LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన ఫిర్యా దులను పరిశీలించిన స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఇద్దరు ఎమ్మె ల్యేలు పార్టీ మార్పిడి చేశా రని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం స్పీకర్ వాటిని డిస్మిస్ చేశారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి పై ఉన్న పార్టీ ఫిరాయింపు ఆరోపణల నుంచి వారికి క్లీన్ చిట్ లభించింది. ఫిర్యాదులపై అందిన పత్రాలు, ఆధారాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్ల డించింది.  పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత విధించాలనే అభ్యర్థనలను స్పీకర్ తిరస్కరించారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ మార్పిడి ఆరోపణలు రావడంతో వారి సభ్యత్వంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం నుంచి కూడా ఈ వ్యవహారంపై పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ ఈ ఫిర్యాదులను కొట్టివే యడంతో వారి సభ్యత్వాలు కొనసాగనున్నాయి. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
బీజేపీ ఎట్టకేలకు మౌనం వీడింది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.  రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో  బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్‌తో పొత్తు  ప్రసక్తే లేదన్నారు. ఇది బీజేపీ తుదినిర్ణయమని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో   బీఆర్ఎస్‌  రెండుసార్లు, కాంగ్రెస్‌  ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.   బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు.  తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ బలమన్న రామచందర్ రావు.. రేవంత్ సర్కార్  ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో  ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, కుటుంబ పాలన వంటి అంశాల కారణంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన అటువంటి బీఆర్ఎస్ తో చేతులు కలిపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీతో.. తెలంగాణలో  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖపోరు అనివార్యం అని తేలిపోయింది. అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించినట్లైంది.  అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో  బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించింది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. ఇంత వరకూ కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.  
వన్ నేషన్ వన్ ఎలక్షన్  కరెక్ట్ కాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటోందని విమర్శించారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గిపోతుందని విమర్శించారు.   అదికారాలన్నీ కేంద్రం చేతుల్లోకే వెళ్లిపోతాయన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంటే  సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విఘాతమేనని స్టాలిన్ పేర్కొన్నారు. జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.   కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.   ప్రస్తుత   సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నెల 20 వరకూ సాగే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమెదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల నిర్వహణను ప్రజాస్వామ్యంపై దాడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలూ దీనిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.  కాగా   మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ  లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరపాలన్న వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనపై గతంలో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.  
ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెచ్చరిల్లడానికి కారణంగా రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల పాలనే కారణమని ఆరోపించారు.   తూర్పుగోదావరి జిల్లా  దుద్దుకూరులో  నిర్వహించిన  ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో ఆమె జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.  జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు.  జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం మోడీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు.  రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని దారుణంగా ఓడంచడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
  రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల  మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది. *ఆధిపత్య పోరు టిడిపి ఇన్చార్జి ​చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు  శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. *​అసలు చిచ్చు ఎక్కడ? ​రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు. *​ప్రోటోకాల్ రచ్చ:  ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి  కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది. *​వైఎస్సార్‌సీపీకి 'అయాచిత' బలం! ​ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే  క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. *​అధిష్టానం మౌనం..   ​ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది
ALSO ON TELUGUONE N E W S
సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళడంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే టైటిల్ విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కంటెంట్ కి తగ్గ టైటిల్ ని ఎంచుకుంటూనే, అందరి దృష్టిని ఆకర్షించేలా చూసుకుంటారు. తాజాగా ఓ టైటిల్ అలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారింది. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న ఈటీవీ విన్ నుంచి మరో సినిమా రాబోతుంది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకులు.  ఈ సినిమాకి 'ఇంకా ఏం అనుకోలేదు'(Inka Em Anukoledhu) అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేయడం విశేషం. తాజాగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఆ వీడియో కూడా మీమ్ కంటెంట్ తో డిఫరెంట్ గా ఉంది.  'ఇంకా ఏం అనుకోలేదు' ఈ ఏడాది సెప్టెంబర్ 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, రెహాన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. Also Read: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'పెన్నుమ్ పోరాట్టమ్' https://x.com/etvwin/status/2031245354554040626
    -ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది ఎవరు! -నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎం జరుగుతుంది -ఈ నెల 19 న సునామి ఖాయమా! హరీష్ శంకర్(Harish Shankar).. గబ్బర్ సింగ్ తో తాను లైమ్ లైట్ లోకి రావడమే కాదు, 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ని వరుస పరాజయాల నుంచి విముక్తుడి చేసి, పవన్ కట్ అవుట్ కి సరికొత్త కంటెంట్, రికార్డులని పరిచయం చేసాడు. దీంతో ఆ ఇద్దరి కాంబోలో ఈ నెల 19 న ల్యాండ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాల స్థాయి రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ అంతకు అంత పెరుగుతుంది. నిన్నటి వరకు వచ్చిన కాలర్ ఎగరెయ్యరా సాంగ్ ప్రోమోనే ఉదాహరణ. దీంతో మూవీకి సంబంధించిన  మరిన్ని అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి, నెటిజెన్స్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పిన న్యూస్ వైరల్ గా మారింది. మరి సదరు పూర్తి న్యూస్ ఏంటో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh)రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని ట్విట్టర్ లో ఈసారి బాక్సాఫీస్ వద్ద BoB రికార్డులు కూడా లేచిపోవాలంటూ కామెంట్ చేశాడు. సదరు ట్వీట్‌ కి “తథాస్తు” అంటు హరీష్ శంకర్ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ రిప్లై పైనే మహేష్ బాబు ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే BoB అనే వర్డ్ ని Boss of Blockbusters గా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో మహేష్ బాబు రికార్డులని కించపరిచే ప్రయత్నం అంటు కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.హరీష్ శంకర్‌ కి   పొగరెక్కిందని క్షమాపణ చెప్పకపోతే ‘ ఉస్తాద్ భగత్‌సింగ్ ’ ని బాయ్‌కాట్ చేస్తామంటూ పోస్టులు కూడా చేస్తున్నారు. అలాంటి ఈ టైంలో హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ రిలీజ్ చేసాడు. ససారు నోట్ లో 'మహేష్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది  ‘నిన్న నాకు చాలా బిజీగా గడిచింది. మూవీ విజయవంతమవ్వాలని ఆశీర్వాదాల కోసం పెద్దమ్మ గుడిని సందర్శించాను. సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్ జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకున్నాను. నిన్న రిలీజైన ప్రోమోకి  సంబంధించిన ఫైనల్ చెక్స్ పూర్తి చేశాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ దగ్గరకి వెళ్లాను. మరో పక్క ప్రోమోని మెచ్చుకుని శుభాకాంక్షలు పంపుతున్న జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులకి కూడా నేను సమాధానాలు ఇస్తూ ఉన్నాను. ఆ హడావుడిలో ఒక ట్వీట్‌ ని పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. ఆ వెంటనే అభిమాని చేసిన  ట్వీట్‌ని పూర్తిగా చదవమన్నారు. వెంటనే నా పొరపాటు గుర్తించి  డిలీట్ చేశాను. also read: Irumudi: రవితేజ ఇరుముడిలో కొత్త హీరోయిన్.. గోల్డెన్ లెగ్ తన సొంతం  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)గారిపై నాకు అపారమైన గౌరవం ఉంది. 'వారణాసి'(Varanasi)సినిమాతో ఆయన పేరుతో ఇంకా ఎన్నో రికార్డులు నమోదవుతాయని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. ఆయన్ని గానీ, అభిమానులని గానీ బాధపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ గురించి నేను చేసిన ట్వీట్లు చూస్తే ఆయనపై నాకు ఉన్న ప్రేమ, గౌరవం అర్థమవుతుంది. నా తప్పు వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అన్ని హీరోల అభిమానులు, కుటుంబాల మద్దతు అవసరం. ఉస్తాద్ రిలీజ్ కి కేవలం 10 రోజులు మాత్రమే ఉండగా అలాంటి పోస్టులు చేసేంత అవగాహన లేకుండా అయితే నేను లేను. మా సినిమాకి   మీ మద్దతు కొనసాగించాలని కోరుకుంటున్నానని సదరు నోట్ లో  తెలియచేసాడు.      
ఓటీటీలోకి మలయాళ సెటైరికల్ ఫిల్మ్  డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన యాక్టర్  మలయాళ సినిమాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడ హిట్టయిన సినిమాలను వివిధ భాషలలో డబ్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లోనూ మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. రీసెంట్ సూపర్ హిట్ ఫిల్మ్ 'పెన్నుమ్ పోరాట్టమ్'(Pennum Porattum) ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. మలయాళ నటుడు రాజేష్ మాధవన్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'పెన్నుమ్ పోరాట్టమ్'. ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సెటైరికల్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. నెల రోజులకే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. 'పెన్నుమ్ పోరాట్టమ్' ఓటీటీ రైట్స్ ని దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని రివీల్ చేసింది. మార్చి 13 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://x.com/Netflix_INSouth/status/2031256238915207268 కేరళలోని ఒక గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామంలోని కట్టుబాట్లు ఏంటి? వాటిని చారులత అనే యువతి, ఆమె పెంపుడు కుక్క 'సుట్టు' బ్రేక్ చేయడంతో ఏం జరిగింది? అనేది చూపిస్తూ.. మనుషుల కంటే జంతువులే నయమనే కోణంలో సెటైరికల్‌గా ఉంటుందీ సినిమా. రాజేష్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో.. కుక్క పాత్రకు హీరో టొవినో థామస్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. Also Read: మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న ప్రభాస్!
లోకంలో అన్నిటికంటే బలమైనది ఏది అంటే ‘డబ్బు’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చేరి పలకరించే బంధువులే, అదే డబ్బు లేనప్పుడు ముఖం చాటేస్తారు. మన కళ్ళ ముందే ఉన్న మనవాళ్ళు పరాయి వాళ్ళలా మారిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఒకప్పుడు రాజ పరంపర అనిపించుకున్న కుటుంబం, పరిస్థితులు తారుమారైతే ఎంతటి దయనీయ స్థితికి చేరుతుందో, ఆ సమయంలో సొంత రక్తమే ఎంతటి ద్రోహానికి ఒడిగడుతుందో తెలియజెప్పే ఈ వీడియో రాజీవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రియురాలు పిలిచింది’ చిత్రంలోనిది. మమ్ముట్టి, అజిత్, టబు, ఐశ్వర్యారాయ్, శ్రీవిద్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నం దించారు.  ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రి వీలునామాలో ఆస్తినంతా కొడుకు పేరున రాశాడని తెలియగానే, అప్పటి వరకు ప్రేమానురాగాలతో ఉన్న బంధాలు ఒక్కసారిగా తెగిపోయాయి. తన సోదరి పద్మకు, ఆమె పిల్లలకు కనీసం ఉండటానికి నీడ కూడా లేకుండా చేయడమే కాక, ఆమెను తన ఇంట్లోనే ఒక పనిమనిషిలా చూడటం ఆ కొడుకు కసాయి బుద్ధిని తెలియజేస్తుంది.  ‘అమ్మా.. మనం వాళ్ళని ఎదిరించి పోరాడాలి లేదా ఊరు వదిలిపోవాలి’ అన్న కూతురి మాటలు ఆనాటి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడతాయి. సొంత మేనమామ దగ్గరే తప్పుడు లెక్కలు రాయించి ఆస్తి కాజేశారన్న నిందలు వస్తాయి. ఆ అవమానాన్ని భరించలేక కట్టుబట్టలతో ఆ ఇల్లు వదలాల్సి వచ్చింది. గౌరవంగా బతికిన ఆ కుటుంబం హైదరాబాద్ వంటి నగరానికి వచ్చి, వెయ్యి రూపాయల అద్దె ఇంట్లో నివసిస్తూ ప్రతి రూపాయి కోసం పడే కష్టాలు ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ‘రాజ పరంపర, మంచి కుటుంబం అని అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు అద్దెకు ఇచ్చాను’ అని ఇంటి యజమాని అవమానించినప్ప్పుడు, సాయంత్రంలోగా డబ్బు కట్టకపోతే సామాన్లు బయట పారేస్తానని బెదిరించినప్ప్పుడు ఆ తల్లి పడే వేదన మాటల్లో చెప్పలేం. ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం ఉన్నా, కుటుంబం కోసం ఆ తల్లి టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగానికి కూడా సిద్ధపడటం, హోటల్‌లో అరటి పువ్వు వలిచే పని చేయడం చూస్తుంటే... ఆకలి ముందు అర్హతలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. ‘మా కష్టం మాతోనే పోవాలి, మేము హోటల్‌లో పనిచేస్తున్న విషయం మా పిల్లలకు తెలియనివ్వకండి’ అని ఆ తల్లి పడే ఆరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తుంది. డబ్బు లేనప్పుడు అయినవాళ్ళు కూడా ఎంత హీనంగా చూస్తారో, లోకం మనల్ని ఎంత  తక్కువ చేసి మాట్లాడుతుందో ఈ గాథ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. కానీ ఎంతటి కష్ట కాలంలోనైనా అధైర్యపడకుండా, ఆత్మగౌరవంతో బ్రతకడమే నిజమైన గెలుపు. బంధాల కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఈ లోకంలో, నిజమైన విలువలు ఎక్కడ ఉన్నాయో మనం గుర్తించాలని తెలియజెప్పే సన్నివేశాలతో కూడిన ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
-ఇరుముడిపై ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్  -హిట్ కాదు సూపర్ హిట్ ఖాయమా!  -గోల్డెన్ లెగ్ హీరోయిన్ కూడా ఉందా! ఇక ఏ మాత్రం ఉపేక్షించేది లేదు.. హిట్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది.. అర్జెంటుగా సూపర్ హిట్ అందుకొని పబ్లిక్ లో హిట్  కుళ్ళికుళ్ళి ఏడ్చేలా చేస్తానని మాస్ మహారాజా 'రవితేజ'(Raviteja) చాలా గట్టిగానే ఫిక్స్ అయినట్టుగా ఉన్నాడు. ఇందుకు నిదర్శనమే అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి'(Irumudi)నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు. అసలు రవితేజ ఏ ముహూర్తాన ఇరుముడికి ఓకే చెప్పాడో గాని ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్ ని తెచ్చుకోవడంతో పాటు ఎప్పడెప్పడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ప్రేక్షకుల మెంటల్ కండిషన్ కూడా సేమ్. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాకి అదనపు హంగుల్ని తెచ్చిపెడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. సుదీర్ఘ కాలం నుంచి భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన హవాని కొనసాగిస్తు వస్తున్న పాన్ ఇండియన్ భామ తమన్నా. అలాంటి తమన్నా ఇరుముడిలో మరో హీరోయిన్ గా ఎంపిక అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే ఇరుముడికి ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ స్థాయి పెరిగినట్టే అని చెప్పవచ్చు. ఎందుకంటే తమన్నా గత కొంత కాలంగా గోల్డెన్ లెగ్ హోదాలో సినీ జర్నీని కొనసాగిస్తు వస్తుంది.స్పెషల్ సాంగ్స్ చేసినా చాలు ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అలాంటిది ఇప్పుడు రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయమైతే ఇరుముడి పంట పండినట్టే. ఈ ఇద్దరు గతంలో 'బెంగాల్ టైగర్' మూవీలో జంటగా నటించారు. also read: Mgr: తమిళుల ఆరాధ్య దైవం ఎంజిఆర్ పై నోరుజారిన రాజేంద్రప్రసాద్.. ఎందుకు మాట్లాడాడు ఇరుముడిలో ఇప్పటికే తమిళ భామ 'ప్రియా భవాని శంకర్'(Priya Bhavani Shankar)ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే మేకర్స్ ఆమె లుక్ ని రివీల్ చేయగా హోమ్లీ క్యారక్టర్ లో ఉండటంతో పాటు రవితేజ వైఫ్ గా చేస్తున్న విషయం అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా ఉండటం ఫిక్స్ అయితే, తమన్నా రోల్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు కాగా పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.     
ప్రభాస్ ని కలిసి 'ఎకో' దర్శకుడు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ సినిమా! 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్(Prabhas).. తనతో సినిమాలు చేయడానికి ఎందరో స్టార్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నా.. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే సుజీత్, రాధాకృష్ణ కుమార్ వంటి పలువురు దర్శకులకు అవకాశమిచ్చాడు. ఇప్పుడు ఆ లిస్టులో మరో డైరెక్టర్ చేరేలా ఉన్నాడు. 'కక్ష: అమ్మినిప్పీళ్ల'తో దర్శకుడిగా పరిచయమైన మలయాళ డైరెక్టర్ దింజిత్ అయ్యతన్.. 'కిష్కింధ కాండం', 'ఎకో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ దర్శకుడు ఇటీవల ప్రభాస్ ను కలవడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రభాస్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన దింజిత్.. "సూపర్ స్టార్ ప్రభాస్ ని కలవడం సంతోషంగా ఉంది. గొప్ప సంభాషణలు, నవ్వులు, మంచి విందుతో నిండిన అద్భుతమైన సాయంత్రం ఇది. ప్రభాస్ సార్ కి, హోంబలే ఫిల్మ్స్ కు ధన్యవాదాలు." అని రాసుకొచ్చాడు. గతంలో హోంబలే ఫిల్మ్స్, ప్రభాస్ తో మూడు సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు సినిమాలకు దర్శకులు ఎవరనేది అధికారికంగా చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ని దింజిత్ కలవడం, హోంబలే ఫిల్మ్స్ కి థాంక్స్ చెప్పడం చూస్తుంటే.. వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని అనిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజి' షూటింగ్ లో బిజీలో ఉన్నాడు. 1940 నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు హను రాఘవపూడి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 'ఫౌజి'తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'కల్కి-2' సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. వీటి తర్వాత దింజిత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ రిపోర్ట్ https://www.instagram.com/p/DVsKJwVj-Vj/
  -ఎంజిఆర్ అంటేనే ఒక శక్తీ  -అలాంటి వ్యక్తిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలేంటి! -ఆ మాటలు సబబేనా!  ఎంజిఆర్(MGR).. ఎక్స్ పైరీ డేట్ లేని ఈ మూడు అక్షరాల గురించి విన్నా, చూసినా, చదివినా తమిళనాడు వ్యాప్తంగా ఏర్పడే ప్రకంపనలు మాములు స్థాయిలో ఉండవు. అంతలా సిల్వర్ స్క్రీన్ పై, రాజకీయ రంగంపై ఎంజీఆర్ ఒక పెద్ద చరిత్రనే సృష్టించాడు. ఆయన తరహా డ్రెస్ స్టైల్, మాట, నడక తీరుని అనునయిస్తూ ఎంటైర్ తమిళనాడు వీధుల్లో చాలా మంది  కనిపిస్తుంటారు. ప్రస్తుత రాజకీయాలు సైతం ఎంజీఆర్ అనే పేరు ప్రస్తావించకుండా నడవవు. టోటల్ ఇండియాలోనే సినీ రంగం నుంచి సిఎం అయిన మొదటి వ్యక్తి.  అంతటి సినీ, రాజకీయ సమ్మోహన శక్తీ ఎంజీఆర్ సొంతం. అలాంటి ఎంజిఆర్ గురించి మన నట కిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్(Rajendraprasad)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా నిలిచాయి. ఆ మాటలేంటో, ఎక్కడ చేసాడో చూద్దాం. నిన్న భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ కల్చరల్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్రప్రసాద్‌కి 2025 వ సంవత్సరానికి సంబంధించి 'కళాప్రపూర్ణ కత్తి కాంతారావు' జాతీయ పురస్కారంని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు 'తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్ గారు. అలాంటి వ్యక్తి కాంతారావు గారి జానపద చిత్రాలని చూసి వామ్మో వీడు ఎవడు ఇండియా మొత్తాన్ని కొట్టుకెళ్ళేవాడిలా ఉన్నాడని భయంతో ఉచ్చపోసుకున్నాడనే వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి. also read: Gopinchand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీకి హీరోయిన్ ఫిక్స్. కరెక్ట్ జోడి నేనా! కాంతారావు(Kantharao)గారి గురించి చెప్పుకుంటే తెలుగు సినిమా ఒడిలో దాగి ఉన్న మరో ఆణిముత్యం అనుకోవచ్చు. ఎన్నో జానపద చిత్రాల్లో నటించి ఆ జోనర్ కి స్టార్ మెటీరియల్ సొగసుల్ని అద్దాడు. కాంతారావు కత్తి పట్టుకునే స్టైల్ కూడా అభిమానుల్ని, ప్రేక్షకులని ఉర్రుతలుగించేది. ఎంజీఆర్ కూడా అనేక జానపద చిత్రాల్లో చేసి తన రేంజ్ ని పెంచుకున్నాడు. పూర్తి పేరు ఎం జి. రామచంద్రన్.    
Manchu Manoj has once again caught the attention of fans with a powerful social media post that shows his renewed discipline and dedication towards his craft. Known for his intense screen presence and commitment to performance, Manoj shared an update from his ongoing physical transformation, revealing that he has spent the last three weeks pushing himself beyond comfort in preparation for his upcoming projects. The post, accompanied by striking workout images, quickly gained traction among fans who praised the actor’s determination. In the post, Manoj spoke candidly about his decision to cut out excuses and put in the work. “Three weeks ago, I made a decision. No more negotiating with comfort. No more excuses. Just the work,” he wrote, talking about how demanding action filmmaking really is. He went on to say that performing stunts on camera leaves no room for shortcuts. “In action cinema, nobody can fake it for you. Every punch, every fall, every hit. Your body either shows up or it doesn’t. The camera doesn’t lie.” He said he has stopped training for looks and is now focused on building endurance and resilience, with the goal of becoming “unbreakable.” Calling the update “Week 3,” Manoj said the journey has only begun but that he already feels like a different man from who he was just 21 days ago. Manoj’s recent work on screen has also kept him in the spotlight. He made a strong comeback with Mirai, where he played the powerful antagonist Mahabir Lama, also known as “Black Sword.” The film did well at the box office and Manoj’s intense performance was widely appreciated by audiences and critics. It was yet another reminder of the physical intensity and emotional conviction he brings to his roles. Looking ahead, Manoj is gearing up for one of the most ambitious films of his career, David Reddy, a large-scale pan-India period action drama directed by Hanuma Reddy Yakkanti and produced by Nallagangula Venkat Reddy and Bharat Motukuri. Set during the British colonial period between 1897 and 1920, the film follows a fierce warrior who rises against oppression. The cast includes international actress Maria Ryaboshapka, and the project is being mounted on a grand scale for audiences across India. The recently released David Reddy glimpse has already crossed 10 million digital views, building strong buzz and raising anticipation around Manoj’s powerful new avatar. Apart from David Reddy, Manoj has several other projects in the pipeline, signalling a busy and exciting phase in his career.   https://www.instagram.com/p/DVtRzdhEix7/
  -శరవేగంగా షూటింగ్ జరుగుతున్న గోపించంద్ కొత్త మూవీ  -సంకల్పరెడ్డి ఈ సారి హిట్ ఇస్తాడా! -హీరోయిన్ ఫిక్స్  కట్ అవుట్ కి తగ్గ కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ వద్ద గోపిచంద్(Gopichand)హవా మాములుగా ఉండదు. ఇప్పటి వరకు వచ్చిన హిట్ చిత్రాలకి లభించిన ప్రేక్షక ఆదరణే అందుకు ఉదాహరణ. కొంత కాలంగా గోపి చంద్ ఖాతాలో హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ప్రస్తుతం  విభిన్న చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy)తో మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యింది. సదరు రోల్ కి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాని రఫ్ఫాడిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో మనం కూడా చూసేద్దాం. ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ(Ritu Varma). ఈ మేరకు నిన్న సాయంత్రం మేకర్స్ అధికారకంగా వెల్లడి చేస్తు రీతూవర్మ లుక్ తో పాటు ఆమె పేరు, క్యారక్టర్ కి సంబంధించిన విధి విధానాలు కూడా వెల్లడి చేసారు. ఏడవ శతాబ్దానికి చెందిన సత్యవతి అనే  శక్తివంతమైన గిరిజన మహిళగా చేతిలో విల్లంబు ధరించి బాణాన్ని ఎక్కుపెడుతుంది. దీంతో ఆమె క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. aslo read: Couple Friendly: ఓటిటిలోకి కపుల్ ఫ్రెండ్లీ.. డేట్ ఎప్పుడో తెలిస్తే షాక్ అవుతారు హిస్టారికల్ యాక్షన్ అండ్ పీరియాడిక్ డ్రామా ఏడవ శతాబ్దాన్ని మన కళ్ళ ముందు ఉంచబోతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణని జరుపుకుంటుంది. చరిత్రలో దాగి ఉన్న ఒక యదార్ధ సంఘటనని బేస్ చేసుకున్నారన్నది సమాచారం. వీరుడుగా గోపీచంద్ మెస్మరైజ్ చేయబోతున్నాడు. సదరు క్యారెక్టర్స్ కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు అభిమానుల్లో, మూవీ లవర్స్ లో  ఈ సారి గోపీచంద్ ప్రభంజనం సృష్టించడం గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి(Srinivasa Chitturi)నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. టైటిల్ ప్రకటనతో పాటు రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.         
The prestigious “Bapu Bomma – Vishwa Mahila” Awards ceremony was organized in a grand manner by noted actress K. Divyavani Choudary.  The first award recipient was Mega Mother Mrs. Konidela Anjanidevi. Divyavani Choudary, a prominent actress who earned a permanent place in the hearts of Telugu audiences as a “Bapu Bomma”, and who has also been making her mark in the social and political spheres, instituted these awards on the occasion of International Women’s Day 2026 under the title “Bapu Bomma – Vishwa Mahila.” Among the distinguished women who received the awards were Mrs. Konidela Anjanidevi, wife of Rebel Star Krishnam Raju – Mrs. Shyamala Devi, Anchor Swapna, Janeta Kancherla (USA), Dr. Vennela Gaddar, Dr. Padmaja Chandrakant, Sameera Bharadwaj, Rekharani, and D. Jyothi Reddy (USA), among others. The grand event was held at Daspalla Hotel, Hyderabad, with the support of Telangana Minister Jupally Krishna Rao. Several prominent personalities attended the ceremony as guests, including Telangana Congress Party President Mahesh Goud, Telugu One Chairman K. Ravishankar, noted actor and writer Harshavardhan, Deputy Collector E. Venkatachari, and Assistant Commissioner of Police M. Kiran kumar, among others. Speakers at the event appreciated Divyavani for launching the prestigious “Bapu Bomma – Vishwa Mahila Awards” and for beginning this initiative by honouring Mega Matriarch Mrs. Konidela Anjanidevi. Divyavani, who has been actively contributing to the film, political, and social sectors, stated that the purpose of this initiative is to honour women who excel in various fields and inspire other women in society. She expressed her heartfelt gratitude to everyone who contributed to the grand success of the event. Divyavani also conveyed special thanks to the Government of Telangana under Chief Minister Revanth Reddy for its efforts towards women’s empowerment in the state. On this occasion, Divyavani announced that the “Bapu Bomma – Vishwa Mahila Awards” will soon be expanded beyond the two Telugu states and conducted across India and internationally!!  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మంచి నీరు అంటే నేటికాలంలో అందరికీ మినరల్ వాటర్ ఏ తెలుసు. ఇక చాలామందికి తాగే నీరు అంటే RO వాటరే. ఇప్పట్లో ధనికుల ఇళ్ళ నుండి మధ్య తరగతి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇంట్లో రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ ఉపయోగించే ఫ్యూరిఫైయర్లు వాడుతున్నారు.  వీటినే సింపుల్ గా RO ఫ్యూరిఫైయర్లు అని అంటున్నారు. నీటిలో ఉండే  మలినాలను, భారీ లోహాలను,  ఇతర హానికరమైన కలుషితాలను తొలగించడంలో ఈ ప్యూరిఫైయర్లు బాగా సహాయపడతాయని చెబుతారు.  ఈ కారణంగానే ప్రతి ఇంట్లో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడటం సహజం అయిపోయింది. ప్రతిరోజూ ఆర్.ఓ వాటర్ తాగడం సహజం.  అయితే ప్రతిరోజూ ఈ ఆర్.ఓ వాటర్ ను తాగడం మంచిదేనా?  ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు?  తెలుసుకుంటే.. ఆర్.ఓ శుద్దీకరణ ఎలా పనిచేస్తుంది? RO టెక్నాలజీలో, నీరు పొర గుండా వెళుతుంది, బ్యాక్టీరియా, వైరస్‌లు, కరిగిన లవణాలు, భారీ లోహాలు,  ఇతర హానికరమైన మూలకాలను తొలగిస్తుంది. అందుకే ఆహార కాలుష్యం లేదా మలినాలకు గురయ్యే ప్రాంతాలలో నీటిని శుద్ధి చేయడంలో RO వ్యవస్థ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ప్రక్రియ నీటిలోని కాల్షియం,  మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలామంది RO నీరు అధికంగా శుద్ధి చేయబడిందని, ఈ నీటిలో  అవసరమైన పోషకాలు ఉండవని చెబుతారు.   ఖనిజ లోపాలు.. ఆహారం.. శరీరానికి అవసరమైన ఖనిజాలకు  ప్రధాన వనరు నీరు కాదని,  మనం రోజువారీ తీసుకునే  ఆహారమే ఖనిజాలు భర్తీ చేస్తుందని  పోషకాహార నిపుణులు అంటున్నారు. త్రాగునీటి నుండి శరీరం పొందే ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలా పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి, అయితే ప్రతిరోజూ సమతుల్య,  పోషకమైన ఆహారం తీసుకుంటే, RO నీటిలో కొద్దిగా ఖనిజాలు లోపం ఉన్నా అదేమీ సమస్య కాదని అంటున్నారు. . పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీర పోషక అవసరాలను సులభంగా తీర్చగలుగుతాయని అంటున్నారు. ఆర్.ఓ నీరు.. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండ వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, RO నీరు సాధారణంగా మూత్రపిండాల ఆరోగ్యంపై ఎటువంటి పెద్ద ప్రతికూల ప్రభావాలను చూపదట.  నీటి నుండి మలినాలను తొలగించడానికి, త్రాగడానికి సురక్షితంగా చేయడానికి RO వ్యవస్థ రూపొందించబడిందని వైద్యులు అంటున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఖనిజాలు కోల్పోవచ్చు, మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండటానికి నీరు తగినంతగా తాగడం చాలా ముఖ్యమట. సమతుల్య ఆహారం తీసుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. శుభ్రమైన,  సురక్షితమైన నీటిని తాగడం మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆర్.ఓ నీరు.. ఎలక్ట్రోలైట్లు.. కొంతమంది RO నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఇది చాలా అరుదని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత మూత్రపిండాల హార్మోన్లు,  ఆహారం నుండి పొందిన పోషకాల ద్వారా నియంత్రించబడుతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం,  మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ప్రధానంగా ఆహారం నుండి లభిస్తాయి. కాబట్టి సాధారణ సమయాలలో ఆర్.ఓ నీరు తాగడం వల్ల ఎలాంటి ఎలక్ట్రోలైట్ సమతుల్యత ప్రబావితం కాదు.                                  *రూపశ్రీ.
మన జీవితంలో వినికిడి అనేది కేవలం ఒక ఇంద్రియ జ్ఞానం మాత్రమే కాదు, అది మన ఆత్మీయులతో మనల్ని కలిపే ఒక వారధి. వయసు మళ్లుతున్న కొద్దీ కంటి చూపు తగ్గడం సహజమని ఎలా భావిస్తామో, వినికిడి తగ్గడాన్ని కూడా అలాగే గమనించాలి. ముఖ్యంగా 50 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారికి మాటలు వినిపిస్తున్నా, అవి స్పష్టంగా అర్థం కాకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది కేవలం శారీరక సమస్యే కాదు, మనుషులతో కలవలేకపోవడం వల్ల వచ్చే మానసిక వేదన కూడా. మీ వినికిడి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి ENT Specialist Dr. PLVN Murthy గారు చెప్పిన విషయాలను ఈ  Video Link క్లిక్ చేసి  తెలుసుకోండి. మనం ఎందుకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలి? (Why Should We?) వయసు పెరిగే కొద్దీ వచ్చే వినికిడి లోపాన్ని 'ప్రెస్ బై అక్యూసిస్' (Presbycusis) అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలు ఇవే: సామాజిక దూరం (Social Withdrawal): ఎదుటివారు మాట్లాడే మాటలు అర్థం కాకపోవడం వల్ల, ఫ్యామిలీ ఫంక్షన్లలో లేదా స్నేహితులతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. మానసిక ఒత్తిడి: సరిగ్గా వినిపించకపోవడం వల్ల ఎదుటివారు ఎగతాళి చేస్తారేమో అన్న భయంతో డిప్రెషన్ మరియు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి తగ్గడం: వినికిడి లోపం వల్ల మెదడు యొక్క పనితీరు (Cognitive function) మందగించే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్య పర్యవేక్షణ: ముఖ్యంగా డయాబెటిస్ (చక్కెర వ్యాధి), బీపీ (రక్తపోటు) ఉన్నవారిలో వినికిడి నరాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఏమి చేయకూడదు? (What Not To Do) గూగుల్ వైద్యం వద్దు: వినికిడి సమస్య రాగానే గూగుల్‌లో చూసి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా మందులు వాడటం చేయకండి. ఇది చాలా సున్నితమైన అవయవం కాబట్టి నిపుణులైన ఈఎంటి (ENT) డాక్టర్ని మాత్రమే సంప్రదించాలి. లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి: "వయసు పెరిగింది కదా, వినిపించకపోవడం సహజం" అని సరిపెట్టుకోవద్దు. అధిక శబ్దాలకు దూరంగా ఉండండి: ఫ్యాక్టరీల్లో లేదా అధిక శబ్దాలు వచ్చే ప్రదేశాల్లో పని చేసే వారు తగిన రక్షణ లేకుండా ఉండకూడదు. పరీక్షలు మరియు చికిత్స - ఎలా? (How To) మీ వినికిడి స్థాయిని తెలుసుకోవడానికి డాక్టర్లు సాధారణంగా ఈ క్రింది పరీక్షలు చేస్తారు: ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ (Pure Tone Audiometry): ఇది వినికిడి లోపాన్ని గుర్తించడానికి అత్యంత కీలకమైన (Gold Standard) పరీక్ష. దీని ద్వారా ఏ ఫ్రీక్వెన్సీలో ఎంత లోపం ఉందో తెలుస్తుంది. టెంపనోమెట్రీ (Tympanometry): మధ్య చెవిలో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నీరు చేరిందా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ (OAE): చెవిలోని లోపలి భాగంలో ఉండే 'ఔటర్ హెయిర్ సెల్స్' పనితీరును ఇది గుర్తిస్తుంది. పరీక్షల కాలపరిమితి: 45 నుండి 50 ఏళ్ల మధ్యలో ఒకసారి బేస్‌లైన్ టెస్ట్ చేయించుకోవాలి. సాధారణంగా ప్రతి 2 నుండి 3 ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. డయాబెటిస్, బీపీ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రతి ఏటా వినికిడి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నాకు మాటలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు, ఎందుకు?  సమాధానం: దీనిని 'వర్డ్ డిస్క్రిమినేషన్' (Word Discrimination) సమస్య అంటారు. వయసు రీత్యా హై ఫ్రీక్వెన్సీ వినికిడి లోపం ఉన్నప్పుడు శబ్దం వినిపిస్తుంది కానీ మాటలోని స్పష్టత లోపిస్తుంది. ప్రశ్న: ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి కూడా వినికిడి సమస్యలు వస్తాయా?  సమాధానం: అవును, మంచి లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ వయసుతో పాటు వినికిడి నరాలు బలహీనపడటం వల్ల సమస్యలు రావచ్చు. అలాగే డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఏవైనా మందుల వల్ల వినికిడి తగ్గుతుందా?  సమాధానం: అవును, కొన్ని రకాల క్యాన్సర్ డ్రగ్స్ లేదా మరికొన్ని ఆటోటాక్సిక్ డ్రగ్స్ వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడవచ్చు. వినికిడి లోపం అనేది కేవలం చెవికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మీ జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేసే అంశం. సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మీ సామాజిక జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందులో వినికిడి ఆరోగ్యం అత్యంత ముఖ్యం! మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
• కిడ్నీలో రాళ్ళు ఉన్న • యూరిన్ ఇన్ఫెక్షన్ / యూరిన్ ప్రాబ్లెమ్స్ • కిడ్నీ డిసీజ్ & వారి కుటుంబ సభ్యులు • సహజమైన ఆయుర్వేదం / యూనానీ వైద్యం  • సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ట్రీట్‌మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ రోజుల్లో మనల్ని వేధిస్తున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారికి ఒక తీపి కబురు. కేవలం ఒక పండుతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు (Kidney Stones) & యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ వీడియోలో ప్రముఖ యూనానీ వైద్య నిపుణులు Dr. SGV Satya గారు కిడ్నీ స్టోన్స్ కి సహజమైన & శాశ్వతమైన పరిష్కారం గురించి వివరంగా చెప్తున్నారు. సర్జరీ లేకుండా కిడ్నీ రాళ్ళు కరిగించే అద్భుతమైన పండు గురించి, యూరిన్ ప్రాబ్లెమ్స్ కి యూనానీ ట్రీట్‌మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. పైనాపిల్: మీ కిడ్నీలకు మరియు సర్వ రోగాలకు ఒక సంజీవిని పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి యునాని వైద్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. శరీరంలోని మలినాలను తొలగించి, మిమ్మల్ని తాజాగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం పైనాపిల్ ఎందుకు తీసుకోవాలి? (Why Should We?) 1. కిడ్నీ మరియు మూత్రపిండాల రక్షణ: పైనాపిల్‌లో 'డయూరిటిక్ ఎఫెక్ట్' ఉంటుంది. ఇది యూరిన్ ఫ్రీగా వచ్చేలా చేసి, కిడ్నీలో రాళ్లు (Kidney Stones) మరియు ప్రోస్టేట్ సమస్యలను నివారిస్తుంది. 2. వాపుల నివారణ (Anti-inflammatory): యునాని వైద్యంలో దీనిని 'ఇల్తహాబ్' (వాపు) తగ్గించడానికి వాడుతుంటారు. కీళ్ల నొప్పులు (Arthritis), సైనసైటిస్, గొంతు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఇది మేలైన పరిష్కారం. 3. శరీర ప్రక్షాళన (Detoxification): శరీరంలోని హానికరమైన వ్యర్థాలను (Morbid material) బయటకు పంపడంలో పైనాపిల్‌ను మించినది లేదు. 4. మెదడు మరియు గుండె ఆరోగ్యం: నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి, మెమరీ లాస్ ఉన్న వారికి ఇది మేధోశక్తిని పెంచుతుంది. అలాగే రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (Blood clotting) చూస్తూ గుండెను కాపాడుతుంది. 5. దంత ఆరోగ్యం: పళ్లపై పేరుకుపోయిన గార (Plaque) తొలగించడానికి మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేరుగా పైనాపిల్ ముక్కలు తినడం ఎంతో మంచిది. ఏం చేయకూడదు? (What Not to Do?) • అపెండిక్స్ సర్జరీ అయిన వారు: అపెండిక్స్ తీసేసిన వారు నేరుగా పండు తినకూడదు, కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి. • అతిగా తీసుకోవద్దు: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా, మరీ పుల్లగా ఉన్నవి తీసుకోకండి. దీనివల్ల కొన్నిసార్లు జలుబు లేదా ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. • డయాబెటిస్ ఉన్నవారు: షుగర్ ఉన్నవారు పండును లేదా జ్యూస్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎలా ఉపయోగించాలి? (How to Use?) • ప్రయాణాల్లో వాంతులు (Motion Sickness): బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వాంతులు అయ్యే వారు, చిన్న బాక్స్‌లో పైనాపిల్ ముక్కలు పెట్టుకుని, టూత్‌పిక్‌తో అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. • పిల్లల్లో కడుపులో పురుగులు: పిల్లలకు తరచుగా పైనాపిల్ తినిపిస్తే, పేగుల్లో ఉండే పురుగులు (Intestinal worms) నశిస్తాయి. • డయాబెటిస్ నియంత్రణకు: పైనాపిల్ ఆకులు మరియు వేర్లను నీళ్లలో మరిగించి ఆ కషాయం తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. • శ్వాసకోస సమస్యలకు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు పైనాపిల్ జ్యూస్‌ను డైల్యూట్ చేసి తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పైనాపిల్ తీసుకోవచ్చా?  జవాబు: తప్పకుండా! బాడీలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేయడంలో, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో పైనాపిల్ జ్యూస్ పాత్ర సాటిలేనిది. ప్రశ్న: పైనాపిల్ తింటే జలుబు చేస్తుందా?  జవాబు: ఇది చాలా మందిలో ఉన్న అపోహ. పైనాపిల్ వల్ల జలుబు రాదు, కానీ అతిగా పుల్లని పండు తింటే సమస్య రావచ్చు. సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది లంగ్స్ మరియు గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న: శరీర నొప్పులకు పైనాపిల్ పనిచేస్తుందా? జవాబు: అవును, ఇందులో అనాల్జిసిక్ (Analgesic) గుణాలు ఉండటం వల్ల వెన్నునొప్పి, కడుపునొప్పి వంటి బాడీ పెయిన్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును మీ డైట్‌లో భాగం చేసుకోండి. "ఏతదాలే అక్లాత్" అంటే శరీరంలోని నాలుగు ధాతువులను సమతుల్యంగా ఉంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో పైనాపిల్ ఎంతో కీలకం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ మా Youtube"TeluguOne Health"ఛానెల్‌ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి! Disclaimer: ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించండి.