LATEST NEWS
  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి  హోంమంత్రి అమిత్ షా కు ఉప ప్రధానిగా ప్రమోషన్ దక్కనుందంటూ వైసీపీ మాజీ నాయకుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు  హాట్ టాపిక్ గా మారింది.  కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.   కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు డిప్యూటీ పీఎం పదవి దక్కనుందంటూ వస్తున్న కథనాలను సమర్ధిస్తూ..  రాబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అమిత్ షాను ఉప ప్రధానిగా మోడీ నియమించనున్నట్లు విజయసాయి పేర్కొన్నారు.  దేశ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మకమైన, పాత్ర పోషిస్తున్న అమిత్ షాకు ఉప ప్రధానిగా ప్రమోషన్ రావడం సముచితమని పేర్కొన్న విజయసాయి..  దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అమిత్ షా వెనుకాడరనీ, అందువల్లే ఉప ప్రధాని పదవికి ఆయన అన్ని విధాలా అర్హులని  పేర్కొన్నారు.  భారత రాజకీయ చరిత్రలో గతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులు ఉప ప్రధాని బాధ్యతలను స్వీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి   ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవితో అమిత్ షాకు దక్కబోయే స్థానాన్ని పోల్చారు. గతంలో సర్దార్ పటేల్ అలంకరించిన ఈ ఉన్నతమైన డిప్యూటీ పీఎం హోదాను అమిత్ షాకు కేటాయించడం  సముచితంగా ఉంటుందని పేర్కొన్న విజయసాయి.. , ముందుముందు  అమిత్ షా చేపట్టనున్న ఈ కొత్త బాధ్యతకు మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపారు.   అమిత్ షా ఉప ప్రధాని అంటూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాకముందే..   విజయసాయి రెడ్డి వంటి సీనియర్ పార్లమెంటేరియన్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   భారతదేశంలో 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు విడతల్లోనూ డిప్యూటీ పీఎం పదవిని ఎవరికీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ హయాంలోనే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆ హోదాను ఎవరికీ కేటాయించలేదు.  ఈ నేపథ్యంలో అమిత్ షాకు  ఉప ప్రధాని పదవి  అప్పగించడం ద్వారా, భవిష్యత్తులో ప్రధాని పదవిని చేపట్టబోయేది అమిత్ షాయే అన్న సంకేతాన్ని వ్యూహాత్మకంగా విజయసాయి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటి వరకూ అయితే..  ఉప ప్రధాని నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటిక.. , విజయసాయి రెడ్డి పోస్ట్ వల్ల జాతీయ స్థాయిలో   ఈ విషయంపై చర్చ జోరందుకుంది.  ఒకవేళ  అమిత్ షా అధికారికంగా ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే, అది దేశ రాజకీయ ముఖచిత్రాన్ని,  అధికారిక ప్రాధాన్యతలను  మార్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.   Amit Shah Deputy PM news, Vijaya Sai Reddy tweet on Amit Shah, Union Cabinet Reshuffle 2026, Narendra Modi government Deputy Prime Minister, YSRCP BJP political updates
   బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న *యువ సంగ్రామ సభ' కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్  పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విచారణ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కార్యక్రమం నిర్వహించేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెంటనే అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇస్తూనే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ కారణంగా జాతీయ రహదారి లేదా ఇతర ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలను దిగ్బంధించరాదని స్పష్టం చేసింది.  అలాగే సభ నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, సభ నిర్వాహకులు పోలీసులు సూచించే అన్ని నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, జనస మ్మర్ద నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కూడా సూచించింది. హైకోర్టు అనుమతితో శనివారం (జూలై 18) సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు, యువ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సభ నిర్వహణకు పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశముంది. BRS Youth Sangram Sabha, Telangana High Court, Saroornagar Indoor Stadium, BRS Party, KCR, KTR, CM Revanth reddy
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది.   కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.   ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.   ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.    public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
ALSO ON TELUGUONE N E W S
The makers of Bethlehem Kudumba Unit, starring Nivin Pauly and Mamitha Baiju, have officially announced the film's theatrical release date. Directed by Girish AD, the much-awaited Malayalam family entertainer will hit cinemas on August 21, perfectly timed for the Onam weekend. The release date was unveiled through a new poster featuring Nivin Pauly and Mamitha Baiju walking together on a railway platform with cheerful smiles, reflecting the feel-good vibe the film promises to deliver. The announcement has further raised expectations for what is being billed as one of the biggest festive releases of the year. Bethlehem Kudumba Unit marks the first collaboration between Nivin Pauly and Mamitha Baiju, while also reuniting director Girish AD with the creative team behind the blockbuster Premalu. The film is produced by Dileesh Pothan, Fahadh Faasil and Syam Pushkaran under the Bhavana Studios banner, with Girish AD co-writing the screenplay alongside Kiran Josey. The ensemble cast includes Vinay Forrt, Suresh Krishna, Bindu Panicker, Sangeeth Prathap, Shyam Mohan, Srindaa and several others. Vishnu Vijay has composed the music, while Ajmal Sabu handles cinematography and Akash Joseph Varghese is the editor. Bethlehem Kudumba Unit is set to join the highly competitive Onam box office season, where several major Malayalam films are expected to vie for audience attention. Backed by a successful creative team and a fresh lead pairing, the film heads into the festive weekend with strong anticipation.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ నందు. ప్రస్తుతం ఆయన నటించిన సరికొత్త చిత్రం 'అగ్లీ స్టోరీ' ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇటీవల హాట్ స్టార్ లో విడుదలైన అగ్లీ స్టోరీ.. దురంధర్, ది రాజా సాబ్ సినిమాల తర్వాత అత్యధిక ఆదరణ పొందిన చిత్రంగా రికార్డు సృష్టించింది.  శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ ఏకంగా 8.1 మిలియన్ వ్యూస్ సాధించి టాప్‌లో నిలిచింది. తాజాగా హాట్ స్టార్ విడుదల చేసిన టాప్ 10 అత్యధిక వ్యూస్ చిత్రాల లిస్ట్ లో అగ్లీ స్టోరీ 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.  కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన నటనతో మెప్పిస్తున్న శ్రీ నందుకు ఈ సినిమా విజయం ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్‌ని ఇస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో శ్రీ నందు నటన చాలా అద్భుతం అని విశ్లేషకులు కొనియాడారు. తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.      Ugly Story, Nandu, Avika Gor, Telugu Cinema  
సినిమా రంగంలో ఒకప్పుడు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోతే ఆ చిత్రం కథ ముగిసిపోయిందని అందరూ భావించేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ వేదికలు సినిమాలకు అద్భుతమైన సెకండ్ లైఫ్ ఇస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'ది రాజాసాబ్' నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం సరికొత్త రికార్డుల దుమ్మురేపింది. ప్రభాస్ గ్లోబల్ స్టార్డమ్ రేంజ్ ఏంటో ఈ చిత్రం మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. 2026 జనవరి నుండి జూన్ వరకు భారతీయ ఓటీటీ రంగంలో వివిధ సినిమాల ప్రదర్శనపై ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా రీసెర్చ్ ఒక ప్రత్యేకమైన ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ నివేదికను విడుదల చేసింది. ఈ అధికారిక నివేదిక ప్రకారం 2026 ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా 'ది రాజాసాబ్' అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ఏకంగా 17.5 మిలియన్ వ్యూస్ నమోదు చేసి సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యున్నత రికార్డు సృష్టించింది. థియేట్రికల్ రన్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయినా, డిజిటల్ ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ చిత్రం పూర్తి భిన్నమైన బ్లాక్‌బస్టర్ ఫలితాన్ని అందుకోవడం విశేషం. దర్శకుడు మారుతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ వినూత్న హారర్ కామెడీ డ్రామాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక డిఫరెంట్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామలు మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకినప్పటికీ, థియేటర్లలో సాధారణ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కొంత తడబడింది. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే ఓర్మాక్స్ నివేదికలో మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సౌత్ ఓటీటీ రంగంలో మలయాళ చిత్రాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ టెన్ అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో ఏకంగా నాలుగు మలయాళ సినిమాలు చోటు దక్కించుకుని సత్తా చాటాయి. అందులో 'ద్రిడమ్' సినిమా 8.5 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలవగా, 'వాజా 2' చిత్రం 7.8 మిలియన్ వ్యూస్, 'సర్వం మాయ' 7 మిలియన్ వ్యూస్, మరియు మోస్ట్ అవేటెడ్ 'దృశ్యం 3' ఏకంగా 6.9 మిలియన్ వ్యూస్‌తో టాప్ 10 జాబితాలో నిలిచాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే ప్రభాస్ 'ది రాజాసాబ్' ప్రథమ స్థానంలో ఉండగా, మరో క్రేజీ తెలుగు చిత్రం 'అగ్లీ స్టోరీ' ఏకంగా 8.1 మిలియన్ వ్యూస్‌తో ఓవరాల్‌గా మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. వీటితో పాటు నటసింహం నందమూరి బాలకృష్ణ మోస్ట్ పవర్‌ఫుల్ సీక్వెల్ మూవీ 'అఖండ 2' డిజిటల్ వేదికపై 6.6 మిలియన్ వ్యూస్ సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాగే టాలెంటెడ్ యాక్టర్ నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా 6.5 మిలియన్ వ్యూస్‌తో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుని డిజిటల్ ప్రేక్షకులను అలరించింది. తమిళ ఇండస్ట్రీ నుండి 'బ్లాస్ట్' సినిమా 6.8 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో, 'యూత్' మూవీ 4.6 మిలియన్ వ్యూస్‌తో పదో స్థానంలో నిలిచాయి. ఈ ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ అధికారిక గణాంకాలు చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. థియేటర్లలో టాక్ మరియు బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా, ప్రభాస్ సినిమాలకు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండే క్రేజ్, సపరేట్ ఆడియన్స్ బేస్ మరియు అసాధారణమైన ఆదరణ ఎప్పటికీ తగ్గవని నిరూపితమైంది. థియేటర్ల వసూళ్ల పరిమితులను దాటి, గ్లోబల్ డిజిటల్ మార్కెట్లో ప్రభాస్ బ్రాండ్ వాల్యూ మరియు రేంజ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఈ 2026 ఓటీటీ నివేదిక మరోసారి బాక్సాఫీస్ వర్గాలకు గట్టిగా చాటిచెప్పింది.     Prabhas, The RajaSaab, ott
Former Telugu Film Theatre Digital Dealers Association (TFTDDA) president and choreographer SK Janibasha has issued an open letter to Telugu film producers, alleging large-scale corruption within the dancers' union and accusing Federation leaders of protecting those involved instead of supporting disciplinary action. In the letter dated July 17, 2026, Janibasha stated that producers are the backbone of the Telugu film industry and deserve the utmost respect as they provide employment to thousands of workers despite challenges like piracy, theatre shortages and rising financial pressures. He stressed that every film worker has a responsibility to safeguard producers' interests. According to Janibasha, the current leadership of the dancers' union, headed by president V.V. Sumalatha Devi, identified irregularities involving certain programme in-charges who allegedly submitted illegal bills to production houses and misappropriated money meant for dancers. He claimed that the union suspended several members, removed its General Secretary and decided to conduct by-elections after disciplinary proceedings. However, Janibasha alleged that the Federation opposed these decisions and pressured the union to reinstate suspended members. He further claimed that during a Federation General Council meeting held on July 16, some members reportedly dismissed the alleged financial irregularities by saying the money belonged to producers and that the issue should be ignored. He also accused Federation leaders of remaining silent over such remarks. The former TFTDDA president further alleged that Federation officials threatened the dancers' union with "non-cooperation," boycott and cancellation of membership if it refused to comply with their directives. He also claimed that union president Sumalatha Devi, being a woman, was subjected to unfair treatment while attempting to expose corruption within the organisation. Appealing directly to Telugu film producers, Janibasha urged them to intervene and ensure that the Federation does not interfere in the internal affairs of the dancers' union. He requested that the union be allowed to conduct its by-elections independently and take strict action against those accused of corruption, reiterating that the welfare of producers and dancers remains the union's foremost priority. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి అన్ని విధాలుగా కొండంత అండగా ఉంటు అభిమానుల నిత్య నామ స్మరణలో ఒకరిగా మారారు అన్నాకొణిదెల(Anna Konidela). ఇటీవల సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయిన అన్నాకి సంబంధించిన తాజా న్యూస్ వైరల్ గా మారింది.  ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే.శస్త్రచికిత్స ముగిసిన తర్వాత  హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తన భర్త పవన్ కళ్యాణ్ ఈ శస్త్రచికిత్స నుంచి పూర్తి ఆరోగ్యంతో  కోలుకోవాలని కోరుకుంటూ అన్నా లెజినోవా  కలియుగ దైవం, ఆపద మొక్కుల వాడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి చెంతకు కాలినడకన బయలుదేరారు.ఈ రోజు తెల్లవారు జామున అలిపిరి నడకమార్గం ద్వారా అత్యంత భక్తిశ్రద్ధలతో మెట్ల మార్గంలో నడుచుకుంటూ  కొండకి చేరుకున్నారు. రష్యన్ మహిళతో పాటు క్రిస్టియన్  అయినప్పటకి క్షేత్ర సాంప్రదాయాలని  పూర్తిగా గౌరవిస్తూ ఆమె చేసిన ఈ కాలినడక ప్రయాణం అభిమానులను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.  Also read: ఓ సుకుమారి ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. తిరువీర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం  తిరుమలకి చేరుకున్న అన్నాకి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రభాత సేవలో పాల్గొని  ఏడుకొండల వాడిని దర్శించుకుంది. శ్రీవారి దర్శనానంతరం క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్దకి  చేరుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన భర్త సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుని ప్రత్యేక హారతి తీసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం టీటీడీ రంగనాయకుల మండపంలో వేద పండితులు అన్నాకి  వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాన్ని అందజేశారు.  దర్శనానికి ముందు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసినట్టుగా తెలుస్తుంది.  pawan kalyan, anna konidela, tirumala, tirupati    
టాలీవుడ్‌లో ఒక సినిమాపై అంచనాలు పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఫస్ట్‌లుక్, మరికొన్నిసార్లు టీజర్ ఆ అంచనాలను పెంచితే, ఈసారి మాత్రం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఒక బలమైన టాక్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.  టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'భోగి'. ఈ సినిమాకు సంబంధించిన ఒక గంట నిడివి గల రఫ్ ఫుటేజ్‌ను ఇటీవల ఇండస్ట్రీకి చెందిన కొందరు ముఖ్యమైన సినిమా మిత్రులు ప్రత్యేకంగా వీక్షించారు. ఆ 60 నిమిషాల విజువల్స్ చూసిన వారంతా ముక్తకంఠంతో చెప్తున్న మాట ఒక్కటే.. ఇది శర్వానంద్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ లా నిలిచిపోయే చిత్రం కాబోతోంది. సినిమా చూసిన ఆ ఇండస్ట్రీ మిత్రులు ఈ చిత్రాన్ని నేరుగా రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'రంగస్థలం'తో పోలుస్తుండటం విశేషం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ ఎమోషన్స్, పాత్రల డిజైనింగ్, కథలో ఉండే డ్రామా చూస్తుంటే శర్వానంద్ కెరీర్‌లో ఇది ఒక 'రంగస్థలం' లాంటి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వారు బలంగా నమ్ముతున్నారు.  ముఖ్యంగా ఇందులో డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఒక రేంజ్‌లో ఉన్నాయని సమాచారం. గతంలో శర్వానంద్ ఎన్నడూ చేయని విధంగా, అత్యంత సహజంగా, ఊరమాస్ స్టైల్‌లో ఈ యాక్షన్ సీన్లను తెరకెక్కించారట. స్క్రీన్ పై శర్వానంద్ నటన, ఆయన పండించిన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో విలేజ్ ఎమోషనల్ డ్రామాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అఖిల్ అక్కినేని నటించిన రీసెంట్ హిట్ 'లెనిన్' కూడా 'అఖిల్ రంగస్థలం' అనే పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో 'భోగి' సినిమాతో 'శర్వానంద్ రంగస్థలం' రాబోతుంది అంటున్నారు.  ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే అదిరిపోయే బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. శర్వానంద్ మార్కెట్‌ను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి ఇండస్ట్రీ మిత్రులు ఇంతలా ఫిదా అయ్యారంటే, రేపు థియేటర్లలో పూర్తి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుందోనని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. పక్కా విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ 'భోగి' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.     Sharwanand, Bhogi Movie, Akhil Akkineni, Lenin Movie, Rangasthalam  
  ఫ్యామిలీ హీరో అనే టాగ్ లైన్ తో  తిరువీర్(thiruveer)నిన్న ఐశ్వర్య రాజేష్ తో కలిసి 'ఓ సుకుమారి'(oh Sukumari)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. తమిళంలో ఐశ్వర్య రాజేష్ కి ఉన్న  క్రేజ్ దృష్ట్యా తమిళంలో కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది. మరి తెలుగు, తమిళంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం  తమిళ వెర్షన్ కేవలం రెండు అంటే రెండు లక్షల రూపాయల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగులో నలభై తొమ్మిది  లక్షల రూపాయల నెట్ వచ్చింది. దాంతో మొదటి రోజు 'ఓ సుకుమారి' నెట్ కలెక్షన్స్ 51 లక్షల రూపాయలు కాగా గ్రాస్ విషయానికి వస్తే  57 లక్షల రూపాయలు. ఈ కలెక్షన్స్ తిరువీర్ కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్పవచ్చు. మేకర్స్ మాత్రం ఇంకా కలెక్షన్స్ పై అధికార ప్రకటన చేయలేదు.. తిరువీర్ ప్రీవియస్ చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే ;ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' .. ఓపెనింగ్ డే కలెక్షన్స్ 12 లక్షల నెట్.  'పాపం ప్రతాప్ కి  17 లక్షల నెట్ వచ్చింది. మరి ఆ ఆ రెండిటితో కంపార్  చేస్తే.  'ఓ సుకుమారి'తో తిరువీర్ తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు. also read: కొత్త పెళ్ళికొడుకు అమీర్ ఖాన్ కి ప్రాణ హాని.. ఎవరి నుంచో తెలిస్తే షాక్ అవుతారు  ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ అవ్వడం హెల్ప్ అయ్యింది. 'సంకాంతికి వస్తున్నాం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసి ఉండటం వల్ల ఆమె కోసం థియేటర్లకి  వచ్చిన ఆడియన్స్ ఉన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని ముట్టుకుంటే షాక్ తగులుతుందనే కొత్త కాన్సెప్ట్‌తో ఓ సుకుమారి తెరకెక్కినా కూడా కథ లైన్ చుట్టూ అల్లుకునే కథనం, క్యారక్టర్ ల తీరు, డైలాగ్స్ బాగోకపోవడంతో ఓ సుకుమార్ కి నెగిటివ్ టాక్ రన్ అవుతుంది. భరత్ దర్శన్ దర్శకుడు కాగా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మహేష్ రెడ్డి నిర్మించాడు. ఝాన్సీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర రోల్స్ లో కనిపించారు. thiruveer, Aishwarya Rajesh, oh sukumari
ఇటీవల విజువల్ వండర్‌గా, మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘నాగబంధం’. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్‌తో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించారు. ఇప్పుడీ ‘నాగబంధం’ టీమ్, తమ తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ హీరో శర్వానంద్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో సంచలన విషయం ఏమిటంటే, దీని కోసం ఏకంగా రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుందని అంచనా వేస్తున్నారు.  ‘నాగబంధం’ సినిమాతో విజువల్స్ పరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా అద్భుతమైన ప్రతిభను కనబరిచిన ఈ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ టీమ్, శర్వానంద్ కోసం ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని సరికొత్త కథాంశాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ శర్వానంద్ బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన నటనకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో పాటు, కమర్షియల్‌గా కూడా భారీ స్థాయిలో వర్కవుట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రూ. 80 కోట్ల బడ్జెట్ అంటే కేవలం మేకింగ్ పరంగానే కాకుండా, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ యాక్షన్ సీక్వెన్సులు, దేశ విదేశాల్లో జరిపే గ్రాండ్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారని టాక్. ‘నాగబంధం’ టీమ్‌కు గ్రాండ్ విజువల్స్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో ఉన్న అనుభవం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ప్లస్ పాయింట్ కానుంది.  శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఈ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వినికిడి. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాక్.      Nagabandham, Sharwanand, Tollywood  
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం.   గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది.   కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల  గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.  ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి,  గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు.  ఈ మొక్కలు  గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా  పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి.  చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక  మొక్క పీస్ లిల్లీ..  ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి.  కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే  డిటర్జెంట్లు, పెయింట్లు,  గమ్ లలో  ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి  గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని,  ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో  పెంచుకుంటే ఇంటి వాతావరణం,  ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది.                                   *రూపశ్రీ.