Home

»

Latest News

అమృతాన్నికురిపిస్తున్నఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్: ఎవరో గుర్తుపట్టారా!

Oct 28, 2026 6:37PM

 

'బుజ్జి పెళ్లి కొడుక్కి(పెళ్లి కూతురు)  రాజయోగమురా' అని ఈ పక్కన ఉన్న పిక్ కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు  గంతులేస్తూ మరి పాడుకుంటారు. మరి కనిపెట్టనోళ్లు... మ్యాటర్ చదివాకా డాన్స్ చేస్తారు.. సో దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏంటంటే సాంగ్ మాత్రం కంటిన్యూ.  


'సీమటపాకాయ్', 'అవును' వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత 'శ్రీ మహాలక్ష్మి', 'నువ్వలా నేనిలా', 'రాజుగారి గది', 'అఖండ 2' వంటి పలు భారీ చిత్రాలతో పాటు అగ్ర హీరోల సినిమాలలో ప్రత్యేక గీతాలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న ఈ నటి 'గుంటూరు కారం' చిత్రంలోనూ మెరిశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రముఖ రియాలిటీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తున్నారు.   ఈ అందాల తార చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. తన అద్భుతమైన ప్రతిభతో మలయాళంలో ప్రసిద్ధమైన 'సూపర్ డ్యాన్సర్' రియాలిటీ పోటీలో పాల్గొని తొలిసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరో అర్థమైంది కదు పూర్ణ.

ఇది కూడా చదవండి: నెక్స్ట్ ఆ లెజండ్రీ బయోపిక్ లో ఆనంది: గరివిడి లక్ష్మితో చితక్కొటేసిందిగా! 

 

 

రీసెంట్ గా జైలర్ 2 లో కూడా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. జైలర్ 2 అని చెప్తే వెంటనే చెప్పేస్తారని  చెప్పలేదులే. అయినా కూడా సినీ ప్రేమికులు ముందుగానే ఊహించేసి న్యూస్ మధ్యలోనే చిన్న బ్రేక్ ఇచ్చి  బుజ్జి పెళ్లి కొడుక్కి(పెళ్లి కూతురు)  రాజయోగమురా అని డాన్స్ చేసే ఉంటారు.

 

[Poorna Childhood Photo Viral, poorna childhood photo, tollywood actress childhood pic, shamna kasim viral photo, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com