పదవుల చిచ్చు.. కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.!

posted on: Jul 8, 2026 2:41PM

మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. విషయం ఏమిటంటే..   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన అసంతృప్తి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. 

మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం చలో గాంధీభవన్‌కు బయలుదేరింది. ఈ వర్గాన్ని  అర్వపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది.

రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీ చార్జితో పరిస్థితిని అదుపు చేశారు.  ఈ ఘటనతో అర్వపల్లి చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

conflict among Congress factions, flare up over posts, Suryapet district, Arvapalle, Stones, Sticks, Teluguone

google-ad-img
    Related Sigment News
    • Loading...