ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్యాక్ ఇన్ వర్క్

posted on: May 13, 2026 12:50PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అమరావతి చేరుకున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం (మే 13) ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.

 బుధవారం (మే13) ఉదయం  హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కు జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు  ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా పవన్ కల్యాణ్ అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఉపముఖ్యమంత్రిగా తన పనులు మొదలెట్టేశారు.  కాగా శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని అమరావతి చేరుకున్న పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...