LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ విశ్లేషకుడు  ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనీ, టీడీపీ కేవలం ఇన్స్టంట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ ఆయన సరికొత్త థియరీని తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందని, జనసేన కోర్ కమిటీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని నాగేశ్వర్ పేర్కొనడం సంచలనంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన  ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేశారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ణత కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.   తెలుగు దేశం, బీజేపీ  బంధం నిన్న మొన్నటిది కాదనీ..  1984లో ఎన్టీ రామారావు హయాం నుంచే రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు  పైగా ఉన్న ఈ సుదీర్ఘ అనుబంధాన్ని ఇన్స్టంట్ ఫ్రెండ్ షిప్ అనడం నాగేశ్వర్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కూటమిలో   వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు.   ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్  జై ఆంధ్రప్రదేశ్' అని అనడాన్ని కూడా నాగేశ్వర్ తప్పుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాంతీయ, కుల విభేదాలను రూపుమాపి సమైక్యతను తీసుకురావడానికే జనసేనాని ఆ నినాదం ఇచ్చారని స్పష్టం చేశారు.  వైసీపీ   హయాంలో మూడు రాజధానుల వివాదం వచ్చినప్పుడే  జై అమరావతి నినాదం ప్రాధాన్యత సంతరించుకుందని, రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించినప్పుడు  జై ఆంధ్రప్రదేశ్ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. అమరావతి అనేది ఐదు కోట్ల ప్రజల రాజధాని అన్న అప్పసాని రాజేశ్..  అది కేవలం టీడీపీకి మాత్రమే పరిమితమైనది కాదన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా కేవలం అమరావతిపైనే నిధులు కుమ్మరిస్తున్నారనడం అబద్ధమని తోసిపుచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఇలాంటి సోకాల్డ్ ప్రొఫెసర్లకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విద్వేషాలు చొప్పించేందుకు జరుగుతున్న ఇటువంటి ఎజెండా బేస్డ్ ప్రచారాలను ప్రజలు నమ్మరనీ, భవిష్యత్తులో వీరికి తగిన బుద్ధి చెబుతారని అప్పసాని అన్నారు.    
జనసేన నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు రాజ్యసభకు వెళ్లనున్నారా? అందు కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేయనున్నారా?   అన్న చ‌ర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రచారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు..  పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా  నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.  మాములుగా అయితే జ‌న‌సేన  త‌ర‌ఫున‌ లింగ‌మ‌నేని ర‌మేష్ ని రాజ్య‌స‌భ‌కు పంపుతారని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు జనసేనాని ఆయనకు గతంలో హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం లింగమనేని రామేష్ ను కాదని నాగబాబును రాజ్యసభకు పంపేయోచన చేస్తున్నారని అంటున్నారు.  ఇప్ప‌టికే నాగాబు జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పైకి  రీ ఎంట్రీ ఇచ్చారు. మ‌ళ్లీ  ఆయ‌న ఢిల్లీ పాలిటిక్స్ లోకి  ఎంట్రీ ఇస్తే ఈ వినోద కార్య‌క్ర‌మాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది.  ఇక ఢిల్లీలో చ‌క్రం తిప్పేంత  సామర్థ్యం నాగ‌బాబుకు ఉందా? అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఢిల్లీ రాజకీయాలలో చురుకుగా, క్రియాశీలంగా ఉండి, పార్టీ వాయిస్ వినిపించాలంటే.. భాష చాలా ముఖ్యం. మరి హిందీ భాషలో నాగబాబు ప్రావీణ్యం ఎంత అన్న సందేహం వ్యక్తమౌతోంది.  ఇక రాష్ట్ర రాజ‌కీయాల్లోనే  నాగ‌బాబు త‌న కార్య‌క‌ర్త‌లు అడిగే  ప్ర‌శ్న‌ల‌కు తిక‌మ‌క ప‌డుతుంటారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ  విష‌యంలో నాగ‌బాబును బాగా త‌ప్పు ప‌డుతుంటార‌నీ పార్టీ వర్గాల్లోనే ఒక అభిప్రాయం ఉంది.  మ‌రి  అలాంటి  నాగ‌బాబు జాతీయ స్థాయిలో రాణింపు సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  ఇక  ఇటు ఒంగోలు రీజియన్‌లో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాగబాబు గనుక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తే..  ఖాళీ అయ్యే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి తరఫున బాలినేనికి కేటాయించే అవకాశం ఉంది.  ఇక్క‌డింకో విచిత్ర‌మైన ప‌రిస్థితి  ఏంటంటే  ఒంగోలు ఎమ్మెల్యే దామంచ‌ర్ల జ‌నార్ధ‌న్ తో బాలినేనికి అస్స‌లు సరిపడదు. ఇద్ద‌రూ ఒకే కూట‌మికి  చెందిన నేత‌లే అయినా ఒక‌రిపై  మ‌రొక‌రు  ఆరోప‌ణ‌లు, విమర్శలు చేసుకుంటున్నారు. బాలినేని ఇంకా వైసీపీలో ఉన్న‌ట్టే త‌న‌పై  నింద‌లు వేస్తున్నార‌ని అంటారు జ‌నార్ధ‌న్. మ‌రి ఈ స‌మ‌స్యకు  ప‌రిష్కారం ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వి ద్వారా అయినా ప‌రిష్కారం దొరుకుతుందా? అన్న‌ది  తేలాల్సి ఉంది. బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అనుభవంతో ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఇప్ప‌టికే నెల్లూరులో  జ‌న‌సేన‌కు   ఇంఛార్జ్ లేరు. బాలినేనిని మండలికి పంపడం ద్వారా ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఒక  కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంటుందా? అన్న‌ది తేలాల్సిఉంది.  ఇటీవల బాలినేని, సీఎం చంద్రబాబు నాయుడితో కూడా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.  అయితే ఇవ‌న్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న సమాచారమే అయినప్పటికీ, దీనిపై జనసేన అధిష్టానం లేదా కూటమి పెద్దల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలులో  కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు శాసనసభ్యుడు టీజీ భరత్   ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.   మే 14న కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ ధ్వర్యంలో  జరిగిన  ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  మంత్రి టీజీ భరత్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ నిరసనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించే విధంగా ఉన్నాయని మంత్రి టీజీ భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   బైరెడ్డి వ్యాఖ్యలు కేవలం పరువు నష్టం కలిగించడమే కాకుండా, సాధారణ ప్రజానీకంలో ఒక రకమైన భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనిపేర్కొన్నారు.  మంత్రి   ఫిర్యాదుమేరకు కర్నూలు  త్రీ టౌన్ పోలీసులు  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  
  మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.  ఒక రెండు మూడు రోజుల్లో ఒక వర్గం ఎంఎల్యేలు ఢిల్లీకి ప్రయాణం కావాల‌ని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏఐసీసీని పూర్తి స్థాయి ప్రక్షాళన చెయ్యాల‌నే ఆలోచన‌లో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉన్న‌ట్టు స‌మాచారం. అధ్య‌క్షుడు మల్లికార్జున ఖార్గే కి ఈ మధ్యనే పేస్ మేకర్ కి సంబందించిన ఆపరేషన్ జ‌ర‌గ‌డం.. దీంతో పాటు ఆయ‌న‌ వయసు సుమారు 84 ఏళ్ళు  ఉండటం  అటు ఆరోగ్య సమస్య  ఇటు వయసు కూడ మీదికి రావడంతో కీల‌క‌  నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విప‌రీత‌మైన జాప్యం జరుగుతోంది.  ఏఐసీసీ కొత్త‌ ప్రెసిడెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక సీఎం పంచాయతీ కూడ మ‌ళ్లీ తెర‌పైకి వచ్చింది. సిద్ధ రామయ్య- 2028 వరకు నేనే సీఎం అని స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. స‌రిగ్గా అదే సమయలో డీకే సైతం త‌న‌కూ సీఎం పోస్టు కావ‌ల్సిందేన‌ని ప‌ట్టు ప‌డుతున్నారు.   తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య కి పరిష్కారం ప్రస్తుత దేశ రాజకీయాల‌ను దృష్టిలో పెట్టుకొని.. సిద్ద రామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ డీకే శివ కుమార్ సేవలను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు స‌మాచారం.   ప్ర‌స్తుత అధ్య‌క్షుడుమల్లికార్జున ఖర్గె ని రాజ్యసభ లో ప్రతిపక్ష‌ నేత గా కొనసాగించి.. కొత్త‌ ఏఐసీసీ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు.. డీకే శివ కుమార్ కి అప్ప చెప్పి.. దేశ వ్యాప్తంగా తన సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల‌ని కాంగ్ర‌స్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.  డీకే చేత ఎమ్మెల్యే పదవి, పీసీసీ పదవికి కూడా రాజీనామా చేయించి.. ఆయ‌న వ‌దులుకున్న‌ ఎమ్మెల్యే పదవిని శివ కుమార్ తమ్ముడు- సురేష్ కి అప్పజెప్పేలా క‌నిపిస్తోంది. పీసీసీ పదవిని  ఇక్కడ ఎవరికో ఒకరికి- పార్టీ సీనియర్ నాయకుడికి అప్పచెప్పాల‌ని కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఈ సమాచారం నిజంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన సంచలన, అత్యంత వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఈ  ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ హైకమాండ్ అటు కర్ణాటక సీఎం పీఠం వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, ఇటు జాతీయ స్థాయిలో ఏఐసీసీ కి ఒక పవర్‌ఫుల్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌షిప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్‌ను లోతుగా పరిశీలిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.   ఖర్గేకి 84 ఏళ్లు పైబడటం, ఇటీవల పేస్‌మేకర్ ఆపరేషన్ జరగడం వల్ల ఆయనపై జాతీయ స్థాయి పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించడం ఇటు రాజకీయంగా, అటు మాన‌వీయ కోణంలో చూసినా అవసరంగా క‌నిపిస్తోంది. అయితే ఆయనకున్న సీనియారిటీ, గౌరవాన్ని కాపాడుతూ ఆయన్ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగించడం ద్వారా పార్లమెంట్‌లో పార్టీ పట్టు చేజారకుండా చూసుకోవచ్చ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం జరుగుతున్న అంతర్గత పోరు  మ‌రీ ముఖ్యంగా కేబినెట్ మార్పులు, కొందరు ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో.. పార్టీకి తలనొప్పిగా మారింది. సిద్ధరామయ్య ప్లస్ పాయింట్స్ ఏంటో చూస్తే,  వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల.. ఓటు బ్యాంకుపై సిద్ధరామయ్యకు ఉన్న పట్టును కాంగ్రెస్ వదులుచుకోలేదు. ఆయన్ను 2028 ఎన్నికల వరకు సీఎంగా ఉంచడం ద్వారా కర్ణాటక ప్రభుత్వ స్థిరత్వానికి ఢోకా ఉండద‌ని భావిస్తోంది హ‌స్తం పార్టీ. ఇక డీకే శివకుమార్‌కు కేవలం కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చాలా చిన్నది. ఆయనకున్న  ట్రబుల్ షూటర్ ఇమేజ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్,  ఆర్థిక వనరులను సమకూర్చగల సామర్థ్యం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అవసరం. ఆయన్ను నేరుగా ఏఐసీసీ ప్రెసిడెంట్  చేయడం ద్వారా దేశవ్యాప్తంగా క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కూడా  నింపిన‌ట్టు అవుతుంది. డీకే శివకుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన ఎమ్మెల్యే పదవికి, కర్ణాటక పీసీసీ  అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఆయన తమ్ముడు, మాజీ ఎంపీ అయిన డీకే సురేష్‌ను అసెంబ్లీకి పంపడం ద్వారా కనకపుర నియోజకవర్గంలో డీకే ఫ్యామిలీ పట్టు అలానే ఉంటుంది. పీసీసీ పదవిని డీకే వర్గానికి చెందిన లేదా సిద్ధరామయ్యకు నమ్మకస్తుడైన ఒక సీనియర్ నేతకు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సమతుల్యత  దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఈ వ్యూహం సక్సెస్ అయితే కాంగ్రెస్‌కు వచ్చే లాభాలు.. ఎలాంటివో చూస్తే.. సౌత్ ఇండియా సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది.  ఖర్గే  తర్వాత మళ్లీ సౌత్ ఇండియా.. అది కూడా కర్ణాటక నుంచే మరో పవర్‌ఫుల్ లీడర్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టినట్టు అవుతుంది. ఆగ్ర‌స్సివ్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బీజేపీని వారి శైలిలోనే ఢీకొట్టడానికి డీకే శివకుమార్ లాంటి దూకుడున్న నాయకుడు ఏఐసీసీ చీఫ్‌గా పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కుర్చీ లాటరీకి ఎండ్ కార్డ్ పడితే, సిద్ధరామయ్య ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు. ఈ ఢిల్లీ లీక్స్  గనుక నిజమైతే, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణంలో చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. డీకే శివకుమార్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తారనేది అత్యంత ఆసక్తికరం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వైసీపీ  ప్రస్తుతం ఉనికిమాత్రంగా మిగిలిపోయింది. ఒకరిద్దరు నేతలు వినా మరెవరూ పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్  రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత,  జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి. ఇక ఏపీకి జగన్ చుట్టపు చూపుగా వస్తుండటం, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లకే పరిమితం కావడం తప్ప చొరవ తీసుకుని పార్టీని, క్యాడర్ ను ముందుకు నడిపించడంలో ఎటువంటి చొరవా తీసుకోవడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి.   ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విపక్షం వైసీపీ మాత్రమే. అటువంటి పార్టీకి ఇప్పుడు దిశానిర్దేశం చేసే విషయంలో జగన్ ఉదాశీనంగా వ్యవహరించడంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించడంలో గానీ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో గానీ పార్టీ శ్రేణులు పెద్దగా ఉత్సాహం చూపని పరిస్థితులు నెలకొని ఉండటానికి జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రాకుండా బెంగళూరులోనే ఎక్కవ కాలం మకాం ఉండటం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని  నేరుగా రంగంలోకి దిగి, పార్టీని గాడిలో పెట్టకపోతే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇక పోతే రాజకీయవర్గాలలో అయితే.. జగన్ రాజకీయ సన్యాసం చేశారా? లేక వ్యూహాత్మకంగా క్రియాశీలంగా ఉండటం లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను అడపాదడపా సోషల్ మీడియా వేదికగానో, తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే విమర్శించడం వినా..   ప్రజాక్షేత్రంలోకి వచ్చి గళమెత్తకపోవడంతో జగన్ ప్రభావం ఏపీ రాజకీయాలలో నామమాత్రంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
Rawking Manchu Manoj is all set to strike back in style with the hilariously entertaining title announcement of Vaddi Kaasula Vaada, which has instantly grabbed attention across social media. The title concept video was unveiled on the special occasion of Manoj’s birthday and has already sparked curiosity among audiences alike. Interestingly, the film marks Manoj Manchu’s reunion with AK Entertainments after the super success of Bindass, a film that remains one of the most loved entertainers in his career. Bringing back those vintage comedy vibes, Manoj once again showcases his trademark comic timing in the title concept video, reminding audiences why he earned a special fan base for his energetic and humorous performances. The concept video cleverly taps into the current trending EMI and installment culture, presenting a hilarious and relatable setup with Manoj pleading to God amidst financial tensions. The title Vaddi Kaasula Vaada itself sounds striking, catchy, and instantly connects with today’s audience. The fun-filled presentation, combined with a rooted commercial entertainer vibe, hints that a solid laughter-loaded entertainer is on the way. What makes the concept even more appealing is how naturally it connects with every middle-class household. From EMIs and monthly installments to financial struggles wrapped in humor, the theme feels highly relatable to today’s generation. At the same time, the video balances comedy with subtle emotions, making the concept feel entertaining yet emotionally grounded.  Written and directed by Tej Uppalapati, the project already looks like a promising entertainer loaded with humor, relatability, fun emotions, and vintage Manoj Manchu energy. If the title concept video is any indication, Vaddi Kaasula Vaada could turn out to be a solid commercial entertainer with a refreshing and relatable backdrop. Produced by Ramabrahmam Sunkara under AK Entertainments, co-produced by Kishore Garikipati (GK), Ajay Sunkara, and Daya Pannem, the film is presented by ATV.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్‌, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం (Ramani Kalyanam) మంచి ఫీల్‌గుడ్ సినిమాలా కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్‌, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. “కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది. సంజన RJ & సింగర్. తనకి చూపులేదు.. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్ గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి. ఈ కథని నేచురల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్‌తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్ట్ ఫేం రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ ట్రైలర్‌కు మరో బలం. కొన్ని మాటలు నేరుగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి.   టెక్నికల్‌గా కూడా ట్రైలర్ మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. సాఫ్ట్ విజువల్స్‌తో కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. మొత్తం మీద ట్రైలర్ అంతా ఒక క్లీన్ ఫీల్‌గుడ్ మూవీని ప్రామిస్ చేస్తోంది విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ నిర్మించిన 'రమణీ కళ్యాణం' సినిమా మే 22న విడుదల కానుండగా, ప్రస్తుతం ట్రైలర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని పెంచుతోంది.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ (Dragon) ఫస్ట్ గ్లింప్స్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ కట్ చేసిన రా అండ్ రస్టిక్ విజువల్స్ చూసి నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఈ మాస్ హై లో ఉండగానే, అభిమానులకు మరో ఊహించని సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War). గత కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల రూమర్స్ వస్తున్న తరుణంలో, నాగవంశీ తన ట్వీట్ ద్వారా వాటన్నింటికీ ఒక్కసారిగా చెక్ పెట్టారు. తారక్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. డ్రాగన్ గ్లింప్స్ అరాచకంగా ఉందంటూనే, ‘అతి త్వరలోనే మనం సెట్స్‌లో కలుద్దాం అన్నా’ అంటూ ట్వీట్ చేసి, 'గాడ్ ఆఫ్ వార్' గురించి హింట్ ఇచ్చారు. ఈ ట్వీట్‌లో ఆయన ప్రత్యేకంగా ఒక ‘నెమలి’ (Peacock) ఎమోజీని పెట్టడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లార్డ్ కుమారస్వామి (కార్తికేయ) బ్యాక్‌డ్రాప్‌లో, పౌరాణిక ఫాంటసీ ఎలిమెంట్స్‌తో త్రివిక్రమ్ ఈ డ్రీమ్ ప్రాజెక్టును ప్లాన్ చేశారనే వార్తలకు ఈ ఎమోజీ మరింత బలాన్ని చేకూర్చింది. ‘డ్రాగన్’ తర్వాత తారక్ ఈ లార్జ్ స్కేల్ మైథలాజికల్ డ్రామా షూటింగ్‌లోనే పాల్గొనబోతున్నట్లు స్పష్టమైంది. ఈ అఫీషియల్ హింట్‌తో ఎన్టీఆర్ లైనప్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.   https://x.com/vamsi84/status/2056807052060807574
    -పాన్ ఇండియా వ్యాప్తంగా డ్రాగన్ రికార్డుల మోత  -ఫ్యాన్స్ అయితే సంబరాల్లో బిజీ -అయితే ఎన్టీఆర్ క్యారక్టర్ లూగర్ పై కూడా చర్చ  -అసలు లూగర్ అంటే ఏంటి! -ఈ డీటెయిల్స్ మీ కోసమే  'డ్రాగన్'(Dragon)ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా లెవల్లో హయ్యస్ట్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే  గ్లింప్స్ రిలీజైనప్పట్నుంచి ఫ్యాన్స్, ఫిలిం సర్కిల్స్‌తో పాటు నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.  ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన కేజీఎఫ్ లో రాకీ బాయ్, సలార్ లో దేవా లాంటి మాస్ పేర్లని ఫిక్స్ చేస్తే  ఎన్టీఆర్ పోషిస్తున్న క్యారక్టర్ పేరు లూగర్ అని రివీల్ చేసారు. దీంతో  ఆ పేరు వెనుక ఉన్న మర్మమేంటి అని వాళ్లంతా  గూగుల్‌లో కూడా తెగ వెతికేస్తున్నారు. .  గూగుల్ సమాచారం ప్రకారం లూగర్ అనేది  సాధారణ పేరు కాదు, ఇది మొదటి  రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో జర్మనీ సైనికులు తమ ప్రామాణిక సర్వీస్ ఆయుధంగా ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్ పేరు. ఎంతో ఖచ్చితత్వం, గురి తప్పని నమ్మకానికి  లూగర్ పిస్టల్ పెట్టింది పేరు. జర్మనీ  పిస్టల్ తరహాలోనే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా శత్రువుల గుండెల్లో బుల్లెట్‌లా దూసుకుపోయేలా, గురి తప్పని వైల్డ్ ఎనర్జీతో, పవర్‌ఫుల్‌గా, డైనమిక్‌గా ఉండబోతోందని చెప్పడానికే లూగర్ పేరుని  డిజైన్ చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. Also read: Aditi Govitrikar: సంచలన నిజాలు బయటపెట్టిన పవన్ తమ్ముడు మూవీ లవ్లీ... లైంగికంగా వేధించారు   అయితే ఎన్టీఆర్ తో పాటు క్యారక్టరలందరికి ఆయుధాల పేరుని ఎందుకు ఫిక్స్ చేసానేది సస్పెన్స్.  ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ ని మైత్రీ మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 11, 2027 వరల్డ్ వైడ్ టేక్ ఆఫ్ డేట్      
రాకింగ్ మంచు మనోజ్ (Manchu Manoj) స్టైలిష్‌ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల వాడ' సినిమాను ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ కాన్సెప్ట్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.  టైటిల్ క్యాచీగా ఉండడం, మనోజ్ మ్యానరిజానికి తగ్గట్టుగా ఉండడంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్ లో 2010లో బిందాస్ సినిమా వచ్చింది. బిందాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇన్నాళ్లకు హీరో మనోజ్ మళ్లీ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో బ్యానర్ తో జతకట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  బిందాస్ సినిమాకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మళ్లీ అదే వైబ్‌ను చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ తనదైన కామెడీ టైమింగ్‌ ని చూపించారు. మనోజ్ అంటే ఎనర్జీ, హ్యూమర్ అని తెలిసిందే. మరోసారి అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ను వడ్డీ కాసుల వాడలో చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక మనోజ్ నుంచి ఓ సాలిడ్ కమర్షిల్ సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్‌ కు వడ్డీ కాసుల వాడ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.  మన జీవితంలో ఈఎంఐలు భాగమైపోయాయి. అదే కాన్సెప్ట్ తో వడ్డీ కాసుల వాడ రూపొందుతుంది. అప్పుల బాధకు కావాల్సినంత హాస్యాన్ని జోడించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో మనోజ్ దేవుడిని కోరుకోవడం చూస్తే నవ్వు ఆగదు. నన్ను ధనవంతుడిని చేస్తే.. తిరుపతిలో కాలేజ్ పెట్టి 25 పెర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని.. తన తండ్రి మోహన్ బాబు మోడ్యులేషన్ లో చెప్పడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఆయనకు ఉన్న ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు తనదైన స్టైల్ లో దేవిడిని మొక్కడం చూస్తుంటే ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. తేజ్ ఉప్పలపాటి రచన, దర్శకత్వంలో పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వడ్డీ కాసుల వాడ రూపొందుతోంది. ఈ సినిమాతో వింటేజ్ మనోజ్ ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్ చూడబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అలాగే అందరికి కనెక్ట్ అయ్యే కథ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫుల్ మీల్స్ అందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.  మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోకు వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేస్తూ.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తామని పేర్కొన్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నేతృత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.   
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు (మే 20) సందర్భంగా నందమూరి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లు లభిస్తున్నాయి. ఒకవైపు ఆయన నటిస్తున్న ‘డ్రాగన్’ (Dragon) చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా, మరోవైపు తారక్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక క్యూట్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీకి ఇద్దరు కొత్త స్నేహితులను పరిచయం చేస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఇంట్లోకి కొత్తగా వచ్చిన రెండు ముద్దుల పెంపుడు పక్షుల (బర్డీస్) ఫోటోను ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వాటికి ‘అసాహి’ (Asahi), ‘యూహి’ (Yuuhi) అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. ఈ పేర్లు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా తారక్ వెల్లడించారు. "నా పక్షులు అసాహి, యూహిలను మీకు పరిచయం చేస్తున్నాను. ఇవి జపాన్ దేశంపై నాకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం" అంటూ ఆయన రాసుకొచ్చారు. జపనీస్ భాషలో ‘అసాహి’ అంటే ఉదయించే సూర్యుడు అని, ‘యూహి’ అంటే సాయంత్రపు సూర్యుడు (సూర్యాస్తమయం) అని అర్థం. ఇంత అర్థవంతమైన పేర్లను ఎంచుకోవడంతో తారక్ అభిరుచిని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్ తన నటనతో, వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా విడుదలైనప్పటి నుండి జపాన్ దేశంలో తారక్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ ఊహించని స్థాయికి చేరుకుంది. జపాన్ ప్రజలు ఎన్టీఆర్‌ను తమ సొంత హీరోలా ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలోనే జపాన్ దేశం, అక్కడి సంస్కృతిపై తారక్ కు అపారమైన గౌరవం, ప్రేమ ఏర్పడ్డాయి. ఇప్పుడు తన పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టడం ద్వారా జపాన్ దేశంతో తనకున్న బలమైన అనుబంధాన్ని తారక్ మరోసారి చాటుకున్నారు. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలా తన పర్సనల్ లైఫ్‌లోని ప్రశాంతమైన, క్యూట్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకోవడం నందమూరి అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. డ్రాగన్ గ్లింప్స్ ఇచ్చిన మాస్ హై తర్వాత, తారక్ షేర్ చేసిన ఈ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ పిక్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది.   https://www.instagram.com/p/DYjcKj5mLaJ/
      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)బ్లాక్‌బస్టర్ మూవీ తమ్ముడులో లవ్లీగా పవన్ కి జతగా చేసిన నటి  అదితి గోవిత్రికర్(Aditi Govitrikar). కేవలం వెండితెరపైనే కాదు, నిజజీవితంలో ఆమె ఎంతోమందికి ఒక రోల్ మోడల్. వృత్తిరీత్యా ఆమె ఒక డాక్టర్.సైకాలజిస్ట్ గా ఎంతో మందికి సేవలందించింది. అలాగే  2001లో 'మిసెస్ వరల్డ్' కిరీటాన్ని కైవసం చేసుకున్న ఏకైక భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించింది. అదితి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏడూ సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, నా తండ్రి స్నేహితుడు నన్ను లైంగికంగా వేధించాడు. ఆ వయసులో నాకు అసలు  ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన, స్పర్శ  తీవ్రమైన అసౌకర్యాన్ని, భయాన్ని కలిగించాయి. ఆ పసి వయసులో ఎదురైన భయానక అనుభవాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక పది, పదిహేను  సంవత్సరాల పాటు  తీవ్రమైన మానసిక వేదనని అనుభవించాను. ప్రస్తుతం 20% కంటే ఎక్కువ మంది పిల్లలు ఏదో ఒక రూపంలో ఇలాంటి వేధింపులకి  గురవుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందుకే, సమాజంలో ఈ అంశంపై అవగాహన పెంచడం కోసమే  ఇప్పుడు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటు వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులని  కూడా గమించాలంటూ చెప్పుకొచ్చింది. Also read: Dhurandhar 2 :ధురంధర్ 2కి  ఢిల్లీ హైకోర్టు షాక్.. దేశ భద్రతకే ముప్పా!    ముంబైకి చెందిన అదితి 1998 లో ముఫజల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని  2009 లో విడాకులు తీసుకుంది. 1999 లో వచ్చిన తమ్ముడు మూవీతోనే సినీ అరంగ్రేటం చేసింది. తెలుగులో మరో చిత్రంలో చేయలేదు. కానీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి సత్తా చాటింది.  49 ఏళ్ల అదితి ప్రస్తుతం చిత్ర పరిశ్రమకి దూరంగా ఉంటు ముంబైలోనే   డాక్టర్‌గా వర్క్ చేస్తుంది.    
టాలీవుడ్‌లో తనదైన నటనతో, క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. నిరంతరం వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన లైఫ్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ముచ్చటించిన అనన్య.. గతంలో తాను ఎదుర్కొన్న బ్రేకప్ పెయిన్ గురించి మనసు విప్పి మాట్లాడింది. తాను ఒక వ్యక్తిని ఎంతగానో విశ్వసించానని, కానీ చివరకు అతడు నమ్మించి మోసం చేశాడని చెప్పుకొచ్చింది. అది కేవలం ప్రేమ విఫలం కావడం కాదని, నమ్మకద్రోహమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మోసం వల్ల దాదాపు మూడేళ్లపాటు తీవ్రమైన మానసిక నరకాన్ని అనుభవించానని అనన్య పేర్కొంది. ఉదయం లేచినప్పటి నుండి ఆ జ్ఞాపకాలే వేధించేవని, అయినప్పటికీ తన వృత్తిపరమైన బాధ్యతలను మాత్రం ఎప్పుడూ విస్మరించలేదని తెలిపింది. రాత్రంతా ఏడ్చినా, మరుసటి రోజు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేదాన్నని, షూటింగ్ సమయంలో క్యారవాన్‌లో ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేదాన్నని కన్నీటిపర్యంతమైంది. తన షాట్ రాగానే కళ్లు తుడుచుకుని కెమెరా ముందుకు వచ్చేదాన్నని వివరించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య, చిత్ర పరిశ్రమలోకి రాకముందు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్‌ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. నటనపై ఉన్న మక్కువతో లఘు చిత్రాలలో నటించి, ఆ తర్వాత ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆపై పవన్ కళ్యాణ్ ‘వ‌కీల్ సాబ్’, ‘ప్లే బ్యాక్’, ‘శాకుంతలం’, ‘పొట్టేల్’, ‘డార్లింగ్’ వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కేవలం అమ్మాయిల గురించే నెగిటివ్ మీమ్స్ వస్తుంటాయని, అబ్బాయిలే ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల వారి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే సమాజానికి తెలుస్తోందని ఈ సందర్భంగా అనన్య అభిప్రాయపడింది. అమ్మాయిల మనోభావాలు, వారు అనుభవించే బాధలు బయటకు రావడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
తెలంగాణ ఈఏపీసీఈటీ (TG EAPCET) ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఎం. రుషి (M. Rushi) కి జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రుషిని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఈ ప్రత్యేకమైన కలయిక వెనుక ఒక ఎమోషనల్ ఫ్యామిలీ సెంటిమెంట్, తండ్రి ఇచ్చిన మాట దాగి ఉంది.  కూతురు చదువులో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో, ఈఏపీసీఈటీ పరీక్షలో కనుక స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే.. తాను ప్రాణంగా ఆరాధించే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిపిస్తానని రుషి తండ్రి గతంలో ఒక పెద్ద ప్రామిస్ చేశారు. తండ్రి ఇచ్చిన ఆ ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న రుషి, పట్టుదలతో రాత్రింబవళ్లు చదివి ఊహించినట్లుగానే రాష్ట్రంలోనే టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. కూతురు సాధించిన ఈ అద్భుతమైన విజయంతో తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అన్న మాట ప్రకారం తన కూతురిని మెగాస్టార్ దగ్గరకు తీసుకువెళ్లగా, ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఎంతో సంతోషపడ్డారు. రుషి, ఆమె కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించుకుని.. ఆ టాపర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతటితో ఆగకుండా ఆమెతో సరదాగా కాసేపు ముచ్చటించి, ఆమె భవిష్యత్తు ఆశయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువులో ఇంతటి ప్రతిభ కనబరిచిన రుషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తన కెరీర్‌లో అత్యుత్తమ విజయాలు సాధించాలని మెగాస్టార్ ఆశీర్వదించారు. ఈ ఎమోషనల్, ఇన్‌స్పిరేషనల్ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, మెగాభిమానులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక తండ్రి తన కూతురిని ప్రోత్సహించిన విధానం, అలాగే ఆ చిన్నారి తన కలను నిజం చేసుకోవడానికి చూపిన పట్టుదల అందరికీ ఆదర్శంగా నిలిచాయని కొనియాడుతున్నారు.  
M. Rushi, a student from Resonance Junior Colleges in Hyderabad, recently made history by securing the State 1st Rank in the TG EAPCET 2026 examinations. She wanted to meet Chiranjeevi and her wish has been fulfilled. This achievement is particularly notable as she is the first female student to secure the top rank since the inception of the EAMCET in 1986, breaking a nearly four-decade trend predominantly held by male candidates. Prior to the exams, Rushi’s father promised her that achieving the top rank would earn her a meeting with Megastar Chiranjeevi. Following the announcement of the results, this promise was fulfilled. Chiranjeevi met with the young student to personally congratulate her on the historic accomplishment. During their interaction, the actor praised Rushi’s immense dedication and hard work. Going beyond a simple congratulatory gesture, Chiranjeevi assured Rushi’s family that he would take full financial responsibility for her upcoming higher education.  He emphasized that her academic journey must continue without any financial hurdles or interruptions. He also instructed her parents to contact him directly for any future educational assistance she might require. The meeting served as a fulfilling reward for Rushi, combining her groundbreaking academic success with a highly memorable personal milestone.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.
  భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం  ఎప్పుడూ తగాదాలు,  వాదనలతో నిండి ఉంటుంది.  కానీ గొడవ అయినా, తగాదాలు అయినా  భర్త పదేపదే  అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం.  ఇలా  అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు.  అవేంటో తెలుసుకుంటే.. భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..  భర్త  భార్యకు  అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.  సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి  కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.  భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు.. భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా  భర్తతో ఓపెన్ గా  మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ,  అది భార్యను  ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు.  ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది. కారణాలు అర్థం చేసుకోవాలి.. భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత.  ఇలా అర్థం చేసుకుంటే  తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు.  అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.   పరిష్కారం.. భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా  అండగా ఉన్నారని,  ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి  అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.   బయటి నుండి సహాయం.. పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య  మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి  అతను చేస్తున్నది ఎంత  తప్పు అనే విషయం  అర్థం చేసుకునేలా చేయడానికి  అతనితో సమయం గడపాలి. దగ్గరి వ్యక్తుల  సహాయం..   భర్త అబద్దాలు చెప్పడం అనే  సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు,   స్నేహితులు,  ఆత్మీయులు మొదలైనవారితో  చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు.  కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి.  భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.                                *రూపశ్రీ.
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
మలబద్ధకం (Constipation) లేదా మలబద్దకంతో బాధపడుతున్నారా? సుఖ విరేచనం అవ్వక ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అద్భుతమైన చిట్కాలను వివరించారు.  ముఖ్యంగా ఎండుద్రాక్ష (Raisins లేదా Kishmish) ఉపయోగించి సుఖ విరేచనం ఎలా అయ్యేలా చేసుకోవచ్చో, అలాగే మలబద్ధకానికి గల కారణాలు మరియు ఆయుర్వేద గృహ వైద్యం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. వీడియోలోని ముఖ్యమైన అంశాలు: మలబద్ధకం రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? కిస్‌మిస్ (ఎండుద్రాక్ష) మలబద్ధకాన్ని ఎలా నివారిస్తుంది? సుఖ విరేచనం కోసం కిస్‌మిస్‌ను ఎలా ఉపయోగించాలి? నిత్యం పాటించవలసిన సులభమైన ఆయుర్వేద చిట్కాలు. ఈ రోజే ఈ చిట్కాలను పాటించండి, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం నుండి లభించే పోషకాలు రక్తంలోకి శోషించబడేది కూడా ప్రేగుల ద్వారానే. శరీరంలో ఇంత ముఖ్యమైన విధులు నిర్వర్తించే ప్రేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉంటే పైన పేర్కొన్న విధులు మందగిస్తాయి. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందా లేదా తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచించే లక్షణాలు.. ఆహారం తిన్న తర్వాత.. ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నా, బరువుగా అనిపించినా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందని  అర్థం.  అయితే భారీ ఆహారం తీసుకున్నప్పుడు సాధారణంగానే ఉబ్బరంగా లేదా బరువుగా అనిపిస్తుంది. కానీ సాధారణ ఆహారం తీసుకున్నప్పుడు కూడా బరువుగా అనిపించడం, అది కూడా తరచుగా అనిపిస్తూ ఉంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని అర్థం. మలబద్దకం.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఉండే అతిపెద్ద లక్షణం మలబద్దకం.  మలం గట్టిగా రావడం లేదా మలవిసర్జన చేసేటప్పుడు గట్టిగా బలవంతంగా విసర్జన చేయడానికి ప్రయత్నించడం వంటివి ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తాయి. అలాగే మలవిసర్జన ప్రతి రోజూ ఒకే సమయానికి కాకుండా అస్తవ్యస్తంగా రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. గ్యాస్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న గ్యాస్, ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు అన్నీ కేవలం ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వస్తున్నాయని అనుకుంటారు చాలామంది. కానీ ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. అది కూడా గ్యాస్,  ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు పదే పదే వస్తాయి. నోటి ఆరోగ్యం.. నాలుక పైన తెల్లటి పూత రావడం, నోటి దుర్వాసన రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఒక సూచన. చాలామందికి నోరు ఎంత శుభ్రం చేసుకున్నా నాలుక మీద తెల్లని పూత,  నోటి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారిలో ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి.. ఆకలి సరిగా లేకపోయినా లేదా  అతిగా ఆకలి వేసినా కూడా ప్రేగు ఆరోగ్యం సరిగా లేదని అర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.                           *రూపశ్రీ.