Home

»

Latest News

ఎందుకు ఇలా జరిగింది.. ఫ్యాన్స్ షాక్!

Oct 31, 2026 5:45PM

 

దేవిశ్రీ ప్రసాద్.. 19 సంవత్సరాల వయసులోనే దేవి మూవీలో 'కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి' అనే అద్భుతమైన ట్యూన్ తో సంగీత ప్రియులు, ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాటలతో తెలుగు సంగీత సామ్రాజ్యానికి 'నవ చక్రవర్తి' అనిపించుకున్నాడు. వర్షం పడే ముందు పొలంలోని మట్టి ఇచ్చే సువాసన ఏ విధంగా ఉంటుందో, దేవి సంగీత ధార కూడా అంతే. ముఖ్యంగా దర్శకుడు  సుకుమార్ తన కాంబోలో వచ్చిన సినిమాల్లోని సాంగ్స్ ఫ్యాన్స్ కి ఫెవరేట్.   

 డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమా హిట్ రేంజ్ ని సైతం పెంచిన కాంబో. రేపు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'ఆర్‌సి 17' (RC 17). స్టార్ట్ కానుంది.  గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఆర్‌సి 17 ప్రకటన రాగానే ఫ్యాన్స్ అత్యంత ఉత్సాహంతో ఊగిపోయారు. ఈ ప్రాజెక్ట్‌కు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని అందరూ వంద శాతం బలంగా భావించారు. సుకుమార్ విజన్, డిఎస్పీ ఎనర్జిటిక్ మాస్ బిజిఎమ్ (BGM), రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో మరోసారి రికార్డుల సునామీ ఖాయమని అంచనా వేశారు. 

ఇది కూడా చదవండి: RC17 కి అనిరుద్ ఫిక్స్: నో దేవిప్రసాద్! 

 

 

అయితే ఊహించని విధంగా ఈ కాంబినేషన్ విషయంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఆర్‌సి 17 ప్రాజెక్ట్ లోకి సంగీత దర్శకుడిగా  అనిరుద్ ని ఫిక్స్ చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు సుకుమార్ తీసిన ప్రతి ఒక్క సినిమాకి దేవిమాత్రమే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలాంటి  ఈ ఐకానిక్ కాంబినేషన్ ఆర్‌సి 17 వద్ద విడిపోవడం ఆ ఇద్దరి కాంబో అభిమానులని షాక్ కి గురి చేస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు, చర్చలు మొదలయ్యాయి.

 

[Sukumar And Dsp Combo Break, Rc 17 Music Director, Anirudh In Rc17 Fix, Ram Charan, Sukumar, RC17, Ram Charan RC17 movie, Mythri Movie Makers, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com