LATEST NEWS
ఒంగోలులో దామచర్ల, బాలినేని వ్యవహారంపై ఇటు తెలుగుదేశం, అటు జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యాయి. తెలుగుదేశం హైకమాండ్ దామచర్లకు, జనసేన అధిష్ఠానం బాలినేనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఒం  మాజీ మంత్రి, జనసేన నాయకుడు   బాలినేని శ్రీనివాసరెడ్డి,   తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ల నడుమ గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి.  తాజాగా ఈ ఇరుురు నేతలూ పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సంచలనం రేపింది.   ఈ ఇద్దరు కీలక నేతల   వైరం   కూటమి ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలహై కమాండ్ లు  ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై  అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి.  ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దామచర్ల, బాలినేని వ్యహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఉమ్మడి సమన్వయ కమిటీ నేతలు  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయంలో, నేతలు ఇలా   పరస్పరం విమర్శలూ, దూషణలతో  రోడ్డెక్కడం ఏమాత్రం సరికాదని కమిటీ పేర్కొంది.   నేతల మధ్య  విబేధాలు, సమస్యలు   ఉంటే వాటిని పార్టీల అంతర్గత వేదికలపై  మాట్లాడటంలేదా,  అధిష్టానం దృష్టి తీసుకురావడం చేయాలే తప్ప..  మీడియా  ఎదుటకు వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం కరెక్ట్ కాదనీ, కూటమి ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందనీ కమిటీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.  ఈ వివాదానికి వెంటనే స్వస్తి పలకాలని,   ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని  ఇరువురికీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.   ఇరు వర్గాలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అయోమయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇటువంటి వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడమే కాకుండా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రెండు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన హైకమాండ్, ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. కూటమిలో ఏ చిన్నపాటి విభేదాలు వచ్చినా స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలి లేదా సమన్వయ కమిటీల దృష్టికి తీసుకురావాలి తప్ప, మీడియాని వేదికగా చేసుకుని పరస్పర బురదజల్లుడు కార్యక్రమాలు చేపడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సీరియస్ హెచ్చరికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ తమ విమర్శల దాడిని నిలిపివేసి సంయమనం పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ, ఇరువర్గాల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఈ ఇద్దరు నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను తుచ్ఛంగా భావించి మళ్లీ బహిరంగ విమర్శలకు దిగితే, పార్టీల నాయకత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం కోరుతోంది. మొత్తానికి, ఒంగోలులో రగిలిన పొలిటికల్ కాకను చల్లార్చేందుకు తెలుగుదేశం, జనసేన ఉన్నత నాయకత్వాలు తీసుకున్న శీఘ్ర నిర్ణయం కూటమి వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో క్రమశిక్షణ, భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఎంత ముఖ్యమో ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో జిల్లా స్థాయిలోనే సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలను, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మరి హైకమాండ్ విధించిన గీతను దాటకుండా ఈ ఇద్దరు కీలక నేతలు కలసి పనిచేస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. Balineni Srinivasa Reddy,  Damacharla Janardhan, Ongole Alliance Dispute, TDP Jana Sena Warning, Andhra Pradesh Politics, TeluguOne
రాజ మహూంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ను  కారుతో ఢీకొట్టి దారుణ హత్యకు గురి చేసిన సంఘటన   రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి విదిమే.   ఈ కేసును ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిండానికి వైసీసీ అధినేత చేస్తున్న ప్రయత్నం వెనుక ఉన్న  ఈ కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకడైన న ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఒక పాపస్టర్ కుమారుడు కావడమేనంటున్నారు.వాస్తవానికి విషయంతో సంబంధం లేకుండాప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం వైసీపీ ఎకోసిస్టమ్లో భాగంగా మారిపోయింది.  రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో  నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది. రెండుసంఘటనల్లోనూ ఆయన   స్పందన వేరువేరుగా ఉంది. కాశీబుగ్గ ఘటనలో నిందితులకు అనుకూలంగా, రాజమహేంద్రవరం సంఘటనలో మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లోని వైరుధ్యాన్నీ, ప్రభుత్వంపై నిందలు మోపుతున్న తీరునూ గమనిస్తే.. జగన్ నిందితులకు  మద్దతుగా మాట్లాడుతూ, రాజకీయంతోనూ, ప్రభుత్వంతోనూ ఏమాత్రం సంబంధం లేని సంఘటనలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని చెప్పకతప్పదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండుసంఘటనల్లోనూ కూడా నిదితులు మద్యం మత్తు, నిర్లక్ష్యం, అహంకారంతో వాహనం నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణం బలితీసుకున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఇసుమంతైనా లేదు.   ముందుగా కాశీబుగ్గ సమీపంలో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయానికి వస్తే..  ఆ సంఘటనలో ఒక పేద గొర్రెల కాపరి దానయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ సందర్భంగా  వైసీపీ అధినేత జగన్  వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. తొలుత  సొంత పార్టీ నేత కుమారుడిని రక్షించేందుకు వేరొక అనామకుడిపై నింద మోపే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో నడిరోడ్డుపై పడి ఉన్న దానయ్యను కాపాడే ప్రయత్నం చేయలేదు. దానయ్య కుటుంబాన్ని ఆదుకోలేదు. కుమారుడిని కాపాడేందుకు, కేసును తప్పుదోవపట్టిచేందుకు ప్రయత్నించిన   సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే..  దాన్ని రాజకీయ కక్ష సాధింపు గా జగన్ రెడ్డి  అభివర్ణించి విమర్శల పాలయ్యారు.  బాధితుడైన గొర్రెల కాపరి కుటుంబం ఆవేదనను పక్కనపెట్టి, కేవలం తమ పార్టీ నేత, కుల సమీకరణాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. సీదిరి అప్పలరాజు, అతడి కుమారుడిపై కేసు పెట్టడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా, మత్స్యకార నాయకుడ్ని వేధించడంగా  అభివర్ణించారుర.  ఇక తాజాగా రాజమహేంద్రవరం ఘటనలో డాక్టర్ ప్రియాంక మరణానికి కారణమైన  వారిలో ఒక నిందితుడు..  తనకు కీలకమైన  ఓటు బ్యాంకువర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఈ ఘటనలో మరణించిన ప్రియాంక వైద్య విద్యార్థిని కావడంతో  ఏం మాట్లాడాలో తెలియక డైలమాలో పడిన జగన్ చివరికి ప్రభుత్వాన్నినిందిస్తూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.  జోసెఫ్ ఎడ్వర్డ్స్ కుటుంబం సామాజికంగా, మతపరంగా వైసీపీకి సాంప్రదాయకంగా మద్దతు ఇచ్చే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో రాజమమేంద్రవరం కేసులో  నిందితులకు కఠిన శిక్ష పడాలని, వైసీపీ చేస్తున్న డిమాండ్లు మాటవరసేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే..  కాశిబుగ్గ కేసులో అప్పలరాజు కొడుకుపై చట్టం చర్యలు తీసుకుంటే వ్యతిరేకించిన జగన్.. ప్రియాంక విషయంలో  అందుకు భిన్నంగా స్పందిస్తారని ఎలా భావించగలమని అంటున్నారు.    ప్రియాంక తండ్రి కడుపు కోతతో మాట్లాడుతున్న మాటలను  రాజకీయం చేసి లబ్ధి కోసం పాకులాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు, ఒక నిందితుడు తమ పార్టీ నేత కొడుకైనా, లేక ఓటు బ్యాంకుకు చెందిన ప్రముఖుడి కొడుకైనా శిక్ష ఒకేలా ఉండాలి.. జగన్ డిమాండ్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి కదా అంటున్నారు.   బాధితురాలైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఏపీవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, వైసీపీ ద్వంద్వ వైఖరి ఆ పార్టీ విశ్వసనీయతను మరింత మరింత మసకబారుస్తోందనడంలో సందేహం లేదు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో బాధితుడికి ఒక న్యాయం, రాజమహేంద్రవరం ప్రియాంక కేసులో మరో న్యాయం అన్నట్లుగా జగన్ రాజకీయాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Jagan double standards, Politics, Hit and Run, Sidiri Appalaraju Son, Doctor Priyanka
రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేసిన విజయసాయి.. అడుగులు ఇప్పుడు మళ్లీ పాలిటిక్స్ దిశగా పడుతున్నాయి.  రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి.. ఇటీవల మళ్లీ పాలిటిక్స్ పై తన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ మధ్య కొంత కాలం సొంత మీడియా అంటూ హడావుడి చేసిన విజయసాయి.. ఇప్పుడు పాలిటిక్సే తన గమ్యం అని చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తలలో విజయసాయి పెట్టబోయే సొంత పార్టీ పేరు  భారత్ జన వికాస్ అంటూ నెట్టింట వైరల్ అవుతోంది.  వైసీపీలో ఉండగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన విజయసాయి.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించి హస్తినలో చక్రం తిప్పారు. అయితే ఆ తరువాత పార్టీలో మారిన  పరిస్థితుల్లో ప్రాధాన్యత కోల్పోయి, అవమానాలను ఎదుర్కొనాల్సి రావడంతో..  వియసాయి పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసేసి, పార్టీలో కోటరీ అంటూ నిందిస్తూ.. ఇక వ్యవసాయమే వ్యాపకం అంటూ దణ్ణం పెట్టి మరీ రాజకీయ సన్యాసం ప్రకటించేశారు.    సోషల్ మీడియాలో  ప్రచారంలో ఉన్న దానిని బట్టి విజయసాయి త్వరలో  ఏర్పాటు చేయబోయే సొంత పార్టీకి భారత్ జన వికాస్(బీజేవీ) అనే  పేరు పరిశీలనలో ఉంది.  గతంలో ఆయన కొత్త పార్టీ ప్రకటనతో పాటు ఒక సొంత మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరి చూడాలి ఆయన మీడియా సంస్థ ఏర్పాటు చేస్తారా? కొత్త రాజకీయ పార్టీతో జనం ముందుకు వస్తారా అన్నది.  Vijayasai Reddy New Party, Bharat Jana Vikas, AP Politics Latest News, Vijayasai Reddy Political Re Entry, Former MP Vijayasai Reddy, YSRCP Vijayasai Reddy
ఆంధ్రప్రదేశ్ లో బీసీ సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం దిశగా కూటమి  వ్యూహాత్మకంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో  బీసీల హక్కులను పరిరక్షణతో పాటు.. వారికి సమగ్రమైన చట్టబద్ధమైన రక్షణ కల్పించే  లక్ష్యంతో  బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని   మంత్రి నారా లోకేష్ ప్రకటన   ప్రాధాన్యత సంతరించుకుంది.  గతంలో లోకేష్   యువగళం పాదయాత్రలో,  ఎన్నికల ప్రచార సభలలో బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి ఆత్మీయ సమావేశాలలో లోకేష్ బీసీ రక్షణ చట్టంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలు   ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసుల  ముప్పు నుంచి వారికి శాశ్వత విముక్తి కలిగించడమే ఈ ప్రతిపాదిత చట్టం  ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. బీసీల సామాజిక, ఆర్థిక,  రాజకీయ వికాసానికి తోడ్పాటునందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని లోకేష్ పునరుద్ఘాటించారు.  బీసీ రక్షణ చట్టం  వివరాలు,  నియమావళి,  అమలు తీరుతెన్నులను విశ్లేషిస్తే, రాష్ట్రంలో బీసీల ఇది  రక్షక కవచం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో  బీసీ వర్గానికి  ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు,  సామాజిక కార్యకర్తలపై అనేక రకాల అక్రమ కేసులు నమోదయ్యాయి.  సుమారు 26 వేల మందికి పైగా బీసీలపై వివిధ  పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుఅయ్యాయి. వారిని జైళ్ల పాలయ్యారు. తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు.  ఇటువంటి అన్యాయాలను  పూర్తిగా అరికట్టేందుకు బీసీ రక్షణ చట్టం దోహదపడనుంది. ఈ   చట్టం అమలులోకి వస్తే, బీసీలకు చెందిన వారిపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం ఉండదు, ఒకవేళ దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే బాధితులకు ఉచితంగా   న్యాయ సాయం అందించే బాధ్యతను ప్రభుత్వమే   స్వీకరిస్తుంది.  న్యాయపోరాటం చేయడానికి అయ్యే అన్ని రకాల ఖర్చులను కూడా ప్రభుత్వం తరఫున భరిస్తూ, వారికి నిరంతరం లీగల్ సపోర్ట్ అందిస్తుంది. కేవలం రక్షణ చట్టానికే పరిమితం కాకుండా, బీసీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా పూర్వ  వైభవాన్ని తీసుకురావడానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కూడా అమలు చేయనున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ ఉపకులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రాతిపదికన సముచిత రీతిలో ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ రుణాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు,  ఇతర రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలలో బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్న లోకేష్.. వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. యువతలో వృత్తి నైపుణ్యాలను విస్తృతంగా పెంపొందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నియోజకవర్గాల వారీగా చేపట్టి, యువతను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా సొంతంగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.  
భారతీయ రాజకీయాల్లో గత కొద్ది సంవత్సరాలుగా   ఎక్కువగా వినిపిస్తున్న,   చర్చనీయాంశమైన పదాలలో  పప్పు అన్న మొదటి వరుసలో ఉంటుంది.   ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించడానికి రాజకీయ నాయకులు తరచూ ఈ పప్పు పదాన్ని ఉపయోగించారు. జాతీయ రాజకీయాలలో ఈ పప్పు అన్న పదానికి ప్రత్యామ్నాయంగా రాహుల్ ను చూపుతూ ప్రత్యర్థులు తెగ ట్రోల్ చేసేవారు. అలాగే ఏపీలో పప్పు పద ప్రయోగానికి ఎక్కువగా గురైన వారు నారా లోకేష్. లోకేష్ తన యువగళం పాదయాత్ర ద్వారా కంప్లీట్ గా  మేకోవర్ అయ్యారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారే లోకేష్ పరిణితిని, ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరును ప్రశంసించాల్సిన పరిస్థితిలో పడ్డారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారు ఇప్పుడు సైలెంటైపోయారు.   పప్పు అన్న పదం ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మారుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతోంది. అలాగే జాతీయ రాజకీయాలలో కూడా రాహుల్ గాంధీ పరిణితి చెందిన నేతగా మేకోవర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనా విధానం, యువత స్పందన,  నాయకుల ఇమేజ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.  పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే వాదనలు,   ప్రభుత్వ పనితీరుపై వచ్చే గణాంకాలు ఈ రాజకీయ పదాల పుట్టుకకు, వాటి అర్థం మారడానికి  కారణం అవుతున్నాయి.  లోక్‌సభలో జరిగిన చర్చల సమయంలో కొందరు ఎంపీలు ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక వృద్ధి రేటు వంటి అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ సమయంలో తయారీ రంగంలో నమోదైన ప్రతికూల వృద్ధి రేట్లు,  ఆర్థిక సంక్షోభ సూచీలను ఉదహరిస్తూ, అసలైన అసమర్థత ఎవరిదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. సమాజంలో ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు, కేవలం సోషల్ మీడియా ప్రచారాలు లేదా క్యూరేటెడ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్  శాశ్వతం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో మారుతున్న యువత ఆలోచనా ధోరణి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఆర్థిక అసమానతలు వంటి వాస్తవ సమస్యలను ప్రజలు  గమనిస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రెండ్లు, మీమ్స్,  క్రియేటర్ ఎకానమీ ద్వారా రాజకీయ నాయకుల వ్యూహాలను యువత తిప్పికొడుతోంది.    ఒకప్పుడు ఒకరిని అప్రతిష్ఠపాలు చేయడానికి వాడిన పప్పు అన్న పదమే ఇప్పుడు బూమరాంగ్ అయ్యి.. ఎవరిని ఇరుకున పెడుతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా, ప్రజాస్వామ్యంలో ఏ  ఇమేజ్ కూడా శాశ్వతం కాదని, ప్రజల చైతన్యమే అంతిమ తీర్పును ఇస్తుందని చరిత్ర పదే పదే నిరూపిస్తుంటుంది. రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎగతాళి చేసిన వారూ, యువత అంటే 59 ఏళ్ల యువకులు కారంటూ ఎద్దేవా చేసిన వారూ ఇప్పటి పరిస్థితుల్లో యూత్ ట్రోలింగ్ కు గురి కావడమే కాకుండా వాస్తవ సరిస్థితులలో అడుగు వెనక్కు వేసి మరీ ఆబోరు కాపాడుకోవలసిన పరిస్థితిలో ఉన్నారు.  Indian politics, Pappu political term, Parliament debate, economic indicators, political narrative, Trolling, bumarang
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలోని సంచలన పాట 'దబిడి దిబిడి' గురించి ఆయన ఓపెన్‌గా స్పందించారు. ఈ సినిమాలో బాలకృష్ణ, బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కలసి వేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ అప్పట్లో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పాటలో బాలయ్య ఊర్వశిపై వేసిన ఒక ప్రత్యేకమైన మాస్ స్టెప్ వివాదాస్పదంగా మారింది. తాజాగా ఓ టాక్ షోలో యాంకర్ దీనిపై ప్రశ్నించగా శేఖర్ మాస్టర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "ఆ స్టెప్ కంపోజ్ చేస్తున్న సమయంలో మాకేమీ తప్పుగా అనిపించలేదు. ఒక రెగ్యులర్ మాస్ స్పెషల్ సాంగ్ తరహాలోనే దాన్ని డిజైన్ చేశాం. కానీ పాట రిలీజ్ అయ్యాక జనాలు దానిని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు" అని వివరణ ఇచ్చారు. ఆ డాన్స్ మూమెంట్ కంపల్సరీగా తాను కొరియోగ్రఫీ చేసినందుకు ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా అని అడగ్గా, అలా ట్రోలింగ్ జరగడం చూసి కొంత బాధపడ్డానని శేఖర్ మాస్టర్ అంగీకరించారు. అయితే ఆ పాటలో ఆ స్టెప్‌ను తనే కంపోజ్ చేశానని ఇప్పటికీ చాలామందికి తెలియదని, కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ప్రచారం జరిగిందని చెప్పారు. దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, ఈ ఒక్క పాటలోని స్టెప్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఊర్వశి రౌతేలా కూడా గతంలో దీనిపై స్పందిస్తూ రిహార్సల్స్ సమయంలో తమకు ఎలాంటి ఇబ్బందికరమైన భావన కలగలేదని తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ బయటకు రావడంతో నెటిజన్లు మళ్లీ ఈ పాటపై తమ అభిప్రాయాలను నెట్టింట పంచుకుంటున్నారు. శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇవ్వడం మంచిదైందని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం స్టార్ హీరోల పాటల్లో కొరియోగ్రఫీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా ఎన్నో చార్ట్‌బస్టర్ సాంగ్స్‌కు అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లలో మాస్ పాటల డిజైనింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Akhil Akkineni's team has officially clarified that the actor is yet to sign his next project, putting an end to the speculation that has been doing the rounds on social media. For the past few days, several names have been linked to Akhil's next, with reports suggesting that he could be joining hands with directors including Puri Jagannadh and Parasuram Petla, among others. With multiple rumours gaining traction across social media, the actor's team has now stepped in to make the actual status clear. The team stated that Akhil has not signed his next project yet and requested everyone not to believe or circulate rumours regarding the same. An official announcement about his next film will be made soon. The speculation has naturally picked up after Akhil's recent big success with Lenin. The film gave the actor a much-needed commercial breakthrough and generated strong positivity, making his next choice an interesting talking point among moviegoers and the industry. With the success of Lenin behind him, there is considerable curiosity about which filmmaker Akhil will choose for his next. While Puri Jagannadh, Parasuram Petla and a few other directors have been linked to the actor, none of these collaborations have been officially confirmed at this point. The latest clarification therefore makes it clear that fans will have to wait for Akhil's team to announce the project officially. Given the momentum created by Lenin, expectations will be high for whatever Akhil chooses as his next film. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి కాస్టింగ్ కౌచ్, మహిళపై లైంగిక వేధింపుల దారుణం తీవ్ర కలకలం రేపుతుంది. 'బడే దిల్ వాలా' (1999), 'జోరు కా గులామ్' (2000) వంటి క్రేజీ చిత్రాలను తీసి గుర్తింపు పొందిన 73 ఏళ్ల సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీ. ఇప్పుడు ముంబై పోలీసులకి  చిక్కడం చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. దీంతో  సీనియర్ ఫిల్మ్‌మేకర్ ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టాడో తెలిసి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.  ఈ విషాదకర సంఘటన మూలాలు 2016 సంవత్సరం వరకు వెళ్తాయి.  ముంబైలోని లోఖండ్‌వాలాలో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో  నటిగా స్థిరపడదామని అనుకున్నయువతీ, షకీల్ నూరానీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ యువతికి తన రాబోయే కొత్త సినిమా ప్రాజెక్టులో మంచి అవకాశం ఇస్తానని నూరానీ మాట ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే ఆ తర్వాతి రోజుల్లో ముంబై మాల్వానీ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి స్క్రిప్ట్ చర్చల పేరుతో నూరానీ పిలిపించాడు. సినిమా చర్చల కోసం వెళ్లిన ఆ యువతి జీవితం అక్కడే ఊహించని మలుపు తిరిగింది.  కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమెకు ఆ అసభ్యకరమైన వీడియోను చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా కుటుంబ సభ్యులకు చెప్పినా ఈ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టాడు. ఈ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ గడిచిన 4 ఏళ్ల కాలంలో ఆమెపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.     ఈ వేధింపులు కేవలం శారీరక దాడికే పరిమితం కాలేదు. గర్భనిరోధక మాత్రలు ముగించడం, ఆపై విషపూరిత పదార్థాలు కలిపిన ఆహారం తినిపించడం వల్ల ఆమె గర్భస్రావానికి గురైందనే  సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్య చికిత్స కోసం నటి ముంబై తిరిగి వచ్చిన తరువాత, దాదాపు 40 రోజుల క్రితం మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో ధైర్యంగా ఫిర్యాదు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే 73 ఏళ్ల షకీల్ నూరానీ పరారయ్యాడు. Also read: Toxic: యష్ రిస్క్ చేస్తున్నాడా,బయటపడలేకపోతున్నాడా! పోలీసులు మొదట ఆయన కుమారుడి అంధేరి లోఖండ్‌వాలా నివాసంలో సోదాలు చేసినా ఆచూకీ లభించలేదు. చివరకు సాంకేతిక ఆధారాల సహాయంతో ముంబైకి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మహాబలేశ్వర్ ఏరియాలోని ఒక ఫామ్‌హౌస్‌లో దాక్కున్నట్లు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన పోలీసులు నూరానీని అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు.  నూరానీపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 64(2)(m) (లైంగిక దాడి), 123 (విషప్రయోగం), 88 (అక్రమ గర్భస్రావం కలిగించడం) మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద  కేసులు నమోదు చేశారు. అనంతరం  బోరివలి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సినిమా ఆశలతో వచ్చే నటీమణుల జీవితాలతో ఆడుకునే ఇటువంటి సంఘటనలు బాలీవుడ్ చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టాయి. Shakeel Noorani, Malvani police station, Bollywood   
  మొన్న యష్ వన్ మాన్ షో టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఉంది. స్టిల్ ఈ టైంకి ట్రైలర్ చూసే వాళ్ళ ఫిగర్ ని ఖచ్చితంగా చెప్పడం కష్టం. అంతలా తన యూనిక్ హీరోయిజంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నాడు.  యష్ కి అంతటి ఇమేజ్ ని సంపాదించిన చిత్రాలు 'కేజీఎఫ్: ఛాప్టర్ 1', ఛాప్టర్ 2' సినిమాలనే విషయాన్నీ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులని తిరగరాశాయి. అయితే ఆ రెండు భారీ విజయాల తర్వాత యష్ తన తదుపరి అడుగు విషయంలో చాలా సమయం తీసుకున్నాడు. అయితే సినీ ప్రియులని , ట్రేడ్ విశ్లేషకులని ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం ఏంటంటే టాక్సిక్ లో  యష్ 'రాయా' (Raya) అనే అత్యంత శక్తివంతమైన, గ్రే షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నాడు. గోవా డ్రగ్ అండ్ డాన్ బ్యాక్‌డ్రాప్‌లో, డార్క్ అండర్‌వరల్డ్ నేపథ్యంతో రూపొందుతుంది. ఇక మరొక వైపు, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' (Ramayana) లో యష్ ది లంకేశ్వరుడైన 'రావణాసురుడి' రోల్. ఒకవైపు 'టాక్సిక్' లో డార్క్ అండర్‌వరల్డ్ కింగ్‌గా, ఇంకోవైపు 'రామాయణ' లో రావణుడిగా ఈ రెండు పాత్రల్లోనూ ప్రతి నాయక లక్షణాలు, తీవ్రమైన వైలెన్స్, నెగిటివ్ షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'కేజీఎఫ్' లో రాఖీ భాయ్ రోల్ గమనిస్తే,  కంప్లీట్ పాజిటివ్ హీరో కాదు. నేరాలు, ఘోరాలు చేసే గ్యాంగ్‌స్టర్ అయినప్పటికీ, ఆ క్యారెక్టర్‌కు ఉన్న ఎమోషన్, పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ వల్ల ప్రేక్షకులు రాఖీ భాయ్‌ని ఒక ఐకానిక్ హీరోగా ఆరాధించారు. అయితే సాధారణంగా స్టార్ హీరోలు ఒక భారీ హిట్ తర్వాత సేఫ్ జోన్‌లోకి వెళ్లి సాఫ్ట్ లేదా రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ ఎంచుకుంటారు. కానీ యష్ మాత్రం అందుకు భిన్నంగా పూర్తి నెగిటివ్ అండ్ డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నే మళ్లీ ఎందుకు ఎంచుకున్నాడు అనే చర్చ సినీ వర్గాల్లోసాగుతోంది. ఇది యష్ కెరీర్‌లో ఒక విప్లవాత్మకమైన కొత్త ప్రయోగమా? లేక రాఖీ భాయ్ సృష్టించిన ఆ మాస్ ఇమేజ్, డార్క్ ఆరా నుంచి బయటపడలేకపోతున్నాడా? అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. Also read: సంచలనం: మోహన్‌లాల్ కూతురు విస్మయ.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు అంటే  విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది యష్ తీసుకున్న ప్రమాదకరమైన రిస్క్ కాదు, తన బ్రాండ్ వాల్యూని మరియు గ్లోబల్ అప్పీల్‌ను అత్యంత తెలివిగా ఉపయోగించుకునే వ్యూహం. ప్రస్తుత పాన్-ఇండియా ట్రెండ్‌లో లార్జర్ ద్యాన్ లైఫ్, గ్రే అండ్ డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలకే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కుతోంది. సాదాసీదా సాఫ్ట్ క్యారెక్టర్స్ కంటే, డార్క్ షేడ్స్ ఉన్నరోల్స్ ల్లోనే నటుడిగా తనలోని విలక్షణమైన పవర్‌, నటనని  చూపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.మరి రాబోయే 'టాక్సిక్'  'రామాయణ' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తాయో, యష్ తన డార్క్ అవతారాలతో ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేస్తాడో వేచి చూడాలి! Yash, Toxic, Geethu Mohandas, Ramayana  
భారతీయ సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ కుటుంబంలో తీవ్ర ఆందోళన రేపిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు, యువ ప్లేబ్యాక్ సింగర్ ఏఆర్‌ అమీన్ ప్రయాణిస్తున్న కారు సోమవారం వేకువజామున చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ఆయన స్వల్ప గాయాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని గిండి ప్రాంతంలో ఉన్న ఒలింపియా టెక్ పార్క్ సిగ్నల్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోయంబేడు నుంచి గిండి వైపు తన స్నేహితుడితో కలిసి అమీన్ కారులో వెళ్తుండగా, పక్క రోడ్డు నుంచి వేగంగా వచ్చిన మరొక వాహనం (క్యాబ్) వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు రెండు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అడియార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన అమీన్, ఆయన స్నేహితుడిని వెంటనే కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ధృవీకరించి, డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక తండ్రి తగ్గ తనయుడిగా మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు అమీన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నతనంలోనే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారమ్’ సినిమాలోని 'మౌలా వా సలీమ్' పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయమైన అమీన్, ఇటీవల రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలోని తమిళ్ వెర్షన్ ‘చికిరి చికిరి’ సహా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో తన స్వరాన్ని అందించారు. ఏఆర్‌ అమీన్ కారు ప్రమాదానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారనే వార్త తెలియడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు "గాడ్ ఈజ్ గ్రేట్" అంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
రీసెంట్ గా 'లెనిన్' సినిమాతో అఖిల్ అక్కినేని బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అఖిల్ నెక్స్ట్ మూవీపై అక్కినేని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. "అఖిల్ ఆ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడంట...", "ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ప్రాజెక్ట్ ఓకే అయిందంట..." అంటూ రకరకాల గాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ.. అక్కినేని టీమ్ కీలక ప్రకటన చేసింది. "అఖిల్ ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి వస్తున్న రూమర్స్ ని నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని కోరుతున్నాము. అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది." అని తెలిపారు.  అఖిల్ తన నెక్స్ట్ మూవీ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని, ప్రతీ పాయింట్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది.     Akhil Akkineni, Next Movie, Akkineni Fans, Lenin Movie  
The surprise success of DC is now creating a potential box-office problem for Suriya’s Vishwanath and Sons. The film has already collected close to Rs.28 crore gross, and Sun Pictures is reportedly keen on retaining as many screens as possible for the second weekend. With the Independence Day holiday falling on August 15, the production house is looking to make the most of the sudden momentum and turn the film's positive reception into stronger theatrical revenue. However, Vishwanath and Sons, which is releasing on August 14, could face a serious screen crunch if DC continues to grow. The Arun Matheswaran directorial has been generating increasingly positive word-of-mouth, with social media chatter reportedly spreading like wildfire after its release. What initially looked like a film that would have to fight for attention has suddenly become a strong theatrical competitor. The buzz around DC has been driven significantly by Anirudh Ravichander's music. While the songs created decent anticipation before release, their popularity has apparently gone to another level after the film's theatrical release. Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Sanjana Krishnamoorthy and director Arun Matheswaran are also receiving appreciation, but Anirudh appears to have emerged as the biggest talking point. For Suriya, the timing is particularly important. The actor is coming off Karuppu, which emerged as a major blockbuster and came close to the Rs.300 crore gross mark worldwide. After a long phase without a major theatrical blockbuster, the success of Karuppu finally gave his career a much-needed boost. Films such as Soorarai Pottru and Jai Bhim were hugely acclaimed but skipped theatrical releases, making his wait for a major big-screen success even longer. Vishwanath and Sons does have several positives going into the release. Venky Atluri, who delivered the unanimously appreciated Lucky Bhaskar, is directing the film, raising expectations for another engaging commercial entertainer. Mamitha Baiju is the leading lady, while Raveena Tandon and Radhika Sarathkumar are playing prominent roles. The trailer has also generated interest, although the overall pre-release buzz has remained relatively muted compared to Suriya's previous film. That makes the theatre allocation a crucial factor. If DC continues its upward trajectory and exhibitors prefer to retain screens for the film during the holiday weekend, Vishwanath and Sons could find itself entering the race with fewer screens than expected. At the same time, a strong opening for Suriya's film could immediately change the equation. Suriya finally found the blockbuster momentum he had been waiting for with Karuppu, and he would certainly want to carry that momentum forward. After establishing himself as one of the biggest stars of the 2000s, the actor is once again looking to reach those commercial peaks. Whether Vishwanath and Sons can overcome the unexpected DC challenge and continue his box-office resurgence will be interesting to watch. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న నయా రూరల్ రొమాంటిక్ డ్రామా 'హుషార్ పిట్టలు' ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, టీనేజ్ వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులు, ఆ వయసులో పుట్టే తొలి ప్రేమతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలను సహజ సిద్ధంగా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. పల్లెటూర్లో పెరిగిన ఒక సాధారణ అమ్మాయి పెద్దమనిషి అయిన తరుణంలో ఆ కుటుంబంలో జరిగే వేడుకతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. టీనేజ్ వయసులోకి అడుగుపెట్టిన తరువాత ఆడపిల్లల ఆలోచనల్లో వచ్చే మార్పులు, అబ్బాయిల పట్ల కలిగే ఆకర్షణ, సమాజంలో ఉండే అపోహలను వినోదాత్మకంగా చూపుతూనే కథలోకి తీసుకెళ్లారు. "మెచ్యూర్ అయిన తర్వాత గర్ల్స్ కి బాయ్స్ టచ్ అయితే.. సర్రుమని కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందంటగా" అంటూ సాగే సంభాషణలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయకత్వాన్ని, అదే సమయంలో ఆ వయసులో కలిగే తుంటరి ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి.  రవి(హీరో) అనే కుర్రాడితో హీరోయిన్ కు ఏర్పడే పరిచయం, ఆపై అది ప్రేమగా మారడం కథలోని అసలు మలుపుకు బాటలు వేస్తుంది. కోరికలు అదుపు చేసుకోలేక.. వీడియో కాల్స్ చేసుకోవడం, శారీరికంగా కలవడం వంటి సీన్స్ కనిపిస్తాయి. అయితే, వయసుతో వచ్చే ఆకర్షణను నిజమైన ప్రేమగా భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, ఆ ప్రభావం కన్నవారిపై ఎంత దారుణంగా పడుతుందో చూపించే క్రమంలో కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. "కన్నవాళ్ళ ప్రేమ కావాలా? ప్రేమించినోడి ప్రేమ కావాలా?" అనే ప్రశ్న ఈ చిత్రంలోని ప్రధాన సంఘర్షణను ఎంతో బలంగా ఆవిష్కరిస్తుంది. ఈ క్రమంలో వచ్చే తల్లిదండ్రుల భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా"ఆడిపిల్లను కన్నాం కదా.. దండం పెట్టాల్సి వస్తది, కాళ్ళు మొక్కాల్సి వస్తది" వంటి డైలాగ్స్ హత్తుకునేలా ఉన్నాయి.  ట్రైలర్ చివరిలో హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా.. హీరోకి సైగ చేసి చెప్తుంది. చరణ్ అర్జున్ అందించిన సంగీతం ఈ సన్నివేశాలలోని గాఢతను మరింత పెంచింది. ముఖ్యంగా "క్షణ సుఖముకై వందేళ్లను బలి చేయడం నీకు న్యాయమా" అంటూ సాగే సాహిత్యం యువతకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఆలోచింపజేస్తోంది.  అప్పట్లో 'చిత్రం' సినిమా కూడా ఈ తరహా కథతోనే వచ్చి సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఈ 'హుషార్ పిట్టలు' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.     Hushar Pittalu Trailer, Vasavi Ganeshan, Telugu Cinema  
Ram Gopal Varma appears to be returning to the territory that once defined his strongest work. According to an exclusive report by Bollywood Hungama, the filmmaker is set to direct Harshvardhan Rane in Police Company, a crime thriller based on the life of celebrated Mumbai police officer Daya Nayak. The project is said to be backed by T-Series, with Harshvardhan Rane stepping into the role inspired by Nayak. The subject is particularly interesting for Varma because the filmmaker has repeatedly explored Mumbai's underworld and the police force, most notably through films such as Satya and Company. His association with Ab Tak Chhappan, which was inspired by Daya Nayak's life, makes this new project even more intriguing. Daya Nayak became one of Mumbai Police's most recognised encounter specialists, gaining widespread attention for his work against organised crime in the city. His life and career have already provided material for several crime stories, but Varma returning to the subject could bring a distinctly raw and grounded treatment, especially given his earlier fascination with the Mumbai police and underworld ecosystem. For Harshvardhan Rane, the film could be another significant opportunity to move beyond the image established by Sanam Teri Kasam. The actor has previously taken on darker and more intense characters, including his role in Taish, and a gritty police drama under Varma could offer him a completely different space as a performer.   After spending considerable time experimenting with different genres and formats, a gritty Mumbai crime drama could be the kind of subject that plays directly to RGV's strengths. If Police Company materialises as reported, the combination of Varma's crime-film sensibilities and Harshvardhan Rane's intense screen persona could make this one of the more interesting Hindi projects in development. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    అగ్ర హీరో మోహన్‌లాల్‌ గత నాలుగు దశాబ్దాల నుంచి మళయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మోహన్ లాల్   కొడుకు ప్రణవ్  నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు మోహన్‌లాల్ ముద్దుల కుమార్తె విస్మయ  కూడా వెండితెరపైకి అడుగుపెట్టింది.  విస్మయ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘తొడక్కమ్’ఇటీవల థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. '2018' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల మనసులను సైతం గెలుచుకుంటోంది.బాక్సాఫీస్ విషయానికి వస్తే, 'తొడక్కమ్' చిత్రం మొదటి రోజు నుంచే థియేటర్లలో స్థిరమైన వసూళ్లను సాధిస్తోంది. తొలి రోజైన శుక్రవారం నాడు ఇండియా నెట్ కలెక్షన్ల రూపంలో 2.55 కోట్లు రాబట్టి శుభారంభం చేసింది. రెండవ రోజైన శనివారం నాటికి ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల కలెక్షన్లు ఏకంగా 37.3 శాతం పెరిగి 3.60 కోట్లకు చేరుకున్నాయి.    మొదటి రెండు రోజుల్లోనే భారతదేశ వ్యాప్తంగా నెట్ కలెక్షన్లు 6.05 కోట్లకు పెరగ్గా, ఇండియా గ్రాస్ కలెక్షన్ 7.02 కోట్లకు చేరుకుంది.  మూడవ రోజు అంటే ఆదివారం నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత ఉధృతాన్ని చూపించింది. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 18.1 శాతం గ్రోత్‌తో 4.25 కోట్ల భారీ నెట్ కలెక్షన్ సాధించి ఆశ్చర్యపరిచింది. ఆ రోజు ఏకంగా 1,212 షోలలో ప్రదర్శించబడగా, రాత్రి షోలకు ఏకంగా 77.17 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. మొత్తం మీద ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా సగటున 63 శాతం ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.   Also read: బిగ్ షాక్: రవితేజ చిత్రం నుంచి తప్పుకున్న మైత్రి మూవీ మేకర్స్ ! దీంతో కేవలం మూడు రోజుల్లోనే 'తొడక్కమ్' ఇండియా నెట్ కలెక్షన్ 10.40 కోట్లను దాటేయగా, ఇండియా వ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్ 12.06 కోట్లకు చేరింది. కేవలం భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా విస్మయ డెబ్యూ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. విదేశాల్లో ఆదివారం నాటికి ఓవర్సీస్ గ్రాస్ 11.40 కోట్లకి చేరుకోవడంతో   ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే దాదాపు 23.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.   మోహన్‌లాల్ ఒక ప్రత్యేక క్యామియో పాత్రలో మెరిసి అభిమానులకి  మరింత కిక్ ఇచ్చాడు Vismaya, Mohanlal, Thudakkam   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది. కంటి సమస్యలు అంటే చాలామంది కంటి శుక్లాలు రావడం,  కంటికి ఏదైనా దెబ్బ తగలడం... వీటి గురించి చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో పిలవని అతిథి గా వచ్చేది కంటి ఇన్ఫెక్షన్ల సమస్య. కంటి ఇన్ఫెక్షన్లు వస్తే కన్ను ఎర్రబడటం,  కంటి నుండి నీరు కారడం, కళ్లు మసకగా మారడం, కళ్ల మంటలు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో వచ్చే ఈ కంటి ఇన్ఫెక్షన్ల సమస్య.. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది కూడా. అసలు కంటి ఇన్పెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చికిత్స ఏంటి?  తెలుసుకుంటే.. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? వర్షపు నీరు నేరుగా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు.. అయినప్పటికీ ఈ కాలంలో బ్యాక్టీరియా , వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, మురికి చేతులతో కళ్లను తాకడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన టవల్ లేదా చేతి రుమాలును ఇతరులు వాడటం, కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన కంటిని తాకిన తర్వాత  డోర్‌నాబ్, మొబైల్ ఫోన్, టేబుల్ లేదా ఇతర వస్తువులను తాకితే, అక్కడ ఉన్న వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కంటి ఇన్పెక్షన్ లక్షణాలు.. కళ్లు ఎర్రబడటం, ఆగకుండా నీరు కారడం,  దురద లేదా మంట.  కళ్ల నుండి జిగటగా లేదా పసుపు-తెలుపు రంగులో స్రావం రావడం. కనురెప్పలు వాపు. కళ్లలో ఇసుక గుచ్చుతున్నట్లు అనిపించడం. ఉదయం నిద్రలేచినప్పుడు కనురెప్పలు జిగటగా ఉండటం.. వంటివి కంటి ఇన్పెక్షన్ లక్షణాలు. కన్ను ఎర్రబడితే ఇన్పెక్షన్ వచ్చినట్టా? వర్షాకాలంలో అలర్జీలు, దుమ్ము, కాలుష్యం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడవచ్చు. అందువల్ల,  కన్ను ఎర్రబడగానే అది  కంటి ఇన్పెక్షన్ అనుకోవడం పొరపాటు.   కొందరు ఇలా సందేహం రాగానే  సొంతంగా యాంటీబయాటిక్ కంటి డ్రాప్స్ వంటివి   వాడతారు,  ఇలా చేయడం మంచిది కాదు.  నొప్పి తీవ్రంగా ఉంటే, దృష్టి మసకబారితే, లేదా లైటింగ్ కు కళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే  వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వీళ్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం.. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు,  చిన్న పిల్లలు,  వృద్ధులు కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మాత్రమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ మధ్యనే  కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కళ్లను ఎలా కాపాడుకోవాలి? చేతులను సబ్బు ,  నీటితో బాగా కడుక్కోవాలి. మురికి చేతులతో  కళ్ళను తాకకూడదు. బయటి నుండి వచ్చిన తర్వాత  ముఖాన్ని, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.  కళ్ళలోకి దుమ్ము లేదా మురికి నీరు వెళితే, వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు లేదా దిండులను సెల్ఫ్ గా ఉంచుకోవడం, సెల్ఫ్ గా వాడుకోవడం మంచిది. ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరులవి వాడటం మంచిది కాదు. కంటి అలంకరణ వస్తువులైన కాటుక,  ఐ లాషెస్,  ఐ లైనర్ వంటివి ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకోవడం మంచిది కాదు.  ఇన్ఫెక్షన్ సోకినట్లయితే కళ్లను అలంకరించుకోవడం మానెయ్యాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు.. వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పెట్టుకునే ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లెన్స్‌లను గానీ, వాటి కేస్‌ను గానీ కుళాయి నీటితో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కళ్ళు ఎర్రబడటం, నొప్పి లేదా చీము కారడం వంటివి కనిపిస్తే, వెంటనే  లెన్స్‌లను తీసివేసి, వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్‌లు ధరించడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి?  కళ్ళు ఎర్రబడినా లేదా నీరు కారుతున్నా, మొదటగా  వాటిని పదేపదే రుద్దడం ఆపాలి. శుభ్రమైన దూదితో లేదా మెత్తని గుడ్డతో వాటిని శుభ్రం చేసుకోవాలి. తక్కువ మంట లేదా వాపు ఉంటే చల్లటి కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది.  డాక్టర్ రికమెండ్  చేస్తే కృత్రిమ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్‌ను సంప్రదించకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ కంటి చుక్కలను ఉపయోగించకూడదు. అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఒకేలా ఉండదు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                *రూపశ్రీ.  
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఆ ఆకుకూర ఏంటి? దానిలో ఉండే పోషకాలు ఏమిటి? ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ ఈ ఆకుకూర గురించి ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కాల్షియం మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే ఐరన్ శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇతర సహజ ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగం. అయితే ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మాత్రమే కాల్షియం లేదా ఐరన్ లోపం పూర్తిగా సరిచేయబడుతుందని భావించకూడదు. ఇప్పటికే లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వైద్యుల సూచన మేరకు సరైన ఆహారం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: • కాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎందుకు అవసరం? • ఇంట్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏమిటి? • ఈ ఆకుకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? • ఆకుకూరలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? • సహజ ఆహారాల ద్వారా పోషకాలను పొందడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పోషక లోపం, అనారోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)