LATEST NEWS
కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, తిరుగులేని  ట్రబుల్‌షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్  కర్నాటక సీఎంగా బుధవారం (జూన్ 2) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎన్నో  ఒడుదొడుకులు, సుదీర్ఘ నిరీక్షణల అనంతరం డీకే కర్ణాటక రాష్ట్ర  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పార్టీని సంక్షోభాల నుంచి ఒంటిచేత్తో  బయటపడేసిన  64 ఏళ్ల ఈ సీనియర్ నాయకుడి కల ఎట్టకేలకు సాకారమైంది. డీకేకి సీఎం పదవి దక్కడంతో   కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. కర్ణాటక శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివకుమార్, ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని  ప్రకటించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం తనపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులు, మహిళలు, యువత భాగస్వామ్యంతో రాష్ట్రంలో  నవ యుగం' సృష్టిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి బెంగళూరులోని లోక్‌భవన్‌ గ్లాస్ హౌస్ ముస్తాబైంది. బుధవారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వేడుకలో జ్యోతిష్యుల సలహాలు, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి విడత   13 మంది కీలక నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఈ మంత్రివర్గాన్ని కూర్చింది. ఇందులో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి.పరమేశ్వర రాష్ట్ర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా, మరో సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.  తొలి విడతలో ప్రమాణం చేయబోయే 13 మంది మంత్రుల   జాబితాలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యాతీంద్రతో పాటు, కేహెచ్ మునియప్ప, యూటీ ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి బలమైన నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రాన్ని నడిపించి, అధికార మార్పిడి సజావుగా సాగేలా సహకరించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  (సీడబ్ల్యుసీ) సభ్యుడిగా సిద్ధరామయ్యను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఉన్న ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, కర్ణాటకలోని వివిధ ప్రముఖ మఠాల అధిపతులు తరలివస్తున్నారు.  
  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ సభల చుట్టూ తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన "నవనిర్మాణ సంకల్ప సభ" ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఈ సభను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్,  టిఆర్ఎస్  అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ కాకను పుట్టించాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేయగా, కవిత మరింత ఘాటుగా స్పందించారు. గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలుగువన్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక  ఇంటర్వ్యూలో  కవిత, పొన్నం ప్రభాకర్,  ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ పేరు వింటేనే కొందరికి భయం పట్టుకుందని, అందుకే ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకోవడానికి వీల్లేదన్నట్లు మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ గతంలో ఒరిస్సా, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరిట సభలు పెట్టలేదా అని బాలకోటయ్య నిలదీశారు. తెలంగాణ వాదులుగా చెప్పుకునే కొందరు నాయకులు తాలిబాన్లలా మాట్లాడుతున్నారని, ఇది తీవ్రమైన రాజకీయ ఉన్మాదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని చేతకాలేదన్న కవిత వ్యాఖ్యలకు బాలకోటయ్య గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం 28,000 మంది రైతులు సుమారు 34,000 ఎకరాల భూములను త్యాగపూర్వకంగా ఇచ్చారని, అది ధీరోదాత్తమైన రాజధాని అని గుర్తు చేశారు. లిక్కర్ కేసుల్లో ఇరుక్కున్న కవితకు అమరావతిని విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను రైతులకు సహాయంగా అందించిన గొప్ప నాయకుడని, ఆయనపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి ఆధారాలు (సోర్స్) లేకుండా అమిత్ షా, పవన్ కళ్యాణ్‌లపై చేసిన బేస్‌లెస్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాగేశ్వర్ తన తప్పు తెలుసుకుని వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా, కొందరు ఇంకా వివాదాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలోపేతం అవుతుందనే భయంతోనే ఈ ముందస్తు రాజకీయ దాడులు జరుగుతున్నాయని బాలకోటయ్య విశ్లేషించారు. 2004లో రాజశేఖర్ రెడ్డితో, 2009లో చంద్రబాబు నాయుడితో పొత్తులు పెట్టుకున్న చరిత్ర టీఆర్ఎస్‌కు లేదా అని గుర్తు చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది 1,200 మంది సాదాసీదా అమాయక బిడ్డలే తప్ప కేసీఆర్ కుటుంబంలో ఎవరూ ఆత్మబలిదానం చేసుకోలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం ప్రాంతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని ప్రజలు త్వరలోనే తిప్పికొడతారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభ ఖచ్చితంగా జరిగి తీరుతుందని, బెదిరింపులకు జనసేన భయపడదని బాలకోటయ్య స్పష్టం చేశారు.
జనసేన ఎమ్మెల్యే  అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.  రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అరవ శ్రీధర్ ఇటీవల తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.  ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ భేటీ అనంతరం వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా చేశారు.   అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆ కమిటీ అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిందా, ఒక వేళ పూర్తి చేస్తే.. పార్టీ హైకమాండ్ కు ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. అయితే.. అరవ శ్రీధర్ జనసేనానితో భేటీ అనంతరం విఫ్ పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఆమోదం పొందటం జరిగిపోయాయి.   
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా  తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరిట ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. మంగళవారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే, రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండటం, అదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ,  ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పోలీసుల నిర్ణయంతో ఏమాత్రం వెనక్కి తగ్గని జనసేనాని పవన్ కళ్యాణ్, తక్షణమే ప్రత్యామ్నాయ వ్యూహానికి తెరలేపారు. సభకు బ్రేక్ పడినా, తన గళాన్ని వినిపించేందుకు   సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణలో జనసేన భవిష్యత్ యాక్షన్ ప్లాన్, పార్టీ పటిష్టతకు తీసుకోబోయే   కీలక నిర్ణయాలను ఆయన నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్ మీట్ ద్వారా తన పొలిటికల్ ఎజెండాను బలంగా చాటాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు, పోలీసుల నిరాకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీమ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. రేపు మధ్యాహ్నం లోగా కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. కోర్టు తీర్పుపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో యువత టార్గెట్‌గా, దాదాపు 50 శాతం కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, తెలంగాణలోనూ జనసేన సత్తా చాటాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగాల్సిన సభకు బ్రేక్ పడటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి   కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  అనూహ్య పరిణామం సంభవించింది. నిన్న మొన్నటివరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వం కోసం  పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే..  పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు   భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత..  భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు  ఏర్పాటు చేసిన   కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు   గైర్హాజరు  అయ్యారు.  ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని,  ముఠా రాజకీయాలనుబహిర్గతం చేసింది. ముఖ్యంగా మమతా బెనర్జీ వారసుడిగా చలామణి అవుతున్న అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై పార్టీ సీనియర్లలో  ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కంటికి  గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా హుగ్లీలో మరో కీలక నేత కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని దిగ్భ్రాంతికి గురి చేసింది.    తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా బెంగాల్ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.   వీరంతా మమతా బెనర్జీ,  అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..  సరికొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.  ఈ తాజా సంక్షోభంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతుంటే ఆసుపత్రులు కూడా చికిత్స అందించవద్దంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, బెంగాల్‌  ప్రస్తుతం   నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఆరోపించారు.  కాగా 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి గైర్హాజర్ కావడం చూస్తుంటే.. టీఎంసీలో  మమతా బెనర్జీ పట్టు   సడలినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
బుల్లితెర ప్రేక్షకుల‌కు, సోషల్ మీడియా యూజర్లకు కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తనదైన క్లాస్, మాస్ స్టెప్పులతో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  (Dance Master Pandu) విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలను మరియు ఆయన అభిమానులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. (Pandu Master Accident) అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళితే.. డ్యాన్స్ మాస్టర్ పండు మంగళవారం నాడు విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో జరిగిన ఒక స్థానిక జాతర డ్యాన్స్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఈవెంట్ తర్వాత పండు మాస్టర్ తన డ్యాన్స్ బృందంతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వారంతా కారులో వైజాగ్ నుండి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో వారి వాహనం ఆనందపురం సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఒక తోటి డ్యాన్సర్‌కు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడి, వాంతులు అయ్యాయి. దీంతో కారును రోడ్డు పక్కన నిలిపారు. అయితే దురదృష్టవశాత్తూ అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా కోళ్ల లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న వీరి కారును బలంగా ఢీకొట్టింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఈ భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బొలెరో వాహనం వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో జరిగిన ఇంపాక్ట్‌కు కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతని రెండు కాళ్లకు చాలా బలమైన గాయాలు కావడంతో ఆయన కదలలేని స్థితికి చేరుకున్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, తోటి సిబ్బంది.. పండు మాస్టర్‌ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు అత్యవసర వైద్య సేవలను అందించడం ప్రారంభించింది.  ప్రస్తుతానికి ఆసుపత్రి వర్గాల నుండి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పండు మాస్టర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. అయితే కాళ్లకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.  రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో డ్యాన్సర్‌గా ఎంతో భవిష్యత్తు ఉన్న పండు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.  
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit). ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ కల్ట్ కాప్ డ్రామాలో ప్రభాస్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని రెబెల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా భారీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్‌తో షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ పార్ట్‌ను ముగించాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. సందీప్ రెడ్డి పక్కా ప్లానింగ్ మరియు స్క్రిప్ట్ వర్క్‌తో రంగంలోకి దిగడంతో, ఇప్పుడు జరుగుతున్న జెట్ స్పీడ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఆయన అనుకున్న సమయానికే, అంటే ఈ డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 2027 మార్చి 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ లాంగ్ గ్యాప్‌లో పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమా రిలీజ్‌కు ముందే అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించేందుకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధమవుతోంది. రాబోయే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వడానికి సందీప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే కానుకగా 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సందీప్ రెడ్డి మార్క్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ పోలీస్ అవతార్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ రేంజ్ క్రేజ్ మరోసారి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఘనంగా నిరూపితమవుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మోస్ట్ అవేటెడ్ సినిమా జూన్ 4న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే, అంటే జూన్ 3నే ప్రీమియర్ షోల రూపంలో సందడి చేయనుంది. అయితే, సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టడానికి ముందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ప్రారంభించి, ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నార్త్ అమెరికా వ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ ప్రీ-బుకింగ్స్ విండో ఓపెన్ అయినప్పటి నుంచి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికా, కెనడాలోని మెగా అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుండటంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఈ క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే, కేవలం అడ్వాన్స్ ప్రీ-సేల్స్ ద్వారానే నార్త్ అమెరికాలో ఏకంగా 1 మిలియన్ డాలర్ల ($1 Million) గ్రాస్ మార్కును సునాయాసంగా దాటేసింది. రిలీజ్‌కు ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ‘పెద్ది’ సినిమా చేరడం సాధారణ విషయం కాదు. గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత, ప్రీమియర్స్ కలెక్షన్ల పరంగానే రామ్ చరణ్ కెరీర్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న చిత్రంగా ‘పెద్ది’ నిలవడం విశేషం.  సినిమా కథాంశంపై ఉన్న నమ్మకం, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ స్థాయి అంచనాలకు కారణమని సినీ వర్గాలు అంటున్నాయి. నేడు(జూన్ 3) ప్రీమియర్స్ సమయానికి ఈ నంబర్లు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ సినిమా మార్కెట్‌లో ఓవర్సీస్ వసూళ్లు కీలక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో, ప్రీ-సేల్స్ లోనే మిలియన్ డాలర్లు సాధించడం సినిమాపై ఉన్న హైప్‌కు నిదర్శనం. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్డమ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎంతగా పెరిగిందో ఈ ప్రీ-సేల్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది.  వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ క్రేజ్ చూస్తుంటే జూన్ 4న థియేటర్లలోకి వచ్చే సరికి బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎలాంటి సునామీ సృష్టిస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  
'పెద్ది' (PEDDI) సినిమా గ్రాండ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తెలంగాణలో థియేటర్ టికెట్ ధరల గురించిన పూర్తి స్పష్టత లభించింది. ఈ భారీ చిత్రం జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో, చిత్ర నిర్మాణ సంస్థ అయిన వృద్ధి సినిమాస్ చేసిన అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, జూన్ 4 నుండి జూన్ 13 వరకు అంటే మొత్తం 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో 'పెద్ది' సినిమాకు పెంచిన ప్రత్యేక ధరలు వర్తిస్తాయి. ఈ 10 రోజుల కాలంలో రోజుకు గరిష్టంగా ఐదు ప్రదర్శనలు (5 shows per day) వేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  సాధారణంగా పెద్ద సినిమాలకు లభించే ఈ అదనపు షోలు మరియు ధరల పెంపు వసూళ్ల పరంగా సినిమాకు భారీ ఊరటను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రత్యేక ధరలు అమల్లోకి రానున్నాయి. టికెట్ల ధరల పెంపు వివరాల్లోకి వెళితే, సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న ధరలపై అదనంగా 100 రూపాయలు (Rs.100/-) పెంచుకునేందుకు అనుమతి లభించింది. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్ పై అదనంగా 125 రూపాయలు (Rs.125/-) పెంచనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ అదనపు ధరల్లో జీఎస్టీ కూడా కలిసి ఉంటుందని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రేక్షకుడి జేబుకు కొద్దిగా భారం పడినప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా వీకెండ్స్ లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా జూన్ 3 రాత్రి 8:00 గంటలకు ప్లాన్ చేసిన ప్రత్యేక ప్రీమియర్ షో ధర అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా విడుదల కంటే ఒకరోజు ముందే ప్రదర్శించే ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 600 రూపాయలుగా (Rs. 600/-) ఖరారు చేశారు. ఈ ప్రీమియర్ షో ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టికెట్ ధరల పెంపుతో పాటు ప్రభుత్వం ఒక కీలకమైన సామాజిక బాధ్యతను కూడా ఈ ఉత్తర్వుల్లో చేర్చింది. థియేటర్ల యాజమాన్యాలు ఈ పెంచిన ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయం నుండి 20 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఖాతాకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. సినీ పరిశ్రమలో రాత్రింబగళ్లు కష్టపడే పేద కార్మికుల సంక్షేమానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. దీనితో పాటు థియేటర్లలో మాదకద్రవ్యాల (Narcotics, Drugs) దుష్ప్రభావాలు మరియు సైబర్ నేరాలపై (Cybercrime) అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలన్నీ థియేటర్లు కచ్చితంగా పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇది విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే 1985 నాటి ఫిక్షనల్ కథ. కుస్తీ (రెజ్లింగ్) నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం రామ్ చరణ్ దాదాపు 4 నెలల పాటు పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు. 'దంగల్' ట్రైనర్‌తో పాటు తెలంగాణ పహల్వాన్లను కూడా ఇందులో భాగం చేశాం. ఈ చిత్రంలో చరణ్ గారి పెర్ఫార్మెన్స్, మేకోవర్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. సినిమా జర్నీని మూడు దశలుగా విభజించి, ఏఐ (AI) ద్వారా డిజైన్ చేసిన లుక్స్ కంటే ఆయన అద్భుతంగా మారారు. షూటింగ్‌లో ఆయనకు గాయాలైనా లెక్కచేయకుండా నటించారు. శివరాజ్ కుమార్ గారు ఆటను బ్రతికించే గురువుగా, జగపతిబాబు గారు పవర్‌ఫుల్ 'అప్పలసూరి' పాత్రలో కనిపిస్తారు. జాన్వి కపూర్ తన నటనతో లవ్ ట్రాక్‌కు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. రెహమాన్ గారితో పనిచేయడం నా లైఫ్ టైమ్ డ్రీమ్. ఆయన ఇచ్చిన 'మస్సా మస్సా' సాంగ్ చరణ్ గారికి నచ్చేసింది. అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యం అందించారు. నా మొదటి సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే, 'పెద్ది' బడ్జెట్ 350 కోట్లు. ఈ స్థాయి కేవలం రామ్‌చరణ్ గారి వల్లే సాధ్యమైంది. 'పెద్ది' కేవలం ఒక కమర్షియల్ లేదా స్పోర్ట్స్ సినిమా మాత్రమే కాదు, ఇందులో 15 నిమిషాల భారీ ఎమోషనల్ బ్లాక్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లలో చరణ్ కనిపించడు, కేవలం 'పెద్ది' మాత్రమే కనిపిస్తాడని, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగ్గ అద్భుతమైన చిత్రమిదని ఆయన ముగించారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబీకులు నటించిన సినిమాలకు రిలీజ్ సమయంలో ఏదోరకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీష్ లు ప్రయత్నిస్తున్నారని, 'మన శంకర వరప్రసాద్' రిలీజ్ సమయంలో కూడా విశాఖపట్నం ఏరియాలో ఆ సినిమాను ఆపాలని వారు కుట్రలు పన్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నట్టి కుమార్ మాట్లాడుతూ, విశాఖపట్నంకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్)ను అడ్డం పెట్టుకుని, దిల్ రాజు, శిరీష్‌లు ఆ మధ్య చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్' చిత్రాన్ని విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో రిలీజ్ కాకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. అందుకు సంబంధించి శిరీష్, బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) మధ్య జరిగిన ఆడియో సంభాషణను కూడా ఈరోజు బయటపెట్టడం జరిగింది. 'మన శంకర వరప్రసాద్' చిత్రం విశాఖపట్నం ఏరియాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తమకు గుడ్ విల్ ఇస్తానని చెబితే...  నేను, మురళీకృష్ణ వంటి కొందరం సిండికేట్ గా రూ.5 కోట్ల 75 లక్షల రూపాయల అమౌంట్‌ను బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్)కు ఇచ్చాం. అంతకుముందు బాలకృష్ణ అఖండ-2 సినిమాకు కూడా మేము వైజాగ్ సతీష్‌కు డబ్బులు ఇచ్చాం. ఆ డబ్బులు కూడా మాకు తిరిగి కట్టలేదు. ఇక 'మన శంకర వరప్రసాద్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ.15 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, కేవలం రూ 3 కోట్ల 23 లక్షల రూపాయలు మాత్రమే నిర్మాతలకు చెల్లించి, మిగతా అమౌంట్ కట్టకుండా ఆ సినిమా రిలీజ్ కు ముందు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) చేతులెత్తేశాడు. కావాలంటే మీరు రిలీజ్ చేసుకోండి అని సతీష్ ఉన్నట్లుండి తప్పించుకున్నాడు. అప్పట్లో 11 వ తేదీ సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది.  మరోవైపు 8వ తేదీ నుంచి హాలిడేస్ ఉన్నాయి. విశాఖపట్నం ఏరియాకు  'మన శంకర వరప్రసాద్' సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతుందన్న ఉద్దేశ్యంతో నేను, మురళీకృష్ణ కలసి అమౌంట్ రిస్క్ చేసి, అన్నపూర్ణా స్టూడియో వారి ద్వారా సినిమా ఆగకుండా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శిరీష్, వైజాగ్ సతీష్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో ను కూడా నేను బయట పెడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఆపడానికి దిల్ రాజు, శిరీష్, వైజాగ్ సతీష్ ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఇంతకంటే అధరాలు ఇంకేమి కావాలి. ఇటీవల పెద్ది సినిమా విషయంలో కూడా తెలంగాణలో వివాదం చెలరేగడం వెనుక కూడా దిల్ రాజు హస్తం ఉంది. అసలు మెగాస్టార్ కుటుంబీకుల సినిమాల రిలీజ్ సమయంలో ఏదోవిధంగా వివాదాలను తెరపైకి తీసుకుని వచ్చి, వారి సినిమాలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోనే కాదు వైజాగ్, ఉత్తరాంధ్ర‌లో కూడా దిల్ రాజు, శిరీష్ లు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని, శాసించాలని చూస్తున్నారు. కానీ వారి ఆటలు సాగనివ్వం. వైజాగ్ సతీష్ తమకు డబ్బు చెల్లించాల్సింది పోయి...తమ మీదే వైజాగ్ పోలీస్ స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి, లోపల వేయించేస్తాను అని బెదిరింపులకు పూనుకుంటున్నాడు.  స్పందన నోటీసుకు ఆ తేదీన మేము తప్పకుండా హాజరై, వాస్తవాలను ఆధారాలతో సహా బయట పెడతాం. చట్టాలకు, న్యాయ విషయాలకు అతీతంగా స్పందన చర్యలు చేపడుతుందని సతీష్ భ్రమపడుతున్నాడు. అతనేదో మంచిగా వ్యాపారం చేసుకుంటాడన్న ఉద్దేశ్యంతో తాము డబ్బులు ఇవ్వడమే కాకుండా కొందరు వేరే వాళ్ల చేత కూడా నేను అతనికి డబ్బులు ఇప్పించాను. వానపాములు, ఇంకా వేరే వ్యాపారాల పేర్లు చెప్పి, ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా, జవాబు చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దాదాపు 28 కోట్ల రూపాయలు సతీష్ అందరికీ బాకీలు చేసి, చెల్లించాల్సి ఉంది. అతను బ్లాక్ మెయిలర్ అని తెలియక డబ్బులు ఇచ్చి, ఇంకా ఎందరో మోసపోకుండా అతని బండారం బయట పెట్టేందుకు, దిల్ రాజు, శిరీష్ లు మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటున్న విషయాలను చెప్పేందుకే  ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాను అని నట్టి కుమార్ స్పష్టం చేశారు.
నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న దండయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య, తన అభిమానులకు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం #NBK111. సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే వింటేజ్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆశిస్తారు. కానీ, ఈసారి రూట్ మార్చారు. మీరు ఇప్పటివరకు చూడని, ఊహించని ఒక సరికొత్త 'న్యూ ఏజ్' అవతారంలో బాలయ్య అలరించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. "మీరు గుర్తుపెట్టుకున్న #NBK ఇది కాదు.. మీరు అస్సలు ఊహించని NBK రాబోతున్నారు. ఇకపై వింటేజ్ లేదు.. ఓన్లీ న్యూ ఏజ్" అంటూ మేకర్స్ వదిలిన హింట్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఒక అగ్నిపర్వతం బద్దలు కాబోతోందంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే, బాలకృష్ణను మునుపెన్నడూ లేని విధంగా ఒక అల్ట్రా మోడరన్ లేదా సరికొత్త రస్టిక్ యాక్షన్ రోల్‌లో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. నందమూరి అభిమానులు కాలెండర్‌లో మార్క్ చేసి పెట్టుకోవాల్సిన తేదీ వచ్చేసింది. జూన్ 10న ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్‌ను విడుదల చేయబోతున్నారు. బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ అప్‌డేట్ రానుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బహుశా ఈ రోజే సినిమా టైటిల్ లేదా ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక టాలెంటెడ్ టీమ్ ఉంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నారు. బాలయ్య-మనోజ్ కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందో చూడాలనే కుతూహలం అందరిలోనూ ఉంది. వెంకట శీలారు ప్రొడక్షన్‌లో, వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. దీనికి అరవింద్ కశ్యప్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు. బాలయ్య పాత రికార్డులను తిరగరాసేలా, ఈ ‘న్యూ ఏజ్’ యాక్షన్ డ్రామా టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Ram Charan is starring in the upcoming highly anticipated sports drama Peddi, directed by Buchi Babu Sana, which is scheduled for a grand theatrical release on June 4. Returning five years after his debut film Uppena, the director clarified that the script was written exclusively for Ram Charan, dismissing rumors that it was originally meant for Jr NTR. Bankrolled by Vriddhi Cinemas and presented by Mythri Movie Makers and Sukumar Writings, the film is made on a massive budget of Rs 350 crores. The movie features a strong ensemble cast alongside Ram Charan. Janhvi Kapoor plays the female lead, bringing a fresh dynamic to the romantic track. The supporting cast includes Kannada superstar Shiva Rajkumar in the role of a mentor, Jagapathi Babu playing a powerful character named Appalasuri, and Divyendu Sharma in a crucial role. Art director Avinash has authentically recreated a 1985 Vizianagaram backdrop for the story. To prepare for the raw wrestling sequences, Ram Charan trained for three to four months alongside local Telangana wrestlers and the coach from Dangal. During an action scene, the actor suffered a bleeding eye injury. While Buchi Babu feared Chiranjeevi's reaction to the mishap, the veteran actor instead laughed and asked for a video of the incident. Additionally, Chiranjeevi's wife, Surekha, became highly emotional after watching a specific sequence from the film. The protagonist's journey spans three distinct phases, with the looks initially designed using AI. Featuring music by AR Rahman, the director admitted to hiding the song Massa Massa for two months while seeking alternatives, but Ram Charan accidentally heard it in his car and finalized it. Additionally, a crucial 15-minute emotional block has been intentionally kept out of the promotional trailers to preserve the theatrical experience. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nandamuri Balakrishna is currently busy shooting for his upcoming film, tentatively titled NBK111. Directed by Gopichand Malineni and produced by Vriddhi Cinemas, the film is gearing up for a special announcement on June 10 to mark the actor’s birthday. The makers recently released a pre-look poster that offered the first glimpse into the film’s tone. Carrying the tagline, “No More Vintage, Only New Age,” the poster features a dark visual design with elements like a heavy metal chain and bullets. While it does not reveal much about the story, it hints at a more contemporary action setting compared to what audiences may usually associate with Balakrishna’s on-screen image. Meanwhile, production is progressing at a steady pace. The team is currently shooting important portions in Mumbai as part of an extended schedule. The film has huge generated curiosity with the confirmation of Manchu Manoj playing a powerful antagonist role in the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలోని శంకర్ పల్లి ఏరియాలోని కోడి చెరువుకి చెందిన పది ఎకరాల భూముల్ని ఆక్రమించాడనే వార్తలు గత కొంత కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ మాట్లాడుతు రాజకీయ లబ్ధి కోసం కొందరు పనిగట్టుకుని నాపై  బురద జల్లుతున్నారు. ఇలాంటి ఆరోపణలు నాకు కొత్తేమీ కాదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు, దాడులని  ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాం. నేను కోడి చెరువుని ఆక్రమించుకున్నట్లు కనుక నిరూపిస్తే, ఆ మరుక్షణమే ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ మట్టితో తనకు ఉన్న అనుబంధం కేవలం రాజకీయాల కోసం పుట్టుకొచ్చింది కాదు. కొందరు విమర్శకులు తెలంగాణలో జనసేన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అనే విషయాన్ని మరువరాదు. ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచన రాకముందే తాను ఈ నేల నుంచి పోరాట స్ఫూర్తిని పొందానని, తన సినిమాల్లో సైతం ఆ తెలంగాణ జెండా, స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తాయని  చెప్పుకొచ్చాడు. Also read: Raghava lawrence: లారెన్స్ కుమార్తె రాఘవి సంచలన నిర్ణయం.. లారెన్స్ వెనక్కి తగ్గాల్సిందేనా!  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు  ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే   జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది  విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు  తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది?  వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.   ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది.  విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.  ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను  బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.   సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది.                             *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.
  మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది.   మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా?  సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా?   సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి?  సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం.  కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166   మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!  మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!