్నది కూడా చెన్నైలోనే. ఆమెకు కూడా అక్కడ సొంత ఇల్లు ఉంది. మళ్లీ సపరేట్ గా చెన్నైలో చైతన్య, సమంత దంపతులు ఇల్లు కొనుక్కోవడం ఎందుకనేది చాలామందికి అర్థం కావడం లేదు. అత్తారింటిలో, అమ్మగారి ఇంటిలో ఉండడం వేరు. సొంత ఇంటిలో ఉండడం వేరు కదా. అందుకని, తమకంటూ ఓ ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారట. బీచ్ హౌస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ లో చైతన్యకు సొంత ఇల్లు ఉంది. అలాగే, గోవాలో ఒక ఇల్లు కొంటున్నట్టు ఇండస్ట్రీ గుసగుస. కొత్తగా చెన్నై బీచ్ హౌస్ న్యూస్. తమకు ఇష్టమైన సిటీల్లో ఒక్కో ఇల్లు ఉండాలని ప్లాన్ చేస్తున్నారేమో. 
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా‘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. చిరంజీవి మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుపడ్డ రాజశేఖర్... పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్ లాక్కుని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలను బయటపెట్టాడు. వేదికపైనున్న అందరి కాళ్లు మొక్కుతూ రాజశేఖర్ వింతగా ప్రవర్తించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కారణంగా తన ఫ్యామిలీలో గొడవులు జరుగుతున్నాయని, తన కారు ప్రమాదానికి కూడా ‘మా‘ గొడవలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పు ఉన్నప్పుడు... దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పొగ రాకుండా ఆపలేమన్నారు. అయితే, వేదికపైనున్న మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, జయసుధ తదితరులు ఆపేందుకు ప్రయత్నించినా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు రాజశేఖర్. అయితే, హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. మంచిని మైకులో చెబుదాం... చెడుని చెవిలో చెప్పుకుందామని తాను విజ్ఞప్తి చేసినా... రాజశేఖర్ పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. వేదికపైనున్న పెద్దలను రాజశేఖర్ అవమానించారని మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో క్రమశిక్షణాసంఘం ఉంటే... రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని చిరంజీవి సూచించారు. రాజశేఖర్ ప్రవర్తన, వ్యాఖ్యలపై జీవిత క్షమాపణలు చెప్పారు. రాజశేఖర్ ది చంటి పిల్లాడి మనస్తత్వమని, ఆయన ఏదీ దాచుకోడని, మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడతాడంటూ వాతావరణాన్ని కూల్ చేసేందుకు జీవిత ప్రయత్నించారు. అయితే, చిరంజీవి మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర్ అడ్డుపడటం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చిరంజీవి పీఆర్పీని ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ కారుపై మెగా ఫ్యాన్స్ రాళ్ల దాడి చేయడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి-రాజశేఖర్ మళ్లీ కలిసినా.... ఇప్పుడు ‘మా‘ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిని మళ్లీ టార్గెట్ చేయడం వెనుక ఏదో గొడవ ఉందంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 23 వ తేదీన వచ్చిన ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. గతంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా అసెంబ్లీలో వైసీపీ 86 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 151 సీట్లలో గెలిచి రికార్డు సృష్టించింది. పోలైన మొత్తం ఓట్లలో 49.9 శాతం సాధించింది. ఇక అధికారం కోల్పోయిన తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 30.96 శాతం ఓట్లతో ప్రతిపక్షస్థానంలో కూర్చవలసి వచ్చింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి, మొత్తం 25 స్థానాలకు గాను, 22 చోట్ల వైసిపి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న జగన్ కల 2019 లో నెరవేరింది. ఇందు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలవాలన్న తపనతో అంతకు రెండేళ్ల ముందే 2017 నవంబర్ 6 న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 3648 కిలోమీటర్ల పాద యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 9 వ తేదీ న ప్రజా సంకల్ప యాత్రను ముగించారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. చివరకు ఘన విజయాన్ని అందుకో గలిగారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30 వ తేదీ న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు, ప్రమాణ స్వీకారం రోజు ఆయన వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. జూన్ 8 వ తేదీ న సీఎం జగన్మోహనరెడ్డి సెక్రటేరియట్ లో తొలిసారి అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంతపురం, అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండవ సంతకం చేశారు. జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తూ మూడవ సంతకం చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాటు పాలించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చంద్రబాబు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలేవి ఆయన్ను గట్టెక్కించలేక పోయాయి. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి కమ్యునిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరపున రాపాక వర ప్రసాద్ మాత్రమే గెలిచారు. జనసేన పార్టీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఈ సారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. 2014 లో టిడిపితో కలిసి నాలుగు సీట్లు గెలిచిన బీజేపీకి ఈ సారి ఒక్కటి కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు ఎంతో ప్రయత్నించింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. జనసేనతో కలిసి పోటీ చేసిన కమ్యునిస్టు పార్టీల పరిస్థితి కూడా అంతే. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత  టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యలు పార్టీ ఫిరాయించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోయారు. మెజారిటీ సభ్యులు అటు వెళ్లడంతో రాజ్యసభలో టిడిపికి ఒక సభ్యుడు మాత్రమే మిగిలారు. ఓవరాల్ గా ఈ ఏడాది ఎన్నికలు వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలన్నింటికీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ విశాఖ అంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "28న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం." అని జగన్ విశాఖ పర్యటనను విజయవంతం చేయండి అంటూ ట్విట్టర్ లో పెద్ద పోస్టే పెట్టారు. విజయ సాయి వ్యాఖ్యలు ట్వీట్లు చూసి ఇంకేముంది వైసీపీ నెంబర్ 2 నే విశాఖను రాజధాని అన్నారంటే ఇక కంఫర్మ్ అయిపోయినట్టే... కేబినెట్ భేటీ తరువాత ప్రకటన తరువాత ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే.. టోటల్ రివర్స్ అయింది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి.. హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ చెబితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కేబినెట్ మీటింగ్ ముగిసింది కానీ రాజధానిపై సస్పెన్స్ కి మాత్రం ఎండ్ కార్డు పడలేదు. మరి ఈ మాత్రం విజయ సాయి ఇంత హడావుడి ఎందుకు చేసారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి విజయసాయి ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ.. మంత్రి పేర్ని నాని మాత్రం విజయసాయివి రాజకీయ వ్యాఖ్యలని సింపుల్ గా తేల్చేశారు. కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆయన.. విజయసాయి ప్రకటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్‌గా విజయసాయిరెడ్డి మాట్లాడి ఉండవచ్చని.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని తెలిపారు. దీనిని బట్టి చూస్తే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా.. విజయ సాయి కంగారుపడి వ్యాఖ్యలు చేసారా లేక ప్రస్తుతం పార్టీలో విజయసాయికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దాంతో, తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు మొదలైంది. సీనియారిటీ, సమర్ధత, వైఖరిని పరిగణనలోకి తీసుకుని సీఎస్ ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, సీఎస్ కేసులో ముఖ్యంగా ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరు ప్రముఖంగా తెరపైకి వస్తోంది. అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుందోనని, వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సీఎస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. సీనియారిటీపరంగా చూస్తే 1983 బ్యాచ్ నుంచి బీపీ ఆచార్య, బినయ్ కుమార్... అలాగే 1984 బ్యాచ్ నుంచి అజయ్ మిశ్రా.... 1985 బ్యాచ్ నుంచి పుష్పా సుబ్రమణ్యం... 1986 బ్యాచ్ నుంచి సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ.... 1987 బ్యాచ్ నుంచి రాజీవ్ రంజన్, వసుధా మిశ్రా... 1988 బ్యాచ్ నుంచి శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా.... ఇక, సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోన్న సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.... అయితే, ఇంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ... 1984 బ్యాచ్ అజయ్ మిశ్రా... అలాగే 1989 బ్యాచ్ సోమేష్ కుమార్ వైపు మాత్రమే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఒకవేళ అజయ్ మిశ్రాకి అవకాశమిస్తే కేవలం ఆరు నెలలు మాత్రమే అంటే 2020 జూన్ వరకు మాత్రమే సీఎస్ గా కొనసాగనున్నారు. అదే, సోమేష్ ను ఎంపిక చేస్తే మాత్రం 2023 డిసెంబర్ చివరి వరకు సీఎస్ గా పనిచేసే అవకాశముంటుంది. 2023 డిసెంబర్ నెలాఖరులో సోమేష్ కుమార్ ఉద్యోగ విరమణ ఉండటంతో... ఆయన నాలుగేళ్లపాటు సీఎస్ పదవిలో ఉంటారు. మరి, సీఎం కేసీఆర్.... అజయ్ మిశ్రా వైపు మొగ్గుచూపుతారో... లేక దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సోమేష్ కి అవకాశమిస్తారో చూడాలి. అయితే, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా... సీఎస్ గా రావడానికి పలువురు సీనియర్లు అస్సలు ఇష్టపడటం లేదనే మాట కూడా వినిపిస్తోంది.
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను.. మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. జగన్ నిర్ణయాన్ని చిరంజీవి సమర్ధించడం పట్ల ఎలా స్పందించాలో తెలియక మెగా అభిమానులు తలలుపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంత రైతులు మాత్రం చిరంజీవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సాక్షిగానే రైతులు చిరంజీవి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ‘చిరంజీవి ఏ రోజూ ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు?. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌ ని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు’ అని ఓ రైతు వ్యాఖ్యానించాడు. ‘చిరంజీవికి వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు స్వాగతించారు.' అని ఓ రైతు ఆరోపించాడు. 'రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఏపీలో మీ సినిమాలు కూడా రిలీజ్ చేయనివ్వం.’ అని మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్‌లో స్టూడియో కోసమే చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా కొందరైతే పాత విషయాలను తవ్వితీసి మరీ.. చిరంజీవి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి సొంత ఊళ్ళో నిరుపయోగంగా ఉన్న ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వాలని ఆ ఊరి ప్రజలు కోరగా.. అప్పుడు చిరంజీవి ఇవ్వకుండా ఆ ఇంటిని డబ్బులకి అమ్ముకున్నారని అంటున్నారు. ప్రజాదరణతో సినిమాల్లో కోట్లు సంపాదించారు కానీ ఓ చిన్న ఇంటిని ఊరికోసం ఇవ్వలేకపోయారు. కానీ అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి.. వారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  
జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో షాకులిచ్చిన కేంద్రం... తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఏపీకి కొత్తగా మెడికల్ కాలేజీలు కేటాయించబోమని... అవసరమనుకుంటే మీరే కట్టుకోవాలంటూ తేల్చిచెప్పింది. అయితే, కేంద్రమే ముందుగా ప్రతిపాదనలు కోరి, ఇఫ్పుడు మీరే కట్టుకోమంటూ కేంద్రం చేతులెత్తేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, అలాగే వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కంగుతిన్నారు. కేంద్రంపై ఆశలు పెట్టుకునే తాము మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముందడుగు చేస్తే, ఇప్పుడు నిధులు ఇవ్వమంటే ఎలా అంటున్నారు. ప్రతి జిల్లాలో కచ్చితంగా ఒక మెడికల్ కాలేజీ ఉండేలా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. దాంతో, ఆయా రాష్ట్రాలు తమ అవసరాలను తెలుపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే, వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం... కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కొత్త మెడికల్ కాలేజీలను కేటాయించింది. అయితే, ఏపీ... మూడింటికి ప్రతిపాదనలు పంపగా... ఒక్కటి కూడా ఇవ్వలేదు. అందుకు కేంద్రం అనేక కారణాలను చూపినప్పటికీ, ముఖ్యంగా ఏపీలోని 13 జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని... పశ్చిమగోదావరి, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని... ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు ఉన్నందున... ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు కేటాయించలేమని స్పష్టంచేసింది. అయితే, ఏపీ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని... ఒక్కో కాలేజీకి 340కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని మళ్లీ కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఏలూరు మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, అలాగే... మిగతా రెండు కాలేజీలకూ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు రెడీ అవుతున్నందున నిధులు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు. అంతేకాదు, సరికొత్త లెక్కలతో కేంద్రం ముందు మళ్లీ ప్రతిపాదనలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. తమిళనాడులో 25 జిల్లాలు ఉన్నప్పటికీ... ప్రతి జిల్లాలో 20లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారని... అయితే, ఏపీలోని 13 జిల్లాల్లో ప్రతి చోటా 40లక్షల మంది జనాభా ఉన్నారని... అందువల్ల జనాభా ప్రాతిపదికన ఏపీకి కొత్త మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరనున్నారు. అయితే, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏలూరు, పాడేరు, విజయనగరంతోపాటు పులివెందుల, మచిలీపట్నం, గురజాల, మార్కాపురంలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కేంద్రం షాక్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకవేళ రెండోసారి కూడా రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరిస్తే మాత్రం... ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి దాదాపు 2500కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడనుంది. ఇప్పటికే, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఏపీ... అంత పెద్ద మొత్తాన్ని భరించగలిగే పరిస్థితిలో లేదంటున్నారు అధికారులు.
మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీకి వరసన ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీకి బలమనుకున్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే పార్టీని కూడా వీడారు. వారి స్థానంలో మరొకరిని నియమించటం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి వాటిలో ఒకటి తెలుగు యువత అధ్యక్ష స్థానం. మొన్నటి వరకు ఈ స్థానంలో దేవినేని అవినాష్ ఉండేవారు. విజయవాడలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్, విభజనకు ముందు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 లో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి టిడిపిలో చేరారు. నెహ్రూ మరణంతో అవినాష్ కు చంద్రబాబు ధైర్యం చెప్పి తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గుడివాడ నియోజక వర్గం టికెట్ కూడా కేటాయించారు కానీ ఈయన కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదంటూ వైసీపీలోకి మొగ్గు చూపారు. దీంతో పార్టీలో తెలుగు యువత అధ్యక్ష స్థానం ఖాళీ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ పేరు గట్టిగా వినిపిస్తోంది .  అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పేరు పరిటాల, ఒకప్పుడు పెత్తందారులకు వ్యతిరేకంగా నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న పరిటాల రవీంద్ర, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భూస్వాములకూ, పెత్తందారులకు, నియంతలకు ఎదురు తిరిగిన రవి తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. ఆయనకి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. పరిటాల రవి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాక ఆయన స్థానంలో ఆయన సతీమణి సునీత వచ్చారు. ఆమెను కూడా అభిమానులు కార్యకర్తలు గుండెల్లో పెట్టుకున్నారు. వైయస్ లాంటి బలమైన నేతల ప్రభావంతో కాంగ్రెస్ విజయం సాధించిన కాలంలో కూడా వరుసగా 3 సార్లు గెలిచి అయిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో రవి వారసుడిగా రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే రవి ఆధిపత్యం మొదలైన నాటి నుంచి తొలిసారి ఈ ఎన్నికల్లో ఓటమి చూసింది పరిటాల ఫ్యామిలీ. రాష్ట్రమంతా వైసిపి గాలి వీయడంతో ఇక్కడ కూడా ఓటమి తప్పలేదు. దీంతో ఒకింత నైరాశ్యంలో ఉండిపోయారు పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్. ఈ క్రమంలో పరిటాల కుటుంబం పార్టీ మారుతుందన్న పుకార్లు  కూడా వినిపిస్తున్నాయి. దీనికి స్పందిస్తూ తాము ఏ పార్టీకి మారడం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది ఆ కుటుంబం. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రీరామ్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారన్న వార్తలొచ్చాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ న్యూస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.మరి ఈ కష్ట కాలం నుంచి యువతను పార్టీ నుంచి జారిపోకుండా బాబు ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.
టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై గులాబీ నేతలను ఊరిస్తూ వస్తోంది. ఈ సారి తమకు అవకాశం వస్తుందని ఆశావహులు కొండంత ఆశతో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు మరోసారి తమ రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీలో ఉద్యమ నేతలు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు ఎప్పుడెప్పుడు తమకు పదవులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఎక్కువ మొత్తంలో ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ కోసం తాము చేసిన సేవలని గుర్తు చేస్తూ తమ పొలిటికల్ ప్రొఫైల్ అందిస్తున్నారు. అయితే కేటీఆర్ ఆశీస్సులు ఉన్న వారికే పదవులు వస్తాయనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు కీలకమైన కార్పొరేషన్ పదవులు లేదా పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు వస్తాయన్న ఆశతో ఉన్నారు. లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నేతలకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ వారిలో కొద్దిమందికి విప్ పదవులు ఇచ్చి సరిపెట్టారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులతో పాటు దేవాలయ పాలక మండలి చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. వచ్చే ఏప్రిల్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి ముందే పదవులన్నింటినీ భర్తీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, వేములవాడ, యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్ లను నియమించాల్సి ఉంది. పార్టీలోని సీనియర్ నేతల తోనే ఈ పదవులు భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా లాభదాయక పదవి విషయంలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఆరుగుర్ని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన న్యాయ చిక్కుల కారణంగా కొన్నాళ్లకే వారు పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి చిక్కులకు ఆస్కారం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పదవులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.  మరోవైపు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయనకు బలమైన అనుచరగణాన్ని ఇప్పటి నుంచే కేసీఆర్ తయారు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు నేతలంతా ఇప్పటికే కేటీఆర్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్ తమ బాస్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు అందుకున్న వాళ్ళంతా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులే. మంత్రి వర్గ కూర్పులను కేటీఆర్ సూచనలనూ కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. దీంతో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ నాటికి పదవుల భర్తీకి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి ప్లీనరీలో సంచలన ప్రకటన చేసే కేసీఆర్ ఈ సారి ప్లీనరీ లోనూ కీలక ప్రకటన చేయబోతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్లీనరీ వేదికగా కేటీఆర్ కు పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మరో రెండు మూడు సార్లు తానే సీఎంనంటూ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో త్వరలో కేటీఆర్ సీఎం అవుతారంటూ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చర్చ నీయాంశంగా మారుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా కేటీఆరే వారసుడు అని కెసిఆర్ దాదాపుగా ప్రకటించేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పే అవకాశముంటే ఢిల్లీకి కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ సీఎం అని దాదాపుగా పార్టీ ముఖ్యులకు చెప్పేశారు.అయితే అవేమీ జరగక పోవటం, కొన్ని ప్రభుత్వ పథకాలు ట్రాక్ లో పడాల్సి రావడం, స్థానిక సంస్థలుమ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో కేటీఆర్ పట్టాభిషేకాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా ప్రభావం చూపడం లేదనే భావన ఉన్నందున ఏడాది లోపే కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి లేదా అంతకంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను దూరం చేయడంలో ఉసిరికి సారి మరొకటి లేదు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.     ఉసిరితో ఉపయోగాలు : 1. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 2. కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. 3. ఉసిరిలో ఉండే విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. 4. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. 5. మధుమేహం రాకుండా నివారిస్తుంది. 6. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Myocardial Infarction (MI) is the medical term for an event commonly called heart attack in layman's language. MI occurs when there is inadequate supply of blood to a part of heart, the heart muscles are injured as they do not receive required oxygen. It usually occurs due to the blockade of the coronary arteruies by unstable mass of white blood cells, cholesterol and fat, these coronaries arteries are the ones supplying the heart muscles and enabling them to ensure circulation and oxygen supply.   MI presents as sudden chest pain usually behind the sternum, which may radiate to left arm or left side of the neck. In addition, Shortness of breath, profuse sweating, nausea, vomitting, abnormal heatbeats and anxiety may be seen.In many cases, the person does not have chest pain or other symptoms,these are called "silent" myocardial infarctions.   The risk factors for heart attacks are modifiable, and thus heart attacks are preventable!   The causes of Heart Attacks can be broadly categoriesed into:   Lifestyle - Smoking, obesity, lack of exercise and high stress levels play pivaot role in the causation of heart attacks. While, exposure to air pollution, alcohol consumption and increased consumption of trans-fat increase the risk of MI!   Disease - Diseases like Diabetes Mellitus type 1 or 2, hypertension, hypercholestetolemia, high levels of triglycerides and obesity also aid in MI.   Genetic - About 27 genes have been discovered whose mere presence in your genome can put you at the risk of heart attack!