LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.   రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.
 రాజకీయ విశ్లేషకుడిగా, విద్యావేత్తగా   గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు  చేసే ఆయన, తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. . అమిత్ షా పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని  జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనపై కేసు పెట్టారు.  కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రసారం చేసిన  టీవీ ఛానెల్‌పై కూడా పోలీసులు కేసు నమోదు అయ్యింది.   ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల జరిగిన ఒక టెలివిజన్ డిబేట్‌లో   గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. గతంలో ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్   ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారనీ,   ఆ సందర్భంగా వారు మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయాలని   అమిత్ షాను కోరారనీ చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్..   అమిత్ షా రాజకీయాల్లో  ఇన్‌స్టంట్ ఫ్రెండ్,  లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే వ్యత్యాసాలు ఉంటాయనీ,  చంద్రబాబు నాయుడు ఇన్‌స్టంట్ ఫ్రెండ్,   జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్, నాదెండ్ల మనోహర్ లకు తేల్చి చెప్పారనీ అన్నారు.   అంతే కాకుండా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని కూడా అమిత్ షా పవన్, నాదెండ్లకు సలహా ఇచ్చారని నాగేశ్వర్ ఆ డిబేట్ లో చెప్పారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.  అమిత్ షా అసలు అనని మాటలను అన్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కల్పించి చెబుతున్నారని..  కావాలనే కూటమి నేతల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన కార్యకర్తలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌,  ఆ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు. 
    తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన తెలుగువన్ వాస్తవ వేదికలో ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన  విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలజీవన్ మిషన్’ పథకం చుట్టూ ఇప్పుడు వివాదం ముదిరింది. పవన్ కళ్యాణ్ తన శాఖ పరంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపి, రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకురావడంలో విజయం సాధించారు. అయితే, కేంద్రం నుంచి విడుదలైన ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి చేరిన కేవలం అరగంట వ్యవధిలోనే మళ్ళించబడ్డాయనే ఆరోపణలు రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ నిధులు నేరుగా ‘మెఘా కృష్ణారెడ్డి’కి చెందిన సంస్థల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయనే అంశం ఇప్పుడు ప్రభుత్వ పారదర్శకతపై పెద్ద ప్రశ్న మార్క్‌గా నిలిచింది. రాజకీయ వ్యూహాలు మరియు అంతరార్థాలు: ఈ వ్యవహారంలో తెరవెనుక నడుస్తున్న రాజకీయ వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ నిధుల సాధన కోసం శ్రమిస్తుంటే, మరోవైపు ఆ నిధులు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోవడం వెనుక ఉన్న శక్తులెవరనేది మిస్టరీగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న అంతర్గత సత్సంబంధాలను, ఏపీ కార్బైడ్స్ వంటి పరిశ్రమల్లో భాగస్వామ్యాలను గుర్తుచేస్తూ ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా కనిపించే నాయకులు, తెరవెనుక ఒకే మంచం ఒకే కంచం అన్నట్లుగా వ్యవహరిస్తారనే వాదనకు బలం చేకూరుతోంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. ఇసుక రవాణాలో ప్రతి టిప్పర్‌కు భారీగా వసూళ్లు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్ల పెత్తనం మారకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే సంకేతాలు అందుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: ఈ నిధుల మళ్ళింపు ఉదంతం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర మంత్రి కష్టపడి తెచ్చిన నిధులు, ఆయన ప్రమేయం లేకుండానే మళ్ళిపోవడం వల్ల ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణను వ్యతిరేకిస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనాలని, మూడో బిడ్డకు రూ. 30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు ఇస్తామని సరికొత్త పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగించడంలో విఫలమైతే ఆశించిన ఫలితం ఉండదు.  ప్రజల చదువు, ఆరోగ్యం, ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వనంత కాలం ఇటువంటి పథకాలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోతాయి. పాలనలో పారదర్శకత లోపిస్తే, రాబోయే రోజుల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, అది వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
  నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం(21-5-26న) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్‌బ్యూరో నియామకం తర్వాత తొలిసారి జరిగినఈ సమావేశానికి వర్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.  ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్‌కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.  టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమానికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరినీ మహానాడులో భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహానాడు ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రాజకీయ, సామాజిక మార్పులను మహానాడు వేదికగా ప్రదర్శించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
  నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామనారాయణరెడ్డి, టీడీపీలోకి 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం, పదిహేనేళ్ల తర్వాత తిరిగి అక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ మంచి మెజార్టీతో గెలిచారు.  గత ఎన్నికల్లో ఆయన విజయం కోసం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ కొమ్మి లక్ష్మయ్యనాయుడు, సీనియర్ టీడీపీ నేత గూటూరు కన్నబాబులు కృషి చేశారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ అయిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఆత్మకూరులోని తన సొంత మండలమైన మర్రిపాడులో ఆనం గెలుపు కోసం పనిచేశారట. ఇప్పుడా ముగ్గురూ ఆనం తిరిగి మంత్రి అయ్యాక ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఆ సీనియర్లు ఏకమై చక్రం తిప్పుతుడటం చర్చనీయాంశంగా మారింది. రామనారాయణరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని ఆ సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబు వర్గీయుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయినా వారు టీడీపీ పట్ల లాయల్ గానే వ్యవహరిస్తున్నారు. 73 ఏళ్ల వయసు పైపడిన ఆనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని, అప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆ ఇద్దరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.  అయితే ఆనం రామనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కైవల్లారెడ్డిని ప్రకటించడం, ఆమె ఆత్మకూరు నియోజకర్గంలో యాక్టివ్ అవుతుండటం అసలు ముసలానికి కారణమైంది. ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగడంతో నారా లోకేష్ యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలిని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. 1983లో రామరాయణరెడ్డి తండ్ర ఆనం వెంకరెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది ప్రస్తావిస్తూ తాత వారసత్వాన్ని నిలబెట్టాలని రామనారాయణ కుమార్తెను గీతోపదేశం చేస్తున్నారట.  వచ్చే ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి కైవల్య రెడ్డిని బరిలో దింపాలనే ఉద్దేశంతో  రామనారాయణరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తూ.. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీతో పాటు మేకపాటి వంశస్తులు కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబులతో జతకట్టి యాంటీ ఆనం గ్రూపు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. రామనారాయణ రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి జెండా మోసిన వారిని కాకుండా.. పార్టీ పిరాయింపుదారులకు ప్రాధాన్యత  ఇస్తున్నారని సీనియర్లు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం..  ఆనం అవినీతిపై రోడ్డు ఎక్కితే పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో తామంతా మౌనంగా ఉన్నామని ఆ ముగ్గురు నేతలు చెబుతున్నారట. తమ వెంట తిరిగే కార్యకర్తలకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదీకాక  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సొంత మండలమైన చేజర్ల, గూటూరు కన్నబాబు సొంత మండలం కరటంపాడు లో కూడా ఆనం వర్గమే ఆదిపత్యం చెలాయిస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందు ఆ ముగ్గురు సీనియర్ నేతలు కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారట.  పార్టీ కోసం తాము చేసిన త్యాగాలను అధిష్టానం కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మంత్రి ఆనం మీద ఫిర్యాదు చేశారని వారి అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారి మండలాల్లో జరిగే కార్యక్రమాలకి కూడా మంత్రి ఆనం వారిని ఆహ్వానించడం లేదట. తమతో తిరిగితే పనులు కూడా చెయ్యనని తమ అనుచరులను ఆనం భయపెడుతున్నారని ఆ ముగ్గురు నేతలు రగిలిపోతున్నారట. ఆ ఎఫెక్ట్‌తో  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సహా ఆనంపై అసంతృప్తితో నేతలందరూ మేకపాటి శిబిరంలో చేరిపోతున్నారంట.  మరి కుమార్తె పొలిటికల్ కెరీర్ కోసం పాట్లు పడుతున్న ఆనం.. ఆత్మకూరులో ఈ వ్యతిరేక పరిస్థితులు ఎలా అధిగమిస్తారో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
Cast: Nandu, Avika Gor, Shivaji Raja, Raviteja Mahadasyam Crew: Music Director: Shravan Bharadwaj Cinematography: Sri Sai Kumar Dara Writer-Director: Pranava Swaroop Ugly Story, a psychological romantic thriller starring Nandu and Avika Gor, released today. Shivaji Raja and Raviteja Mahadasyam play prominent roles. Let's discuss about the film in detail. Plot: Orphaned Neha (Avika Gor) is raised by her uncle. Her cousin, Karthik (Nandu), develops a psychotic, suffocating obsession with her from childhood. When Karthik discovers Neha actually loves Gautam (Raviteja), his toxic behavior worsens. This eventually forces Neha into a torturous marriage with him. How does this dark marriage end? Watch the movie to find out. Analysis: Director Pranava Swaroop effectively explores the dark reality of extreme possessiveness and marriages lacking mutual consent. While the characters are well-defined, the first-half screenplay falters. Repetitive scenes establishing Neha's trauma and Karthik's psychosis make the pacing sluggish until the interval.  However, the second half quickly regains momentum. The climax is highly satisfying and realistic, delivering justice without preachy lectures, though some raw sequences may disturb sensitive viewers. Nandu completely immerses himself in his role, brilliantly shifting from terrifying calmness to sudden rage. Avika Gor matches his intensity, communicating deep fear and pain through powerful expressions that evoke genuine empathy.  Ravi Prakash Mahadasyam and Shivaji Raja provide solid emotional support. Technically, the film excels despite budget constraints. Sri Sai Kumar Dara’s close-up shots beautifully capture raw emotions, while Shravan Bharadwaj’s gripping background score strongly elevates the suspense. Positives: Lead pair performances Engaging second half Excellent background score Cinematography Negatives: Dragged first half Repetitive scenes Some disturbing sequences Bottomline:  A bold and realistic psychological drama but not for all. Rating: 2.25/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా 'అగ్లీ స్టోరీ'. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. (Ugly Story Movie Review) కథ: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా (అవికా గోర్)ను ఆమె మావయ్య (శివాజీ రాజా) తమ ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. వరుసకు మరదలైన నేహాపై మావయ్య కొడుకు కార్తీక్ (నందు) చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ పెంచుకుంటాడు. నేహ వేరే వారితో మాట్లాడినా భరించలేని సైకో మనస్తత్వం కార్తీక్‌ది. అయితే నేహాకు చిన్నతనం నుంచి గౌతమ్ (రవితేజ మహాదాస్యం) అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం తెలిసి కార్తీక్ మరింత సైకోలా మారతాడు. అసలు ఇష్టం లేకపోయినా, చిన్నప్పటి నుంచి తను పెట్టే టార్చర్‌ను భరించలేకపోయినా నేహా చివరకు కార్తీక్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? పెళ్లైన తర్వాత నేహాకు కార్తీక్ ఇంకెంత నరకం చూపించాడు? చివరకు ఈ దంపతుల కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే ఈ 'అగ్లీ స్టోరీ'. విశ్లేషణ: సమాజంలో ప్రేమ పేరుతో జరిగే దాడులు, పెళ్లి తర్వాత భార్యలపై భర్తలు చూపే అతి పొసెసివ్‌నెస్, సైకోయిజం చుట్టూ దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ 'అగ్లీ స్టోరీ'ని తెరకెక్కించాడు. పేరుకు తగ్గట్టే ఇదొక డార్క్ అండ్ రా స్టోరీ. భార్యాభర్తల మధ్య 'సమ్మతి' లేకపోతే ఆ బంధం ఎంత వికృతంగా మారుతుందో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ సినిమాలో పాత్రలను చాలా క్లారిటీతో రాసుకున్నారు. కానీ, స్క్రీన్‌ప్లే విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, నేహా భయపడటానికి గల కారణాలు, కార్తీక్ సైకో ప్రవర్తనను ఎస్టాబ్లిష్ చేశారు. అయితే, ఇంటర్వెల్ వరకు హీరో సైకోయిజం చుట్టూనే సీన్లు రిపీట్ అవుతున్నట్లు అనిపించి కథనం కొంచెం స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాతే కథలో కాస్త వేగం పెరుగుతుంది.  ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగతీతగా అనిపించినా, సెకండాఫ్ వేగంగా సాగుతూ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు, సున్నిత మనస్కులకు కాస్త డిస్టర్బింగ్‌గా అనిపించవచ్చు. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి జస్టిఫికేషన్‌తో ముగుస్తుంది. క్లైమాక్స్ లో దర్శకుడు ఎటువంటి అనవసర ఉపన్యాసాలు ఇవ్వకుండా, సమాజంలోని పచ్చి నిజాన్ని చూపిస్తూ న్యాయం జరిగేలా ముగించడం ప్రేక్షకులకు సంతృప్తిని ఇస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:   నందు తన కెరీర్‌ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కార్తీక్ అనే సైకో భర్త పాత్రలో నందు జీవించేశాడు. కళ్లలోనే క్రూరత్వాన్ని, నిమిషాల్లో ప్రశాంతత నుండి కోపానికి మారే బాడీ లాంగ్వేజ్‌ను అద్భుతంగా పలికించాడు. ఇన్నోసెంట్ భార్యగా అవికా గోర్ తన నటనతో సినిమా స్థాయిని పెంచింది. మాటల కంటే తన ముఖ కవళికలతో భయాన్ని, బాధను అద్భుతంగా పండించి ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. గౌతమ్‌గా రవిప్రకాష్ మహాదాస్యం తన పరిధి మేరకు నటించగా, మేనమామ పాత్రలో శివాజీ రాజా భావోద్వేగ నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్ పరంగా శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ బాగుంది. క్లోజప్ షాట్స్‌తో క్యారెక్టర్ల ఎమోషన్స్‌ను చక్కగా క్యాప్చర్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ అసెట్. ఉత్కంఠభరిత సన్నివేశాలను తన సంగీతంతో మరింత ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ సెకండాఫ్‌లో బాగుంది కానీ ఫస్టాఫ్‌లో కొన్ని రిపీటెడ్ సీన్స్ కట్ చేయాల్సింది. తక్కువ బడ్జెట్‌లోనైనా నిర్మాణ విలువలు క్వాలిటీగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: నందు, అవికా గోర్ పెర్ఫార్మెన్స్ సెకండాఫ్‌ సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్  మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్‌లో సాగదీత, రిపీటెడ్ సీన్లు కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఫైనల్ గా.. 'అగ్లీ స్టోరీ' ఒక బోల్డ్ అండ్ టాక్సిక్ లవ్ స్టోరీ. రియలిస్టిక్, సైకలాజికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు. రేటింగ్: 2.25/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
స్టార్ హీరోలు మమ్ముట్టి(Mammootty),మోహన్‌లాల్(Mohan lal)కలిసి చేసిన చిత్రం పేట్రియాట్(Patriot). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా  ఈ నెల 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు కలిసి నటించిన భారీ చిత్రం కావడంతో అభిమానులు, ప్రేక్షకులు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు. కానీ మూవీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు ఈ మూవీ  ఓటిటి వేదికగా రిలీజ్ కి రెడీ అయ్యింది.  ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'జీ5'  డిజిటల్ రైట్స్‌ని  సొంతం చేసుకుంది. జూన్ 5, 2026 నుండి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం వంటి 5 ప్రధాన భారతీయ భాషల్లో ఈ స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా ప్రకటించింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఓటీటీ వీక్షకులని  ముఖ్యంగా మిస్టరీ, పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులని పేట్రియాట్  బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ సుమారు ఒక సంవత్సరానికి పైగా ఇండియా, శ్రీలంక, లండన్, అజర్‌బైజాన్ మరియు యూఏఈ వంటి 10కి పైగా అంతర్జాతీయ దేశాల్లోని లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. సుశీన్ శ్యామ్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం, మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. Also read: Vishnu Priya: మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియ.. సరికొత్త మలుపు తిరిగిన కథ   ఇండియాలో మొదటి రోజే  9.80 కోట్ల నెట్ కలెక్షన్లతో పాటు, ఓవర్సీస్ మార్కెట్‌లో 18.00 కోట్ల గ్రాస్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 29.37 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. థియేట్రికల్ రన్ మొదటి రోజుల్లో 66 శాతం అక్యుపెన్సీతో దూసుకుపోయిన ఈ చిత్రం, ఆ తర్వాత మిశ్రమ సమీక్షల వల్ల నాలుగో రోజు నాటికి కలెక్షన్లు తగ్గి 19 శాతం అక్యుపెన్సీకి పడిపోయింది. అయినప్పటికీ, మమ్ముట్టి ,మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అభిమానులు థియేటర్లకి  క్యూ కట్టారు. నయనతార, ఫహద్ ఫాజిల్, సీనియర్ నటి రేవతి, కుంచకో బోబన్, దర్శన రాజేంద్రన్  రాజీవ్ మీనన్ వంటి భారీ తారాగణం  కీ రోల్స్ పోషించారు.   
    ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ(Vishnupriya)అంటే తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో పలు వివాదాలు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ ద్వారా హాట్ టాపిక్‌గా మారిన ఆమె, తాజాగా తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటూ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీలను, ముఖ్యంగా మహిళా నటీమణులను లక్ష్యంగా చేసుకుని కొందరు చేస్తున్న అసభ్యకరమైన ప్రచారాలు, ట్రోలింగ్స్ హద్దులు దాటుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ  ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే  యూట్యూబ్ ఛానల్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తోందని విష్ణుప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరంతరం అసభ్యకరమైన పోస్టులు, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో  యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.ఈ సందర్భగా విష్ణు ప్రియ మాట్లాడుతు కేవలం వ్యూస్, సబ్‌స్క్రైబర్లని  పెంచుకోవడం కోసమే కొందరు డిజిటల్ క్రియేటర్లు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. మా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అనరాని మాటలు అంటున్నారు. ఏడ్చి ఏడ్చి విసిగిపోయా. ఇక మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. అందుకే మౌనంగా ఉండటం కంటే చట్టం ద్వారా బుద్ధి చెప్పడమే సరైన మార్గమని భావించి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. ఈ ఫిర్యాదుని  స్వీకరించిన మియాపూర్ పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని  ముమ్మరం చేశారు. సదరు యూట్యూబ్ ఛానెల్  ఐపీ అడ్రస్, అకౌంట్ వివరాలని  సేకరించే పనిలో సైబర్ క్రైమ్ విభాగం నిమగ్నమైంది. Also read: Anna lezhneva: జిమ్‌లో పవన్ భార్య అన్నా లెజినోవా ఫిట్‌నెస్ సెన్సేషన్.. చిరు కామెంట్‌కి క్రేజీ రిప్లై  
Presented under the banner of GMB Entertainment by Superstar Mahesh Babu and Namrata Shirodkar, and brought to life in collaboration with A+S Movies and SriChakraas Entertainments, Rao Bahadur marks another intriguing venture for actor Satya Dev. Venkatesh Maha, known for his bold cinematic language, not only directs but also pens and edits the movie. Buzz around the film has steadily intensified, fueled by the striking glimpse and the much-loved track O Sundari. With its graceful visuals and evocative melody, the song has beautifully evoked a bygone era, significantly amplifying early excitement for the project. The makers have come up with a BTS glimpse- Into The World Of Rao Bahadur, offering a fascinating window into the massive scale of the production. The video chronicles the rigorous pre-production, intricate prosthetics work, and grand-scale filming schedules that define this ambitious project. The video highlights a film that promises to be a visually striking, character-driven theatrical experience. The major attraction of the footage is the astonishing physical transformation of Satya Dev. It captures the actor arriving on set and stepping straight into his vanity van to undergo a meticulous makeup and styling process.   To bring his aging, regal character to life, a team of expert technicians is seen skillfully applying a bald cap, blending specialized prosthetics, and seamlessly attaching a long, graying mane paired with a thick beard and a prominent, curled handlebar mustache. Complete with custom contact lenses and an elite wardrobe featuring an ornate purple sherwani, heavy pearl necklaces, and a traditional turban, Satya Dev fully embodies the majestic aura of a bygone era. The video shows different looks of the actor in the movie. Beyond the actor’s transformation, the glimpse sheds light on the massive production values and technical craftsmanship being poured into the film. Viewers are taken onto lavish, antique-themed indoor sets, and extensive outdoor locations. It also teases intense stunt preparation, underscoring the dynamic narrative flow planned by the director. Deepa Thomas plays the female lead, while Vikas Muppala, Bala Parasar, Anand Bharathi, Pranay Vaka, and Master Kiran appear in key roles. On the technical front, the film is powered by an impressive crew- cinematography by Kartik Parmar Kartik Parmar, music by Smaran Sai Smaran Sai, and production design by Rohan Singh Rohan Singh. Rao Bahadur sets the stage for a world rich in heritage, mystery, and the unsettling remnants of an aristocratic past. With themes rooted in legacy and long-buried secrets, the film aims to offer a gripping experience. Only 6 more Fridays to go before you experience the madness of Rao Bahadur in theatres on July 3rd.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సతీమణి అన్నా లెజినోవా(Anna lezhneva)సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకి  సంబంధించిన జిమ్ వర్కవుట్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిత్యం ట్రెడిషనల్ లుక్‌లో మెరిసే మెగా కోడలు, ఈసారి కంప్లీట్ ఫిట్‌నెస్ మోడ్‌లోకి మారిపోయి భారీగా కసరత్తులు చేస్తూ కనిపించడంతో మెగా అభిమానులతో పాటు నెటిజన్లు  ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.  నిజానికి తనకు మొదటి నుంచి స్పోర్ట్స్ అన్నా, కఠినమైన వ్యాయామాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదని అన్నా లెజినోవా ఓపెన్‌గా ఒప్పుకున్నారు. కేవలం గడిచిన 6 నుండి 8 నెలలుగా మాత్రమే ఆమె క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం ప్రారంభించారట. ప్రారంభంలో కొన్ని నెలల పాటు  ఇష్టం లేకుండానే, అయిష్టంగానే వ్యాయామాలు చేసినప్పటికీ, క్రమక్రమంగా ఆ అలవాటు తనలో ఒక సరికొత్త మార్పుని  తీసుకువచ్చిందని ఆమె ఎంతో సంతోషంగా వివరించారు. ఈ ప్రయాణంలో నిలకడగా శ్రమించడం వల్ల ఆమె కేవలం ఈ 6 నుండి 8 నెలల కాలంలోనే ఏకంగా 11 కిలోల వరకు బరువు తగ్గినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ అంకెలు చూసిన నెటిజన్లు ఆమె డెడికేషన్‌కు ఫిదా అవుతూ, తమకు నిజమైన ఫిట్‌నెస్ గోల్స్ ఇస్తున్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాయామం కేవలం శారీరక మార్పుల కోసమే కాకుండా, తన మానసిక దృఢత్వానికి ఎంతో సహాయపడిందని అన్నా లెజినోవా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఇటీవల తన భర్త పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌లో చేరి సర్జరీ చేయించుకుంటున్న కష్టసమయంలో, ఈ రోజువారీ కసరత్తులే తనకు మానసిక ప్రశాంతతను అందించి, ఎంతో ధైర్యంగా ఉండేందుకు దోహదపడ్డాయని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి రోజువారీ వ్యాయామాలు కేవలం సెలబ్రిటీలు, మోడల్స్ మరియు నటీమణులకు మాత్రమే పరిమితం కాదని, తనలాంటి 30 ఏళ్లు దాటిన ప్రతి గృహిణికి ఇది ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. తనను చూసి మరికొంతమంది మహిళలు కూడా స్ఫూర్తి పొంది ఇప్పుడైనా వ్యాయామం మొదలుపెడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. Also read: Dragon: డ్రాగన్ మాస్టర్ ప్లాన్ లీక్!..  ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు భయ్యా ఇక ఈ జిమ్ వర్కవుట్ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వర్కవుట్ వీడియోలను గుర్తుచేస్తూ, "ఏంటి వదినా.. చిరు సార్‌కే గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారుగా అని సరదాగా కామెంట్లు పెట్టారు. దీనికి అన్నా లెజినోవా కూడా అంతే హుందాగా స్పందిస్తూ..  బాస్‌కు ఎవరూ పోటీ రాలేరు, ఆయన ఎప్పటికీ ది బెస్ట్" అంటూ మెగా అభిమానుల మనసులను గెలుచుకున్నారు. అలాగే బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరగా, "నేనంటే మీకు ఎంత బాధ్యత" అంటూ రిప్లై ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.    
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ, డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సందడి నెలకొనడం ఖాయం. తనదైన నటన, అద్భుతమైన డాన్స్ స్టెప్స్‌తో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ యంగ్ బ్యూటీ, తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించింది.  శుక్రవారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న శ్రీలీలను చూసేందుకు అభిమానులు, ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపారు. . ఈ సందర్భంగా శ్రీలీల ధరించిన అవుట్‌ఫిట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఎల్లో కలర్ హాల్టర్-నెక్ టాప్ ధరించి మెరిసిపోయింది.  ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. ఎక్కడా విసుగు పడకుండా తనదైన క్యూట్ స్మైల్‌తో శ్రీలీల అందరికీ అభివాదం చేస్తూ, ఎంతో ఓపిగ్గా ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోలు దిగింది. ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణంలో భాగంగా అక్కడ ఉన్న 'ది బెవ్ బార్' (The Bev Bar) లో శ్రీలీల కాసేపు సేదతీరింది. విశేషం ఏంటంటే, ఈ బార్‌లో ఆమె పేరు మీదుగానే ఒక ప్రత్యేకమైన డ్రింక్‌ను నామకరణం చేశారు. అక్కడ శ్రీలీల తనకు ఇష్టమైన పర్పుల్ స్మూతీని తాగుతూ కెమెరాలకు చిక్కింది.  ఫ్లైట్ ఎక్కే ముందు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిసి ఎంతో సరదాగా ఒక సెల్ఫీ దిగి, వారిని కూడా ఖుషీ చేసింది. దీనికి సంబంధించిన క్యూట్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రకారం, శ్రీలీల హైదరాబాద్ నుండి ముంబైకి పయనమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన ఈ కన్నడ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లో జెండా పాతేందుకు సిద్ధమైంది. 2026లో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ సరసన ఒక భారీ హిందీ ప్రాజెక్ట్‌తో ఆమె అక్కడ గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతోంది. ఆ సినిమాకు సంబంధించిన తదుపరి షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనడానికే శ్రీలీల ముంబై వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఫ్రైడే మార్నింగ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీలీల చేసిన సందడి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.  
  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో డ్రాగన్(Dragon)గ్లింప్స్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే 64 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించి ఫిలింనగర్ వర్గాల నుండి ఒక తాజా  సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక్క భాగంతో ముగించకుండా, ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి  ప్రశాంత్ నీల్ సిద్ధం చేసిన సుదీర్ఘమైన, ఎమోషనల్ మైండ్ బ్లోయింగ్ కథ ఒక్క భాగంలో సరిపోదని భావించిన చిత్ర యూనిట్, దీనిని రెండు భాగాలుగా విస్తరించాలని నిర్ణయించింది. బాహుబలి, కేజీఎఫ్, సలార్, పుష్ప చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా రెండు భాగాల ఫ్రాంచైజీగా రాబోతుండటం ఎన్టీఆర్ అభిమానులకి అసలైన పూనకాలు తెప్పిస్తోంది. ఇంకో విషయం  ఏంటంటే సలార్ లా లేటు ఉండకుండా డ్రాగన్ మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే రెండో భాగం కూడా తెరకెక్కిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. Also read: Naga chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో చైతు క్రేజీ ప్రాజెక్ట్! ఫ్యాన్స్ రియాక్షన్ వింటే షాక్ అవుతారు డ్రాగన్ ని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ జత కడుతుంది.  
మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా "తక్షక" (Takshaka). ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న "తక్షక" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేశారు.  ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. "మల్లిడి సత్యనారాయణరెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణ మల్లిడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత లతారాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. లతా రాజు గారి అబ్బాయి కుశాల్ రాజు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ అబ్బాయి హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి నిర్మాతగా లతా గారు కొత్త అయినా  అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా విజయం సాధించి కుశాల్ రాజు హీరోగా పేరు తెచ్చుకోవాలి, అలాగే మా కృష్ణ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా." అన్నారు. ప్రొడ్యూసర్ డా. లతారాజు మాట్లాడుతూ.. "మా "తక్షక" సినిమా పోస్టర్ లాంచ్ చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు. సరికొత్త సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలున్న చిత్రమిది. మహాభారత కాలం నుంచి నేటి వరకు వేల ఏళ్లుగా జరిగిన అద్భుతమైన సన్నివేశాలు మా సినిమాలో ఉంటాయి. ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ, రీసెర్చ్ చేస్తూ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు మా డైరెక్టర్ కృష్ణ మల్లిడి. అలాగే మా చిత్రానికి పిల్లర్ లా నిలబడిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబీకి కృతజ్ఞతలు చెబుతున్నా. నాకు మోరల్ సపోర్ట్ గా మా అన్నయ్య డా.నరేంద్రనాథ్ రాజుకు థ్యాంక్స్. మా అబ్బాయి కుశాల్ రాజు గురించి చెప్పాలంటే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతి విషయం నేర్చుకుంటూ నటించాడు. మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా." అన్నారు. డైరెక్టర్ కృష్ణ మల్లిడి మాట్లాడుతూ.. "మా "తక్షక" మూవీ ఓపెనింగ్ వినాయక్ గారి చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు పోస్టర్ లాంచ్ కూడా ఆయనే చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అయి డైరెక్టర్ గా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ చేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం. సినిమా సక్సెస్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం." అన్నారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ.. "మా మూవీ ప్రతి ఈవెంట్ లో సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్. వినాయక్ గారు మా మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఈ చిత్రం కోసం నేను, మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశాం. మా డైరెక్టర్ విజన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మీరంతా మా సినిమాను ఇష్టపడతారని కోరుకుంటున్నా." అన్నారు.  
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆమె లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.  వెండితెరపై ఎంతో పద్ధతిగా, హోమ్లీ లుక్‌లో కనిపించి కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ 29 ఏళ్ల బెంగళూరు భామ.. తాజాగా ఊహించని విధంగా అత్యంత గ్లామరస్ అవతారంలో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. పూల్‌సైడ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రీన్ కలర్ బికీనీ ధరించి కెమెరాలు, షూటింగ్ సిబ్బంది మధ్య ఆమె ఉన్న ఒక స్పెషల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.  సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వేలాది వ్యూస్, లైకులను సాధించి విపరీతంగా వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత్ కెరీర్‌లోనే ఇలాంటి ఒక అల్ట్రా బోల్డ్ బికీనీ లుక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో, నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ గ్రీన్ బికీనీ వీడియో చూసిన అభిమానులు రుక్మిణి వసంత్ గ్లామర్ అప్పీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ చీరకట్టులో, సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో చూసిన తమ అభిమాన నటిని ఈ రేంజ్ హాట్ అవతారంలో చూసేసరికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే, ఈ వీడియోపై ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో, ఇది ఎవరైనా సృష్టించిన ఏఐ డీప్‌ఫేక్ వీడియో కావచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం రుక్మిణికి చీరకట్టు, ట్రెడిషనల్ లుక్సే ఎంతో అందంగా ఉంటాయని.. ఇలాంటి బోల్డ్ లుక్స్ ఆమెకు సెట్ కావు అంటూ అభిప్రాయపడుతున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది. నిజానికి ఆయుర్వేదం అనేది వైద్య విదానంలా కాకుండా అది మనిషి జీవన విదానంలా చక్కగా కలిసిపోతుంది. మనిసి శరీరం  గురించి,  ఆరోగ్యం గురించి ఆయుర్వేదం ఎంతో గొప్పగా, మరెంతో లోతుగా, అదే విదంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఆయుర్వేదంలో ఉన్న రెండు శ్లోకాలు అర్థం చేసుకుంటే శరీరం వ్యాధులకు దూరంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ శ్లోకాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలే అనేక వ్యాధులకు మూల కారణం.  ఉపవాసం, పంచకర్మ వంటి ప్రక్రియలు శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేయడానికి సహాయపడతాయి. నియంత్రణలో ఉండేలా  ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, , ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు కూడా చూపిస్తున్నాయి. ప్రకృతి వైద్యం శరీరం  సహజంగా వ్యాధులను తనకు తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది సమతుల్య ఆహారం, యోగా, ధ్యానం, , శరీరం శుద్ది చేసే  పద్ధతులను ఉపయోగిస్తుంది. శరీరం, మనస్సు,  ఆత్మ సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి  నిజంగా ఆరోగ్యంగా ఉంటాడని ఆయుర్వేదం నమ్ముతుంది. శ్లోకం.. "లంఘనం పరం ఔషధం" అంటే ఉపవాసమే ఉత్తమమైన ఔషధం. శరీరాన్ని వ్యాధి రహితంగా ఉంచుకోవాలంటే  జంతువుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. అవి అనారోగ్యానికి గురైనప్పుడు తినడం మానేస్తాయి, కానీ మనం అనారోగ్యానికి గురైనప్పుడు అన్నీ తినేస్తుంటాము. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు 2-3 రోజులు ఉపవాసం ఉండటం నేర్చుకుంటే, తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదాన్ని కూడా తొలగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటే  కణితులు, గుండె సమస్యలు, ఫైబ్రాయిడ్ల వంటి సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావట. ఆయుర్వేదంలో ఉపవాసాన్ని శరీరం, మనస్సును శుద్ధి చేసే సాధనంగా పరిగణిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు, శరీరానికి విశ్రాంతినిచ్చి, జీర్ణవ్యవస్థ తిరిగి క్రియాశీలం కావడానికి సమయం ఇవ్వడం. ఉపవాసం జీర్ణాశయ అగ్నిని బలపరుస్తుంది. శ్లోకం.. "సర్వేషాం రోగనాం నిదానం కూపిత మల" అంటే అన్ని వ్యాధులకు మూలం కూపిత మలం. శరీరంలోని వాత, పిత్త లేదా కఫ దోషాలు అసమతుల్యమై, కలుషితమైనప్పుడు వ్యాధులు వస్తాయి.  దీన్ని తగ్గించడం  కోసమే పంచకర్మ చేస్తారు. పంచకర్మ అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక శుద్ది ప్రక్రియ, దీని ముఖ్య ఉద్దేశ్యం శరీరం నుండి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని సమతుల్యం చేయడం. ఇందులో వామన, విరేచన, బస్తి, నస్య , రక్తమోక్షణ వంటి విధానాలు ఉంటాయి. శరీరం నుండి అసమతుల్య దోషాలను తొలగించడం, పేరుకుపోయిన విషపదార్థాలను తీసివేయడం , సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందించడం వీటి ప్రధాన లక్ష్యం. పంచకర్మ విశిష్టత.. శరీరంలో పేరుకుపోయిన 'ఆమ' లేదా విష పదార్థాలు అనేక వ్యాధులకు కారణమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ విష పదార్థాలను తొలగించడంలో పంచకర్మ సహాయపడుతుందని భావిస్తారు. పంచకర్మ తర్వాత చాలా మంది మంచి నిద్ర, తేలికదనం , శక్తిని పొందినట్లు భావిస్తారు.                          *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది. అయితే, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు డాక్టర్ శ్రీలత గారు. తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక వీడియోలో డాక్టర్ శ్రీలత గారు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు మరియు కొన్ని సులువైన చిట్కాలను పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం... గుండె ఆరోగ్యానికి రక్షణ కవచాలు.. ఈ ఆహారాలు: ఆకుకూరలు (Leafy Vegetables): తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే 'విటమిన్ కె' రక్తనాళాలను రక్షించి, బ్లడ్ ప్రెషర్ (BP) నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. తృణధాన్యాలు (Whole Grains): మనం తినే పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా ఓట్స్, బార్లీ, జొన్నలు, రాగులు, దంపుడు బియ్యం (Brown Rice) వంటి తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే పీచు పదార్థం (Fiber) శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొవ్వులు (Healthy Fats): అన్ని కొవ్వులు గుండెకు కీడు చేయవు. బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) గుండె రక్తనాళాల్లో పూడికలు (Blocks) ఏర్పడకుండా చూస్తాయి. నూనెల వాడకంలో జాగ్రత్తలు: వంటల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans Fats) ఎక్కువగా ఉండే వనస్పతి, డాల్డాలను పూర్తిగా దూరం పెట్టాలి. బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ గుండె ఆరోగ్యానికి శత్రువులని డాక్టర్ శ్రీలత హెచ్చరిస్తున్నారు. ఉప్పు, పంచదార తగ్గించండి: ఆహారంలో సోడియం (ఉప్పు) శాతం పెరిగితే బీపీ పెరుగుతుంది. అది నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఉప్పు మరియు చక్కెర వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. గుండె పదిలంగా ఉండాలంటే చేయాల్సినవి: ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ధూమపానం (Smoking), మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. గుండె జబ్బులు వచ్చాక బాధపడటం కంటే, రాకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం (Prevention is better than cure). డాక్టర్ శ్రీలత గారు సూచించిన ఈ సాధారణ డైట్ టిప్స్ పాటిస్తూ మీ హృదయాన్ని పదికాలాల పాటు పచ్చగా ఉంచుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది రకరకాల మానసిక రుగ్మతల (Mental Illness) బారిన పడుతున్నారు. అసలు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? వాటి రకాలు ఏమిటి? వీటికి మందులు వాడకుండా కేవలం కౌన్సెలింగ్, థెరపీల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అనే విషయాలపై ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం (న్యూ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్, హైదరాబాద్) గారు ఈ VIDEO లో విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. మానసిక రుగ్మత (Mental Illness) అంటే ఏమిటి? సాధారణంగా ఒక వ్యక్తి ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో మరియు భావోద్వేగాలలో అసాధారణ మార్పులు వచ్చి, అవి వారి దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తే దానిని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. ఇది కేవలం 'పిచ్చి' కాదు, గుండె జబ్బు, మధుమేహం లాగే మెదడు పనితీరుకు సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య. ప్రధాన మానసిక సమస్యలు - రకాలు: సమాజంలో ఎక్కువగా కనిపించే కొన్ని ముఖ్యమైన మానసిక రుగ్మతలు: డిప్రెషన్ (Depression - తీవ్ర నిరాశ): ఎప్పుడూ బాధగా ఉండటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. యాంగ్జైటీ డిజార్డర్స్ (Anxiety Disorders - ఆందోళన): చిన్న విషయాలకే విపరీతంగా భయపడటం, కంగారుపడటం.  అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD): ఒకే ఆలోచన పదే పదే రావడం (ఉదాహరణకు చేతులు కడగడం, తాళాలు సరిచూసుకోవడం).  బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder): ఒకసారి విపరీతమైన ఆనందం, మరోసారి తీవ్రమైన నిరాశకు లోనవడం.  స్కిజోఫ్రీనియా (Schizophrenia): లేని విషయాలు ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రమపడటం. మానసిక సమస్యలను గుర్తించడం ఎలా? (Diagnosis) చాలా మంది తమకు సమస్య ఉన్నా బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తారు. ఒక వ్యక్తిలో క్రింది లక్షణాలు కనిపిస్తే వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు: నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం. చిన్న విషయాలకే విపరీతంగా కోపం లేదా ఏడుపు రావడం. నెగటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ఆలోచనలు రావడం. మందులు లేకుండా మానసిక సమస్యలకు చికిత్స (Treatment Without Medication): చాలా మంది మానసిక సమస్య అనగానే జీవితాంతం మందులు (Psychiatric Medicines) వాడాలేమో అని భయపడతారు. అయితే, అన్ని సమస్యలకూ మందులు అవసరం లేదని డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేశారు. సైకాలజిస్టులు అందించే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వీటిని పూర్తిగా నయం చేయవచ్చు: కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT): ఈ థెరపీ ద్వారా రోగిలోని ప్రతికూల (Negative) ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూల (Positive) ఆలోచనలుగా మారుస్తారు. సైకాలజికల్ కౌన్సెలింగ్: మనసులోని బాధను, ఒత్తిడిని నిపుణులైన సైకాలజిస్ట్‌తో పంచుకోవడం ద్వారా సగం సమస్య పరిష్కారమవుతుంది. వారు సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారాన్ని చూపిస్తారు. లైఫ్ స్టైల్ మార్పులు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మైండ్‌ఫుల్‌నెస్ మరియు ధ్యానం: మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (Meditation) ఎంతో సహాయపడుతుంది. మానసిక సమస్యలు అనేవి దాచుకోవాల్సిన విషయాలు కావు. శారీరక నొప్పులకు డాక్టర్‌ను సంప్రదించినట్లే, మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు సంకోచించకుండా సైకాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం. మందుల వాడకం లేకుండా, కేవలం సరైన అవగాహన, థెరపీలతో మానసిక రుగ్మతలను జయించి సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!