LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. మంగళవారం అమరావతిలో బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్  యూనివర్శిటీ (బిసెర్ ) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తుపై తనకున్న విజన్‌ను పంచుకున్నారు.  పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ కి ఈ సంస్థ పెద్దపీట వేయనుంది. రానున్న రోజుల్లో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి..  వారిని అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మెడికల్, పారామెడికల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు.  అలాగే.. ఈ ప్రాజెక్టు గడువుపై స్పష్టమైన చంద్రబాబు నిర్దిష్ట గడువు నిర్దేశించారు.  వచ్చే ఏడాది మే నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేయాలని  యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల అనుమతులు  ఆటో పైలట్  మోడ్‌లో వేగంగా మంజూరు చేస్తామని,ఇన్వెస్టర్లు  పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  గతంలో తాను హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ,  హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ..  అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు  చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులతో అమరావతి అంతర్జాతీయ పటంలో నిలుస్తుందన్నారు.  రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల కలలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు భవిష్యత్తులో ఈ నగరం ద్వారా అత్యధిక లాభం చేకూరుతుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని చంద్రబాబు అన్నారు.   రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్,  నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించడమే కాకుండా..  పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అమరావతి గడ్డపై బిసెర్ వంటి విద్యా, వైద్య సంస్థలు రావడం శుభపరిణామమన్న సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా..  రాజధాని ప్రాంతం ఒక మెడికల్ టూరిజం హబ్‌గా మారుతుందని చెప్పారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అమరావతి చేరుకున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం (మే 13) ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.  బుధవారం (మే13) ఉదయం  హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కు జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు  ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా పవన్ కల్యాణ్ అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఉపముఖ్యమంత్రిగా తన పనులు మొదలెట్టేశారు.  కాగా శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని అమరావతి చేరుకున్న పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 తమిళనాడు  అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో గెలిచింది. బుధవారం బుధవారం  అసెంబ్లీలో జరిగిన  విశ్వాస పరీక్షలో  ద‌ళపతి విజయ్ నేతృత్వంలోని  టీవీకే ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  ఇటీవలి ఎన్నికల్లో   విజయం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విజయ్.. ఈ విశ్వాస పరీక్షలో గెలిచి  నిలబె ట్టుకున్నారు. అయితే, ఈ ఓటింగ్‌కు ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన 59 మంది ఎమ్మెల్యేలతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక..  మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే  ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ,   ఆ పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో  దీంతో  తమిళ  రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన అన్నాడీఎంకే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయినట్లైంది. అన్నా డీఎంకేలో  పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ తిరుగుబాటుతో పళనిస్వామికి రాజకీయంగా గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక పోతే విశ్వాస పరీక్ష తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం విజయ్... విజిల్ చరిత్రను మార్చిందన్నారు.  తమది మైనారిటీ ప్రభుత్వం అని చెబుతూనే..   మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వమన్నారు.   
ఏళ్ల తరబడి  అమరావతి ఒక క్రియాశీలక రాజధాని ప్రాజెక్టుగా కంటే  ఎక్కువగా  రాజకీయ చర్చగానే మిగిలిపోయింది.  అమరావతి చుట్టూ జరిగిన   ప్రతి చర్చ చివరికి విధానం, ప్రాంతం, రాజకీయాలు లేదా కోర్టు పోరాటాలుగానే సాగింది. ఈ నేపథ్యంలోనే 2019 - 2024 మధ్య కాలంలో  క్షేత్రస్థాయిలో నిర్మాణాల వేగం మందగించింది. అమరావతి పురోగతిపై అనిశ్చిత పెరిగింది.   అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి. అయితే ఆ అనిశ్చితిని, అనుమానాలనూ పటాపంచలు చేస్తూ.. 12 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్ల నిర్మాణం పూర్తి చేసింది తెలుగుదేశం కూటమి సర్కార్. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ టవర్లు ఆధునిక సౌకర్యాలతో పూర్తిగా సిద్ధమయ్యాయనీ, త్వరలో జీఏడీకి అప్పగిస్తామనీ  మంత్రి  ప్రకటించారు.   మాములుగా చూస్తే.. ఇవి సాధారణ మౌలిక సదుపాయాల నవీకరణలుగా కనిపిస్తాయి కానీ,  రాజకీయంగా  ప్రభుత్వం వేసిన అడుగు..  అమరావతిపై అనిశ్చితిని పటాపంచలు చేసింది. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు ఇచ్చింది.  కంటికి కనిపించే నిర్మాణాలు, పనిచేసే కార్యాలయాలు ఇక ఎక్కువ జాప్యం లేకుండానే అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు భరోసా ఇచ్చాయి.  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  బండి కుమారుడిపై పోక్సో కేసు నమోదైందని తెలియగానే.. బీజేపీ ఆయనను పక్కన పెట్టేసింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ  ప్రధాని ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో ఆయన పేరును కనీసం ఆహ్వాన పత్రికలో కూడా ముద్రించలేదు. బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది.  ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ కూడా బండి సంజయ్ విషయంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది.  బండి సైంజయ్ కుమారుడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతుగా నిలవడానికి సిద్ధంగా లేదు. అయితే వైసీపీ మాత్రం అందుకు మినహాయింపుగా కనిపిస్తోంది.  తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బండి బగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం (మే14)   వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసులో బండి బగీరథ్ తరఫున  వైసీపీ ఎంపీ, సీనియిర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించనున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Renowned writer and director Janardhana Maharshi is setting a historic milestone in Indian cinema. He is taking a massive step by launching a dedicated and full-fledged Sanskrit Film Industry. While the Indian cinema landscape is largely defined by Telugu, Tamil, Malayalam, Kannada, and Hindi films, this new initiative stands out. It aims to bring the foundational language of Sanskrit to the mainstream silver screen in a big way. Through the newly established Bharathiya Sanskrit Film Federation, the goal is to present the rich linguistic beauty of Sanskrit to a global audience. A primary objective of this federation is to break the long-standing myth that Sanskrit is solely reserved for mythological epics and spiritual chants. Janardhana Maharshi clarified that this new venture will operate much like the regular regional film industries. The focus will be on producing engaging commercial films with sensible, contemporary storylines that connect with today's audience. The official registration of the federation is complete, and formal operations will begin on May 16th. Prominent industry giants, including Kannada producer Rockline Venkatesh, along with figures from the Tamil and Hindi fraternities, are joining as key partners to support this charity-driven trust. The federation will provide comprehensive support to filmmakers for worldwide promotions and film festival submissions. Janardhana Maharshi has set an ambitious target to make twelve films, with three projects already prepared to go on floors, promising a vibrant new chapter for Indian cinema.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The teaser for Raja The Raja, recently unveiled by filmmaker Nag Ashwin, brings a fresh and youthful energy to the screens. Directed by Annil Boyiidapu and produced under the Vrindavan Creations banner, the film introduces Ruthvik and Vishakha Dhiman in the lead roles. It sets the stage for a story that aims to balance lighthearted romance with the emotional weight of domestic expectations. At the heart of the narrative is a conflict that resonates with many Indian households. Ruthvik plays a young man with a secret passion for fashion design, yet he finds himself trapped in a web of lies to satisfy his father’s dream of him becoming a doctor. This struggle between personal ambition and parental duty forms a relatable core for the upcoming drama, highlighting the pressure many youngsters face today. The teaser showcases a close-knit bond between the protagonist and his father, played by the veteran VK Naresh. The dynamic shifts significantly with the introduction of Aadya, portrayed by Vishakha Dhiman. Her character appears to be the primary influence that challenges the protagonist's double life, eventually pushing him toward a path of self-discovery and difficult choices. Technically, the film looks polished with vibrant cinematography and a spirited score by Mark K Robin. While the theme of a student pursuing a non-traditional career is a familiar trope, the chemistry between the new leads and the modern treatment suggest an engaging watch. If the film can effectively navigate its blend of humor and tragedy, it could stand out as a meaningful coming-of-age story for a wide audience.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే ఫ్యాక్టరీ. కానీ, కాలక్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల మేజిక్ ఉన్నప్పటికీ థియేటర్ల దగ్గర మునుపటి సందడి కనిపించడం లేదు. ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడానికి వెనకాడుతుండటంతో టాలీవుడ్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. మల్టీప్లెక్స్‌ల ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు సామాన్యులకు భారంగా మారడం ఒక ఎత్తైతే, కంటెంట్‌లో నాణ్యత లేకపోవడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం స్టార్ పవర్ నమ్ముకుని సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఇటీవలి ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఓటీటీ విప్లవం తర్వాత ఆడియన్స్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. సినిమా రిలీజైన కొన్ని వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వస్తుండటంతో, థియేటర్లకు వెళ్లి ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని చూడటానికే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల నిర్మాతలకు నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా లాభం చేకూరినప్పటికీ, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రెంటల్ విధానం కంటే షేర్ పద్ధతిలో సినిమాలు ప్రదర్శించడం మేలని వారు భావిస్తున్నారు. ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించినా, రేట్లు పెంచితే ప్రేక్షకులు అసలు రారనే భయం వారిని వెంటాడుతోంది. గతంలో 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటినప్పటికీ, చిన్న మరియు మధ్యతరహా సినిమాలకు ఆదరణ కరువైంది. కేవలం విజువల్ వండర్స్ లేదా కొత్తదనంతో కూడిన కథలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ క్రమంలో దర్శకులు, రచయితలు తమ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో కూడా థియేటర్ల పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "సినిమా బాగుంటేనే థియేటర్ వరకు వెళ్తాం" అని నెటిజన్లు తెగేసి చెబుతున్నారు. ఇక హీరోల భారీ రెమ్యూనరేషన్లు కూడా ప్రొడక్షన్ కాస్ట్‌ను పెంచేసి నిర్మాతలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే నిర్మాణ వ్యయం తగ్గించుకోవడంతో పాటు, ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించేలా బలమైన కంటెంట్‌ను అందించాలి. రాబోయే పెద్ద సినిమాలైనా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి థియేటర్లకు కొత్త వెలుగులు నింపుతాయేమో వేచి చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు కౌన్సిల్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు ఆయన ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో కౌన్సిల్ పనితీరుపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నట్టి కుమార్ తన రాజీనామా లేఖలో కౌన్సిల్ పరిపాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. పర్సెంటేజ్ విధానాన్ని హ్యాండిల్ చేయడంలో కౌన్సిల్ విఫలమైందని, దీనివల్ల ఎగ్జిబిటర్లు పైచేయి సాధిస్తుంటే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, గిల్డ్ పెత్తనం సాగడం వంటి అంశాలను ఆయన ఎండగట్టారు. కౌన్సిల్‌లో ప్రజాస్వామ్యం కరువైందని, ఎన్నికలు లేదా నిబంధనలు లేకుండానే సంస్థ కొనసాగుతోందని నట్టి కుమార్ ఆరోపించారు. పరిపాలన, ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, జవాబుదారీతనం లేని చోట తాను పదవిలో కొనసాగడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు. కనీసం తన రాజీనామా తర్వాత అయినా సభ్యులందరూ మేల్కొని, సంస్థను వృత్తిపరంగా, పారదర్శకంగా నడపాలని ఆయన కోరారు. నట్టి కుమార్ రాజీనామాపై నిర్మాత మండలి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, పరిశ్రమలో చిన్న నిర్మాతల పక్షాన నిలిచే వ్యక్తిగా పేరున్న నట్టి కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం, మండలిలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.  
  తెలుగు సినిమా ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు రాజీవ్ కనకాల(Rajeev Kanakala). ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా ఉండేలా చేయగలిగే ధీశాలి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అనే టాగ్ లైన్ కూడా రాజీవ్ సొంతం. రీసెంట్ గా రాజీవ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో ఉన్న పళంగా వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చాడు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.    హైదరాబాద్‌లో ఉన్న వైబ్రాంట్ అనే స్కూల్‌‌ ఈవెంట్ కి రాజీవ్ గెస్ట్ గా హాజరయ్యాడు. దీంతో రాజీవ్ తీరుపై నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ స్పందిస్తు వైబ్రాంట్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నడుస్తుంది. అటువంటి స్కూల్ ని రాజీవ్  ఎలా ప్రమోట్ చేస్తాడంటు సదరు నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్( NVTS ) ఫైర్ అయ్యింది. దీంతో  రాజీవ్ కనకాల ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేసాడు. అందులో అయన మాట్లాడుతు  వైబ్రాంట్ స్కూల్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకి నా చేతుల మీదుగా చిన్నపాటి బహుమతులు, సత్కారాలు, సన్మానాలు జరిగాయి.  సెలబ్రిటీ అనుకోండి.. తెలిసిన వ్యక్తి అనుకోండి.. మీలో ఒకడిగా అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ పవన్ వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. Also read: Mouni Roy: భర్తతో విడిపోతున్నారా? రూమర్లకి చెక్ పెడుతున్న మౌనీ రాయ్ పిక్స్ నాకు నిజంగా ఆ స్కూల్ గురించి అవన్నీ తెలియదు. సందేహాలు ఏమైనా ఉంటే పేరెంట్స్ అంతా ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్లు ఏవైతే అడిగారో అవన్నీ కనుక్కుని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. స్కూల్ ప్రమోషన్స్ లో నా ఫోటోలు, వీడియోలు వాడొద్దు అని వైబ్రాంట్ యాజమాన్యానికి  చెప్పాను. స్కూల్ విషయంలో నన్ను అలెర్ట్ చేసిన NVTS కి ధన్యవాదాలని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.  
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ (Thalapathy Vijay) పేరే వినిపిస్తోంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్.. తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ కి మీ సలహా ఏంటి? అని మీడియా ప్రశ్నించగా.. కమల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "విజయ్‌ను కేవలం ఒక సినిమా నటుడిగా మాత్రమే చూడకండి. ఆయనకు ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు, అందులో తప్పేమీ లేదు. అయితే, ఆయన మా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది" అని కమల్ పేర్కొన్నారు. ఒక సీనియర్ నటుడిగా, తోటి రాజకీయ నాయకుడిగా విజయ్‌కు కమల్ ఇస్తున్న మద్దతు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా తమిళనాడు కొత్త సీఎం విజయ్ గురించి మీడియా అడగగా.. ఆయన సమాధానం చెప్పకుండా, చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళారు.   
మెగాస్టార్ విశ్వంభర(Vishwambhara)ఫేమ్ మౌనీ రాయ్(Mouni Roy)తన భర్త సూరజ్ నంబియార్‌(Suraj Nambiar)తో విడిపోనుందనే  న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో  చేసుకోవడంతో విడిపోతున్నారనే వార్తలకి బలం కూడా చేకూరినట్లయింది. రీసెంట్ గా ఈ విషయంపై  మౌనీ రాయ్ స్పందించడం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'మీడియా సంస్థలన్నింటికీ నా విన్నపం. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయకండి. మాకు కొంత సమయం, ప్రైవసీ  ఇవ్వండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. ఆమె నేరుగా విడాకుల గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, వస్తున్న వార్తలు తప్పుడు కథనాలు అని పేర్కొనడం గమనార్హం.  కానీ సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ ఇద్దరి పెళ్లి ఫోటోలని తొలగించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే  తన అకౌంట్‌ ని డీయాక్టివేట్ చేశాడు. మౌనీ రాయ్ స్నేహితురాలు అగ్ర హీరోయిన్  దిశా పటానీ కూడా సూరజ్‌ను అన్‌ఫాలో చేసింది. మరి  మౌనీ రాయ్ ఏమో అవాస్తవాలని అంటుంది. Also read: Suriya: చప్పుడు లేని వీరభద్రుడు.. కారణం ఇదేనా!    మౌనీ రాయ్, సూరజ్ నంబియార్‌ వివాహం జనవరి 27, 2022న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఫోర్ ఇయర్స్ కే విడిపోతున్నారనే  వార్తలు రావడం అభిమానులని  కలవరపెడుతోంది.మౌని రాయ్  నాగిని సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పేరు పొందిన విషయం తెలిసిందే.   
Jaya Krishna Ghattamaneni is ready to win over Telugu audiences with his striking looks and base voice in the upcoming film Srinivasa Mangapuram. Hailing from the prestigious Ghattamaneni family, he shows immense promise in carrying the rich legacy of Superstar Krishna and Mahesh Babu forward. Director Ajay Bhupathi, known for creating intense worlds in films like RX100 and Mangalavaaram, has crafted another engaging novelistic romance for this grand debut. The team has now delivered a vibrant and fun musical treat with their second single, Manga Manga. This energetic song follows the massive success of their first track, Alelle Alelle, which crossed 4.6 Million views in two weeks. The new song highlights the sparkling chemistry between Jaya Krishna and Rasha Thadani. The fun visuals feature him playfully mesmerized by her charm, asking her to let him live in Tirupathi. National Award-winning composer G V Prakash Kumar delivers a brilliant, infectious tune that grows into an addictive earworm. Sung energetically by L V Revanth with flavorful lyrics penned by Kasarla Shyam, the song is a perfect youth anthem. Bankrolled by Gemini Kiran under Chandamama Kathalu Pictures and presented by Ashwini Dutt, the film boasts top-notch technical values and an exciting star cast featuring Mohan Babu and Brahmaji.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే, ఈ సినిమా క్రేజ్ కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ఇప్పుడు అసెంబ్లీ హాల్స్‌కు కూడా పాకింది. తాజాగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా 'పుష్ప 2' సినిమాలోని ఒక అంశంపై జరిగిన చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో పుష్ప రాజ్‌ను ఉదాహరణగా తీసుకోవడం విశేషం. "పుష్ప 2 సినిమాలో చూపించినట్లుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సోఫాలు పంపిస్తున్నారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా నవ్వులు పూయించడమే కాకుండా రాజకీయ వేడిని కూడా పెంచాయి. సినిమాల్లోని సన్నివేశాలను రాజకీయ విమర్శలకు వాడుకోవడంలో ఉదయనిధి ఎప్పుడూ ముందుంటారు, ఇప్పుడు పుష్ప సినిమా సీన్లను ఆయన ప్రస్తావించడం వైరల్ అవుతోంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ పుష్ప రిఫరెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ "పుష్ప రాజ్ రేంజ్ అది" అంటూ పోస్టులు పెడుతుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఉదయనిధి స్టాలిన్ తెలివిగా సినిమా ట్రెండ్‌ను వాడుకొని విమర్శలు గుప్పించారని అభిప్రాయపడుతున్నారు.  
భారతీయ చలనచిత్ర రంగం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ పరిశ్రమలు. కానీ, వీటన్నింటికీ మూలమైన సంస్కృత భాషలో ఒక పూర్తిస్థాయి సినిమా ఇండస్ట్రీ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచననే నిజం చేస్తూ, ప్రముఖ రచయిత మరియు దర్శకుడు జనార్థన మహర్షి ఒక చారిత్రాత్మక అడుగు వేశారు. భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషా మాధుర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన "సంస్కృత ఫిలిం ఇండస్ట్రీ"ని ప్రారంభిస్తున్నారు. సంస్కృతం అంటే కేవలం పౌరాణికాలు, శ్లోకాలకే పరిమితం అనే అపోహను తొలగించడమే ఈ ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం. అస‌లు సంస్కృత ఫిలిం ఇండస్ట్రీని స్థాపించాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ల‌బోతున్నారు, ఇందులో ఎంత మంది భాగ‌స్వాములుగా చేరబోతున్నారు. ఈ సంస్థ కార్య‌క‌లాపాలు ఎలా ఉంటాయి అనే విష‌యాల గురించి జనార్థన మహర్షి మాట్లాడుతూ.. "తెలుగు, తమిళ పరిశ్రమల తరహాలోనే ఇది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ. ఇందులో కేవలం పౌరాణికాలే కాదు, చక్కని సెన్సిబుల్ కథలతో కూడిన కమర్షియల్ సినిమాలు కూడా నిర్మించవచ్చు. ఇప్పటికే నేను 'విశ్వదర్శనం', 'దేవస్థానం' వంటి చిత్రాల్లో శ్లోకాలను ఆ విధంగానే ప్రయోగించాను. ఇప్పుడు మరింత సీరియస్‌గా సంస్కృత భాష ప్రధానంగా సినిమాలు తీయబోతున్నాను" అని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన తర్కాన్ని ఆయన వినిపించారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలైన విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, భగవద్గీత అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైతే, ఆయనతో సంభాషించడానికి సంస్కృతం అవసరమని, అలాగే స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవతలతో మాట్లాడాలన్నా ఈ భాషలో ప్రావీణ్యం ఉండాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. అందుకే 'జయతు జయతు సంస్కృతం' అనే కాన్సెప్ట్‌తో ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. Bharathiya Sanskrit Film Federation పేరుతో ప్రారంభిస్తున్న ఈ ఇండస్ట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మే 16 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో కన్నడ నుంచి రాక్‌లైన్ వెంకటేష్‌తో పాటు తనికెళ్ల భరణి, కె.వి.రమణాచారి వంటి ఎందరో ప్రముఖులు భాగస్వామ్యం కాబోతున్నారు. ఈ ఇండ‌స్ట్రీలో ఎవరైనా సంస్కృత భాష‌లో  సినిమాలు తీయవచ్చు లేదా దర్శకత్వం వహించవచ్చు. వారికి ఈ ఇండస్ట్రీ తరపున పూర్తి సహకారం ఉంటుంది. అంతేకాదు, వారి సినిమాలకు సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్, ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపడం, కమర్షియల్ డీల్స్‌లో సహాయం చేయడం వంటి బాధ్యతలను జనార్థన మహర్షి స్వయంగా తీసుకోనున్నారు. గతంలో జి.వి.అయ్యర్ వంటి వారు సంస్కృతంలో చిత్రాలు తీసినప్పటికీ, ఇప్పుడు జనార్థన మహర్షి ఏకంగా 12 సినిమాలు తీయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. సంస్కృత సినిమాను ఒక భాషగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జనార్థన మహర్షి 'సన్ ఆఫ్ సాన్‌స్క్రిట్' అనిపించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చారిటీ మరియు ట్రస్ట్ రూపంలో సాగే ఈ ప్రయత్నం భారతీయ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చు. సంస్కృత భాషాభిమానులు, సినీ ప్రియులు ఈ వినూత్న ప్రయత్నానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
  నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో "పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిదా?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు హెల్త్ కోచ్ ఈ వీడియోలో వివరించారు. పంచదార vs బెల్లం: ఏది బెటర్? చాలా మంది పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే, వాస్తవానికి పంచదార మరియు బెల్లం రెండింటికీ దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. గ్లైసీమిక్ ఇండెక్స్: పంచదార నేరుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణం కావడం: బెల్లంలో మొలాసిస్ (Molasses) ఉండటం వల్ల, ఇది పంచదార కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ, శరీరానికి అందే క్యాలరీలు మరియు ప్రభావం విషయంలో రెండూ దాదాపు సమానమే. సలహా: మీరు ఆరోగ్యంగా ఉండి, గ్లూకోజ్ లెవల్స్ సాధారణంగా ఉంటే పరిమితంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రెండింటికీ దూరంగా ఉండటమే మంచిది. స్వీట్నెస్ మరియు ఆరోగ్యం ప్రకృతిలో లభించే పండ్లు మొదలైనవి మనకు అలవాటైన స్వీట్లంత తీపిగా ఉండవు. బ్రాండ్లు మరియు కంపెనీలు మనకు ఈ అధిక తీపిని అలవాటు చేశాయి. పిసిఒఎస్ (PCOS), హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలకు చక్కెర ప్రధాన కారణం. డయాబెటిస్ మరియు హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చక్కెరను డైట్ నుండి వీలైనంత వరకు తొలగించాలి. ప్రత్యామ్నాయాలు ఏవి? చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన స్వీట్నర్లను వాడవచ్చు: మొంక్ ఫ్రూట్ (Monk Fruit): ఇది తక్కువ క్యాలరీలను ఇస్తుంది మరియు ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచదు. స్టీవియా (Stevia): దీనిపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మితంగా వాడితే ఇది సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి దీనిని ఎంచుకోవాలి. బయటికి సన్నగా ఉన్నా లోపల ప్రమాదమేనా? కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు (Metabolism వల్ల). కానీ వారు జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర తీసుకుంటే, అది బయటికి కనిపించకపోయినా లోపల లివర్ ఇన్ఫ్లమేషన్ (Liver Inflammation) కు దారితీస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించే లేదా పెంచే ఎంజైమ్స్ లోపం వల్ల కొందరు లావు అవ్వకపోవచ్చు, కానీ వారి రక్త నాళాల్లో అడ్డంకులు (clogging) ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకరి శరీరం స్పందించే తీరు మరొకరికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ముగింపు: ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం లేదా పెరగడం మాత్రమే కాదు, లోపల అవయవాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది ముఖ్యం. సరైన పోషకాహారం మరియు మితమైన తీపి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...