LATEST NEWS
  దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలు, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష వ్యవహారం దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల నిజమైన ప్రతిభావంతులు నష్టపోతుండగా, అక్రమ మార్గాల్లో పేపర్లు సంపాదించిన వారికి ప్రయోజనం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని చర్చలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు బాధ్యత స్వీకరించాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం తప్పులను అంగీకరించకుండా విమర్శకులపైనే ఎదురుదాడికి దిగుతున్నారని పేర్కొన్నారు. విద్యా సంస్థలు ర్యాంకులు, ఐఐటీ సీట్ల సంఖ్యలను ప్రచారం చేస్తూ మార్కెటింగ్‌పై దృష్టి పెడుతున్నాయని, కానీ మిగిలిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఎవ్వరూ చర్చించడం లేదని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. సాంకేతిక పరికరాల సహాయంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని, దీనివల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయని చర్చలో ప్రస్తావించారు. సరైన సన్నాహకాలు లేకుండా కొత్త విధానాలను అమలు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన వారిని ప్రోత్సహించి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, వారిని దేశద్రోహులుగా లేదా విదేశీ ఏజెంట్లుగా ముద్రవేసే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రధాన స్రవంతి మీడియా కూడా ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితులు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని, విద్యార్థులు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి రానున్న రోజుల్లో రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే విద్యా రంగంలో పారదర్శకత పెంచడం, అవినీతిని అరికట్టడం, తప్పులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని సూచించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయకపోతే దాని ప్రభావం కేవలం విద్యార్థులపైనే కాకుండా దేశ భవిష్యత్తుపై కూడా పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పాలకులు రాజకీయాలకు అతీతంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.  
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి విభజన సెంటిమెంట్, ఆత్మగౌరవం అంశాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో  జనసేన రాజకీయ ప్రణాళికలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్  పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.   కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది ప్రాణాలర్పించారని చెబుతున్న బీఆర్ఎస్ నాయకత్వం, అధికారంలోకి వచ్చాక కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలను మాత్రమే ఎందుకు ఆదుకుంది, మిగిలిన వారిని ఎందుకు విస్మరించిందన్న  ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అమరవీరుల బలిదానాల ఫలాలు ఎవరు అనుభవించారో, ఎవరు వేల లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారో ప్రజలకు తెలుసంటూ జనసేన  మద్దతు దారులు ఎదురు దాడికి  దిగుతున్నారు. తమకు పదవులు, అధికార భాగ్యం కల్పించిన అమరజీవుల కుటుంబాలనే సరిగ్గా పట్టించుకోని కల్వకుంట్ల కుటుంబం..  ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఆంధ్రాలో కూడా విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ నాడు ఆ ఉద్యమాలను దొంగ ఉద్యమాలని కేసీఆర్, కేటీఆర్ ఎగతాళి చేశారనీ, ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమాల గురించి ఎవరైనా మాట్లాడితే తమ ఆత్మగౌరవం దెబ్బ తింటోందంటూ ఎదురుదాడి చేయడం ఏమిటనీ నిలదీస్తున్నారు. కేసీఆర్ సెలైన్లు పెట్టుకుని చేసిన 10 రోజుల దీక్ష గురించే అంతలా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు..  పొట్టి శ్రీరాములు  ప్రాణాలు కోల్పోయే వరకు చేసిన ఆమరణ నిరాహార దీక్షను చులకనగా మాట్లాడటం  అహంభావానికి నిలువెత్తు నిదర్శనంగా తూర్పారపడుతున్నారు.   ఈ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు   ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉందనీ..  కానీ రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రాలో మాత్రం అలాంటి సెంటిమెంటు ఏదీ లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్కడ జై ఆంధ్రా అనే వాళ్ళు కూడా కరువయ్యారని.. మూడు రాజధానులు అంటున్నా, ఇంకేం అంటున్నా అభ్యంతరం చెప్పేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రా వాళ్లంటే తెలంగాణ నాయకులకు ఇంత చులకన భావం ఏర్పడిందని పవన్ విశ్లేషించారు. గతంలో కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించినప్పుడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో రాజకీయాలు చేసినప్పుడు ఆంధ్రా ప్రజలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుని దెబ్బతీసేందుకు తెరచాటు రాజకీయాలు జరిగినప్పుడు కూడా  ఊరుకున్నారనీ పవన్ అన్నారు. ఈ డైలాగ్ వార్ తో ఏపీ, తెలంగాణలో మళ్లీ విభజన సెంటిమెంట్, ఆత్మగౌరవం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. 
 ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరిగ్గా రెండేళ్ళ క్రితం ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. 2024 జూన్ 4వ తేదీన విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యావత్ రాష్ట్రాన్నివిస్మయపరిచాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ, ఐదేళ్లలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని ఘోరంగా పరాజయం పాలైంది. 2024 ఎన్నికలలో  వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.  ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు. ఇంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తరువాత కూడా జగన్ లో కానీ, వైసీపీలో కానీ ఇప్పటికీ ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇప్పటికీ..  క్షేత్రస్థాయి వాస్తవాలను, 2024 ఎన్నికలలో ప్రజలు తమను తిరస్కరించడం వెనుక ఉన్న కారణాలను అంగీకరించేందుకు కానీ, గుర్తించేందుకు కానీ వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ సిద్ధంగా లేరు. అదే ఇప్పటికీ రాష్ట్రంలో జగన్ పట్ల, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఇసుమంతైనా తగ్గకపోవడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజలు కేవలం నెలవారీ సంక్షేమ పథకాల లబ్ధిని మాత్రమే ఆశించరనీ, వాటితో పాటు సుస్థిరఅభివృద్ధి, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ప్రశాంతమైన జీవన వాతావరణం కూడా  కోరుకుంటారనే కనీస సత్యాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించడం లేదని అంటున్నారు.  ప్రజల నిజమైన ఆకాంక్షలను పక్కనబెట్టి, కేవలం పార్టీ రాజకీయ,  ఆర్థిక ప్రయోజనాలకే   ప్రాధాన్యత ఇచ్చిన జగన్ గత ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.   అప్పట్లో ఆయన రాజధాని అమరావతి నిర్ణయాన్ని వ్యతిరేకించి మూడు రాజధానులంటూ ఆడిన మూడుముక్కలాట కారణంగా ఆయన పార్టీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ కుదేలౌంది. అంతటి ఘోర పరాజయం తరువాత రెండేళ్లయినా జగన్ లో కానీ, ఆయన పార్టీలో కానీ ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి జగన్ తాజాగా ప్రస్తావించిన ‘మావిగన్’ ప్రతిపాదనే నిదర్శనమంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెగా పవర్ స్టార్ మాస్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 'పెద్ది' సినిమా ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ స్టేటస్ చూస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నైజాం (హైదరాబాద్) పరిధిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, సాయంత్రం ఆటలకు వచ్చేసరికి దాదాపు అన్ని థియేటర్లలో 'హౌస్‌ఫుల్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు వైజాగ్, విజయవాడ, గుంటూరు వంటి మేజర్ సిటీస్‌లో కూడా రికార్డు స్థాయి అక్యుపెన్సీ నమోదవుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్రాలోని వైజాగ్, కాకినాడ వంటి ప్రాంతాల్లో సాయంత్రం షోలకు ఏకంగా 85 శాతం పైగా అక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్ లాంటి భారీ మార్కెట్‌లో 1100 కి పైగా షోలు ప్రదర్శితమవుతుండగా, అందులో సగం కంటే ఎక్కువ థియేటర్లు నిండిపోయాయి. ఇక ప్రీమియం ఐమాక్స్, ఎపిక్ (EPIQ) ఫార్మాట్లలోనైతే టికెట్లు దొరకడమే గగనంగా మారింది. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. 1980ల నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో 'పెద్ది' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కూడా కలిసిరానుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇకపై సినిమాల రిలీజ్ ప్లానింగ్స్ పూర్తిగా మారిపోనున్నాయి. ఎంతో కాలంగా మేకర్స్‌కు అత్యవసర సమయాల్లో అండగా నిలుస్తున్న 'తత్కాల్ సెన్సార్' విధానానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) శాశ్వతంగా బ్రేక్ వేసింది. ఈ మేరకు జూన్ 1, 2026 నుండి తత్కాల్ సర్టిఫికేషన్ ప్రక్రియను అధికారికంగా రద్దు చేస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ అదనపు ఫీజు చెల్లించి, ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో కేవలం కొన్ని రోజుల్లోనే సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకునే వెసులుబాటు నిర్మాతలకు ఉండేది. కానీ ఇకపై ఆ రూట్ క్లోజ్ అయిపోవడంతో, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా సాధారణ క్యూ పద్ధతిలోనే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నార్మల్ ప్రాసెస్‌లో సెన్సార్ సర్టిఫికేట్ రావడానికి గరిష్టంగా 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దర్శకులు, నిర్మాతలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ మధ్య కాలంలో చాలామంది మేకర్స్ రిలీజ్ డేట్‌కు వారం, పది రోజుల ముందు వరకు రీ-రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ (VFX) పనులను సాగదీస్తూ ఆఖరి నిమిషంలో తత్కాల్ ఆశ్రయించేవారు. తాజా నిర్ణయంతో సినిమా విడుదలకు కనీసం రెండు నెలల ముందే ఫైనల్ కాపీని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే అనుకున్న తేదీకి థియేటర్లలోకి రావడం అసాధ్యం. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో, ఎక్కువ భాషల్లో రూపొందే పాన్-ఇండియా చిత్రాలకు దీని వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగ సీజన్లను టార్గెట్ చేసే పెద్ద సినిమాల సెన్సార్ ప్రక్రియ కాస్త ఆలస్యమైనా, మొత్తం బిజినెస్ సైకిల్ తలకిందులవుతుంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల కేటాయింపు, డిజిటల్ అగ్రిమెంట్లు మరియు ప్రమోషనల్ టూర్స్ షెడ్యూల్స్ అన్నీ అయోమయంలో పడతాయి. అయితే పరిశ్రమలోని కొందరు ట్రేడ్ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తత్కాల్ ఆప్షన్ లేకపోవడం వల్ల మేకర్స్‌లో బద్ధకం పోయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పక్కా క్రమశిక్షణ పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఎక్కువ డబ్బున్న పెద్ద నిర్మాణ సంస్థలకే కాకుండా, చిన్న నిర్మాతలకు సైతం సమానమైన అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కొత్త నిబంధనలకు అలవాటు పడటం చిత్ర పరిశ్రమకు సవాలే అయినప్పటికీ, భవిష్యత్తులో ఇది మంచి మార్పుకు దారితీస్తుందో లేదో చూడాలి.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేసవి కాలం ముగింపు దశకు వస్తున్నా, సినిమాల సందడి మాత్రం తగ్గడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నయా సెన్సేషన్ పెద్దిచిత్రంతో టాలీవుడ్ సమ్మర్ విన్నర్‌గా నిలిచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా అందించిన భారీ ఉత్సాహంతో, ఇదే జూన్ నెలలో మరికొన్ని విభిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ ఆసక్తికర చిత్రాల వివరాల్లోకి వెళితే.. ముందుగా జూన్ 11వ తేదీన 'సింగ్ గీతం' అనే వెరైటీ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, టాలెంటెడ్ మేకర్ నాగ్ అశ్విన్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ మ్యూజికల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం గారు ఈ రేంజ్ క్రియేటివిటీతో సరికొత్త కథను తీసుకురావడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆయన అందించిన 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' లాంటి క్లాసిక్స్ తరహాలోనే, ఈ సినిమా కూడా ఇప్పటివరకు తెలుగు స్క్రీన్‌పై చూడని సరికొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీని తర్వాత, జూన్ 19న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం రిలీజ్ కానుంది. ఫీల్ గుడ్ సినిమాల దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు పాపులర్ మేకర్ రాజ్ నిడిమోరు కథ, నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వంటి వెబ్ సిరీస్‌ల తర్వాత సమంత, రాజ్ కలయికలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సమంత, నందిని రెడ్డి ఇద్దరికీ ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. ఇక జూన్ చివరి వారంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్'తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. గత చిత్రం 'ఏజెంట్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రచార చిత్రాలు, కంటెంట్ ప్రేక్షకులలో మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో అఖిల్ కెరీర్ సరికొత్త మలుపు తిరుగుతుందని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ జూన్ రిలీజ్‌లపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అటు సమంత లేడీ ఓరియెంటెడ్ పవర్, ఇటు అఖిల్ మాస్ కంబ్యాక్, మరోవైపు సింగీతం గారి వింటేజ్ మ్యాజిక్.. ఇలా మూడు భిన్నమైన జోనర్ల చిత్రాలు పోటీ పడుతుండటం విశేషం. ఈ క్రేజీ లైనప్‌తో జూన్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పెద్ది' థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి ఆట నుంచే ఊచకోత మొదలుపెట్టింది. బుధవారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ మెగా చిత్రం రికార్డుల వేటను అట్టహాసంగా ప్రారంభించింది. ముఖ్యంగా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సృష్టించిన ప్రభంజనం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అక్కడ కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా ఏకంగా రూ. 3.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ వసూళ్లతో గతంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' (రూ. 2.72 కోట్లు) పేరిట ఉన్న హయ్యెస్ట్ ప్రీమియర్ రికార్డును చరణ్ క్లీన్ స్వీప్ చేసేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న 'రాజా సాబ్', 'పుష్ప 2' చిత్రాలను కూడా దాటేసి కర్ణాటకలో సరికొత్త చరిత్ర లిఖించింది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ లోనూ ఈ సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. ప్రముఖ బుకింగ్ యాప్ బుక్ మై షో లో గంటకు దాదాపు 40 వేల టికెట్లు అమ్ముడవుతూ 'పెద్ది' సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో కేవలం 'కల్కి 2898 ఏడీ', 'సలార్', 'పుష్ప 2' లాంటి భారీ చిత్రాలకు మాత్రమే ఈ స్థాయి అవర్లీ ట్రెండింగ్ దక్కగా, ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్ లోకి రామ్ చరణ్ కూడా అడుగుపెట్టారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు 10 లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడవడం విశేషం. 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో నటిస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై ట్రేడ్ లోనూ, ప్రేక్షకులలోనూ మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మలిచారు. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ ఈ సినిమా ర్యాంపేజ్ నడుస్తోంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ లోనే ఈ చిత్రం $1.5 మిలియన్ల మార్కును దాటేసి యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా మొదటి రోజు దాదాపు రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఉంటుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానుల హంగామా మామూలుగా లేదు. థియేటర్లలో పేపర్లు ఎగరేస్తూ, పూల చల్లుతూ పండగ చేసుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరిన్ని భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.
Speculation surrounding Toxic has been gaining momentum over the last few days, with several reports claiming that the film had run into creative turbulence. However, the makers have now firmly denied the rumours and clarified that the project is progressing as planned. According to circulating reports, actor Yash was allegedly unhappy with the way the film had shaped up and had demanded an extensive 100-day reshoot schedule. Rumours further suggested that creative differences had emerged between Yash and director Geethu Mohandas and that the star had personally stepped in to shoot a few portions of the film himself. Responding to the speculation, the makers have dismissed the entire narrative and stated that there is no truth to the reshoot claims. They reportedly clarified that post-production work on the film has been completed and that the project remains on schedule. While the clarification has put creative-dispute rumours to rest, conversations continue around the film’s release timeline.  According to industry insiders, the team is currently focused on closing a major OTT agreement and is also exploring the possibility of bringing a Hollywood studio on board to handle distribution of the English version. Sources indicate that the makers are expected to announce the release date only after these key deals are finalised, aiming to position Toxic for a wider global rollout.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నట విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ పీరియడ్ డ్రామాలో వినికిడి లోపం ఉన్న 'చిట్టిబాబు' పాత్రలో చరణ్ జీవించేశారు. ఆ నటన చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. కచ్చితంగా ఆ పర్ఫార్మెన్స్‌కు రామ్ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వస్తుందని అటు అభిమానులు, ఇటు సినీ విశ్లేషకులు ఎంతగానో ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ యేడాది చరణ్‌కు జాతీయ అవార్డు దక్కలేదు. అప్పట్లో ఈ విషయం మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. చిట్టిబాబు పాత్రకు అవార్డు రాకపోవడంపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అసంతృప్తిని, నిరాశను వ్యక్తపరుస్తూనే ఉంటారు. చరణ్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌లా నిలిచిపోయిన ఆ క్యారెక్టర్‌కు సరైన గుర్తింపు రాలేదనే బాధ వారిలో అలాగే ఉండిపోయింది. అయితే, ఇప్పుడు ఆ పాత నిరాశకు చెక్ పెట్టేలా సరికొత్త చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. రామ్ చరణ్ తాజాగా నటించిన 'పెద్ది' (Peddi) సినిమా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో చరణ్ మరోసారి తన నటనా నైపుణ్యంతో వెండితెరపై మాయ చేశారు. ఈ సినిమాలో చరణ్ కనబరిచిన పీక్ పర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ అద్భుతమైన నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తన వన్-మ్యాన్ షోతో సినిమా మొత్తాన్ని చరణ్ తన భుజాలపై వేసుకుని నిలబెట్టాడని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలంలో మిస్ అయిన జాతీయ అవార్డు కసితీర ఈ సినిమాతో రావడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'పెద్ది' సినిమాలో ఆయన పండించిన నవరసాలు, క్లైమాక్స్ సీన్లలో చూపించిన ఇంటెన్సిటీ చూస్తుంటే జాతీయ అవార్డు జ్యూరీ కూడా చరణ్ నటనను పక్కన పెట్టలేదని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఎక్కడ చూసినా 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వస్తుందా లేదా అనే విషయంపైనే హాట్ హాట్ చర్చ నడుస్తోంది. రంగస్థలం నాటి నిరాశను ఈ చిత్రం తుడిచిపెట్టేస్తుందని, గ్లోబల్ స్టార్ స్టామినా ఏంటో ఈ అవార్డుతో మరోసారి దేశవ్యాప్తంగా నిరూపితమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి 'పెద్ది' చిత్రం నిజంగానే రామ్ చరణ్‌కు ఆ ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డును తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
Nithya Menen is set to headline yet another content-driven project, this time joining hands with the director of Yamirukka Bhayamen for a film that is said to revolve entirely around a female protagonist. According to industry reports, the upcoming project was narrated to Nithya recently, and the actor is believed to have instantly connected with the concept.  Sources suggest that the strength of the central character and the story’s heroine-oriented approach played a major role in her decision to come on board. Known for choosing unconventional scripts and performance-driven roles over routine commercial outings, Nithya reportedly found the narration compelling enough to give her approval without prolonged discussions. The makers are said to be designing the film with her character at the center, making it one of her most prominent female-led projects in recent times. The director, who gained recognition with Yamirukka Bhayamen, is expected to present a fresh narrative while placing strong emphasis on storytelling and character development.  Further details regarding the supporting cast, production banner and shooting schedules are expected to be announced in the coming weeks. With Nithya Menen leading the project, expectations around the film have already started building among audiences.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో హీరో యష్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే భారీ ఎత్తున మార్పులు చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం ఈ రూమర్లకు గట్టి సమాధానం ఇస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపించిన టాక్ ప్రకారం.. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీసిన కొన్ని సీన్లు యష్‌కు నచ్చలేదని, దాదాపు 100 రోజుల పాటు సినిమాను మళ్లీ రీషూట్ చేయాలని ఆయన పట్టుబట్టినట్లు గట్టిగా ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలను చిత్ర యూనిట్ వర్గాలు పూర్తిగా కొట్టిపారేశాయి. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాధారమైన పుకార్లని స్పష్టం చేశాయి. సినిమా కంటెంట్ మరియు ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల హీరో యష్ వంద శాతం సంతృప్తిగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. అసలు రీషూట్ చేయాలనే ఆలోచనే ఎవరికీ లేదని, ప్రస్తుతం సినిమా పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. బిగ్ బజెక్ట్ చిత్రాల విషయంలో ఇలాంటి నెగెటివ్ రూమర్స్ రావడం సహజమేనని, అభిమానులు వీటిని నమ్మవద్దని కోరారు. ‘కేజీఎఫ్ 2’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘టాక్సిక్’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ హోమ్ బ్యానర్ ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’తో కలిసి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. అయితే, సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడటంతోనే ఇలాంటి గాసిప్స్ పుట్టుకొచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పంపిణీ ఒప్పందాలు, గ్లోబల్ రిలీజ్ స్ట్రాటజీ వల్లే ఆలస్యం జరుగుతోందని గతంలోనే యష్ స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ రూమర్ల బారిన పడకుండా, సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో పాటు యష్ బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో రావణుడి పాత్రలోనూ నటిస్తున్నారు. మరి ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు. తరువాత  దాని గురించి పశ్చాత్తాపపడతారు. చాలా వరకు ప్రతి వ్యక్తి తన నిర్ణయం సరైనదని నమ్ముతాడు, కానీ కాలక్రమేణా, వారి భ్రమలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం వారి మనస్సు , మెదడు డైరెక్షన్ ద్వారా నడుస్తుంది.  ఈ విషయాన్ని స్వయానా ఆచార్య  చాణక్యుడు స్పష్టం చేశాడు. మనిషి మనస్సు , మెదడు పూర్తీ సామరస్యంతో లేనంత వరకు, వారి నిర్ణయాలు తప్పు అని రుజువవుతాయని చాణక్యుడు నమ్ముతాడు. మనస్సు , మెదడు సంపూర్ణ సామరస్యంతో లేకపోతే, వారి సొంత మనస్సే వారికి శత్రువుగా మారుతుంది.ఒక వ్యక్తికి తన సొంత మనస్సే శత్రువుగా మారడానికి గల ఐదు కారణాలను ఆచార్యుడు స్పష్టంగా వివరించాడు.  అవేంటో తెలుసుకుంటే.. బాలెన్స్ లేకపోవడం.. నిర్ణయం తీసుకునే సామర్థ్యం  వ్యక్తి యొక్క మనఃస్థితి , మెదడుపై ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటాడు. అందువల్ల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, ఆ నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యక్తి భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.  దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దురశాతో ఆధిపత్యం చెలాయించడం.. దురాశ  మనిషిని  ఆవరించినప్పుడు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చాణక్యుడు చెబుతాడు. లాభాపేక్ష అనే ఆలోచనే మనిషిలో దురాశ పుడుతుంది.   ప్రయోజనాల కారణంగా జరిగే నష్టాల గురించి ఆలోచించరు. ఈ అలవాటు నేటికాలంలో చాలామందిలో చాలా ఎక్కువగా ఉంది.  వ్యాపారవేత్తలు కూడా అధిక లాభాల ఆశతో పెట్టుబడుల నుండి వచ్చే  నష్టాలను తరచుగా పట్టించుకోరు. చాణక్యుని దృష్టిలో, దురాశ , తొందరపాటు మనసును శత్రువుగా మారుస్తాయి. కోపం.. కోపం ముఖ్యమైన సంబంధాలను కూడా క్షణాల్లో విచ్ఛిన్నం చేస్తుంది.  చాణక్యుని ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, ఇతరులు చెప్పే విషయాన్ని వినాలనే ఆసక్తిని కూడా అణిచివేస్తుంది.  కోపంలో ఉన్నప్పుడు మనిషి తన కోపాన్ని బయటకు వ్యక్తం చేస్తాడు అంతే కానీ.. ఆలోచించి  జరిగిన విషయం గురించి ఆలోచించి సమస్యను పెద్దది కాకుండా ఆపే విచక్షణ ఉండదు. అందుకే తన కోపమే తన శత్రువు అని అన్నారు.ఈ కోపం మనిషి మనసును కూడా శత్రువుగా మారుస్తుంది. అతిగా ఎమోషనల్ బాండింగ్.. ఆచార్య చాణక్యుని ప్రకారం మితిమీరిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగపరంగా చాలా గాఢంగా ముడిపడి ఉన్నప్పుడు, వారు నిజానిజాలు సరిచూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పరిస్థితిలో భ్రమల ఏది, నిజం ఏది తెలుసుకోలేరు.  తమ భ్రమ పడే విషయమే నిజం అని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే అపార్థాలు కూడా చాలా సులువుగా వచ్చేస్తాయి. సందేహంతో తీసుకునే నిర్ణయాలు.. చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చాడు. అసంపూర్ణ జ్ఞానం భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది.    పూర్తి నిజం తెలుసుకోకుండా తుది నిర్ణయానికి రావడం చాలా ప్రమాదమని,  దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతాడు. సందేహంతో తీసుకునే   నిర్ణయాలు కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు మనిషిని నష్టానికి దూరంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా,  భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు.  అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే..  ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు  కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే..  సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా  చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని  తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి  ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి  అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో  కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు   భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం  ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో  కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా  రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం,  పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు  సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు.  ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.   జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు.                                         *రూపశ్రీ.
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అసలు అంత కోపం ఎందుకు వస్తుంది అనే విషయం కూడా అర్థం కానట్టు ఉంటుంది. కోపం అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు.. అది  మనస్సు , శరీరానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు, వారి శరీరం పూర్తిగా అల్లకల్లోలానికి గురవుతుంది. అతిగా కోపం తెచ్చుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ నిజం ఏమిటో తెలుసుకుంటే.. మెదడులోని ఈ భాగమే కారణం... మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. దీనిని  శరీరపు అలారం అని కూడా పిలవవచ్చు. మనకు ఏదైనా విషయం గురించి బాధగా అనిపించినప్పుడల్లా, ఈ అలారం వెంటనే మోగుతుంది. కోపానికి లోనయ్యే వ్యక్తులలో ఈ ప్రాంతం చాలా చురుకుగా ఉంటుంది. ఇది మెదడులోని ఆలోచనా భాగాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల తొందరగా కోపం వచ్చే వారు  ఆలోచించకుండానే మాటలు మాట్లాడతారు లేదా పనులు చేస్తారు. కోపం రాగానే జరిగేది ఇదే.. అమిగ్డాలా చురుకుగా మారినప్పుడు అది అడ్రినలిన్ , కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ల విడుదల శరీరంలో ఈ క్రింది ప్రధాన మార్పులకు కారణమవుతుంది. గుండె కొట్టుకోవడం చాలా వేగంగా అవుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. కండరాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. శ్వాస చాలా వేగంగా , నిస్సారంగా మారుతుంది. ముఖానికి, చేతులకు రక్త ప్రసరణ పెరగడం వల్ల ముఖం ఎర్రగా మారుతుంది. మితిమీరిన కోపం ఏదైనా వ్యాధికి సంకేతమా? పదే పదే  మితిమీరిన కోపం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిరంతర కోపం శరీరాన్ని ఎప్పుడూ  ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది గుండెపోటు, పక్షవాతం , నిద్రలేమి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు లేదా నిద్రలేమి కూడా కోపం పెరగడానికి దోహదం చేస్తాయి. మితిమీరిన కోపాన్ని ఎలా శాంతపరచాలి? కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అసాధ్యం కాదు. కోపం వచ్చినప్పుడల్లా వెంటనే దీర్ఘంగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. 1 నుండి 10 వరకు అంకెలను వెనక్కి లెక్కించండి. కాసేపు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లడం, చల్లటి నీళ్లు తాగడం కూడా కోపాన్ని  తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ యోగా, ధ్యానం చేయడం మనసును ప్రశాంతపరచడానికి, అమిగ్డాలాను నియంత్రించడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు.  కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు.  వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు.  అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. టీ ఆరోగ్య ప్రయోజనాలు.. టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని  అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు.  ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం  గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు  బరువు   విషయంలో పర్పెక్ట్ గా,  మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా   ఉంటారని పరిశోధనలో తేలింది.  రోజులో ఎంత టీ తాగాలి? ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని  చెబుతున్నారు.  అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువగా తాగితే.. ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.