LATEST NEWS
రేవంత్ తన కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడంపై తొలి సారిగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మిత మీడియా ముందు భోరు మన్నారు. తన తల్లి మంత్రి పదవి పోవడానికి తానే కారణమంటో విలపించారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా   కొండా సురేఖ కుటుంబం తీరు ఉందనిఎద్దేవా చేస్తున్నారు.   కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి  విధానాలపై కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మీత   విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సవాల్ విసిరారు. ఆమె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు.  దీనిపై కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని, కానీ  న తల్లిని టార్గెట్ చేయడం   బాధాకరమని సుస్మిత మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.  అయితే కిందపడ్డా నాదే పై చేయి అన్నచందంగా.. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాని చెప్పుకొచ్చారు. వాస్తవానికి సుశ్మీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ కనీసం ఖండిచకపోవడాన్ని మాత్రం సుశ్మీత ఈ సందర్భంగా విస్మరించారు. ఇక పోతే కొండా సుశ్మిత వ్యాఖ్యలు పార్టీని బహిరంగంగా సవాల్ చేశాయనీ, పార్టీలో అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా.. బహిరంగంగా నాయకత్వాన్ని సవాల్ చేయడమే కొండా సురేఖపై వేటుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అటువంటి సుశ్మిత తన తల్లిపై చర్య తీసుకోవడం దారుణమంటూ ఇప్పుడు విలపించి ప్రయోజనం లేదని అంటున్నారు.      [Konda Susmitha Tears Bedore Media, Konda Surekha, Revanth Reddy, Telangana Congress, Cabinet dismissal, Telugu One]
రాష్ట్రం ఏదైనా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలూ, అసమ్మతి, అసంతృప్తి రాగాలూ సహజమే. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ సీఎంలు అసమ్మతి, అసంతృప్తి నేతలను నియంత్రించడంలో ఇబ్బందులు పడటం రివాజే అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ తీరు ఇదే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యమంత్రులు పార్టీ అంతర్గత వర్గపోరును అదుపు చేయడానికి నానా తంటాలు పడ్డారు. కొండొకచో  సీఎం పీఠం నుంచి తప్పుకోవలసిన పరిస్థితులూ ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ విభజించు పాలించు విధానాన్ని అనుసరించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుండటం కూడా కద్దు. అంటే పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.  దీనివల్ల ముఖ్యమంత్రి పరిధికి మించి కూడా చాలా మంది సీనియర్ నాయకులకు పార్టీ వ్యవహారాల్లో సమానమైన పట్టు లభిస్తుంది. అయితే.. దీనికి  తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత మినహాయింపుగా కనిపిస్తున్నారు. ఆయన అసమ్మతీయులను, తన వ్యతిరేకులను సమర్ధంగా అదుపు చేయగలుగుతున్నారు.  గత కొన్ని నెలలుగా.. కొండా సురేఖ,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి   సవాళ్లను ఎదుర్కొన్నారు. చిన్నారెడ్డి వంటి మరికొందరు నాయకులు కూడా అసమ్మతి గళం వినిపించారు. ఈ ముగ్గురి విషయంలో రేవంత్ వ్యూహాత్యకంగా వ్యవహరించారు.   ఢిల్లీలో పార్టీ పెద్దలను ఒప్పించి.. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారు. ఇది అసమ్మతిని గళం ఎత్తుతున్న ఇతర నేతలు వెనక్కుతగ్గడానికి దోహదం చేసింది. అంతే కాకుండా ఒక్క కొండా సురేఖ బర్త్ రఫ్ తో హైకమాండ్ వద్ద తన మాటకే చెల్లుబాటు ఉందని పార్టీ నేతలకు, శ్రేణులకు రేవంత్ చాటారు.  దీంతో ఇప్పటి వరకూ సమయం, సందర్భంతో సంబంధం లేకుండా విమర్శల గళమెత్తి సీఎంను లక్ష్యం చేసుకుంటూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక్కు తగ్గారు. సీఎంతో విభేదాలు లేవని చాటుకోవడానికి శతధా ప్రయత్నించడం ఆరంభించారు. ఇందుకు తార్కానంగా తాజాగా ఒక బహిరంగ వేదికపై ఆయన రేవంత్ పక్కన కూర్చుని ఆయనతో ముచ్చటించి.. తాను రేవంత్ కు వ్యతిరేకంగా కాదని చాటుకున్నారు. కొండా సురేఖ ఎపిసోడ్ వరకూ రేవంత్ కు తాను బద్ధ వ్యతిరేకినన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన కోమటి రెడ్డి ఇప్పుడు రేవంత్ తో సఖ్యత పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.  ఇదొక్కటే కాదు..కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన చెప్పిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో వాతావరణం రేవంత్ కు అనుకూలంగా మారిందన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.   దీంతో ఇక అసమ్మతి రాగాల బెడద ఇప్పటిలో రేవంత్ కు ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క కొండా సురేఖ బర్త్ రఫ్ తో అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై రేవంత్ తన పట్టు చాటుకున్నారని అంటున్నారు.  [Revanth reddy Upper Hand In Congress Internal Rift, konda surekha, komatireddy rajagopal reddy, telangana congress, revanth effect, congress politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కూటమి రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై బీజేపీ  సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పలు  అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పార్టీ విధానాలు, అలాగే ఇతర పార్టీలతో ఉన్న సంబంధాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూటమి   సమష్టి కృషితో ముందుకు సాగుతోందని చెబుతూనే.. క్షేత్రస్థాయిలో విభేదాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.  వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.  త్వరలో జరగనున్న  స్థానిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, సర్దుబాటు అంశాలపై  మూడు పార్టీల అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న విష్ణు వర్ధన్ రెడ్డి..   భాగస్వామ్య పార్టీలన్నీ సమన్వయ కమిటీల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటాయని వెల్లడించారు.   కూటమి ధర్మం ముందు వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశమే లేదన్న ఆయన మిత్రధర్మాన్ని కూటమి పార్టీలన్నీ పాటిస్తాయన్నారు.   ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.  గతంలో పార్లమెంటరీ వేదికలపై అంశాలవారీగా కొన్ని సందర్భాల్లో వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపితే తెలిపి ఉండొచ్చు కానీ అంత మాత్రానికే ఆ పార్టీని బీజేపీ బీటీమ్ అనడం సరికాదని చెప్పారు.   త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో పోటీ చేసి   విజయం సాధించాలని మూడు పార్టీల శ్రేణులు పట్టుదలతో ఉన్నాయన్న విష్ణువర్ధన్ రెడ్డి.. క్షేత్రస్థాయిలో ఉన్న స్వల్ప విభేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు.   [Differences in Allience Dact, Vishnuvardhan Reddy, BJP AP Alliance, TDP Janasena BJP, AP Local Body Elections, Andhra Pradesh Politics]
ఆంధ్రప్రదేశ్‌లో  సాగునీటి రంగం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల,  ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి రాష్ట్ర రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. వైసీపీ  అధినేత జగన్ పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టులపై ఇటీవల చేసిన ట్వీట్లు, విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై  తెలుగుదేశం అధికార ప్రతినిథి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.  గత వైసీపీ  ప్రభుత్వ హయాంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అప్పసాని రాజేష్ వివరించారు. కాలువ నిర్మాణంలో అత్యంత కీలకమైన సివిల్ వర్క్స్, అక్విడెక్ట్‌లు, కల్వర్టులు పూర్తి చేయడంలో గత పాలకులు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ గత ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉంటే, నేడు పురుషోత్తపట్నం నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అయన చెప్పారు. ప్రస్తుతం ఎల్లినో పరిస్థితులు, వర్షాభావ వాతావరణం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం వరద జలాలను సమర్థవంతంగా ఒడిసిపట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు అందిస్తోందన్నారు. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయని పేర్కొన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని, కానీ ఆనాటి ఆ నిర్ణయమే నేడు కృష్ణా డెల్టాను కాపాడిందని గుర్తుచేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.  ఇక వైఎస్ హయాంలో జలయజ్ణం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అప్పసారి రాజేష్ ఖండించారు. వైఎస్ హయాంలో కేవలం మట్టిపనులు పూర్తి చేసి డబ్బులు దండుకుని చేసింది జలయజ్ణం కాదు, ధనయజ్ణమని విమర్శించారు.  [Polavaram Left Canal, Veligonda, Polavaram Left Canal, Chandrababu Naidu Irrigation,  Jagan Credit Chori, Purushothapatnam lift irrigation, AP Politics News, Telugu One]
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరుసగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, నీటి విడుదల జరుగుతోంది. అంటే ఏ ప్రాంతానికి నీరు అందని పరిస్థితి ఉందో ఆ ప్రాంతానికి నీటిని అందించే కార్యక్రమం ఏపీలో మొదలవ్వడమే కాదు అది సాకారమయ్యే పరిస్థితి కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా వైసీపీ ఆ క్రెడిట్ అంతా తమదేనని బాకాలూదుతోంది. క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నా వైసీపీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ విశ్లేషకుడు విక్రమ్ పూల వాస్తవాలను కళ్లకు కట్టారు.  రాష్ట్రంలో ఇరిగేషన్ పురోగతి వైఎస్ జలయజ్ణంతో మొదలైందనీ, ఆయన తరువాత చేసింది తామేనని చెప్పుకుంటూ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విక్రమ్ పోలా అసలు జలయజ్ణం కథ ఇదీ అంటూ ఆయన..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో  జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో భారీ మరియు మధ్యతరహా ప్రాజెక్టులతో కూడిన సుమారు 26 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ సమయంలో రాష్ట్ర బడ్జెట్ పరిమితులకు మించి ప్రాజెక్టులు చేపట్టడం, భారీగా రుణాలు సేకరించడం జరిగిందని చెప్పారు.  ఈ ప్రాజెక్టుల అమలులో భాగంగా కాంట్రాక్టర్ల ఎంపికలో ఈపీఎస్  విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, అనుమతులు రాకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం వంటి పరిణామాలు వివాదాస్పదమన్నారు. జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.  ఇక రాష్ట్ర విభజన తర్వాత  నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా చంద్రబాబు పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత..  సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టారు. ఆయన  హయాంలో నిధుల కేటాయింపు,  పట్టిసీమ వంటి అనుసంధాన ప్రాజెక్టుల పూర్తి ద్వారా  సాగు, తాగునీరు అందించడంలో పురోగతి సాధించింది.  ఏది ఏమైనా రాజకీయ శంకుస్థాపనలు కాదు.. వాటి ఫలితాలను ప్రజలకు ఎవరైతే అందించారో వారికే క్రెడిట్ దక్కుతుందని విక్రమ్ పూల అన్నారు. జగన్ చేస్తున్నది క్రెడిట్ చోరీ ప్రయత్నమే తప్ప చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.   [What Happened Actually In Jalayagnam, YSR Irrigation Projects, AP Politics, Telugu One, Polavaram Project, Jagan Credit Chori]
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినీ డాన్స్ కొరియోగ్రఫీ రంగానికి చెందిన ప్రముఖ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొద్దిరోజులుగా నడుస్తున్న వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమయానికి గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుగొట్టి ఆమెను కాపాడటంతో తృప్తిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కొరియోగ్రాఫర్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి ఇన్ని రోజులవుతున్నా పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అరెస్ట్ చేయకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మనస్తాపంతోనే ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు మాధురిని రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈశ్వర్ సాయిపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో నార్సింగి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు పొందే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత వివాదాలకు దారితీసింది. గతంలో కూడా పలువురు డ్యాన్సర్లు, ఆర్టిస్టులు ఎదుర్కొన్న ఇటువంటి ఘటనలపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే మాధురి ఈ రీతిలో స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో సినీ వర్గాలు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. బాధితురాలి ఆరోపణలపై నార్సింగి పోలీసులు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.     [Dancer Madhuri Rathod, Ishwar Sai, Madhuri Rathod Suicide Attempt, Narsingi Police Station, Telugu Cinema Gossip]
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్  పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. రియల్ ఇన్సిడెంట్స్‌పై తీశారు. చాలా రూటెడ్‌గా ఉంది. తెలంగాణ మైసాపురం బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. డెఫినెట్‌గా జనాలకి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్రశాంత్ విహారి పాటలు చాలా బాగున్నాయి. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే డీఓపీ ప్రశాంత్ వర్క్ చాలా బాగుంది. ఈ సినిమా నిర్మాతలు మయూర్  కుశాల్‌కి మంచి సక్సెస్, మంచి పేరు, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్లు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. దీపా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడారు. వికాస్ అందులో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. నాగరాజుకి  ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం, అది మాధవ్‌తో చేయడం చాలా బాగుంది. తమ్ముడు మాధవ్ బాగున్నాడు.(నవ్వుతూ) తన ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమా చూస్తారని, యంగ్ టాలెంట్‌ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జై సినిమా.  హీరో మాధవ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత బాగా నచ్చిందో సినిమా కూడా అంతే బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మీ అందరికీ పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక మనిషికి దున్నపోతు ఉన్నా హ్యూమన్ ఎమోషన్ చూస్తారు. డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే మా నిర్మాతలు మయూర్, కుశాల్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. దీప అద్భుతంగా నటించింది. వికాస్ విలన్ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. అలాగే ప్రశాంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం. జై మారెమ్మ.  డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మాధవ్ రవితేజ గారిని అనుసరిస్తూ సినిమా ప్రయాణం మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే చాలా రూటెడ్ కంటెంట్ తీసుకున్నారు. ఈ కంటెంట్ చూస్తుంటే నాకు ‘జల్లికట్టు’ సినిమా గుర్తొచ్చింది. చాలా నేచురల్‌గా ఈ కంటెంట్ ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  హీరోయిన్ దీప బాలు మాట్లాడుతూ.. “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవితేజ గారికి చాలా థాంక్యూ.ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ ఎంతో క్రమశిక్షణతో అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. తనకు చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది . యాక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. రవితేజ గారి సినిమాలో నేనింతే నాకు చాలా పర్సనల్‌గా కరెక్టే సినిమా. ఎందుకంటే నాకు కూడా సినిమా తప్పితే ఇంకేమీ తెలియదు. మాకు స్ఫూర్తినిచ్చిన రవితేజ గారికి థాంక్యూ. మాధవ్  అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా మనసుల్ని తాకుతుంది.  డైరెక్టర్ మంచాల నాగరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’ జాతర మొదలు కాబోతుంది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. 2006 టైమ్‌లైన్‌లో జరిగే స్టోరీ ఇది. అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన రవితేజ గారికి థాంక్యూ. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం.  నిర్మాత మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “రవితేజ గారికి వెల్‌కమ్. ‘ఇరుముడి’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రవితేజ గారికి కంగ్రాజులేషన్స్. దర్శకుడు ‘మారెమ్మ’ కథ చెప్పినప్పుడు మా ఊరి కథ అనిపించింది. మా ప్రొడక్షన్ టీమ్‌కి థాంక్యూ. అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ‘మారి’ పాత్రలో మాధవ్ గారు చాలా అద్భుతంగా నటించారు. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూసి సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నాకు చాలా నమ్మకం ఉంది”    మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం కల్పించిన దర్శకుడికి, అలాగే మా నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ గారు ఈ సినిమాలో ‘మారి’ పాత్రలో అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది”  మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. “ఈ సినిమాకి కావాల్సిన ఎనర్జీ మొత్తం అమ్మవారే ఇచ్చారు. మాధవ్ గారు తన తొలి చిత్రానికే ఎంతో అద్భుతమైన సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వద్దకు వెళుతుంది. అంత మంచి కంటెంట్. తప్పకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాను”  డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. మా నిర్మాతలకు, దర్శకుడికి ధన్యవాదాలు. చాలా అద్భుతమైన ప్రాజెక్టులో ఎంచుకున్నారు. మాధవ్ గారి కటౌట్ స్క్రీన్ మీద అదిరిపోతుంది. మా కెమెరా డిపార్ట్‌మెంట్‌కి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘ మండాడి ’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బోట్ రేసింగ్, యాక్షన్, ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘మండాడి’ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా శివ నిర్వాణ స్పెషల్ గెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *హీరో సుహాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడి దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు టీచర్స్ డే, నా టీచర్స్ అంతా నా ముందే ఉన్నారు. మీ అందరి సపోర్ట్ తో ఎన్నో ఫేజెస్ దాటుకుంటూ మందాడి వరకు వచ్చా. చిత్రయూనిట్ అందరి సపోర్ట్ వల్లనే సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాము. హీరోయిన్ మహిమ, రవీంద్ర విజయ్, సూరి నటన ఈ సినిమాకు మెయిన్ అసెట్స్. సెప్టెంబర్ 10 న ఓ వినూత్న కంటెంట్ థియేటర్స్ లో చూడటానికి సిద్ధంగా ఉండండి అన్నారు. యాక్టర్ సూరి మాట్లాడుతూ.. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈ సారికి వదిలేయండి, వచ్చే సారి ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతా. మండాడి సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సుహాస్ తో కాళీ పని చేయడం చాలా సంతోషంగా అంది అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. భాస్కర్ భట్ల మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నాకు పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గారికి స్పెషల్ థాంక్స్. ఏష నాగుల గట్ట మీద సాంగ్ బిగ్గెస్ట్ హిట్ చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.   యాక్టర్ రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఒక సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరం చాలా కష్ట పడ్డాము. ఇలాంటి ఒక కథ ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవం. ఇప్పటివరకు చూడని ఎన్నో సీన్స్ ఈ ఇంటెన్స్ స్పోర్ట్ యాక్షన్ డ్రామా చూసి ఉండరు. సముద్రంలో ఎంతో చాలెంజింగ్ గా ఈ సినిమా షూట్ చేశారు. ఈ సినిమా కోసం సూరి, సుహాస్ ఎంతో నిబద్దతతో పని చేశారు. ఇది ఎమోషనల్ ప్యాక్ యాక్షన్ డ్రామా. ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా ఇది అన్నారు.  హీరోయిన్ మహిమా నంబియార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మందాడి నాకు చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా యూనిట్ మొత్తానికి స్పెషల్ థాంక్స్. హీరో సుహాస్ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. రవీంద్ర విజయ్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సూరి సార్ మీరు నాకు ఇన్స్పిరేషన్. ఈ సినిమా చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా అన్నారు.   డైరెక్టర్ మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాతలకు, నటీనటులకు అందరికీ థాంక్స్. సూరి, సుహాస్ లేకుండా అస్సలు ఈ సినిమానే లేదు. ఈ బోట్ రేస్ అనేది తమిళనాడు లో ట్రెండ్. ఈ సినిమా కోసం ఎంతో కంమిట్మెంట్ తో పని చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రూపొందించాం. ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పంచుతుందని నమ్ముతున్నా అన్నారు.  ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రొడ్యూసర్ ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మైత్రి నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. ఒకరోజు నవీన్ సార్ స్వయంగా కాల్ చేసి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్న చేస్తా అన్నారు. ఈ సినిమా కోసం చాలా డబ్బు వెచ్చించాము. మా సినిమా ఓటీటీ డీల్ లో నవీన్ గారి సహకారం గొప్పది అన్నారు. హీరో హీరోయిన్లతో పాటు నటీనటులు అంతా బాగా కష్టపడి ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారు అని తెలిపారు.   మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ.. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నా. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు.      హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ఒక మూవీ పేరు వినగానే సినిమాకు వెళ్ళాలి అనిపించే సినిమా ఇది. సూరి, సుహాస్ నడుమ ఓ బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేశారు. సముద్రంలో సినిమా తీయడం అనేది పెద్ద ఛాలెంజ్. పడవ షాట్ తీయడంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాంటిది సినిమా మొత్తం సముద్రంలో తీశారంటే రియల్లీ హ్యాట్సాఫ్ అన్నారు. మరో అతిధి,   డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం చాలా గర్వంగా ఉంది. సూరి గారు మీరు డౌన్ టు ఎర్త్. ఈ సినిమా తరిలేరు చూసి ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుండనై ఫిక్స్ అయ్యా. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారు. థియేటర్స్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మందాడి సినిమాకు ఎన్నో అవార్డ్స్ వస్తాయని నమ్మనుతున్నా అన్నారు.
మలయాళ చిత్రసీమలో తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో వెండితెరకు పరిచయమైన నటి విస్మయ మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన తొలి చిత్రం 'తుడక్కం'లో డిఫరెంట్ యాక్షన్ అండ్ సర్వైవల్ రోల్‌తో అలరించారు. ఆగస్టులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ జుడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తుడక్కం' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగించుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 18 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో విస్మయ మోహన్‌లాల్ 'మీను' అనే ఒక మార్షల్ ఆర్ట్స్ శిక్షకురాలి పాత్రలో కనిపించారు. ఒక సైకో క్రిమినల్ వేధింపులకు గురైన తర్వాత ఒక సాధారణ యువతి తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో ఎలా పోరాడింది అనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. విస్మయ నటన, ప్రత్యేకించి రియలిస్టిక్ స్టంట్ సీన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. విస్మయకి జోడీగా విలన్ పాత్రలో నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ కూడా నటుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం విశేషం. కథలో అత్యంత కీలకమైన సమయంలో తన కుమార్తె పాత్రకు స్పూర్తినిచ్చే మార్షల్ ఆర్ట్స్ గురువుగా ఆయన కనిపించి అభిమానులను అలరించారు. సాయికుమార్, మనోజ్ కే జయన్, బాబీ కురియన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో గ్రాండ్ రన్ సాధించిన 'తుడక్కం' మూవీని మిస్ అయిన మూవీ లవర్స్, విస్మయ మోహన్‌లాల్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే వారు సెప్టెంబర్ 18 నుండి జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. మలయాళంతో పాటు మిగిలిన ప్రాంతీయ భాషల ఆడియెన్స్ నుండి కూడా ఈ ఓటీటీ రిలీజ్ పై మంచి స్పందన వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.     [Thudakkam OTT Release Date, Vismaya Mohanlal, Mohanlal Daughter Movie, JioHotstar OTT Release, Malayalam OTT Movies]
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణపై మళ్లీ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాల్లో కథా అవసరం లేకుండా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే మహిళా నటులను ప్రదర్శించడంపై యంగ్ అండ్ హాట్ బ్యూటీ కాయదు లోహర్ తాజాగా స్పందించారు. సినిమాల్లో ఉద్దేశపూర్వకంగా నటీమణులను గ్లామరస్ వస్తువులుగా చూపించడాన్ని తాను అస్సలు సమర్థించనని ఆమె ఖరాఖండిగా తెగేసి చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినిమాల్లోని కొన్ని దృశ్యాలపై ఎదురైన ప్రశ్నలకు కాయదు లోహర్ అత్యంత నిజాయితీగా సమాధానమిచ్చారు. “సినిమా కథకు, ఆ పాత్ర ప్రయాణానికి గ్లామర్ లేదా బోల్డ్ సీన్స్ అవసరమైతే నా పరిధి మేర ఓకే చెప్తాను. కానీ, కేవలం పబ్లిసిటీ కోసం, ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ అవ్వడం కోసం మాత్రమే ఒక నటిని అభ్యంతరకర కోణంలో చూపించాలనుకుంటే అలాంటి ప్రాజెక్ట్‌లకు నేను ఎప్పటికీ 'యస్' చెప్పను” అని ఆమె స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో భావప్రకటనా స్వేచ్ఛ, పాత్రల రూపకల్పనపై నిర్మాతలు, దర్శకులతో మాట్లాడటం చాలా కష్టమైన విషయమని కాయదు అభిప్రాయపడ్డారు. సెట్స్‌పై ఇటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తే 'ఇక్కడ అందరూ ఇలాగే చేస్తారు' అనే సమాధానం ఎదురవుతుంటుందని, అయితే ఒక నటిగా తన గళాన్ని వినిపించడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా సరళి కూడా మారుతోందని, అనవసర గ్లామర్ సీన్లపై నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. అస్సాంకు చెందిన ఈ భామ శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'అల్లూరి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ప్రదీప్ రంగనాథన్ సరసన చేసిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ఘనవిజయంతో ఈ బ్యూటీకి ఊహించని పాపులారిటీ లభించింది. దాంతో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయికలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం కాయదు లోహర్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు వరుసకట్టాయి. టాలీవుడ్‌లో నాని సరసన 'ది ప్యారడైజ్'తో పాటు తమిళ్, మలయాళ భాషల్లో 'తారం', 'మంజనాత్తి' వంటి భారీ చిత్రాల్లో ఈ భామ నటిస్తున్నారు. ఎల్లప్పుడూ కేవలం లుక్స్ కంటే కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసిన కాయదు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.     [Kayadu Lohar, Kayadu Lohar Interview, Objectification of Women in Cinema, Kayadu Lohar Movies, Telugu Cinema News]
తెలుగు సినీ వర్గాల్లో భావప్రకటనా స్వేచ్ఛ మరియు సెన్సార్ బోర్డు ఆంక్షల చుట్టూ మళ్లీ తీవ్రమైన చర్చ మొదలైంది. తాజాగా సీబీఎఫ్‌సీ (CBFC) అధికారుల తీరును తప్పుబడుతూ 'పీపుల్స్ స్టార్' ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చలనచిత్ర పరిశ్రమను, దర్శకనిర్మాతలను అనవసరపు నిబంధనల పేరుతో వేధించడం సరికాదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. యువ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైటిల్‌లో 'కామ్రేడ్' అనే పదాన్ని వాడటంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందనే వార్తలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల రూపాయిల బడ్జెట్‌తో, వందలాది మంది కష్టంతో రూపుదిద్దుకునే కళారూపాన్ని ఇలా చిన్న విషయాలకే అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. సామాజిక స్పృహతో ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను 'కామ్రేడ్' అని పిలుస్తారని, అలాంటి పవిత్రమైన మాటపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని నారాయణమూర్తి స్పష్టం చేశారు. ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఓటీటీలలో ఎటువంటి నియంత్రణ లేకుండా అభ్యంతరకరమైన కంటెంట్ వస్తుంటే, కేవలం థియేటర్ సినిమాలపైనే కఠిన ఆంక్షలు విధించడం ఏ రకమైన న్యాయమని ఆయన ప్రశ్నించారు. సమాజానికి అద్దం పట్టే సినీ మాధ్యమానికి రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కళను, సినీ పరిశ్రమను బతకనివ్వాలని, అనవసరపు విధివిధానాలతో నిర్మాతల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని వేడుకున్నారు. గతంలో కూడా అనేక విప్లవాత్మక, సామాజిక సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నారాయణమూర్తి, పరిశ్రమ తరఫున ఎల్లప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే 'పీపుల్స్ స్టార్' చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ విశ్లేషకులు, నెటిజన్లు కూడా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వివాదాల నడుమ రూపుదిద్దుకుంటున్న శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రాజెక్ట్‌పై ఈ కామెంట్స్‌తో మరింత హైప్ నెలకొంది.       [R Narayana Murthy, Comrade Kalyan, Sree Vishnu, Censor Board Issue, Telugu Cinema New]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  డిసెంబర్ 3న ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజీ' విడుదల కానుంది. ఆ భారీ సినిమా విడుదలవుతున్న మరుసటి రోజే 'లెగసీ' వస్తుందంటే రిస్క్ అనే చెప్పొచ్చు. కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఆసక్తికరంగ్ మారింది.  సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెగసీ’ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాతలు. చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో డిసెంబర్ 4న ‘లెగసీ’తో విశ్వక్ సేన్ ఎలాంటి పవర్‌ఫుల్ అనుభూతిని అందించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘పిండం’ తర్వాత కలాహి మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రం కూడా ఇదే కావడం విశేషం. పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది.        [Vishwak Sen, Legacy Movie, Release Date, Prabhas, Fauzi Movie, Telugu Film News, Telugu News]  
Mass Ka Das Vishwak Sen’s upcoming intense political action drama ‘LEGACY’ has locked its worldwide theatrical release date. The film, directed by Saikiran Reddy Daida and produced under the Kalaahi Media banner, will release worldwide on December 4, 2026. The intense political action drama is being produced by Yeshwanth Daggumati and Saikiran Reddy Daida, with Sanjay Sambrani and V.V.N. Prasad as co-producers. The makers unveiled a striking new release-date poster featuring Vishwak Sen and Ekta Rathod, officially announcing December 4th as the date audiences can mark on their calendars. Written and directed by Saikiran Reddy Daida, LEGACY marks his second feature film after his directorial debut Pindam. The film also marks the second production venture from Kalaahi Media, following Pindam.  Set against a powerful political backdrop, LEGACY explores the collision of power, family, love and betrayal. Vishwak Sen plays a character who is drawn into a dangerous world shaped by his father’s legacy, while acclaimed Hindi actor Kay Kay Menon takes on a powerful antagonist role.  The film features a strong ensemble cast including Rao Ramesh, Sachin Khedekar, Murali Mohan, Ekta Rathod, Raja Ravindra, Rajeev Kanakala, Aneesh Kuruvilla, Khushee Ravi, Kalyani Natarajan, Ravi Kaale, Amit Tiwari and others.  The technical team includes Jiju Sunny as cinematographer, Govind Vasantha as music composer, Sirish Prasad as editor, Rajeev Nair as production designer and Jashuva as action choreographer. The final leg of shooting is currently underway   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    కొంత కాలంగా హిట్ నే కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మార్చుకున్న  శ్రీ విష్ణు ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' తో రాబోతున్నాడు.  జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కగా కొంత సేపటి టీజర్ విడుదలైంది. అలా రిలీజ్ అయ్యిందో లేదో టీజర్ ని చూస్తూ ఉండటం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల ఫ్యాషన్ అయిపోయింది. దీంతో ఆటో మాటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. టీజర్ చూస్తుంటే ఈ సారి కూడా ఎప్పటిలాగానే  వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు,వస్తున్నట్లు అర్ధం అవుతుంది. 1992వ సంవత్సరం నాటి కాలఘట్టంలో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. సరిగ్గా రేడియోలో నక్సలైట్‌ ముప్పు పెరుగుతోందని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఒక అనౌన్స్‌మెంట్ రావడంతో టీజర్ ఎంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్ లీడర్ 'కామ్రేడ్ కళ్యాణ్'ను ఎలాగైనా వేటాడి పట్టుకోవాలని గ్రేహౌండ్స్ బలగాలు మరియు ప్రత్యేక పోలీస్ బృందాలు ఆ గ్రామాన్ని చుట్టుముడతాయి. అక్కడ మొదలైన తీవ్రమైన వేట, ఊహించని మలుపులు, రోమాంచితమైన సీన్లు ప్రేక్షకులను క్షణం కూడా పక్కకు తప్పుకోకుండా టీజర్‌కు కట్టిపడేస్తాయి. అయితే, ఈ  క్రైమ్ అండ్ మ్యాన్‌హంట్ నేపథ్యానికి దర్శకుడు ఎంతో తెలివిగా కామెడీని జతచేశాడు. సీరియస్ పోరాటాలు, రాజకీయ ఉద్రిక్తతల నడుమ శ్రీ విష్ణు మార్క్ వినోదం, ఆయన టైమింగ్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తున్నట్లు అందుతున్న సంకేతాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.  తెలంగాణ మరియు ఆంధ్ర యాసలతో పలికించిన సంభాషణలు, డిఫరెంట్ లుక్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రతి సన్నివేశంలోనూ హైలైట్‌గా నిలిచాయి. శ్రీ విష్ణు కామెడీ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమనిపిస్తోంది.   Also read: హనుమాన్ అంశ చిత్రానికి పన్ను మినహాయింపు: మన ముఖ్యమంత్రిపై ప్రశంసలు  సాంకేతిక పరంగా కూడా ఈ టీజర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. 1990ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా కనిపిస్తోంది. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని యాక్షన్, వినోదాన్ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ టీజర్‌కు మంచి రేసింగ్ పేస్‌ను తెచ్చిపెట్టింది. అలాగే సినిమాలో రాధికా శరత్ కుమార్, అపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మొత్తంగా చూస్తే, 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ వింటేజ్ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పక్కా యాక్షన్-కామెడీ రైడ్‌ను ప్రామిస్ చేస్తోంది. స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాత.అక్టోబర్ 9 వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ . [Comrade Kalyan Teaser, Sree Vishnu, Kona venkat, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
కంటెంట్ ని నమ్ముకొని మూవీ తెరకెక్కిస్తే 'కరోడ్ పతి' అవ్వడంతో పాటు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారని నిరూపించిన మూవీ "హనుమాన్ అంశ'. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్, సెల్యులాయిడ్ వద్ద  సంచలనాలు సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక సత్యంతో కూడిన పకడ్బందీ స్క్రిప్ట్   నిష్కల్మషమైన భక్తి ముందర కోట్లాది రూపాయల బడ్జెట్లు కూడా చిన్నబోతాయనే సత్యాన్ని కూడా బలంగా చాటి చెప్పిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూవీకి అనూహ్య గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ అద్భుత ఆధ్యాత్మిక కావ్యానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  డెహ్రాడూన్‌లోని ఒక ప్రముఖ సినిమా హాళ్లలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన ధర్మపత్ని గీతా ధామీతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా మరియు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. సినిమా చూసిన అనంతరం పరవశించిపోయిన ముఖ్యమంత్రి, బాబా నీమ్ కరోలీ మహారాజ్ జీ త్యాగం, సేవా నిరతి, హనుమంతుడిపై ఆయనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలని కళ్లకు కట్టినట్లు చూపించింది. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, అదొక సేవ మరియు మానవాళి సంక్షేమానికి ఆత్మసమర్పణ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా అందిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేవభూమి ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని దేశ విదేశాలకు చాటిచెప్పడంలో 'హనుమాన్ అంశ' వంటి సినిమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ధామీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు కైంచి ధామ్ ఒక పవిత్రమైన శ్రద్ధా కేంద్రంగా మారిన వేళ, ఈ నిర్ణయం భక్తులకు ఎంతో ప్రాధాన్యమైనదిగా నిలిచింది.     Also Read: వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి: పూనమ్ పాండే సంచలన కామెంట్స్ విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం 1.75 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల అత్యంత స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కగా, ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైనప్పుడు ఎటువంటి ఆర్బాటాలు లేవు. తొలి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగి  మౌత్ టాక్ ముందు ఎన్ని పబ్లిసిటీ జిమ్మికులైనా జూజిబీ అని నిరూపించింది. ఈ విషయం భారతీయ సినిమా పుట్టుక నుంచి నిరూపితమవుతూ వస్తుంది. అందుకే  100 కోట్లకి  చేరువలో ఉంది.     [Hanuman Ansh, Tax Free, Neem Karoli Baba Biopic, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సమాజంలో అత్యంత పవిత్రమైన, బాధ్యతాయుతమైన పాత్ర గురువుది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపే మహోన్నత మూర్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో నేర్పించే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ, మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వేసుకోవాల్సిన ఆత్మపరిశీలన ప్రశ్న..  జ్ఞానం నేర్పే గురువుకు మనం నిజంగా ఏమిస్తున్నాం? అని. టీచర్స్ డే అంటే కేవలం గురువుకు శుభాక్షంకలు చెప్పడం, చిన్న బహుమతులు ఇవ్వడం కాదు.. టీచర్స్ డే రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయాలు ఉన్నాయి. గురువుల నుండి జ్ఞానం పొందిన ప్రతి విద్యార్థి.. ఎంత వయసు అయిన  వారైనా సరే.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి..   మనోభావాల రూపంలో ప్రతిఫలం.. ఒకప్పుడు గురుకులాశ్రమాల్లో విద్య పూర్తయిన తర్వాత శిష్యులు తమ శక్తిమేరకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురువులు కూడా ఏనాడూ ధనాన్ని ఆశించకుండా సన్మార్గంలో నడిచే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా జీవించారు. మరి నేటి ఆధునిక కాలంలో మనం గురువులకు ఇస్తున్న ప్రతిఫలం ఏమిటి? కాలం మారే కొద్ది  విద్య వ్యాపారంగా మారిపోయిన నేటి సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం, వారికి లభిస్తున్న గౌరవం ఎటువైపు పయనిస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదిగినా ఒదిగి ఉండటం లేదు.. చాలామంది విద్యాభ్యాసం పూర్తయి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత తాము చదువుకున్న పాఠశాలలను, మార్గదర్శకత్వం వహించిన గురువులను మరిచిపోతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను కేవలం జీతం తీసుకునే ఉద్యోగులుగా మాత్రమే చూసే ధోరణి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లిస్తున్నాం కదా అనే భావనతో ఉపాధ్యాయుల శ్రమను, వారి ఆవేదనను గుర్తించలేకపోతున్నారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ఉపాధ్యాయుడికి మనం తిరిగి ఇస్తున్నది కేవలం కొన్ని పూలమాలలు, షాళ్ళు లేదా ఒక రోజు ఇచ్చే తాత్కాలిక గౌరవం మాత్రమేనా? గురువు ఆశించే అసలైన గురుదక్షి.. ఒక గురువు తన శిష్యుడి నుంచి గిఫ్ట్ లు , ధనాన్ని ఏనాడూ ఆశించడు. ఒక ఉపాధ్యాయుడికి లభించే అతిపెద్ద బహుమతి తన విద్యార్థి ఉన్నత స్థానంలో నిలబడటమే. మనం గురువుకు ఇవ్వాల్సిన మొదటిది గౌరవం. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి సంపదను ఆర్జించినా, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని చూసినప్పుడు వినయంతో నమస్కరించడం, వారి సేవలను గుర్తుంచుకోవడం నిజమైన గౌరవం. గుర్తింపు... తరగతి గదిలో విద్యార్థి క్రమశిక్షణతో ఉంటూ, గురువు నేర్పిన విలువలను జీవితంలో పాటించినప్పుడు ఆ ఉపాధ్యాయుడి శ్రమకు సార్థకత లభిస్తుంది. సమాజంలో మంచి పౌరుడిగా ఎదిగి, పదిమందికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఫలానా ఉపాధ్యాయుడి శిష్యుడు..  అని సమాజం మెచ్చుకుంటే, ఆ మాట గురువుకు ఇచ్చే అతిపెద్ద ఆనందం. కృతజ్ఞతా భావం.. కాలం మారినా, ఏళ్లు గడిచినా తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను తరచూ గుర్తుచేసుకోవడం, వీలైతే వారిని కలసి పలకరించడం ఉపాధ్యాయులకు ఎంతో మానసిక తృప్తినిస్తుంది. మార్పు అవసరం.. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, గురువుల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవాలి. ఉపాధ్యాయులను కేవలం సమాచారం అందించే యంత్రాలుగా చూడకుండా, ఒక తరాన్ని నిర్మించే శిల్పులుగా గుర్తించాలి. పాఠశాలల్లో , సమాజంలో వారికి తగిన గౌరవాన్ని, భద్రతను, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. గురువు ఇచ్చిన జ్ఞానం అమూల్యమైనది. దానికి ఏ భౌతిక వస్తువూ సాటి రాదు. మనం గురువుకు తిరిగి ఇవ్వగలిగింది కేవలం హృదయపూర్వక గౌరవం, కృతజ్ఞత, వారు చూపిన సన్మార్గంలో నడవడం మాత్రమే. ఉపాధ్యాయులు నేర్పిన సద్గుణాలను, విలువలను మన జీవితంలో ఆచరిస్తూ, సమాజ శ్రేయస్సుకు తోడ్పడటమే మనం గురువులకు సమర్పించగల నిజమైన గురుదక్షిణ.                         *రూపశ్రీ.
మనలో చాలామంది నిద్ర తక్కువైతే ఆరోగ్యానికి హానికరం అని భావిస్తుంటారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసటగా అనిపించడం, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలిసిందే. కానీ, ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేయకపోగా, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా మారుతుందని మీకు తెలుసా? ఇటీవల దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన ఒక కీలక పరిశోధనలో నిద్ర వ్యవధికి, మానవ ఆరోగ్యానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ రాత్రి సమయంలో సుమారు 6.4 గంటల నుండి 7.8 గంటల మధ్య సరైన రీతిలో నిద్రపోయే వారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, దీని అర్థం ప్రతి ఒక్కరూ కచ్చితంగా 7 గంటలే నిద్రపోవాలని కాదు. ఒక వ్యక్తికి అవసరమయ్యే నిద్ర సమయం అనేది వారి వయసు, జన్యుపరమైన అంశాలు, అనుసరించే జీవనశైలి, చేసే శారీరక శ్రమ మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం నిద్రపోయే గంటల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిద్ర సరిపోతుందో లేదో నిర్ణయించలేము. అయితే రోజువారీగా అతిగా నిద్రపోవడం అనేది మీ శరీరంలో లేదా మానసిక స్థితిలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉన్నాయనడానికి ఒక స్పష్టమైన హెచ్చరిక కావచ్చు. డిప్రెషన్, స్లీప్ అప్నియా, శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపులు వంటి ప్రమాదకర పరిస్థితులతో అతి నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఒక వ్యక్తిలో నిద్రపోవాల్సిన వ్యవధిని అసాధారణంగా పెంచుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువసేపు నిద్రపోవడం వల్లనే ఈ వ్యాధులు వస్తున్నాయని పరిశోధన చెప్పడం లేదు; ఇప్పటికే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే వ్యక్తి ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.       oversleeping health risks telugu guide,healthy sleep duration research details.
చిన్న పిల్లలు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏది తింటే అనారోగ్యం పాలవుతారు అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చే ఆహారంలో చక్కెర, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన స్వీట్లు ఎంతవరకు సురక్షితం అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. చిన్నతనంలోనే పిల్లలకు విపరీతంగా తీపి అలవాటు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఒక సంచలనాత్మక పరిశోధన ఈ అంశంపై మరింత స్పష్టతనిచ్చింది. జీవిత ప్రారంభ దశలో, ముఖ్యంగా రెండేళ్ల వయసు లోపు పిల్లలకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల వారు పెద్దయిన తర్వాత తీవ్రమైన క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆసక్తికరమైన అంశాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో 1953 నాటి చారిత్రక పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఆ కాలంలో రేషనింగ్ వ్యవస్థ కారణంగా బ్రిటన్‌లో చక్కెర అందుబాటుపై కఠినమైన నియంత్రణలు ఉండేవి. దీనివల్ల ఆ సమయంలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలో చాలా తక్కువ మొత్తంలో చక్కెర లభించింది. ఈ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని, పరిశోధకులు ఏకంగా 64,000 మందికి పైగా వ్యక్తుల దశాబ్దాల కాలపు ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. చిన్నతనంలో తక్కువ చక్కెర తిని పెరిగిన వారి ఆరోగ్య ఫలితాలను, సాధారణంగా చక్కెర తిన్నవారితో పోల్చి చూసినప్పుడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నతనంలో పంచదార వినియోగాన్ని పరిమితంగా ఉంచిన వారిలో, దశాబ్దాల తర్వాత కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సుమారు 36 శాతం నుండి 69 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విషయంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా మరియు ఎక్కువగా కనిపించింది. దీనితో పాటు రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా వారిలో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులో చక్కెర పరిమితి వల్ల శరీరంలో కలిగే మార్పులు దీర్ఘకాలికంగా రక్షణ కవచంలా పనిచేస్తాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.         kids sugar restriction health benefits,childhood sugar intake cancer study.
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ , సాఫ్ట్ టిష్యూలకు గాయాలవడం వల్ల ఈ నొప్పి ఏ వయస్సు వారికైనా రావచ్చు. దీర్ఘకాలం పాటు వేధించే ఈ మోకాళ్ల నొప్పి మనుషులను శారీరకంగా, ఆర్థికంగా , మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. అయితే ఈ నొప్పి రాగానే నేరుగా సర్జరీ అవసరం పడుతుందని భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్స కంటే ముందే అసలు ఈ మోకాళ్ల నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో మరియు దానిని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే.. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు.. సాధారణంగా 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో మోకాళ్ల నొప్పి రావడానికి ఆస్టియోఆర్థరైటిస్ ప్రధాన కారణం. ఇందులో మోకాలి జోళ్లలోని కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల మోకాళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ రకమైన నొప్పి మోకాలి కింద లేదా ఇరువైపులా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి. మరొకవైపు, శారీరక శ్రమ మరియు వ్యాయామం ఎక్కువగా చేసే యువత లేదా క్రీడాకారులలో మోకాళ్ల నొప్పి గాయాల వల్ల వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ లేదా వర్కౌట్లు చేయడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ రావచ్చు.  తొడ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాలి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల పాటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ లేదా రన్నర్స్ నీ అనే సమస్య వస్తుంది. దీనివల్ల మోకాలిచిప్ప కింద నొప్పి అనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మోకాళ్ల నొప్పి కింద పడటం, ప్రమాదాలు జరగడం, ఆటలు ఆడేటప్పుడు లేదా వంగి పనులు చేసేటప్పుడు అకస్మాత్తుగా రావచ్చు.  మోకాలికి అయ్యే గాయాల్లో మెనిస్కస్ చిరగడం చాలా సాధారణం. ఇది మోకాలిని స్థిరంగా ఉంచే ఒక అర్ధచంద్రాకార కార్టిలేజ్. కాళ్లు అనుకోకుండా మెలిక తిరిగినప్పుడు ఇది చిరిగిపోయి తీవ్రమైన నొప్పి, వాపుకు కారణమవుతుంది. మోకాలిని అనుసంధానించే లిగమెంట్లు అతిగా సాగడం లేదా చిరగడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ప్రత్యేకించి ఎమ్‌సిఎల్ , ఏసిఎల్ అనే లిగమెంట్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పి నివారణ , సంరక్షణ మార్గాలు.. నొప్పి నెమ్మదిగా ప్రారంభమై పెరుగుతున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. నడక తీరులో లోపాలు, నడుము భాగం బలహీనంగా ఉండటం వల్ల కూడా మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నివారణ మందుల కంటే బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వాడటం వంటి తక్కువ ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయాలి. మంచి సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. వైద్య చికిత్సలు , జాగ్రత్తలు.. జీవనశైలి మార్పులు , సాధారణ మందులతో ఉపశమనం లభించనప్పుడు వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. ప్రారంభ దశలోని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు హైలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లు కొంతవరకు సహాయపడవచ్చు. ఏ చికిత్స పనిచేయనప్పుడు చివరి ఛాయిస్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మోకాళ్ల గాయాల నివారణకు ప్రథమ చికిత్స .. వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు గాయం వల్ల నొప్పి వస్తే ఆ పనిని వెంటనే ఆపేయాలి. మోకాలి చుట్టూ మంచు గడ్డలతో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. మెనిస్కస్ లేదా ఏసిఎల్ చిరిగిన సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మోకాలు పట్టు కోల్పోయినట్లు అనిపించినా, నిలబడటం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు.. వయస్సు లేదా జన్యుపరమైన అంశాలను మార్చలేము కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భార తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు పాడవుతాయనేది అపోహ మాత్రమే. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడి ఆస్టియోఆర్థరైటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కండరాలను బలంగా ఉంచుకోవడం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం  సాధ్యమవుతుంది.                *రూపశ్రీ.