LATEST NEWS
  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్‌ మండలం నల్లంపల్లి వద్ద నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే..! “విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది. ప్రజల కోసం పోరాడింది.  కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు. మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను..! “యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. “పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి” అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు. కొత్త పెన్షన్ లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.  ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం” అని హామీ ఇచ్చారు. టీడీపీలో కార్యకర్తే అధినేత..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో “కార్యకర్తే అధినేత” అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు.  కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం. పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి..! “జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా?  ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు. 1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!” అని సవాల్ విసిరారు. కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి. మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి” అని పిలుపునిచ్చారు. కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది..! “మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్ గారిది. రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu Desam Party, Rayadurgam, Anantapur, Local Body Elections, TDP Cadre, Party Workers, My TDP App, TDP Alliance, CM Chandrababu Naidu, Andhra Pradesh Development, TDP Welfare, Kalyan Yojana, Political Alliance, Jana Sena, BJP, AP Politics  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వానికి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయి పరిణామాలపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ కార్యక్రమం నిర్వహించారు.  ఈ విశ్లేషణలో ప్రధాంశాలు..రాజకీయ పరిస్థితులు.. పట్టణ ఓటర్లు  క్షేత్రస్థాయి అసంతృప్తిగ్రామీణ ప్రాంతాల ఎన్నికలతో పోలిస్తే పట్టణ ప్రాంత ఎన్నికలు పూర్తి భిన్నమైనవి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు స్థానిక నాయకత్వం  వ్యక్తుల ప్రాతిపదికన సాగుతాయి. కానీ, మున్సిపాలిటీలు  కార్పొరేషన్లలో పార్టీ గుర్తులపై నేరుగా పోరు జరుగుతుంది. పట్టణాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలపై పూర్తిగా ఆధారపడరు. వారు ప్రభుత్వ పాలనాతీరు, మౌలిక వసతులు, పారదర్శకతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులలో అవినీతి విచ్చలవిడిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఇతర చిన్న పనుల వరకు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం, వేధింపులు పెరిగాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో అవినీతి రహిత పాలన అని ప్రకటించినా, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. చంద్రబాబు వ్యూహం మౌలిక లోపాలుకూటమి ప్రభుత్వం తన ప్రధాన ఘనతలుగా పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం, పరిశ్రమల రాకను ప్రచారం చేసుకుంటోంది.  అయితే ఈ వ్యూహంలో పలు రాజకీయ లోపాలు కనిపిస్తున్నాయి:అమరావతి కేంద్రీకరణ: అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రాధాన్యమే అయినప్పటికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఇది అంతగా భావోద్వేగాన్ని కలిగించడం లేదు. సొంత నియోజకవర్గాల్లో రోడ్ల గుంతలు, మౌలిక వసతులు లేని స్థితిలో రాజధానిపైనే కోట్లు ఖర్చు చేయడం పట్ల కొంత వ్యతిరేకత వస్తోంది. పోలవరం పరిశ్రమలు: పోలవరం పనులు నెమ్మదించడం, పరిశ్రమల ఒప్పందాలు కేవలం ప్రకటనలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలుగా మారకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోంది. సంక్షేమం – ప్రచార లోపం: ప్రభుత్వం భారీ స్థాయిలో పెన్షన్లు (రూ. 4,000) ఇస్తున్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా పథకాల సమర్థవంతమైన ప్రచారం, కచ్చితమైన అమల్లో లోపాలు కనిపిస్తున్నాయి. రైతాంగ సమస్యలు : కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల గురించి స్పష్టత ఇవ్వకపోవడం, పంట కొనుగోళ్లలో వ్యత్యాసాలు రైతుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావంరాబోయే మున్సిపల్ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పాలనకు తొలి ప్రాక్సీ టెస్ట్‌గా మారనున్నాయి.  గతం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని నిరూపించుకోవడంలో వైఫల్యం చెందితే, పట్టణ ప్రాంతాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పుంజుకునే అవకాశం ఉంది.శాసనసభ్యుల అవినీతిని అరికట్టడం, నిత్యావసరాలు మరియు మౌలిక వసతులపై దృష్టి సారించడం, పరిశ్రమలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడంపై చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది. లేనిపక్షంలో, పట్టణ ఓటర్లు ఇచ్చే తీర్పు రాబోయే సాధారణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.   AP Municipal Elections, CM Chandrababu Naidu Strategy, AP Politics Telugu, Amaravati Development, TDP vs YSRCP, AP Local Body Elections, AP Corruption Issues, AP Urban Elections, Polavaram Project Update, AP Welfare Schemes  
  తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్‌ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి మరికాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన నివేదికలోని అంశాలు, చర్యలకు గల కారణాలను సీఎం దృష్టికి మల్లు రవి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి, వైస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ మోహన్‌ తమ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు సమర్పించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో గతంలో హెచ్చరికలు చేసినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రాలేదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ లైన్‌ దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని, కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అత్యంత కీలకమని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అదేవిధంగా చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సిఫారసులపై సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. Telangana Congress, Konda Surekha, Chinna Reddy, CM Revanth Reddy, MP Mallu Ravi, Telangana Politics,TPCC, Mahesh Kumar Goud  
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతోంది... సిబిఐ విచారణ ముగిసిందనుకుంటున్న సమయంలో, హఠాత్తుగా ఈడీ ఎందుకు ఎంటర్ అయింది?  అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్ట్ వీవీరావు తెలుగువన్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో,  న్యాయ వర్గాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హఠాత్తుగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హఠాత్తుగా రంగానికి దిగి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2019 మార్చి నెలలో జరిగిన వైఎస్ వివేకా  హత్య ఉదంతంలో ఇప్పటివరకు  సిబిఐ విచారణ జరుపుతుండగా, ఉన్నట్టుండి ఈడీ అధికారులు రంగప్రవేశం చేయడం వెనుక ఉన్న కారణాలపై విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భాగంగా పలు కీలకమైన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితులు, సాక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల ఇళ్లలో జరిపిన శోధనలలో  24 లక్షల రూపాయల నగదుతో పాటు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన  ఏడేళ్ల తరువాత నిందితుల ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు ఉంటాయా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్న నేటి పరిస్థితుల్లో హత్య జరిగిన ఏడేళ్ల తరువాత కీలక పత్రాల స్వాధీనం అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవని వీవీరావు విశ్లేషించారు.  ఈ తనిఖీల వెనుక కేవలం హత్య కేసు విచారణ మాత్రమే  లేదన్నారు. అయినా ఈడీ వంటి దర్యాప్తు సంస్థల తనిఖీలు రానున్న రోజులలో జరగనున్న రాజకీయ పరిణామాలకు తార్కాణమని గత అనుభవాలను బట్టి  అవగతం చేసుకోవచ్చునన్నారు. ఇప్పుడు ఈడీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే జగన్ హయాంలో ఏపీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ఒడిషాలో కాంగ్రెస్ గూటికి చేరడం... రానున్న రోజుల్లో జగన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే.. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ఈడీ ఈ కేసులో అవినాష్ రెడ్డి తదితరుల నివాసాలలో ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. రానున్న రోజులలో జరగబోయే పరిణామాలేమిటన్నది వేచి చూడాలన్నారు.   Jagan to join Congress, YS Viveka Case ED Raids, YS Vivekananda Reddy Murder Case, ED Investigation, Avinash Reddy ED Raids, TeluguOne
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ప్రకటించేశారు. శ్రావణ శుక్రవారం రోజే తాను విజయవాడ వేదికగా కొత్తపార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు.  తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే వెల్లడించిన విజయసాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రకటన ఎప్పుడు, ఎక్కడ అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.    శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు  విజయవాడ వేదికగా  పార్టీ పేరు, జెండా, అజెండా, విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు.  ప్రజాసమస్యలపై నిలదీసేందుకు,  ప్రజల గొంతుకగా మారేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.   గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన ఇంత కాలానికి సొంత రాజకీయ వేదక ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.    Vijayasai Reddy Political Party Announcement, Vijayawada, Sravana Sukrvaram, Vijayawada,   AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
Director Anil Ravipudi has responded to the rumours surrounding his reported collaboration with Superstar Mahesh Babu, making it clear that the news currently doing the rounds is not true. Reacting to the speculation, Anil Ravipudi issued a statement about his equation with Mahesh Babu and categorically dismissed the reports.  He wrote, “Superstar Mahesh Babu garu has always been a dear person to me. I have immense love and respect for him, always. Whatever news is currently circulating is completely false and untrue. Please don’t believe or spread such rumours.” Anil and Mahesh Babu previously worked together on Sarileru Neekevvaru, which became one of the major commercial successes of 2020. The director has also spoken positively about collaborating with Mahesh again in the past, with reports of a possible reunion continuing to surface periodically. Anil Ravipudi is busy shooting for his next film, January 12 Vidudala with Venkatesh, Nandamuri Kalyanram, Keerthy Suresh, Krithi Shetty. The movie is releasing for Sankranti. On the other hand, Mahesh is busy shooting for SS Rajamouli's Varanasi, scheduled for 7th April 2027 release.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల కాంబినేషన్లు, కొత్త ప్రాజెక్ట్‌ల గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికపై నెట్టింట జరుగుతున్న ప్రచారాలపై స్వయంగా దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఈ కాంబినేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల నిరాధారమైన కథనాలు చక్కర్లు కొట్టాయి. సినిమా ప్రకటనలు, ప్రాజెక్ట్ అప్‌డేట్లంటూ వస్తున్న ఆ వార్తలు టాలీవుడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అభిమానుల్లో కూడా ఈ వార్తల వల్ల కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకు ఎప్పుడూ ఎంతో గౌరవం, అభిమానం ఉంటాయని స్పష్టం చేశారు. ఆయనంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నింటిలోనూ ఏమాత్రం నిజం లేదని అనిల్ రావిపూడి తేల్చిచెప్పారు. అదంతా పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైన వదంతులను అభిమానులు ఎవరూ నమ్మవద్దని, అలాగే వాటిని సోషల్ మీడియాలో మరింతగా షేర్ చేసి స్ప్రేడ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దర్శకుడే స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సినిమా గోసిప్స్ ఆధారంగా వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని ట్రేడ్ పండితులు కూడా సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్టార్ హీరోల నుంచి వచ్చే అఫీషియల్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి నిలిచింది.   Anil Ravipudi Clarification, Mahesh Babu Anil Ravipudi Project, Tollywood Movie Rumours, Vamsi Shekar Twitter, Telugu Cinema News
Yash returns to the big screen with an unprecedented roar as his upcoming gangster drama, Toxic, rewrites pre-release box office history. Directed by Geetu Mohandas, the film has already recorded a massive ₹60 crore in all-India advance bookings for its opening day. With this tremendous momentum, the movie is on track for a staggering ₹100 crore-plus debut in India alone. The pan-India project boasts a star-studded female cast that has elevated the anticipation to another level. Featuring acclaimed actresses , the movie promises a powerful cinematic experience. Audiences are eagerly waiting to witness this ensemble share the screen with the superstar. KVN Productions and Monster Mind Creations are producing the film.  Ticketing platforms are witnessing an unbelievable rush for the first-day shows. The combined ticket sales on BookMyShow and District apps have already crossed the 2.5 million mark across the nation. This overwhelming demand highlights the unparalleled excitement for the theatrical release. The response in the Telugu-speaking regions has been absolutely phenomenal. Advance sales for the Telugu version have effortlessly breached the ₹10 crore milestone. Furthermore, Hyderabad city alone has contributed a massive ₹5 crore to these pre-sales. Dil Raju is distributing the film in Telugu and ticket hikes are helping numbers in a big way.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కాంబినేషన్‌లో #SVC64గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘దాగుడు మూతలు దండాకోర్’ అనే మైండ్ బ్లోయింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. 'ఇరుముడి' గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ఫుల్ జోష్‌తో ఉన్న రవితేజ, దిల్ రాజు నిర్మాణ విలువలు, హసిత్ గోలి మార్క్ అవుట్ అండ్ అవుట్ హార్డ్‌కోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్ రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, రవితేజ-శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ఓ మల్టీస్టారర్ నిర్మిస్తున్నట్లు వార్తలొచ్చాయి. 'వీరాధి వీరులు' అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. మరి అదే మల్టీస్టారర్ కు ఈ ‘దాగుడు మూతలు దండాకోర్’ టైటిల్ ను ఫిక్స్ చేశారా? లేక ఇది వేరే సినిమానా? అనే క్లారిటీ రావాల్సి ఉంది. https://x.com/SVC_official/status/2092186818049700286       Irumudi, Ravi Teja, Dagudu Moothalu Dandakor, Sankranthi 2027  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక సరికొత్త మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం కథలో అక్కడక్కడా కనిపించే పిల్లల పాత్రలు, ఇప్పుడు సినిమా విజయానికి కీలకమైన ఆత్మగా మారుతున్నాయి. మన చైల్డ్ ఆర్టిస్టులు తమ అద్భుతమైన అభినయం, అమాయకత్వం, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో ఏకంగా స్టార్ హీరోలతో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకుంటూ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రంలో బేబీ నక్షత్ర తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో 'మణమ్మ' పాత్రలో ఆమె ఒలికించిన హావభావాలు, ఎమోషన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా రీల్స్ ద్వారా వెలుగులోకి వచ్చి, దర్శకుడు శివ నిర్వాణ దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నారి ప్రస్తుతం బహుభాషా చిత్రాల్లో నటిస్తూ ప్రమోషన్లలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మాస్టర్ రేవంత్ భీమల పండించిన కామెడీ నవ్వులు పూయించింది. 'బుల్లిరాజు' పాత్రలో గోదావరి యాసలో రేవంత్ చెప్పిన డైలాగులు, అతని టైమింగ్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించాయి. 'మన శంకర వర ప్రసాద్' వంటి చిత్రాల్లోనూ నటిస్తూ రేవంత్ తనదైన ముద్ర వేస్తున్నాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సోషియో ఫాంటసీ హిట్ 'బింబిసార'లో చిన్నారి శ్రీదేవి బంగారం పండించిన సెంటిమెంట్ కథలో కీలక మలుపుగా నిలిచింది. ఒక క్రూరమైన రాజు మనసును మార్చే పాత్రలో ఆమె సహజ నటన సినిమా విజయానికి ఎంతగానో తోడ్పడింది. సీరియల్స్, సినిమాలు చేస్తూ ఈ చిన్నారి ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ఇక నాని నటించిన 'హాయ్ నాన్న' చిత్రంలో మహిగా నటించిన బేబీ కియారా ఖన్నా ఒలికించిన ఎమోషన్స్ వర్ణనాతీతం. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో కియారా నటనకు ప్రేక్షకులు కంటతడి పెట్టారు. అంతేకాకుండా 'సరిపోదా శనివారం' వంటి భారీ చిత్రాలలో కూడా కార్తీక కృష్ణ వంటి చిన్నారులు తమ విలక్షణమైన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న పిల్లలు నటించిన సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఈ చిన్నారులు పండిస్తున్న సెంటిమెంట్, కామెడీ థియేటర్లలో చప్పట్లు, ఈలలు కొట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ బాలనటుల డ్యాన్స్ వీడియోలు, క్యూట్ ఇంటర్వ్యూలు విపరీతంగా వైరల్ అవుతుండడం విశేషం. కథలకు తగినట్లుగా బాలనటుల ప్రాధాన్యతను గుర్తిస్తూ మన తెలుగు దర్శకులు వైవిధ్యమైన పాత్రలను రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ బుల్లి స్టార్స్ మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, టాలీవుడ్‌లో తమదైన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
చిన్న సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ 'కికు చిరంజీవి' హీరో కికు యనమల ఆవేదన వ్యక్తం చేశారు. "పాలమ్మిన పూలమ్మిన" అంటూ వేదికలపై మాట్లాడే పెద్ద మనుషులు.. కష్టపడి సినిమా తీసిన చిన్న హీరోలను చిన్నచూపు చూస్తున్నారు అంటూ.. పరోక్షంగా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేడుకలో "పాలమ్మిన పూలమ్మిన" అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో మూవీ ఈవెంట్స్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇటీవల 'టాక్సిక్' ఈవెంట్ కూడా వేలాది మంది సమక్షంలో జరిగింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వడంలేదట. 'కికు చిరంజీవి' మూవీ విషయంలో మొదట ఈవెంట్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారట. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో కికు యనమల బయటపెట్టారు. హీరో కికు యనమల మాట్లాడుతూ.. "ఒక ప్రముఖ కాలేజీలో ప్రమోషన్స్ చేసుకుంటామని పర్మిషన్ అడిగితే మొదట ఇస్తామని చెప్పి, తీరా సమయానికి కనీసం రెస్పాండ్ కాలేదు. కానీ, అదే పెద్దాయన ఒక పెద్ద సినిమా వేడుకలో స్టేజ్ మీద నిలబడి 'నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా.. ఎంతో కష్టపడ్డాను' అని చెప్తే చాలా బాధగా అనిపించింది. మీరు కష్టపడినప్పుడు ఎదుటివారి కష్టాన్ని కూడా గుర్తించాలి కదా" అని ఎమోషనల్ అయ్యారు. "ఒక పెద్ద సినిమా కోసం ఏకంగా 75,000 మందిని ఒకే చోట ఆర్గనైజ్ చేసిన సదరు వ్యక్తులు.. కనీసం నా సినిమా కోసం ఒక 700 మందిని కూడా ఆర్గనైజ్ చేసి హెల్ప్ చేయలేకపోయారా? మా కష్టం వాళ్లకు కనిపించలేదా?" అని ప్రశ్నించారు. అంతేకాదు, థియేటర్ల వద్ద కూడా చిన్న సినిమాలకు ఘోరమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కష్టపడి ప్రింట్ చేయించి వేసిన 'కికు చిరంజీవి' మూవీ పోస్టర్లను తొలగించేసి, వాటి ప్లేస్‌లో ఇతర భాషల పెద్ద సినిమాలైన 'టాక్సిక్' వంటి పోస్టర్లను పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. "మన తెలుగు సినిమాలకు మనవాళ్లే సపోర్ట్ చేయకపోతే ఇక బయటవాళ్లు ఎలా చేస్తారు? పోనీ ఆ 'టాక్సిక్' పోస్టర్ పక్కనైనా మా సినిమా పోస్టర్ ఉంచవచ్చు కదా? అలా కాకుండా పూర్తిగా తీసి పడేయడం ఎంతవరకు న్యాయం?" అని ఆయన నిలదీశారు.       Kiku Chiranjeevi, Kiku Yanamala, Toxic Movie, Mallareddy  
Nivin Pauly and Dulquer Salmaan sharing the screen again could be one of the most exciting possibilities in Malayalam cinema. The two actors, who have been friends and contemporaries for years, recently met at an event and, according to Nivin, ended up discussing several personal matters and things they had wanted to tell each other. Interestingly, they later realised that despite their equation, they had not properly discussed working together in a film for more than a decade. That conversation has now opened the possibility of a proper Nivin-Dulquer reunion. Nivin revealed that the two actors have expressed interest in doing a film together if a script comes along that genuinely satisfies both of them. Their last major collaboration was Bangalore Days, which also featured Fahadh Faasil, Nazriya Nazim and Parvathy, and remains one of Malayalam cinema’s most loved ensemble films. Nivin also revealed an interesting gesture from Dulquer while discussing his current projects. Although Dulquer’s I’m Game was originally positioned alongside Bethlehem Kudumba Unit for the Onam season, he still appreciated Nivin and his film. I’m Game was subsequently postponed by two weeks and is now scheduled to release on September 3. The conversation also comes at an important point in Nivin’s career. The actor recently spoke about the delay surrounding Benz, revealing that around 35 days of shooting are still pending and that he had wanted to remove his beard for Bethlehem Kudumba Unit and his next film, but could not get clarity from the team. For now, there is no film officially announced for the duo. But the fact that Nivin and Dulquer themselves are open to sharing the screen again makes the possibility far more interesting. After more than a decade, it may only take the right script to bring this much-loved combination back together. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కన్నడ సినీ పరిశ్రమని కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  హీరో దర్శన్ కి కోర్టులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంచలనాత్మక హత్య కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ (Pradosh) ప్రభుత్వ సాక్షిగా, అంటే అప్రూవర్‌గా (Approver) మారేందుకు కోర్టు అనుమతించింది. ప్రదోష్ సమర్పించిన పిటిషన్‌ను విచారించిన బెంగళూరులోని 59వ అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు, ప్రాసిక్యూషన్ ప్రకటనలు మరియు వాదనలు విన్న తర్వాత ఆయన అభ్యర్థనకి  ఆమోదం తెలిపింది.  దీంతో కేసులో పూర్తి సత్యాన్ని బయటపెట్టి, నిందితుల పాత్ర గురించి సమగ్ర వివరాలను కోర్టుకు వెల్లడిస్తే చట్టపరమైన క్షమాభిక్ష లభించే అవకాశం ఉంది.  ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2024 జూన్ 8వ తేదీన చిత్రదుర్గానికి చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే ఫార్మసీ ఉద్యోగి దారుణంగా అపహరణకు గురై హత్యకు గురయ్యాడు. నటుడు దర్శన్ భాగస్వామి మరియు నటి అయిన పవిత్ర గౌడకు సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపాడనే ఆగ్రహంతోనే రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులోని షెడ్‌కు తరలించారని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2024 జూన్ 9న బెంగళూరులోని సుమనహళ్లిలోని ఒక మురికికాల్వ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం తీవ్ర గాయాలతో లభ్యమైంది.   Also Read: టాక్సిక్ కి షాక్ ..ఆ ఏరియాలో ఒక్క టికెట్ అమ్ముడుపోలేదు! తదనంతరం జూన్ 11న మైసూరులోని ఒక హోటల్ సమీపంలో ఉన్న జిమ్‌లో ఉన్న నటుడు దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ, ప్రదోష్ సహా మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా విచారణను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, 60 మంది కీలక సాక్షులను ప్రాధాన్య ప్రాతిపదికన విచారించాలని స్పష్టం చేసింది. దర్శన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. Darshan, sandilWood
  యష్ అభిమానులంతా టాక్సిక్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో నమోదైన రికార్డులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగు , తమిళం, హిందీ తో పాటు ఇతర భాషల్లో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్  కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 60 కోట్ల రూపాయలకు చేరినట్టు  ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.  ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ , ఓవర్సీస్ లో మాత్రం బుకింగ్స్ డల్ గా ఉన్నట్టుగా టాక్ .ముఖ్యంగా నార్త్ అమెరికాలో  ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ ద్వారా 4 లక్షల 70 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, అందులో కేవలం తెలుగు వర్షన్ నుండి 3 లక్షల డాలర్లు అని,  తమిళం నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదని అంటున్నారు. అంటే గ్రాస్ సున్నా అన్నమాట. దీన్ని బట్టీ అర్థం అవుతుంది ఏమిటంటే , తమిళ ఆడియన్స్ కేవలం వాళ్ళ సినిమాలను మాత్రమే చూస్తారు, ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళ సినిమాలు చూడరు. Also Read: మోహన్ బాబుకి భారీ కానుక ఇచ్చిన విష్ణు.. పద్మిని మళ్ళీ రోడ్ మీదకి కానీ వాళ్ళు మాత్రం అన్ని భాషల్లోనూ తమ సినిమాలను విడుదల చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆడియన్స్ ప్రోత్సహిస్తున్నారు కూడా. అయితే టాక్సిక్ చిత్రానికి తమిళ వెర్షన్ లో జీరో టికెట్స్ అమ్ముడుపోవడం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి.  Yash, Toxic, Geethu MohanDas  
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఇటీవల థియేటర్లలో అడుగుపెట్టిన 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కు కూడా మంచి పేరు వచ్చింది. అయితే హీరోయిన్ గా మారకముందు, ఒకప్పుడు ఆమె టీవీ యాంకర్ అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఒక తమిళ న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించి, సీరియల్ నటిగా ఎదిగి, ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్నారు ప్రియా భవానీ శంకర్. తాను యాంకర్ నుంచి హీరోయిన్ గా మారిన విషయాన్ని 'ఇరుముడి' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా ఆమెనే రివీల్ చేయడం విశేషం. ప్రముఖ తమిళ న్యూస్ ఛానెల్ 'పుదియ తలైమురై'లో న్యూస్ ప్రెజెంటర్‌గా ప్రియ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు హోస్ట్‌గా మారి తన మార్కు చూపించారు. అక్కడి నుంచి 'కళ్యాణం ముదల్ కాదల్ వరై' అనే పాపులర్ సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టారు. టీవీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2017లో వచ్చిన 'మేయాద మాన్' చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ప్రియ. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కార్తీ సరసన 'కడైకుట్టి సింగం', ఎస్.జె. సూర్య కాంబినేషన్‌లో 'మాన్‌స్టర్', ధనుష్ కాంబినేషన్‌లో 'తిరుచిత్రంబలం' వంటి చిత్రాల్లో నటించారు.  తెలుగులో 'కళ్యాణం కమనీయం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియ.. భీమా, జీబ్రా వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఇరుముడితో మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగే అవకాశముంది.        Ravi Teja, Irumudi, Priya Bhavani Shankar, Interview  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
రక్తసంబంధాలన్నింటిలోనూ అత్యంత విలక్షణమైనది, మధురమైనది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం. చిన్నతనంలో ఒకే ఇంట్లో పెరుగుతూ గిల్లికజ్జాలు, చిలిపి అల్లర్లు, పంచుకోవడంలో గొడవలతో మొదలైన వీరి పయనం.. కాలంతో పాటు మరింత పరిణతి చెందుతుంది. ఆ పవిత్ర బంధానికి స్నేహం, వాత్సల్యం, రక్షణ కలగలిపి పండుగలా జరుపుకునే వేడుకే 'రక్షాబంధన్'. ప్రేమకు, రక్షణకు ప్రతీక.. సోదరి తన అన్న లేదా తమ్ముడి చేతికి కట్టే ఆ చిన్న దారప్పోగు కేవలం ఒక దారం మాత్రమే కాదు.  అది ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీక. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడి శ్రేయస్సును, ఆయురారోగ్యాలను కోరుకుంటూ రాఖీ కడితే.. సోదరుడు ఆమె జీవితాంతం తోడుగా ఉంటానని, ప్రతి కష్టంలోనూ వెన్నుదన్నుగా నిలుస్తానని మాటిస్తాడు. రాఖీ కట్టే సమయానికి దారంతో పాటు మానసికంగా వారిని ముడివేసే అనుబంధం మరింత గట్టిపడుతుంది. కాలం మారినా.. తరగని విశిష్టత.. ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా తోబుట్టువులు వేర్వేరు నగరాల్లో, దేశాల్లో నివసిస్తున్నప్పటికీ రాఖీ పండుగ ఇచ్చే భావోద్వేగం మాత్రం మారలేదు. దూరాలు పెరిగినా రాఖీల రూపంలో ప్రేమ సందేశాలు చేరుతూనే ఉన్నాయి. ఈ రోజున పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా ప్రేమానురాగాలు నిత్యనూతనంగా నిలుస్తాయి. బాధ్యతను గుర్తుచేసే వేడుక.. రక్షాబంధన్ అంటే కేవలం బహుమతులు మార్చుకోవడమే కాదు,  అది ఒక సామాజిక, కుటుంబ బాధ్యతను గుర్తుచేసే పండుగ. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు.. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉండటాన్ని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది.  రక్షణగా నిలవడం.. తోబుట్టువుకు ఏ సమస్య వచ్చినా 'నేనున్నాను' అనే నమ్మకాన్ని ఇవ్వడమే నిజమైన రక్ష. రాఖీ కట్టిన సందర్భంగా ప్రతి సోదరుడు తన సోదరికి ఇచ్చే నిజమైన బహుమానం.. నేనున్నాను అనే భరోసా ఇవ్వడమే. గౌరవం.. సమాజంలో మహిళలను గౌరవించే సంస్కారాన్ని ఈ బంధం నుంచే ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ఒక ఆడపిల్లను తన ఇంటి వారు గౌరవిస్తే.. బయటి వాళ్ళు కూడా ఆ ఆడపిల్లను గౌరవిస్తారు.  సుఖదుఃఖాల్లో తోడు.. జీవితంలో వచ్చే ప్రతీ ఎత్తుపల్లాల్లో ఒకరికొకరు మానసిక ధైర్యంగా నిలబడాలి. ఆ ధైర్యం మనిషిని ఎంత కష్టంలో అయినా పోరాడేలా.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా నిలబడేలా చేస్తుంది.  కలకాలం నిలిచే అనుబంధానికి రాఖీలో ఉండే దారప్పోగు ఇచ్చే బలం ఎంతో గొప్పది. స్వచ్ఛమైన ప్రేమకు, బాధ్యతకు చిహ్నమైన ఈ రాఖీ పండుగ తోబుట్టువులందరి జీవితాల్లో సంతోషాలను నింపాలని కోరుకుందాం!                                                                                                                                      *రూపశ్రీ
పెళ్లి.. ఆడపిల్ల జీవితాన్ని, పుట్టింటితో గల బంధాన్ని కూడా చాలా వరకు మార్పులకు లోను చేస్తుంది. పెళ్లయ్యాక సొంత తోబుట్టువుల సంబంధ బాంధవ్యాల్లో కొన్ని మార్పులు రావడం సహజం.  పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తాడు..  అప్పటి వరకు పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, కొత్త వాతావరణంలో ఉండాల్సి వస్తుంది. అది క్రమంగా అలవాటు అయినా పుట్టిల్లు మాత్రం దూరంగానే ఉంటుంది.  అయితే సరైన అవగాహన, ప్రేమానురాగాలు ఉంటే తోడబుట్టిన వాళ్ళతో బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. పెళ్లయ్యాక అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం మరింత బలంగా ఉండటానికి కొన్ని సలహాలు చాలా బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే.. సమయాన్ని కేటాయించుకోవడం.. ఎంత బిజీగా ఉన్నా రోజూ లేదా వారానికి ఒకసారైనా పలకరించుకోవడం ముఖ్యం. పండుగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో కలిసి గడపడానికి ప్రయత్నిస్తే దూరం అనే భావన తగ్గుతుంది. స్పేస్  ఇవ్వడం, గౌరవించడం.. వివాహమైన తర్వాత తోబుట్టువుల జీవితాల్లో వారి భాగస్వామికి ప్రధాన స్థానం ఉంటుంది. ఆ మార్పును అర్థం చేసుకుని, వారి వ్యక్తిగత జీవితానికి , నిర్ణయాలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. భాగస్వాములతో మంచి సంబంధం.. ఆడపిల్లను చేసుకున్న వ్యక్తికి ఇచ్చే గౌరవాన్ని బట్టే.. తోడబుట్టిన వాళ్ళ బంధం ఆరోగ్యంగా ఉంటుంది. ఆడపిల్లను ఇచ్చినప్పుడు ఇంటి అల్లుడిని కుటుంబంలో ఒకరిగా ప్రేమగా చూడాలి. వారితో పాజిటివ్ వాతావరణం ఏర్పడితే అన్నాచెల్లెళ్ల/అక్కాతమ్ముళ్ల బంధం మరింత పటిష్టమవుతుంది. పోలికలు,  నిష్టూరాలు.. పాతికేళ్ల క్రితం ఉన్న చిన్నప్పటి పరిస్థితులను, పెళ్లయ్యాక వచ్చే మార్పులను పోల్చి చూడకూడదు. భర్త రాగానే మారిపోయింది అని నిష్టూరం చేసుకోవడం లాంటివి కూడా చేయకూడదు.  ఆర్థికపరమైన విషయాల్లో లేదా ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చినా పరస్పరం అర్థం చేసుకోవాలి. సమస్యలను నేరుగా మాట్లాడుకోవడం.. ఏవైనా మనస్పర్థలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, తోబుట్టువులతో నేరుగా ప్రేమగా మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలి. కుటుంబ విషయాల్లో హుందాగా ప్రవర్తించడం  చాలా అవసరం. చిన్ననాటి జ్ఞాపకాలు..  అప్పుడప్పుడు చిన్నప్పటి సరదాలు, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ద్వారా అనుబంధంలో పాత తీపిదనం, ఆప్యాయత ఎప్పటికీ తగ్గకుండా ఉంటాయి. చివరగా..  బంధాలు నిలబడటానికి ప్రేమ ఎంత ముఖ్యమో.. పరస్పర గౌరవం, సర్దుబాటు తత్వం కూడా అంతే ముఖ్యం. మారుతున్న జీవిత పరిస్థితులకు అనుగుణంగా ఒకరికొకరు తోడుగా నిలిస్తే అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల బంధం కాలంతో పాటు మరిన్ని తీపి జ్ఞాపకాలను అందిస్తుంది.                                                                                                                                                   *రూపశ్రీ.                              
నేటి వేగవంతమైన జీవనశైలిలో మహిళలు తమ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీనివల్ల చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రక్తహీనత లేదా ఎనీమియా అత్యంత ప్రమాదకరమైనదిగా మారింది. శరీరంలో ఇనుప ధాతువు లేదా ఐరన్ లోపం వల్ల నిరంతరం అలసట, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, అలాగే చర్మం పాలిపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విధమైన సమస్యల నుంచి బయటపడటానికి రోజూ మెడికల్ షాపుల్లో లభించే కేమికల్ మందులు లేదా ఐరన్ టాబ్లెట్లపై ఆధారపడటం కంటే, మన వంటింట్లో లభించే సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో బలాన్ని పుంజుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ క్రమంలోనే మహిళల ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేసే ఒక అద్భుతమైన ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ లడ్డూ వంటకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ హెల్దీ మరియు రుచికరమైన ఐరన్ లడ్డూలను ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన ప్రధాన దినుసులు మన ఇంట్లో సులభంగా లభించే నల్ల నువ్వులు, బెల్లం, వేయించిన పల్లీలు, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ మరియు కొద్దిగా నెయ్యి. నల్ల నువ్వులు మరియు బెల్లంలో సమృద్ధిగా ఐరన్, కాల్షియం నిక్షేపమై ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచడానికి అద్భుతంగా తోడ్పడతాయి. ముందుగా బాదం, జీడిపప్పు, పల్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వులను కూడా లైట్‌గా వేయించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని బెల్లం తురుముతో కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి కలిపి చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన ఐరన్ లడ్డూలు సిద్ధమవుతాయి. రోజువారీ ఆహారంలో కేవలం ఒక ఐరన్ లడ్డూను చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఐరన్, ప్రొటీన్, మరియు ఇతర అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడే మహిళలకు, గర్భిణులకు, అలాగే రక్తం తక్కువగా ఉన్న యుక్తవయసు బాలికలకు ఈ లడ్డూలు తక్షణ శక్తిని అందిస్తాయి. బెల్లంలో ఉండే సహజసిద్ధమైన తీపి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఈ లడ్డూలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం మరియు జుట్టు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతాయి.       How to increase hemoglobin naturally laddoo, sesame jaggery iron boosting superfood.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా.  అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే.. కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్.. కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ  ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి  గోరువెచ్చని కాపడాలు చాలా బాగా  సహాయపడతాయి. అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే..  ఆ కడుపు నొప్పి కూడా వాంతులు,  జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను  అలాగే పెట్టుకుని పడుకోకూడదు. ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి. కఫ సమస్యలకు ఉప్పు కాపడం.. దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.  ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు.  వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.                                                                                                                                                   *రూపశ్రీ.