LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్  బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచే వారు తమ ఓటమిని అంగీకరించేశారు. ఓటమికి కారణాలు వెతుక్కుని వెతుక్కుని మరీ చెప్పారు.  నగరి నుంచి పోటీ చేసిన మంత్రి రోజా అయితే.. తన ఓటమికి సొంత పార్టీ వారే కారణమని పోలింగ్ ఇంకా పూర్తిగా ముగియకుండానే మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకుని మరీ చెప్పారు. ఇక పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ఎన్నికల సంఘాన్నీ పోలీసులనూ మేనేజ్ చేసి తమ అవకాశాలు దెబ్బతీశారంటూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. అధికార పార్టీ అయి ఉండీ కొందరు పోలింగ్ ఏకపక్షంగా తెలుగుదేశంకు అనుకూలంగా జరిగిందని బేల అరుపులు అరిచారు. సరే ఎంత గింజుకున్నా, ఎంత మొత్తుకున్నా ఓటమి మాట మాత్రం వారి నోటి వెంట వారికి తెలియకుండానే వచ్చేసింది.  ఇక పార్టీ అధినేత జగన్ గంభీరంగా గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం అని ఓ మాట చెప్పి విదేశీ పర్యటనకు చెక్కేశారు. అధినేత గెలుపుపై చెప్పిన మాట వైసీపీ శ్రేణులకు ఇసుమంతైనా భరోసా కలిగించలేదనుకోండి అది వేరే సంగతి.  ఇక ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వ్యూహకర్తలు ఓటమికి కారణాలు వెతుక్కుని మరీ చెబుతున్నారు. అందులో భాగంగానే  విరిప్పుడు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలు కావడం ఖాయమని అంగీకరించేసి.. ఆ ఓటమికి కారణాలు చెప్పుకొస్తున్నారు. అందుకు వారు సామాజిక మాధ్యమాన్నే వేదికగా ఎంచుకున్నారు.  జనం మొత్తం జగన్ వెంటే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలపై ప్రజలలో గూడుకట్టుకున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా జగన్ అధికారానికి దూరం కాబోతున్నారన్నట్లుగా కథనాలు వండి వారుస్తోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత గడపగడపకూ సమయంలోనే ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అధికారంలో ఉండాలి అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం మాకు వద్దు అంటూ పలు నియోజకవర్గాలలో ప్రజల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయనీ చెప్పుకొస్తున్నారు. అందుకనుగుణంగానే జగన్ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ అప్పటికే ఆలస్యమైందని వివరణలు ఇచ్చుకుంటున్నారు.  కానీ వాస్తవమేమిటంటే ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా జగన్  పాలనక వ్యతిరేకంగా ఇవ్వడానికి డిసైడైపోయారని పరిశీలకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే..జనం ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూనే జగన్ అసలే వద్దు అని విస్పష్టంగా చెప్పేశారనీ, అందుకే ఇప్పుడు జగన్ కు అనుకూలమే కానీ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలపైనని కలర్ ఇచ్చేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్ పై కంటే ఎమ్మెల్యేలపై ప్రజలలో వ్యతిరేకత ప్రబలడానికి కారణాలేమీ లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాలలో వాలంటీర్ల పెత్తనంతో  ఎమ్మెల్యేల పాత్ర  డమ్మీల స్థాయికి పరిమితమైపోయిందని అంటున్నారు. 
మద్యం మత్తులో యువతీ యువకుల అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే పై, ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లోనే  గొడవపడుతున్నారు. వీరేమ‌న్నా అవారాగాళ్ళ అంటే అదీ కాదు.  విద్యావంతులే. అయితే పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరీ వీళ్లను ఏమనాలో..!  జనంతో ఛీ అనిపించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు.  సమాజ కట్టుబాటుపై, చట్టాల పై ధిక్కార స్వరం..! వీరు ఆధునిక జీవనశైలికై ఆరాట‌ప‌డుతూ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైదరాబాద్‌లో  ఓ యువ‌ జంట పట్టపగలే నడిరోడ్డుపై రెచ్చిపోయింది. శుక్రవారం వేకువజామున బీరు తాగుతూ నానా హంగామా సృష్టించారు. నాగోల్‌లో ఓ వైపు మార్నింగ్ వాకర్స్ తమ పనుల్లో నిమగ్నమై ఉంటే.. ఇంకోవైపు ప్రేమికులిద్దరూ బీరు సీసాలు చేతిలో పెట్టుకుని.. కారులో భీకరమైన లౌడ్ స్పీకర్లు ఆన్ చేసి.. నడిరోడ్డుపై తాగుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి చేష్టలను కొంతసేపు భరించిన వాకర్స్.. మరింత శృతిమించడంతో ప్రజలు కలుగజేసుకుని ఇది పద్ధతి కాదని చెప్పిన పాపానికి జంట మరింత రెచ్చిపోయింది. వాకర్స్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అమ్మాయైతే.. బీరు సీసా చేతిలో పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ బండ బూతులు తిట్టింది. అక్కడే ఉన్న వాకర్స్.. ఈ దృశ్యాలు మొబైల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం మాయరోగం అంటూ జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పెంపకం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.   రాజస్థాన్‌లోనూ ఇలాంటి సంఘ‌ట‌నే వైర‌ల్ అయి నెట్‌లో చ‌క్క‌ర్ కొడుతోంది. ఆ జంట నడిరోడ్డుపై బైక్‌పై వెళ్తూ హద్దులు దాటి ప్రవర్తించింది. ప్రేమికులిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయారు.  ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై ఎంజాయ్ చేశారు. అయితే అక్క‌డి పోలీసులు జోక్యం చేసుకొని ఆ ప్రేమ‌ప‌క్షుల్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.  గుంజీలు తీయించారు. ఇద్దరి చేత ప్రమాణాలు కూడా చేయించారు. మరోసారి ఇలా చేయమంటూ వారిద్దరి చేత ప్రమాణపత్రం కూడా తీసుకున్నారు. 
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ఉండనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ని కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కి అవకాశమిచ్చారు. జులై 24న సీట్లను కేటాయించి... జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.ఇంజినీరింగ్ కౌన్సిల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్, జులై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్, ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: రాజు యాద‌వ్‌ తారాగణం: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రూపాల‌క్ష్మి తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: సాయిరామ్ ఉద‌య్‌ ఎడిటింగ్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రెడ్డి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ రచన, దర్శకత్వం: కృష్ణ‌మాచారి  నిర్మాత: ప్ర‌శాంత్ రెడ్డి బ్యానర్: సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ విడుదల తేదీ: మే 24, 2024  బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను.. వెండితెరపై కూడా పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'రాజు యాద‌వ్‌' అంటూ హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా గెటప్ శ్రీనుకి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: డిగ్రీ ఫెయిల్ అయ్యి ఊళ్ళో ఖాళీగా ఉండే రాజు యాద‌వ్‌(గెటప్ శ్రీను)కి ఒకసారి క్రికెట్ ఆడుతుంటే.. ఫేస్ కి కార్క్ బాల్ తగులుతుంది. అక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చీరాని వైద్యంతో కుట్లు వేయడంతో.. అతని ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లుగా మారిపోతుంది. సర్జరీ చేస్తేనే గానీ.. రాజు ఫేస్ మళ్ళీ నార్మల్ అవ్వదు. కానీ అంత ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకునే స్థోమత రాజుకి ఉండదు. మరోవైపు, ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ కోసం రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా.. అక్కడ స్వీటీ(అంకిత ఖరత్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తన వెంట పడొద్దని స్వీటీ చెప్పినా వినకుండా.. ఉద్యోగం కోసం ఆమె హైదరాబాద్ వెళ్తే.. ఆమెని వెతుక్కుంటూ రాజు కూడా సిటీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రాజుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? స్వీటీ ప్రేమని దక్కించుకోగలిగాడా? డబ్బుల కోసం తండ్రితో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? దుబాయ్ కి వెళదామని రాజు ఎందుకు అనుకున్నాడు? ఆపరేషన్ చేయించుకున్నాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి. విశ్లేషణ: హీరోకి క్రికెట్ బాల్ తగిలి.. ఎప్పుడూ నవ్వుతున్నట్టుగా ముఖం మారిపోవడం అనే పాయింట్ తప్ప.. సినిమాలో ఎటువంటి కొత్తదనం లేదు. కథాకథనాలు చాలా రొటీన్ గా ఉన్నాయి. అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి పిచ్చోడిలా తిరగడం.. ఈ తరహా కథలు ఇప్పటికే తెలుగులో ఎన్నో వచ్చాయి. 'రాజు యాద‌వ్‌' కూడా అదే కోవకి చెందినది. హీరోకి నవ్వు జబ్బు అనేది ఒక్కటే ఇందులో కొత్త పాయింట్. అయితే ఆ పాయింట్ కి తగ్గట్టుగా.. ఆకట్టుకునే కథాకథనాలు, బలమైన సన్నివేశాలు రాసుకొని.. ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీయడంలో దర్శకుడు అంతగా సక్సెస్ కాలేకపోయాడు. అక్కడక్కడా కామెడీ, ఎమోషన్స్ వర్కౌట్ అయినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా రొటీన్ గా నడిచింది. టెక్నికల్ గా సినిమా బాగానే ఉంది. సాయిరామ్ ఉద‌య్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంది. సహజత్వం ఉండేలా చూసుకున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. సురేష్ బొబ్బిలి కూడా తనదైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్, మరికొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించాయి. నిర్మాణ విలువలు పరవాలేదు.  నటీనటుల పనితీరు: రాజు యాద‌వ్‌ పాత్రకి గెటప్ శ్రీను పూర్తి న్యాయం చేశాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటూ.. అన్ని భావోద్వేగాలను కళ్ళతో పలికించాల్సిన కష్టమైన పాత్రలో శ్రీను నటనను మెచ్చుకోవాల్సిందే. అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రూపాల‌క్ష్మి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా... దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగానే ఉన్నప్పటికీ.. రొటీన్ కథాకథనాలతో సినిమా తేలిపోయింది. గెటప్ శ్రీను నటన కోసం.. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్ల కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5 
జూన్ 4 వ తేదీ దగ్గర పడే కొద్దీ అల్లు అర్జున్ (allu arjun)అభిమానుల్లో టెన్షన్ ఎక్కువయ్యింది. పుష్ప 2 (pushpa 2)రిజల్ట్ విషయంలో టెన్షన్ పడటానికి  ఆగస్టు దాకా టైం ఉంది కదా అని అనుకుంటున్నారా. మీరు అనుకునేది నిజమే. కానీ ఆ టెన్షన్ పుష్ప గురించి కాదు.. అంతకు మించి.. ఆంధ్రప్రదేశ్ లో మొన్న పదమూడవ తేదీన  జరిగిన ఎన్నికల్లో బన్నీ తన స్నేహితుడైన శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి తరుపున ప్రచారానికి వెళ్ళాడు. రాయలసీమలోని నంద్యాల అసెంబ్లీ కి అధికార వైసిపి పార్టీ  తరుపున శిల్పా పోటీ చేసాడు. ఆయన గెలుపుని కోరుతు ర్యాలీ కూడా చేసి శిల్పా కి ఓటు వెయ్యాలని బన్నీ  ప్రజలకి విజ్ఞప్తి చేసాడు. ఇంతవరకు బాగానే ఉంది.కానీ  ఒక వేళ శిల్పా ఓడిపోతే మా బన్నీ  పరిస్థితి ఏంటి అనే దిగులు ఫ్యాన్స్ లో మొదలయ్యింది. ఎందుకంటే  తెలుగుదేశం తో మిళితమైన కూటమి అధికారంలోకి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.  ఈ విషయాన్నీ దాదాపుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదే టైంలో వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోనుందని కేవలం ఇరవై లోపు స్థానాలే వస్తాయని కూడా స్పష్టం చేస్తున్నాయి.దీంతో  ఆ ఇరవై స్థానాల్లో నంద్యాల లేకపోతే బన్నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే బెంగ తో ఉన్నారు. అది  పుష్ప 2 కలెక్షన్స్ మీద  కూడా ప్రభావం చూపించవచ్చని అంటున్నారు. ఇప్పుడు  సోషల్ మీడియాలో ఇంకో చర్చ కూడా నడుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)కొడాలి నాని, వల్లభనేని వంశీ లు చాలా మంచి స్నేహితులు. ఎన్టీఆర్ తో ఆ ఇద్దరు  సినిమాలు కూడా నిర్మించారు.ఆ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోస్ ని చూస్తే  వాళ్ళ స్నేహం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. అలాంటి ఎన్టీఆర్ నే ఆ ఇద్దరు మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేస్తే ప్రచారానికి వెళ్ళలేదు. అలాంటిది బన్నీ అనవసరంగా వెల్లాడేమో అని కొంత మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పైగా బన్నీ శిల్పకి అంత ఫ్రెండ్ షిప్ లేదని కూడా చెప్తున్నారు   
బెంగుళూర్ లో మొన్న ఆదివారం  రేవ్ పార్టీ జరిగింది. అందులో పాల్గొన్న చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారని రుజవయ్యింది. వాళ్ళందరి  రక్తనమూనాలని పరీక్షలకి పంపించగా సుమారు ఎనభై ఆరు మందికి పాజిటివ్ రిపోర్ట్ . వాళ్ళల్లో  ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉంది. తాజాగా ఇంకో నటి పేరు కూడా బయటకి వచ్చింది అషీ రాయ్(ashi roy) కె ఎస్ 100 , మిస్టరీ ఆఫ్ సారిక, లాక్ డౌన్, వైతరణి రానా లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని పొందింది. తను కూడా బెంగళూరు లో జరిగిన రేవ్ పార్టీ లో పాల్గొంది. డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.దీంతో ఇప్పుడు అషీ విషయం కూడా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది  బెంగుళూర్ పార్టీ లో పాల్గొన్నది నిజమే కానీ డ్రగ్స్ తీసుకోలేదు. ఫ్రెండ్ పుట్టిన రోజు పార్టీ చేసుకుందామంటేనే వెళ్లానని   రెండు రోజుల క్రితం అషీ రాయ్ చెప్పింది.  ఇప్పుడు ఆమె కూడా డ్రగ్ తీసుకున్నటు రుజువయ్యింది.ఇప్పుడు ఈ సంఘటనలతో హేమ, అషీ రాయ్ ఘటనలతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే విధంగా ముందు ముందు ఎవరి పేర్లు బయటకొస్తాయో అనే టెన్షన్ అందరిలో ఉంది   
సినిమా పేరు: బిగ్ బ్రదర్ తారాగణం: శివ కంఠంనేని, ప్రియా హెగ్డే,  శ్రీ సూర్య, ప్రీతి శుక్లా, దేవ్ సింగ్, హ్యారీ జోష్, గౌతమ్ రాజ్, గుండు సుదర్శన్, రాజేందర్ తదితరులు సంగీతం: ఓం ఝా  నేపథ్య సంగీతం: జీభు డీఓపీ: సూర్య ప్రకాష్  ఎడిటర్: సంతోష్ ఆర్ట్ డైరెక్టర్: షేర రచన, దర్శకత్వం: సుబ్బారావు గోసంగి నిర్మాతలు: కె. శివశంకర రావు, ఆర్. వెంకటేశ్వర రావు బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్  విడుదల తేదీ: మే 24, 2024  శివ కంఠంనేని కథానాయకుడిగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బిగ్ బ్రదర్'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: శివ (శివ కంఠమనేని), గౌరి (ప్రియా హెగ్డే)కి నిశ్చితార్థమై పదేళ్లయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. శివకి తన తమ్ముడు సూర్య(శ్రీసూర్య) అంటే ప్రాణం. ఒకసారి అనుకోకుండా సూర్యపై ఎటాక్ జరిగితే.. శివ కాపాడతాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి గొడవలకు పోకుండా, అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలని సూర్యకి శివ చెబుతాడు. తన అన్న మాటలని సీరియస్ గా తీసుకోని సూర్య.. వదినకి మాయ మాటలు చెప్పి బయటకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో సూర్యకి పూజ(ప్రీతి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో సూర్య, పూజలపై ఎటాక్ జరుగుతుంది. ఆ ఎటాక్ ని శివ, సూర్య కలిసి తిప్పికొడతారు. అయితే అసలు ఆ ఎటాక్ జరిగింది పూజ కోసమని తెలుసుకుంటాడు శివ. పూజ ఎవరు? ఆమె గతమేంటి? ఆమెపై ఎటాక్ చేసింది ఎవరు? అలాగే శివ, సూర్యల గతం ఏంటి? నిశ్చితార్థం జరిగినా పెళ్లి చేసుకోకుండా శివ ఉండటానికి కారణమేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషనల్, డ్యాన్స్ వంటి అంశాలతో ఫుల్ మీల్స్ లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని భర్తీ చేయడం కోసమే అన్నట్టుగా 'బిగ్ బ్రదర్' రూపొందింది అని చెప్పవచ్చు. అన్ని అంశాలను సమపాళ్లలో ఉండేలా చూసుకున్న దర్శకుడు.. మాస్, ఫ్యామిలీ, యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా సినిమాని మలిచాడు. ఫస్టాఫ్ లో ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అన్నదమ్ముల అనుబంధం, వదిన మరిది ఆప్యాయత, నానమ్మ మనవడి అల్లరి.. వంటి సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సూర్య-పూజ లవ్ ట్రాక్ తో పాటు.. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు కూడా మెప్పించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక సెకండాఫ్ లో యూత్ ని మెప్పించే అంశాలు ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్, కాలేజ్ ఎపిసోడ్స్ ని చూపిస్తూ సెకండాఫ్ ని నడిపించిన తీరు బాగుంది. తమ్ముడి ప్రేమను గెలిపించడం కోసం అన్న చేసిన పోరాటం మెప్పించింది. అలాగే శివ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని చక్కగా చూపించారు.  టెక్నికల్ గా ఈ సినిమా పరవాలేదు. మ్యూజిక్ ఓకే. పాటలు వినడానికి బాగానే ఉన్నా.. గుర్తు పెట్టుకొని పాడుకునేలా లేవు. ప్రకాష్ కెమెరా పనితనం బాగానే ఉంది. సంతోష్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణాలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నటీనటుల పనితీరు: శివ పాత్రలో శివ కంఠమనేని మెప్పించాడు. అన్ని ఎమోషన్స్ ని బాగా పలికించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. రెండు షేడ్స్ ఉన్న సూర్య పాత్రలో శ్రీసూర్య నటన ఆకట్టుకుంది. ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా... లవ్, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలతో ఫుల్ మీల్స్ లాంటి కమర్షియల్ సినిమాలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. అలాంటి పక్కా కమర్షియల్ సినిమా చూడాలి అనుకునేవారు.. 'బిగ్ బ్రదర్' చిత్రానికి హ్యాపీగా వెళ్లొచ్చు. రేటింగ్: 2.75/5 
Disney Plus Hotstar, a favorite among OTT lovers for its variety of web series, is set to release another intriguing series titled "Yakshini." This web series is produced by Shobu Yarlagadda and Prasad Devineni of the Baahubali fame production house, Arka Media Works. The series features an ensemble cast including Vedhika, Manchu Lakshmi, Rahul Vijay, and Ajay in leading roles. Teja Marni directed the series. Recently, the first look poster of "Yakshini" was released, hinting at its upcoming release. "Yakshini" is crafted with a unique concept distinct from other socio-fantasy movies and web series. The "Yakshini" trailer dropped today, and it has all the elements to impress viewers. It begins by introducing Yakshini, her story, and the curse. What is the curse, and how is it connected to romancing 100 men? Who is Krishna, and why isn't he married even though he's 30? All these questions will be answered on June 14th. The trailer offers a sneak peek into the thrilling adventure that Yakshini embarks on. Her romance and fun with Krishna, played by Rahul Vijay, and all the comedic moments in the house bring laughs. The family moments, romance, and thrilling mystical elements are the highlights of the trailer. The captivating visuals and score are stunning. It looks like the team is bringing the perfect entertainment to enjoy with family. The "Yakshini" web series will be available for streaming from 14th June in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Bangla, and Marathi.
Megastar Chiranjeevi’s highly anticipated magnum opus Vishwambhara is the most ambitious project for director Vassishta and the production house UV Creations. While Vassishta is rightly utilizing the opportunity to make a memorable film for mega fans and movie buffs, UV Creations is mounting the movie on a large canvas in an uncompromised manner. As we've already reported, Ashika is playing key role. Meanwhile, the team of mighty Vishwambhara onboarded the charming Ashika Ranganath to the epic cinematic journey of Vishwambhara. The ageless diva Trisha Krishnan is the female lead opposite Chiranjeevi in this movie that features some other noted actors in prominent roles. Vikram, Vamsi and Pramod are bankrolling this fantasy action adventure. MM Keeravani who recently won an Oscar Award scores the music, while the popular lensman Chota K Naidu is the cinematographer. Vishwambhara will be released for Sankranthi in 2025 on January 10th.
 సిల్వర్ స్క్రీన్ వద్ద మోస్ట్ లక్కీయస్ట్ హీరోయిన్ ఎవరంటే కమల్ డాటర్ శృతి హాసన్ (Shruti haasan)అని చెప్పవచ్చు.ఆ మాటకొస్తే వరల్డ్ మొత్తం మీదనే లక్కీయస్ట్  హీరోయిన్. ప్లాపుల్లో ఉన్న హీరో  తన సినిమాలో శృతిని ఫిక్స్ చేస్తే చాలు ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అంతటి కీర్తి ఉన్న శృతి  ముంబై నడివీధుల్లోనే రిప్లై ఇవ్వవలిసిన పరిస్థితి వచ్చింది.  శృతి రీసెంట్ గా చెన్నై నుంచి ముంబైకి వచ్చింది.  ముంబైలోని ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఎలాంటి చిరాకుని ప్రదర్శించకుండా హాయిగా ఫోన్ ఓపెన్ చేసి అభిమానులతో ముచ్చటించింది. ఇన్ స్టా వేదికా జరిగిన ఈ ముచ్చట్లలో  పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. బాధల్లో ఉంటే ఏం చేస్తావ్ అని ఒక అభిమాని అడిగాడు. ఎక్కువగా ఏడ్చేస్తా.బట్ ఉదయాన్నే లేచే సరికి అంతా మర్చిపోయి  కొత్తగా స్టార్ట్ చేస్తాను. రీసెంట్‌గా నీ జీవితంలో జరిగిన వికృతమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యే నా జీవితంలో అతి దారుణమైన సంఘటన  జరిగింది. వెంటనే  దాని నుంచి బయటపడిపోయి ఇప్పుడు హ్యాపిగా ఉన్నాను.. నీ  బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అలాగే  సింగిలా కమిటెడా?  ఈ విషయంలో  మాత్రం నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు.కానీ ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. నాట్ విల్లింగ్ టు మింగిల్ అని ఫన్నీగా ఆన్సర్  ఇచ్చింది. అదే విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు  నేనే బెస్ట్ ఫ్రెండ్ అని  కూడా చెప్పింది..ముంబైలో వాతావరణం ఎలా ఉంది అని కూడా అడిగితే  చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే  ట్రాఫిక్ కదిలింది అని చాటింగ్ ని ముగించుకుంది        ఇప్పుడు  ఈ చాటింగ్ తో శృతి  తన బాయ్ ఫ్రెండ్ శంతను తో బ్రేక్ అప్ అయిన విషయం నుంచి కోలుకుందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే గత కొన్నేళ్లుగా శంత నే లోకంగా బతికింది. విడిపోయాక కొన్ని రోజులు బయటకి కూడా రాలేదు. సోషల్ మీడియాలో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో అందరు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లారని అనుకున్నారు. శృతి ప్రస్తుతం తెలుగులో అడవిశేషు హీరోయిన్ గా వస్తున్న  డెకాయిట్ లో చేస్తుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి  
శర్వానంద్(Sharwanand), కృతి శెట్టి(Krithi Shetty) జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మనమే'(Manamey). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  విడుదల తేదీని కనీసం నెలరోజుల ముందైనా ప్రకటించి.. తమ మూవీని బాగా ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు మేకర్స్. కానీ 'మనమే' టీం మాత్రం.. 'మా రూటే సెపెరేట్' అంటుంది. ఏప్రిల్ లో 'మనమే' టీజర్ ని విడుదల చేసిన సమయంలో.. సినిమాని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కానీ, మే నెల చివరికి వచ్చింది. వేసవి కూడా అయిపోవచ్చింది. అయినా 'మనమే' రిలీజ్ పై క్లారిటీ లేదు. అయితే తాజాగా మేకర్స్ ఉన్నట్టుండి రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు. 'మనమే' విడుదల తేదీని ఈరోజు సాయంత్రం రివీల్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే జూన్ 7న సినిమాని విడుదల చేయాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. ఓ రకంగా ఇది షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే విడుదల తేదికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో సినిమాని ప్రమోట్ చేసి, జనాల్లోకి తీసుకెళ్లి, వారిని థియేటర్లకు వచ్చేలా చేయడం అంత తేలికైన విషయం కాదు.  అసలే ప్రస్తుతం థియేటర్లలో సినిమాల ఆదరణ అంతంతమాత్రం ఉంది. ఎన్నికలు, ఓటీటీల ప్రభావం థియేటర్లపై బాగా పడింది. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్ కి తగినంత సమయం లేకుండా.. సడెన్ గా 'మనమే' చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ రకంగా ఇది రిస్క్ అనే చెప్పాలి. మరి ఈ ప్రతికూలతలను దాటుకొని.. 'మనమే' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఈ ప్రపంచంలో వ్యక్తులకు న్యాయం జరిగేలా చూసేది న్యాయవ్యవస్థ. స్వాతంత్య్రం పొందిన ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు రాజ్యాల పేరుతో ఈ భూమండలాన్ని పాలించిన రాజులు, రాణులు కూడా న్యాయవ్యవస్థను పాటించారు. ఎక్కడో కొందరు నియంతలు మాత్రం తాము చెప్పిందే వేదమనే ధోరణిలో రాజ్యపాలన చేశారు. అయితే ఇదంతా అధికారం చేతిలో ఉన్నవాళ్లకే తప్ప సాధారణ పౌరులు తలవంచుకుని పోయే పరిస్థితులే ఉండేవి.  దేశాలు నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టినా, ఎంత అభివృద్ధి సాధించినా మహిళలకు న్యాయం అనేది విభిన్నంగానే ఉండేది, బడుగు బలహీన వర్గాలకు బానిసత్వం తప్ప న్యాయం అనే పదానికి తావుండేది కాదు. ఈక్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ప్రపంచం మీద కాలుతున్న కత్తిపై సమ్మెట దెబ్బల్లా మారాయి. ఫలితంగా న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో మహిళలకు సమాన మరియు సంపూర్ణ భాగస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి.   ప్రతి సంవత్సరం మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయస్థానాలు మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. మగవారితో సమానంగా ఆడవారు ఉండాలని భావించారు. జనాభాకు ప్రాతినిధ్యం వహించడానికి, వారి ఆందోళనలకు ప్రతిస్పందించడానికి, సమర్థ నిర్ణయాలను జారీ చేయడానికి న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర చాలా కీలకం. మహిళా న్యాయమూర్తులు తమ విధులకు హాజరు కావడం ద్వారా న్యాయస్థానాల విశ్వసనీయతను పెంచుతారు, వారు బహిరంగంగా న్యాయం కోరుకునే ఎవరికైనా అందుబాటులో ఉంటామనే బలమైన సందేశాన్ని, భరోసాను ఇస్తారు.  సహజంగా ఓ కుటుంబంలో మహిళల నిర్ణయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, వారి నిర్ణయాలే పైచేయిగా ఉంటాయి. సమాజంలో ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువ అని భావించబడుతున్నారు, అందువల్ల జీవితంలోని వివిధ రంగాలలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అవి అలానే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, దోహాలో జరిగిన UNODC గ్లోబల్ జ్యుడీషియల్ ఇంటెగ్రిటీ నెట్‌వర్క్ యొక్క రెండవ ఉన్నత-స్థాయి సమావేశంలో, ప్రెసిడెంట్ వెనెస్సా రూయిజ్, ఖతార్ ప్రధాన న్యాయమూర్తి సంయుక్తంగా మహిళా న్యాయమూర్తుల విజయాలను గౌరవించే అంతర్జాతీయ దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు.  కోర్టు బెంచ్‌లో సమాన సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉండటం న్యాయవ్యవస్థ  నిష్పాక్షిక తీర్పుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళా న్యాయమూర్తులు ధర్మాసనానికి విభిన్న దృక్కోణాలను అనుభవాలను అందిస్తారు, వారు సేవ చేసే సమాజాన్ని చిత్రీకరిస్తూ మానవ హక్కులు, చట్ట నియమాలను రక్షించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు అవినీతిని ఎదుర్కోవడానికి, కుట్రలను నాశనం చేయడానికి కూడా సహాయపడతారు. మహిళా న్యాయమూర్తులను గతంలో నిషేధించారు కానీ తరువాత వీటిని తిరిగి చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థలను మరింత పారదర్శకంగా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయ వ్యవస్థలు, నిర్వాహక నాయకత్వ సంస్థలు, ఇతర స్థాయిలలో మహిళల అభివృద్ధి కోసం సంబంధిత విజయవంతమైన జాతీయ విధానాలు, ప్రణాళికలను స్థాపించడానికి మరియు అమలు చేయడానికి నిబద్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన కొన్ని పనులను చూస్తే.. •ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఒక స్టాండ్ తీసుకోండి మీరు ప్రస్తుతం మహిళల కోసం మాట్లాడటానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజున, సోషల్ మీడియాలో లింగసమానత్వం మీకు ఎందుకు ముఖ్యమైనదో షేర్ చేయవచ్చు.   •మహిళా శక్తిని ప్రోత్సహించండి మహిళలు తమ హక్కుల కోసం తమ మద్దతును చూపించడానికి మరిన్ని అవకాశాలను ప్రోత్సహించండి. మహిళా సాధికారతను పెంపొందించడానికి కొన్ని ఆలోచనలు మహిళల కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించవచ్చు. •అణగారిన మహిళలకు న్యాయవాది ప్రాథమిక అవసరాలు లేదా హక్కుల విషయానికి వస్తే అందరికీ సమాన హక్కు లేదు. సమాజం ద్వారా వారి ప్రాథమిక అవసరాలు ఏర్పాటయ్యేలా చేయడం, మానవ హక్కులను కోల్పోతున్న మహిళల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్లి సహాయం చేయలేకపోయినా మీ చుట్టూ  ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. న్యాయం విస్తృతమవ్వాలంటే.. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య పెరగాలి. ◆నిశ్శబ్ద.
ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  
చాలారోజుల క్రితం ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను ఓసారి దూరదేశాలకు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ అతను, తన దగ్గర పని చేసే ముగ్గురు పనివాళ్లని పిలిచాడు. ‘చూడండి! నేను తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నేను మీకో పని అప్పచెబుతున్నాను. మీ ముగ్గురికీ నేను కొంత డబ్బుని ఇస్తున్నాను,’ అంటూ మొదటి వ్యక్తికి ఐదువేలు, రెండో వ్యక్తికి రెండువేలు, మూడో వ్యక్తికి వేయి రూపాయల డబ్బుని చేతికిచ్చాడు.   అలా యజమాని తన ముగ్గురు పనివాళ్లకీ డబ్బుని అందించి ప్రయాణమైపోయాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగివచ్చాడు. ‘నేను మీకిచ్చిన డబ్బుని ఏం చేశారు?’ అని ఆ ముగ్గురినీ అడిగాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం మీ లక్షణం. డబ్బుని స్థిరంగా ఉంచడం మీకు ఇష్టం ఉండదు. మీ మనస్తత్వం తెలిసినవాడిని కనుక మీరిచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాను. రాత్రింబగళ్లు కష్టపడ్డాను. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డబ్బు రెట్టింపైంది,’ అని పదివేల రూపాయలని చేతిలో పెట్టాడు మొదటి పనివాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం నాకు అలవాటైన విద్య కాదు. కానీ డబ్బుని అలా నిరుపయోగంగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న భయం ఉన్నా కూడా ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఒళ్లు వంచి పనిచేశాను. అదృష్టవశాత్తూ ఫలితం దక్కింది. రెండు వేలు కాస్తా నాలుగు వేలు అయ్యాయి,’ అని చెప్పుకొచ్చాడు రెండో పనివాడు.   ‘ప్రభూ! మీరు పాపం డబ్బుని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కోసం ఇల్లు విడిచి ఎక్కడెక్కడో వ్యాపారం చేసి వస్తుంటారు. అలాంటి డబ్బుని ఏదో ఒకటి చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఓ గొయ్యి తీసి ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బుని దాచిపెట్టాను. ఇదిగోండి మీరు ఇచ్చిన సొమ్ముని యథావిధిగా మీ చేతిలో పెడుతున్నాను,’ అంటూ వెయ్యి రూపాయలు ఉన్న మూటని వ్యాపారి చేతిలో పెట్టాడు మూడో పనివాడు.   ‘మూర్ఖుడా! డబ్బయినా, ప్రతిభ అయినా ఒక వరంలాంటిది. దాన్ని ఉపయోగించకపోతే ఎవరికీ పనికిరాకుండా పోతుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయావు. ఆ డబ్బు నీకూ ఉపయోగపడలేదు, నాకూ ఉపయోగపడలేదు. మొదటి ఇద్దరూ నేను ఇచ్చిన డబ్బులతో పాటు, వచ్చిన లాభాలని అట్టిపెట్టుకోండి. కానీ మూడో వ్యక్తికి ఇచ్చిన వేయి రూపాయలని కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను,’ అన్నాడు వ్యాపారి.   ఇది బైబిల్‌లో Parable of the Talents అనే కథ ఆధారంగా రాయబడింది. ఇందులో వ్యాపారి తన ముగ్గురు పనివాళ్లకీ ఇచ్చిన సొమ్ముని ‘Talent’ అని పిలుస్తాడు. Talent అనేది పూర్వకాలంలో డబ్బుకి ఓ కొలబడ్డగా వాడేవారు (మిలియన్, లక్ష, వేయి లాగా). వ్యాపారి మొదటి పనివాడికి ఎనిమిది టాలెంట్లు, రెండోవాడికి రెండు టాలెంట్లు, మూడోవాడికి ఒక్క టాలెంటు ఇచ్చి వెళ్తాడన్నమాట. కానీ ఇక్కడ టాలెంట్ అంటే ప్రతిభ అన్న అర్థం కూడా వస్తుంది! ప్రకృతి మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని టాలెంట్స్ ఇస్తుంది. వాటిని సవ్యంగా వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఉన్న ఒక్క టాలెంటునీ వాడుకోకుండా దాచుకున్నవాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఎక్కడ ఏ నష్టం వస్తుందో అని భయపడుతూ తన ప్రతిభని అణచివేసిననాడు జీవితం వృధా అయిపోతుంది. - నిర్జర.  
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.  ఎరుపు, నలుపు,  ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ,  సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ  శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...  రోగనిరోధక వ్యవస్థ.. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కంటి ఆరోగ్యం.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని,  కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది. బీపీ పై నియంత్రణ.. ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.  కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ.. ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం,  ఫైబర్  జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి. కొలెస్ట్రాల్‌.. ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని,  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.                                                    *నిశ్శబ్ద.
ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు.