Home

»

Latest News

రామ్‌చరణ్ 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ ఎమోషనల్ రైడ్ : ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా 

Jun 2, 2026 7:58PM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఇది విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే 1985 నాటి ఫిక్షనల్ కథ. కుస్తీ (రెజ్లింగ్) నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం రామ్ చరణ్ దాదాపు 4 నెలల పాటు పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు. 'దంగల్' ట్రైనర్‌తో పాటు తెలంగాణ పహల్వాన్లను కూడా ఇందులో భాగం చేశాం.

ఈ చిత్రంలో చరణ్ గారి పెర్ఫార్మెన్స్, మేకోవర్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. సినిమా జర్నీని మూడు దశలుగా విభజించి, ఏఐ (AI) ద్వారా డిజైన్ చేసిన లుక్స్ కంటే ఆయన అద్భుతంగా మారారు. షూటింగ్‌లో ఆయనకు గాయాలైనా లెక్కచేయకుండా నటించారు.

శివరాజ్ కుమార్ గారు ఆటను బ్రతికించే గురువుగా, జగపతిబాబు గారు పవర్‌ఫుల్ 'అప్పలసూరి' పాత్రలో కనిపిస్తారు. జాన్వి కపూర్ తన నటనతో లవ్ ట్రాక్‌కు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు.

రెహమాన్ గారితో పనిచేయడం నా లైఫ్ టైమ్ డ్రీమ్. ఆయన ఇచ్చిన 'మస్సా మస్సా' సాంగ్ చరణ్ గారికి నచ్చేసింది. అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యం అందించారు. నా మొదటి సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే, 'పెద్ది' బడ్జెట్ 350 కోట్లు. ఈ స్థాయి కేవలం రామ్‌చరణ్ గారి వల్లే సాధ్యమైంది.

'పెద్ది' కేవలం ఒక కమర్షియల్ లేదా స్పోర్ట్స్ సినిమా మాత్రమే కాదు, ఇందులో 15 నిమిషాల భారీ ఎమోషనల్ బ్లాక్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లలో చరణ్ కనిపించడు, కేవలం 'పెద్ది' మాత్రమే కనిపిస్తాడని, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగ్గ అద్భుతమైన చిత్రమిదని ఆయన ముగించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com