LATEST NEWS
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి సిబ్బంది పడుతున్న శ్రమను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తుఫాన్ సమయంలో ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో తలెత్తిన విద్యుత్ అంతరాయాలను సరిదిద్దేందుకు ఏపీఈపీడీసీఎల్ (AP EPDCL) సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించారని ఆయన పేర్కొన్నారు. భారీ ఈదురుగాలులు, ఎదరుచూడని వర్షాల కారణంగా తీగల తెగిపోవడం, విద్యుత్ స్తంబాలు నేలకూలడం వంటి ఎన్నో సవాళ్లను వారు ధైర్యంగా ఎదుర్కొన్నారని వివరించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పనిచేసిన తీరు అసాధారణమని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి కార్మికులు సమన్వయంతో పనిచేయడం వల్లే అత్యవసర సేవలను త్వరగా అందించగలిగామని తెలిపారు. విపత్తు సమయాల్లో తమ కుటుంబాలను, వ్యక్తిగత కష్టాలను పక్కన పెట్టి ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల కృషి నిజంగా అభినందనీయమని ఆయన అన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవడంలో సిబ్బంది పాత్ర కీలమని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం మరియు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం అంతా అప్రమత్తమై పనిచేయడం వల్లనే పెను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని రాజకీయ, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సాంకేతికతను జోడించి మరింత పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు నిరంతరం విద్యుత్ సేవలు అందేలా ప్రభుత్వం మరిన్ని శాశ్వత రక్షణ చర్యలు చేపడుతుందని ఆశించవచ్చు.       [ AP EPDCL,Union Minister Rammohan Naidu,Cyclone Relief AP, APEPDCL Employees Dedication, AP Power Restoration, Cyclone Arnab, Andhra Pradesh rains, IMD weather alert, AP weather forecast ]
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలంటే వైపీపీ ఓటు బ్యాంకు భారీగా తగ్గాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.  రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన జరిగి, సుపరిపాలన మరింత బలోపేతం కావాలంటే ఆ పార్టీ ప్రాభవం పూర్తిగా క్షీణించాల్సిన అవసరం ఉందన్నారు.   స్థానిక  ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన,  బీజేపీ శ్రేణులకు ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.  స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.  రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతున్నాయన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనుసరించిన విధానాల వల్లే రాష్ట్ర అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందనీ, వాటిని కూటమి ప్రభుత్వం అధిగమిస్తూ ముందుకు సాగుతోందనీ అన్నారు.   వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.   ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య సమన్వయంపై విస్పష్ట మార్గదర్శకాలు జారీ చేశారు.  చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీల శ్రేణులూ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. అనధికారికంగా లేదా రెబల్స్‌గా పోటీ చేసే ధోరణులను ఇసుమంతైనా సహించేది లేదని విస్పష్టంగా హెచ్చరించారు.  కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు.   ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాకాల విపత్తులు, సహాయక చర్యలపై కూడా ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండేలా చూస్తూనే, మరోవైపు ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించాలని నాయకులకు సూచించారు.   [Chandrababu Fires YCP, Teleconference, Y CP Vote Bank, Local Body Elections, AP NDA Alliance, Telugu One]
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కాళీరాజ్ మహేష్ కుమార్‌ను బదిలీ చేయగా, ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్. నిశాంతినిని కొత్త కమిషనర్‌గా నియమించింది.  స్కూటర్‌ను ఢీకొన్న మెర్సిడెస్.. వ్యక్తి మృతి.! కొచ్చిలోని చెరానల్లూర్ ప్రాంతంలో అక్టోబర్ 25న తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 55 ఏళ్ల జయబాలకృష్ణన్ స్కూటర్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ కారును అదనపు జిల్లా న్యాయమూర్తి 17 ఏళ్ల కుమారుడు నడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.  మొదట తేలికపాటి సెక్షన్లే.. కుటుంబ సభ్యుల ఆందోళన.! ప్రమాదం తర్వాత పోలీసులు తొలుత నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మరణానికి కారణం కావడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్‌పై విడుదల చేయడంపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగం.? ప్రమాదానికి ముందు కారు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించాయని వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేసులోని అభియోగాలను మరింత తీవ్రతరం చేస్తూ, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105ను చేర్చారు. ఇది హత్య కాని నేరపూరిత నరహత్యకు సంబంధించిన నిబంధన. నిందితుడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.  నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు.! ఈ కేసు దర్యాప్తులో విధి నిర్వహణ లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక విచారణ నివేదిక నేపథ్యంలో చెరానల్లూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్‌ఇన్‌స్పెక్టర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా కొచ్చి పోలీస్ కమిషనర్‌ను కూడా బదిలీ చేశారు. కొత్త కమిషనర్‌గా ఆర్. నిశాంతిని.! కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌గా ఆర్. నిశాంతినిని నియమిస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో జరిగిన పరిణామాలు, పోలీసుల తీరుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులపై కూడా బాధ్యత నిర్ణయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదం కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభావవంతమైన వ్యక్తుల కుటుంబాలకు చెందినవారైనా చట్టం ముందు సమానమేనని, దర్యాప్తులో ఎలాంటి లోపాలు ఉన్నా వాటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.        [ Kochi Mercedes Accident, Kerala Police, Kaliraj Mahesh Kumar, R Nishanthini, Jayabalakrishnan, Hit and Run Case, Minor Driving, Police Investigation Lapses, Kerala Government, Police Officers Suspended ]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెరుగుతున్న ధరల భారాన్ని కొంతమేర తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పెన్షనర్ల కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. 60 శాతం నుంచి 63 శాతానికి డీఏ, డీఆర్.! తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ ప్రస్తుతమున్న 60 శాతం నుంచి 63 శాతానికి పెరగనుంది. ఈ పెంపు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన భత్యంతో పాటు గత నెలల బకాయిలు కూడా అందనున్నాయి. అయితే, అదనంగా వచ్చే మొత్తం వారి ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌పై ఆధారపడి ఉంటుంది.  1.16 కోట్ల మందికి పైగా ప్రయోజనం.! ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షలకు పైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా 1.16 కోట్ల మందికి పైగా ఈ పెంపు ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.  గ్రామీణాభివృద్ధి, కంటైనర్ల తయారీకి ప్రోత్సాహం.! డీఏ, డీఆర్ పెంపుతో పాటు కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేసేందుకు 2026–27 నుంచి 2030–31 వరకు అమలు చేయనున్న ‘ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన’కు రూ.7,395.55 కోట్ల కేటాయింపుతో ఆమోదం తెలిపింది. అలాగే, దేశీయంగా కంటైనర్ల తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. క్రీడా పరికరాల తయారీకి కూడా ఊతం.! దేశంలో క్రీడా పరికరాల తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌’కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.1,856.67 కోట్ల నిధులు కేటాయించారు. దేశీయ తయారీ, సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం దీని లక్ష్యం.  మొత్తంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు తక్షణ ఆర్థిక ఊరటను అందించనుండగా.. ఇతర పథకాలు గ్రామీణ పాలన, తయారీ రంగాల అభివృద్ధికి దోహదపడనున్నాయి.       [ DA Hike 2026, Dearness Allowance, Dearness Relief, Central Government Employees, Pensioners, Narendra Modi, Union Cabinet Decisions, DA Arrears, PM Viksit Gram Swaraj Yojana, Container Manufacturing Scheme, Khelo India Sports Goods Scheme ]
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌న్నారు. క్యూర్ ఏరియాలో మంచినీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్ లో ముఖ్య‌మంత్రి  బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎల్ నినో నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు.  శుద్ది చేసిన నీటిని సెక్ర‌టేరియ‌ట్ తో పాటు సీఎంవో, అవుట‌ర్ రింగ్ , మైట్రో రైల్ , ఇత‌ర శాఖ‌ల‌ కార్యాల‌యాల్లో  పచ్చదనం నిర్వహణ, ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించేలా చూడాల‌ని సీఎం తెలిపారు. ప‌బ్లిక్ పార్క్ లు,  రోడ్ల శుభ్ర‌త కు కూడా ట్రీటెడ్ వాట‌ర్ నే వాడాల‌న్నారు. భ‌వ‌న నిర్మాణంలో శుద్ది చేసిన నీటినే వాడాల‌నే నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి రెడ్కో ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.  ఎస్టీపీల్లో నీటి శుద్దికి అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాలు పాటించాల‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నీటి నాణ్యత విష‌యంలో ఏ మాత్రం రాజీ ప‌డొద‌న్నారు. ప్రతి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ కేంద్రాల పనితీరును ఎప్ప‌టికిప్పుడు హైడ్రా పర్యవేక్షించాల‌న్నారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.  ప్ర‌స్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాట‌ర్ ను గ్రీన్ ట్యాంక‌ర్స్ ద్వారా పంపిణీ చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు.  వినియోగ‌దారుల నుంచి కేవ‌లం ర‌వాణా రుసుం మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నామ‌ని, నీళ్లను ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.         [ Hyderabad Drinking Water, Drinking Water Supply, CM Orders, Hyderabad Water Crisis, Telangana Government, Water Supply Management, Drinking Water Problem, GHMC, Water Resources, Summer Water Supply, Hyderabad News, Telangana News ]  
ALSO ON TELUGUONE N E W S
మహానటితో పాటు పలు చిత్రాలతో అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చాలా బలంగా నాటుకు పోయిన భామ కీర్తి సురేష్. మహానటితో అయితే సావిత్రిగారిని దింపి పడేసింది.ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో అలకతో కూడిన దుఃఖం మాత్రమే కనపడే సన్నివేశం ఒక్కటి చాలు తాను ఎంత పెద్ద నటినో చెప్పడానికి.  అలాంటి కీర్తి సురేష్ మహానటి తర్వాత చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడింది. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. మహానటి తర్వాత ఆరునెలల పాటు సినిమాలు లే క ఖాళీగా ఉంది. దాంతో ఫైనాన్షియల్ పొజిషన్ తలకిందులు అయ్యింది. ఏంటి మీరింకా నమ్మడం లేదా! మహానటి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆరునెలల గ్యాప్ లో డబ్బుని ఎలా దాచుకోవాలో, ఎలా ప్లానింగ్ చేసుకోవాలో తెలిసిందని కీర్తి  సురేష్ నే స్వయంగా తన నోటితో తాను చెప్పింది. ఇది కూడా చదవండి: అమృతాన్నికురిపిస్తున్నఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్: ఎవరో గుర్తుపట్టారా!   కీర్తి ఈ నెల 30 న 'అక్క' అనే వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ వేదికగా గుడ్ మార్నింగ్ చెప్పనుంది. జనవరి 12 విడుదల, రౌడీ జనార్ధన వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె లిస్ట్ లో ఉన్నాయి.   [Keerthy Suresh About Financial Struggles, Keerthy Suresh, Mahanati movie, Keerthy Suresh financial struggles, Keerthy Suresh news, Tollywood updates, South Indian actress, Telugu Cinema News, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]  
  'బుజ్జి పెళ్లి కొడుక్కి(పెళ్లి కూతురు)  రాజయోగమురా' అని ఈ పక్కన ఉన్న పిక్ కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు  గంతులేస్తూ మరి పాడుకుంటారు. మరి కనిపెట్టనోళ్లు... మ్యాటర్ చదివాకా డాన్స్ చేస్తారు.. సో దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏంటంటే సాంగ్ మాత్రం కంటిన్యూ.   'సీమటపాకాయ్', 'అవును' వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత 'శ్రీ మహాలక్ష్మి', 'నువ్వలా నేనిలా', 'రాజుగారి గది', 'అఖండ 2' వంటి పలు భారీ చిత్రాలతో పాటు అగ్ర హీరోల సినిమాలలో ప్రత్యేక గీతాలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న ఈ నటి 'గుంటూరు కారం' చిత్రంలోనూ మెరిశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రముఖ రియాలిటీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తున్నారు.   ఈ అందాల తార చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. తన అద్భుతమైన ప్రతిభతో మలయాళంలో ప్రసిద్ధమైన 'సూపర్ డ్యాన్సర్' రియాలిటీ పోటీలో పాల్గొని తొలిసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరో అర్థమైంది కదు పూర్ణ. ఇది కూడా చదవండి: నెక్స్ట్ ఆ లెజండ్రీ బయోపిక్ లో ఆనంది: గరివిడి లక్ష్మితో చితక్కొటేసిందిగా!      రీసెంట్ గా జైలర్ 2 లో కూడా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. జైలర్ 2 అని చెప్తే వెంటనే చెప్పేస్తారని  చెప్పలేదులే. అయినా కూడా సినీ ప్రేమికులు ముందుగానే ఊహించేసి న్యూస్ మధ్యలోనే చిన్న బ్రేక్ ఇచ్చి  బుజ్జి పెళ్లి కొడుక్కి(పెళ్లి కూతురు)  రాజయోగమురా అని డాన్స్ చేసే ఉంటారు.   [Poorna Childhood Photo Viral, poorna childhood photo, tollywood actress childhood pic, shamna kasim viral photo, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
మన దేశం నుంచి ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైన సినిమా తెలుగులోకి వస్తుంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో అంచనాలు మరింత పెరుగుతాయి. అదే మరాఠీ సినిమా ‘గోంధళ్’ (Gondhal). తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై చర్చ మొదలైంది. సంతోష్ దవఖర్ స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన సినిమా ‘గోంధళ్’. 2027లో జరిగే 99వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపికైంది. సెప్టెంబర్ 18న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మొత్తం 33 సినిమాల నుంచి ‘గోంధళ్’ను ఎంపిక చేశారు. గతేడాది నవంబర్‌లో మరాఠీ భాషలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సంతోష్ దవఖర్‌కు గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది. ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. మహారాష్ట్రలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. సుమన్ అనే యువతి అసంతృప్తికరమైన వైవాహిక జీవితంలో చిక్కుకుపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తన ప్రియుడు సర్జేరావ్‌కు సంప్రదాయ గోంధళ్ ఆచారంపై ఉన్న అమితమైన నమ్మకాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. కొత్తగా పెళ్లైన జంట కోసం రాత్రంతా నిర్వహించే సంప్రదాయ గోంధళ్ కార్యక్రమం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత కోరికలు, కుటుంబ బాధ్యతలు, రహస్యాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ రాత్రి ఏం జరిగింది? అసలు సుమన్ ఏం చేయాలనుకుంది? అనేది సినిమాలో చూడాలి. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సస్పెన్స్, మిస్టరీ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ వాతావరణం, సంప్రదాయ ఆచారాలు, పాత్రల మధ్య సంఘర్షణలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చిక్కుముడులు, ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఇళయరాజా సంగీతం. కథలోని భావోద్వేగాలకు, సస్పెన్స్‌కు తగ్గట్టుగా ఆయన అందించిన సంగీతం ట్రైలర్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘గోంధల్’ సినిమాలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు కీలక పాత్రల్లో నటించారు. అమలేందు చౌధరి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాను నవంబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది కూడా చదవండి: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఓటీటీలోకి రాజమౌళి మూవీ.!       [Gondhal Telugu Trailer, Indias Oscar Entry 2027, Gondhal Telugu Release Date, Gondhal Trailer Telugu, Gondhal Movie Story, Santosh Davakhar, Ilaiyaraaja, Hombale Films, Telugu Film News]  
వరంగల్ అమ్మాయి ఆనంది ఉత్తరాంధ్ర లెజండ్రీ కళాకారిణి 'గరివిడి లక్ష్మి' తో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. దీంతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించింది. ఆనంది కోసమే  'గరివిడి లక్ష్మి 'ని రెండు సార్లు చూసిన వాళ్ళు సైతం ఉన్నారు. ఇంచు కూడా పిన్ టూ పిన్ తగ్గకుండా  ఒరిజినల్ గరివిడి లక్ష్మిని కళ్ళ ముందు ఉంచింది. నటించడం కాదు జీవించడం అంటే ఏంటో మరోసారి సెల్యులాయిడ్ కి, ప్రేక్షకులకి రుచి చూపించింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా ఆనంది తదుపరి ప్రాజెక్టులపై అందరి దృష్టి నెలకొంది. క్యారక్టర్ లో  ఉండే విభిన్నత, కథలోని బలాన్ని బట్టి సినిమాలు ఎంచుకునే ఆనంది, మళ్లీ ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతారనే  మాటలు వినిపిస్తున్నాయి.ఇంకో లెజండ్రీ మణి బయోపిక్ లో కూడా చేస్తుందని, త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు.  ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం పరిస్థితి ఏంటి: హిట్ కొడుతున్నారా..అది జరిగితే మాత్రం!    ఆనంది సుదీర్ఘ కాలం నుంచి తమిళ నాట తన హవా చాటుతూ ఉంది. దీంతో ఆనంది మా అమ్మాయి అని తమిళ ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్పే పరిస్థితి. అక్కడి హిట్ లిస్ట్ చాలా పెద్దదే.     [Anandhi Next Project Details, Anandhi next project, Garividi Lakshmi movie, Anandhi upcoming movies, Garividi Lakshmi box office, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
ఓటీటీలో హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడియా భాషలో రూపొందిన ‘దహాన్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆహా వేదికగా అందుబాటులోకి వచ్చింది. అనుపమ్‌ పట్నాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బర్షా నాయక్‌, ఔరోసికా మిశ్రా, సమ్రాట్‌ మహాపాత్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ హారర్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టింది? కథలో కొత్తదనం ఉందా? అనేది చూద్దాం. అడవికి సమీపంలో ఉన్న ఓ పాత బంగ్లా ఈ కథకు ప్రధాన నేపథ్యం. ఒకప్పుడు జమీందారుకు చెందిన ఈ బంగ్లాలో ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత అది నిరుపయోగంగా మారుతుంది. కొంతకాలానికి ఆయన వారసురాలు ఆనందిత తన తమ్ముడు సమర్‌, చెల్లెలు మనూతో కలిసి అక్కడికి వస్తుంది. ఆస్తులను అమ్మేసి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనేది ఆమె ఆలోచన. అయితే, బంగ్లాలోని అవుట్‌హౌస్‌లో ఉన్న ఓ చెక్కపెట్టెను మనూ తెరవడంతో పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో వింత మార్పులు కనిపిస్తాయి. ఆ పెట్టెకు, తమ పూర్వీకులకు ఉన్న సంబంధం ఏమిటి? మనూను ఆ ప్రేతాత్మ బారి నుంచి ఆనందిత కాపాడగలిగిందా? అనేది మిగతా కథ. సాధారణంగా ఇలాంటి హారర్‌ కథలు మొదలవడానికి కొంత సమయం తీసుకుంటాయి. ‘దహాన్‌’ కూడా తొలి అరగంట నిదానంగా సాగుతుంది. ఆ తర్వాత పెట్టెలో ఏముంది? అందులోని వస్తువుల వెనుక రహస్యం ఏమిటి? ప్రేతాత్మకు ఆనందిత కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్‌ తర్వాత కథనం వేగం పుంజుకోవడం, ఆనందిత పెట్టెను వదిలించుకోవడానికి ప్రయత్నించడం, మనూ దానిని కాపాడుతూ ఉండటం ఉత్కంఠను పెంచుతాయి. చర్చి ఫాదర్‌ పాత్ర ప్రవేశించిన తర్వాత కథ క్లైమాక్స్‌ వైపు సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు కొంతమేర భయపెడతాయి. అయితే, ప్రేతాత్మలకు సంబంధించిన కథల్లో ఇప్పటికే చూసిన సన్నివేశాలు ఇందులోనూ కనిపించడం ప్రధాన లోపం. ఆత్మ ఆవహించినప్పుడు పాత్రలు ప్రవర్తించే తీరు, ప్రేక్షకులను భయపెట్టడానికి ఉపయోగించిన పద్ధతులు కొత్తగా అనిపించవు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కొంత భిన్నంగా ఉన్నప్పటికీ, కథలో మరింత కొత్తదనం ఉంటే బాగుండేది. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్‌ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే, హారర్‌ సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు.      [Dahaan Movie Review, Dahaan Telugu Review, Dahaan OTT Release, Dahaan Aha Movie, Odia Horror Thriller, Dahaan Movie Cast, Anupam Patnaik]
నవ్విన నాప చేనే పండుతుందనే నానుడి ప్రస్తుత ఏఐ యుగంలో  ఆదర్శ కుటుంబం ద్వారా తన ఉనికిని చాలా బలంగా చాటేలా ఉంది. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు ఆదర్శ కుటుంబంపై అంచనాలు లేవు. మేకర్స్ కి కూడా ఈ విషయం తెలియంది కాదు. కానీ ప్రమోషన్స్ తో అంచనాలకి మించిన అంచనాలని పెంచుకుంది. దీంతో సినిమా ఫలితంపై అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి చూద్దాం.   ముఖ్యంగా నేటి తరం కుటుంబాల్లో మాయమవుతున్న అనుబంధాలు, మనుషుల మధ్య పెరిగిన దూరాలు, ఆత్మీయతల విలువని గుర్తుచేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందనే వార్త ఫ్యామిలీ ఆడియన్స్‌ని  విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. మొదటి రోజే యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలవడం ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. గతంలో వెంకటేష్ నటించిన కుటుంబ కథా చిత్రాలకి త్రివిక్రమ్ అందించిన మాటల విందుకి ట్రేడ్ వర్గాల్లో భారీ స్పందన ఉండేది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు. దీంతో మరో సారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని, హిట్ పక్కా అనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.   ప్రీ-రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు  80 కోట్ల మేర జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాన్-థియేట్రికల్ రైట్స్, డిజిటల్ ఓటీటీ హక్కులు ఏకంగా  50 కోట్లకు అమ్ముడుపోవడం ఈ ప్రాజెక్ట్ విలువని  చాటిచెబుతోంది. ఇది కూడా చదవండి: అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే: హీరో ఎవరంటే!     సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే కుటుంబ ప్రేక్షకుల నుంచి ఏకంగా 95% సానుకూల రేటింగ్ మరియు సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లకు కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఈ సినిమాతో మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.  వెంకటేష్, శ్రీనిధి శెట్టి నటన, త్రివిక్రమ్ రాసిన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి 30 న అసలు విషయం తెలిసిపోనుంది.   [Adarsha Kutumbam censor Report, Adarsha Kutumbam Public Talk, Venkatesh Trivikram Movie, Adarsha Kutumbam Update, Venkatesh New Telugu Movie, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
Director Adhik Ravichandran has made it clear that he does not want to repeat the Good Bad Ugly formula in his next film with Ajith Kumar, Daredevil. In a recent interview, he said the earlier film's approach was a one-time experience and would not work again if repeated. He stressed that Daredevil would be a completely different film, designed as a commercial entertainer with all emotions in the right balance.  Adhik revealed that Daredevil was actually the story he had initially planned to make with Ajith. However, due to time and budget constraints, the team developed a different proposition, which eventually became Good Bad Ugly. He described that film as a fan tribute to Ajith, but said the upcoming project would not follow the same template. The director wants Daredevil to appeal to a wider audience rather than rely on the fan-service approach of their previous collaboration. Adhik also confirmed that Sreeleela is part of the film, dismissing speculation around Kayadu Lohar's involvement. He praised producer Shalini Ajith's understanding of narrative, story and screenplay, admitting that he was surprised by how eloquently she expressed her views on these aspects. The film's shoot will begin at 8:05 AM on November 12 at Ramoji Film City in Hyderabad, after the Diwali break. The Indian portions will be shot continuously on specially built sets, with additional schedules planned abroad. Daredevil also stars Prabhu, Parthiban and Sunil, with music by Anirudh Ravichander. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సినిమా.. సినిమా.. ఏ ముహూర్తాన భరత ఖండంపై అడుగుపెట్టిందో కానీ ఎన్నో వైభవాలని, గుర్తులని, రికార్డులని దాచుకొని ఉంది. అందుకే ఈ విశ్వంలో దాగి ఉన్న అన్ని రకాల హరివిల్లులు, రంగవల్లులు తనలో ఉన్నాయని మిడిసిపాటు. మరి మాములు వాళ్ళకే మిడిసిపాటు ఉంటే సినిమాకి ఎంత ఉండాలి చెప్పండి. అది కూడా నిజమేలే  అనేలా సినీ సజీవ పునాదుల్లో దాగి ఉన్న ఒక రహస్యాన్ని మన ముందు ఉంచి ఆశ్చర్య పరుస్తుంది. అదే అమెరికాలో ఫస్ట్ షూటింగ్ జరుపుకున్న తెలుగు మూవీ ఇదే అనే న్యూస్     విదేశీ గడ్డపై షూటింగ్ జరుపుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. ఆ చిత్రం హరే కృష్ణ హలో రాధ. సి.వి. శ్రీధర్ దర్శకుడు.  పూర్తిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో (USA) చిత్రీకరించబడిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా  రికార్డు సృష్టించింది.  లాస్‌ ఏంజిల్స్‌, లాస్‌ వేగాస్‌ వంటి నగరాలతో పాటు గ్రాండ్‌ కానియన్‌, అరిజోనా, ఫీనిక్స్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించారు. అక్కడి సహజ సౌందర్యం, విభిన్నమైన భౌగోళిక నేపథ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి సినిమాల్లో విదేశీ లొకేషన్లను తెరపై చూడటం ప్రేక్షకులకు సాధారణ విషయమే.  ఆ కాలంలో విదేశాలకు వెళ్లి సినిమాని తెరకెక్కించడం  సామాన్యమైన విషయం కాదు. కానీ అప్పట్లోనే మేకర్స్ ఇంతలో దైర్యం చేసి అమెరికాలోని ప్రముఖ ప్రాంతాలని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం  ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కేవలం సాంకేతికంగానే కాకుండా, నిర్మాణపరంగా కూడా టాలీవుడ్ స్థాయిని సరికొత్త శిఖరాలకు చేర్చింది.  ఇది కూడా చదవండి: 4 సెకన్లలో వందల కోట్ల ఆస్థి పోగొట్టుకున్న ప్రముఖ నటి: ఫ్యాన్స్ షాక్! శ్రీ భరణి చిత్ర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి. భరణి రెడ్డి  ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.   కృష్ణ సరసన శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి వంటి ప్రముఖ నటీమణులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, జయమాలిని, పండరీబాయి, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రలలో నటించి సినిమాకు మరింత వన్నె తెచ్చారు. విదేశీ లొకేషన్లలో చిత్రీకరించినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల నాడిని ఏమాత్రం కోల్పోకుండా చక్కటి కుటుంబ కథాంశంతో, వినోదాత్మకంగా నిలిచారు. పాటలు కూడా అప్పట్లో సంచలన విజయం సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకులు విజయ భాస్కర్  అందించిన మధురమైన బాణీలకు, కొసరాజు రాఘవయ్య చౌదరి, వీటూరి వంటి దిగ్గజ గేయ రచయితలు అందించిన సాహిత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులని  చేసింది.     ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జైరామ్ సుమధుర గాత్రం సినిమా స్థాయిని మరింత పెంచింది.   అమెరికా వీధుల్లో, అద్భుతమైన ప్రాకృతిక అందాల మధ్య నడచిన ఈ సినిమా నాటి టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ లా నిలిచింది. నేడు టాలీవుడ్ హీరోలు హాలీవుడ్ రేంజ్‌లో అమెరికా మరియు యూరప్ దేశాలలో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నప్పటికీ, ఆ ట్రెండ్‌కు నాలుగు దశాబ్దాల క్రితమే అంకురార్పణ చేసిన సాహస చిత్రం 'హరే కృష్ణ హలో రాధ'.అక్టోబర్ 16, 1980 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.      [Hare Krishna Hello Radha First Telugu Film Shoot In Usa, Hare Krishna Hello Radha, Superstar Krishna, first telugu movie in usa, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]  
Marvel Studios has announced that Avengers: Doomsday will arrive in Indian theatres on December 17, 2026, a day before its US release. Robert Downey Jr. and Chris Evans revealed the update through a special Diwali video message, greeting Indian fans with “Namaste India” and extending their festive wishes. The announcement has added to the anticipation surrounding Marvel's next major superhero spectacle. In their message, the actors connected the festive occasion with the film's arrival, giving Indian fans an early opportunity to witness the next chapter of the Marvel Cinematic Universe. Avengers: Doomsday marks Robert Downey Jr.'s return to the franchise in a strikingly different role. After playing Tony Stark, aka Iron Man, across several Marvel films, he will portray the iconic villain Doctor Doom. Chris Evans also returns as Steve Rogers, the former Captain America, setting the stage for the reunion of two familiar MCU stars. Directed by Anthony and Joe Russo, the film features an expansive ensemble that includes Chris Hemsworth, Pedro Pascal, Paul Rudd, Anthony Mackie, Florence Pugh, Vanessa Kirby, Tom Hiddleston, Sebastian Stan, Ian McKellen and Patrick Stewart, among others. The film is expected to release in India in English, Hindi, Tamil and Telugu. With familiar heroes returning and Doctor Doom emerging as the central threat, Avengers: Doomsday is shaping up to be one of Marvel's biggest cinematic events. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
    తెలుగు సినిమా అమ్ముల పొదిలో నిశ్శబ్దంగా దాక్కొని ఉన్న గొప్ప నటీమణుల్లో సుధ ఒకరు. ఎందుకు నిశ్శబ్దంగా  అని అనాల్సి వస్తుందంటే అమ్మగా, అత్తగా, అక్కగా, వదినగా సుమారు 500లకుపైగా సినిమాల్లో అంతే నిశ్శబ్దంగా వైవిధ్యమైన క్యారెక్టర్స్ పోషించి అభిమానులకి ప్రేక్షకులకి ఎనీ టైం బయట ఎక్కడ కనపడినా మన సుధ అని పిలిపించుకునే క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా చిరంజీవి గ్యాంగ్ లీడర్ వదినగా ఫుల్ ఫేమస్. సుధకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది  సుధది  అత్యంత ధనిక కుటుంబం.నలుగురు అన్నయ్యల మధ్య ఏకైక ఆడబిడ్డ. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఆమె బాల్యం రాజభోగాల మధ్య సాగింది. మూడు కార్లు, ఇంట్లో సేవకులు ఉండే అత్యంత ఉన్నత కుటుంబం. అయితే, తండ్రి తీవ్ర అనారోగ్య బారిన పడటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలింది. క్యాన్సర్ మహమ్మారి సోకడంతో తండ్రి వైద్యం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. అప్పుడు సుధ వయసు కేవలం ఎనిమిది సంవత్స్సరాలు. చదువుకునేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావడంతో, చివరికి తల్లి తాళిబొట్టుని సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధ, నటిగా కోట్లాది రూపాయల సంపాదనను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. కానీ, జీవితం మళ్లీ ఆమెను పరీక్షించింది. ఢిల్లీలో భారీ స్థాయిలో ఒక హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సుధ, అక్కడ అనూహ్యంగా భారీ ఆర్థిక నష్టాలను చవిచూశారు. కేవలం ఒక్కటంటే ఒక్క సంతకం పెట్టిన కారణంగా తన జీవితంలో కూడబెట్టిన సంపదంతా క్షణాల్లో కరిగిపోయింది.  దీంతో కోట్ల విలువైన ఆస్తులన్నీ సున్నాగా మారిపోయాయి. వ్యాపారంలో ఎదురైన ఆ ఒక్క పొరపాటు తన జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది. కేవలం ఆర్థిక పరమైన నష్టాలే కాకుండా, వ్యక్తిగత జీవితంలోను తీవ్రమైన ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు. భర్త, కొడుకు ఇద్దరూ ఆమెకు దూరంగా ఉంటున్నారని, ప్రస్తుతం తాను పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నానని ఆమె తెలిపారు. కుటుంబసభ్యుల నుంచి తగిన మద్దతు లభించకపోయినా, ఆమె ఎక్కడా కుంగిపోలేదు. ఇది కూడా చదవండి: ప్రభంజనం తప్పదా: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడా! డబ్బు వస్తుంది పోతుంది కానీ మనిషికి మనశ్శాంతే అసలైన సంపద అని సుధ నిరూపించారు. జీవితంలో అన్నీ కోల్పోయినా ఈరోజుకి నవ్వుతూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఆమె అనుభవించిన కఠిన పాఠాలే. కాలం తెచ్చిపెట్టిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ఉన్నదాంతో సంతృప్తి చెందడమే నిజమైన జీవితమని ఆమె బలంగా నమ్ముతున్నారు. కూతురు వివాహం జరిపించి, ప్రస్తుతం తన మనవరాలితో సంతోషంగా కాలం గడుపుతున్న సుధ... డబ్బే సంతోషాన్ని కొనుగోలు చేయలేదని మరోసారి రుజువు చేశారు.        దీన్ని బట్టి సుధ లైఫ్ స్టైల్ ని బట్టి మనకి అర్ధమయ్యేది ఏంటంటే  ఒక్క సంతకంతో వందల కోట్ల ఆస్తిని కోల్పోయినా, ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొంటూ ఆమె ఇస్తున్న సందేశం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. అదే విధంగా సంపద శాశ్వతం కాదని, కష్టాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యమే మనిషిని నిలబెడుతుందని కూడా సుధ జీవితం ద్వారా స్పష్టమవుతోంది.            [Actress Sudha Financial Loss Story, actress sudha, sudha financial loss, telugu actress sudha interview, sudha property lost, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
    ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలియగానే మహిళలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు కూడా సరైన పోషకాహారం ఎంతో ముఖ్యం. అయితే గర్భం దాల్చిన మొదటి రోజుల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి? బయట ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? గర్భిణులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఈ ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఏ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి? గర్భధారణ సమయంలో ప్రతి ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని ఆహారాలు కలుషితం కావడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు. సరిగా ఉడకని ఆహారాలు, పరిశుభ్రత పాటించకుండా తయారు చేసిన పదార్థాలు, బయట లభించే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? గర్భిణులు నివారించాల్సిన ఆహార పదార్థాలు ఏవి? ఈ అంశాలపై డాక్టర్ హరిత వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గర్భిణులు బయట ఆహారం ఎందుకు తగ్గించాలి? ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం తయారీలో పరిశుభ్రత, పదార్థాల నాణ్యత, సరైన నిల్వ పద్ధతులు చాలా ముఖ్యం. బయట ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం తాజాగా ఉందా, సరిగ్గా ఉడికించారా, పరిశుభ్రంగా తయారు చేశారా అనే విషయాలను గమనించాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఎందుకు అవసరమో ఈ వీడియోలో వివరించారు. ప్రసవం తర్వాత బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రసవం తర్వాత తల్లి శరీరానికి కోలుకోవడానికి, బిడ్డకు పాలివ్వడానికి తగినంత శక్తి, పోషకాలు అవసరం. ఈ సమయంలో ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎలా ఎంచుకోవాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి? బాలింతలు తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. తల్లిపాలు పెరగడానికి ఎలాంటి ఆహారం ఉపయోగపడుతుంది? బిడ్డకు తగినంత తల్లిపాలు అందడం తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్యానికి ముఖ్యమైనది. పాలిచ్చే తల్లులు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం, విశ్రాంతి పొందడం అవసరం. పాలిచ్చే సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం, ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ హరిత అందించే సూచనలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బిడ్డ ఎదుగుదలకు సరైన పోషకాహారం ఎందుకు ముఖ్యం? శిశువు ఎదుగుదలలో సరైన సమయంలో తగిన ఆహారాన్ని పరిచయం చేయడం ఎంతో ముఖ్యం. వయస్సుకు తగిన అనుబంధ ఆహారం, బేబీ ఫుడ్ ఎంపిక, అవసరమైన పోషకాలు, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులు వంటి అంశాలపై కూడా ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలను తెలుసుకోవచ్చు. గర్భధారణ నుంచి ప్రసవం తర్వాతి దశ వరకు తల్లి పోషకాహారం, తల్లిపాలు, శిశువు ఆహారపు అలవాట్ల గురించి అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం, నివారించాల్సిన పదార్థాలు, బాలింతల పోషకాహారం గురించి మరిన్ని వివరాల కోసం డాక్టర్ హరిత వివరణను పూర్తిగా చూడండి. గమనిక: గర్భధారణ సమయంలో మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహార నియమాలను పాటించడానికి మీ వైద్యుడి సూచనలు తీసుకోండి.
గర్భం దాల్చాలని ప్రయత్నించే మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కేవలం ఆహారం తీసుకోవడం, డాక్టర్ చెప్పిన విటమిన్లు వేసుకోవడం మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. గర్బం దాల్చాలని అనుకునే  చాలా మంది మహిళలకు తెలియని కొన్ని ముఖ్యమైన , లోతైన విషయాలను వివరంగా  తెలుసుకుంటే.. సర్కాడియన్ రిథమ్  బాలెన్స్.. శరీరంలో సర్కాడియన్ రిథమ్ ను అంతర్గత గడియారం అని అంటారు. ఇది బాలెన్స్డ్ గా ఉండటం  చాలా ముఖ్యం. రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం లేదా షిఫ్ట్ డ్యూటీల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ప్రొలాక్టిన్ , మెలటోనిన్ హార్మోన్లు అండం విడుదల కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వారు రాత్రి పూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే గదిలో లైట్లు పూర్తిగా ఆరిపోయేలా లేదా డిమ్ గా ఉంచుకోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. ప్లాస్టిక్ కు దూరం..  రోజూ వాడే ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, నాన్-స్టిక్ పాన్ల వాడకం వల్ల శరీరంలోకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనే రసాయనాలు ప్రవేశిస్తాయి. ఇవి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి అండం నాణ్యతను తగ్గిస్తాయి. దీనికి బదులుగా గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను వాడడం చాలా మంచిది. ప్లాస్టిక్ డబ్బాలలో వేడి వేడి ఆహారాన్ని నిల్వ చేయడం పూర్తిగా మానేయాలి. ప్యాక్డ్, జంక్ ఫుడ్.. శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ లేదా అంతర్గత మంట కూడా సంతానోత్పత్తిని అడ్డుకుంటుంది. ప్యాకెట్లలో లభించే జంక్ ఫుడ్, మైదా ఉత్పత్తులు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచుతాయి. దీనికి బదులుగా యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు ఎక్కువగా ఉండే నల్ల ద్రాక్ష, దానిమ్మ, బ్లూ బెర్రీస్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి అండం నాణ్యతను పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కార్టిసాల్ హార్మోన్.. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రెగ్నెన్సీకి సహకరించే ఇతర హార్మోన్లను అణచివేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కేవలం యోగా ఒక్కటే కాకుండా, ప్రకృతితో గడపడం, సూర్యరశ్మిలో కాసేపు నడవడం వంటివి చేయాలి. ఉదయం పూట ఎండలో పదిహేను నిమిషాలు గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది, ఇది హార్మోన్ల సమతుల్యతకు ఎంతో అవసరం. పెల్విక్ ఆరోగ్యం.. పెల్విక్ ఫ్లోర్ కండరాల ఆరోగ్యం  గురించి చాలా మంది పట్టించుకోరు. గర్భాశయానికి రక్త సరఫరా సక్రమంగా జరగాలంటే ఈ కండరాలు ఆరోగ్యంగా ఉండాలి. రోజూ తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కాఫీ, టీ.. కాఫీ, టీల వాడకాన్ని కొద్దిగా తగ్గించడం మంచిది. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల అండం విడుదలయ్యే వేగం మందగించే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గర్భధారణ మార్గం చాలా సులభం అవుతుంది. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి,  ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా నిపుణుల సలహా తీసుకోవడం కూడా ఎంతో మంచిది.                                                                                                                       *రూపశ్రీ.
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, నిద్రలేమి వంటి సమస్యలు మన రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొందరిలో నిరంతర ఆందోళన, బాధ, నిరాశ కారణంగా పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చు. అసలు మానసిక ఒత్తిడికి, శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సైకోథెరపీ ఎలా సహాయపడుతుంది? ఈ వీడియోలో డాక్టర్ శారదా దేవి గారు మానసిక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, సైకోథెరపీ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. మందులు మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్సలో సైకోథెరపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? మనసు, శరీరం మధ్య సంబంధం ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సైకోథెరపీ అంటే ఏమిటి? మానసిక సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఆలోచనలు మరియు భావోద్వేగాలను ఆరోగ్యకరంగా నిర్వహించుకోవడానికి సహాయపడే చికిత్సా విధానాల్లో సైకోథెరపీ ఒకటి. మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటం ద్వారా సమస్యలకు కారణమయ్యే ఆలోచనా విధానాలను గుర్తించడం, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులను నేర్చుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటి అంశాల్లో సహాయం పొందవచ్చు. సైకోథెరపీ ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది? చికిత్స ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు? అనే విషయాలను ఈ వీడియో వివరిస్తుంది. డిప్రెషన్, ఆందోళన, భయం ఎందుకు కలుగుతాయి? నిరంతర ఆందోళన, భయం, నిరాశ, భావోద్వేగ ఒత్తిడి వంటి సమస్యలు వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను, రోజువారీ పనులను ప్రభావితం చేయవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను సాధారణ బాధ లేదా తాత్కాలిక ఒత్తిడితో సమానంగా చూడకూడదు. వీటి వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. సమస్యలను గుర్తించడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో డాక్టర్ శారదా దేవి గారు వివరిస్తారు. మానసిక ఒత్తిడికి, శారీరక ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? మనసుపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు సంభవించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్ర, రోగనిరోధక వ్యవస్థ, రక్తపోటు వంటి ఆరోగ్య అంశాలపై ప్రభావం చూపవచ్చు. అయితే అధిక రక్తపోటు (BP)కు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి ఒక్కటే దానికి కారణమని భావించకూడదు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టవచ్చు. నిద్రలేమి ఎందుకు వస్తుంది? నిద్ర ఎందుకు ముఖ్యం? తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు నిద్రను దెబ్బతీయవచ్చు. ఈ విధంగా మానసిక ఆరోగ్యం, నిద్ర ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాలను గుర్తించి తగిన సహాయం పొందడం అవసరం. సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యల గురించి తెలుసుకోండి మానసిక ఆరోగ్య సమస్యలు ఒకే రకంగా ఉండవు. డిప్రెషన్, ఆందోళన, సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి పరిస్థితుల లక్షణాలు, వాటికి అవసరమైన చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. వీటి గురించి సరైన అవగాహన పెంపొందించుకోవడం, అపోహలకు దూరంగా ఉండటం, బాధితులను గౌరవంగా చూడటం ఎంతో ముఖ్యం. అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం సరైన మార్గం. శారీరక, భావోద్వేగ, సామాజిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, సంబంధాల్లో ఇబ్బందులు, జీవితంలో ఎదురయ్యే మార్పులు మన మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని గుర్తించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, విశ్రాంతికి సమయం కేటాయించడం, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ శారదా దేవి గారి వివరణ ద్వారా సైకోథెరపీ ప్రాముఖ్యత, మనసు-శరీరం మధ్య సంబంధం, ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు, నిద్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా వ్యక్తిగత చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి లేదా అధిక రక్తపోటు సమస్యలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా సూచించిన మందులను ఆపవద్దు.