LATEST NEWS
కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 
తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
Tejas Gunjal Films and Rohit Gunjal Films proudly present the action crime drama ‘ONE/4 (One by Four)’, starring Venkatesh Peddapalem, Aparnna Mallick, and Heena Soni in the lead roles. The film is directed by Bahubali Palani K, who previously worked as an Associate Director on the blockbuster Baahubali. Produced jointly by Ranjana Rajesh Gunjal and Rohit Ramdas Gunjal, ONE/4 is gearing up for a grand worldwide theatrical release on January 30 across 200 theatres. Speaking on the occasion, the film unit shared "ONE/4 (One by Four) is a gripping action crime entertainer with a fresh concept. In real life, we often underestimate the consequences of a simple tongue slip, but its impact can be life-changing. This film explores what happens when one small mistake triggers a chain of unexpected crimes. The movie features intense action episodes, powerful performances by the cast, energetic choreography by Sagar Master, and engaging music by Subhash Anand. Director Palani K’s visual storytelling, inspired by the grand narrative style of S.S. Rajamouli, keeps the audience hooked without a single dull moment. Every frame is crafted to maintain suspense and momentum.” The team confidently added that ONE/4 will offer a high-voltage cinematic experience and promises to entertain audiences thoroughly when it releases worldwide on January 30. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
The makers of ‘Raakaasaa’, a fantasy-comedy produced under Pink Elephant Pictures and Z Studios, have officially unveiled the film’s title announcement poster, confirming a worldwide theatrical release on April 3, 2026. Presented as A Niharika Konidela Production, the announcement formally introduces the identity of #PEP2 and signals its steady movement toward release. The title announcement poster establishes the film’s tonal world with striking clarity. Centred around the imagery of a solar eclipse emerging through dense, storm-laden clouds, the visual language leans decisively into myth and fantasy. The title ‘Raakaasaa’ appears sculpted in an organic, root-like form, glowing subtly from within, evoking folklore and elemental force. Notably, the poster avoids overt comedy cues, suggesting that humour in the film emerges organically from character and narrative rather than surface-level visual treatment. ‘Raakaasaa’ features an ensemble cast that includes Sangeeth Shobhan, Nayan Sarika, Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyardhi, Getup Srinu, Sukwinder Singh, Annapurnamma, Anoopsingh takur, Ramana Bhargav, Vasu Inturi, Rohini (Jabardast), Rohan (#90’s), among others. The casting reflects a balance between familiar performers and character-driven roles, aligning with the film’s fantasy-comedy framework. Written and directed by Manasa Sharma, the film carries a unified creative vision, with Story, Screenplay, Dialogues, and Direction handled by her. Mahesh Uppala contributes as Additional Screenplay writer. The technical crew includes Anudeep Dev as music composer, Raju Edurolu as cinematographer, Anwar Ali as editor, and Vijay as action choreographer. Production design is led by Ramanjaneyulu, with Pulla Vishnu Vardhan serving as art director and Sandhya Sabbavarapu overseeing costume design. The project progressed through a major action-heavy schedule, choreographed by Vijay, who has earned strong industry recognition for his recent work on They Call Him OG. Following the completion of this action block, the team filmed comedy-driven sequences and other crucial narrative portions that strengthen the film’s humour and character dynamics. With these segments now completed, ‘Raakaasaa’ has wrapped the bulk of its shoot, with only one remaining song and approximately four days of talkie portions left to be filmed, placing the project firmly in its final stage of production. Produced by Niharika Konidela and Umesh Kumar Bansal, with Manyam Ramesh serving as Executive Producer, ‘Raakaasaa’ continues Niharika Konidela’s focus on youthful, content-driven cinema under the Pink Elephant Pictures banner. An established actress-turned-producer, she has been actively sharing glimpses from the sets through her social media platforms, offering audiences insight into the film’s progress. Following her mainstream production debut with Committee Kurrollu, ‘Raakaasaa’ represents a continuation of her evolving producer journey, with the banner also engaging audiences through behind-the-scenes updates on its official platforms. With its atmospheric title reveal, near-completion of principal photography, and a clearly defined fantasy-comedy approach, ‘Raakaasaa’ is steadily building anticipation. The project has also drawn increased attention within industry circles, with ZEE5 recently coming on board, reflecting confidence in the film’s concept and execution, while Z Studios continues its association, strengthening the film’s scale and visibility ahead of its April 3, 2026 theatrical release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Sree Vishnu, often called the King of Entertainment, has established himself as one of the most reliable actors in Telugu cinema through his steady success. Following a string of hit films, he is back with a unique character in his upcoming movie, Vishnu Vinyasam, directed by Yadhunaath Maruthi Rao. This time, he portrays a man with an extreme, almost crude, belief in astrology. The producers recently shared an intriguing title poster, which has now been followed by the release of a very catchy title song. Composed by Radhan, the track serves as a playful introduction to the protagonist. The lyrics by Ramjogayya Sastry cleverly describe his character as a devoted believer in stars and signs, highlighting how his obsession creates comical frustration for those around him. The singer, Sri Krishna, adds a fantastic vibe to the song with his lively vocals. Sree Vishnu looks incredibly energetic in this unconventional role, proving once again that his comic timing is top-notch. His chemistry with actor Satya and his funny antics perfectly fit the character's personality. Furthermore, his dance moves are both stylish and fitting for the beat; specifically, a unique "T-Shirt step" is already expected to become a massive trend on social media. With the release of this upbeat track, the filmmakers have successfully sparked curiosity about the movie's plot. Because the lead character is so distinct and different from the usual hero tropes, the film promises to be a hilarious experience for theater audiences. Produced by Sumanth Naidu, this comedy entertainer features Nayan Sarika as the leading lady. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) మొదటిసారి హారర్ కామెడీ జానర్ లో నటించిన సినిమా 'ది రాజా సాబ్'(The Raja Saab). మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలవుతోంది. ఈ రోజు(జనవరి 8) రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.    ఇంతవరకు ప్రభాస్ చేయని హారర్ కామెడీ జానర్ కావడం, పైగా వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారని ముందు నుంచి మూవీ టీమ్ చెప్పడంతో.. 'రాజా సాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. ఇక ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.   ఇప్పటికే 'ది రాజా సాబ్'ను ప్రత్యేకంగా వీక్షించిన కొందరు.. ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మూడు గంటల నిడివి గల ఈ మూవీ.. స్క్రీన్ పై మ్యాజిక్ చేసిందని చెబుతున్నారు. రాజ కుటుంబానికి చెందిన రాజాసాబ్(ప్రభాస్) తన నానమ్మతో కలిసి సాధారణ జీవితం గడపటం, తమ కుటుంబానికి చెందిన రాజభవనాన్ని హీరో అమ్మాలనుకోవడం, ఈ క్రమంలో తాత ఆత్మతో పోరాడాల్సి రావడం వంటి ఎపిసోడ్స్ తో సినిమా నడిచిందట.   ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ చేసే అల్లరి 'డార్లింగ్' సినిమా నాటి ప్రభాస్ ని గుర్తు చేస్తుందట. ప్రభాస్ ఎంట్రీ సీన్, కామెడీ, డ్యాన్స్ లు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అట. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందట. సెకండాఫ్ లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని, అదే సమయంలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని వినికిడి. కామెడీతో పాటు, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది.   మొత్తానికి 'ది రాజా సాబ్'తో దర్శకుడు మారుతి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరికొద్ది గంటల్లో 'రాజా సాబ్'పై ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా తేలిపోనుంది.    
          -ఏంటి అనసూయ కి అంత నమ్మకం  -ఆమె నిజంగానే కారణ జన్మరులా  -అయితే ఈ జన్మలో ఏం చేయబోతుంది!     యాంకర్ గా, నటిగా, సామాజిక సమస్యలపై స్పందించే భాద్యత గల పౌరురాలిగా అనసూయ(Anasuya)పోషిస్తున్న పాత్ర ఎంతో ఘనమైనది. భారీ అభిమాన ఘనం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటు ఎంతో డేర్ గా పలు విషయాలపై తన భావాన్ని చాలా బలంగా చెప్పడం కూడా అనసూయ స్పెషాలిటీ.  రీసెంట్ గా ఇనిస్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వాళ్ళు వేసిన పలు ప్రశ్నలకి తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చి థట్ ఈజ్ అనసూయ అని మరో సారి తెలిసేలా చేసింది.     అనసూయ అభిమానులతో మాట్లాడుతు'నేనెప్పుడూ ఏదైనా విషయంపై నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తాను. కానీ ఆ అభిప్రాయాన్ని వివాదం చేస్తారు. నేను ఫెమిస్ట్ నే కానీ పురుషుల వ్యతిరేకిని కాదు. ఈ మధ్యన చీరలు కడుతుంటే ట్రోల్స్ కారణంగా చీరలు కడుతున్నానని కొంత మంది అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. నాకెప్పుడూ ఇష్టముంటే అప్పుడు చీరలు కట్టుకుంటాను.      Also read:  సంక్రాంతి సినిమా ఎంత పని చేసింది!  పగోడికి కూడా ఈ బాధ రాకూడదు     నాకు సంబంధం లేని విషయాల్లో కలగచేసుకుని పరువు పోగొట్టుకుంటున్నానని చాలా మంది అనుకుంటున్నారు. నా పరువు పోలేదు. నా దగ్గరే ఉంది. నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను. ఇది డెస్టినీ.  కారణ జన్మురాలినని నా నమ్మకం అని చెప్పుకొచ్చింది.  
        -సినీ విశ్లేషకులు ఏమంటున్నారు -తెలుగు ప్రేక్షకుల పరిస్థితి ఏంటి -అసలు  ఏం చేద్దామనుకుంటున్నారు -ఆ ఆరు చిత్రాల ద్వారా ఏం అర్ధమవుతుంది      పగవాడికి కూడా మీ బాధ రాకూడదు గురువు గారు అని అదుర్స్ మూవీలో బ్రహ్మానందాన్ని ఉద్దేశించి ఎన్టీఆర్(Ntr)చెప్తాడు. ఇప్పుడు అదే డైలాగ్ ని తెలుగుసినిమా ప్రేక్షకులని ఉద్దేశించి చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే రేపట్నుంచి వాళ్ల ముందుకి దిరాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, పరాశక్తి వంటి ఆరు సినిమాలు వస్తున్నాయి. నిజానికైతే  ఈ ఆరు చిత్రాల రాకతో తెలుగు ప్రేక్షకుల కంటే అదృష్టవంతులు ఉండరు. కానీ సోషల్ మీడియా వేదికగా ఈ ఆరు సినిమాల రాకతో సినీ విశ్లేషకుల మధ్య  మరో చర్చ కూడా జరుగుతుంది. మరి ఆ చర్చ ఏంటో చూద్దాం.      సినీ విశ్లేషకులు మాట్లాడుతు సినీ మార్కెట్ లో ప్రత్యక్షం కాబోతున్న ఆరు సినిమాలు ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ . ట్రైలర్ రిలీజ్ తో ఇంకాస్త క్రేజీ ప్రాజెక్ట్స్ గా మారిపోయాయి. పైగా సదరు ఆరుగురు హీరోలకి ఫ్యాన్ బేస్ భారీగా ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో కూడా సదరు హీరోలపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆ ఆరు సినిమాలని చూస్తామా అనే ఆశతో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఆరు సినిమాలని చూడాలంటే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ ని బట్టి కొంచం భారీ అమౌంట్ నే కావాలి. పైగా ఫ్యామిలీ తో చూడాలంటే సదరు అమౌంట్ లో భారీ పెరుగుదల ఖాయం.      Also read:   రాజాసాబ్ హిట్, ప్లాప్ పై డిస్ట్రిబ్యూటర్ ఆడియో లీక్.. చిరంజీవిని ఎందుకు లాగారు     నిజానికి తెలుగు సినిమాని తెలుగు సినిమా ప్రేక్షకులు తమ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. గతంలో కూడా సంక్రాంతి సందర్భంగా చాలా క్రేజీ సినిమాలే వచ్చాయి. అయినా అమౌంట్ మాటర్ నథింగ్ అంటూ క్యూ కట్టారు.కానీ ఈ సారి ఏకంగా ఒకే సారి ఆరు క్రేజీ కాస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. పైగా అప్పటి టికెట్ రేట్స్ కి ఇప్పటి టికెట్ రేట్స్ కి చాలా తేడా ఉంది. సంక్రాంతి పండుగ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వాళ్ల ముందు నోరూరే ఆరు లడ్డులని పెట్టి నోరూరిస్తున్నట్టుగా ఉంది. అందుకే పగోడికి కూడా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకి వచ్చిన బాధ రాకూడదనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.    
  2022లో 'కేజీఎఫ్-2'తో పాన్ ఇండియాని షేక్ చేసిన కన్నడ స్టార్ యశ్, నాలుగేళ్ళ తర్వాత 'టాక్సిక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్, మార్చి 19న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలుపుతూ 'ఇంట్రడ్యూసింగ్ రాయ' పేరుతో స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.   రెండున్నర నిమిషాలకు పైగా నిడివితో రూపొందించిన 'టాక్సిక్' గ్లింప్స్ బోల్డ్ గా, ఇంటెన్స్ గా ఉంది. మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ప్రతిదీ హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. కొడుకుని కోల్పోయిన ఓ గ్యాంగ్ స్టర్.. తన అనుచరులతో కలిసి స్మశానంలో ఉంటాడు. ఒకతను కారులో వచ్చి స్మశానంలో బాంబ్ బ్లాస్ట్ కోసం కనెక్షన్ ఇచ్చి వెళ్లిపోగా.. గ్యాంగ్ స్టర్ అనుచరులు ఆ కారుపై కాల్పులు జరుపుతారు. కారులో లేడీతో శృంగారం చేస్తూ ఉన్న యశ్.. బాంబ్ బ్లాస్ట్ జరిగాక.. కారు దిగి గన్ తో శత్రువులపై విరుచుకుపడతాడు. కేజీఎఫ్ రేంజ్ లో యశ్ ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి.    కేవలం ఒకే ఒక్క గ్లింప్స్ తో ఇప్పుడు 'టాక్సిక్' మూవీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారు సీన్ చూసి.. ఒక లేడీ డైరెక్టర్ సినిమాలో ఈ రేంజ్ బోల్డ్ సీనా! అంటూ అందరూ అవాక్కవుతున్నారు. అయితే బోల్డ్ సీన్ ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేసిందో.. మేకింగ్ పరంగా ఓవరాల్ గ్లింప్స్ కూడా అదే రేంజ్ లో సర్ ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు.     'టాక్సిక్' గ్లింప్స్ అదిరిపోవడంతో మార్చి 27న విడుదల కానున్న రామ్ చరణ్ 'పెద్ది'పై ఏమైనా ప్రభావం పడుతుందా అనే చర్చ జరుగుతోంది. చరణ్ సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతుంది. కానీ మార్చి 19న 'ధురంధర్-2', 'టాక్సిక్' సినిమాలు ఉండటంతో.. థియేటర్లు కావాల్సినన్ని దొరకడం కష్టమే.    న్యూ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'ధురంధర్'కి సీక్వెల్ కావడంతో నార్త్ లో 'ధురంధర్-2' డామినేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక 'టాక్సిక్' కూడా సౌత్ తో పాటు నార్త్ లో ప్రభావాన్ని చూపేలా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట 'పెద్ది'కి అంత అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు.    అయితే పెద్ది మూవీ వాయిదా పడే అవకాశముందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పెద్ది వాయిదా పడుతుందా? లేక మార్చిలోనే విడుదలై కంటెంట్ తో ఆ రెండు సినిమాలకు షాకిస్తుందో చూడాలి.    
Prime Video, India’s most loved entertainment destination, today announced January 23 as the worldwide premiere date of the Prime Original Telugu movie, Cheekatilo. Set in the heart of Hyderabad, Cheekatilo is an edge-of-the-seat crime suspense that follows Sandhya, a true crime podcaster portrayed by Sobhita Dhulipala, whose relentless quest for truth exposes some of the most brutal and darkest secrets of the city.  Directed by Sharan Kopishetty and produced by D. Suresh Babu under the banner of Suresh Productions Pvt. Ltd., the gripping narrative is written by Chandra Pemmaraju, and Sharan Kopishetty. The movie stars Sobhita Dhulipala and Viswadev Rachakonda in lead roles, alongside Chaitanya Visalakshmi, Esha Chawla, Jhansi, Aamani and Vadlamani Srinivas in pivotal roles. The Telugu Original movie will premiere exclusively on Prime Video across India and in over 240 countries and territories worldwide, with subtitles in Tamil, Hindi, Malayalam, and Kannada, on January 23.   Set against the backdrop of bustling city of Hyderabad, Cheekatilo is a gripping Telugu Original crime suspense that follows Sandhya, a true crime podcaster, in her relentless pursuit of justice after her intern’s mysterious death unravels a chilling trail of brutal crimes.    "At Prime Video, we remain committed to expanding our South Originals slate with stories that are bold, rooted, and creatively distinct. While suspense and thriller are widely explored genres, our focus is on delivering unique narratives with emotional depth, something audiences strongly resonated with in our Telugu Original series Dhootha. Our upcoming Telugu Prime Original Cheekatiloreflects that vision,” said Nikhil Madhok, director & head of Originals, Prime Video India.  “What sets Cheekatilo apart is its blend of cultural authenticity, with modern storytelling mediums like podcasts that play a key role in the narrative. We believe the movie’s universal themes of resilience and sisterhood will extend its appeal far beyond the Telugu-speaking diaspora and connect with audiences across India and globally. With this Original movie, we are also delighted to deepen our longstanding partnership with Suresh Productions. Cheekatilo is a narrative-rich thriller that we believe will strongly resonate with viewers across India and around the world when it premieres on Prime Video on January 23.”    D. Suresh Babu, producer of Cheekatilo, shared, “Cheekatilo is a layered, emotional suspense drama. What’s close to my heart is how it explores the courage to confront darkness and speak the truth, something we need more of in society today. Working with Prime Video on this Prime Original has been a wonderful experience. The movie marks another milestone in our longstanding collaboration. We share a vision of championing unique, culturally rooted narratives with relatable characters that not only entertain but deeply engage viewers. With its haunting storyline and powerful performances, Cheekatilo promises an unforgettable and gripping journey. I am excited for audiences in India and around the world to experience it when it premieres globally on Prime Video on January 23.” Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
           -ఆ ఆడియో రికార్డులో నిజమెంత  -సంచలనం కోసం చేసారా! -లేక నిజమేనా! -చిరంజీవిని ఎందుకు ప్రస్తావించారు     పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సంక్రాంతి డైనోసార్ లాగా రేపు 'ది రాజాసాబ్'(The Raja Saab)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో ఫ్యాన్స్ లో, మూవీ లవర్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఫ్యాన్స్ ఇప్పటికే  థియేటర్స్ అన్నింటిని ప్రభాస్ కట్ అవుట్స్  తో నింపేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రాజా సాబ్ రిజల్ట్ కి సంబంధించిన ఆడియో రికార్డింగ్ వాళ్ళల్లో ఎనలేని సంతోషాన్నితెస్తుంది. మరి ఆ ఆడియోలో ఏముందో చూద్దాం.      ఒక  డిస్ట్రిబ్యూటర్ ప్రభాస్ అభిమానితో ఫోన్ లో మాట్లాడుతు రాజా సాబ్ చాలా బాగుంది. స్క్రీన్ పై ప్రభాస్  చాలా అందంగా కనిపించాడు, యాక్టింగ్ కూడా చాలా కూల్ గా ఉంది.  ప్రభాస్ ఇప్పటి వరకు ఇరవై నాలుగు సినిమాల్లో చేసిన యాక్టింగ్.. ఈ ఒక్క సినిమాలో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విపరీతంగా ఎంజాయ్ చేస్తు రిపీట్ గా మూవీ చూస్తారు. చిరంజీవి నటించిన 'దొంగ మొగుడు' సినిమా తరహాలో ఐదు, ఆరు కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి సెకండాఫ్ లో లాస్ట్ 30 నిమిషాలు మూవీ ఒక రేంజ్ లో   అదిరిపోయింది. హాస్పిటల్ సీన్ లో ప్రభాస్ యాక్టింగ్ పీక్స్. సత్య కామెడీ,   నాన్నమ్మ పాత్ర, సంజయ్ దత్ పాత్రలు కూడా హైలైట్. హర్రర్ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళు కూడా మూవీలో హీరోలని సదరు డిస్ట్రిబ్యూటర్ ప్రభాస్ అభిమాని చెప్పుకొచ్చాడు.    Also Read:  జన నాయగాన్ రిలీజ్ డేట్ వాయిదా.. రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది      ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  ప్రభాస్ ప్యాన్స్ అయితే జై రాజా సాబ్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్స్ లో ఎక్కువ మంది  అదంతా ఫేక్ రికార్డు అనే కామెంట్స్ చేస్తున్నారు.  
The trailer of Anaganaga Oka Raju opens on a majestic note with King Akkineni Nagarjuna Garu lending his powerful voice. The young sensation gets the voice of King, his narration instantly elevates the trailer and perfectly sets the tone for this festive entertainer. Star performer Naveen Polishetty once again proves why he is one of the most loved entertainers today. His exceptional comic timing, effortless humor, and energetic screen presence dominate the trailer. Every punchline lands with precision, making it clear that this is just a glimpse of the full-throttle entertainment the film promises. The trailer assures pure fun that will resonate with audiences across all age groups. Meenakshi Chaudhary impresses with her innocence and charm. The fun surrounding her character is neatly executed, and her chemistry with Naveen Polishetty stands out. The love track, family emotions, and situational comedy are well balanced, adding depth to the narrative. Debutant director Maari deserves special appreciation for presenting Naveen Polishetty in a refreshing and engaging manner. Supported by a strong ensemble cast including Rao Ramesh and others, the film feels rooted and wholesome. Mickey J Meyer’s background score enhances the trailer with a solid blockbuster vibe, while the already released songs have emerged as chartbusters. Anaganaga Oka Raju is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, with Srikara Studios presenting the film. With the catchy line “PANDAGA KI ALLUDU VASTUNNADU”, the film promises to be a perfect Sankranthi family entertainer, inviting everyone to celebrate together on the big screens this January 14th, 2026 Worldwide. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. జనవరిలో జన్మించిన వారి రాశిచక్రం,  పుట్టిన సమయం కూడా వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరిలో జన్మించిన వ్యక్తులు తరచుగా  భిన్నంగా కనిపిస్తారు. వారిలో ఒక వింతైన తీవ్రత ఉంటుంది, చిన్న వయస్సులోనే జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.  ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం,  ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం జనవరిలో జన్మించిన వారు సహజంగా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు.  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.   పరిణితి.. జనవరిలో జన్మించిన పిల్లలు గంభీరమైన స్వభావం,  ఆలోచనలో పరిణతితో  వారి వయసు  కంటే తెలివైనవారిగా కనిపిస్తారు.  ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడినప్పుడు  జాగ్రత్తగా మాట్లాడతారు. వారి నిర్ణయాలు భావోద్వేగాలపై తక్కువగా,  తర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో  అందరికీ దూరంగా ఉండటం ఎక్కువ. ఎవరితో ఎక్కువ మాట్లాడరు కూడా..  కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు వారికి బలంగా మారతాయి. నిరాడంబరత, ఆదర్మమార్గం.. జనవరిలో జన్మించిన వ్యక్తులలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. అయినా కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా లీడర్స్ గా ఎలా ఉండాలో  వారికి తెలుసు. వారు ఆజ్ఞాపించరు, ఆదర్శంగా ముందుకు సాగుతారు. పాఠశాలలో లేదా ఆఫీసులలో అయినా, అందరూ వీరి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ వారి రక్తంలోనే ఉంటుంది. జనవరిలో పుట్టిన వారికి  బద్దకం అంటే శత్రువట.  సమయానికి మేల్కొనడం, తమ పనిని సరిగ్గా చేయడం,  తమ బాధ్యతలను నెరవేర్చడం వీరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు వారిని కఠినంగా లేదా మొండిగా చేస్తుంది. ముఖ్యంగా  తమ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా  జరగనప్పుడు మరింత మొండిగా మారతారు. వ్యక్తీకరణ..  వీరి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా వ్యక్తం చేస్తారు. వీరి నుండి  ప్రేమ పూర్తి నిజాయితీతో వస్తుంది,  స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అయితే భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సంకోచం వారిని సంబంధాలలో అపార్థాలకు గురి చేస్తుంది. భయం.. కష్టపడి పనిచేయడానికి భయపడరు.  కష్టాలకు భయపడి వెనుకంజ వేయడం వంటివి చేయరు. జనవరిలో పుట్టిన పిల్లలు కష్టపడి పని చేయడాన్ని గౌరవిస్తారు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే భ్రమలో  జీవించరు. అందుకే వారు తమ కెరీర్‌లో నెమ్మదిగా ఎదుగుతారు.  కానీ పూర్తీగా పై స్థాయిలో ఉండే విధంగా స్థిరపడతారు.   వారి గొప్ప బలం ఓర్పు. వారి అతిపెద్ద బలహీనత తమతో తాము చాలా కఠినంగా ఉండటం.   బాధ్యత.. ఇంట్లో అయినా లేదా సమాజంలో అయినా జనవరిలో పుట్టిన వారు  చిన్న వయస్సులోనే బాధ్యతలను స్వీకరిస్తారు. వారు తక్కువ ఫిర్యాదు చేస్తారు,  తమ విధులను నెరవేర్చడంలో  నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ భారం వారిని అంతర్గతంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ వారు అలసిపోతున్నట్టు అస్సలు బయటపడనీయరు.                                          *రూపశ్రీ.
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతుంటారు.  అందుకే అల్పాహారం ఆరోగ్యకరంగా, పోషకాలతో నిండి ఉండాలని కూడా చెబుతారు.  అందరూ ఒకే విధమైన బ్రేక్పాస్ట్ తీసుకోరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం బ్రేక్పాస్ట్ లో తీసుకోవడం అలవాటుగా ఉంటుంది.  అయితే బ్రేక్పాస్ట్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల టోటల్ గా బాడీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంతకీ బ్రేక్ పాస్ట్ విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? అసలు బ్రేక్పాస్ట్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రేక్పాస్ట్ ప్రయోజనం.. అల్పాహారం లేదా బ్రేక్పాస్ట్  రోజులో మొదటగా తీసుకునే ఆహారం.  ఇది రోజంతా శక్తివంతంగా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీవక్తియ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ కారణంగా ఉదయాన్నే సరైన బ్రేక్పాస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. బ్రేక్పాస్ట్ విషయంలో చేసే తప్పులు.. ఖాళీ కడుపుతో టీ.. ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు వైద్యులు.  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని, డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని,  ఆకలి కూడా  తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. చపాతీ, పరాటా.. మీరు ప్రతిరోజూ బ్రేక్పాస్ లో చపాతీలు లేదా  పరాటాలు  తింటే  ఉదయాన్నే ఎక్కువ  కార్బోహైడ్రేట్లను తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ప్రోటీన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఉదయాన్నే చపాతీలు లేదా పరాటాలు తినడం వల్ల  కడుపు నిండినట్టు అనిపిస్తుంది  కానీ ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుందట.  మధ్యాహ్నం  తీసుకునే ఆహారం వల్ల  మరింత హెవీగా  మారుతుందని ఇది శరీరాన్ని బరువుగా ,  పనుల మీద ఆసక్తి మరల్చేలా మారుస్తుందని చెబుతున్నారు. ఇన్స్టంట్ ఓట్స్..  అల్పాహారంలో చాలామంది  ఇన్‌స్టంట్ ఓట్స్ తింటుంటారు.  ఇది చాలా ఆరోగ్యకరమని కూడా అనుకుంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిదని కూడా అనుకుంటారు.  కానీ ఈ ఓట్స్  అధికంగా ప్రాసెస్ చేసి ఉంటారు. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడానికి దీనిని తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టీ తో బిస్కెట్,  జ్యూస్.. ఉదయాన్నే  టీతో పాటు బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తీసుకోవడం చాలా మందికి అలవాటు.  దీన్నే బ్రేక్పాస్ట్ గా సరిపేట్టేస్తుంటారు కూడా. అయితే వీటిలో శుద్ధి చేసిన పిండి, చక్కెర,  ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతాయి,  ఊబకాయాన్ని పెంచుతాయి. బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే.. చాలామంది డైటింగ్ పేరుతో ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తుంటారు.  బరువు తగ్గాలనే తాపత్రయంతో బ్రేక్పాస్ట్ స్కిప్ చేసి నేరుగా  బోజనం చేస్తుంటారు.  కానీ ఇది సరైన పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు.  బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మందగిస్తుందట. ఉదయం బ్రేక్పాస్ట్ స్కిప్ చేసే చాలామంది ఉదయం సమయంలో బిస్కెట్లు, జంగ్ ఫుడ్స్, ఇన్స్టంట్ డ్రింక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. పైగా అవి చాలా లైట్ ఫుడ్స్ అని కూడా అనుకుంటారు.  ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్.. సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు.. రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలేంటీ ఆలమ్ స్పైస్..   అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...