Home

»

Latest News

అనుపమ జీవితంలో అసలేం జరిగింది? ఆమె తాజా పోస్ట్‌తో మళ్లీ చర్చ!

Oct 31, 2026 6:27PM

కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా ఇతరుల గురించి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె పేర్కొనడం ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు.. ఒకప్పుడు తప్పుగా భావించిన విషయాలే ఇప్పుడు ఇతరులు చేస్తుంటే సాధారణంగా మారిపోతున్నాయంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

తన పోస్టులో అనుపమ మాట్లాడుతూ.. ఒకప్పుడు కొన్ని పనులు చేసినప్పుడు తప్పు చేసినట్లుగా భావించేలా చేశారని, అదే పనులు ఇప్పుడు వేరే వ్యక్తులు చేస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. సంతోషాన్ని వ్యక్తం చేయడం, తనను ప్రేమించే వారిని అభినందించడం, జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం వంటి సాధారణ విషయాలకే ఒకప్పుడు తప్పు చేసినట్లుగా భావించేలా చేశారని అన్నారు. కానీ ఇప్పుడు అదే పనులు బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ తప్పుగా చూడటం లేదని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక్కడ సమస్య మనం చేసిన పనిలో లేదని, ఆ పని చేయడానికి ఎవరికి అనుమతి ఉందనే విషయంలోనే అసలు తేడా ఉందనే భావనను వ్యక్తం చేశారు.

ఇక సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడటం, వారి కామెంట్లకు స్పందించడం తనకు ఎప్పటి నుంచో అలవాటేనని అనుపమ స్పష్టం చేశారు. ఇది నిన్న మొన్న మొదలుపెట్టిన పని కాదని, ఇకపై కూడా తనకు సమయం, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు అభిమానులతో మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. అయితే ఎవరు ఎవరి కామెంట్లకు స్పందించారు? ఎవరి స్టోరీలకు రిప్లై ఇచ్చారు? అంటూ తనను ఇతరులతో పోల్చుతూ మెసేజ్‌లు చేయవద్దని కోరారు. అభిమానుల ప్రేమను తాను గౌరవిస్తానని, కానీ సోషల్ మీడియా ఇంటరాక్షన్స్‌ను పోటీగా మార్చుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. ప్రేమ, కృతజ్ఞతలను ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రదర్శించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇటీవల అనుపమ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యానని, ఆ అనుభవాల నుంచి బయటపడి ఇప్పుడు ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నానని గతంలో వెల్లడించారు. అయితే తాజా పోస్ట్‌లో మాత్రం ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. తెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించే అనుపమ.. వ్యక్తిగత విషయాల్లోనూ తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.

 

 

[Anupama Parameswaran, Anupama Instagram Post, Anupama Latest News, Anupama Cryptic Post, Anupama Personal Life, Tollywood Actress News, Anupama Social Media]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com