Home

»

Latest News

4 సెకన్లలో వందల కోట్ల ఆస్థి పోగొట్టుకున్న ప్రముఖ నటి: ఫ్యాన్స్ షాక్!

Oct 28, 2026 4:47PM

 

 

తెలుగు సినిమా అమ్ముల పొదిలో నిశ్శబ్దంగా దాక్కొని ఉన్న గొప్ప నటీమణుల్లో సుధ ఒకరు. ఎందుకు నిశ్శబ్దంగా  అని అనాల్సి వస్తుందంటే అమ్మగా, అత్తగా, అక్కగా, వదినగా సుమారు 500లకుపైగా సినిమాల్లో అంతే నిశ్శబ్దంగా వైవిధ్యమైన క్యారెక్టర్స్ పోషించి అభిమానులకి ప్రేక్షకులకి ఎనీ టైం బయట ఎక్కడ కనపడినా మన సుధ అని పిలిపించుకునే క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా చిరంజీవి గ్యాంగ్ లీడర్ వదినగా ఫుల్ ఫేమస్. సుధకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది


 సుధది  అత్యంత ధనిక కుటుంబం.నలుగురు అన్నయ్యల మధ్య ఏకైక ఆడబిడ్డ. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఆమె బాల్యం రాజభోగాల మధ్య సాగింది. మూడు కార్లు, ఇంట్లో సేవకులు ఉండే అత్యంత ఉన్నత కుటుంబం. అయితే, తండ్రి తీవ్ర అనారోగ్య బారిన పడటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలింది. క్యాన్సర్ మహమ్మారి సోకడంతో తండ్రి వైద్యం కోసం ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. అప్పుడు సుధ వయసు కేవలం ఎనిమిది సంవత్స్సరాలు. చదువుకునేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావడంతో, చివరికి తల్లి తాళిబొట్టుని సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధ, నటిగా కోట్లాది రూపాయల సంపాదనను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. కానీ, జీవితం మళ్లీ ఆమెను పరీక్షించింది. ఢిల్లీలో భారీ స్థాయిలో ఒక హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సుధ, అక్కడ అనూహ్యంగా భారీ ఆర్థిక నష్టాలను చవిచూశారు. కేవలం ఒక్కటంటే ఒక్క సంతకం పెట్టిన కారణంగా తన జీవితంలో కూడబెట్టిన సంపదంతా క్షణాల్లో కరిగిపోయింది.  దీంతో కోట్ల విలువైన ఆస్తులన్నీ సున్నాగా మారిపోయాయి. వ్యాపారంలో ఎదురైన ఆ ఒక్క పొరపాటు తన జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది. కేవలం ఆర్థిక పరమైన నష్టాలే కాకుండా, వ్యక్తిగత జీవితంలోను తీవ్రమైన ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు. భర్త, కొడుకు ఇద్దరూ ఆమెకు దూరంగా ఉంటున్నారని, ప్రస్తుతం తాను పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నానని ఆమె తెలిపారు. కుటుంబసభ్యుల నుంచి తగిన మద్దతు లభించకపోయినా, ఆమె ఎక్కడా కుంగిపోలేదు.

ఇది కూడా చదవండి: ప్రభంజనం తప్పదా: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడా!


డబ్బు వస్తుంది పోతుంది కానీ మనిషికి మనశ్శాంతే అసలైన సంపద అని సుధ నిరూపించారు. జీవితంలో అన్నీ కోల్పోయినా ఈరోజుకి నవ్వుతూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఆమె అనుభవించిన కఠిన పాఠాలే. కాలం తెచ్చిపెట్టిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ఉన్నదాంతో సంతృప్తి చెందడమే నిజమైన జీవితమని ఆమె బలంగా నమ్ముతున్నారు. కూతురు వివాహం జరిపించి, ప్రస్తుతం తన మనవరాలితో సంతోషంగా కాలం గడుపుతున్న సుధ... డబ్బే సంతోషాన్ని కొనుగోలు చేయలేదని మరోసారి రుజువు చేశారు. 

 

 

 

దీన్ని బట్టి సుధ లైఫ్ స్టైల్ ని బట్టి మనకి అర్ధమయ్యేది ఏంటంటే  ఒక్క సంతకంతో వందల కోట్ల ఆస్తిని కోల్పోయినా, ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొంటూ ఆమె ఇస్తున్న సందేశం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. అదే విధంగా సంపద శాశ్వతం కాదని, కష్టాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యమే మనిషిని నిలబెడుతుందని కూడా సుధ జీవితం ద్వారా స్పష్టమవుతోంది. 

       

 

[Actress Sudha Financial Loss Story, actress sudha, sudha financial loss, telugu actress sudha interview, sudha property lost, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com